
భర్తతో విద్యాశ్రీ (ఫైల్)
యశవంతపుర: భర్త వివాహేతర సంబంధం, వరకట్నం వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో శుక్రవారం రాత్రి జరిగింది. విద్యాశ్రీ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. 9 నెలల క్రితం రాకేశ్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి జరిగినప్పటి నుంచి కట్నం కోసం రాకేశ్ విద్యాశ్రీని వేధిస్తూ ఉన్నాడు. (చదవండి: సంతానం కలగలేదు.. భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడని.. )
దీంతో భర్తపై విరక్తి కలిగిన ఆమె శుక్రవారం రాకేశ్‌పై డెత్‌నోట్ రాసి నువ్వొక సైకో, నువ్వొక శాడిస్ట్, నువ్వో పనికిమాలిన వాడివి అంటూ ఆంగ్లంలో నోట్ రాసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్యహత్య చేసుకున్న సమయంలో రాకేశ్ ఇంటిలో లేడని తెలిసింది. సుబ్రమణ్యనగర పోలీసులు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.