Cheating
-
పార్లమెంట్ సాక్షిగా బయటపడ్డ బాబు మోసాలు
-
చీటింగ్ యాప్ : భర్త ఫోన్లను ఎక్కువగా చెక్ చేస్తోంది ఈ నగరంలోనేనట!
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్ఫోన్లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్లైన్లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్‌ఫోన్‌ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్‌ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్‌లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్‌లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్ఫ్రెండ్లు డేటింగ్ యాప్‌ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్‌లోకి వస్తున్నారట. ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్‌హామ్ తరువాతి టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్‌లో మాంచెస్టర్‌లో, 8.8శాతంగా బర్మింగ్‌హామ్‌లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్‌హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట. దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది. -
వృద్ధ దంపతులను మోసం చేసిన బ్యాంకు మేనేజర్ మేఘన
యశవంతపుర(కర్ణాటక): వృద్ధురాలిని మోసం చేసిన గిరినగరకు చెందిన ప్రైవేటు బ్యాంకు మేనేజర్ మేఘన, ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను గిరినగర పోలీసులు అరెస్ట్ చేశారు. గిరినగరలోని ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో వృద్ధ దంపతులు జాయింట్ అకౌంట్ తెరిచారు. కొంతమొత్తం డిపాజిట్ చేశారు. బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ మేఘనా పరిచయం ఉండటంతో వృద్ధ దంపతులు తమ కష్టాలు ఆమె వద్ద చెప్పుకునేవారు. ఇటీవల ఇంటిని కూడా విక్రయిం కోటి రూపాయిలు బ్యాంకులో జమా చేశారు. ఆ నగదుపై మేఘనా కన్ను పడింది. బాండ్ అవధి ముగిసిందని, కొత్తగా డిపాజిట్ చేసేందుకు చెక్ అవసరమని మభ్య పెట్టి కొన్నిపత్రాలపై సంతకాలు చేయించుకుంది. అనంతరం రూ.50 లక్షలను తన అకౌంట్‌కు బదిలీ చేయించుకుంది. వృద్ధ దంపతుల కుమారుడు బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా నగదు తక్కువగా కనిపించింది. బ్యాంకుకు వెళ్లి మేఘనాను ప్రశ్నించారు.మీరు చెప్పిన ఖాతాకు నగదు బదిలీ చేసినట్లు మేఘనా దబాయించింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా మేఘనా వంచన బయట పడింది. మేఘనతోపాటు ఆమె భర్త శివప్రసాద్, స్నేహితులు వరదరాజు, అన్వర్ఘోష్లను పోలీసులు అరెస్ట్ చేశారు. -
రూ. 1000తో రూ. 1.50 లక్షల బంగారం.. వింత టోకరా
ఆ బంగారు నగల దుకాణంలో వింత మోసం చోటుచేసుకుంది. కస్లమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానిని బురిడీ కొట్టించారు. తాను మోసపోయాన్న విషయాన్ని దుకాణం యజమాని చాలా ఆలస్యంగా గుర్తించాడు. వెంటనే ఈ ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని సుల్తాన్‌పూర్‌లోని ఒక నగల దుకాణంలో మోసం జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. బంగారు నగల దుకాణంలోనికి కస్టమర్లుగా వచ్చిన ఒక జంట దుకాణం యజమానికి ముందుగా రూ.1000 చెల్లించి, రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలను ఎంచుకుని, కొద్దిసేపటి తరువాత వస్తామని చెప్పి దుకాణం నుంచి వెళ్లిపోయారు. అయితే సాయంత్రం దాటినా వారు తిరిగి దుకాణానికి రాలేదు. దీంతో దుకాణం యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే అతను సీసీటీవీ ఫుటేజ్(CCTV footage)ను పరిశీంచి, దానిలోని దృశ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు. జరిగిన మోసంపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనలో మోసపోయిన నగల దుకాణం యజమాని కృష్ణచంద్ర మాట్లాడుతూ తమ దుకాణానికి కస్టమర్లుగా వచ్చిన ఒక పురుషుడు, ఒక మహిళ తనను బంగారు హారం, గొలుసు చూపించమని అడిగారన్నారు. వాటిని తాను చూపించాక వారు అడ్వాన్స్(Advance) గా వెయ్యి రూపాయలు చెల్లించి, పది నిముషాల్లో తిరిగి వచ్చి, మిగిలిన మొత్తం చెల్లించి, వస్తువులు తీసుకుంటామని చెప్పి వెళ్లిపోయారని తెలిపారు. అయితే వారిద్దరూ సాయంత్రం దాటినా రాకపోయేసరికి తనకు అనుమానం వచ్చి, దుకాణంలోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా వారు రూ.1.5 లక్షల విలువైన ఆభరణాలతో పారిపోయారని గుర్తించానన్నారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని కృష్ణచంద్ర పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ -
విశాఖలో సినిమా నిర్మాణం పేరిట టీడీపీ నేత మోసం
-
చంద్రబాబు నాయుడు మోసకారి కాదా? ప్రజలను మోసం చేసినందుకు 420 కేసు పెట్టకూడదా?... వైఎస్సార్సీసీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
వీడియో తీసి.. రూ.8.5 లక్షలు వసూలు
జగిత్యాల క్రైం: విలేకరినని పరిచయం చేసుకున్నాడు.. డబ్బులిస్తుంటే వీడియో తీశాడు.. తర్వాత బెదిరించి, పరిశ్రమల శాఖ జగిత్యాల జనరల్ మేనేజర్ యాదగిరి నుంచి పలు దఫాలుగా రూ.8.50 లక్షలు వసూలు చేశాడు. నిందితుడితోపాటు అతనికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎర్ర యాదగిరి పరిశ్రమల శాఖ జగిత్యాల జిల్లా జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత నెల 20న విధుల్లో ఉండగా డీపీఆర్వో కార్యాలయ అటెండర్, జగిత్యాల అర్బన్ మండలం ధరూర్‌కు చెందిన బాలె జగన్ వచ్చాడు. రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్ తండాకు చెందిన భూక్య సంతోష్‌నాయక్‌ను ఓ చానల్ విలేకరని ఆయనకు పరిచయం చేశాడు.మరుసటి రోజు లోన్ కావాలని..21న సంతోష్‌నాయక్ జనరల్ మేనేజర్ యాదగిరి ఆఫీస్‌కు ఓ మహిళను తీసుకెళ్లాడు. తన బంధువని చెప్పి, సబ్సిడీపై కారు లోన్ కావాలని అడిగాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. రూ.5 వేలను కవర్లో పెట్టి, ఆయన టేబుల్‌పై పెట్టాడు. తర్వాత రహస్యంగా వీడియో తీశాడు. అదేరోజు రాత్రి ప్రెస్ గ్రూప్‌లో పెడతామంటూ ఆ వీడియోను అధికారికి వాట్సాప్ చేసి, బెదిరించాడు. కాసేపటికి సంతోష్‌కుమార్‌కు సంబంధించిన ఒడ్డెలింగాపూర్‌కు చెందిన పాలకుర్తి రాకేశ్, లోక్యానాయక్ తండాకు చెందిన మాలోతు తిరుపతి, భూక్య గంగాధర్‌లు కారులో వచ్చి, యాదగిరిని జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట శివారుకు తీసుకెళ్లారు. రూ.3 లక్షలు డిమాండ్ చేస్తూ కొట్టారు. దీంతో ఆయన రూ.35 వేలు ఇచ్చారు. అవి సరిపోవని చెప్పడంతో మళ్లీ రూ.35 వేలతోపాటు ఫోన్‌పే ద్వారా మరో రూ.30 వేలు ముట్ట జెప్పారు. సంతోష్‌కుమార్ 22న ఫోన్ చేసి, డబ్బులు సరిపోలేదని బెదిరించడంతో కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ ఆఫీసు వద్ద రూ.2 లక్షలు ఇచ్చారు. 23న మా చానల్ చైర్మన్ ఒప్పుకోవడం లేదనడంతో 25న కలెక్టర్ కార్యాలయ సమీపంలోని వాటర్‌ట్యాంక్ వద్ద రూ.5.50 లక్షలు అప్పగించారు. ఇలా.. నిందితులు మొత్తం రూ.8.50 లక్షలు వసూలు చేశారు.బెదిరింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు..అయినా, బెదిరింపులకు పాల్పడటంతో అనుమానం వచ్చిన జీఎం యాదగిరి 30న జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. భూక్య సంతోష్‌కుమార్, పాలకుర్తి రాకేశ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.1.75 లక్షల విలువైన బంగారం, రూ.16 వేలు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. వసూలు చేసిన డబ్బులో నుంచి కొంత మొత్తం తీసి, సంతోష్‌కుమార్ తన అప్పులు కట్టుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుతో ప్రమేయం ఉన్న తిరుపతి, గంగాధర్, జగన్ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ వేణుగోపాల్, ఎస్సై కిరణ్ పాల్గొన్నారు. -
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్‌ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
పోతారు మొత్తం పోతారు.. ఇది నా తుగ్లకీయం
-
బాబూ.. ఇదేనా నీ సంతకం విలువ?: శ్యామల
గుంటూరు, సాక్షి: ఎన్నికల హామీల పేరిట మహిళలను తేలికగా మోసం చేయొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, రాష్ట్రంలోని ప్రతి మహిళా ఇప్పుడు ఆయన్ని గద్దె దించాలని అనుకుంటున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల (Are Syamala) అన్నారు. కూటమి ప్రభుత్వ హామీల ఎగవేతపై శనివారం ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘దీపం పథకం ఏమైందో చంద్రబాబు(Chandrababu) చెప్పాలి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏమైందో చంద్రబాబు చెప్పాలి. కూటమి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. నమ్మించి.. మాటిచ్చి.. ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేయడం బాబుకు అలవాటే. చేతగానప్పుడు, చేయలేనప్పుడు శుష్కవాగ్ధానాలు చేయకూడదు. చంద్రబాబు మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేస్తామని చెప్పి అలాగే మోసం చేశారు. సూపర్ సిక్స్ పేరుతో బాండు పేపర్లు ఇచ్చి నిలువునా మోసం చేశారు. చంద్రబాబూ.. ఇదే నా మీ సంతకం విలువ?. మహిళలను మోసం చేసినందుకు చంద్రబాబుపై 420 కేసు పెట్టవచ్చు.. .. 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ పేరుతో మోసం చేశారు. నమ్ముతున్నారని మహిళలను సులువుగా మోసం చేస్తున్నారు. తల్లికివందనం(thalliki vandanam) పేరుతో జగన్ ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని ఆపేశారు. లక్షలాది మంది తల్లులు, విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామన్నారు. రాసి పెట్టుకోమని కూడా చెప్పారు. ఇప్పుడు మంత్రిగా ఉన్న రామానాయుడు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎన్నికల ముందు తిరిగారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.. హామీలు మాత్రం జనంలో ఇచ్చారు. ఇవ్వలేకపోతున్నామని నాలుగు గోడల మధ్య ఎందుకు చెప్తున్నారు?. తల్లికి వందనం ఇవ్వట్లేదని టీడీపీ నేతలు జనంలోకి వచ్చి చెప్పాలి. దీపం పథకం కింద ఇవ్వాల్సిన రూ.4,115 కోట్లు ఎగ్గొట్టారు. కనీసం ఉచిత బస్సు పథకాన్ని కూడా ఎందుకు అమలు చేయటం లేదు?.. 2025 జనవరి ఫస్టున జాబ్ కేలండర్ ఇస్తామని లోకేష్(Nara Lokesh) ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో కాదుకదా.. కనీసం జాబ్ కేలండర్ కూడా ఎప్పుడు ప్రకటిస్తారో తెలియటం లేదు. పండుగ హామీలు లేవు, పెళ్లిళ్ల కానుకలూ లేవు. కూటమి నేతలు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.సంపద సృష్టి అంటే ప్రజలకేమో అనుకున్నాం.. చంద్రబాబు సొంతంగా సృష్టించుకోవటం అని ఇప్పుడే తెలిసింది. రూ.74 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని లెక్క తెలిసినా చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బుల్లేవని ఎలా చెప్తారు?. ‘‘ఇప్పుడు గనుక జగన్ మోహన్‌రెడ్డి ఉండి ఉంటే..’’ అని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ అనుకుంటున్నారు. ఈ హామీల అమలుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది’’ అని స్పష్టం చేశారామె.( ఈ క్రమంలో హామీల పేరుతో ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు చేసిన హడావిడిని.. ప్రకటనలను వీడియో రూపంలో శ్యామల మీడియాకు ప్రదర్శించారు. -
మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది..
గచ్చిబౌలి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం..ఖాజాగూడలోని సాయి వైభవ్ లేఅవుట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తున్న తన కూతురుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు మ్యాట్రిమోనిలో అమ్మాయి వివరాలు ఉంచాడు. ఈ వివరాలు తెలుసుకున్న రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చిందిని చెప్పాడు. తన అక్క మాధురి, నాన్న రంగ ప్రసాద్, అమ్మ రాణిదేవి ఆ్రస్టేలియా ఉంటున్నారని నమ్మించాడు. ఫోన్లో వారితో మాట్లాడించి అమ్మాయి నచ్చిందిని చెప్పించాడు. ఆగస్టు 14న ఇంటికి వచ్చి త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పాడు. అమ్మాయికి కేజీ బంగారు నగలు తీసుకుంటున్నామని, కొంత డబ్బు తక్కువ పడిందని చెప్పాడు. దీంతో తమ అమ్మాయికే నగలు పెడుతున్నారని నమ్మి బాధితులు నవంబర్ 28,29,30 తేదీల్లో రూ.19 లక్షల నగదు, ఆన్లైన్లో రూ.2.2 లక్షలు ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి రెండు నెంబర్లకు ఫోన్ చేయగా రెస్పాండ్ కాలేదు. దీంతో ఈ నెల 12న యువతి తండ్రి రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ 318(40, 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మోసానికి పాల్పడిన వ్యక్తి బాచుపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఎస్ఆర్నగర్ పీఎస్‌లోనూ అతనిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు మ్యాట్రిమోనిలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి..పెళ్లి పేరిట ఇతను మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా? -
అమ్మ ఒడి పేరుతో సైబర్ మోసం
ఆలూరు రూరల్ : సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమ్మ ఒడి పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే రూ.26,500 వారి ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారికి ఆదివారం మధ్యాహ్నం 9266495107 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘మీకు అమ్మ ఒడి వచ్చిందా’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అడిగి.. వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మిన నాగరాజు, మల్లికార్జునలు తమకు రాలేదని చెప్పారు. దీంతో ఆగంతకుడు మీ వలంటీర్ ఆనంద్‌ను కాన్ఫరెన్స్‌లో తీసుకుంటున్నానంటూ వలంటీర్‌కు కాల్ చేశాడు. అనంతరం ఆనంద్‌తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని.. మల్లికార్జున, నాగరాజులకు అమ్మ ఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.త్వరలోనే మీ ఐడీలను అప్డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలనూ ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. అనంతరం ‘నీకు పనిచేయడం రాదా’ అంటూ వలంటీర్‌ను దబాయిస్తూ మాట్లాడాడు. ఆగంతకుడు ఫోన్ కట్ చేయగానే.. నాగరాజు ఖాతా నుంచి రూ.12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి రూ.9 వేలు, వలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి నుంచి రూ.5 వేలు మాయం అయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
బంగారం బిజినెస్ పేరుతో మోసం.. బాధితుల్లో టాప్ హీరోయిన్లు..?
సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు.కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. -
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్‌లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్‌లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.229 కోట్ల మోసం..ఇద్దరి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అధిక వడ్డీ ఆశ చూపి రూ.229 కోట్లు కొల్లగొట్టిన మాదాపూర్ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డైరెక్టర్లు సయ్యద్ అష్ఫక్ రాహిల్ ఈ కేసులో ఏ2గా ఉండగా అయిషా నాజ్ ఏ9గా ఉన్నారు.17 వేల 5 వందల మంది నుంచి పెట్టుబడికి రెండింతలువ లాభం ఇస్తామని ఆశ చూపి రూ.229 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన డీకేజెడ్ కంపెనీ ఇటీవల బోర్డు తిప్పి డిపాజిట్‌దారులను మోసగించింది. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
లేడీ.. కిలాడీ
-
Big Question: ఏపీ చెవిలో సూపర్ పువ్వు
-
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్‌రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్‌రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్‌రూమ్‌కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్‌రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్‌లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్‌లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
నా బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్‌ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్‌ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
-
అపార్ట్మెంట్ కట్టలేదు..స్థలం అమ్మేశారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు. నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్‌కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. అటు అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు. -
సేనానికి ప్యాకేజీ.. నమ్ముకున్నవారికి నిరాశ..!
వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్‌కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్‌గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్‌కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు. ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్‌ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు. బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్‌ను నిలదీశారు పోతిన మహేశ్.. కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు. పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్ హోటల్లో వింతవైనం!
సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్లో ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్‌లోని మాన్హాటన్లో ఉన్న ఒక హోటల్‌కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్‌తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్‌కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్‌ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్ పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని సుభా‹Ùనగర్‌కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్‌కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్‌కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్‌ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్‌లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్‌కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్‌తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో నయా మోసం
దన్వాడ: ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో కొందరు కేడీలు నయా మోసానికి తెరలేపారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసేందుకుగాను రూ.236 చొప్పున వసూలు చేసి వినియోగదారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో బుధవారం ఆరుగురు వ్యక్తులు వినియోగదారుల ఇళ్లకు వెళ్లారు. ప్రతి సంవత్సరం గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకుగాను రూ.236 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేయించుకోకపోతే సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. వీరి మాటలు నమ్మిన కొందరు వినియోగదారులు.. గ్యాస్ కనెక్షన్ చెకప్ కోసం రూ.236 చొప్పున చెల్లించారు. గ్రామంలో మొత్తం 300 కనెక్షన్లు ఉండగా.. 200 మంది నుంచి దాదాపు రూ.50వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరికి అనుమానం వచ్చి గురువారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించగా.. తాము ఎలాంటి చెకప్‌లు చేయడంలేదని తెలిపారు. తమ కార్యాలయంలోనే సిలిండర్‌ను పూర్తి స్థాయిలో చెక్‌చేసి, వినియోగదారులకు అందజేస్తామని తెలియజేశారు. కాగా గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో డబ్బులు వసూలు చేసిన దుండగులు.. అందుకు సంబంధించిన రసీదులు ఇవ్వడం గమనార్హం. ఏదేమైనప్పటికీ రోజురోజుకు కొత్త కొత్త మోసాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మా లో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
హోంగార్డు ఉద్యోగాల పేరిట ఐపీఎస్ అధికారి ఘరాన మోసం
మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు. అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం. దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట
వెంగళరావునగర్(హైదరాబాద్): ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు నేనూ సర్వస్వం అర్పించాను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు బాబా ఫక్రుద్దీన్‌ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: తెలియకుండా విదేశాలకు భార్య! భర్త ఆత్మహత్య -
కాంగ్రెస్‌వి దొంగ డిక్లరేషన్లు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ ప్రకటించినవన్నీ దొంగ డిక్లరేషన్లేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. వాటిని నమ్మితే ప్రజలు నిలువునా మోసపోతారన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం గృహాలను గురువారం 4,800 మంది లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో హరీశ్‌రావు మాట్లాడు తూ కేసీఆర్ కిట్టు.. న్యూట్రీషియన్ కిట్టు.. ఎన్సీడీ కిట్టు.. ఇలా బీఆర్ఎస్ సర్కారు లబ్ధిదారులకు కిట్లు పంపిణీ చేస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నేతలు తిట్లకే పరిమితం అవుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్ధిని చూసి సినీ నటుడు రజనీకాంత్ మెచ్చుకున్నప్పటికీ., ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలకు చెందిన గజనీగాళ్లకు మా త్రం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్ బెంగళూరును మించి పోయిందనీ, ఇప్పుడు ఈ రంగంలో దేశంలోనే హైదరాబాద్ నం.1 స్థానంలో నిలుస్తోందన్నారు. ఇచ్చే రూ.60 వేలల్లోనూ లంచాలు తీసుకునేవారు.. కాంగ్రెస్ హయాంలో ఇంటి నిర్మాణానికి ఇచ్చే రూ.60 వేలల్లోనూ ఆ పార్టీ నేతలు లంచాలు అడిగే వారని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎలాంటి లంచాలు లేకుండా ఇంటిని కేటాయిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కొక్కరు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ జలాల్లో 90 టీఎంసీల నీటి వాటా మనకే దక్కిందని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి కూడా అనుమతి తెచ్చుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, మాగంటి గోపీ నాథ్, సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ పాల్గొన్నారు. -
సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్ల మేజేజర్ల హవా మాములుగా ఉండదు. నిర్మాతకు హీరో,హీరోయిన్లకు మధ్య వారధిలా వాళ్లు పని చేస్తుంటారు. నిర్మాతకు డేట్స్ కావాలంటే.. సదరు హీరో, హీరోయిన్ల మేనేజర్లను సంప్రదించాల్సిందే. రెమ్యునరేషన్ మొదలు.. డేట్స్ వరకు ప్రతీది మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా.. మేనేజర్లు చెప్పేదే విని ఓకే చెబుతారు. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన మేనేజర్ని ఇంటి మనిషిలా భావించి, అన్నీ అతని చెప్పినట్లుగానే చేసేది. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి.. సామ్‌ని ఆర్థిక మోసం చేశాడనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకు తెలియకుండా రూ. కోటిని కాజేసేందుకు ప్రయత్నించాడట. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోయిందట. తొలుగ నమ్మకపోయినా.. ముఖ్యమైన వ్యక్తి చెప్పడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం. త్వరలోనే మరో కొత్తవ్యక్తిని తన మేనేజర్‌గా నియమించుకునే పనిలో ఉన్నారట. అసలు విషయం ఇదేనా? మయో సైటిస్ బారిన పడడంతో సామ్ ఒప్పుకున్న ఓ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలకు తన వల్ల నష్టం జరిగిందని, తన రెమ్యునరేషన్ తగ్గించాలని సామ్ భావించారట. ఈ విషయాన్ని తన మేనేజర్‌తో చెప్పి, రూ. కోటి వరకు తగ్గించి తీసుకోమని చెప్పిందట. అయితే మేనేజర్ మాత్రం నిర్మాతల దగ్గర ఆ కోటి కూడా తీసుకోవాలనుకున్నాడట. సదరు నిర్మాతల దగ్గరకు వెళ్లి బ్యాలెన్స్ గా ఉన్న రూ. కోటిని క్యాష్ రూపంలో ఇవ్వమని అడిగారట. అంత డబ్బు క్యాష్‌గా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. తన స్నేహితుడి అకౌంట్‌కి పంపమని చెప్పాడట. వారికి అనుమానం కలగడంతో ఈ విషయాన్ని సామ్ దగ్గర వరకు తీసుకెళ్లారు. ఇలా మేనేజర్ అసలు రూపం బయటపడింది. ఇక సినిమా విషయాలకొస్తే.. సమంత- విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో వరుణ్ ధావణ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీమింగ్ కానుంది. -
ఆందోళనలో మార్గదర్శి చందాదారులు
తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వారికి సైతం చెల్లింపులు చెల్లించని వైఖరిని మార్గదర్శి అవలంభిస్తోంది. దీంతో చందాదారుల్లో ఆందోళన నెలకొంది. అదే సమయంలో అధికారిక తనిఖీల్లో మార్గదర్శి అక్రమాలు, అవకతవకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడోరోజూ మార్గదర్శి కార్యాలయాల్లో ఏపీ సీఐడీ సోదాలు కొనసాగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. మార్గదర్శి అక్రమాలకు సంబంధించిన కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే.. తాజా సోదాలలో డిపాజిటర్ల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. బ్యాంక్ ఖాతాలు, చిట్టీ గ్రూపుల చందాల వివరాలు.. నిధుల మళ్లింపునకు సంబంధించిన పత్రాలతో పాటు ఫోర్జరీ సంతకాలు చేసిన రికార్డులు, హార్డ్ డిస్క్‌లను అధికారులు జప్తు చేశారు. ఇవాళ్టి తనిఖీలలో మరిన్ని అక్రమాలు బయటపడొచ్చనే భావిస్తున్నారు. ఆ వర్గానికి మాత్రమే చెల్లింపులా? ఇప్పటికే తొమ్మిది నెలలుగా చిట్ పాడుకున్న వాళ్లకు మార్గదర్శి యాజమాన్యం చెల్లింపులు చెల్లించలేదు. అదే సమయంలో కాల పరిమితి ముగిసినా ప్రైజ్‌మనీ అందించని పరిస్థితి ఉంది. దీంతో మార్గదర్శి చందాదారుల్లో ఆందోళన నెలకొంది. చందాదారులకు రూ.2 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది మార్గదర్శి. దీంతో చందాదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే.. ఒత్తిడి తెస్తున్న ఓ సామాజికవర్గం వారికి మాత్రం చెల్లింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. రామోజీకి దెబ్బ! చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు. దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అదే సమయంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టింది. నిధుల మళ్లింపు పాపం కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును.. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు కాబట్టి. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదొక్కటే దారి రామోజీ పాపం ఫలితంతో.. 50 వేల మంది చందాదారుల సొమ్ము ప్రశ్నార్థకంగా మారింది. అయితే ‘అగ్రిగోల్డ్’ తరహాలో మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణపైనా సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. -
కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు!
ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్లైన్లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని తీసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఇదేకోవకు చెందిన ఒక ఉదంతంలో పోలీసులు 36 ఏళ్ల నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన మహిళ పలువురు మహిళలకు ఫోన్ చేసి, మీకు వచ్చిన ఖరీదైన బహుమతులు అందుకోవాలంటే వెంటనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టయిన మహిళను పోలీసులు నైజీరియాకు చెందిన ఒఫోరిగా గుర్తించారు. ఆమె వలలో పడి 20 మంది బాధితులు మోసపోయినట్ల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తనను తాను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఒక మహిళ ఆన్లైన్లో తనతో స్నేహం చేసిందని పేర్కొంటూ, ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ మహిళతో కొద్దికాలంలోనే మంచి స్నేహం ఏర్పడిందని, అప్పటి నుంచి ఆమె బహుమతులు పంపేదని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. తన పేరు మీద విమానాశ్రయానికి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటిని విడుదల చేయాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి తనకు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను రూ. 25 వేలు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను చెల్లించినదానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశారు. మోసానికి పాల్పడిన ఆ మహిళ సోషల్ మీడియా ఖాతాల కోసం ఉపయోగించిన ఐడిలు నైజీరియాకు చెందినవని తేలింది. బాధితురాలి కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నైజీరియన్ మహిళ ఓఫోరి ఈ మోసానికి కీలక సూత్రధారి అని తేలింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్ -
చిటీల పేరుతో టీడీపీ నేత అప్పలనాయుడు భారీ మోసం
-
కంపెనీ డబ్బులు రూ.21 లక్షలు కొట్టేసి ఏం చేశాడో తెలుసా?
లండన్: యూకేలో వేల్స్ కు చెందిన ఒక నిర్మాణ కంపెనీలో పనిచేస్తోన్న థామస్ స్టైల్స్(25) అశ్లీల చిత్రాలకు బానిసై వాటిని కొనుగోలు చేసేందుకు తాను పనిచేస్తోన్న చోట అక్రమాలకు పాల్పడ్డాడు. కంపెనీ బిల్లల మొత్తాన్ని ఇష్టానికి మార్చుకుంటూ సుమారు రూ. 21 లక్షలు దోచుకున్నాడు. థామస్ స్టైల్స్(25) అట్లాంటిక్ క్లాడింగ్ అనే ఒక నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే తన ప్రతిభకు మెచ్చుకుంటూ మేనేజరుగా కూడా ప్రమోషన్ ఇచ్చింది కంపెనీ. ఆనతి కాలంలోనే వ్యాపార లావాదేవీల తాలూకు ఆర్ధిక చెల్లింపులు చేసే స్థాయికి ఎదిగాడు. మనిషి ఎదిగినప్పుడే బుద్ధి గడ్డి తింటుందన్నట్టు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా తనకున్న వ్యసనానికి కంపెనీ డబ్బును పాడుచేశాడు. అశ్లీల వెబ్ సైట్ల మాయలో పడి తాను పనిచేస్తోన్న కంపెనీలో భారీ స్థాయిలో అవకతవకలకు పాల్పడ్డాడు. ఇష్టానుసారంగా బిల్లులు పెంచుకుంటూ పోయి తన పిచ్చిలో తాను మునిగి తేలేవాడు. అంతలో పెరుగుతున్న బిల్లులను చూసి కంపెనీ వారికి అనుమానం రావడంతో తీగ లాగారు. డొంకంతా కదిలింది. మే 4 నుంచి జులై 31, 2021 వ్యవధిలో మొత్తం బిల్లుల అక్రమాలను లెక్క వేయగా సుమారు రూ. 21 లక్షలుగా తేలింది. అంత మొత్తాన్ని ఏం చేశాడని ఆరా తీయగా విషయం తెలుసుకుని నివ్వెరపోయిన కంపెనీ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. కంపెనీ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు న్యాయస్థానం థామస్ ను దోషిగా తేల్చి మొదట 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలని భావించింది. కానీ జడ్జి దయ తలచి శిక్షను 10 నెలలకు కుదించారు. నెలకు 500 పౌండ్ల చొప్పున కంపెనీకి తిరిగి చెల్లించాలని తీర్పునిచ్చారు. ఇది కూడా చదవండి: బెలారస్ లో వాగ్నర్ సైన్యం.. అంతా ప్లాన్ ప్రకారమే..? -
'చీటింగ్ అనే పదం వాళ్ల బ్లడ్‌లోనే ఉంది!'
క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు ఆస్ట్రేలియా శాసించిందన్న మాట అందరికి తెలిసిందే. 1990 దశకం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆస్ట్రేలియా క్రికెట్‌ను ఏకచత్రాధిపత్యంతో ఏలింది. ఈ రెండు దశాబ్దాల్లో కంగారూలు మూడు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే, టెస్టుల్లో చాలాకాలం పాటు నెంబర్‌వన్‌గా కొనసాగారు. భయమంటే ఏంటో ఎరుగని జట్టుగా ఉన్న ఆస్ట్రేలియాకు టీమిండియా కూడా దాసోమయ్యింది. 2003 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ అందుకు చక్కటి ఉదాహరణ. స్టీవా, రికీ పాంటింగ్, మార్క్ వా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, మైకెల్ బెవాన్, గ్లెన్ మెక్‌గ్రాత్, షేన్ వార్న్, మైకెల్ క్లార్క్, జాసన్ గిలెస్పీ.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. జట్టుగా ఎంత బలంగా ఉంటుందో.. ఆధిపత్యం ప్రదర్శించడంలోనూ అంతే పట్టుదలగా ఉండేది. ఒక దశలో కంగారూలతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లు కంగారు పడే పరిస్థితి ఉండేది. అయితే ఇన్ని ఘనతలున్నా కంగారూలకు చీటింగ్ అనేది పర్యాయపదంగా ఉండిపోయింది. ఆస్ట్రేలియా ఎన్నో గొప్ప మ్యాచ్‌లు గెలిచినా కొన్నిసార్లు ఆ జట్టు చీటింగ్ చేసి గెలిచిన మ్యాచ్‌లే ఎక్కువగా గుర్తుండిపోయాయి. ముఖ్యంగా క్యాచ్ ఔట్ల విషయంలో ఆసీస్ ఆటగాళ్లు చేసిన చీటింగ్‌లు ఏ జట్టు చేయలేదని చెప్పొచ్చు. బాల్ టాంపరింగ్ నుంచి సాండ్ పేపర్ ఉదంతం వరకు అన్ని ఆస్ట్రేలియా ఖాతా నుంచి వచ్చినవే. అందుకే చీటింగ్ అనే పదం కంగారూల బ్లడ్‌లోనే ఉందంటారు క్రికెట్ అభిమానులు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మరోసారి చీటింగ్‌ను బయటపెట్టింది. 444 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు గిల్, రోహిత్‌లు శుభారంభం అందించారు. 41 పరుగులు జోడించిన అనంతరం స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో షాట్ ఆడే యత్నంలో శుబ్‌మన్ గిల్ స్లిప్‌లో ఉన్న గిల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్యాచ్ తీసుకునే క్రమంలో డైవ్ చేసిన గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి.. ఫోర్స్‌కు బంతిని నేలకు తాకించినట్లు కనిపించింది. దీంతో గిల్ రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్ పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. అయితే గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉన్నట్లు థర్డ్అంపైర్ మైక్‌లో చెప్పి బిగ్ స్ర్కీన్‌పై గిల్ ఔట్ అని ప్రకటించాడు. ఈ నిర్ణయం రోహిత్, గిల్‌తో పాటు సగటు అభిమానిని ఆశ్చర్యపరిచింది. గతంలోనూ పాంటింగ్, స్టీవ్ స్మిత్, మైకెల్ క్కార్ల్ కెప్టెన్లుగా ఉన్నప్పుడు ఇలాంటి చీటింగ్‌లు చాలానే జరిగాయి. అంపైర్లు కూడా ఆసీస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తూ ఫలితాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా నాటౌట్ అని క్లియర్‌గా కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం ఇచ్చాడు. అయితే సాఫ్ట్ సిగ్నల్ నిబంధన ఉండి కూడా ఎందుకు ఉపయోగించడం లేదని అభిమానుల సందేహం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) Always winning with cheating #notout pic.twitter.com/H2m939vqCD — Milind Joshi (@MilindJ03022606) June 10, 2023 Cheating is in Australian cricket team DNA. pic.twitter.com/fqXsPxulBQ — SAVAGE (@Freakvillliers) June 10, 2023 చదవండి: #NotOut: థర్డ్ అంపైర్ చీటింగ్.. గిల్ ఔట్ కాదు -
మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధాప్య పెన్షన్..ఆరా తీస్తే..
పల్నాడు జిల్లాలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తికి 12 ఏళ్లుగా వృధ్యాప్య ఫించన్ ఇస్తున్నారంటూ విమర్శుల వెల్లువెత్తాయి. చాలా ఏళ్ల క్రితం తండ్రి చనిపోతే..అతడి పెన్షన్‌కి ఆశపడి ప్రభుత్వాని మోసం చేస్తున్న కొడుకు ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చనిపోయని వ్యక్తి బతికున్నట్లు నమ్మించి 12 ఏళ్లుగా ఫించన్ తీసుకుంటున్నాడు మృతుడు పారా కిరీటి కుమారుడు సారయ్య. 2001లో చనిపోయిన తన తండ్రి స్థానంలో మరొక వ్యక్తిని చూపిస్తూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ పెన్షన్ అందుకుంటున్నట్లు మృతుడి బంధువులు జాయింట కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు. అతను 2011లో తన మామ చనిపోతే..అతడిని తండ్రిగా చూపించి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఫించన్‌కు దరఖాస్తు చేస్తే అధికారులు ఫించన్ మంజూరు చేసేశారు. దీంతో అతడు ధర్జాగా గత 144 నెలలుగా మోసం చేస్తూ సుమారుగా 4 లక్షల రూపాయలు ప్రభుత్వ సొమ్మును పారా సౌరయ్య కాజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టాలని డీడీవో మహాలక్ష్మిని జేసీ శ్యాంప్రసాద్ ఆదేశించారు. ఇన్నేళ్లుగా పింఛన్ తీసుకుంటున్నా అధికారులకు మాత్రం దొరకలేదు. (చదవండి: సత్తా చాటిన గుంటూరు జిల్లా ఎడ్లు) -
‘నా భార్య, తండ్రి కలసి నన్ను వంచించారు’
ఒక వ్యక్తి తనకు ఎదురైన అత్యంత చేదు అనుభవాన్ని ఈ ప్రపంచంతో పంచుకున్నాడు. తాను అమితంగా ప్రేమించిన తన భార్య తనను ఘోరంగా మోసగించిందంటూ తన బాధను వెళ్లగక్కాడు. తన భార్య తన తండ్రితో తిరుగుతున్నదని తెలుసుకుని అతను నిశ్చేష్టుడైపోయాడు. ఇప్పుడు తన భార్య తన తండ్రి కారణంగా గర్భం ధరించిందని తెలుసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి పేరు డెక్లాన్ ఫులర్. తన 22 ఏళ్ల భార్య స్టెఫనీ తనను మోసగించిందని తెలియగానే అతనికి కాళ్ల కింద భూమి ఒక్కసారిగా కదిలిపోయినట్లయ్యింది. ఆమె తన 44 ఏళ్ల తండ్రి డైరెన్తో సంబంధం పెట్టుకుందని తెలిసి అతను తల్లడిల్లిపోయాడు. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ కుటుంబం బ్రిటన్‌లో ఉంటోంది. 22 ఏళ్ల డెక్లాన్, స్టెఫనీలకు రెండేళ్ల కుమార్తె విలో కూడా ఉంది. బాధితుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ తాను మధ్యాహ్నం సమయంలో తన భార్య, తండ్రి కలసి బెడ్రూమ్లో సరసాలు ఆడటాన్ని చూశానని తెలిపారు. అయితే స్టెఫనీ దీని గురించి మాట్లాడుతూ తాను, తన మామగారితో పాటు ఆ సమయంలో టీవీ చూస్తున్నానని తెలిపింది. అయితే తన తండ్రి కూడా తనను ఇంతలా మోసం చేస్తాడని అనుకోలేదన్నారు. తన తండ్రి గతంలో తన తల్లి నుంచి విడాకులు తీసుకున్నాడని, అయినా తిరిగి తమ ఇంటికి వచ్చివుంటున్నాడన్నారు. పైగా తన భార్య, తన తండ్రి కలసి ఉండటాన్ని చూశాన్నారు. త్వరలో తన భార్య కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నదని అన్నారు. దీనిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. తమ కుటుంబం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కాగా త్వరలో పుట్టబోయే కవలలకు డెక్లాన్ సవతి సోదరుడు కానున్నాడు. అలాగే అతని కుమార్తె విలో ఆ చిన్నారులకు ఆంటీ కాబోతోంది. ఇటువంటి పరిస్థితులను నమ్మలేకపోతున్నానని డెక్లాన్ వాపోతున్నాడు. -
రోల్స్ రాయిస్ ఇండియాకు కేంద్రం షాక్: అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు
సాక్షి, ముంబై: బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు భారీ షాక్ తగిలింది. 24 హాక్ జెట్ 115 అడ్వాన్స్ కొనుగోలులో భారత ప్రభుత్వాన్నిమోసంచేశా రని ఆరోపిస్తూ కంపెనీ డైరెక్టర్‌సహా, మరికొంతమందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లపై కేసు నమోదు చేసింది. రోల్స్ రాయిస్ ఇండియా డైరెక్టర్ టిమ్ జోన్స్, ఆయుధాల డీలర్లు సుధీర్ చౌదరి , భాను చౌదరితోపాటు, ప్రభుత్వ ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.రోల్స్ రాయిస్ పిఎల్సి, యుకె , ఎం/ఎస్ రోల్స్ రాయిస్ టర్బోమెకా లిమిటెడ్‌తో సహా దాని అసోసియేట్ గ్రూప్ కంపెనీల నుండి హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోలు విషయంలో భారత ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ కేసు సంబంధించినదని సీబీఐ ప్రకటించింది. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!) CBI registers a case against British Aerospace company Rolls Royce India Pvt Ltd, Tim Jones, Director Rolls Royce India Pvt Ltd and private individuals Sudhir Chuadhrie and Bhanu Chaudharie and other unknown public servants and private persons with the objective to cheat the… pic.twitter.com/tREN8OUkyk — ANI (@ANI) May 29, 2023 -
వాట్సాప్‌లో చీటింగ్!
సాక్షి, అమరావతి: సైబర్ నేరగాళ్లు సరికొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెలికాం సంస్థలు తీసుకుంటున్న భద్రతా చర్యలకు పైఎత్తులు వేస్తున్నారు. సాధారణ స్పామ్ కాల్స్ కట్టడికి ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్) ఫిల్టర్లను ప్రవేశపెట్టినప్పటికీ అంతకు మించి దోపిడీ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్ల వాట్సాప్ కాల్స్‌తో నేరాలకు పాల్పడుతున్నారు. దేశంలో సుమారు 480 మిలియన్ల వాట్సాప్ వినియోగదారులుండటం, ప్రపంచంలోనే అతిపెద్ద వాట్సాప్ కేంద్రం కావడంతో సైబర్ నేరగాళ్ల దృష్టి మనపై పడింది. అంతర్జాతీయ నంబర్లతో.. వాట్సాప్ వినియోగదారులకు ఎక్కువగా ఇథియోపియా (+25), మలేషియా(+60), ఇండోనేషియా (+62), కెన్యా (+254), మాలి (+223), గినియా (+224) వియత్నాం (+84)తో పాటు మరికొన్ని దేశాల నుంచి అంతర్జాతీయ నంబర్లతో పదేపదే వాట్సాప్ కాల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువ భాగం ఆగ్నేయాసియా దేశాల ఐఎస్డీ కోడ్లతోనే కాల్స్ వస్తున్నాయి. కనిపెట్టడం కష్టం.. అంతర్జాతీయ నంబర్లతో వస్తున్న వాట్సాప్ కాల్స్ ఉనికిని కనిపెట్టడం చాలా కష్టం. ఒక ఐఎస్డీ కోడ్‌తో వచ్చే వాట్సాప్ కాల్‌ను మోసగాళ్లు అదే దేశం నుంచే చేస్తున్నట్లు నిర్ధారించలేం. విదేశాల్లో ఉండే వారి ద్వారా అక్కడి నంబర్ తీసుకుని వేరే దేశంలో ఉంటూ వాట్సాప్ యాక్టివేట్ చేసుకుని మోసపూరిత కాల్స్ చేయవచ్చు. బయట మార్కెట్లో చాలా ఏజెన్సీలు నేరగాళ్లకు అంతర్జాతీయ నంబర్లను విక్రయిస్తున్నాయి. ‘మనీ ఫర్ లైక్స్’ స్కామ్ వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా జాబ్ ఆఫర్లను పంపడం కొత్త రకం స్కామ్. ఇంటి నుంచి పార్ట్‌టైమ్ ఉద్యోగ అవకాశం కల్పిస్తామంటూ వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు. యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలని, టెలిగ్రామ్ చానెల్లో చేరాలని నమ్మబలుకుతారు. యూట్యూబ్ వీడియోల లైక్ బటన్ నొక్కడం, పోస్టులపై కామెంట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కంటెంట్‌ను ప్రచారం చేయడం లాంటి పనులు చేయాలని చెబుతారు. బాధితుడిని నమ్మించడానికి తొలుత చిన్న చిన్న టాస్క్‌లు అప్పగించి చెల్లింపులు జరుపుతారు. ఆ తర్వాత నెమ్మదిగా అధిక మొత్తంలో చెల్లిస్తామంటూ టాస్క్‌లను కేటాయిస్తారు. అయితే ఈసారి ముందస్తుగా భారీగా డిపాజిట్ చేయాలని కోరతారు. ఇక్కడే బాధితులు మోసపోతున్నారు. డిపాజిట్లు వసూలు చేసుకున్నాక నేరగాళ్లు పత్తా లేకుండా పోతున్నారు. ఇక్కడ ఏదో ఒక సమయంలో నగదు రిటర్న్‌లతో నకిలీ సమస్యను సృష్టిస్తారు. యూజర్లు తమ టాస్క్‌లకు వచ్చిన డబ్బు తిరిగి పొందేందుకు కొంత మొత్తం చెల్లించాలని వసూలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే బాధితులను స్టాక్స్, క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడులు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకర్ల పేరుతో.. నేరగాళ్లు ‘ఏఐ’ చాటున స్పూఫింగ్ ద్వారా బ్యాంకులు/ప్రభుత్వ ఏజెన్సీల నుంచి మెసేజ్ కాల్ వస్తున్నట్టు చిత్రీకరిస్తున్నారు. బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు సేకరించి ఫోన్ మాట్లాడుతుండగా ఆన్లైన్లో కొనుగోళ్లు జరిపి మోసాలకు పాల్పడుతున్నారు. అనాథలు, ప్రకృతి విపత్తుల ఫోటోలు, వీడియోలు పెట్టి చందాలు వసూలు చేస్తున్నారు. భావోద్వేగాలకు గురి చేస్తూ స్వచ్ఛంద సంస్థల పేరుతో కాజేస్తున్నారు. లైక్ చేస్తే అంతే.. యూట్యూబ్ టాస్క్‌లు, వాట్సాప్‌కు వచ్చే లింక్‌లను ఒక్కసారి లైక్ చేస్తే సదరు యూజర్ డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. ఆ మరుక్షణం నుంచి గూగుల్ మెయిల్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లోని ప్రొఫైళ్లను సులభంగా తెలుసుకోగలుతారు. ఇందులో భాగంగానే నిత్యం ఈ–మెయిళ్లకు అనేక ప్రమోషనల్ మెయిళ్లు, లోన్ వచ్చినట్టు లింక్‌లు కనిపిస్తుంటాయి. వాటిని క్లిక్ చేస్తే యూజర్ మీడియా యాక్సెస్ మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేస్బుక్లో యూజర్ ప్రొఫైల్‌ను బట్టి రకరకాల మోసపూరిత ఆఫర్లతో ప్రలోభపెడతారు. ఆ లింక్‌లపై క్లిక్ చేసి నగదు చెల్లిస్తే వస్తువులు ఎప్పటికీ డెలివరీ కావు. కొన్ని సందర్భాల్లో అశ్లీలతను జొప్పించి ట్రాప్ చేయడం పరిపాటిగా మారింది. వీడియో కాల్స్‌తో బ్లాక్ మెయిల్ మోసగాళ్లు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేందుకు వాట్సాప్ వీడియో కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. అజ్ఞాత వ్యక్తులు రకరకాల నంబర్ల నుంచి వీడియో కాల్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అవతల మహిళ అశ్లీలంగా కనిపిస్తుంది. కాల్ డిస్కనెక్ట్ చేసేలోగా నేరగాళ్లు స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్ షాట్ తీస్తారు. ఆ తర్వాత బాధితుడికి పంపి బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. మరికొన్ని ఘటనల్లో వీడియో కాల్స్ వస్తున్నప్పటికీ యూజర్ స్క్రీన్‌పై ఎటువంటి ఆడియో లేకుండా ఖాళీ వీడియో కనిపిస్తుంది. చూస్తుండగానే కాల్ అకస్మాత్తుగా కట్ అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత మార్ఫింగ్ చేసిన అశ్లీల వీడియోను పంపి డబ్బులు ఇవ్వకుంటే యూజర్ కాంటాక్ట్‌లకు పంపిస్తామంటూ బెదిరించి డబ్బులు గుంజుతారు. ఆ కాల్స్‌ను బ్లాక్ చేయండి సైబర్ మోసగాళ్లు అనేక విధాలుగా మోసం చేయాలని ప్రయత్నిస్తారు. వాట్సాప్‌లో అవాంఛిత, అంతర్జాతీయ కోడ్లతో ఫోన్లు వస్తే తిరస్కరించాలి. పదేపదే వస్తుంటే బ్లాక్ చేసి వాట్సాప్‌లోనే రిపోర్టు చేయాలి. ఎటువంటి లింక్‌లపై క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే యూజర్ డేటా మొత్తం క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు చేరుపోతుంది. తర్వాత బ్లాక్‌మెయిల్‌కు పాల్పడతారు. డిస్కౌంట్లు, చెకింగ్‌ల పేరుతో ఎవరూ ఫోన్ చేసినా వివరాలు చెప్పొద్దు. సైబర్ మోసాలకు గురైన బాధితులు నేషనల్ పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 112, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. – అమిత్ బర్దార్, ఎస్పీ, సైబర్ క్రైమ్ -
హలో.. పార్శిల్ ముట్టిందా? కాదు.. బ్యాంకు ఖాతా ఖాళీ అయింది
కాజీపేట: నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటాం. వాటికి సంబంధించిన సమాచార అన్వేషణ కోసం ఇంటర్నెట్పై ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్ట్లను పరిశీలించే వారి సంఖ్య పెరుగుతోంది. మనిషి అవసరాన్ని గుర్తించిన కేటుగాళ్లు తమ సంపాదనకు మలుచుకుంటున్నారు. ఫలితంగా సొ మ్ము పరుల పాలవుతోంది. సేవా లోపాల పరిష్కారానికి వివిధ సంస్థల ఫోన్ నంబర్లు ఇంటర్నెట్లో బోగస్‌వి పెడుతున్నారు. వాటికి పలువురు వినియోగదారులు ఫోన్‌చేసి మోసగాళ్ల ఉచ్చులో పడి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును పోగొట్టుకుంటున్నారు. కొరియర్ నంబర్ కోసం వెతికితే... కాజీపేటకు చెందిన అబ్దుల్ ఖాదర్ హైదరాబాద్‌లో ఉండే తన స్నేహితుడికి ఇటీవల ఓ పార్సిల్‌ను కొరియర్ చేశాడు. వారం గడుస్తున్నా కొరియర్ రాకపోయేసరికి ఇంటర్నెట్లో సంబంధిత సంస్థ కస్టమర్ కేర్ నంబర్ కోసం వెతికి దానికి ఫోన్ చేశాడు. ఆ నంబర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తర్వాత కొద్దిసేపటికి కొరియర్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. మీ పార్సిల్ బ్రాంచి కార్యాలయంలో ఆగిందని, ప్రాసెస్ చేయడానికి రూ.2 ఫోన్ ద్వారా చెల్లించాలని కోరారు. మీకు రాము అనే కొరియర్ బాయ్ తీసుకొస్తాడని చెప్పి ఓ నంబర్ ఇచ్చాడు. ఆ నంబర్‌కు రూ.2 చెల్లిస్తే ఈ నెల 26 వరకు పార్సిల్ చేరుస్తామంటూ ఓ లింక్ పంపించాడు. నిజమే అని నమ్మిన అబ్దుల్ ఖాదర్ ఆ లింక్‌ను క్లిక్‌చేసి డబ్బు చెల్లించాడు. రెండు రోజులు దాటుతున్నా కొరియర్ సర్వీస్ అడ్రస్ లేకపోవడంతో పాటు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఎస్ఎంఎస్లు చూసి అవాక్కయ్యాడు. తొమ్మిది విడుతలుగా రూ.1.36 లక్షలు ఆయన బ్యాంక్ ఖాతా నుంచి డ్రా అయ్యాయి. వెంటనే ఖాతాను బ్లాక్ చేయించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలాంటి ఆన్లైన్ కేసులు ఒక కాజీపేట పీఎస్‌లోనే పాతికకు పైగా నమోదయ్యాయి. ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లలో పలువురు మోసగాళ్లు ..వివిధ కంపెనీల, బ్యాంకుల కస్టమర్ కేర్ నంబర్ అని చెప్పి తమ సొంత ఫోన్ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లను ఉంచుతున్నారు. వెబ్సైట్లలో వెతికి ఈ నంబర్లకు ఫోన్ చేసి మోసపోకూడదు. ఆ సంస్థకు చెందిన అధీకృత వెబ్సైట్ నుంచి మాత్రమే తీసుకోవాలి. ప్రైవేట్ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేయకూడదు. అవి మోసగాళ్లకు సులువుగా వెళ్తాయి. సంబంధిత కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లడం ఉత్తమం. -
చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే..
రామోజీరావు మార్గదర్శిలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు వెల్లడించారు. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తూ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా రామోజీ చూశారని వివరించారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు ఆయన మాటల్లోనే.. 2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్ని, నిమేష్ అంబానీ అనే బ్రోకర్ని పట్టుకున్నారు. రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమవ్వడంతోనే కొంతమందికి చెల్లించారు. మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు.. మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్ చేయడం, రిజిస్టర్స్ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్‌లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు. వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు. చదవండి: కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు? -
ఉద్యోగం పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు.. 40 మందికి టోకరా
పెదకాకాని: ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసగించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో రూ.కోటీ ఇరవై లక్షలు మోసపోయారు. బాధితుల కథనం.. గుంటూరు జిల్లా పెదకాకాని పరిధిలోని కంతేరు అడ్డరోడ్డులో ఉన్న ఐజేఎం అపార్ట్‌మెంట్స్‌లో విజయవాడ ట్రెజరీ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దావులూరి మాల్యాద్రి నివాసం ఉంటున్నాడు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇచ్చింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వికలాంగ పిల్లలకు విద్యాబోధన చేస్తున్న మాత జయప్రకాష్‌రెడ్డికి దావులూరి మాల్యాద్రి పరిచయం అయ్యాడు. డీఎస్సీలో మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. తనకు మధ్యవర్తిగా లాజర్ అనే వ్యక్తిని పరిచయం చేశాడు.. జయప్రకాష్‌రెడ్డి కాకినాడ జిల్లా, కాజులూరు మండలం, దుగ్గుదూరు గ్రామం కావడంతో ఆయన పరిచయం ఉన్న మరో ఏడుగురితో కలసి మొత్తం ఎనిమిది మంది లాజర్‌ను కలిశారు. ఒక్కొక్క పోస్టుకు రూ.3 లక్షల అవుతుందని ముందుగా అడ్వాన్స్ లక్ష చొప్పున చెల్లించాలని లాజర్ చెప్పడంతో 8 లక్షలు చెల్లించారు. ఎక్కువ మందిని చూసుకోవడం ద్వారా ఖర్చులు తగ్గుతాయని చెప్పడంతో శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్న మరో 32 మందిని పరిచయం చేశారు. 40 మంది నుంచి ఫోన్ పే, గూగుల్ పే, బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించారు. వారి వద్ద నుంచి దావులూరి మాల్యాద్రి, లాజరు అతడి భార్య అరుణ వసూలు చేశారు. ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోగా అదిగో ఇదిగో వస్తుంది అంటూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీయడంతో అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకూ షూరిటీగా నోట్లు, 100 స్టాంప్ పేపరుపైనా దావులూరి మాల్యాద్రి సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అనంతరం కొంతకాలానికి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో మీకు ఉద్యోగాలు ఇప్పించం, చేతనైంది చేసుకోండి అంటూ దుర్భాషలాడాడు. అలానే ఉద్యోగానికి నగదు చెల్లించిన వారిలో ఒకరైన ఎం.రాజేష్ బావ బి. వెంకటేశ్వరరావు(కానిస్టేబుల్) నిన్ను నమ్మి డబ్బులు చెల్లించాం, నీ చెక్ ఇవ్వాలని మాత జయప్రకాష్‌రెడ్డి ఇంటిపైకి వచ్చి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబితే ఆశపడి 40 మంది అభ్యర్థులు ఒక్కొక్కరూ రూ.3 లక్షల చొప్పున చెల్లించి మోసపోయామని, మాకు మా కుటుంబసభ్యులకు ప్రాణరక్షణ కల్పించాలని, మోసపోయిన నగదు ఇప్పించాలని బాధితులు పెదకాకాని పోలీసుస్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
సహకారం.. స్వాహాపర్వం
సాక్షి ప్రతినిధి,ఏలూరు: సహకార చట్టంలోని బ్యాంకుల నిబంధనలను పాటించలేదు.. రుణపరిమితిని అడ్డగోలుగా ఇష్టానుసారంగా పెంచేశారు.. సరైన షూరిటీలు లేకుండా కోట్లాది రూపాయల రుణాలు మంజూరు చేశారు. అర్హులైన రైతులకు ఇవ్వాల్సిన రుణాలను పక్కదారి పట్టించి మద్యం వ్యాపారులతో సహా పలువురికి కట్టబెట్టారు. ఇదంతా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని బ్రాంచీల్లో జరిగిన అవినీతి పర్వం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని డీసీసీబీ పరిధిలోని ఆరు శాఖల్లో జరిగిన భారీ అవకతవకలపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. సమగ్ర విచారణ నివేదిక ఆధారంగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులందరిపై శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో పనిచేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో పాటు మేనేజర్ కేడర్‌లోని 17 మందిపై చర్యలు తీసుకోనున్నారు. రుణాల మంజూరు విషయంలో.. జిల్లాలోని DCCB పరిధిలోని పలు బ్రాంచీల్లో ఏళ్ల తరబడి రుణాల మంజూరు విషయంలో భారీగా అవకతవకలు జరిగాయి. వివాదాల్లో ఉన్న భూము లను బ్యాంకుల్లో షూరిటీగా చూపించి కోట్ల రూపాయల రుణాలు పొంది తిరిగి రూపాయి కూడా చెల్లించని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని యలమంచిలి, కొవ్వూరు, తాడేపల్లిగూడెం, ఏలూరుతో పాటు మరికొన్ని బ్రాంచీల్లో జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం గుంటూరు కో–ఆపరేటివ్ రిజిస్ట్రార్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీనిపై కో–ఆపరేటివ్ శాఖ క మిషనర్ ఎ.బాబు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అక్రమాల్లో కొన్ని.. ● యలమంచిలి బ్రాంచీలో వివాదాలతో ఉన్న ఆ స్తులను షూరిటీలుగా చూపించి రూ.33.22 కోట్ల రుణం మంజూరు చేశారు. దీనిలో రూ.13.86 కోట్లు ఇప్పటికీ రికవరీ కాలేదు. అలాగే 2015–16, 2017–18 నాబార్డు వార్షిక తనిఖీల్లో నిర్దేశించిన నిబంధనలను అతిక్రమించి రుణాలు మంజూరు చేసినట్లుగా నిర్ధారించారు. ఎలాంటి షూరిటీలు లేకుండా రుణాలు మంజూరు చేసి బ్యాంకుకు ఆర్థిక నష్టం చేకూర్చారు. ● తాడేపల్లిగూడెం బ్రాంచీలో 104 మంది సభ్యుల పేరుతో రూ.2.80 కోట్లను ఓ రియల్టర్‌కు రుణంగా ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని డీసీసీబీ బ్రాంచీలో మొత్తం బకాయిల విలువ రూ.11.69 కోట్లు కాగా 559 రుణాలు విలువ రూ.4.30 కోట్లు. వీటి గడువు దాటినా కొన్నింటి వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ● 2012–13 నుంచి 2018–19 వరకు డీసీసీబీ పలు శాఖల ద్వారా రూ.867.19 కోట్ల విలువైన 2,445 బ్యాంకు గ్యారంటీలు జారీ చేసింది. దీనిలో రూ.295.35 కోట్ల విలువైన 23 బ్యాంకు గ్యారంటీలను మద్యం వ్యాపారులు, రైస్‌మిల్లులు, ఇతరులకు ఇచ్చినట్టు గుర్తించారు. ● వ్యవసాయ భూమి విలువ భారీగా పెంచి షూరిటీగా చూపి రుణాలు కూడా మంజూరు చేశారు. క్రిమినల్ కేసులు అక్రమాలు జరిగిన క్రమంలో ఆయా కాలంలో పనిచేసిన బ్యాంకు అధికారులపై క్రిమినల్ కేసులకు సిఫార్సు చేశారు. మేనేజర్లు మన్నె మోహనరావు, ఐవీ నాగేశ్వరరావు, డి.ఆంజనేయులు, టీవీ సుబ్బారావు, కేఏ అజయ్‌కుమార్, జి.పిచ్చయ్యచౌదరి, కె.సురేంద్రప్రసాద్, ఎం.శ్రీనివాసరావు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్.రాధాకృష్ణ, జేఎస్వీ సత్యనారాయణరావు, సీహెచ్ రత్నకుమారి, కె.కిరణ్మయి, వి.శ్రీదేవి, డి.రమణ, జనరల్ మేనేజర్లు ఎ.మాధవీమూర్తి, వైవీ రాఘవేంద్రరెడ్డి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీవీఎం ఫణి తదితరులపై క్రిమినల్ చర్యలతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సిఫార్సు చేశారు. -
అదృష్టం వరించే రాళ్లంటూ వంచన
కర్ణాటక: సాలిగ్రామ అనే రాయిని అదృష్టం రాళ్లు అంటూ నమ్మించి వంచనకు పాల్పడుతున్న మనోజ్, ఆదిత్యసాగర్ అనే వ్యక్తులను అరెస్ట్‌చేసినట్లు సీసీబీ జాయింట్ పోలీస్‌కమిషనర్ డాక్టర్ ఎస్డీ.శరణప్ప తెలిపారు. నిందితులు రాజాజీనగర డాక్టర్ రాజ్కుమార్రోడ్డులోని ప్రైవేటు హోటల్లో బస చేశారు. వినియోగదారులను అక్కడకు పిలిపించి గుజరాత్‌లోని గోమతి నది నుంచి సాలిగ్రామ రాళ్లు తెప్పించామని, ఇవి విష్ణురూపమని, వీటిని ఇంట్లో ఉంచుకుంటే అదృష్టమని, వీటిని రూ.2కోట్లకు విక్రయిస్తామని చెప్పారు. పక్కా సమాచారంతో శుక్రవారం సీసీబీపోలీసులు దాడిచేసి నిందితులను అరెస్ట్ చేశారు. సాలిగ్రామ రాళ్లను స్వాదీనం చేసుకున్నారు. -
నమ్మిన వ్యక్తే దారుణంగా మోసం చేశాడు: ‘మిర్చి’ నటి ఆవేదన
ప్రముఖ సినీ, టీవీ నటి మాధవి ఓ వ్యక్తిని నమ్మి దారుణంగా మోసపోయానంటూ షాకింగ్ విషయం బయటపెట్టింది. నటి మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభాస్ ‘మిర్చి’ సినిమాతో ఆమె గుర్తింపు పొందింది. మిర్చిలో మాట వినని కొడుకు కోసం ఆత్మహత్యాయత్నం చేసిన తల్లిగా కనిపించింది. దీంతో ప్రభాస్ ఆమెకు విలన్ కుటుంబం తరపున డబ్బు సాయం చేస్తాడు. అలా ఈ సినిమాలో ఎమోషన్స్ పండించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆమె పలు టీవీ సీరియల్స్‌లో విలనిజం పోషిస్తోంది. బుల్లితెరపై కుట్రలు చేస్తూ, మోసం చేసే పాత్రల్లో మాధవి ఆకట్టుకుంటోంది. చదవండి: ఏడాది తిరక్కుండానే యాంకర్ శ్యామల మరో కొత్త ఇంటి నిర్మాణం, ‘అంత డబ్బు ఎక్కడిది?’ అలాంటి ఆమె నిజ జీవితంలో ఓ వ్యక్తి నమ్మ భారీ మొత్తంలో డబ్బు పొగొట్టుకుందట. ఇటీవల లైవ్‌లో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన ఆమె స్వయంగా ఈ విషయం వెల్లడించింది. తనకు తెలిసిన వ్యక్తే నమ్మించి మోసం చేశాడంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాకు బాగా తెలిసిన వ్యక్తి స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టమన్నాడు. అతడిని నమ్మి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మాయ మాటలు చెబుతూ ఆ డబ్బు మొత్తం కాజేశాడు. స్టాక్ మార్కెట్‌పై నాకు పెద్దగా అవగాహన లేకపోడం వల్లే సులువుగా నన్ను మోసం చేయగలిగాడు. చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కల్యాణ్ రామ్ అమిగోస్.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..! డబ్బు పోయిందనే బాధ కంటే.. తెలిసినే వ్యక్తే, నేను బాగా నమ్మిన వ్యక్తి మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఎవరిని గుడ్డిగా నమ్మొద్దని, లేదంటే తనలా మోసపోతారంటూ నెటిజన్లకు సూచించింది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ గురించి తెలియకుండ అసలు డబ్బులు ఇన్వెస్ట్ చేయొద్దని ఆమె తెలిపింది. కాగా స్టార్ మాలో ప్రసారమయ్యే ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో మాధవి దేవయాని పాత్ర పోషించింది. ఇందులో హీరోకు పెద్దమ్మగా నటించింది. కపట ప్రేమ చూపిస్తూ.. సొంతవాళ్లపైనే కుట్రలు చేసే పెద్దమ్మగా మాధవి తన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆమె ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. -
యూట్యూబ్‌లో లైక్ చేయాలంటూ వల.. ఒక్క రోజులో రూ. కోటి స్వాహా!
హిమాయత్‌నగర్: ఒక్క రోజులో సైబర్ కేటుగాళ్లు రూ.కోటి కొట్టేశారు. డబ్బు పోగొట్టుకున్న బాధితులు శనివారం సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌కు క్యూ కట్టారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లో నివాసం ఉండే వైద్యురాలికి కొద్దిరోజుల క్రితం టెలిగ్రాంలో ఓ యువతి పరిచయమైంది. తాము పంపించే యూట్యూబ్ లింకులను ఓపెన్ చేసి దానిలోని వీడియోను లైక్, కామెంట్‌తో పాటు షేర్ చేస్తే ఒక్కో లైక్‌కు రూ.500, కామెంట్‌కు రూ.1,000, షేర్ చేస్తే రూ.2 వేలు ఇస్తామన్నారు. తొలిరోజుల్లో లాభాలు ఇచ్చారు. వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. దీంతో ఇన్వెస్ట్మెంట్ వైపు ఆమెను ఆహా్వనించింది. దీనికి ఒప్పుకున్న వైద్యురాలికి ఇన్వెస్ట్మెంట్లో కూడా తొలుత లాభాలు ఇచ్చారు. ఆ తర్వాత పెట్టిన పెట్టుబడికి టాస్క్‌లు ఉన్నాయంటూ చెబుతూ పలు దఫాలుగా రూ.64 లక్షలు దోచుకున్నారు. మరో వ్యక్తి ఆమెజాన్ గిఫ్ట్ కూపన్స్ కొనుగోలు చేసి ఆన్లైన్లో ఇతరులకు విక్రయిస్తుంటాడు. కేవైసీ తీసుకున్న వారికే గిఫ్ట్ కూపన్స్‌ను బల్్కలో కొంతకాలంగా ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నాడు. బల్క్‌లో తీసుకున్న కొందరు డబ్బు వేస్తున్నట్లు నటించి డబ్బు వేయలేదు. రెండు నెలల వ్యవధిలో కేవైసీ ఇచి్చన ఇద్దరు వ్యక్తులు రూ.34 లక్షలు కాజేశారు. మరో ఐదుగురి నుంచి సైబర్ నేరగాళ్లు ఓటీపీలు, ఇన్వెస్ట్మెంట్లు అంటూ దాదాపు రూ.10 లక్షలు స్వాహా చేశారు. ఇలా శనివారం ఒక్కరోజే కోటికి పైగా డబ్బు పోగొట్టుకున్న వారు సైబర్‌క్రైం పోలీసుల్ని ఆశ్రయించారు. చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
ఆ ఉచ్చులో పడితే అంతే.. చైనాలో సూత్రధారులు.. ఉత్తరాదిలో పాత్రధారులు
మాజీ సైనికోద్యోగి నుంచి 21 లక్షలు.. పదవీ విరమణ చేసిన ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.53 లక్షలు.. ఓ వ్యాపారి నుంచి రూ.48 లక్షలు.. కేవలం గత మూడు రోజుల్లో పార్ట్‌టైమ్ జాబ్స్ పేరిట సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్ము ఇది. కేవలం లైకులు కొడితే చాలంటూ.. ఇంటి నుంచే పనిచేస్తూ సంపాదించుకోవచ్చంటూ.. గాలం వేసి డబ్బులు కాజేస్తున్న ఈ తరహా నేరాలు బాగా పెరిగాయని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆన్లైన్లో పార్ట్‌టైమ్ జాబ్‌లు అంటూ వచ్చే మెసేజీలు, ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చిన్న సందేశంతో మొదలై.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఉన్నాయని.. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ ఉంటే చాలు ఇంటి నుంచే సంపాదించవచ్చంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ సందేశాలు, ఎస్సెమ్మెస్‌లు పంపుతున్నారు. వ్యవస్థీకృతంగా పనిచేసే ఈ ముఠాలు వర్చువల్ నంబర్లతోపాటు నకిలీ గుర్తింపుకార్డులతో తీసుకున్న ఫోన్ నంబర్లతో ఈ వ్యవహారాన్ని నడిపిస్తాయి. ఆ సందేశాల్లో ఉన్న లింకులను క్లిక్ చేస్తే వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లోని గ్రూపులు తెరుచుకుంటాయి. అక్కడ ఈ పార్ట్‌టైమ్ జాబ్‌ల వివరాలు ఉంటాయి. కేవలం లైకులు కొడితే చాలు డబ్బులు వస్తాయని.. తనకు నెల రోజుల్లోనే రూ.లక్షల్లో సొమ్ము వచ్చిందని.. ఇందులో చేరితే బాగుంటుందని.. ఇలా ఆ గ్రూపుల్లో చర్చలు జరుగుతుంటాయి. ఇలా కామెంట్స్ చేసే వారంతా ఆ సైబర్ క్రైమ్ ముఠా వారే ఉంటారు. అవి చూసిన అమాయకులు ఆశతో ముందడుగు వేస్తారు. యాప్స్, వాలెట్స్‌లో డబ్బులు జమ చేయించి.. సైబర్ నేరగాళ్లు తాము టార్గెట్ చేసిన వ్యక్తితో వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ.. ప్రత్యేక యాప్స్, వెబ్సైట్లకు చెందిన లింకులను పంపుతారు. వాటిలో వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలని కోరుతారు. అందులో ఉండే వివిధ స్కీముల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకుని.. దానికి అనుగుణంగా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ విధానంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలని సూచిస్తారు. స్కీమ్ ఎంపిక చేసుకుని, డబ్బులను అందులో జమ చేశాక.. వరుసగా వీడియోలు వస్తుంటాయి. వాటిని లైక్ చేస్తూ పోవాలని, ప్రతి లైక్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు వస్తాయని చెబుతారు. ఇలా లైకులు చేసే కొద్దీ అందుకు సంబంధించిన సొమ్ము బాధితుడి వర్చువల్ ఖాతాలోకి జమ అవుతూ ఉంటాయి. చిన్న మొత్తాలు ఇచ్చి.. పెద్ద మొత్తానికి గాలమేసి.. బాధితులు జమ చేసిన మొత్తం, లైకుల ద్వారా సంపాదించిన సొమ్ము వారి వర్చువల్ ఖాతాలోనే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల్లోనే సొమ్ము బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇందులో కొంతమొత్తం సొమ్మును ఒకట్రెండు సార్లు బ్యాంకు ఖాతాలోకి మార్చుకుని, డ్రా చేసుకోవడానికీ అవకాశమిస్తారు. ఇలా పూర్తిగా నమ్మించి.. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ వీడియోలను లైక్ చేసే అవకాశం వస్తుందని.. ఎక్కువ లాభం వస్తుందని గాలం వేస్తారు. దీంతో కొందరు బాధితులు లక్షల్లో సొమ్మును యాప్స్/వాలెట్లలోకి జమ చేస్తారు. వీడియోలు లైక్ చేసిన కొద్దీ వచ్చే సొమ్ము వారి వర్చువల్ ఖాతాలో కనిపిస్తుంటుంది. ఇక్కడే మరింత మోసం మొదలవుతుంది. వర్చువల్ ఖాతాల్లో భారీగా సొమ్ము కనిపించినా.. బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇవ్వరు. అలా డ్రా చేసుకోవాలంటే, రూల్ ప్రకారం మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలంటూ.. బాధితులతో వీలైనంత మేర జమ చేయిస్తారు. ఆ సొమ్మంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయినట్టే. తర్వాత ఆ యాప్/ వెబ్సైట్ మాయమైపోతాయి. తమ ఫోన్‌కు వచ్చిన లింకులు, వెబ్ అడ్రస్‌ల ద్వారా తెరవడానికి ప్రయత్నించినా.. సదరు యాప్స్/వెబ్సైట్లు అందుబాటులో లేవని చూపిస్తుంది. ఇలాంటి సైబర్ గ్యాంగులు దేశవ్యాప్తంగా అమాయకులకు గాలం వేసి వందల కోట్ల రూపాయలు కాజేస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, రాజస్తాన్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ఎక్కువగా పంజా విసరుతున్నాయి. లైకులు, ఇన్వెస్ట్మెంట్స్, సేల్స్ పేరుతో జరిగే ఈ స్కామ్స్‌కు చైనీయులే సూత్రధారులని.. ఉత్తరాది రాష్ట్రాల వారి సాయంతో ఈ నేరాలకు పాల్పడుతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. కేవలం లైకులు, షేర్లు చేయడం వల్ల డబ్బు రాదని.. తెలియని అంశాల్లో పెట్టుబడులు వద్దని సూచిస్తున్నారు. చదవండి:ఒకటి, రెండు కాదు.. 40 బైకులు సీజ్: కారణం ఏంటంటే? -
అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..
సాక్షి, హైదరాబాద్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. మాదాపూర్ జోన్‌కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. కిషోర్ యూఎస్‌లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది. భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: ► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. ► వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. ► మ్యారేజ్ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. ► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ► విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. ► వధువు వీసా, పాస్‌పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. ► ఎన్నారై వరుడి పాస్‌పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్‌లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి. -
HYD: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ట్రాన్సిట్ వారెంట్ అనుమతి కోరుతూ ఢిల్లీ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ఎస్కార్ట్ కంపెనీ మాజీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ నందా ఫిర్యాదుతో సంధ్యా శ్రీధర్‌పై కేసు నమోదైంది. ఢిల్లీ, లూథియానాలో ఉన్న భూములను ఫోర్జరీ సంతకాలతో శ్రీధర్ అమ్మినట్లు సమాచారం. సుమారు రూ. 200 కోట్ల రూపాయల విలువైన భూములను ఫోర్జరీ డాక్యుమెట్లతో మోసాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. రూ.180 కోట్లు చెల్లించినట్లు తన దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయని, అమితాబచ్చన్ బంధువులను మోసం చేయలేదన్న శ్రీధర్.. న్యాయ పోరాటం చేస్తానన్నారు. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
రూ.6వేలు అప్పు ఇచ్చి.. రూ.54వేలు కట్టించుకున్నారు.. అయినా..!
సాక్షి, ఖమ్మం: ఆన్లైన్ యాప్ లోన్ ఆగడాలకు ఖమ్మంలో ఓ యువకుడు బలయ్యాడు. యాప్ వారి వేధింపులకు భరించలేక పురుగుమందుతాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు గమనించి ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపూజీ తండాకు చెందిన భూక్యా భావ్‌సింగ్ కుమారుడు ఆకాశ్(24) నగరంలోని ఓ బంగారం షాపులో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ యాప్ ద్వారా రూ.6 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పును సకాలంలో చెల్లించడంతోపాటుగా అదనంగా రూ.54 వేలు చెల్లించినా....ఇంకా అప్పు ఉన్నావని, అప్పు చెల్లించకుంటే ‘నీ ఫొటో, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెడతాం’అంటూ వేధింపులకు పాల్పడ్డారు. వారి వేధింపులు భరించలేక ఈ నెల 9న తాను పనిచేసే షాపు వెనుకనే పురుగు మందు తాగాడు. షాపు యాజమాన్యం గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఆకాశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఖమ్మం త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీఐ సర్వయ్య మాత్రం లోన్‌యాప్ వేధింపులనే ఫిర్యాదు తమకు అందలేదని, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం ఉందని, దీనిపై విచారణ చేస్తున్నామని చెప్పారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: నార్సింగి కేసులో వీడిన మిస్టరీ.. ఇద్దరు అరెస్ట్ -
భార్యకు తెలియకుండానే విడాకులిచ్చిన భర్త.. డబ్బు కొట్టేయాలని ప్లాన్
సాక్షి, సిటీబ్యూరో: డబ్బుల కోసం కట్టుకున్న భార్యను, చనిపోయిన కన్న తల్లినీ మోసం చేశాడు. భార్యకు తెలియకుండా విడాకులు ఇవ్వడమే కాకుండా ఆమె పేరున ప్రాపర్టీ కొనుగోలు చేసి, ప్రతి నెలా ఈఎంఐ కిరికిరిలో భార్యను ఇరికించేశాడు! చనిపోయిన తల్లి సంతకం ఫోర్జరీ చేసి డబ్బు కాజేశాడు. ఈ సొమ్ము భార్య, భర్తల జాయింట్ ఖాతాలో జమకావడంతో తన ప్రమేయం లేకుండానే అటు బాధితురాలు, ఇటు నిందితురాలిగా మారింది ఓ భార్య! విచిత్రమైన ఈ కేసు గచి్చ»ౌలి మహిళా ఠాణాలో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్‌కు చెందిన అభిషేక్, అర్చన (పేర్లు మార్చాం)లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి వైభవంగా పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఆ యువ జంట ఆ్రస్టేలియా వెళ్లింది. నాలుగైదు ఏళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. ఆ తర్వాత అతడి అసలు రంగు బయటపడింది. చీటికీమాటికీ భార్యతో గొడవ పడుతుండటంతో అదే సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యల రీత్యా.. ఆమె ఇండియాకు తిరిగొచ్చేసింది.దీంతో అభిషేక్ తన భార్య వెళ్లిపోయిందని విడాకులను కావాలని ఆ్రస్టేలియాలో కోర్టును ఆశ్రయించడంతో అక్కడి న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. విడాకుల విషయం దాచి.. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన అతను భార్యకు విడాకుల విషయం చెప్పకుండా దాచేశాడు. అప్పటికే ఆమె గచి్చ»ౌలిలోని ఓ బహుళ జాతి కంపెనీలో ఐటీ ఉద్యోగి. లక్షల్లో వేతనం కావటంతో ఆమె బ్యాంకు ఖాతాలోని డబ్బును ఎలాగైనా కాజేయాలని పథకం వేశాడు. ఎంచక్కా.. ఇద్దరి పేరున ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరిచాడు. భార్యను సహ యజమానురాలిగా పెట్టి బ్యాంకు రుణంతో ఓ ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశాడు. బ్యాంకు నెలవారీ వాయిదా ఆమె అకౌంట్ నుంచి జమ అయ్యేలా ప్లాన్ చేశాడు. అయితే ప్రాపర్టీ మీద వచ్చే అద్దె డబ్బును సొంతానికి వాడుకుంటున్నాడు. చనిపోయిన తల్లి డబ్బు కాజేయాలని.. గతంలోనే అభిషేక్ తల్లి చనిపోయింది. అయితే ఆమె బ్యాంకు ఖాతాలోనే డబ్బు ఉందని తెలుసుకున్న అతను.. ఎలాగైనా దాన్నీ కొట్టేయాలని మరో స్కెచ్ వేశాడు. తల్లి బ్యాంకు చెక్ తీసుకొని అమ్మ సంతకం ఫోర్జరీ చేశాడు. ఈ చెక్‌ను ఉమ్మడి ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసి.. రూ.లక్షల్లో సొమ్ము తీసుకున్నాడు. ఈ విషయం అభిషేక్ సోదరికి తెలియడంతో ఆమె పోలీసు స్టేషన్లో ఫోర్జరీ కేసు పెట్టింది. దీంతో పోలీసులు అభిషేక్‌ను విచారించగా.. బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయి తన భార్య కాదని అందుకే తనపై 498ఏ కేసు పెట్టేందుకు ఆమె అర్హురాలు కాదని అభిషేక్ పోలీసులతో వాగ్వాదం దిగడం కొసమెరుపు. అనధికారికంగా తల్లి ఖాతాలోని డబ్బు భార్య, భర్తలు ఉమ్మడి ఖాతాలోనే జమైంది కాబట్టి.. పోలీసులు భర్తతో సహా భార్యపై కూడా కేసు పెట్టారు. దీంతో ఆమె ఉద్యోగం పోగొట్టుకుని జైలుపాలైంది. చదవండి: వివాహిత కిడ్నాప్.. కారులో తిప్పుతూ లైంగిక దాడి -
Nikki Yadav: ప్రియుడు మోసగాడని తెలియక నిక్కీ..
క్రైమ్: శ్రద్ధా వాకర్ తరహాలో.. అదీ దేశరాజధానిలోనే వెలుగు చూసిన ‘ఫ్రిడ్జ్‌లో ప్రియురాలి శవం’ ఉదంతం డేటింగ్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారి తీసింది. ఏళ్ల తరబడి కలిసి ఉన్న ఆమెకు.. ప్రియుడు చేసిన నమ్మక ద్రోహం తెలిశాక నిలదీసింది. అయితే తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. వదిలించుకునేందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు. మంగళవారం ప్రియుడు సాహిల్ గెహ్లాట్‌కు చెందిన ఓ రెస్టారెంట్ ఫ్రిడ్జ్‌లో శవమై కనిపించింది నిక్కీ యాదవ్. ఛార్జింగ్ కేబుల్‌ను మెడకు బిగించి చంపి.. ఆపై ఆ శవాన్ని దగ్గర్లోనే ఉన్న తన కుటుంబానికి చెందిన ధాబాలోని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు సాహిల్. తన కూతురికి సాహిల్ మోసగాడు అని గుర్తించలేకపోయిందని, గుడ్డిగా ప్రేమించి ప్రాణం పొగొట్టుకుందని నిక్కీ తండ్రి విలపిస్తున్నాడు. సాహిల్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాడాయన. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఫుటేజ్ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. निक्की यादवचं हत्येच्या काही तास आधीचं CCTV आलं समोर#NikkiYadav Murder Case CCTV#SahilGehlot #SahilGahlot #Delhi pic.twitter.com/d7hJJtYfuV — Shivraj Yadav | शिवराज यादव 🇮🇳🖊️ (@shiva_shivraj) February 15, 2023 మరోవైపు నిక్కీ యాదవ్ చివరిసారిగా కనిపించిన వీడియో ఒకటి పోలీసుల ద్వారా మీడియాకు రిలీజ్ అయ్యింది. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని తన ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ రోజు తేదీ ఫిబ్రవరి 9. ఆరోజే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాహిల్‌కి చాలారోజుల కిందటే.. మరో యువతితో వివాహం ఫిక్స్ అయ్యింది. ఆ విషయం నిక్కీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అతను. అయితే.. వివాహానికి ముందురోజు ఆమెకు ప్రియుడి చేస్తున్న మోసం తెలిసింది. దీంతో.. అతన్ని నిలదీసింది. మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియగానే.. నిక్కీ అతనితో గొడవకు దిగింది. ఇంట్లోకి వెళ్లిన నిక్కీ.. కాసేపటికే మళ్లీ బయటకు వచ్చింది. ఆపై సుమారు మూడు గంటలపాటు ఇద్దరూ కారులోనే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫోన్ ఛార్జింగ్కేబుల్ను ఆమె మెడకు బిగించి సాహిల్ హత్య చేశాడు. నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్. అయితే ఆమె మాత్రం ఢిల్లీలో ఉంటోంది. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లకు ప్రిపేర్ అవుతున్న క్రమంలోనే నిక్కీ-సాహిల్ మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ డేటింగ్లో ఉన్నారు. నిక్కీ కనిపించకుండా పోయిందని పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో సాహిల్ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్ వర్గాలు చెప్తున్నాయి. -
Banjara Hills: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని..
సాక్షి, బంజారాహిల్స్: అస్సాంలోని దోమ తెరలు, బ్లాంకెట్ల సరఫరాకు సంబంధించి 60 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికి 20 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌కు చెందిన కె.నర్సింహారెడ్డి వ్యాపారి. ఆయనకు విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.నారాయణతో పరిచయం ఉంది. కొద్ది రోజుల కిత్రం నారాయణ ద్వారా మాదాపూర్ జైహింద్ రోడ్డులో నివాసం ఉండే గుండుబోయిన వినయ్, కాకాని మనోహర్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు తమకు వివిధ ప్రభుత్వాలతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. పెద్ద పెద్ద కాంట్రాక్ట్‌లు చేస్తుంటామని నమ్మించారు. అనంతరం అస్సాం రాష్ట్రంలో 60 కోట్ల రూపాయల విలువ చేసే దోమ తెరలు, బ్లాంకెట్లు సరఫరా చేసే కాంట్రాక్ట్ అప్పగింత పని తమ చేతిలో ఉందని తెలిపారు. ఎవరైన పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నర్సింహారెడ్డికి ఆశ కల్పించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ తామే తీసుకుంటున్నట్టు చెప్పడంతో కొంత పెట్టుబడి పెడితే వాటా ఇస్తామని చెప్పారు. నర్సింహారెడ్డి వారి మాటలను నమ్మి 20 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరు మోసగాళ్లని తెలిసింది. తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని నర్సింహారెడ్డి ఇద్దరిని పలుమార్లు అడిగాడు. కాని వారు స్పందించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించగా జూబ్లీహిల్స్ పోలీసులు వినయ్, కాకాని మనోహర్‌రెడ్డిలపై ఐపీసీ 406,420, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: ‘దెబ్బకు దెయ్యం వదిలిపోతుంది.. నన్ను పెళ్లి చేసుకో’
సాక్షి, హైదరాబాద్: నేను ఖయామత్ బంధిష్‌ను (దుష్టశక్తులు ధరికి రాకుండా కాపాడే గొప్ప శక్తిమంతుడిని) అంటూ మాయమాటలు చెప్పి యువతులను వశపరుచుకుంటున్న బాబా ముసుగులో ఉన్న నిత్య పెళ్లికొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. లంగర్‌హౌస్ పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. లంగర్‌హౌస్ ఎండీలైన్స్‌లో నివాసముండే 18 సంవత్సరాల యువతి గత 3 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పలు ప్రాంతాల్లో వైద్యం కోసం తిరిగినా ఫలితం లేకపోవడంతో కొందరి సలహా మేరకు నెల్లూరులోని ఓ దర్గాకు చేరారు. నెల్లూరు ఏసుపాలెం గ్రామంలోని రెహమతుల్లా దర్గా ప్రధాన నిర్వాహకుడు హాతీష్పాషా బాబాను(52) రెండేళ్ల క్రితం కలిసి సమస్యను తెలిపారు. మంత్రశక్తులతో నయం చేస్తానంటూ నిమ్మకాయలు, కాగితాలు ఇచ్చి పంపేవాడు. నిత్యం వైద్యం, మంత్రం కోసం నెల్లూరు వెళ్లిన బాధితులకు హతీష్ బాబా రెండు నెలలుగా ఈ అమ్మాయిని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. తాను ఖయామత్ బంధిస్తానని తనను పెళ్లి చేసుకుంటే సమస్యలు పోవడమే కాకుండా మళ్లీ ఎలాంటి సమస్యలు దరిదాపులోకి రావని తెలిపాడు. నమ్మిన తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకొని ఈ నెల 11న రాత్రి టోలీచౌకీలోని ఫంక్షన్హాల్లో బంధుమిత్రుల ఆధ్వర్యంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పాషా బాబా వివాహసమయానికి ముందు అనారోగ్యం అంటూ ఆస్పత్రిలో చేరి బాధితురాలి కుటుంబీకుల ఫోన్లకు స్పందిచట్లేదు. దీంతో భాదితులు లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా నెల్లూరుకు చెందిన బాబా మంత్రాలు, భూతవైద్యం పేరుతో ఇప్పటికే ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని పలువురిని మోసం చేసి.. మరి కొందరి వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు తెలిసింది. ఇతనిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిపారు. చదవండి: పంజగుట్టలో అర్ధరాత్రి గ్యాంగ్ హల్చల్.. యువకుడిపై 15 మంది దాడి -
50 లీటర్ల పెట్రోల్ ట్యాంకుకు 57 లీటర్ల బిల్లు! బంకు సీల్..!
జబల్పూర్: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఓ పెట్రోల్ పంపు సిబ్బంది ఏకంగా హైకోర్టు న్యాయమూర్తికే టోకరా ఇచ్చారు! ఆయన కారు ట్యాంక్ సామర్థ్యమే 50 లీటర్లయితే ఏకంగా 57 లీటర్ల పెట్రోల్ కొట్టినట్టు బిల్లు చేతికిచ్చారు. న్యాయమూర్తి ఫిర్యాదు మేరకు అధికారులు పెట్రోల్ బంకును సీల్ చేశారు. ఆ ప్రాంతంలోని ఇతర బంకుల నిర్వహణ తీరుపై విచారణకు ఆదేశించారు. ఈ నెల 9వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. చదవండి: ఆల్‌టైం రికార్డు సృష్టించిన చికెన్ ధర.. కేజీ రూ.720..! -
HYD: ప్రేమ పేరుతో సహజీవనం.. రూ. 8 లక్షలు తీసుకొని మరో యువతితో పెళ్లి
సాక్షి, హైదరాబాద్: ప్రేమ పేరుతో లైంగిక దాడికి పాల్పడి పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. అనంతరం ఉపాధి వెతుక్కుంటానని రూ. 8 లక్షలు తీసుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి అప్పటికే మరో యువతిని పెళ్లి చేసుకొని మోసగించారు. ఘటనలో ఘరానా మోసగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వివరాలివీ... హయత్‌నగర్ సమీపంలో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న కాశీ స్నేహిత్ ప్రణయ్ రాజ్‌కు 2011లో యువతితో పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అయిదేళ్లుగా సహజీవనం చేశాడు. బోరబండలో జవహర్‌నగర్‌లో గదులు అద్దెకు తీసుకొని ఆమెతో సహజీవనం చేసిన సమయంలోనే తాను వ్యాపారం చేస్తానని ఆమె వద్ద నుంచి దశల వారిగా రూ. 8 లక్షల వరకు వసూలు చేశాడు. పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేయడమే కాకుండా గతేడాది ఆగస్టు 20న మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. తన మాటేమిటని ప్రశ్నిస్తే ఫోన్ బ్లాక్ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి నాలుగు నెలలుగా తిరిగినా అది తమ పరిధి కాదంటూ పట్టించుకోకపోవడంతో షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. అక్కడి పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376, 420 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: విధి ఆడిన వింత నాటకం.. కొత్త జంట అకాల మరణం -
సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ
యశస్వి కొండెపుడి.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సరిగమప సింగింగ్ షోలో లైఫ్ ఆఫ్ రామ్ పాట పాడి ఓవర్ నైట్‌లో స్టార్ అయ్యాడు. ఆ సమయంలో ఎక్కడ చూసిన యశస్వి పాటనే మారుమోగింది. ఆ సీజన్ సరిగమప సింగింగ్ ఐకాన్ విన్నర్‌గా టైటిల్ కూడా గెలిచాడు. తాజాగా యశస్వి వివాదంలో చిక్కుకున్నాడు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాడు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడు. తాజాగా అతడి బాగోతాన్ని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ బట్టబయలు చేశారు. చదవండి: షణ్ముఖ్‌తో హగ్‌లు, ముద్దులు.. శ్రీహాన్ ముందు సిరి కన్నీళ్లు! కాగా ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు. నవసేవ అనే పేరుతో గత ఐదేళ్లుగా స్వచ్ఛంద సంస్థను స్థాపించి 56 మంది అనాథ పిల్లలను తానే చదివిస్తున్నానని చెప్పారు. కానీ ఓ ఛానల్లో పాటలు పాడిన యశస్వి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందేందుకు సదరు కార్యక్రమం ఓట్లు రాబట్టేందుకు తాను చేయని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. చదవండి: ‘తొలిప్రేమ’ హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తుందో తెలుసా? అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు. కాగా సరిగమప సింగింగ్ షో తెచ్చిన పెట్టిన పాపులారిటితో యశస్వి సెలబ్రెటి అయిపోయాడు. అదే క్రేజ్‌తో అతడు పలు ఈవెంట్స్‌లో తన గాత్రంతో అలరిస్తూ ఎన్నో షోలు చేస్తూ బిజీగా మారాడు. -
హైదరాబాద్ యువతితో నైజీరియన్ స్నేహం.. గిఫ్ట్‌ల పేరుతో రూ. 1.22 కోట్లు..
సాక్షి, హైదరాబాద్: గిఫ్ట్ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్ జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 పాస్‌బుక్‌లు, 8 చెక్కు బుక్‌లు, 9 డెబిట్ కార్డులు, 12 మొబైల్ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను తెరచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపాడు. నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. తనను లండన్‌లో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్‌లో మీ కోసం వస్తున్న డాక్టర్ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్ చేసి చెప్పింది. ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. -
ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లికి సిద్ధం
సాక్షి, కంటోన్మెంట్: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లి కొడుకు బాగోతం బోయిన్‌పల్లిలో కలకలం సృష్టించింది. బోయిన్పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వంశీ కృష్ణ (39) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ దిల్కుష్ నగర్‌లోని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇతను గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకుని వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. తాజాగా మూడో పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీని సంప్రదించాడు. నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్ మీనారెడ్డికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా ఇటీవలే భర్త చనిపోయాడు. ఈమె కూడా అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా ఒకరి వివరాలు మరొకరికి అందడంతో, గత నెలలోనే వంశీకృష్ణ నెల్లూరుకు వెళ్లి మీనారెడ్డినికి కలిశాడు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి నగరానికి తిరిగొచ్చాడు. ఈ నెల 4వ తేదీన నగరానికి వచ్చిన మీనారెడ్డిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల అనంతరం నెల్లూరుకు వెళ్లికిన మీనా రెడ్డి ఈ నెల 24న మళ్లీ తిరిగొచ్చి వంశీకృష్ణ ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే వంశీకృష్ణ తనకు మీనారెడ్డితో వివాహ బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదంటూ చెప్పి, ఓ గదిలో బంధించాడు. మళ్లీ వివాహం కోసం మ్యాట్రిమోనీని సంప్రదించాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వంశీకృష్ణ మళ్లీ పెళ్లికోసం దరఖాస్తు చేసుకోవడంతో మ్యాట్రీమోనీ నిర్వాహకులు మీనారెడ్డిని ఫోన్లో సంప్రదించారు. ఆమె చెప్పిన వివరాలతో పాటు వంశీకృష్ణపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె వంశీకృష్ణ చెరనుంచి తప్పించుకుని బోయిన్పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వంశీకృష్ణ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో అతని కుటుంబ సభ్యులు పాత్రపై కూడా ఆరాతీస్తున్నారు. (చదవండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్) -
సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. బాధితుల ఫిర్యాదులపై విడివిడిగా కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సాహితీ ఇన్ఫ్రా సవాల్ చేసింది. అన్ని పిటిషన్లు ఓకే కేసుగా పరిగణించాలని కోరింది. ఇప్పటివరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో 42 కేసులు నమోదు కాగా.. సింగిల్ బెంచ్ తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని సాహితీ ఇన్ఫ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. రియల్ ఎస్టేట్ పేరుతో 1700 మంది బాధితుల నుంచి రూ.530 కోట్లు వసూలు చేసినట్లు సాహితీ ఇన్ఫ్రాపై ఆరోపణలున్నాయి. 38 అంతస్తుల అపార్ట్మెంట్ నిర్మాణం పేరుతో భారీ మోసానికి తెరతీసినట్లు కేసు ఫైల్ అయ్యింది. ప్రాజెక్టు మొదలు పెట్టకముందే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేశారని, మరో ప్రాజెక్టులో రూ.900 కోట్లు సాహితీఇన్‌ఫ్రా వసూలు చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులు ఈ సంస్థపై కేసులు నమోదుచేశారు. చదవండి: జయత్రి ఇన్ఫ్రా పేరుతో ఘరానా మోసం.. రూ.100 కోట్లకు పైగా వసూళ్లు -
నర్సుతో డాక్టర్ ప్రేమాయణం.. పెళ్లి.. బిడ్డ పుట్టిన తర్వాత!
యశవంతపుర(కర్ణాటక): నర్సును ప్రేమించి పెళ్లి చేసుకున్న డాక్టర్ బిడ్డ పుట్టిన తర్వాత ముఖం చాటేశాడు. ఈ ఘటన విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా హలవాగలు గ్రామంలో జరిగింది. గిరీశ్ బీఎంఎస్ చదివి క్లినిక్ నడుపుతున్నాడు. అదే గ్రామానికి చెందిన త్రివేణి గిరీశ్ వద్ద నర్సుగా పని చేస్తుంది. ఈక్రమంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. కురవత్తి బసవణ్ణ దేవస్థానంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బిడ్డ ఉంది. ఇటీవల డాక్టర్ తీరులో మార్పు వచ్చింది. గిరీశ్ మరో పెళ్లి చేసుకున్నట్లు అరోపణలు వస్తున్నాయి. ఈక్రమంలో త్రివేణి వద్దకు రావడం మానేశాడు. దీంతో త్రివేణి దావణగెరె ఎస్పీకి ఫిర్యాదు చేసింది. చదవండి: నర్సు అనుమానాస్పద మృతి.. ఆసుపత్రిలో ఏం జరిగింది? -
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
ఫీజులు గుంజేసి.. బకాయిలు మింగేసి! హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాకాలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేసిన ఎన్టీఆర్ ట్రస్టు యాజమాన్యం అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాని కార్యాలయంతోపాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని గండిపేట సమీపంలో హైస్కూలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీల్లో 900 మందికి పైగా, హైసూ్కల్లో 500 మంది వరకు విద్యార్థులున్నారు. విద్యార్థుల నుంచి ఏటా రూ.1.50 లక్షల నుంచి రూ.1.75 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50 శాతం తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్‌లో ఎనీ్టఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. వంద మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పని చేస్తుండగా రూ.పది వేలకు మించి జీతాలు చెల్లిస్తున్న వారికి 16 నెలలు కోత విధించారు. పలువురు అధ్యాపకులకు రూ.2 లక్షల నుంచి రూ.5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్టు చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచే ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్‌కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. వసూలు చేసుకుని.. సిబ్బందికి చెల్లించలేదు.. కరోనా సమయంలో ఫీజులు రాలేదని పేర్కొన్న యాజమాన్యం ఆ తర్వాత విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నా.. సిబ్బందికి మాత్రం బకాయిలు చెల్లించలేదు.. ట్రస్టు సీఈవో, డీన్, ప్రిన్సిపాల్, ట్రస్టీలకు మొరపెట్టుకున్నా స్పందన శూన్యం.. చివరకు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్‌కు తెలియజేసినా కూడా పట్టించుకోలేదు.. అంటూ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని నిర్వాహకులను కోరినందుకు ఓ లెక్చరర్‌ను రెండు గంటల్లో ఇంటికి సాగనంపారు. మరో లెక్చరర్ నుంచి క్షమాపణ లేఖ తీసుకుని హెచ్చరించారు. 9 మందికి లీగల్ నోటీసులు బకాయిల గురించి యాజమాన్యం స్పందించకపోవడంతో తొమ్మిది మంది లెక్చరర్లు ట్రస్టు సీఈవోతో సహా నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపారు. ఏ నెల జీతంలో ఎంత కోత విధించారనే వివరాలను నోటీసుల్లో పొందుపరిచారు. చదవండి: ‘డెక్కన్’లో అగమ్యగోచరం! నాలుగో రోజూ లభించని ఆ ఇద్దరి అవశేషాలు -
పరారీలో ఫిజియోథెరపిస్ట్.. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ!
సాక్షి, అనంతపురం: అప్పులు చేసి.. తిరిగి ఇవ్వకుండా ఫిజియోథెరపిస్ట్ పరారైన ఘటన అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసనగర్‌లో ఫిజియోథెరపిస్ట్ రఘువీరప్రసాద్ ఫిజియోథెరపీ సెంటర్ నిర్వహిస్తున్నాడు. తనవద్దకు ఫిజియో థెరపీ కోసం వచ్చే వారితో పాటు స్నేహితులు, సన్నిహితుల నుంచి అప్పులు తీసుకున్నాడు. మంచివాడని, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో తమ డబ్బు ఎక్కడికి పోతుందిలే అన్న ధైర్యంతో అందరూ ధర్మ వడ్డీకి ఇచ్చారు. అలా రూ.3 కోట్ల వరకు అప్పులు చేసిన రఘువీర ప్రసాద్ రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. ఆ వ్యాపారం ఏమైందో తెలీదు కానీ తనవద్ద డబ్బులు లేవని, అప్పు చెల్లించే పరిస్థితిలో లేనని ఐపీ నోటీసులు పంపాడు. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి తాళం వేసి భార్య, పిల్లలు, తల్లితో కలిసి పరారయ్యాడు. ధర్మ వడ్డీ పేరుతో తమ వద్ద డబ్బు తీసుకుని ఇప్పుడు నోటీసులు పంపితే ఎలా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని ఎగ్గొట్టే చర్యలకు పాల్పడుతున్న ఇతనిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చదవండి: (అందం చూసి అనుమానం.. నవ వివాహితను చంపిన సైకో భర్త) -
బిగ్ క్వశ్చన్: అతనే ఒక కుట్ర..
-
పోలీసుల అదుపులో నిత్య పెళ్లికొడుకు.. ఏకంగా 21 మందికి పైగా..
సాక్షి, చెన్నై: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తిరువణ్ణామలైలో స్పెషల్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వివరాలు.. రామనాథపురం జిల్లా పరమక్కుడికి చెందిన కార్తీక్ రాజా(26) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. విరుదునగర్ జిల్లా సాత్తూరు సమీపంలోని వల్లంపట్టికి చెందిన జాన్సీరాణి(20)ని ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమె వద్ద 5 సవర్ల చైన్ తీసుకుని విదేశానికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. భర్త గురించి ఎలాంటి ఆచూకీ లేకపోవడంతో జాన్సిరాణీ ఏలాయిరమ్ పన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తీక్ రాజా తిరువణ్ణామలై జిల్లాలో ఉన్నట్లు తెలుకుని పోలీసులు అక్కడికి వెళ్లి శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శనివారం ఏలాయిరమ్ పన్నై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. ఇతను వివిధ గ్రామాలకు చెందిన 20 మందికి పైగా మహిళలను పెళ్లి చేసుకుని వారి నుంచి 80 సవర్లకు పైగా నగలు తీసుకున్నట్లు తెలిసింది. ఇతనిపై కోయంబత్తూరు, సాత్తూర్, ఏలాయిరమ్ పన్నై, విల్లుపురంతో పాటు పలు పట్టణాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. -
Eluru: లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడు.. గర్భం విషయం తెలియగానే..
నూజివీడు: మండలంలోని రావిచర్లకు చెందిన దేవరపల్లి సురేష్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక యువతి రూరల్ పోలీస్‌స్టేషన్ శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను లాడ్జికి తీసుకెళ్లి తాళి కట్టాడని.. తనకు గర్భం విషయం తెలిపి పెళ్లి చేసుకోమని అడగగా, పథకం ప్రకారం జ్యూస్‌లో మందు కలిపి తాగించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో యువతికి గర్భస్రావం అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని సురేష్ పెద్దవాళ్ల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లు ఆమెను అవమానించి, గ్రామమంతా చెప్పి అల్లరిపాలు చేస్తామని బెదిరించారంటూ బాధితురాలు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తలారి రామకృష్ణ తెలిపారు. చదవండి: (పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య) -
ప్రేమిస్తున్నానంటూ వెంటపడి..పెళ్లి మాట ఎత్తగానే...
సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు. ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష ) -
భార్యకు విడాకులిస్తానని మహిళా అధికారితో చెట్టాపట్టాల్.. చివరకు..
వారిద్దరిదీ ఒకే డిపార్ట్మెంట్.. ఒకే కులం. ఆ యువతితో మాటలుకలిపాడు. అధికారి మనవాడే కదా అని ఆమె కూడా పరిచయం పెంచుకుంది. అదే అదునుగా చూసి ఆ అధికారి పెళ్లయిన విషయాన్ని దాచి మోసం చేశాడు. దీంతో తనకు జరిగన అన్యాయం మరొకరికి జరగకూడదని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అబిద్ అలీ అనే వ్యక్తి డ్రగ్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు. అదే సమయంలో డిపార్ట్మెంట్లో ప్రకాశం జిల్లాలో పనిచేసే మహిళా అధికారికి దగ్గరయ్యాడు. పెళ్లయిన విషయం కూడా చెప్పకుండా ఆ సమయంలో ఇద్దరూ కలిసి సహజీవనం చేశారు. విషయం తెలిసి మహిళా అధికారి నిలదీయడంతో.. తన భార్యకు విడాకులిచ్చి పెళ్లి చేసుకుంటానని మాటాచ్చి తర్వాత ముఖం చాటేశాడు. అయితే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు పిలిచి ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తన ప్రవర్తనలో మార్పులేకపోవడంతో బాధిత మహిళ తనతో గడిపిన ఫోటోలను, వీడియోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన అబిద్ అలీ ఆ మహిళా అధికారి తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపారు. చదవండి: (భార్య వేధింపులు తట్టుకోలేక.. నవ వరుడు ఆత్మహత్య!) -
బయోమెట్రిక్ పద్ధతిన పింఛన్లు స్వాహా!..లబోదిబోమంటున్న బాధితులు
సాక్షి, వెల్గటూర్(ధర్మపురి): వృద్ధాప్యంలో ఆసరా ఉంటుందని రాష్ట్రప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తోంది. అయితే, కొందరు అక్రమార్కులు వీటిని కాజేస్తున్నారు. జిల్లాలోని పలుచోట్ల కొన్ని ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వెల్గటూర్ మండలంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియలో చాలా మోసాలు జరుగుతున్నట్లు వృద్ధులు, నిరక్షరాస్యులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్ పరికరంలో పింఛన్‌దారుల వేలుముద్రలు తీసుకుని తమ బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసుకుంటున్నారు. వేలుముద్రలు రావడం లేదని పింఛన్‌దారులను ఇళ్లకు పంపిస్తున్నారు. కొందరు అనుమానంతో బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయిస్తే.. అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులను నిలదీస్తే.. ఏవేవో మాయమాటలు చెబుతూ.. పింఛన్‌దారుల డబ్బులు తిరిగి చెల్లిస్తున్నారు. మండల కేంద్రంతోపాటు స్తంభంపల్లి అనుబంధ కొత్తపల్లిలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. (చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. కూతురి పెళ్లిరోజే రాష్ట్రస్థాయి పదవి) -
బరితెగించిన మేల్ నర్స్.. సన్నిహితంగా ఉంటూ బ్లాక్‌మెయిలింగ్
సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట ప్రాంతానికి చెందిన మేల్ నర్స్ మహ్మద్ గులామ్ నగరానికి చెందిన ఓ వృద్ధురాలిని టార్గెట్‌గా చేసుకున్నాడు. ఆమె వ్యక్తిగత వివరాలు సంగ్రహించిన అతగాడు వాటిని బయటపెడతానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. బాధితురాలు నగర షీ–టీమ్స్‌ను ఆశ్రయించడంతో కటకటాల్లోకి చేరాడని అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం పేర్కొన్నారు. సదరు 55 ఏళ్ల మహిళ గతంలో కోవిడ్ బారినపడగా టెలీ మెడిసిన్ ద్వారా వైద్య సహాయం పొందారు. అప్పట్లో మేల్ నర్సుగా ఈమెకు తరచు ఫోన్లు చేసి యోగక్షేమాలు తెలుసుకున్న గులామ్ ఆమెకు సన్నిహితంగా మారాడు. తరచు ఫోన్లు చేస్తూ ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు. అతిగా స్పందిస్తున్నాడని, తన వ్యక్తిగత వివరాలు తెలుసుకుంటున్నాడని పసిగట్టిన ఆమె దూరంగా ఉంచడం మొదలెట్టారు. దీంతో తన వద్ద ఉన్న సమాచారాన్ని లీక్ చేస్తానని, ప్రశాంత జీవితాన్ని పాడుచేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టాడు. ఇతడిని వదిలించుకోవడానికి ఆమె కొంత మొత్తం చెల్లించినా పంథా మారలేదు. బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచిన అధికారులు గులామ్‌ను పట్టుకుని, పూర్తి సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల జైలు విధించడంతో చంచల్‌గూడకు తరలించారు. పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడంటూ.. ►పెళ్లి చేసుకోవాలంటూ ఓ వ్యక్తి వేధిస్తున్నాడని మరో బాధితురాలు షీ–టీమ్స్‌ను ఆశ్రయించింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఈ మహిళకు (26) స్పాలో పని చేసే ఎం.అర్జున్ అకౌంటెంట్ ఉద్యోగం ఇప్పించాడు. కొన్నాళ్ల తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అడగడం మొదలెట్టాడు. వివాహితుడైన అతడికి ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో తిరస్కరించింది. బాధితురాలు ఆ ఉద్యోగాన్ని వదిలేసినా అర్జున్ నుంచి వేధింపులు తప్పలేదు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన షీ–టీమ్స్ అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ►గాంధీనగర్ ప్రాంతానికి చెందిన బాలికను ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మొత్తమ్మీద గత నెల్లో షీ–టీమ్స్‌కు 103 ఫిర్యాదులు వచ్చాయి. వీరిలో 52 మంది నేరుగా, 34 మంది వాట్సాప్ ద్వారా, మిగిలిన వాళ్లు ఇతర విధానాల్లో ఆశ్రయించారు. వీటికి సంబంధించి ఆయా ఠాణాల్లో 12 కేసులు నమోదు కాగా.. 26 ఫిర్యాదులు పెట్టీ కేసులుగా మారాయి. ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో 98 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులు ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, 9490616555కు వాట్సాప్ చేయడం ద్వారా లేదా నగర పోలీసు సోషల్‌మీడియా ఖాతాల ద్వారా ఫిర్యాదు చేయాలని ఏఆర్ శ్రీనివాస్ కోరారు. చదవండి: థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం.. హెచ్‌సీయూలో ఉద్రిక్తత -
సరదాగా అలా తిరిగొద్దాం అని చెప్పి..ప్రియురాలిని చంపి, నిప్పంటించాడు
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్యోదంతం మరువక మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాలిని బయటకు వెళ్దాం అని చెప్పి హత్య చేసి నిప్పంటించాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.... చత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల తనూ కుర్రే ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తుండేది. ఆమె తన స్నేహితుడు సచిన్ అగర్వాల్‌తో కలిసి నవంబర్ 21న బలంగీర్కి వెళ్లింది. ఆ తర్వాత నుంచి ఆమె తన కుటుంబ సభ్యులతో టచ్‌లో లేదు. దీంతో అనుమానం వచ్చి కుటుంబసభ్యులు రాయ్‌పూర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసులు ఈ కేసు విషయమై విచారిస్తుండగా...బలంగీర్‌లో కాలిపోయి పడి ఉన్న మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. ఆ మృతదేహన్ని తనూదిగా ఆమె కుటుంబసభ్యులు గుర్తించారు. అనతరం పోలీసులు ఆమె ప్రియుడు సచిన్ అగర్వాల్‌ని అనుమానిస్తూ...ఆ కోణంలో దర్యాప్తు చేయడం ప్రారంభించారు. నిందితుడు సచిన్ అగర్వాల్ ప్రియురాలు తనూ చనిపోయిన ప్రాంతంలో ఎక్కువగా సంచరించినట్లు ఫోన్ లోకేషన్ తెలుపుతోంది. దీంతో పోలీసులు తమదైన తరహాలో సచిన్‌ని గట్టిగా విచారించగా...నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు. తనూని బలంగీర్ చుట్టూ సరదాగా తిరిగొద్దాం అని చెప్పి బయటకు తీసుకు వెళ్లినట్లు చెప్పాడు. తనను మోసం చేస్తుందని భావించి హత్యచేసి చంపేసినట్లు తెలిపాడు. అనతరం పెట్రోల్ పోసి తగలు బెట్టినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: తీస్తే మరో దృశ్యం సినిమా అవుతుందేమో!.. గొంతుకోసి.. వేడినూనె, యాసిడ్‌తో ముఖం కాల్చేసి..) -
అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే!
సాక్షి, హైదరాబాద్: పండుగలు, సెలవుల నేపథ్యంలో స్వదేశానికి వచ్చే వారిని టార్గెట్ చేస్తూ విమాన టికెట్ల రూపంలో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారిని ఎంచుకుని వారి నుంచి రూ.లక్షలు కాజేస్తున్నారు. ఇటీవల యూఎస్‌లో ఉంటూ నగరానికి రావాల్సిన సుమారు 8 కుటుంబాలు సైబర్‌కేటుగాళ్ల చేతిలో మోసపోయి బంధువుల ద్వారా సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విమాన టికెట్ల రూపంలో జరుగుతున్న మోసాలు సైబర్‌క్రైం పోలీసుల దృష్టికి వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులకు ముందే డబ్బు ఇస్తున్నారు. ఏజెంట్ ద్వారా టికెట్‌ను బుక్ చేయించి ఆ వివరాలు ప్రయాణికుడికి ఇస్తుండటంతో నమ్మకం మరింత రెట్టింపు అవుతుంది. తీరా ప్రయాణం రేపు అనగా..పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేస్తే కాని తాము మోసపోయినట్లు తెలియడం లేదు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి స్వదేశానికి వచ్చే వారిని కనిపెట్టిన బిహార్, రాజస్థాన్, యూపీకి చెందిన కొందరు సైబర్ నేరగాళ్లు యూఎస్‌లో ఉంటున్న భారతీయుల వాట్సాప్ గ్రూపుల్లోకి తెలిసిన వారి ద్వారా యాడ్ అవుతున్నారు. ట్రావెల్ ఏజెంట్‌ను అంటూ పరిచయం చేసుకోవడం, తన ద్వారా విమాన టికెట్లు బుక్ చేస్తే 40శాతం నుంచి 60శాతం డిస్కౌంట్ వస్తుందని చెబుతున్నారు. నమ్మకం కోసం తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి రూ.50వేలకే టికెట్‌ను ఇస్తున్నారు. ఆ టికెట్‌ను వాట్సప్ గ్రూపులో చూసిన వారంతా తమకు కూడా కావాలంటూ కేటుగాళ్లను సంప్రదిస్తున్నారు. వీరు టికెట్‌ను ప్రయాణికులకు కావాల్సిన తేదీల్లో బ్లాక్ చేస్తూ ఆ వివరాలను పంపిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఎస్సార్‌నగర్‌కు చెందిన ఓ కుటుంబం వారి చేతిలో మోసపోయింది. దీంతో నగరంలో ఉంటున్న సమీప బంధువుకు చెప్పడంతో అతను సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ బావ నుంచి రూ.10లక్షలు చేశారంటూ పోలీసుల ఎదుట వాపోయాడు. ఇదే తరహాలో పలు కుటుంబాలు రూ.25లక్షల నుంచి రూ.40లక్షల మేర నష్టపోయినట్లు సైబర్ క్రైం అందిన ఫిర్యాదుల ఆధారంగా స్పష్టమవుతోంది. ఆశపడి మోస పోవద్దు.. యూఎస్ నుంచి ఇండియాకు అంత తక్కువ రేటుకు టికెట్ రాదు. ఇండియాకు వచ్చేవారైనా, ఇతర దేశాలకు వెళ్లే వారైనా వారి మాటలు నమ్మి మోసపోవద్దు. ఎయిర్వేస్కు సంబంధించిన అధికారిక వెబ్సైట్లలో మాత్రమే టికెట్‌ను బుక్ చేసుకునేందుకు ప్రయతి్నంచండి. అక్కడ జర్నీ తేదీని బట్టి టికెట్ ధర మారుతూ ఉంటుంది. 5–10శాతం మించి డిస్కౌంట్ ఎవరూ ఎక్కువగా ఇవ్వరు, ఒకవేళ ఇస్తామన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఇతరులను సంప్రదించి మాత్రమే టికెట్ బుక్ చేసుకోండి. గుర్తు తెలియని వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్‌క్రైం ఏసీపీ -
హైదరాబాద్‌లో వెలుగులోకి ‘దొంగ–పోలీసు–దోస్తీ’ వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: తమ ముఠా కోల్పోయిన సొమ్ము, సొత్తు కోసం పరిధులు సృష్టించి మరీ కేసు నమోదు చేసిన అధికారి ఒకరైతే... కానిస్టేబుల్ పైరవీ చేయడంతో ఓ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టిన అధికారి మరొకరు... నల్లగొండలో జైలుకు వెళ్లిన కానిస్టేబుల్ ఈశ్వర్ వ్యవహారంతో నగర పోలీసు విభాగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో దొంగలతో మిలాఖత్ అయిన, వారికి సహకరిస్తున్న పోలీసుల వ్యవహారాలను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది చేసిన దందాలను గుర్తించారు. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్న కొత్వాల్ సీవీ ఆనంద్ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. తక్షణం మారిపోయిన సీన్.. చట్ట ప్రకారం నేరం ఎక్కడ జరిగితే కేసు ఆ పరిధిలోకి వచ్చే ఠాణాలోనే నమోదు చేయడమో, జీరో ఎఫ్ఐఆర్ కట్టి అక్కడికి బదిలీ చేయడమో జరగాలి. సామాన్యులు తీవ్రంగా నష్టపోయిన అంశాల్లోనూ పోలీసులు ఇదే చేస్తుంటారు. ఈ ‘బాధిత ముఠా’ కోసం సదరు అధికారి ఆ నిబంధనను తుంగలో తొక్కారు. ఈ గ్యాంగ్‌కు చెందిన ఓ వ్యక్తి వెస్ట్ జోన్ పరిధిలో ఉండగా గుట్ట వరకు ఎత్తుకుపోయారు అనే మెలిక పెట్టారు. దీంతో కేసు పరిధి పశ్చిమ మండలంలోని ఠాణాకు మారిపోయింది. ఈ కేసు ‘దర్యాప్తు’ చేసిన సదరు అధికారి అవతలి ముఠాను పట్టుకుని రూ.20 లక్షల వరకు ‘రికవరీ’ చేసి ‘బాధితులకు’ అందించాడు. తన వాటాగానూ పెద్ద మొత్తమే తీసుకున్నాడు. ఇది ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. గుట్ట వ్యవహారం వెస్ట్‌కు వచ్చింది.. 2019లో యాదగిరిగుట్టలో జరిగిన ఓ వివాదానికి సంబం«ధించిన కేసు నగరంలోని వెస్ట్‌జోన్ పరిధిలో ఉన్న ఓ ఠాణాలో నమోదైంది. ఈ కేసును ‘పరిష్కరించిన’ సదరు అధికారి రూ.10 లక్షలకు పైగా ‘రికవరీ’ చేసి తమ ముఠాకు అప్పగించాడు. 2018–19ల్లో రెండు పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ యాదగిరిగుట్ట పరిధిలో విరుచుకుపడ్డాయి. డబ్బు పంపకాలకు సంబంధించి వీటి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఓ గ్యాంగ్‌పై దాడి చేసిన మరో గ్యాంగ్ మొత్తం సొమ్ము కాజేసింది. ఈ ‘బాధిత గ్యాంగ్’తో అప్పట్లో పశి్చమ మండల పరిధిలోని ఓ ఠాణాలో పని చేసిన ఇన్స్పెక్టర్కు దగ్గరి సంబంధాలు ఉన్నాయి. వాళ్లు వచ్చి జరిగిన విషయం ఈయనకు చెప్పడంతో వీళ్లకు రావాల్సిన డబ్బు రికవరీ కోసం భారీ స్కెచ్ వేశాడు. పిక్ పాకెటర్ నుంచి రూ.3 లక్షలు వసూలు.. ఈ అధికారి వ్యవహారం ఇలా ఉండగా.. మరో అధికారి ఏకంగా తన కార్యాలయంలోనే సెటిల్మెంట్ చేశారు. పక్షం రోజుల క్రితం ఈ ఉదంతం చోటుచేసుకుంది. నందనవనం ప్రాంతానికి చెందిన ఓ పిక్ పాకెటర్‌ను నగర పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ నాగోల్ వద్ద పట్టుకున్నారు. ఇతగాడిని తమ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించడానికి సిద్ధమయ్యారు. ఈలోపు విషయం తెలుసుకున్న ఓ ‘పోలీసు దొంగ’ రంగంలోకి దిగాడు. ఆ పిక్ పాకెటర్‌ను విడిచిపెట్టడానికి రూ.2 లక్షలు అధికారికి ఇచ్చేలా, వేరే ఇద్దరు నేరగాళ్లకు పట్టిచ్చేలా సెటిల్మెంట్ చేశాడు. ఇది తెలుసుకున్న కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెటిల్మెంట్లో ఇవ్వాల్సిన మొత్తం రూ.3 లక్షలకు పెరిగి ముగ్గురికీ గిట్టుబాటైంది. కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తున్న కొత్వాల్.. నగరంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం లేవు. నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి పూర్తిగా మారిపోయాయి. సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న ఆయన వీలున్నంత వరకు సిబ్బందికి ఏ లోటు లేకుండా చేస్తున్నారు. అదే సమయంలో క్రమశిక్షణారాహిత్యం, పోలీసు విభాగానికి మచ్చ తెచ్చే పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించట్లేదు. ఈ నేపథ్యంలోనే గడచిన ఏడాది కాలంలో పదులు సంఖ్యలో అధికారులు, సిబ్బందిపై వేటు పడింది. ఈ పోలీసు దొంగల దోస్తీ వ్యవహారాన్నీ ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. లోతైన విచారణ చేయిస్తుండటంతో ఈశ్వర్‌తో పాటు ముగ్గురు ఇన్స్పెక్టర్లు, అయిదుగురు కానిస్టేబుళ్ల వ్యవహారాలు బయటపడినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక విభాగంలోనూ పని చేస్తున్నట్లు సమాచారం. ఇలాంటి వారిపై నివేదికల ఆధారంగా ఉద్వాసన చెప్పాలని కూడా కొత్వాల్ ఆనంద్ నిర్ణయించినట్లు సమాచారం. -
హైదరాబాద్‌లో మరికొందరు ‘పోలీస్ దొంగ’లు!.. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ మేకల ఈశ్వర్ వ్యవహారంతో నగర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. సిటీలో ఈ తరహా దందాలకు పాల్పడుతున్న ‘పోలీసు దొంగ’ల్లో మరో ముగ్గురిని గుర్తించారు. వీరిలో ఇద్దరు నగర కమిషనరేట్‌లో పని చేస్తుండగా... మరొకరు సైబరాబాద్‌లో ఉన్నట్లు తెలిసింది. వీరి వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు అందిన తర్వాత చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ అధికారులకు సహకరించిన, సహరిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్ల వ్యవహారాన్నీ సీరియస్‌గా తీసుకున్నారు. సమాచారంతో మొదలై సహవాసం వరకు... పోలీసులకు, దొంగలకు మధ్య పరిచయాలు ఉండటం కొత్త విషయం కాదు. వీరికి సమాచారం ఇచ్చే వారిలో పాత నేరగాళ్లే ఎక్కువగా ఉంటారు. ఎంత ఎక్కువ మంది నేరగాళ్లతో పరిచయాలు ఉంటే అంత ఎక్కువ సమాచారం అందుతుంది. ఈశ్వర్ సహా నగరంలో పని చేస్తున్న/చేసిన ముగ్గురు ఇన్స్పెక్టర్లు సమాచారం స్థాయిని దాటి సహవాసం వరకు వెళ్లారు. వీళ్లలో కొందరు పిక్ పాకెటింగ్, స్నాచింగ్స్ గ్యాంగ్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మరికొందరు ఏకంగా వారికి సంబంధించిన సెటిల్మెంట్లు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జేబు దొంగలకు చెందిన ఓ బడా నాయకుడు ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. అతడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఓ అధికారి వెళ్లి పరామర్శించడంతో వారి మధ్య సంబంధం బయటపడింది. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్‌ను పట్టుకున్న ఠాణాలు, ప్రత్యేక విభాగాల వద్దకు వెళ్లే మరో అధికారి వాళ్లను అరెస్టు చూపకుండా వదిలేసేలా పైరవీలు చేయడంలో సిద్ధహస్తుడిగా మారాడు. విమానాల్లో తిరుగుతూ సెటిల్మెంట్లు... ప్రస్తుతం సైబరాబాద్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి ఈ వ్యవహారాల్లో సిద్ధహస్తుడు. తన మాట వినని, తన గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న ముఠాలను అరెస్టు చేయడంతోనే ఇతడి సక్సెస్ రేటు పెరిగిపోయింది. ఈ సక్సెస్‌ను మాత్రమే చూసిన ఉన్నతాధికారులకు ఇప్పుడిప్పుడే అతడి పూర్తి వ్యవహారాలు తెలుస్తున్నాయి. అంతర్రాష్ట్ర పిక్ పాకెటింగ్ ముఠాలో ఈ అధికారికి సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఏ నగరంలోని పోలీసులకు వీరు చిక్కితే ఈయనే వెళ్లి విషయం సెటిల్ చేసి వచ్చేవాడు. దీనికోసం లీవ్ కూడా పెట్టాల్సిన అవసరం లేకుండా విమానాల్లో వెళ్లి వస్తూ పని పూర్తి చేసేవాడు. నగరంలో సుదీర్ఘకాలం పని చేసిన ఈయన ఎప్పుడూ ఫోకల్ పోస్టు కోసం ప్రయత్నించలేదు. కేవలం ఠాణాల్లోని డిటెక్టివ్, క్రైమ్ వింగ్స్‌లో పని చేయడానికే పైరవీలు చేసుకునేవాడు. ఈశ్వర్‌తో పాటు అలాంటి వ్యవహారాలు చక్కబెట్టిన కొందరు కానిస్టేబుళ్లకు అధికారులు సహకారాలు అందిస్తూ వారిని బందోబస్తు డ్యూటీలకు దూరంగా ఉంచేవారని తెలిసింది. అంతర్జాతీయ చోరీ ఫోన్ల నెట్‌వర్క్‌లో ఈశ్వర్.. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా ఈశ్వర్‌కు ఆ పరిధిలోని ఠాణాలో పోస్టింగ్ వచ్చాక క్రైమ్ ప్రోన్ ఏరియాలుగా మారిపోయేవని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్లో ఉండే మార్కెట్లు, అనువైన ప్రాంతాలను గుర్తించే ఇతగాడు తన గ్యాంగ్స్‌ను దింపి నేరాలు చేయించేవాడు. ఇలా కొందరు దొంగలను తమ కంట్రోల్లో పెట్టుకోవడం, రికవరీల్లో సెటిల్మెంట్లు చేయడంలో ఈశ్వర్‌తో పాటు మరికొందరూ నిష్ణాతులని తెలుస్తోంది. చోరీ ఫోన్లు ట్రాక్ కాకుండా ఉండటానికి ఈశ్వర్ అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. తన గ్యాంగ్ ద్వారా తన వద్దకు చేరిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లు క్లోనింగ్ చేసేవాడు. అలా కుదరని పక్షంలో బయటి దేశాలకు... ప్రధానంగా నేపాల్‌కు పంపేవాడని సమాచారం. గతంలో ఈశ్వర్‌తో పాటు ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి ఒకే ఠాణాలో పని చేశారు. అçప్పట్లోనూ ఈ గ్యాంగ్స్ నిర్వహణ, సెటిల్మెంట్లకు సంబంధించి ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చాయి. చదవండి: Viral: కుటుంబంతో సేదతీరేందుకు వ్యవసాయక్షేత్రంలో రెడీమేడ్ ఇల్లు -
అసోం దంపతులు మహా కిలాడీలు.. మాయమాటలతో లక్షల మోసం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): నా భర్త కస్టమ్స్ అధికారి అని, బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని ఇప్పిస్తామని, అక్కడ అధికారులు సీజ్ చేసిన వస్తువులను తక్కువ ధరకు ఇప్పిస్తామని చెప్పి మోసాలకు పాల్పడుతున్న జంట కటకటాల పాలైంది. దర్బిన్‌దాస్ అలియాస్ మోహన్‌దాస్, అతని భార్య ధనుష్యను కొడిగేనహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 34 లక్షల నగదు, 106 గ్రాములు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ అనూప్‌శెట్టి తెలిపారు. వివరాలు... ఇందిరానగరలో ఓ అకాడమీని నడుపుతున్న స్నేహ భగవత్ వద్ద ధనుష్య శిక్షణకు చేరింది. తన భర్త విమానాశ్రయంలో కస్టమ్స్‌లో పని చేస్తున్నట్లు చెప్పింది. జప్తు చేసిన బంగారు నగలను తక్కువ ధరకు ఇప్పిస్తామని నమ్మించింది. అలా స్నేహ నుంచి పలు విడతలుగా రూ. 68 లక్షలను నగదును వసూలు చేసింది. అంతేకాక అకాడమీలో పని చేస్తున్న సిబ్బంది నుంచి కూడా డబ్బులు వసూలు చేసింది. కొన్నిరోజుల తరువాత ధనుష్య మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసుకుని పరారైంది. దీంతో బాధితులు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ జంట కోసం గాలింపు చేపట్టారు. చదవండి: (మోసకారి దంపతులు దర్బిన్‌దాస్, ధనుష్య) పలువురి నుంచి వసూళ్లు దేవనహళ్లి తాలూకాలో కూడా ఇదే తరహా మోసం కేసు వీరిపై నమోదై ఉంది. ధనుష్య పిల్లలు చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇదే మాదిరి మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు గుంజుకుందని పోలీసుల విచారణలో బయట పడింది. తక్కువ ధరలకు ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లను లభిస్తాయని చెప్పుకొని నివాసం ఉండే అపార్ట్మెంట్లోని వారి నుంచి లక్షల రూపాయలను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో తీసుకుంది. వస్తువులన్నీ ఇప్పించండి, లేదా డబ్బయినా తిరిగి ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేయడంతో ధనుష్య, ఆమె భర్త మంగళూరుకు పారిపోయారు. కొడిగేనహళ్లి పోలీసులు మంగళూరుకు వెళ్లి ఈ జంటను పట్టుకుంది. వారి ఇంట్లో రూ. 34 లక్షలు నగదు, 106 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. బెంగళూరుకు తరలించి విచారణ చేపట్టారు. -
సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా!
సాక్షి, హైదరాబాద్: సినీ నటి జీవితను టార్గెట్‌గా చేసుకుని, ఆమె మేనేజర్‌ను మోసం చేసిన చెన్నై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. జీవితకు కొన్నాళ్ల క్రితం ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫారూఖ్ అంటూ పరిచయం చేసుకున్న అతగాడు మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చింది నేనే అని మొదలెట్టాడు. ఆ సమయంలో బిజీగా ఉన్న జీవిత అదే విషయం చెప్పి తన మేనేజర్‌తో మాట్లాడమని సూచించారు. దీంతో అతడితో మాట్లాడిన దుండగుడు తనకు పదోన్నతి వచ్చిన నేపథ్యంలో ఓ బంపర్ ఆఫర్ విషయం చెప్తున్నానన్నాడు. జియో సంబంధిత సంస్థల్లో విక్రయించే వస్తువులు మీకు మాత్రమే 50 శాతం డిస్కౌంట్లో వస్తాయని నమ్మబలికాడు. దానికి సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. వాటిలో రూ.2.5 లక్షలు ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు రూ. 1.25 లక్షలే వస్తున్నట్లు ఉంది. నిజమని నమ్మిన ఆయన రూ.1.25 లక్షలను ఫారూఖ్గా చెప్పుకున్న వ్యక్తిని ఆన్లైన్లో పంపారు. ఆపై అతడి నుంచి స్పందన లేకపోవడంతో పాటు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో తాను మోసపోయానని గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. చదవండి: (ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఆత్మహత్య) నిందితుడు వాడిన ఫోన్ నెంబర్, నగదు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలు తదితరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. చెన్నైకి చెందిన టి.నాగేంద్ర బాబే నిందితుడని గుర్తించారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసి మంగళవారం సిటీకి తరలించింది. ఇతడు నేరచరితుడని పోలీసులు చెప్తున్నారు. గతంలో సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న వారికి ఫోన్లు చేసి ఆఫర్ల పేరుతో మోసాలు చేసినట్లు గుర్తించారు. సినీ నిర్మాతలకు అవార్డులు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి నుంచీ డబ్బులు వసూలు చేశాడు. నగరంతో పాటు సైబరాబాద్‌లోనూ కేసులు నమోదు కావడంతో గతంలోనూ జైలుకు వెళ్లాడు. గతంలో చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్గానూ పని చేశాడు. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. ఖాళీ టైంలో పెయింటింగ్ వేసి ఆ చిత్రాలను తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్ నంబర్ తీసుకుని చాట్ చేసి ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపు రప్పించాడు. ఈ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు. తొలుత ఇన్వెస్ట్ చేస్తే లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్‌లు, కమీషన్ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
పోలీసునంటూ నిరుద్యోగులకు టోకరా! భారీగా వసూళ్లు
గుంతకల్లు: ఖాకీ యూనిఫాం ధరిస్తాడు. బుల్లెట్ బండిపై సవారీ చేస్తాడు. శ్రీసత్యసాయి జిల్లాలో ఓ ఉన్నతాధికారి వద్ద ఏఆర్ కానిస్టేబుల్‌నంటూ అందరినీ నమ్మించాడు. ఉన్నతాధికారులతో తనకు పరిచయాలు ఉన్నాయంటూ మభ్యపెట్టాడు. పోలీస్, ఇతర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేశాడు. చివరకు మోసం బట్టబయలై పోలీసులకు దొరికిపోయాడు. ఇదీ అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని కథలవీధిలో నివాసముంటున్న పృథ్వి బాగోతం. ఇతను పృథ్వి, చింటూ, హర్షారెడ్డి తదితర పేర్లతో నిరుద్యోగ యువతతో పరిచయం పెంచుకున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ ఉన్నతాధికారి వద్ద కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇతని మాటలు నమ్మి గుంతకల్లు పట్టణంలో హెర్బల్ ప్రొడక్ట్స్ అమ్ముకునే ఓ మహిళ ఏకంగా రూ.17 లక్షల దాకా ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఎస్ఎల్వీ థియేటర్ సమీపంలోని ఓ కూల్ డ్రింక్ షాపు యజమాని రూ.8 లక్షలు, తిమ్మాపురం గ్రామానికి చెందిన సంగమేష్ రూ.4.5 లక్షలు, ఓ మహిళా పోలీస్ కూడా తన చెల్లెలి ఉద్యోగం కోసం రూ.లక్ష సమరి్పంచుకున్నారు. ఇంకా ఇతని గాలానికి చిక్కి ఎందరో నిరుద్యోగులు రూ.లక్షల్లో మోసపోయినట్లు సమాచారం. ఆఫీసులకు తీసుకెళ్లి..అందరినీ నమ్మించి.. నిరుద్యోగులను పృథ్వి నమ్మించి మోసగించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగం కావాలని అడిగారో ఏకంగా ఆ శాఖ కార్యాలయానికి నిరుద్యోగులను తీసుకెళ్లేవాడు. వారిని కార్యాలయం వద్ద కూర్చోబెట్టి ఒక్కడే లోపలికి వెళ్లేవాడు. కాసేపటికి బయటకు వచ్చి పై అధికారితో అంతా మాట్లాడానంటూ నమ్మబలికేవాడు. ఇలా ఒక నిరుద్యోగిని గుంతకల్లు సెబ్ కార్యాలయంలో ఉద్యోగం ఉందని పిలుచుకెళ్లి అక్కడే అడ్వాన్స్‌గా రూ.లక్ష తీసుకున్నాడు. వాస్తవంగా ఇతనికి ఎక్సైజ్ శాఖలో ఎవరూ తెలీదు. ప్రస్తుతం ఇతను గుంతకల్లు టూటౌన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. (చదవండి: కాల్వకు 'జేసీబీ'తో బ్రేక్.. ఈసారి టికెట్ ఆయనకేనా?) -
ఫేస్బుక్లో పరిచయైన యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.. రూ.39లక్షలు..!
సాక్షి, బెంగళూరు: ఫేస్బుక్ పరిచయం ఓ వ్యక్తిని నిలువునా ముంచింది. నాలుగు నెలల క్రితం విజయపుర జిల్లా సిందగి తాలూకా బగలూరి పరమేశ్వరహిప్పరగి అనే యువకుడి ఫేస్బుక్లో ఫ్రెండ్‌రిక్వెస్ట్ వచ్చింది. ఆమోదించిన పరమే«శ్వరహిప్పరగి, యువతితో క్రమేణా పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరు ఫోన్‌నెంబర్లు తీసుకున్నారు. చాటింగ్ ప్రారంభించారు. వంద, వెయ్యి రూపాయలనుంచి సుమారు రూ.39 లక్షలు పరమేశ్వరహిప్పరగి దశలవారీగా యువతి లాగేసింది. వివరాల్లోకి వెళితే... సిందగి నివాసి పరమేశ్వరకు 2022 జూన్ 29 తేదీన మంజుల, కేఆర్ అనే ఫేస్బుక్ ఐడీ నుంచి ఫ్రెండ్‌రిక్వెస్ట్ వచ్చింది. పరమే«శ్వర కన్ఫర్మ్ చేయగానే యువతి హాయ్ అని మెసేజ్ పెట్టింది. తెలంగాణా రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు కంపెనీలో ఉన్న పరమేశ్వర నిత్యం మెసేజ్ చేయడం ద్వారా గుర్తుతెలియని యువతితో ఆత్మీయంగా మెలిగారు. ఆగష్టు 14న తల్లి ఆరోగ్యం సరిగా లేదంటూ రూ.700 ఫోన్‌పే చేయాలని యువతి నుంచి మెసేజ్ వచ్చింది. అనంతరం రూ.2 వేలు అడగగానే యువతికి పరమేశ్వర ఫోన్ చేశాడు. కొద్దిరోజుల తరువాత తిథి కార్యక్రమానికి రూ.5 వేలు కావాలని యువతి అడిగిన వెంటనే పరమేశ్వర ఆమె అకౌంట్‌కు జమ చేశారు. చదవండి: (ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్) వివాహం చేసుకుంటానని నమ్మించి.... కొద్దిరోజుల అనంతరం ఫోన్ చేసిన మంజుల తాను ఐఏఎస్ పరీక్ష పాసయ్యాను. కలెక్టర్ పోస్టు వస్తుంది. ప్రస్తుతం హాసన్‌లో ఉన్నాను తనను చూసుకునేవారు ఎవరూ లేరు. బెంగళూరుకు వెళ్లాలి ఖర్చులకు డబ్బుల్లేవు ఆర్థిక సాయం చేస్తే వివాహం చేసుకుంటానని పరమేశ్వరకు తెలిపింది. యువతి మాటలు నమ్మిన పరమేశ్వర ఒకేరోజు రూ.50 వేలు రెండు దఫాలుగా చెల్లించాడు. కొద్దిరోజుల అనంతరం మంజుల మరింత స్నేహంగా మెలుగుతూ పరమేశ్వర నుంచి దశలవారీగా రూ.41.26 లక్షలు కాజేసింది. అనంతరం తన వద్ద పైసా కూడా లేదని పరమేశ్వర మంజులను అడిగాడు. పాపం కొద్దిగా ఖర్చుకు డబ్బు ఉండాలని భావించి మంజుల రూ.2.21 లక్షలు పరమేశ్వర అకౌంట్‌కు జమ చేసింది. మళ్లీ మంజుల డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన ఆయన ఈనెల 15న విజయపుర సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేపట్టామని చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్డీ.ఆనందకుమార్ తెలిపారు. -
కోవిడ్ ఎఫెక్ట్: కంపెనీల్లో కొత్త రకం మోసాలు
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా దేశీయంగా 95 శాతం కంపెనీలు కొత్త రకం మోసాలను ఎదుర్కొంటున్నాయి. డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగుల భద్రత, తప్పుడు సమాచారంపరమైన రిస్కులతో సతమతమవుతున్నాయి. కోవిడ్ విజృంభణ, దానివల్ల తలెత్తిన అనిశ్చితి, తదనంతరం డిజిటల్.. రిమోట్ పని విధానాలకు మళ్లాల్సి రావడం మొదలైన అంశాలు ఈ పరిస్థితికి దారి తీశాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన సర్వేలో ఇవి వెల్లడయ్యాయి. దీని ప్రకారం 52 శాతం భారతీయ కంపెనీలు గత 24 నెలల్లో ఏదో ఒక మోసం లేదా ఆర్థిక నేరం బారిన పడ్డాయి. 95 శాతం కంపెనీలు కోవిడ్–19 మూలంగా వచ్చిన మార్పుల వల్ల కొత్త రకం మోసాల బారిన పడినట్లు నివేదిక పేర్కొంది. దుష్ప్రవర్తన రిస్కు (67 శాతం), లీగల్ రిస్కు (16 శాతం), సైబర్ క్రైమ్ (31 శాతం), ఇన్సైడర్ ట్రేడింగ్ (19 శాతం), ప్లాట్‌ఫాం రిస్క్ (38 శాతం) విభాగాల్లో ఇవి తలెత్తినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 1,296 కంపెనీలు, భారత్‌లో 112 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. భారత్‌లో కంపెనీలు మోసాలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇస్తున్నాయని సర్వే పేర్కొంది. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు.. తల్లిదండ్రుల ఎంట్రీతో..
సాక్షి, మెదక్ (తూప్రాన్): యువతిని ప్రేమించి పెళ్లి చేసుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ కేసు నమోదైంది. మంగళవారం ఎస్ఐ రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండలం కోనాయపల్లి(పీటీ) గ్రామ పంచాయతీ పరిధి ధర్మరాజ్పల్లి గ్రామానికి చెందిన భాషబోయిన తేజశ్రీ, అదే గ్రామానికి చెందిన సాయిరెడ్డిగారి యశ్వంత్‌రెడ్డి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని శారీరకంగా లొంగదీసుకున్నాడు. వీరి పెళ్లికి కులాలు అడ్డు రావడంతో కుల పెద్దలు నిరాకరించారు. దీంతో గతనెల 19వ తేదీన లక్ష్మీనర్సింహా స్వామి దేవాలయం వద్ద పెళ్లి చేసుకున్నారు. తూప్రాన్‌లో కాపురం పెట్టారు. విషయం తెలుసుకున్న అబ్బాయి, కుటుంబసభ్యులు, కుల పెద్దలు 20న తూప్రాన్ వచ్చి అబ్బాయిని తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించినందుకు యశ్వంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు చంపుతామని బెదిరిస్తున్నారని తేజశ్రీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు యశ్వంత్‌రెడ్డి, కుటుంబ సభ్యులు జయరాంరెడ్డి, రమణమ్మ, అభిషేక్‌రెడ్డి, పుష్ప, శిల్ప, బల్వంత్‌రెడ్డి, మణేమ్మ, రవీందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) -
క్రిప్టో కరెన్సీ ట్రేడ్.. 20 శాతం కమీషన్.. టెకీ నుంచి రూ.22 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: క్రిప్టో కరెన్సీలో మీరు చేసిన ట్రేడ్‌కు లాభాలు వచ్చాయి. ఆ లాభాలు మీకు చెందాలంటే మాకు 20శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనంటూ సైబర్ కేటుగాళ్లు నగరానికి చెందిన ఓ టెకీకి వల వేశారు. మొదట్లో 208 యూఎస్డీ డాలర్లు(రూ.17వేలకు పైగా మన కరెన్సీలో) క్రిప్టో కొనిపించారు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయంటూ నమ్మించి నిండా ముంచేశారు. తనని గుర్తు తెలియని వారు మోసం చేశారంటూ హబ్సిగూడకు చెందిన యేగేశ్ శర్మ మంగళవారం సిటీసైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్న యేగేశ్ శర్మ ఫోన్ నంబర్‌ను టెలిగ్రామ్ గ్రూప్‌లో గుర్తుతెలియని వ్యక్తి యాడ్ చేశాడు. ఈ గ్రూప్‌లో అంతా క్రిప్టో లాభాలపై చర్చ, లాభాలు వచ్చినట్లు స్క్రీన్‌షాట్స్‌తో ఫొటోలు కనిపించాయి. గ్రూప్‌లో ఓ వ్యక్తి యేగేశ్‌శర్మతో మాట కలిపాడు. కేకో కాయిన్ డాట్‌కామ్ అనే లింకును పంపి ఆ లింకులో రిజిస్టర్ అయ్యాక మొదట్లో 208 ఎస్డీ డాలర్ల క్రిప్టో కొనుగోలు చేశాడు. దీనికి రెండింతలు లాభాలు వచ్చాయని చెప్పిన కేటుగాడు 20శాతం కమీషన్ ఇస్తేనే మీ లాభాలు మీ కొచ్చేలా చేస్తామన్నారు. దీనికి సరేనంటూ కేటుగాళ్లు చెప్పిన విధంగా యూఎస్, యూకే డాలర్లను క్రిప్టో పేరుతో కొనుగోలు చేయిస్తూనే ఉన్నారు. యేగేశ్‌శర్మకు ఇవ్వాల్సిన లాభాలు మాత్రం ఇవ్వట్లేదు. ఇలా వారు చెప్పిన విధంగా రూ.22 లక్షలు సమర్పించాడు. అంతటితో ఆగక మరో రూ.1.50 లక్ష క్రిప్టో కొనుగోలు చేసి తాము చెప్పిన అకౌంట్ నంబర్స్‌కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. -
పీటల మీద పెళ్లి నిలిపేసిన భార్య.. పాపం హనీమూన్ ట్రిప్..
పెళ్లి మండపంలో ఎటుచూసినా సందడి. మంగళవాయిద్యాలు మోగుతున్నాయి. మూడుముళ్లకు సమయం సమీపిస్తోంది. వరుడు కూడా ఆతృతగా ఉన్నాడు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. వధువు తల్లిదండ్రులను కలిసి ఏదో చెప్పింది. అంతే పెళ్లి వేడుక బంద్ అయ్యింది. పోలీసులు వచ్చి వరున్ని తీసుకెళ్లారు. పూల కారుపై ఊరేగాల్సిన వరుడు జీపు ఎక్కాడు. సాక్షి, బెంగళూరు(యశవంతపుర): పెళ్లయిన సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధమైన మోసగాన్ని హాసన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బెంగళూరులో ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్న మధుసూదన్‌కు నాలుగేళ్ల క్రితం వసుధ అనే యువతితో వివాహమైంది. గొడవలు రావడంతో ఇద్దరు బెంగళూరులో విడివిడిగా ఉంటున్నారు, కానీ విడాకులు ఇంకా తీసుకోలేదు. హాసన్‌లో రెండో పెళ్లి తతంగం ఆ కేసు పరిష్కారం కాకుండానే అక్క సాయంతో హాసన్‌కు చెందిన అమ్మాయితో గుట్టుగా పెళ్లికి సిద్ధమయ్యాడు. హాసన పట్టణంలోని కళ్యాణ మండపంలో పెళ్లికి ఇరువైపులవారు చేరుకున్నారు. వసుధకు చూచాయగా విషయం తెలిసి గూగుల్‌లో హాసన్ పట్టణంలోని కళ్యాణ మండపాల వివరాలను సేకరించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు మధుసూదన్ వధువుకు తాళికట్టే సమయానికి వసుధ అక్కడకు వచ్చి వధువు తల్లిదండ్రులను కలిసింది. అతని వల్ల నా జీవితం నాశనమైంది. మీ అమ్మాయి జీవితం కూడా పాడు కాకుండా చూసుకోండని గట్టిగా చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు మోసగాడు మధుసూదన్‌ను గదిలో పెట్టి తాళం వేసి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్ చేశారు. పాపం హనీమూన్ ట్రిప్ పెళ్లి అయిన మరుసటి రోజున మాల్దీవులకు హనీమూన్‌కు వెళ్లాలని మధుసూదన్ ప్లాన్ వేశాడు. శనివారం విమానం ఎక్కడానికి పాస్‌పోర్ట్, వీసా, టికెట్లను రెడీ చేశాడు. పెళ్లి తరువాత మొదటి భార్య బంధువులు ఏమి చేయలేయరనే ధీమాతో ఉన్నాడు గానీ పథకం మొత్తం నీరు గారడంతో పాటు కటకటాల వెనక్కు చేరాడు. కాగా పీటల మీద పెళ్లి నిలిచిపోవడంతో వధువు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అతని గురించి ముందే తెలిసి ఉంటే ఇంతవరకూ రానిచ్చేవారం కాదని వాపోయారు. -
జాగో.. ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
డిజిటల్ యుగంలో మోసాలకు కూడా టెక్నాలజీ తోడవుతోంది. ఏమరపాటు, నిర్లక్ష్యం, స్వీయతప్పిదాలు నిండా ముంచేస్తున్నాయి. చాలామంది ఫోన్ రిపేర్‌కు ఇచ్చే సమయంలో కొన్ని తప్పిదాలు చేస్తుంటారు. వాటి వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. స్వీయ తప్పిదంతో తన అకౌంట్ నుంచి రూ. 2 లక్షలకు పైగా డబ్బును పొగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. సొంతంగా వ్యాపారం నడిపించుకునే ఓ వ్యక్తి(40).. తన స్మార్ట్‌ఫోన్‌కి సమస్య రావడంతో అక్టోబర్ 7వ తేదీన దగ్గర్లో ఉన్న రిపేర్‌కు ఇచ్చాడు. అయితే.. ఫోన్ రిపేర్ కావాలంటే.. సిమ్ కార్డు ఫోన్లోనే ఉండాలని, ఆ మరుసటిరోజు సాయంత్రం వచ్చి ఫోన్ తీసుకోమని సదరు వ్యక్తితో రిపేర్ షాపువాడు చెప్పాడు. గుడ్డిగా నమ్మిన ఆ మధ్యవయస్కుడు.. సిమ్ కార్డు ఉంచేసి ఫోన్‌ను ఇచ్చేసి వెళ్లిపోయాడు. కానీ, నాలుగు రోజులైన ఆ రిపేర్ దుకాణం తెరుచుకోలేదు. ఐదవ రోజు షాపులో పని చేసే మరో కుర్రాడు రావడంతో.. అతన్ని నిలదీశాడు బాధితుడు. అయితే తమ ఓనర్ ఊరిలో లేడని.. ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని చెప్పాడు ఆ కుర్రాడు. అనుమానం వచ్చిన బాధితుడు.. బ్యాంక్ ఖాతాను పరిశీలించగా.. అకౌంట్ నుంచి రెండున్నర లక్షల రూపాయలు వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లు ఉంది. దీంతో ఆ స్టేట్మెంట్ కాపీతో పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ముంబై(మహారాష్ట్ర) సాకినాక ప్రాంతంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడిని పంకజ్ కడమ్గా గుర్తించారు. చేయాల్సినవి ► ఫోన్‌ను రిపేర్‌కు ఇచ్చినప్పుడు సిమ్ కార్డును తప్పనిసరిగా తొలగించాలి. ► కీలక సమాచారం, గ్యాలరీ డేటా లేదంటే ఇంకేదైనా డేటా ఉంటే.. బ్యాకప్ చేసుకోవాలి. ► సెక్యూరిటీ లాక్స్ తొలగించాలి ► Factory Reset ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ► ఈరోజుల్లో ఇంటర్నల్ మొమరీతోనే ఫోన్లు వస్తున్నాయి. ఒకవేళ ఎక్స్టర్నల్ మొమరీ ఉంటే గనుక తొలగించాకే రిపేర్‌కు ఇవ్వాలి. ► ఒకవేళ మైనర్ రిపేర్లు అయితే గనుక.. మెయిల్స్, ఇతర సోషల్ మీడియా యాప్స్ లాగౌట్ కావాలి. ► ఫోన్‌కు ఆండ్రాయిడ్ పిన్ లేదంటే ప్యాటర్న్ లాక్‌లో ఉంచడం సేఫ్ ► IMEI ఐఎంఈఐ నెంబర్‌ను రాసి పెట్టుకోవాలి. ► యాప్స్‌కు సైతం లాక్‌లు వేయొచ్చు. ► యూపీఐ పేమెంట్లకు సంబంధించి యాప్‌లకు సెకండరీ పిన్ లేదంటే ప్యాటర్న్లాక్ ఉంచడం ఉత్తమం. ► స్మార్ట్ ఫోన్ వాడకం ఇబ్బందిగా అనిపించిన వాళ్లు.. లింక్డ్ సిమ్‌లను మామూలు ఫోన్లలో ఉపయోగించడం ఉత్తమం. ► గొప్పలకు పోయి స్మార్ట్ఫోన్లు వాడాలని యత్నిస్తే.. ఆపరేటింగ్ తెలీక ఆ తర్వాత తలలు పట్టుకోవాల్సి వస్తుంది. చేయకూడనివి ► ఫోన్లు రిపేర్‌కు ఇచ్చేప్పుడు సిమ్ల అవసరం అస్సలు ఉండదు. ఓటీపీ మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్ కార్డుతో ఫోన్ ఎట్టిపరిస్థితుల్లో రిపేర్‌కు ఇవ్వొద్దు. ► సులువుగా పసిగట్టగలిగే పాస్‌వర్డ్‌లను పెట్టడం మంచిది కాదు. ► చాలామంది నిత్యం వాడేవే కదా అని.. అన్ని యాప్స్‌కు పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తుంటారు. కానీ, ఫోన్లో పాస్వర్డ్లు అలా సేవ్ చేయకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ► అన్నింటికి మించి ఫోన్లను బయటి వైఫైల సాయంతో కనెక్ట్ చేసి.. ఆర్థిక లావాదేవీలను నిర్వహించకూడదు. పైవన్నీ తెలిసినవే కదా.. చిన్న చిన్న కారణాలే కదా.. వీటితో ఏం జరుగుతుంది లే అనే నిర్లక్ష్యం ‘స్మార్ట్ ఫోన్ల’ విషయంలో అస్సలు పనికి కాదు. ఇక ఖరీదైన ఫోన్ల విషయంలో స్టోర్లకు వెళ్లి రిపేర్ చేయించుకోవడం ఉత్తమం. -
స్టూడెంట్స్ కాపీ కొట్టకుండా సూపర్ ఐడియా.. ఫోటోలు వైరల్
విద్యార్థులు పరీక్ష రాసేసమయంలో కాపీ కొట్టకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్లను పర్యవేక్షించే సిబ్బంది. అయితే ఫిలిప్పీన్స్‌లోని బికోల్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్ వినూత్న ఆలోచన చేశారు. 'నో చీటింగ్' పేరుతో పరీక్ష రాసే సమయంలో తలలు తిప్పకుండా టోపీ, లేదా వస్త్రం ధరించాలని విద్యార్థులను ఆదేశించారు. అయితే స్టూడెంట్స్ కూడా వీరిక తగ్గట్టే క్రేజీగా అలోచించారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి రకాల రకాల టోపీలు, హ్యాట్లను తయారు చేసుకుని వచ్చారు. పేపర్లు, కార్డ్ బోర్డ్, ఎగ్ బాక్సెస్, రీసైకిల్డ్ మెటీరియల్ ఉపయోగించి వివిధ రకాల ఆకృతుల్లో హెల్మెట్‌లా వాటిని ధరించి పరీక్ష రాశారు. ఎవరివైపు చూడకుండా, కాపీయింగ్‌కు పాల్పడుకుండా నిజాయితీగా ఉన్నారు. విద్యార్థులు పరీక్ష రాసే సమయంలో ధరించిన హ్యాట్లు, హెల్మెట్లకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్ మేరి జోయ్ మాండేన్ ఆర్టిజ్ మాట్లాడుతూ.. స్టూడెంట్స్ అందరూ సమగ్రతతో నిజాయితీగా ఉండాలనే ఈ ఆలోచన చేసినట్లు చెప్పారు. 2013లో థాయ్‌లాండ్‌లో ఇలా చేయడం చూశానని, ఇప్పుడు దాన్నే అమలు చేశామని పేర్కొన్నారు. Students Wear Bizarre ‘Anti-Cheating Hats’ In Philippines College, Video Goes Viral#TNShorts #Cheating #Philippines pic.twitter.com/wdmp5C7OYP — TIMES NOW (@TimesNow) October 24, 2022 చదవండి: పోటీ నుంచి తప్పుకున్న బోరిస్.. బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్! -
మొబైల్‌కు మెసేజ్.. క్రిప్టో పేరుతో లూటీ!
లక్కీ డ్రా గిఫ్టు పేరుతో ప్రజలు మొబైళ్లకు ఓటీపీ పంపించి వారి బ్యాంకు అకౌంట్లను కాజేసే సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ ఆశ చూపించి దోచేస్తున్నారు. దీనికి ఇన్‌స్టా గ్రాంలో చురుకుగా ఉంటున్న యువతనే టార్గెట్ చేసుకున్నారు. మెసేజ్‌లు, లింక్‌లు పంపించి పలు నకిలీ కంపెనీల బ్రోచర్లను చూపి అధిక లాభాల పేరుతో వలలో వేసుకుంటారు. క్రిప్టో కరెన్సీ మోజులో పడి మోసపోతున్న వారిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా ఉన్నారు. ఎలా వంచనకు పాల్పడతారంటే అంతర్జాతీయ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పై తీవ్ర చర్చ జరుగుతోంది. కోవిడ్, ఆ తరువాత కాలంలో ఈ సైబర్ డబ్బు విలువ పెరిగింది. దీంతో వంచకులు క్రిప్టో బాట పట్టారు. యువత, టెక్కీలు చాలామంది ఇన్‌స్టా వినియోగిస్తారు. సైబర్ మోసగాళ్లు వారికి లింక్‌లు పంపుతూ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే అచిర కాలంలోనే భారీ లాభాలు వస్తాయని చెబుతారు. పెట్టుబడి పెట్టాక అకౌంట్‌ను, ఫోన్ నంబర్లను బ్లాక్ చేసేస్తారు. దీంతో బాధితులు మోసాన్ని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తారు. సైబర్ వంచకులు ఇతరుల ఇన్‌స్టా అకౌంట్లను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడతారు. వారు పంపించిన లింక్, యుఆర్‌పీఎల్ కొద్దిరోజుల్లోనే డీ యాక్టివేట్ అవుతాయి. వంచకులు నగదు జమచేసుకునే బ్యాంకు అకౌంట్లు కూడా నకిలీల పేరుతో ఉంటాయి. దీంతో కేసుల విచారణ కష్టంగా ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. జాగ్రత్తగా ఉండాలి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టే అధికారిక కంపెనీలు ఏవి, వాటికి అనుమతులు ఉన్నాయా? ఇలా పలు విషయాలను తెలుసుకున్న తరువాతనే పెట్టుబడిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ సోషల్ మీడియాలో వచ్చే లింక్‌లను నమ్మి మదుపు చేస్తే మోసపోతారని సైబర్ నిపుణులు తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా లాభాలు వచ్చాయని దుండగులు నకిలీ సక్సెస్ స్టోరీలను పోస్ట్ చేసి మాయకు గురిచేస్తారు. కాబట్టి క్రిప్టో విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆగ్నేయవిభాగ సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సీఐ ఆర్.సంతోష్‌రామ్ తెలిపారు. లక్షల రూపాయలు పోయాయి నగరంలో పేరుపొందిన ఐటీ కంపెనీ ఉద్యోగి ఇన్ స్టా ఖాతాకు క్రిప్టోలో పెట్టుబడి పెడితే లక్షలాది రూపాయల లాభం పొందవచ్చని ఒక సక్సెస్ స్టోరీ వచ్చింది. స్నేహితులు పంపిన లింక్ కదా అని నమ్మి దశలవారీగా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. కొన్ని రోజులు గడిచినప్పటికీ లాభాలు రాకపోగా అకౌంట్లో ఉన్న నగదు మాయమైంది. దీనిపై బాదితుడు సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. చదవండి: మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్! -
మోసం చేస్తూ ఏడాదికి రూ.312 కోట్లు సంపాదన.. స్వయంగా అంగీకరించిన యూట్యూబర్!
యూట్యూబ్.. ఈ మధ్య కాలంలో విపరీతంగా వినపడుతున్న పేరు. ప్రత్యేకంగా చెప్పాలంటే వినోదంతో పాటు సామాన్యులను కూడా సెలబ్రిటీలుగా మారుస్తోంది ఈ వీడియో ప్లాట్‌ఫాం. గత కొన్నేళ్లుగా స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ తక్కువ ధరకు అందుబాటులోకి రావడంతో వీటి యూజర్లు విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసందే. కొందరు దీని ఎంటర్టైన్మెంట్ సాధనంగా చూస్తుంటే మరికొందరు తమ ఉపాధికి యూట్యూబ్‌ని మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వీడియోలు అప్లోడ్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. అయితే ఓ యూట్యూబర్ అందరూ షాక్ అయ్యేలా ఏడాదికి రూ.312 కోట్లు సంపాదిస్తూన్నాడు. దీంతోపాటు మరికొన్ని సంచలన విషయాలను అతను బయటపెట్టాడు. ఇదంతా మోసం చేసి సంపాదించాను! వివరాల్లోకి వెళితే.. మార్క్ ఫిష్‌బాచ్ అనే ఒక యూట్యూబర్ ఒక సంవత్సరంలో యూట్యూబ్ ద్వారా 38 మిలియన్ డాలర్లు (రూ. 312 కోట్లు) సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన చూసి అతనే ఆశ్చర్యపోతున్నాడట. అయితే ఎందుకో గానీ ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నట్లు అతనే స్వయంగా అంగీకరించాడు. యూట్యూబ్ ప్రారంభించిన మొదట్లో అనిపించకపోయినా ఇంత పెద్ద మొత్తంలో సంపద రావడంతో మోసం చేస్తున్న భావన కలుగుతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ వ్యక్తి మార్క్ సంపాదన గురించి అడిగాడు. అందుకు అతను బదులిస్తూ.. ‘యూట్యూబ్ ద్వారా నాకు ఇంత డబ్బు వస్తోందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. అయితే ఒక్కోసారి ఈ దారిలో సంపాదించడం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. ఈ అంశంపై మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే ఈ స్థాయిలో సక్సెస్, సంపాదన రావడం వెనుక సమాజాన్ని మోసగిస్తున్నట్లు అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందని’ తెలిపాడు. భవిష్యత్తులో తన సంపాదనతో ప్రజలకు సహాయం చేయాలని, వారి స్నేహితులు, బంధువుల జీవితాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవలే యూట్యూబర్ MrBeast, (అసలు పేరు జిమ్మీ డోనాల్డ్సన్), అతని యూట్యూబ్ ఛానెల్ కోసం $1 బిలియన్ల డీల్‌ను ఆఫర్ చేసిన సంగతి తెలసిందే. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! -
టు లెట్.. టేక్ కేర్
హిమాయత్‌నగర్: నగరంలోని ఇల్లు ఎవరిదైనా అద్దెకు ఉందని యాడ్ కనిపిస్తే చాలు. క్షణాల్లో కొత్త ఫోన్ నంబర్ నుంచి ఇంటి యజమానికి ఫోన్ వస్తుంది. ‘నేను ఆర్మీలో అధికారిని, మీ ఇల్లు అద్దెకు ఉన్న విషయాన్ని ఇప్పుడే వెబ్సైట్లో చూశాను. మీ ఇల్లు నాకెంతో నచ్చింది’, అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులంటే ప్రజల్లో ఉన్న ఓ గొప్ప నమ్మకాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. మీరు ముందుగా మా అకౌంట్‌కు కొంత డబ్బు పంపండి అది ఓకే అయితే వెంటనే మీకు ఏడాదికి సరిపోయే ఇంటి అద్దె డబుల్ చెల్లిస్తామంటూ మాయ మాటలు చెప్తూ లక్షల రూపాయిలు కాజేస్తున్నారు. కేవలం ఆర్మీ అధికారులు మోసం చేయరనే ఒక నమ్మకంతో అమాయక ప్రజలు లక్షల పోగొట్టుకుంటూ సైబర్‌క్రైం పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. నమ్మకాన్ని రెట్టింపు చేస్తూ కొట్టేస్తున్నారు ఆర్మీలో పనిచేసే అధికారుల ఇల్లు అద్దె అంతా కూడా ఆర్మీనే చెల్లిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి సరిపోయే అద్దెతో పాటు ఆరు నెలల అడ్వాన్స్ ముందుగానే మీ అకౌంట్లో పడుతుందని చెబుతున్నారు. దీనికి ఇంటి యజమాని ఓకే చెప్పడంతో పథకాన్ని రచిస్తున్నారు. ముందుగా మీకొక లింకు పంపుతాము దానికి కేవలం రూ. 5 పంపండి మీకు రూ. 10 వస్తాయి మా ఆర్మీ నుండంటూ సూచిస్తున్నారు. వెంటనే వాళ్లు పంపిన లింకుకు రూ. 5 పంపగానే రూ. 10 వస్తున్నాయి. ఆ తర్వాత నెల అద్దె రూ. 12 వేలు ఉంటే రెండునెలలవి రూ. 24 వేలు పంపమంటున్నారు. అవి పంపినప్పటి నుంచి సైబర్ కేటుగాళ్ల డ్రామా మొదలవుతుంది. ఏదో టెక్నికల్ సమస్య ఉందంటూ మళ్లీ పంపాలని కాజేస్తున్నారు. ఇదే తరహాలో వారం క్రితం ఓ గృహణి పలు దఫాలుగా వారు చెప్పిన లింకుకు ఒక్కరోజులో రూ. 12 లక్షలు పంపింది. ఇంకా ఇంకా అడగడంతో అప్పటికి ఆమె మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆర్మీ అధికారుల పేర్లు చెబుతూ ఈ దందా చేస్తున్నవారంతా కూడా రాజస్థాన్, యూపీకి చెందిన వారిగా సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. (చదవండి: దయచేసి ఆ గుర్తులను తొలగించండి.. టీఆర్ఎస్ విజ్ఞప్తి) -
స్నేహం పేరుతో టోకరా... ఇద్దరు నైజీరియన్లు అరెస్టు
హిమాయత్‌నగర్: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్ట్రాగామ్ వేదికగా అమ్మాయిలను మోసం చేస్తున్న నైజీరియన్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో అడిషనల్ డీసీపీ స్నేహ మెహర, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. బేగంపేటకు చెందిన ఓ యువతికి యూఎస్‌లో ఉంటానంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. స్నేహానికి గుర్తుగా యూఎస్ నుంచి విలువైన గిఫ్ట్‌లు పంపిస్తున్నట్లు సదరు వ్యక్తి యువతితో నమ్మబలికాడు. ఢిల్లీ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నామని యువతికి ఫోన్ చేసి రూ. 2.50 లక్షలు వసూలు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించగా.. నైజీరియాకు చెందిన అల్లోట్ పీటర్ అలియాస్ చిబుజా, రోమాన్స్ జాషువాలను గుర్తించి అరెస్ట్ చేసినట్లు గజరావు భూపాల్ తెలిపారు. (చదవండి: స్పా ముసుగులో వ్యభిచారం) -
ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతివాటం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో టీడీపీ మహిళా నేత చేతి వాటం ప్రదర్శించింది. డ్వాక్రా డబ్బులను టీడీపీ నాయకురాలు లక్ష్మీనారాయణమ్మ గోల్మాల్ చేసినట్లు తెలిసింది. దాదాపు 28 సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళల నుంచి సుమారు రూ.40 లక్షలు స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే మహిళా నేతను టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్‌కుమార్ వెనకేసుకురావడంతో బాధితులు ఆయన ఇంటిని ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చదవండి: బెడ్రూంలో యువకుడితో ఏకాంతంగా భార్య.. బిగ్ షాక్ ఇచ్చిన భర్త -
రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్.. మనీలాండరింగ్‌పై ఛార్జ్‌షీట్
లక్నో: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యుబ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఛారిటీ పేరుతో ప్రజల నుంచి నిధులు సేకరించి ఆమె మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ ఎఫ్ఐఆర్ ఆధారంగా గాజియాబాద్ కోర్టులో బుధవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కెట్టో అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూడు క్యాంపెయిన్లను నిర్వహించి రాణా అయ్యుబ్ కోట్ల రూపాయాలు వసూలు చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మురికివాడల్లోని నివాసితులు, రైతుల కోసం మొదటిసారి 2020 ఏప్రిల్-మే మధ్యకాలంలో, అస్సాం, బిహార్, మహాష్ట్ర రిలీఫ్ పేరుతో రెండోసారి 2020 జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో, కోవిడ్ సాయం కోసం 2021 మే-జూన్ మధ్యకాలంలో మూడోసారి రాణా అయ్యుబ్ విరాళాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ మూడు క్యాంపెయిన్ల ద్వారా రాణా అయ్యుబ్ మొత్తం రూ.2.69కోట్లు వసూలు చేశారని, అందులో రూ.80.5 లక్షలు విదేశాల నుంచి అందాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఐటీ శాఖ విదేశీ విరాళాలపై విచారణకు ఆదేశించగానే ఆ డబ్బునంతా రాణా అయ్యుబ్ తిరిగి దాతలకే పంపారని వివరించారు. ఈ.2.69 కోట్లను ఆమె అక్రమంగానే సేకరించారని పేర్కొన్నారు. విరాళాల రూపంలో సేకరించిన నిధులలో రూ.50లక్షలు రాణా అయ్యుబ్ తండ్రి, సోదరి ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె వాటిని తన ఖాతాలోకి మళ్లించింది. రూ.29లక్షలు మాత్రం ఛారిటీ కోసం ఉపయోగించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అయ్యుబ్‌కు చెందిన రూ.1.77కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అందులో రూ.50లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. చదవండి: జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ -
ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో నమ్మించి, యువతిని మోసం చేసిన ఆర్మీ ఉద్యోగి
సాక్షి, వికారాబాద్: సమాజంలో అందరికీ స్ఫూర్తిగా నిలవాల్సిన ఆర్మీ ఉద్యోగి ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఘటన దోమ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఐనాపూర్‌కు చెందిన యువతి (20)తో దాదాపూర్‌కు చెందిన ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ (24)కు సంవత్సరం క్రితం ఫేస్ బుక్‌లో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం ప్రేమగా మారింది. వారం క్రితం స్వగ్రామానికి వచ్చిన రామకృష్ణ పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీంతో వీరి ప్రేమ శారీరక సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రామకృష్ణ యువతికి ఫోన్ చేసి గ్రామ శివారులోకి తీసుకెళ్లగా అది గమనించిన కుటుంబ సభ్యులు యువకుడిని పట్టుకున్నారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో పెళ్లి విషయం మాట్లాడే ప్రయత్నం చేశారు. రామకృష్ణ వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు కాపీను ఎస్ఐ చింపివేశారని బాధితురాలు ఆరోపించారు. కేసును నీరుగార్చే యత్నం రామకృష్ణ తనను మోసం చేశారని ఫిర్యాదు చేయడానికి వస్తే అతని బంధువు కానిస్టేబుల్ మాటలను నమ్మి ఫిర్యాదు కాపీని చించివేసి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బాధితురాలు ఆరోపించారు. ఉన్నతాధికారులు రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐ విశ్వజన్‌ను వివరణ కోరగా.. బాధితురాలు ఫిర్యాదు మేరకు రామకృష్ణపై 376, 420 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: కదులుతున్న డొంక -
బంగారం.. నీ ప్రేమ కోసం అంతరిక్షం నుంచి భూమ్మీదకు వస్తా!
టోక్యో: ప్రేమ పేరుతో జపాన్ మహిళను మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను రష్యా వ్యోమగామినని, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్సీ)లో పని చేస్తున్నాని చెప్పి నమ్మించి బురిడీ కొట్టించాడు. మహిళను తాను ప్రాణంగా ప్రేమిస్తున్నాని చెప్పాడు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. దీని ఖర్చుల కోసం ఆమె వద్ద నుంచి 4.4 మిలియన్ యెన్(రూ.25లక్షలు) వసూలు చేశాడు. అంతటితో ఆగకుండా పదే పదే డబ్బులు అడగడంతో ఆమెకు అనుమానం వచింది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కంగుతింది. ఈ జపాన్ మహిళ వయసు 65 ఏళ్లు. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఐఎస్సీలో పనిచేస్తున్నట్లు చెప్పాడు. జూన్‌లో ఇందుకు సంబంధించి ఫోటోలు పెట్టాడు. ప్రొఫైల్ పిక్చర్ కూడా మార్చాడు. ఇవి చూసి అతడు నిజంగా వ్యోమగామి అని మహిళ నమ్మింది. ఇద్దరూ తరచూ చాట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీరి సంభాషణ ఇన్స్టాగ్రాం నుంచి జపాన్ సోషల్ మీడియా యాప్ 'లైన్'కు మారింది. ఇందులోనే మహిళను ప్రాణంగా ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకొని జీవితాంతం తోడుగా ఉండాలని ఉందని చెప్పాడు. దీంతో ఆమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. అయితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగి భూమ్మీదకు రావాలంటే ఖర్చవుతుందని రూ.25లక్షలు పంపాలని మహిళను అతను కోరాడు. అతడ్ని నమ్మిన ఆమె రూ.25లక్షలు ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 5 మధ్య ఐదు విడతల్లో పంపింది. అయినా అతను ఇంకా డబ్బు కావాలని అడిగాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతను వ్యోమగామి కాదని, మోసం చేశాడని తెలిసింది. పోలీసులు ఈ కేసును 'ఇంటర్నేషనల్ రోమాన్స్ స్కామ్'గా ట్రీట్ చేసి విచారణ చేపట్టారు. చదవండి: Viral Video: నడిరోడ్డుపై దిండు వేసుకుని పడుకుని హల్చల్ -
నకిలీ వెబ్సైట్లతో చీటింగ్... 12 మంది అరెస్టు
న్యూఢిల్లీ: నకిలీ వెబ్సైట్లతో మోసాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీసులు నాలుగు వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించి సుమారు 12 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. తమ కంపెనీ పేరుతో కొందురు వ్యక్తులు నకిలీ వెబ్సైట్లు సృష్టించి ఈమెయిల్ ఐడీలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారంటూ పలు కంపెనీలు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో సదరు కంపెనీల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభంలో సుమారు ఏడుగురుని అదుపులోకి తీసకున్నట్లు వెల్లడించారు. నిందితులు షమ్మీ, ఆలం ఖాన్, అతుల్ దీక్షిత్, ప్రేమ్ దత్, ఢిల్లీ నివాసితులు, సర్దార్ అమిత్ సింగ్, మోను కుమార్, సందీప్ చౌదరి, గోపాల్ కుమార్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిప్యూట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ గౌతమ్ తెలిపారు. నిందితులందరూ బిహార్‌లు నివాసితులని చెప్పారు. తదుపరి ఆపరేషన్‌లో మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో సదరు నిందితులు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి, ఈమెయిల్ ఐడీలు క్రియోట్ చేసుకుని క్లయింట్లకు మెసేజ్‌లు, కాల్లు చేయడం వంటివి చేసి వారితో లావాదేవీలు జరిపినట్లు తేలింది. అంతేగాదు కంపెనీ మార్కుతో కూడిన ఆమోద లేఖలను సైతం బాధితులకు పంపి మోసగించినట్లు వెల్లడించారు. దీంతో పలువురు బాధితులు ఈ కేటుగాళ్ల చేతిలో మోసపోయినట్లు పోలీసులు చెప్పారు. (చదవండి: సెక్యూరిటీ గార్డుపై మహిళ వీరంగం...టోపీ లాగి కాలర్ పట్టుకుని...) -
పెళ్లైన విషయాన్ని దాచి.. మరో యువతితో రెండో వివాహం.. విషయం తెలిసి..
సాక్షి, ఖమ్మం: ఓ యువకుడు మొదటి పెళ్లి విషయాన్ని దాచి మరో యువతిని రెండో పెళ్లి చేసుకొని మోసం చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త తనను మోసం చేశాడని తెలుసుకున్న రెండో భార్య.. తల్లిదండ్రులతో కలిసి భర్త ఇంటిముందు నిరసన దీక్ష చేపట్టింది. వివరాలు.. ఖమ్మం పట్టణం రోటర్ నగరకు చెందిన నవజీవన్ ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకొని ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా డిసెంబర్ ఒకటో తేదీన ఖమ్మం పట్టణం ఎన్ఎస్టీ ప్రాంతానికి చెందిన కాసం సౌగంధికను రెండో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజుల నుంచి భార్యతో సఖ్యతగా ఉండకుండా ఆమెను వేధింపులు గురి చేసేవాడు. ఈ క్రమంలో యువతి బంధువులు పలుమార్లు నవజీవన్‌ను హెచ్చరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. అంతేగాక అతనికి తన కంటే ముందే వేరే యువతితో పెళ్ళి జరిగిన విషయం సౌగంధికకు తెలిసింది. దీంతో భర్త నవజీవన్‌పై మహిళా పోలీసులకు పిర్యాదు చేసింది. అయితే అక్కడ తనకు ఎలాంటి న్యాయం జరగకపోవడంతో భర్త నవజీవన్ ఇంటిముందు శనివారం న్యాయం కోసం నిరసన దీక్ష చేపట్టింది. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది.. తర్వాతే..
భువనేశ్వర్: రాజకీయ నాయకులు, సినిమా నిర్మాతలను ముగ్గులోకి దింపి, మోసం చేసిన మాయలాడిని ఖండగిరి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందిత మహిళ న్యాయశాస్త్రంలో పట్టా పొందింది. అయితే పోలీసులు ఈ విషయమై అధికారికంగా సమాచారం జారీ చేయలేదు. ఆమె వద్ద 2 పెన్‌డ్రైవ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఇది వరకే వివాహమైంది. భర్త సహాయ సహకారాలతో ప్రముఖులను ముగ్గులోకి దింపి.. నిలువునా దోచుకుంటున్నట్లు ఆరోపణ. ఫేసుబుక్ పరిచయ వేదికగా ప్రముఖుల వివరాలను సేకరించి, సన్నిహిత పరిచయాలు పెంచుకుంటుంది. వారిని అతిథులుగా ఆహ్వానించి, అంతరంగిక లీలలతో ముంచెత్తుతుంది. ఈ సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను భద్రపరిచి, భారీ మొత్తం కోసం బెదిరించడంలో ఆరితేరినట్లు బాధితులు లబోదిబోమంటున్నారు. మాజీ మంత్రులు, నాయకులు, ప్రముఖ వ్యాపారులు, సినీ నిర్మాతలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత ఖండగిరి పోలీస్ ఠాణాలో ఫిర్యాదు నమోదు కావడంతో డొంక కదిలింది. దీర్ఘకాలంగా విచారణకు సహకరించనందున పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. 2021 నుంచి ఈ వ్యవహారంలో తలమునకలై ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. చదవండి: (Nayanathara: నయన్ అంత పెద్ద షాక్ ఇస్తుందా!) -
ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు. భారతీయులు చాలామంది ఉన్నారు మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు. –షారూఖ్‌ఖాన్ ఏజెంట్లు గోల్మాల్ చేశారు మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్మాల్ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్ నుంచి అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు. – నవీద్ సెల్‌ఫోన్ తాకట్టుపెట్టాను మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం. – షాబాజ్‌ఖాన్ మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం. – సలీమ్ హోటల్ వైఫైతో వీడియో పంపాం చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్ వైఫై పాస్ వర్డ్ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది. – హాజీబాబా -
ఆమ్రపాలి సిలికాన్ సిటీపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: బ్యాంక్‌లను రూ.177 కోట్లకు మోసగించిన ఆరోపణలపై ఆమ్రపాలి సిలికాన్ సిటీ ప్రైవేటు లిమిటెడ్, దాని ప్రమోటర్ అనిల్‌కుమార్ శర్మపై సీబీఐ మోసపూరిత కేసు దాఖలు చేసింది. అనంతరం ఢిల్లీ, నోయిడాలోని ఆరు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆమ్రపాలి సిలికాన్ సిటీ తమను మోసగించినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో కూడిన బ్యాంక్‌ల కన్సార్షియానికి లీడ్ బ్యాంక్‌గా బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఢిల్లీ సబర్బన్ ప్రాంతంలోని అమ్రపాలి సిలికాన్ సిటీలో గ్రూపు హౌసింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి వీలుగా ఆమ్రపాలీ సిలికాన్ సిటీ ప్రైవేటు లిమిటెడ్ 1.76 లక్షల చదరపు మీటర్ల భూమిని, న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి తీసుకుంది. ఇందులో నిర్మించిన 468 ఫ్లాట్లను చాలా తక్కువ ధరకు, అది కూడా నిర్మాణ వ్యయానికంటే తక్కువకే కంపెనీ విక్రయించింది. నిర్మాణ వ్యయానికంటే తక్కువకు విక్రయించడం ద్వారా రూ.73 కోట్లను కంపెనీ దారిమళ్లించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో తేలింది. అలాగే, ఇళ్ల కొనుగోలుదారుల నుంచి తీసుకున్న రూ.303 కోట్లను గ్రూపు కంపెనీలకు దారిమళ్లించిన విషయం కూడా వెలుగు చూసింది. దీంతో ఆమ్రపాలి సిలికాన్ సిటీ రుణం విషయంలో ఫోర్జరీ, తప్పుదారి పట్టించడం ద్వారా రూ.177 కోట్ల మేరకు మోసం చేసినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆరోపించింది. చదవండి: మామూలు లక్ కాదండోయ్, సంవత్సరంలో రూ.లక్ష పెట్టుబడితో రూ.20 లక్షలు! -
'చీటింగ్ చేసేవాడితో ఆడలేను.. అందుకే తప్పుకున్నా'
వరల్డ్ చెస్ ఛాంపియన్.. నార్వే గ్రాండ్‌మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్ ప్రత్యర్థి చెస్ ఆటగాడు నీమ్యాన్పై సంచలన ఆరోపణలు చేశాడు. ప్రత్యర్థి హన్స్ నీమ్యాన్ పదే పదే చీటింగ్‌కు పాల్పడినట్లు కార్ల్సన్ ఆరోపించాడు. విషయంలోకి వెళితే.. శనివారం జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో కార్లసన్ మరోసారి నీమ్యాన్తో తలపడ్డాడు. ఒక ఎత్తు వేసిన వెంటనే కార్ల్సన్ ఆట నుంచి తప్పుకున్నాడు. ఇది అక్కడున్న వారందరిని షాక్‌కు గురి చేసింది. అయితే తాను తప్పుకోవడంపై కార్ల్సన్ తన ట్విటర్లో స్పందించాడు. కార్ల్సన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పాటు ఇటీవలే ముగిసిన సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి వైదొలడంపై కార్ల్సన్ వివరణ ఇచ్చాడు. ''సిన్‌క్యూఫీల్డ్ కప్ నుంచి పక్కకు తప్పుకోడానికి ఒక కారణం ఉంది. నీమ్యాన్ ఆ మ్యాచ్‌లో చీటింగ్‌కు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతనే ఇటీవలే ఒప్పుకున్నాడు. అలాంటి ప్లేయర్‌తో ఆడలేను.ఆన్లైన్లోనే కాదు.. బోర్డ్ ప్లేలో కూడా నీమ్యాన్ చీటింగ్ చేశాడు. జూలియస్ బేర్ జనరేషన్ కప్‌లో అతనితో మరోసారి ఎదురుపడాల్సి వచ్చింది. కానీ పదే పదే చీటింగ్ చేసే ఆటగాడితో నేను ఆడలేను అందుకే తప్పుకున్నా.'' అంటూ పేర్కొన్నాడు. ఇటీవల సెయింట్ లూయిస్‌లో జరిగిన ఓ టోర్నమెంట్లో నీమ్యాన్ చేతిలో కార్ల్సన్ ఓటమి పాలయ్యాడు. వరల్డ్ చాంపియన్ ఆ టోర్నీ నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. అయితే కేవలం తన కెరీర్‌ను దెబ్బ తీసేందుకు తనపై కార్ల్సన్ చీటింగ్ ఆరోపణలు చేస్తున్నట్లు నీమ్యాన్ ఆరోపించాడు. ఇక ఆదివారం జరిగిన జూలియస్ బేర్ జనరేషన్ కప్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీలో మాగ్నస్ కార్ల్సన్ విజేతగా అవతరించాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిశేషి అర్జున్‌పై రెండు ఫైనల్స్‌లోనూ కార్ల్సన్ 2.5–0.5; 2–0 తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. My statement regarding the last few weeks. pic.twitter.com/KY34DbcjLo — Magnus Carlsen (@MagnusCarlsen) September 26, 2022 చదవండి: సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్ స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు -
TDP: రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరిక.. ఉలిక్కిపడ్డ కళా..
తెలుగుదేశం జమానాలో జన్మభూమి కమిటీల పెత్తనాలు.. ఆ ముసుగులో వారి ఆగడాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేల బంధువులు సైతం జన్మభూమి కమిటీ నేతలమంటూ జనంపై స్వారీ చేసేవారు. పథకాలు కావాలంటే ముడుపులు కట్టాల్సిందేనంటూ విచ్చలవిడిగా వసూళ్లకు తెగబడేవారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో మాజీమంత్రి కళా వెంకటరావు బంధువు ఒకాయన కూడా రాబంధువులా మారి జనాలను పీక్కు తిన్నాడు. ప్రభుత్వ పథకాల ద్వారా ఆవులు, గేదెలు, ఇళ్లు ఇప్పిస్తామంటూ వేలకు వేలు వసూలు చేశాడు. అలాగని పథకాలు మంజూరు చేయించలేదు.. దండుకున్న డబ్బులూ తిరిగి ఇవ్వలేదు. దీనిపై అప్పట్లోనే బాధితులు నిలదీసినా అధికార మదంతో అణచి వేశారు. మూడేళ్ల తర్వాత కూడా తమ డబ్బులు రాకపోవడంతో బాధితులంతా మూకుమ్మడిగా కళా వారి నివాసానికి వెళ్లి నిలదీశారు. రోడ్డెక్కి రచ్చ చేస్తామని హెచ్చరించారు. దాంతో ఉలిక్కిపడిన కళా కుటుంబీకులు కొందరికి చెల్లింపులు జరిపారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నేతల వ్యవహారాలు రోజుకొకటిగా బయటపడుతున్నాయి. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు పంచాయితీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడు అందరి వద్ద డబ్బులు తీసుకుని, ఆ తర్వాత ముఖం చాటేయడం పంచాయితీ కళా వద్దకు చేరడంతో కొన్ని రోజులుగా నియోజకవర్గంలో ఇదే చర్చ నడుస్తోంది. తెలిసిన బాగోతమే టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పెత్తనం అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యుల ముసుగులో టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ప్రజలకు ఏం కావాలన్నా ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితులు ఉండేవి. సంక్షేమ పథకాలు అందాలంటే చేతులు తడపాల్సి వచ్చేది. ప్రతి పథకానికి ఒక రేటు పెట్టి వసూళ్ల దందా చేశారు. ఇక, నాడు మంత్రులు, ఎమ్మెల్యేలుగా పదవులు చేపట్టిన నాయకుల బంధువులు, అనుచరులైతే మరింత రెచ్చిపోయారు. అయిన దానికి కాని దానికి ప్రజలను పీడించేశారు. కొన్ని పథకాలు మంజూరు చేస్తామంటూ డబ్బులు తీసుకుని చేతులేత్తేసిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి ఘటనలు ఇప్పుడు టీడీపీలో రచ్చ చేస్తున్నాయి. ఆ పార్టీలో గొడవకు దారితీస్తున్నాయి. పథకాల కోసం వసూళ్లు జి.సిగడాం మండలం నిద్దాం, అద్వానంపేట గ్రామాల్లో తెలుగు దేశం ప్రభుత్వం హయంలో ఆవులు, గేదెలు రాయితీపై మంజూరు చేస్తామని 40 మంది లబ్ధిదారుల నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు బంధువు అధిక మొత్తంలో వసూళ్లు చేశారు. ఆ గ్రామంలో జన్మభూమి కమిటీ నాయకుడిగా పెత్తనం చెలాయిస్తూ పథకాల పేరుతో భారీ మొత్తంలో లబ్ధిదారుల నుంచి తీసుకున్నారు. ఇళ్లు కూడా మంజూరు చేస్తామని చెప్పి వసూళ్లకు తెగబడ్డారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.20వేలు వరకు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ, వారికి న్యాయం చేయలేదు. చెప్పినట్టుగా ఆవులు, గేదెలు, ఇళ్లు మంజూరు చేయించలేదు. అలాగని తీసుకున్న డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఇదే విషయమై టీడీపీ హయాంలో జరిగిన జన్మభూమి–మా ఊరు గ్రామసభలో కూడా అప్పట్లో కొందరు నిలదీశారు. ఇదిగో అదిగో అంటూ తాత్సారం చేస్తూ వచ్చారే తప్ప టీడీపీ ప్రభుత్వం దిగిపోయేవరకు వాపసు చేయలేదు. కళా వద్దకు చేరిన పంచాయితీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినా కూడా వారిలో స్పందన లేదు. దీంతో బాధితులంతా ఏకమై మాజీ మంత్రి కళా వెంకటరావు నివాసం ఉంటున్న రాజాం వెళ్లి గట్టిగా నిలదీశారు. పథకాల కోసం తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోతే రోడ్డెక్కుతామని, అవసరమైతే మీడియాకు తెలియపరుస్తామని కళా ముందే హెచ్చరించారు. దీంతో కళాతో పాటు ఆయన బంధువు ఉలిక్కి పడ్డారు. ఇది కాస్త వివాదంగా మారింది. మీడియా ప్రతినిధులకు, నియోజకవర్గ టీడీపీ కేడర్‌కు ఇదంతా తెలిసింది. చెప్పాలంటే దావానంలా వ్యాపించింది. దీంతో గుట్టుగా యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయలు తగ్గేంచేసి కొంతమందికి చెల్లింపులు చేశారు. మరికొంతమందికి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ తంతు ఇప్పుడు జి.సిగడాం మండలంలోనే కాకుండా ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే హాట్ టాపిక్ అయింది. -
నిత్య పెళ్లికూతురు.. ఒకరు కాదు ఏకంగా ఆరుగురితో
తిరువొత్తియూరు(చెన్నై): ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరుగురుని వివాహం చేసుకున్న నిత్య పెళ్లి కూతురు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లా పరమత్తి వేలూరు సమీపంలోని వేంకరైకల్లి పాలయానికి చెందిన ధనపాల్ (35)తో మదురైకు చెందిన సంధ్య (26)కు ఈ నెల 7వ తేదీ పుదువెంకరై ఆలయంలో వివాహం జరిగింది. వధువు తరఫున అక్క, మామ అని ఇద్దరు, బ్రోకర్ బాలమురుగన్ (45) మాత్రమే పాల్గొన్నారు. బ్రోకర్ బాలమురుగన్ కమిషన్ రూ. 1.50 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఈ నెల 9వ తేదీ సంధ్య అదృస్యమైంది. దీని గురించి వరుడు ధనపాల్ పరమత్తి వేలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో సంధ్య, ఆమె సహరులు, బ్రోకర్, బంధువులు ఓ ముఠా అని తెలిసింది. ఆమె ఆరు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. దీంతో మదురై జిల్లా వడిపట్టి చోళవందన్ పేటకు చెందిన సంధ్య (26), ధనలక్ష్మి (45), రామరాజన్ కుమారుడు గౌతమ్ (26), వడిపట్టికి చెందిన జయవేల్ (34)లను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. -
ఇప్పటికే రెండు సార్లు వివాహం.. శిక్షణ కోసం వచ్చిన యువతితో..
తిరువళ్లూరు(చెన్నై): నీట్ శిక్షణ కోసం వచ్చిన 18 ఏళ్ల యువతికి ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన కెమిస్ట్రీ లెక్చరర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తిరువళ్లూరు జిల్లా కాకలూరు బైపాస్ రోడ్డులో నీట్ ఎడ్జ్ కోచింగ్ అకాడమి ఉంది. ఇక్కడ కాకలూరుకు చెందిన 18 ఏళ్ల యువతి ఆరు నెలలుగా కోచింగ్ తీసుకుంటోంది. ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్‌గా కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం గ్రామానికి చెందిన మూర్తి (32) పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం యువతి అదృశ్యమైంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తిరుత్తణి వద్ద మూర్తి, యువతిని గుర్తించి విచారణ చేశారు. యువతికి ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. ఇప్పటికే మూర్తికి రెండు సార్లు వివాహాం సైతం జరిగినట్లు గుర్తించారు. దీంతో మూర్తిని రిమాండ్‌కు తరలించి యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. చదవండి: దారుణం.. ‘థ్యాంక్ యూ’ చెప్పలేదని పొడిచి చంపాడు..! -
తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్‌పే ద్వారా రూ. లక్ష పంపాడు.. తీరా చూస్తే
సాక్షి, నిజామాబాద్: ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తి తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పిన మాటల వలలో పడి ఓ యువకుడు మోసపోయిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చింతనాల్ల ప్రసాద్ ఈనెల 10న ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ ఫ్లాట్ ఫాంలో రషీ ద్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకే ఆపిల్ ఐఫోన్ అమ్ముతానని చెప్పడంతో బాధితుడు నమ్మి ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించారు. చివరికి ఫోన్ డెలివరీ అయిన తర్వాత నకిలీ ఫోన్‌గా గుర్తించిన బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సందర్భంగా ఎస్సై మాట్లాడు తూ బాధితుడు ఫిర్యాదు మేరకు సైబర్ హెల్ప్ లైన్ నంబర్ ద్వారా అమౌంట్ ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. -
డిజిటల్ కాయిన్ పేరుతో భారీ మోసం
సాక్షి, చెన్నై: డిజిటల్ కాయిన్ సంస్థ నడిపి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన కేసుకు సంబంధించిన ఆరుగురు నిందితుల సొంతమైన ఇల్లు, కార్యాలయాలలో ఆర్థిక నేర విభాగం పోలీసులు సోదాలు నిర్వహించారు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా కావేరిపట సమీపంలోని వరట్టపట్టికి చెందిన ప్రకాశ్ (46) నేతృత్వంలో 60 మందికిపైగా గత 9వ తేది కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్ జయచంద్ర బాను రెడ్డి వద్ద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రకాశ్ మాట్లాడుతూ.. యునివర్ కాయిన్ పేరిట డిజిటల్ కాయిన్ సంస్థను నిర్వహిస్తూ వచ్చిన హోసూర్ రామకృష్ణా నగర్‌కు చెందిన అరుణ్ కుమార్, కృష్ణగిరికి చెందిన నందకుమార్, మత్తూర్కు చెందిన శంకర్, ప్రకాశ్ బర్గూర్ సమీపంలోని చెట్టిపట్టికి చెందిన శ్రీనివాసన్, ధర్మపురి జిల్లా మారండహల్లికి చెందిన వేలన్ తదితరులు తనను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. డిజిటల్ కాయిన్ కొనుగోలు చేస్తే, తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చని తెలిపి లక్షలాది రూపాయలు కట్టించుకుని తమను మోసం చేసినట్లు చెప్పారన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టాల్సిందిగా కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం పోలీసులకు కలెక్టర్ ఆదేశించారు. ఈస్థితిలో ఆదివారం ఉదయం కృష్ణగిరి జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శివకుమార్, సేలం జిల్లా ఆర్థిక నేర విభాగం డీఎస్పీ శ్రీనివాసన్, ఇన్స్పెక్టర్ ముత్తమిళ సెల్వన్, కృష్ణగిరి ఇన్స్పెక్టర్ వివేకానందమ్ అధ్యక్షతన కృష్ణగిరి, సేలం ధర్మపురి, నామక్కల్, ఈరోడ్ జిల్లాల నేర విభాగం పోలీసు ఇన్స్పెక్టర్లు 50 మందికి పైగా డిజిటల్ కాయిన్ పేరిట మోసాలకు పాల్పడిన వారి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. వివిధ రికార్డులు, ఫైళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. చదవండి: హాస్టల్ విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం: స్నానం చేస్తూ నాలుగు వీడియోలు పంపిందంతే! -
ఆన్లైన్ మోసాలకు ఇలా అడ్డుకట్ట వేయండి
సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మొదటి ప్లేస్‌లో ఫేస్బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు.. వంటివెన్నో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్. ఫొటోలు, వీడియోలు అనేక ఇతర ఇంటరాక్టివ్ అంశాలు, వ్యాపారం, సేవలను ప్రోత్సహించడానికి మాధ్యమంగా ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. నెట్వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయి ఉండటంతో, స్కామర్లకు ఇది ఒక మాధ్యమంగా మారింది. దీంతో మోసగాళ్లు సోషల్ మీడియా హ్యాండిల్ నుండి లింక్‌లు, కనెక్షన్లతో స్కామ్‌లకు తెరలేపుతున్నారు. స్కామ్‌లు... ఫేస్బుక్ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్ వంటి ఈ మోసాల జాబితాలో మొదట బాధితుడి ప్రొఫైల్‌ను హైజాక్ చేసి, ఆపై వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయ్యిందని తెలియదు. దీంతో ఫేస్బుక్ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్బుక్ చీటింగ్ స్కామ్‌కు సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు. యాక్సెస్ సులువు... సైబర్ నేరగాళ్లు బాధితురాలి/బాధితుడి ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత వివరాలన్నింటికి యాక్సెస్ పొందుతారు. స్కామర్ బాధితుడి ఫేస్బుక్ ఖాతాను లక్ష్యంగా చేసుకుని హ్యాక్ చేస్తాడు. తర్వాత స్నేహితుల జాబితాలోని వారిని సంప్రదిస్తాడు. స్కామర్ సాధారణంగా డబ్బు అడగడానికి ప్రయత్నిస్తాడు ∙నిధుల బదిలీ, యాక్సెస్ కోడ్, వ్యక్తిగత మొబైల్ నంబర్లు, ఇతర వివరాల కోసం ఒక స్కామర్ ద్వారా ఫేస్బుక్ ప్రొఫైల్ యజమాని స్నేహితులు సంప్రదించినట్లు అనేక కేసులు ఇప్పటికే సైబర్‌క్రైమ్‌లో ఫైల్ అయి ఉన్నాయి. వీటిలో... శృంగారపరమైన మోసాలు... అంత్యంత పెద్ద స్కామ్‌లలో ఇది ఒకటి. ఫేస్బుక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రేమికులుగా నటిస్తారు. స్కామర్లు వారి బాధాకరమైన జీవనం గురించి, భాగస్వామి నుంచి విడిపోయినట్లు నటిస్తారు లేదా మిమ్మల్ని ఆకర్షించడానికి ముఖస్తుతిని ఉపయోగిస్తారు. ఒక శృంగారపరమైన వీడియో సంభాషణ మీ భావోద్వేగాలతో ఆడుకోవడానికి, మీ నమ్మకాన్ని పొందేందుకు రూపొందించి ఉంటుంది. వారాలు, నెలల వ్యవధిలో మెసెంజర్చాట్లను పెంచుతూ ఉంటారు. చివరికి ఏదో సమస్య చెప్పి డబ్బు పంపమని అడుగుతారు. ఆన్లైన్లో క్యాట్‌ఫిషింగ్ కోసం ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలలో ఒకటి. షాపింగ్ మోసాలు... ఫేస్బుక్ ద్వారా స్కామర్లు నకిలీ వస్తువులను అంటగట్టడానికి నకిలీ బ్రాండ్ ఖాతాలను సృష్టిస్తారు. రకరకాల ఆఫర్లతో ఎన్నడూ వినని షాప్ పేర్లను సృష్టిస్తారు. ప్రకటనలను పుష్ చేస్తారు. చౌక ధరలకు వస్తువులను అందిస్తామంటారు కానీ దేనినీ పంపరు. బదులుగా, మీ డబ్బు తీసుకొని అదృశ్యమవుతారు. నకిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు... ఫేస్బుక్లో ఉన్న ఎవరైనా ఈ స్కామ్‌ను ఎదుర్కొనే ఉంటారు. ఒక వ్యక్తిని ఫాలో అవడానికి మొత్తం ఫేస్బుక్ ఖాతాలను చేరుకోవడానికి స్కామర్లకు ఇది ఇష్టమైన వ్యూహం. మీరు ఒక ఫేక్ అభ్యర్థనను అంగీకరించినప్పుడు, మీరు మీ అకౌంట్ లాక్ చేసినా మీరు స్కామర్‌కి అంతర్గత యాక్సెస్‌ను అందించినట్టే. మీ డిజిటిల్ డివైజ్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసే మోసపూరితమైన లింక్ వంటి ఇతర స్కామ్‌ల బారినపడేలా మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు. నకిలీ ఛారిటీ స్కామ్‌లు... విపత్తు సంభవించినప్పుడు, సహాయం చేయాలనుకోవడం మానవ స్వభావం. చాలా మందికి, దీని అర్థం డబ్బును విరాళంగా ఇవ్వడం. మోసగాళ్లకు ఇది తెలుసు. వెంటనే డబ్బు చెల్లించేలా సంక్షోభాలను ఉపయోగిస్తారు. నకిలీ ఛారిటీ పేజీలు, వెబ్సైట్లు, గో ఫండ్ మి వంటి ప్రసిద్ధ సైట్లలో ఖాతాలను కూడా సృష్టించి, ఆపై మీ ఫేస్బుక్ ఫీడ్‌లో వారి ‘ధార్మిక సంస్థలను’ ప్రచారం చేస్తారు. ఫోన్ యాప్‌ల ద్వారా డబ్బు చెల్లించమని అడుగుతారు. మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఇచ్చే ముందు రీసెర్చ్ చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఛారిటీ నావిగేటర్, గైడ్‌స్టార్, ఛారిటీ వాచ్‌తో సహా ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సైట్లను చెక్ చేయండి. హ్యాక్ అయిన సమాచారాన్ని రిపోర్ట్ చేయాలంటే.. https://www.facebook.com/hacked నకిలీ సమాచారం గురించి రిపోర్ట్‌కు... https://www.facebook.com/help/572838089565953 helpref=search&sr=2&query=reporting%20false%20claims&search_session_id=f886d969d0ffdf65b717d0567986859f మోసానికి సంబంధించిన సమాచారాన్ని .. httpr://www.facebook.com/he p/174210519303259?rdrhc రిపోర్ట్ చేయడం మంచిది. ఫేస్బుక్ మోసాలకు అడ్డుకట్ట మీ భద్రతను కాపాడుకోవడానికి ఫేస్బుక్లో మీరు చేయగలిగేవి... మీ ఫేస్బుక్ గోప్యతా సెట్టింగ్‌లను లాక్ చేయండి రెండుకారకాల ఫోన్‌నెంబర్ ప్రమాణీకరణను ప్రారంభించండి మీకు తెలియని వారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తిరస్కరించండి వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కోసం అడిగే సందేశాలను పట్టించుకోవద్దు మీకు పంపిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు మీ లాగిన్ చరిత్రను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ∙ బలమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి ధ్రువీకరించబడిన బ్రాండ్ ఖాతాల నుండి మాత్రమే షాపింగ్ చేయండి మీ పేరు మీద ఉన్న ఖాతాల కోసం క్రమం తప్పకుండా శోధించండి మీ ఫేస్బుక్ పేజ్ బయట... మీ పరికరం ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేయండి అన్ని అనుమానాస్పద ఇ–మెయిల్లను తొలగించండి మీ అన్ని డిజిటల్ పరికరాల్లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయండి ఎరుకతో వ్యవహరించండి. మీరు ఫేస్బుక్ స్కామ్‌కు గురైనట్లయితే ... స్కామ్ గురించి ఫేస్‌బుక్‌కి నివేదించండి పాస్వర్డ్ మార్చుకోండి మీ బ్యాంక్ అకౌంట్లను ఎప్పుడూ తనిఖీ చేస్తూ ఉండండి మీ ఆన్లైన్ చెల్లింపులను ఆపేయండి మీ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఎవరైనా దొంగతనం చేశారా గమనించండి ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
పెళ్లి అనుకుంటే లొల్లి
బనశంకరి: పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమైన యువతి మాయలో పడిన ఓ యువకుడు సుమారు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు దక్షిణ పరిధిలో చోటుచేసుకుంది. హనుమగిరి నివాసి అజయ్‌కుమార్ బాధితుడు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న అజయ్‌కుమార్ గత నెల 29వ తేదీన వెబ్సైట్లో వధువు కావాలని తన ఫొటో వివరాలను అప్లోడ్ చేశాడు. తరువాత ఉత్తర భారతదేశానికి చెందిన యువతి అతనికి మెసేజ్ పంపించగా ఇద్దరూ ఫోన్ నంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాడు. భారీగా వసూళ్లు మీరంటే ఇష్టమని, మిమ్మల్ని చూడడానికి వస్తానని యువతి చెప్పింది. దీంతో యువకుడు ఆమె బ్యాంకు అకౌంట్‌కు కొంత డబ్బు జమచేశాడు. అప్పటినుంచి యువతి పలు కారణాలు చెబుతూ అతన్నుంచి నగదు పిండుకోసాగింది. మొత్తం రూ.9.95 లక్షలు ఆమె ఖాతాలోకి జమచేశాడు. తరువాత యువతి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అడ్రస్ లేకుండా పోయింది. మోసపోయానని గుర్తించిన యువకుడు బెంగళూరు దక్షిణ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఐటీసీటీలో అతిపెద్ద సమస్య... అక్రమ సంబంధాలతో 981 జంటలు) -
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: యువత బలహీనతను ఆసరా చేసుకొని.. అందమైన అమ్మాయిలతో వలపు వల విసిరి అడ్డంగా దోచేస్తున్న సైబర్ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. హాయ్ అన్న చిన్న పదానికి స్పందిస్తే చాలు గంటల వ్యవధిలోనే వాట్సాప్ ద్వారా వచ్చే కాల్స్‌ను వద్దనుకున్నా.. టచ్ చేసి తీరుతారు. అందులో నగ్నంగా కనిపించే యువతి ఫొటోను మీరు గమనిస్తుండగా స్క్రీన్ షాట్ తీసి మళ్లీ మీకే పంపుతారు. చదవండి: భర్తను దారికి తెచ్చుకోవాలనుకుంది.. చివరికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన భార్య ఆ తర్వాత బ్లాక్మెయిల్.. వేధింపులు షరామాములే. అవతలి వారు డిమాండ్ చేసిన మేరకు డబ్బు చెల్లించుకోకపోతే మానసిక వేదన తప్పదు. ఈ తరహా చిక్కులో పడి ఎందరో నలిగి పోతున్నారు. వారిలో కొందరు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మరికొందరు వలపుల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు. చాలారోజుల క్రితం రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన ఓ ముఠాను తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేసి రూ. 25 కోట్లు కాజేసినట్లు నిర్ధారించారు. 18 రాష్ట్రాల్లో ఈ ముఠా తన నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు అప్పట్లో పోలీసులు గుర్తించారు. ఈ లెక్కన వలపుల వల విసరడంలో ఈ ముఠాలు ఎంతగా ఆరితేరాయో ఇట్టే అర్థమవుతోంది. ఫేస్ బుక్‌తో చాటింగ్ ప్రారంభించి...వాట్సప్‌తో వసూళ్లకు దిగుతున్న ఈ ముఠాలతో తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అనంత పోలీసులు. మోసపోయిన కొందరు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నుంచి ఉన్నత చదువుల నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు వలపుల వలలో చిక్కుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రైవేటు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఆ యువకుడు.. రాత్రి వేళ పోర్న్ వెబ్‌సైట్‌ను చూస్తుండగా అతని వాట్సాప్‌కు ఓ వీడియో వచ్చింది. తీరా చూస్తే అందులో తాను చూస్తున్న వీడియోలో అమ్మాయితో తాను ఉన్నట్లుగా ఉంది. అవాక్కైన అతను తేరుకునేలోపు అవతలి నుంచి మరో సందేశం వచ్చింది. తాము కోరిన మేరకు డబ్బు చెల్లించాలని లేకపోతే ఆ వీడియోను వెబ్సైట్లో పెడతామంటూ బెదిరిస్తున్నట్లుగా మెసేజ్ చేశారు. దీంతో తన చదువుల కోసం దాచుకున్న డబ్బు కాస్త బ్లాక్‌మెయిలర్ చెప్పిన ఖాతాకు జమ చేశాడు. ఇంతటితో విషయాన్ని ఆపలేదు. తరచూ డబ్బు కోసం వేధిస్తుండడంతో విషయాన్ని తన మిత్రుల ద్వారా తండ్రికి చేరవేశాడు. తల్లిదండ్రులు ఆ యువకుడిని మందలించి ఫోన్లో బ్లాక్ మెయిల్ చేస్తున్న వారిని గట్టిగా హెచ్చరించడంతో వివాదం సద్దుమణిగింది. కాగా, అప్పటికే ఆ యువకుడు రూ.వేలల్లో బ్లాక్‌మెయిలర్‌కు నగదు బదిలీ చేశాడు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ సంఘం నాయకుడి మొబైల్‌కు రాత్రి 10 గంటల సమయంలో హాయ్ ఎలా ఉన్నారంటూ ఓ మెస్సేజ్ వచ్చింది. తెలిసిన వారేమోనని అతను స్పందించాడు. నిమిషాల వ్యవధిలో అతనికి వీడియో ఫోన్ కాల్ వచ్చింది. తీసి చూస్తే న్యూడ్‌గా ఓ యువతి దర్శనమిచ్చింది. మొదట భయపడిన ఆయన కొద్ది క్షణాల పాటు ఆ అమ్మాయి ఎవరోనని చూసి ఫోన్ కట్ చేశాడు. ఇక రాత్రంతా ఒకటే గోల మేము పంపిన నంబరుకు ఫోన్‌పే ద్వారా మీరు డబ్బు పంపక పోతే మీ పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. నేనేం తప్పు చేశానో? చెప్పమంటూ వారితో అతను వాదించాడు. అదే సమయంలో స్క్రీన్ రికార్డు చేసిన చిన్న వీడియో క్లిప్‌ను బ్లాక్‌మెయిలర్ పంపాడు. అందులో ఆ అమ్మాయి న్యూడ్‌గా ఉన్న వీడియోను తాను చూస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోని మీ ఫేస్బుక్లో ఉన్న మిత్రులు, పొలిటికల్ లీడర్లకు పంపుతామని బెదిరించారు. ఏం చేయాలో పాలుపోక తెలిసిన పోలీసు మిత్రుడికి చెప్పి ఆయనతో ఫోన్లో బ్లాక్ మెయిలర్‌ని హెచ్చరికలు జారి చేయించి బయటపడ్డాడు. కాకపోతే అప్పటికే ఆ నేత రూ.18 వేలు ఫోన్‌ఫే ద్వారా బ్లాక్‌మెయిలర్‌కు బదిలీ చేయడం గమనార్హం. రోజుకో రూపంలో మోసాలు సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో మోసాలకు తెగబడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో ఉంచకూడదు. సెల్ఫోన్లో చిన్నపాటి ప్రైవసీ సెట్టింగ్ చేసుకుంటే చాలా మంచిది. ప్రధానంగా ఫేస్బుక్ హ్యాక్, వాట్సాప్, మెస్సేంజర్, వీడియో కాల్స్ ద్వారా ఆకర్శించి దోపిడీ చేస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వీడియోకాల్స్, సందేశాలకు స్పందించకపోతే సురక్షితంగా ఉన్నట్లే. కాదని ఆకర్శితులైతే బ్లాక్మెయిలర్స్ వలలో పడక తప్పదు. కొత్త వ్యక్తులు పంపే సందేశాలు, లింకులను అసలు ఓపెన్ చేయవద్దు. ఒకవేళ ఇలాంటి ఉచ్చులో పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ, అనంతపురం -
ఎస్ఐ పాడుబుద్ధి.. మహిళా హోంగార్డుతో పరిచయం పెంచుకుని..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మహిళా హోంగార్డును మోసం చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) ఎస్ఐని ‘దిశ’ పోలీసులు అరెస్టు చేశారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ మంగళవారం ఈ కేసు వివరాలను మచిలీపట్నంలో మీడియాకు వెల్లడించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి సెబ్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కొమ్మా కిరణ్‌కుమార్.. బందరు సబ్‌జైలులో పని చేస్తున్న మహిళ హోంగార్డుతో పరిచయం పెంచుకున్నాడు. నాలుగేళ్లుగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. చదవండి: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్ ఆమె వద్ద పలుమార్లు డబ్బులు కూడా తీసుకున్నాడు. ఇటీవల ఇంటి అవసరాల నిమిత్తం కిరణ్‌ను ఆమె డబ్బులడిగింది. ‘డబ్బులివ్వను.. ఏమి చేసుకుంటావో చేసుకో’ అంటూ అతను బెదిరించడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు సోమవారం ‘స్పందన’లో ఎస్పీ జాషువాకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎస్పీ వెంటనే ఎస్ఐ కిరణ్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ‘దిశ’ పోలీసులను ఆదేశించారు. ‘దిశ’ డీఎస్పీ రాజీవ్‌కుమార్ కేసు నమోదు చేసి 24 గంటల్లో కిరణ్‌ను అరెస్టు చేశారు. మంగళవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు రాజీవ్ చెప్పారు. -
హనీ ట్రాప్.. యువకులకు యువతి వల.. వీడియో కాల్స్ రికార్డ్ చేసి..
సాక్షిప్రతినిధి కర్నూలు: జ్యోతిర్మయి(పేరుమార్చాం) పెళ్లికాని యువతి. ఇంటర్మీడియట్ చదివింది. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఫ్‌ఎన్‌ఓగా చేరింది. కొద్దిరోజులు పనిచేసి తర్వాత మానేసింది. అక్కడే రేడియాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఓర చూపులు..కొంటె నవ్వులు...కొన్ని రోజులు నడిచింది. మాటల్లో ప్రేమ చూపింది. ఇద్దరూ వీడియోకాల్ వరకూ వచ్చారు. జ్యోతిని నమ్మిన ఆ వ్యక్తి వాట్సాప్ చాటింగ్‌లతో పాటు వీడియోకాల్స్ తరుచూ మాట్లాడేవాడు. చాటింగ్, వీడియోకాల్స్‌ను జ్యోతి రికార్డ్ చేసింది. చదవండి: ప్రేమించి పెళ్లాడి.. వదిలేశాడు ఈ క్రమంలో అతని నుంచి జ్యోతి రూ.10వేలు అప్పు తీసుకుంది. కొద్దిరోజుల తర్వాత అప్పు తిరిగి అతను అడిగాడు. వెంటనే జ్యోతి అసలు నిజస్వరూపం బయటకు వచ్చింది. వీడియోకాల్‌ను అతని వాట్సాప్‌కు పంపింది. డబ్బులు డిమాండ్ చేస్తే వీడియోలు మీ స్నేహితులకు, ఆస్పత్రి సిబ్బందికి పంపిస్తానని బెదిరించింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. చేసేది లేక నిమ్మకుండిపోయాడు. అంతటితో ఆగలేదు. మరో రూ.20వేలు అడిగింది. దీంతో అతను ఇవ్వలేను అనేసరికి వాట్సాప్ చాటింగ్‌లు, మరిన్ని వీడియోకాల్స్ రికార్డింగ్స్ స్క్రీన్‌షాట్స్ పంపి బ్లాక్మెయిల్ చేసింది. భయంతో రూ.20వేలు ఇచ్చాడు. తిరిగి మరోసారి మరికొంత డబ్బులు అడిగింది. ఈ దఫా ఇవ్వలేనని అతను వాదనకు దిగారు. దీంతో జ్యోతి నేరుగా ఆస్పత్రికి వెళ్లి బ్లాక్‌మెయిల్‌తో పాటు గొడవకు దిగింది. ఈ గొడవలో అతని సెల్‌ఫోన్ లాక్కొని వెళ్లిపోయింది. దీంతో చేసేది లేక అతను నేరుగా త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారి జ్యోతి గురించి ఆరా తీశారు. 2021లో త్రీటౌన్ పోలీసుస్టేషన్లోనే జ్యోతి ఒక కేసు పెట్టింది. ఒక అబ్బాయి తనను లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఆపై లోక్ అదాలత్‌లో కేసు కొట్టేశారు. ఈ కేసు సారాంశం పైన ఆస్పత్రిలో జరిగిన తంతే!! అలాగే ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. ఓ వ్యక్తి లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకోలేదని కేసు నమోదు చేశారు. ఇంట్లో గొడవ జరిగిందని, తనపై, తన తల్లిపై దాడి చేశారని, దుస్తులు చించి అత్యాచారం చేసేందుకు యత్నించారని మరో కేసు నమోదైంది. దీంతో పాటు పోలీసులకు మరో విషయం తెలిసింది. ఆ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బంధువుపైనే యువతి ‘హనీట్రాప్’ చేసింది. కొంత డబ్బులు తీసుకుంది. ఇదే స్టేషన్లో గతంలో పంచాయితీ చేసి పంపారు. ఈ ఘటనలే కాదు...చాలామంది మగాళ్లతో పరిచయం పెంచుకోవడం, చాటింగ్, వీడియో కాల్స్ చేయడం, వాటి రికార్డింగ్స్‌తో బ్లాక్ మెయిల్ చేయడం జ్యోతికి అలవాటుగా మారింది. దీన్ని ఓ ఆదాయ మార్గంగా ఎంచుకుంది. పెళ్లికాని యువతి కావడంతో చాలామంది యువకులు ఆకర్షితులై పరిచయం పెంచుకుని బుట్టలో పడుతున్నారు. ఆపై విలవిల్లాడి చేసిన పొరపాటుకు ‘పెనాల్టీ’ చెల్లిస్తున్నారు. ఎట్టకేలకు ఆసుపత్రి ఘటనతో జ్యోతి గుట్టు రట్టయింది. పోలీసులు జ్యోతిపై కేసు నమోదు చేశారు. జ్యోతి ఘటన నేపథ్యంలో ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు
గుత్తి రూరల్ (అనంతపురం/కర్నూలు): ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు. మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి ఇసురాళ్లపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రమేష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె కూడా ప్రేమకు అంగీకరించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. అతను ప్రేమించిన యువతిని మోసం చేసి, జిల్లాలోని పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. బుధవారం ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో వివాహం జరుగుతున్న విషయం బాధితురాలికి తెలిసింది. వెంటనే ఆమె గుత్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయాన్ని దాచి తమనూ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు వరుడు రమేష్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
యువతిపై అత్యాచారం.. సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటపెడతానంటూ..
కపిలేశ్వరపురం(కోనసీమ జిల్లా): వడ్లమూరుకు చెందిన మాకన రాజేష్ తనపై అత్యాచారం చేశాడంటూ అదే గ్రామానికి చెందిన 31 ఏళ్ళ యువతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అంగర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాది 2018 నుంచి విజయవాడలోని ఓల్డేజ్ హోంలో కూలీగా పనిచేస్తుంది. చదవండి: పెళ్లి రోజున కొత్త చీర కొనలేదని.. కోపంతో భార్య ఏం చేసిందంటే? తనను ప్రేమించాలంటూ నిందితుడు రాజేష్ వేధించేవాడని, తరువాత తన సమ్మతి లేకుండా శారీరకంగా అనుభవించాడని, పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా తిరస్కరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అంగర పోలీసులు తెలిపారు. -
మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా
బనశంకరి: ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.7.6 లక్షలు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరులోని సర్జాపుర రోడ్డు కృతిక గోయల్ (30) బాధితురాలు. పెళ్లి చేసుకోవడానికి తగిన వరుడు కావాలని కృతిక.. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రొఫైల్‌ను పెట్టింది. అది చూసి ఒక యువకుడు ఆమెను సంప్రదించాడు, తాను మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి స్నేహం చేశాడు. అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆనారోగ్యం బారినపడ్డారని రూ.7.60 లక్షలు పంపాలని, వెంటనే డబ్బు వెనక్కి ఇస్తానని ఆ యువకుడు కథ చెప్పాడు. అతని మాటలు నమ్మిన కృతిక ఆ డబ్బు పంపింది. ఆ తరువాత యువకుడు అడ్రస్ లేకపోవడంతో టోపీ వేశాడని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బహుమానం వచ్చిందని రూ.5.37 లక్షలు.. బహుమానం కోసం ఆశ పడి ఓ అభాగ్యుడు రూ. 5.37 లక్షలను కోల్పోయాడు. ఈ సంఘట మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకా కోడగి గ్రామంలో జరిగింది. రాము అనే వ్యక్తి ఇంటికి న్యాప్‌టోల్ అనే కంపెనీ నుంచి పార్శిల్ వచ్చింది. అందులో ఒక కూపన్ ఉంది, మీకు రూ. 7.50 లక్షల లాటరీ తగిలిందని, ఆ డబ్బులు పంపాలంటే బ్యాంకు చార్జ్, జీఎస్టీ, టిడిఎస్, కమీషన్ ఇవ్వాలని రాసి ఉంది. దానిని నమ్మిన రాము తన భార్య, స్నేహితుల వద్ద రూ. 5.37 లక్షలను తీసుకొచ్చి కంపెనీ చెప్పిన ఖాతాలోకి జమ చేశాడు. బహుమానం కోసం ఫోన్ చేయగా, ఇంకా కొన్ని రుసుములు చెల్లించాలని, లేదంటే కానుక రద్దవుతుందని బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన రాము సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: విడాకుల కోసం వచ్చి మళ్లీ ఒకటయ్యారు.. మధ్యలో ఏం జరిగిందంటే!) -
విద్యార్థినితో చనువుగా తిరిగి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
మండపేట(కోనసీమ జిల్లా): పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు వంచించాడన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై బుధవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పెదకాలువ వంతెన వద్ద నివసిస్తున్న దుర్గారావు కుమార్తె స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుకుంటోంది. వారి ఇంటి సమీపంలో నివసిస్తున్న గ్రంధి రాజేష్ ప్రేమ పేరిట విద్యార్థిని వెంటపడేవాడు. చదవండి: వేరే అమ్మాయితో పెళ్లి.. నా చావుకు కారణం ఫణిబాబే ఈ విషయాన్ని విద్యార్థిని తండ్రి పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాజేష్‌ను మందలించారు. అయినా వినకుండా మాయమాటలు చెప్పి విద్యార్థినితో చనువుగా తిరిగేవాడు. ఇటీవల రాజేష్‌తో పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని బుధవారం ఇంట్లో ఉన్న థైరాయిడ్ మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు విద్యార్థినిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతోంది. ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు పట్టణ ఎస్ఐ ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. నమ్మించి నగ్న వీడియోలు తీసి..
బనశంకరి(కర్ణాటక): ఒంటరి, వితంతు మహిళలను మాయమాటలతో నమ్మించి నగ్నచిత్రాలు తీసి డబ్బు గుంజుతున్న మహిళతో పాటు నలుగురు ఖతర్నాక్ గ్యాంగ్‌ను ఆదివారం మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళ, రవి, శివకుమార్, శ్రీనివాస్ ఆ ముఠా సభ్యులు. మంగళ, రవి దంపతులు కాగా శివకుమార్, శ్రీనివాస్‌తో కలిసి ముఠాగా అయ్యారు. ఒంటరి మహిళలను గాలించి మంగళ వారిని పరిచయం చేసుకునేది. చదవండి: ఒంటరిగా బతకలేను.. అందుకే వెళ్లిపోతున్నా.. నన్ను క్షమించండి మహిళలను కారులో ఎక్కించుకుని నిర్జన ప్రాంతాల్లోకి తీసుకెళ్లి ప్రాణాలు తీస్తామని బెదిరించి నగ్నచిత్రాలు వీడియో తీసేవారు. ఇక అప్పటినుంచి వారిని బెదిరించి డబ్బులు రాబట్టుకునేవారు. ఈ ముఠాపై మహాలక్ష్మీ లేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఓ బాధితురాలు కేసు పెట్టింది. తనను బెదిరించి బంగారుచైన్, నగలు, రూ.84 వేల నగదు దోచుకున్నారని తెలిపింది. దీంతో ముఠాను అరెస్ట్‌చేసి వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన నగలు, రూ.70 వేల నగదు, కారు, మొబైల్, కత్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. -
పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ
మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్‌కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము. మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్‌కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్‌వాలె అనే వెబ్సైట్లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. వారు లింక్‌లో పంపినఒక వెబ్‌సైట్‌ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది) -
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
సైబర్ దొంగ భలే స్మార్ట్ గురూ!
బనశంకరి: ఐటీ సీటీలో సైబర్ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయించి ఓటీపీ యాక్సెస్ లేకుండా సులభంగా మీ మొబైల్లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండే థర్డ్‌పార్టీ యాప్‌లైన ఎనీడెస్క్ టీమ్వ్యూవర్హాస్క్, క్విక్‌సపోర్ట్, రిమోట్డ్రైడ్, ఏర్మిరర్, రిమోట్ కంట్రోలర్ లేదా స్క్రీన్‌షేర్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్న తక్షణం ఆ సెల్‌ఫోన్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్‌బ్యాంకింగ్ సమాచారం, పాస్వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు. బ్లాక్మెయిల్.. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లను యాక్సెస్ చేసే సైబర్‌కేటుగాళ్లు మొబైల్స్‌లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్ వినియోగదారులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు: ఫోన్‌పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఫోన్‌పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు బ్యాంకింగ్ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు ప్లేస్టోర్‌లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లో పరిచయం లేని యాప్‌లను డిలిట్ చేయాలి ఎవరు ఫోన్‌చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్‌కోడ్ తెలపరాదు ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్ కాదా అని నిర్ధారించుకోవాలి. (చదవండి: -
Hyderabad: యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోతో సినీనటి బ్లాక్మెయిల్
అమీర్‌పేట: ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల మేరకు.. సినీ పరిశ్రమలో పనిచేసే 28 ఏళ్ల యువరాజ్కుమార్కు అదే పరిశ్రమకు చెందిన 25 ఏళ్ల పడాల లక్ష్మి ఓ వీడియో పంపింది. అందులో అతడు ఓ యువతితో సన్నితంగా ఉన్న వీడియో ఉంది. తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని, లేని పక్షంలో సామాజిక మాధ్యమాలలో వీడియోలను వైరల్ చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో అతడు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి...
ఇటీవల కొంతమంది తమను మోసం చేశారనో లేక తమతో ప్రేమగా ఉండటంలేదనో వంటి కారణాలతో దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఇరు జీవితాలు నాశనమవ్వడమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటున్నాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి దారుణమైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ సిటీలోని 27 ఏళ్ల యువకుడు తన ప్రియురాలు తనకు తీరని ద్రోహం చేసిందనే కోపంతో ఆమెను పదునైన ఆయుధంతో హత మార్చాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పారు. అతని వద్ద దొరికిన సూసైడ్‌నోట్‌లో ...తాను రాయ్‌పూర్‌లోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ డయల్-112లో కాల్ ట్రాకర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఐతే తాను ప్రేమిస్తున్న అమ్మాయి తనను మోసం చేస్తూ వేరొకరిని ప్రేమించడంతోనే ఈ ఘటనకు పాల్పడినట్లు. ఈ ఇద్దరూ కూడా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ఒకే గ్రామానికి చెందినవారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: వివాహేతర సంబంధం: బైకుపై ఒంటరిగా వస్తుంటే..) -
నిన్నే పెళ్లాడతానంటూ మ్యాట్రిమోనీలో పరిచయం.. లేడి డాక్టర్‌ను నమ్మించి..
మాట్రిమోనీ వెబ్సైట్లో పరిచయమయ్యాడు. ఇండియాకు వచ్చానని, లక్షల యూరోలు తీసుకువస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారని, ట్యాక్స్ కడితే తాను వచ్చి ఇస్తానంటూ నమ్మించాడు. దీంతో మహిళా డాక్టర్ ఏకంగా రూ.19 లక్షలు జమ చేసింది. ఆ తరువాత నెంబర్ పనిచేయకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. తిరువొత్తియూరు(తమిళనాడు): మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై కోవైకి చెందిన మహిళా డాక్టర్‌కు రూ.19.60. లక్షలు టోకరా వేసిన నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. కోవై పీలమేడు ప్రాంతానికి చెందిన మహిళ సైక్రియాటిస్ట్ వరుని కోసం మాట్రిమోని వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు. అవి చూసి ఓ యువకుడు, తన పేరు యుసాన్ సియాన్ అని వైద్యురాలికి పరిచయమయ్యాడు. తాను నెదర్లాండులో శస్త్ర చికిత్స విభాగంలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఇండియాలో కోట్ల రూపాయలతో ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్లు నమ్మించాడు. ఇందుకు సహకారం అవసరమని కోరారు. పైగా తాను ఇక్కడ సెటిల్ అయ్యాక భారతీయ యువతిని వివాహం చేసుకోనున్నట్లు చెప్పాడు. తాను భారతదేశానికి వచ్చిన సమయంలో కలుస్తానంటూ నమ్మించాడు. అనంతరం ఇద్దరూ సెల్‌ఫోన్ నెంబర్లు మార్చుకుని ఫోన్లో తరచూ మాట్లాడుకునేవారు. చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల లక్ష యూరోలతో వచ్చాడు.. ఈ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారి పేరుతో ఓ మహిళతో ఫోన్ చేయించాడు. ఆమె డాక్టర్‌తో మాట్లాడుతూ.. యుసాన్ సియాన్ తన తల్లితో ఢిల్లీ వచ్చారని వివరించింది. అతని సెల్‌ఫోను మరమత్తులకు గురైనట్లు చెప్పింది. లక్ష యూరో డాలర్లు తీసుకుని వస్తున్నారని, అది భారతదేశపు కరెన్సీలో రూ.82.51 లక్షలకు సమానమని వివరించింది. దాన్ని మార్చడానికి, వారు నివాసం ఉండడానికి, విమాన టికెట్, పన్ను చెల్లించడానికి మొత్తము రూ. 19,59,920 కట్టాలని, యుసాన్ సియాన్ నేరుగా కలిసి నగదు తిరిగి ఇస్తారని తెలిపింది. ఈ మాటలు నమ్మిన కోవై మహిళా డాక్టర్ వారు చెప్పిన అకౌంట్‌కు రూ.19,59,920లను డిపాజిట్ చేశారు. దీని తరువాత వారు ఫోన్లో మాట్లాడలేదు. ఆ తరువతా అనుమానం రావడంతో ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహిళా వైద్యురాలు కోవై కార్పొరేషన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
మార్కెట్లో వస్తువులు కొంటున్నారా? వీటిని గమనించకపోతే జేబుకి చిల్లే!
సాక్షి,విజయనగరం పూల్‌బాగ్: ఏ వస్తువు కొనుగోలు చేయాలనుకున్నా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. దుకాణాల్లో లభ్యమయ్యే ఘన పదార్థాలను తూకాల్లో, ద్రవ పదార్థాలను కొలతల్లో కొలుస్తారు. వీటికి నిర్దిష్ట ప్రమాణాలుంటాయి. అయితే కొందరు వ్యాపారులు అధిక ధన దాహంతో కొలతల్లో జిమ్మిక్కులు చేస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో కొలతల్లో ఏ చిన్నపాటి తేడా గమనించినా వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. లేకపోతే అమ్మకందారుల మోసానికి గురికావాల్సి వస్తుంది. ఈ క్రమంలో కొనుగోలుదారులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న విషయంపై తూనికలు, కొలతల శాఖ అధికారులు నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే దుకాణాల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేస్తూ అమ్మకందారుల మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 13,254 సాధారణ, ఎలక్ట్రానిక్ కాటాలు ఉన్నాయి. వాటిని రిపేరు చేసేందుకు 9 మంది లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు. సాధారణ కాటాలు రెండేళ్లకొకసారి, ఎలక్ట్రానిక్ కాటాలను ఏడాదికొకసారి ముద్రలు/సీళ్లు వేయించుకోవాలి. అవి ఏమైనా మరమ్మతులకు గురైతే లైసెన్స్ హోల్డర్స్ వద్ద రిపేర్ చేయించుకోవాలి. ఎంఆర్పీ కన్నా ఎక్కువకు అమ్మితే చర్యలు.. జిల్లాలోని చౌకధరల దుకాణాలు, వే బ్రిడ్జిలు, రైస్ మిల్లులు, రైస్ షాపులు, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ షాపులు, డిస్పెన్సరీ యూనిట్లు, వాటర్ ప్లాంట్లు, పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాలు, స్వీట్స్, బేకరీ, కిరాణా షాపులు, జనరల్ స్టోర్స్, పాలు, పాల ఉత్పత్తులు, పరిశ్రమలు, మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్స్‌లలో ఎంఆర్పీ రేట్ల కంటే అధికంగా అమ్మకాలు చేపట్టకూడదు. ఎలక్ట్రానిక్ కాటాలు జీరోలో ఉండాలి. మాంసం, చేపల దుకాణాల్లో కాటాలు వేలాడదీసి ఉండాలి. తూకం వేసేటప్పుడు కొనుగోలుదారులు సరిపోయిందా లేదా అనే విషయం గమనించాలి. ఒకవేళ తూకం తక్కువగా ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలి. దీనికోసం ఫోన్ నంబర్లు 08922–223845, 9398159434, 90000828467ను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. చదవండి: Writer Padmabhushan: ‘ఈ సినిమా చూసిన ప్రతిఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు’ -
వీఆర్వో పాడుబుద్ది.. భార్యకు సంతానం కలగడం లేదని యువతికి గాలంవేసి
సాక్షి, తాండూరు(వికారాబాద్): తన భార్యకు పిల్లలు పుట్టడంలేదని, రెండో పెళ్లి చేసుకుంటానని యువతికి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని మోసం చేసిన వీఆర్వోపై తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామానికి చెందిన బోయ కార్తీక్ పెద్దేముల్ మండలంలో వీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఇంతకుముందే వివాహం కాగా, సంతానం లేదు. దీంతో రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతికి మాయమాటలు చెప్పి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తన భార్యకు సంతానం కలగడంతో, సదరు యువతితో మాట్లాడటం మానేశాడు. పెళ్లి చేసుకునేది లేదని ఆమెకు తేల్చి చెప్పాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు కార్తీక్, అతనికి సహకరించిన కుటుంబ సభ్యులపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు సీఐ కార్తీక్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చదవండి: బయటపడ్డ బండారం: అత్యాశకు పోయి.. ఆస్తి మొత్తం పోగొట్టుకుని.. -
పెళ్లి చేసుకుందామని అడిగితే.. కడుపు మీద తన్నడంతో..
మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండు సార్లు అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోమని కోరితే కులం పేరుతో తిరస్కరించాడు. మూడేళ్ల క్రితం విజయనగరకు చెందిన యువతికి, స్థానికుడైన గణేశ్ అనే యువకునికి పరిచయమై ప్రేమ ఏర్పడింది. ఇటీవల యువతి గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోమని కోరింది. ప్రియుడు అబార్షన్ చేయించి, పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి విజయనగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గణేశ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఒక నెల జైలు వాసం తర్వాత బెయిల్‌పై వచ్చిన నిందితుడు యువతికి మళ్లీ మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. యువతి తిరిగి గర్భం దాల్చగా ఈసారైనా పెళ్లి చేసుకుందామని అడిగింది. దీంతో అతడు కోపంతో ఆమె కడుపు మీద తన్నడంతో గర్భస్రావం కూడా జరిగింది. గణేశ్‌తో తనకు పెళ్లి చేయకపోతే బతకనని యువతి చెబుతోంది. న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. చదవండి: (ఆ ఇంట్లో అద్దెకు దిగడమే వారి పాలిట శాపం) -
ప్రేమ పెళ్లి.. అయిదు రోజుల కాపురం, అంతలోనే మోసం
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రేమించానని నమ్మిం,పెళ్లి చేసుకున్నాడు.ఐదు రోజుల తర్వాత కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన నవాబుపేట మండలంలోని దేపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణగౌడ్(23) అదేగ్రామానికి చెందిన రేణుక(21) అనే అమ్మాయినిచాలా ఏళ్లక్రితం నుంచి ప్రేమిస్తున్నాడు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవటంతో గత నెల జూలై 17న హైదరాబాద్‌లోని ఆర్యసమాజంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఐదు రోజుల పాటు కాపురం చేశారు. అనంతరం సత్యనారాయణ, తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి సొంత గ్రామందేపల్లికి వచ్చాడు. తిరిగి హైదరాబాద్ వెళ్లలేదు. అప్పుడు ఇపుడు వస్తానంటూ కాలయాపన చేస్తూవచ్చాడు. కొన్నాళ్లకు ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో తనను కేవలం ప్రేమ పేరుతో మోసం చేసి వాడుకుని వదిలేశాడని పేర్కొంటూ బాధితురాలుపోలీసులను ఆశ్రయింంది. అయినా ఫలితం లేకపోవటంతో మంగళవారం భర్త ఇంటి ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తోంది. తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ప్రస్తుతం సత్యనారాయణను వారి బంధువులు అజ్ఞాతంలో ఉంచారని, తనకు న్యాయంచేయాలని కోరుతోంది. అప్పటి వరకు ఇంటి ముందే కూర్చుని నిరసన తెలుపుతానని చెప్పారు. ఈవిషయమై సీఐని వివరణ కోరగా ఉమెన్ పీఎస్‌కు రిఫర్ చేస్తామని అన్నారు. చదవండి: రాజస్థాన్ నుంచి వచ్చిన బురిడి బాబాలు.. దోష నివారణ పూజలు చేస్తామని -
బయటపడిన నిత్య పెళ్లికూతురి బాగోతం.. ముగ్గురి దగ్గర మూడు పేర్లతో..
సాక్షి, చిత్తూరు(చెన్నై): విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ముగ్గురి భర్తల వద్ద మూడు పేర్లు చెప్పి వివాహం చేసుకున్న కిలాడీ లేడి విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. చెన్నై ఆవడి సమీపంలోని ముత్తు పుదుపేట రాజీవ్‌నగర్‌కు చెందిన హరి(44) ఎంసీఏ పూర్తి చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి 2008లో చెన్నైలోని కొలత్తూరు ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. మనస్పర్థల కారణంగా వీరు 2014లో విడాకులు తీసుకున్నారు. దీంతో హరి రెండవ వివాహం చేసుకునేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇంటి పని చేస్తున్న వ్యక్తి ద్వారా ఆంధ్ర రాష్ట్రం చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన శరణ్య అనే యువతిని చూశారు. ఆ సమయంలో ఆమె తనకు 35 ఏళ్లు అని, బంధువులు ఎవరూ లేదని చెప్పింది. దీంతో హరి, శరణ్యను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. ఈ ఆస్తి వివరాలను చెప్పాలని హరితో శరణ్య తరచూ ఘర్షణ పడేది. ఆస్తులను తనపై పేరుపై రాసి పెట్టాలని కోరింది. చివరికి వరకట్న వేధింపులు గురి చేస్తున్నారని భర్త, అత్త ఇంద్రాణిపై తిరుపతి పోలీసులకు శరణ్య ఫిర్యాదు చేసింది. దీంతో హరి తల్లి ఇంద్రాణి ఆవడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా శరణ్య నిజమైన పేరు సుగణ అని ఈమెకు 50 ఏళ్లని తేలింది. ఈమెకు ఇది వరకే తిరుపతికి చెందిన రవి అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు కుమార్తెలున్నట్లు తెలిసింది. దీంతో ఆవడి పోలీసులు శరణ్యను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని వక్కనంపట్టి గ్రామానికి చెందిన సుబ్రమణి శనివారం ఆవడి పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. అందులో తాను సేలం, ఈరోడ్డు, కాట్పాడి వంటి రైల్వేస్టేషన్‌లోని క్యాంటిన్లో పని చేస్తున్నానని 2010లో ఆరణికి చెందిన ఏజెంట్ ద్వారా శరణ్యకు తనకు వివాహం జరిగిందని పేర్కొన్నాడు. తన వద్ద ఆమె పేరును సంధ్య అని తెలిపిందన్నారు. గత పదేళ్లుగా శరణ్యతో తాను జీవించానని తమకు పిల్లలు లేదని 2021 జూలైలో మేట్టుపాళ్యంలో రైల్వే క్యాంటీన్లో పనికి వెళ్లిన సమయంలో శరణ్య తనను వదిలి వెళ్లి పోయిందని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: ప్రాణం తీసిన ప్రేమ పెళ్లి! -
Hyderabad: రెస్టారెంట్లో పెట్టుబడులంటూ రూ.13 కోట్లు స్వాహా
సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసి క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్‌ను చూపిస్తూ అందులో పెట్టుబడుల పేరుతో అనేక మంది నుంచి రూ. 13 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో తల్లీకుమారులను సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. క్యూబా డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ నిర్వహించే నాగెల్లి రూపస్ ఆయన భార్య నాగెల్లి సుకన్య, కుమారుడు జసింత్ జీటీఎఫ్‌ఎల్ మినిస్ట్రీస్ పేరుతో చర్చిల్ని నిర్వహిస్తున్నారు. అక్కడకు వచ్చిన వారిని నమ్మించిన ఈ త్రయం వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేశారు. 2017–18ల్లో దాదాపు 30 మంది నుంచి రూ.13 కోట్ల వరకు తీసుకున్నారు. తమ డబ్బు ఇవ్వమని అడిగిన వారిని బెదిరించడం వారిపైనే కేసులు పెట్టడం చేస్తున్నారు. వీరికి రూ.కోటి వరకు ఇచ్చి మోసపోయిన కేవీ ప్రసాద్ అనే బాధితుడు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన ఏసీపీ సందీప్‌కుమార్ బుధవారం సుకన్య, జసింత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న రూపస్ కోసం గాలిస్తున్నారు. వీళ్లు విదేశాల్లోని వారి నుంచి డబ్బు తీసుకున్నారని, తెనాలీలోనూ వీరిపై కేసులు ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. చదవండి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. టెన్షన్.. అటెన్షన్! -
మీరు నాకు నచ్చారు.. పెళ్లి చేసుకుందాం.. చివరికి ఊహించని ట్విస్ట్
నెల్లూరు(క్రైమ్): మీరు నాకు నచ్చారు. పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించింది. అయితే నాగదోషముంది. పూజలు చేస్తే పోతుందని ఆ మహిళను నమ్మించి నగదు కాజేసిన ఘటనపై నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఓ మహిళ భర్త 2013వ సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటినుంచి ఆమె తన కుమార్తెతో కలిసి మహిళా ప్రాంగణంలో ఉంటోంది. ఇటీవల రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని ఆన్లైన్లో మ్యారేజ్ బ్యూరోలకు వివరాలను పంపారు. చదవండి: ప్రేమ..పెళ్లి.. గొడవ.. మధ్యలో పద్మ.. ఇంతకీ ఏంటా కథ? ఈక్రమంలో రాఘవరెడ్డి అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి డిఫెన్స్‌లో కల్నల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌రెడ్డికి తాను బాబాయ్ అని పరిచయం చేసుకున్నాడు. మీ ప్రొఫైల్ శ్రీకాంత్‌రెడ్డికి నచ్చిందని అతడితో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇచ్చాడు. సదరు మహిళ శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ చేయగా ఫొటోలు పంపితే సిద్ధాంతికి చూపించి వివాహం చేసుకుందామని నమ్మబలికాడు. దీంతో ఆమె ఫొటోలను పంపారు. సిద్ధాంతికి ఫొటోలు చూపించగా నాగదోషం ఉందని, కన్యాకుమారిలో నాలుగునెలలపాటు హోమం, రోజూ అన్నదానం, వస్త్రదానం చేస్తే నివారణ అవుతుందని చెప్పాడు. అందుకు రూ.1.72 లక్షలు ఖర్చవుతుందని శ్రీకాంత్‌రెడ్డి ఆమెను నమ్మించాడు. అతడి మాటలను గుడ్డిగా నమ్మిన మహిళ గత నెల మే 7వ తేదీన రూ.1.72 లక్షల నగదును అతడి ఖాతాకు పంపారు. అప్పటినుంచి శ్రీకాంత్‌రెడ్డి, రాఘవరెడ్డి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆపేసి ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు వేదాయపాళెం పోలీసులకు పిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ‘డియర్ కస్టమర్.. మీ విద్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి 10.38 గంటలకు నిలిచిపోతుంది. మీరు గత నెల బిల్లు చెల్లించలేదు. వెంటనే మా 998... నంబర్లో సంప్రదించండి. ధన్యవాదాలు’. విద్యుత్ శాఖ నుంచి వచ్చినట్లుగా ఉండే ఈ తరహా సందేశాన్ని నమ్మి మీరు ఫోన్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అయినట్లే. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ క్రింది పేరా చదవండి.. చదవండి: నేను..నాలా‘గే’ ఉంటా.. స్వలింగ సంపర్కులు, థర్డ్ జండర్స్ ప్రైడ్ వాక్ మీకు వచ్చిన సందేశంలోని నంబర్‌కు ఫోన్ చేయగానే అవతలి వ్యక్తులు అచ్చం విద్యుత్ శాఖ అధికారులుగానే మాట్లాడతారు. మీరు బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఆ సొమ్ము మాకు చేరలేదంటారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్ అవుతాయంటూ నమ్మిస్తారు. అది నమ్మి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.10 చెల్లిస్తే వారికి పంట పండినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయిపోతాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పంపించడం, విద్యుత్ బకాయిలపై ఫోన్లో సంప్రదించడం వంటి చర్యలు విద్యుత్ శాఖ చేయదని స్పష్టం చేస్తున్నారు. -
నమ్మి ఆ ఫోటోలు, వీడియోలు పంపిన యువతి.. చివరికి ఏం జరిగిందంటే?
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒక యువతి ఉద్యోగం కోసం రెజ్యూమ్ పంపిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి నగ్న ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధిస్తూ బెదిరించిన నయవంచకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టర్ 10లో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు తాను బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తున్నానని నగరానికి చెందిన ఒక యువతికి పరిచయం చేసుకున్నాడు. చదవండి: పరిచయం.. కొన్నేళ్లుగా సహజీవనం.. అసలు ఏం జరిగిందో కానీ.. ఫోన్ ద్వారా రోజూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. కొద్ది రోజులకు ఆమెను పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అతడి మాటలను నమ్మిన యువతి తన రెజ్యూమ్‌తోపాటు ఫొటోలు, సర్టిఫికెట్లను పంపించింది. తర్వాత నగ్న ఫొటోలు పంపించాలని కనకరాజు యువతిని కోరాడు. ముందు అంగీకరించలేదు. రోజూ అడుగుతుండడంతో పెళ్లి చేసుకుంటాడని నమ్మి ఒకసారి నగ్న ఫొటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా కనకరాజుకు పంపించింది. కొద్ది రోజులకు మళ్లీ ఫొటోలు, వీడియోలు పంపించాలని వేధించడం ప్రారంభించాడు. లేనిపక్షంలో ముందు పంపించిన ఫొటోలు, వీడియోలు యువతి కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఈ నెల 22న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్ ఏడీసీపీ డి.సూర్యశ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ స్టేషన్ మహిళా ఎస్ఐ, బృందం విచారణ చేపట్టారు. యువతని బెదిరిస్తున్న వ్యక్తి ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న తిరుమలశెట్టి కనకరాజు(48)గా గుర్తించి అరెస్టు చేశారు. అపరిచితులను నమ్మి సోషల్ మీడియా ద్వారా గాని, నేరుగా గాని వ్యక్తిగత వివరాలు, ఫొటోలు ఇచ్చి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు సూచించారు. -
కారుణ్యం.. దారుణం..బట్టబయలు చేసిన మెటర్నిటీ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమనాలో..నిద్రమత్తు అనాలో కానీ..గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరుకు ఇదో మచ్చు తునక. ఓ మహిళ తనకు వివాహం కాలేదని చెప్పి..ఏకంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళాఉద్యోగి ఒకరు మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్మెంట్ నిమిత్తం చేసుకున్న దరఖాస్తును జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులు వాటిని చెల్లించే రాష్ట్రస్థాయి వైద్య విభాగానికి పంపించారు. ఫైలును పరిశీలించిన సదరు విభాగం మెటర్నిటీ ప్రయోజనాలను రెండు కాన్పుల వరకు మాత్రమే పొందే అవకాశం ఉందని, ఆమెకది నాలుగో కాన్పు అయినందున నిధులివ్వడం కుదరదని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫైలును తిప్పి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో..అసలు ఆమె ఉద్యోగంలో చేరడమే అక్రమ మార్గంలో చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకం కింద రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఆమె తనకు వివాహం కాలేదని పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు వినిపిస్తోంది. ఇప్పుడు మెటర్నీటీ ప్రయోజనం పొందేందుకు ఆస్పత్రి సేవల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు జతచేయడంతో వాటిని పరిశీలించిన సంబంధిత విభాగం నాలుగోకాన్పుగా గుర్తించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చునని, అమ్మాయిలైతే వివాహం కాని వారికి వర్తిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మిగతా సంతతి నిరభ్యంతరం కూడా అందుకు అవసరం.ఈ నేపథ్యంలో అసలు ఆమె నియామకమే అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంధ పాలన ఎన్నాళ్లు..? ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు ఎన్నాళ్లు అంధ పాలన సాగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్‌పై వచ్చి మూడేళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా.. ఆ తర్వాత సైతం జీహెచ్ఎంసీయే సొంత డిపార్ట్మెంట్లా పాతుకుపోయిన వారి విషయంలోనే ఏమీ చేయని ఉన్నతాధికారులు.. ఇతర విభాగాల్లోనూ వక్రమార్గాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
వెంటపడి మరీ ప్రేమించాడు...పెళ్లికి మాత్రం నో
బంజారాహిల్స్: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి చేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మేడ్చల్ పోలీసులు ఈ కేసును జీరో ఎఫ్ఐఆర్గా నమోదు చేసి తదుపరి విచారణకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివరాల్లోకి వెళ్తే... బంజారాహిల్స్ రోడ్ నెం.2లో నివసించే భాను ప్రకాశ్(21)కి 2020లో ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్యా పరిచయం కుదిరింది. ఇద్దరూ స్నేహితులయ్యారు. కొద్ది రోజులకే ఆ యువతితో పెళ్లి చేసుకుంటానంటూ చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు. చాలా రోజులుగా ఒత్తిడి తీసుకొస్తుండటంతో ఆమె చివరకు అంగీకరించింది. 2020 నవంబర్ 11న భాను ప్రకాశ్ బైక్‌పై ఆమె ఇంటికి వెళ్లి బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని తన గదికి తీసుకొచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా ఏడుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో భాను ప్రకాశ్ మరో యువతితో చాట్ చేస్తున్నాడని గమనించిన బాధిత యువతి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇందుకు నిరాకరించిన సదరు యువకుడు తనకు ఇప్పుడు పెళ్లి అవసరం లేదని, నువ్వు కూడా అవసరం లేదంటూ ముఖం మీద చెప్పేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: నెంబర్ మీదే.. కానీ.. వాడేది కేటుగాళ్లు) -
లోకేశ్ అనుచరుల మోసం
తాడేపల్లి రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌లకు అతి సన్నిహితంగా ఉండే టీడీపీ నేత మంజూష చౌదరి, హరిబాబు చౌదరి అనే దంపతులు అప్పు పేరిట ఓ యువజంట నుంచి రూ.35 లక్షలు తీసుకుని ఆనక టోకరా వేసిన ఉదంతం మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కృష్ణ అనే యువకుడు టీడీపీ అభిమాని. విజయవాడలోనే ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా, ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి అతి సమీపంలోనే ఉండే మంజూష, హరిబాబు చౌదరి దంపతులు.. కృష్ణ, అతని భార్య తేజస్వినితో పరిచయం పెంచుకున్నారు. చంద్రబాబు నివాసంలోనే తిరుగుతూ ఉండే ఆ దంపతులు చంద్రబాబు, లోకేశ్‌తో దిగిన ఫొటోలను చూపించి వారితో తమకెంతో సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇంటి వ్యవహారాలను తామే చూస్తామని నమ్మబలికారు. మూడున్నరేళ్ల క్రితం కృష్ణ, తేజస్విని నుంచి త్వరలోనే తిరిగి చెల్లిస్తామంటూ రూ.35 లక్షలు నగదు అప్పుగా తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగివ్వాలని అడిగినప్పుడల్లా వాయిదాలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీంతో కృష్ణ, తేజస్విని కలిసి మంగళవారం ఉండవల్లి చేరుకుని డబ్బు చెల్లించాలంటూ మంజూష చౌదరి, హరిబాబు చౌదరి ఇంటిముందు బైఠాయించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. డబ్బులు అడుగుతుంటే తిరిగివ్వడం లేదని, తాను బీసీని కాబట్టే తెలుగుదేశం పార్టీ నాయకులెవరూ ఈ విషయం గురించి పట్టించుకోవడం లేదని వాపోయారు. డబ్బులు ఇవ్వని పక్షంలో భార్యాభర్తలిద్దరం మంజూష చౌదరి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తన భార్య 7 నెలల గర్భవతి అని, ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కూడా డబ్బులు లేవని, కన్న కూతురుకి మూడు పూటలా అన్నం పెట్టలేకపోతున్నానని వాపోయారు. తాను కుదువబెట్టిన బంగారం కూడా వేలానికి వచ్చిందని తెలిపారు. టీడీపీ నాయకులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరాడు. టీడీపీ నేతల బెదిరింపులు తమకు రావాల్సిన డబ్బు కోసం మంజూష చౌదరి ఇంటిముందు కృష్ణ, తేజస్విని దంపతులు ధర్నా చేస్తున్నారని తెలుసుకున్న టీడీపీ నాయకులు రంగంలోకి దిగి వారిద్దరినీ బెదిరించారు. మీరు ఏం చేసినా ఉపయోగం లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోండని, లేకపోతే రిస్క్‌లో పడతారని బెదిరించడంతో కృష్ణ, తేజస్విని ఏడ్చుకుంటూ వెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై కృష్ణ దంపతులను వివరణ కోరగా.. తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని, అప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. -
'ఛీ'టింగ్ టీడీపీ నేతలు.. సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట
సాక్షి ప్రతినిధి విజయవాడ: గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ నాయకులు టిడ్కో ఇళ్ల పేరిట చేసిన గిమ్మిక్కులు ఫలించకపోగా ఇప్పుడు అవి వారి పాలిట శాపాలుగా మారాయి. తమ వద్ద వసూలు చేసిన నగదును తిరిగి ఇచ్చేయాలంటూ జనం ఆ పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. ఇందుకు టీడీపీ చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చీటింగ్ చేసి పేద ప్రజలకు శఠగోపం పెట్టారు. 6,500 ఇళ్లు కట్టేందుకు ప్రభుత్వం భూమి కేటాయించింది. అయితే ఏకంగా 11,917 మందికి అప్లికేషన్లు విక్రయించారు. ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ దండుకున్నారు. విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గ నాయకులు నియోజకవర్గానికి నాలుగు వేల చొప్పున అప్లికేషన్లు పంచుకుని విక్రయించి సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పంచాయితీ టీడీపీ నేతలకు తలనొప్పిగా మారింది. ‘బాదుడే బాదుడు’ పేరుతో ప్రజల్లోకి వెళ్తే తమను ఎక్కడ బాదుతారోనన్న భయం వెంటాడుతోంది. దీంతో డబ్బులు వసూలు చేసిన నాయకులు ఈ కార్యక్రమానికి ముఖం చాటేస్తు న్నారు. వారి నుంచి డబ్బులు ఇప్పించాలంటూ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. 6,500 ఇళ్లకే భూమి కేటాయింపు 2019 ఎన్నికల ముందు కేవలం 6,500 టిడ్కో ఇళ్లు నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం భూమి కేటాయించింది. ఆ పనులు చూపించి ఏకంగా 11,917 మంది అమాయక ప్రజల నుంచి నగదు జమ చేసుకుంది. 12 వేల ఇళ్ల నిర్మాణానికి సుమారు 140 నుంచి 160 ఎకరాల స్థలం అవసరం. అయితే షాబాదులో కేవలం 74 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం టిడ్కోకు అప్పగించింది. ఇచ్చిన భూమి కొండ ప్రాంతం కావడంతో ఇళ్ల నిర్మాణానికి కొండను తవ్వలేక అధికారులు, కాంట్రాక్టర్లు నానాయాతన పడ్డారు. చివరకు 6,576 ఇళ్లు నిర్మించారు. ఆ ఇళ్లను చూపి టీడీపీ ప్రభుత్వం 2019 జనవరి 17వ తేదీన విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించింది. నిర్మించిన ఇళ్లను బ్లాకులుగా విభజించినట్లు చూపి, స్లిప్పులపై బ్లాకు, ఇళ్ల నంబర్లు వేసి ప్రజలకు పంచింది. చదవండి: (వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్) అయితే ఆ ఇళ్లు అసలు లేవని తెలుసుకున్న బాధితులు తమ డబ్బు తిరిగి ఇచ్చేయాలని మూడేళ్లుగా టీడీపీ నాయకుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. టీడీపీ నాయకులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన ప్రజలు తమ నియోజకవర్గస్థాయి టీడీపీ నాయకులు, పెద్దల సమక్షంలో పంచాయితీలు పెట్టారు. డబ్బులు తిరిగిచ్చేందుకు గడువు విధించారు. ఆ గడువు ముగియడంతో కొంత మంది బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన టీఎన్టీయూసీ నాయకుడిపై అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే ముగ్గురు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ఇళ్లు నిర్మించకుండానే దోపిడీ విజయవాడలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, బొండా ఉమా, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కనుసన్నల్లో వారి అనుచరులు, టీడీపీ డివిజన్ ఇన్చార్జులు టిడ్కో ఇళ్ల పేరిట ప్రజల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. కనీసం స్థలం సేకరించకుండా, ఇళ్లు నిర్మించినట్లు, వాటిని బ్లాకులుగా విభజించినట్లు చూపి ప్రజలను నమ్మించారు. రూ.5 వేల అప్లికేషన్‌ను రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. చదవండి: (ఇళ్లపై కుళ్లు రాతలు!) సీఎం చొరవతో లబ్ధిదారులకు ఊరట టిడ్కో ఇళ్ల పేరుతో టీడీపీ నాయకులు చేసిన మోసాలకు తోడు, అప్పటి ప్రభుత్వం సైతం దరఖాస్తుదారులతో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు డీడీలు తీయించింది. ఈ మోసాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్ణయించారు. నిర్మాణంలో ఉన్న 6,576 ఇళ్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు పంపిణీచేసి, మిగిలిన 5,341 మంది బాధితులకు వారు డీడీలు తీసిన సొమ్మును తిరిగి వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేయించారు. అంతేకాకుండా బాధితులకు ఉచితంగా ఇంటి స్థలం ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్పయాత్రలో హామీ ఇచ్చిన విధంగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రెట్టింపు మేలు చేశారు. -
కుమార్తె కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని
సాక్షి, హైదరాబాద్: గూగుల్‌లో కాల్ సెంటర్ల నెంబర్లే కాదు... వివిధ సంస్థలూ బోగస్‌వి ఉంటున్నాయి. తన కుమార్తె కోసం డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాలని భావించిన అత్తాపూర్ వాసి ఇలాంటి సంస్థ వల్లోపడి రూ.లక్ష నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అత్తాపూర్‌కు చెందిన బాధితుడు (62) ఓఅపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో రిజిస్టర్ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు. దీనికోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన నెంబర్ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని నమ్మబలికారు. వెరిఫికేషన్ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్డాన్స్‌గా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు నివసించే అత్తాపూర్‌లోని అపార్ట్మెంట్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్ కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలని శనివారం నిర్ణయించారు. అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌లో ప్రేమ.. నెల్లూరుకు వచ్చి వెళ్తూ..
నెల్లూరు(క్రైమ్): ప్రేమ పేరిట వంచించాడని ఆర్ఎస్ఐపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు రోజులుగా పోలీసు అధికారులు రహస్య విచారణ సాగిస్తున్నారు. వివరాలు.. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి జిల్లాలో ఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అతను ఇంజినీరింగ్ చదివే సమయంలో హైదరాబాద్‌కు చెందిన సహచర విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఇంజినీరింగ్ పూర్తయిన అనంతరం ఉద్యోగ నిమిత్తం అతను హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఆ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు పోలీసుశాఖలో ఆర్ఎస్ఐగా ఉద్యోగం వచ్చింది. నెల్లూరులో విధులు నిర్వహిస్తూ ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. తరచూ ఆ యువతి నెల్లూరుకు వచ్చి వెళ్లేది. గత కొంతకాలంగా ఆమెను దూరంగా పెడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి వారి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆయన యువతిపై చేయిచేసుకోవడంతో ఆమె డయల్ 100కు కాల్ చేసింది. దర్గామిట్ట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సదరు అధికారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించగా ప్రేమ పేరిట వంచించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో దర్గామిట్ట పోలీసులు రెండు రోజులుగా గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే సదరు అధికారి వ్యవహార శైలిపై అనేక విమర్శలు ఉన్నాయి. ఆర్ఎస్ఐగా విధుల్లో చేరిన కొత్తలో ఓ యువతి ఇతని వ్యవహార శైలిపై అప్పటి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో తీవ్రస్థాయిలో అతన్ని వారు మందలించారని సమాచారం. చదవండి: (డాక్టర్ నీలిమపై ఎందుకంత ప్రేమ?) -
ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి..
సైదాబాద్(హైదరాబాద్): మాయమాటలు చెప్పి ఓ బాలికను పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖాజాబాగ్కు చెందిన బాలిక(13) ఆరోతరగతి చదువుతుంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా ఆటోలో వెళ్లినట్లు చూశామని స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. చదవండి: యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని.. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఆటో గౌరెల్లికి చెందిన శ్రీకాంత్‌కు చెందినదిగా గుర్తించారు. ఇన్‌స్ట్రాగాంలో బాలికతో పరిచయం కావడంతో శ్రీకాంత్ తరచూ ఆమె నివసించే ప్రాంతానికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో బాధితురాలికి మాయమాటలు చెప్పి గురువారం ఆటోలో తీసుకువెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం
రసూల్‌పురా (హైదరాబాద్): ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేసిన యువకుడిపై తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ శ్రవణ్‌కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి విలేజ్ దర్గా ప్రాంతానికి చెందిన యువతి లెక్చరర్‌గా పనిచేస్తుంది. 2017లో ఆమెకు అత్తాపూర్ కిషన్ బాగ్ ప్రాతానికి చెందిన దూరపు బంధువు నిహాల్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది గత ఏడాది జూలై 1న అత్తాపూర్ వెళ్లిన ఆమెను నిహాల్‌సింగ్ టెర్రస్ పైన ఉన్న గదికి రప్పించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా నిహాల్ సింగ్ పలుమార్లు లాడ్జీలకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా బాధితురాలు గత డిసెంబర్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పగా నిశ్చితార్థం జరిగినా తాను పెళ్లి చేసుకుంటానని నమ్మ బలికాడు. చదవండి: (అశ్లీలం.. విశృంఖలం!.. ఇంటర్నెట్లో రాజ్యమేలుతున్న పోర్న్ వెబ్సైట్లు) గత ఫిబ్రవరిలో ఆమెకు నిశ్చితార్థం జరగడంతో తనను వదిలివేయాలని కోరగా తనతో కలిసి ఉన్న వీడియోలు తీశానని తన కోరిక తీర్చకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేగాక కాబోయే భర్తకు కూడా పంపిస్తానని బెదిరించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేగాక నిహాల్ సూచన మేరకు పెళ్లి కూడా రద్దు చేసుకుంది. ఇటీవల తాను గర్భం దాల్చినట్లు గుర్తించిన బాధితురాలు పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడంతో ఈనెల 6న తల్లితో సహా తిరుమలగిరికి వచ్చిన నిహాల్ సింగ్ ఆమెను పెళ్లి చేసుకోనని తేల్చిచెప్పడంతో బాధితురాలు మంగళవారం తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బార్లో బాయ్‌ఫ్రెండ్ నిర్వాకం.. కారుతో తొక్కి చంపేసిన ప్రియురాలు
వాషింగ్టన్: యువతీయువకులు ప్రేమలో పడడం షరా మామూలే. అయితే ఇటీవల ట్రెండ్ చూస్తే అదే ప్రేమలో ఎవరో ఒకరు మోసపోవడం కూడా షరా మామూలుగానే మారిందనే చెప్పాలి. అయితే ఈ జాబితాలోని కొందరు మాత్రం ఆ బాధని మర్చిపోలేక నరకయాతన అనుభవిస్తుంటే మరికొందరు మాత్రం ప్రేమలో మోసం చేసిన వాళ్లు తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందేనంటూ ఏదో ఓ రూపంలో వారిపై కక్ష తీర్చుకుంటున్నారు. తాజాగా ఇదే తరహాలో ఓ యువతి ప్రియుడు చేసిన మోసానికి ఏకంగా అతడిని కారుతో తొక్కి చంపింది. అమెరికాలోని ఇండియానాపోలిస్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. అమెరికాలో ఉంటున్న ఆండ్రీ స్మిత్, గేలిన్ మోరిస్ ఇద్దరు ప్రేమికులు. అయితే ఇటీవల కొంత కాలంగా తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రీ ప్రవర్తనలో మార్పుని గమనించింది గేలన్. ఆండ్రీ తనను చీటింగ్ చేస్తున్నట్లు ఆమె అనుమానించింది. ఇంకేం క్లారిటీ కోసం ఆపిల్ ఫోన్లోని ఎయిర్ ట్యాగ్ ద్వారా అతడి కదలికలను ట్రాక్ చేసింది. అతను ఓ బార్లో ఉన్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లింది. బార్లో తన బాయ్‌ఫ్రెండ్ మరో అమ్మాయితో ఉండడం చూసి కోపంతో ఊగిపోయింది. ఖాళీ వైన్ బాటిల్‌తో ఆమెపై దాడి చేయబోగా స్మిత్ జోక్యం చేసుకున్నాడు. దీంతో బార్ సిబ్బంది ఆ ముగ్గురిని బయటకు పంపారు. కాగా, బార్ బయట స్మిత్‌పై మోరిస్ దాడి చేసింది. అంతటితో ఆగకుండా చేతులు కట్టేసి రోడ్డుపై పడేసింది. అనంతరం కారును అతడి మీదుగా నడిపింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన స్మిత్‌ని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా అప్పటికే అతను చనిపోయాడు. దీనికి కారకురాలైన ప్రియురాలు మోరిస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పబ్జీ దారుణం.. గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని -
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం
రామభద్రపురం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే పెళ్లికి ప్రియుడు నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘం సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఇంటి దొంగ గుట్టురట్టు.. అసలు సూత్రధారి బ్యాంకు మేనేజరే!) -
యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..
నెల్లూరు (క్రైమ్): ప్రేమ పేరిట యువతిని మోసగించిన వ్యక్తిపై చిన్నబజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మైపాడు గేట్ ప్రాంతానికి చెందిన మోహన్.. మనుమసిద్ధినగర్‌కు చెందిన ఓ యువతి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వివాహం చేసుకోవాలని మోహన్‌ను యువతి ఇటీవల నిలదీయడంతో ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై కేసు నమోదు చేశామని ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బాజీజాన్‌సైదా తెలిపారు. చదవండి: వైజాగ్ అల్లుడొచ్చాడు.. వస్తూనే సందడి చేశాడు.. -
ఆశ చూపించి.. ఉసూరుమనిపించి..
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): నిధుల సేకరణలో కమీషన్లు ఆశ చూపించి మా ప్రేమ సంస్థ యజమాని ముకుందా తమను మోసం చేశారంటూ ఓ వికలాంగ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంవీపీ కాలనీలోని మా ప్రేమ సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితుడు, వికలాంగుడైన ముద్దులు సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఏడాది క్రితం వరకు మా ప్రేమ సంస్థలో వలంటీర్‌గా పని చేశానన్నారు. చారిటీ పేరిట సేకరించిన నిధుల్లో ప్రతి రోజు సగం కమిషన్‌గా ఇస్తానని సంస్థ అధినేత ముకుందా నమ్మబలికాడన్నారు. దీంతో తెన్నేటి పార్కు నుంచి ఆర్కే బీచ్ వరకు పర్యాటకుల నుంచి రోజూ రూ.2 వేలు నుంచి రూ.3 వేలు వరకు సేకరించి ముకుందాకు ఇచ్చేవాడినన్నారు. కొన్ని రోజులు కమీషన్ సక్రమంగానే ఇచ్చిన ముకుందా.. తరువాత ఆపేశారని ఆరోపించారు. దీనికి తోడు జాలరిపేటకు చెందిన పలువురు మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని నమ్మబలికి, వారి నుంచి డిపాజిట్ కింద రూ.3 వేలు తీసుకోవాలని తనకు సూచించాడన్నారు. దీంతో పదుల సంఖ్యలో మహిళల నుంచి నిధులు సేకరించినట్లు తెలిపారు. అయితే వారికి ఎలాంటి రుణాలు ఇవ్వకపోవడంతో వారిలో కొందరు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని సంతోష్‌కుమార్ తెలిపారు. డబ్బులు విషయంపై ప్రశ్నించడంతో తనను వలంటీర్‌గా తొలగించాడన్నారు. న్యాయం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఎంవీపీ పోలీసు స్టేషన్లో ముకుందాపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఇప్పటికైనా ముకుందాపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. (చదవండి: అలలపై కలల నావ..!)