
వైశాఖమాసం, శుక్ల పక్ష తృతీయ నాడు జరుపుకునే నాడు జరుపుకునే అక్షయ తృతీయ అంటే ఆ సందడే వేరు. ఈ ఏడాది ఏప్రిల్ 30న అక్షయ తృతీయ పండుగ జరుపుకోనున్నారు. ఈ రోజున చేసే ఏ పని అయినా అక్షయం అవుతుందని, ఇంట్లో సిరిసంపదలు నిండుగా ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే ఈ పవిత్రమైన రోజున బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భావిస్తారు. అందుకే గోరంతైనా బంగారమో, వెండో కొనుగోలు చేయాలని ఆశపతారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు అక్షయ తృతీయను అనేది ప్రగాఢ విశ్వాసం.

భారతీయులకు బంగారం అంటే లక్ష్మదేవి అంత ప్రీతి. ఇక అక్షయ తృతీయ అనగానే బంగారు నగల్ని సొంతం చేసుకోవాలని ఆశపడతారు. బంగారం కొనుగోళ్లు భారతీయులకు అక్షయ తృతీయ వేడుకలలో అంతర్భాగం. కానీ ఇటీవలికాలంలో బంగారం ధరలు ఆకాశన్నంటేంతగా ఎగిసి అందనంటున్నాయి. ఇప్పుడు 24 క్యారెట్ల నస్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. లక్షకు సమీపంలో ఉంది. ఈ క్రమంలో గత పదేళ్లలో బంగారం ధరల్లో మార్పు గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో 11 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో పుంజుకోవడం గమనార్హం.2014లో అక్షయ తృతీయ నాడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకురూ. 30,182 వద్ద ఉండగా అదే 2025 నాటి ధరలను గమనిస్తే ఏకంగా 218 శాతం పెరిగి రూ. 95,900 కు చేరుకుంది. ఈ ఒక్క సంవత్సరం 2025లోనే ఇప్పటివరకు బంగారం ధర ఏకంగా 30 శాతానికి పైగా పుంజుకుంది.
ఇదీ చదవండి : Akshaya Tritiya 2025 : శుభ సమయం, మంగళవారం గోల్డ్ కొనొచ్చా?
కేవలం 1942లో క్విట్ ఇండియా సమయంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.44గా ఉంది. 1947లో రూ.రూ.88.62 రెట్టింపు అయింది. ఇక తరువాత తగ్గడం అన్న మాట లేకుండా సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. స్వాతంత్ర్యం తరువాత మొదలైన బంగారం ధర పెరుగుదల అలా అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. స్వాతంత్ర్యం తర్వాత బంగారం ధరలో అతిపెద్ద పతనం 1964లో జరిగింది. ఆ సమయంలో 10 గ్రాముల బంగారం రూ.63.25 మాత్రమే.
పదేళ్లలో పసిడి పరుగు
బంగారం ధర 10 సంవత్సరాలలో రూ. 68,500 పెరిగింది. 2015లో అక్షయ తృతీయకు నాటి ధరలతో పోలిస్తే నేటికి HDFC సెక్యూరిటీస్ డేటా ప్రకారం, గత 10 సంవత్సరాలలో బంగారం ధరలు రూ. 68,500 కంటే ఎక్కువ పెరిగాయి.
2019లో అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసి ఉంటే, అప్పుడు ధరలు 10 గ్రాములకు రూ.31,729గా ఉంది. అంటే అప్పటి పెట్టుబడిపై 200 శాతం పుంజుకున్నట్టే. గత ఏడాది అక్షయ తృతీయ నుండి పుత్తడి 30 శాతానికి పైగా ర్యాలీ అయింది. 2024లో 10 గ్రాముల రూ. 73,240 వద్ద ఉంది. 2024 మధ్యకాలం నుండి బంగారం ధరలు విపరీతంగా పుంజుకున్నాయి. దాదాపు 22 శాతం పెరిగి రూ. 73,240 వద్దకు చేరాయి.
చదవండి: Vaibhav Suryavanshi Success Story: తండ్రి త్యాగం, పట్టుదలతో 13 ఏళ్లకే కోటీశ్వరుడు.. ఇదీ టాలెంట్!

హై నుంచి కాస్త తగ్గే అవకాశం, కానీ
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోడీ “చాలావరకు డిమాండ్ ,సరఫరా కారకాలు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపలేదు. ముఖ్యంగా మార్కెట్లో అధిక అనిశ్చితులు ఉన్న సందర్భంలో. గత రెండు నెలలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి. అందువల్ల ధరల్లో కొత్త తగ్గుదల కనిపించవచ్చు. అయితే బంగారం ధరలకు సానుకూలతలు , ప్రతికూలతలు రెండూ ఉన్నాయి, మిశ్రమ ఆర్థిక డేటా పాయింట్లు, సుంకాల యుద్ధం, అధిక ద్రవ్యోల్బణ అంచనాలు, నెమ్మదించిన వృద్ధి ఆందోళనలు, రేటు తగ్గింపు అంచనాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న రుణాలు లాంటి బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.