
ప్రతీకాత్మక చిత్రం
నమ్మబలికి పలుసార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ బాలిక వెంకటరమణపై ఒత్తిడి తేవడంతో, అతను నిరాకరించాడు. ఆమె తన కుటుంబ సభ్యులకు తెలపడంతో..
రామకుప్పం(చిత్తూరు జిల్లా): ప్రేమ పేరుతో బాలికను మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు, మండలంలోని ఆవులకుప్పం గ్రామానికి చెందిన వెంకటరమణ(31), అదే గ్రామానికి బాలికను రెండేళ్లుగా ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి పలుసార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ బాలిక వెంకటరమణపై ఒత్తిడి తేవడంతో, అతను నిరాకరించాడు.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వర్క్‌ఫ్రమ్ హోమ్.. ప్రేమించిన యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో
బాలిక కుటుంబసభ్యులకు తెలపగా బాలిక తల్లి రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వెంకటరమణ మీద పోక్సో కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. శనివారం సాయంత్రం వెంకటరమణను ఆవులకుప్పం క్రాస్‌లో కుప్పం రూరల్ సీఐ సూర్యమోహనరావు సిబ్బందితో కలసి అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.