
అక్షయ తృతీయ (Akshaya Tritiya 2025) పర్వదినం అనగానే అందరికీ గుర్తు వచ్చేది బంగారం. నిజానికి ఈ పండుగను లక్ష్మీదేవి( Lakshmi Devi )కి సంబంధించిన వేడుకగా భావిస్తారు. అక్షయ తృతీయ రోజున కుబేరుడిని కూడా పూజిస్తారు. అలాగే ఈ రోజు తమ తాహతుకు తగ్గట్టు ఎంతో కొంత బంగారం( Gold) వెండి( Silver ) వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవాలని, ఇది తమకు చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. తద్వారా ఏడాదంతా తమ ఇల్లు శుభప్రదంగా ఆర్థికంగా కళకళలాడుతుందని నమ్మకం.
ఇదీ చదవండి: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!
వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకుంటాం.అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే నాశనం లేకుండా ఉంటాయని నమ్మకం. . నిజానికి ఒకపుడు అక్షయ తృతీయ, బంగారం కొనుగోళ్లుపై పెద్దగా ప్రాచుర్యం ఉండేది కాదు. కానీ ఇటీవలి కాలంలో అక్షయ తృతీత సందడి బాగా పెరిగింది. దీనికి తగ్గట్టు జ్యుయల్లరీ వ్యాపారులు కూడా పలు రకాల ఆఫర్లతో ఆకర్షింటారు.దీంతోపాటు, అక్షయ తృతీయ ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవాలనుకునేవారు తమ రాశి ప్రకారం కొనుగోలు చేస్తే మంచిదని పండితులు చెబుతున్నమాట.
ఈ ఏడాది అక్షయ తృతీయ ముహూర్తం వివరాలు
పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్షయ తృతీయ తిథి ఏప్రిల్ 29 సాయంత్రం 5:29 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా ఉదయ తిథినే ప్రామాణికంగా భావిస్తాం కాబట్టి , ఈ సమయంలో ఏ వ్రతమైనా, పూజ అయినా ఆచరించవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున శ్రేయస్సుకు చిహ్నమైన బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవాలని భావిస్తారు. అయితే ప్రస్తుతం పసిడి ధర కొండెక్కి కూచున్న నేపథ్యంలో ఇతర వస్తువులను అయినా కొనుగోలు చేయవచ్చు. అలాగే దానధర్మాలు చేయాలని కూడా పెద్దలు చెబుతారు. అయితే ఏదైనా కొనుగోలు చేసేందుకు శుభ సమయం వచ్చేసి ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.
అక్షయ తృతీయ- బంగారం కొనడానికి శుభ సమయాలు
ఏప్రిల్ 29 మంగళవారం బంగారం కొనుగోలు సమయాలు - 05:31 PM నుండి 04:38 AM వరకు
ఏప్రిల్ 30న ఉదయం 6:11 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు.