బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి.. | Tripura Woman Apprehended For Forcing Minors Into Prostitution | Sakshi
Sakshi News home page

బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం అన్నారు.. రిసార్టులకు పంపి వ్యభిచారం..

Published Mon, Jan 31 2022 7:44 PM | Last Updated on Mon, Jan 31 2022 7:51 PM

Tripura Woman Apprehended For Forcing Minors Into Prostitution - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై: ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్‌(38) అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది.  

ఈ క్రమంలో త్రిపురకు చెందిన నలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్‌ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు.

చదవండి: (Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య)

ఈసీఆర్‌ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు ఆ నలుగురు బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement