
మా అందరి పూర్వ జన్మ సుకృతం
దుడ్డు సత్య వేంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ కంచి కామకోటి పీఠాధిపతి శిష్యునిగా అవుతూండటం మా పూర్వజన్మ సుకృతం. మేము తొమ్మిది మంది అన్నదమ్ములం. ఆరుగురు చెల్లెళ్లు. గణేష్ శర్మ మా రెండో సోదరి భళ్లమూడి భాస్కరం, సూర్యనారాయణ దంపతుల కుమార్తె కొడుకు. అతడి తండ్రి ధన్వంతరి, తల్లి మంగాదేవి. గణేష్‌ను నా చేతుల మీద పెంచాను. అతడి విద్వత్తు చూసి కంచి పీఠానికి తీసుకుని వెళ్లి, నాలుగు వేదాలు, ఉపనిషత్తులు నేర్పించారు.
– నాగాభట్ల కామేశ్వరశర్మ,
వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు, అన్నవరం దేవస్థానం

మా అందరి పూర్వ జన్మ సుకృతం