Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Ratna BJP After Siddaramaiah Remark1
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’

బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్‌ శాంతిప్రియ దేశం. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్‌ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప.

ODI Tri-Nation Series: India starts campaign with nine-wicket win2
INDw Vs SLw: శ్రీలంక‌ను చిత్తు చేసిన టీమిండియా..

శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో భార‌త్ శుభారంభం చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవ‌ర్ల‌కు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 38.1 ఓవ‌ర్ల‌లో 147 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇండియ‌న్ స్పిన్న‌ర్ స్నేహ్ రాణా మూడు వికెట్లు ప‌డ‌గొట్టి లంక ప‌త‌నాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తీ శ‌ర్మ‌, న‌ల్ల‌పు రెడ్డి చ‌ర‌ణి త‌లా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాట‌ర్ల‌లో హ‌స‌నీ పెరీరా(30) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. కవిషా దిల్హారి(25), సంజీవ‌నీ(22) రాణించారు. కెప్టెన్ ఆత‌ప‌ట్టు(7)తో స‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. అనంత‌రం 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే కోల్పోయి 29.4 ఓవ‌ర్ల‌లో చేధించింది.భార‌త బ్యాట‌ర్ల‌లో ప్ర‌తీక రావ‌ల్‌(50 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీతో మెరవ‌గా.. మంధాన(43), డియోల్‌(48 నాటౌట్‌) రాణించారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో ర‌ణ‌వీర ఒక్క వికెట్ సాధించారు. టీమిండియా త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న కొలంబో వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో త‌ల‌ప‌డ‌నుంది.చ‌ద‌వండి: IPL 2025: ముంబై ఓపెన‌ర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచ‌రీ

Ramakrishna Rao Is The New Cs Of Telangana3
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్‌ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్‌ కానున్నారు.

Brs Silver Jubilee Meeting Elkathurthy Warangal Updates4
కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ

ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్‌👉కాసేపట్లో సభా ప్రాంగణానికి కేసీఆర్‌సభ ఏర్పాట్లు ఇలా..👉కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ👉బీఆర్‌ఎస్‌ కటౌట్లు,ఫ్లెక్సీలతో వరంగల్‌ ఎల్కతుర్తి గులాబీమయం👉సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు👉మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు👉 ప్రధాన వేదికపై సీటింగ్‌: 500 మందికి 👉వాహనాల పార్కింగ్‌ : 1,059 ఎకరాలు 👉సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్‌ బాటిళ్లు: 10.80 లక్షలు👉మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు 👉సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు👉మెడికల్‌ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ట్రాఫిక్, పార్కింగ్‌ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం👉ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం👉వరంగల్ ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం👉ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.👉రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం👉ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.👉తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్‌ఎస్‌గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్‌ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్‌ఎస్‌ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.👉14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పారీ్టగా ప్రస్థానం సాగించిన బీఆర్‌ఎస్‌.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్‌ఎస్‌ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు.👉సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్‌.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్‌ పారీ్టయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్‌ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్‌ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.👉అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్‌.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్‌లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.👉2024 మార్చి 31న తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్‌ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్‌.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రకటించే భవిష్యత్‌ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.👉రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్‌పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్‌ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.👉సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్‌ హెలికాప్టర్‌లో వస్తారని పారీ్టవర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్‌ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.

Baisaran Reels Videographer Who Recorded Entire Pahalgam Attack5
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..

శ్రీనగర్‌: అందాల కశ్మీరంలోని పహల్గాం బైసారన్‌ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.. ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. అయితే, బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడికి సంబంధించి అత్యంత కీలక సాక్షిగా నిలిచాడు. ఈ దాడి మొత్తాన్ని అతడు కెమెరాలో బంధించగా, కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్‌ఐఏ చేతికి చిక్కింది.ఈ స్థానిక వీడియో గ్రాఫర్‌ కాల్పులు ప్రారంభమైనప్పుడు తన ప్రాణ రక్షణ కోసం పరిగెత్తి, బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టుపైకి ఎక్కాడు. దాడి జరిగిన సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని ఘటన మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు చేస్తోంది.వీడియో గ్రాఫర్‌ విచారించిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆయన వద్ద నుంచి ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ముందగా ఇద్దరు ఉగ్రవాదులు.. పర్యాటకులను ముస్లిం మతాచారాన్ని పాటించమంటూ బెదిరించారు. అనంతరం నలుగురిని కర్కశంగా కాల్చి చంపారు.ఘటనా స్థలంలో ఏకే-47, ఎం4 రైఫిల్‌ ఖాళీ తూటాలను గుర్తించారు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు సెల్‌ఫోన్లు కూడా లాక్కునట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వాటిని ట్రాక్‌ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉంది. అయితే, దాడి తర్వాత నుంచి స్విచ్ఛాఫ్‌ అయినట్లు అధికారులు గుర్తించారు.

Titanic Survivor Letter Sold For Over Rs 3 Crore At Auction In UK6
టైటానిక్‌ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది

టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ప్రయాణికుడు (కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ) రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో.. సుమారు రూ. 3.4 కోట్లకు అమ్ముడైంది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు 'కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ' రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి రాసినట్లు తెలుస్తోంది. ఇందులో "ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి" అని ఉంది.1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయిన తరువాత సుమారు 1500 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. 1913లో ఈయన మరణించిన తరువాత.. ప్రచురించబడిన తన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆ పుస్తకంలో.. ఓడ మునిగిపోయిన తర్వాత, మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్‌ను ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. మొదట లైఫ్ బోట్ చేరుకున్న వారిలో సగానికి పైగా అలసట లేదా చలి కారణంగా మరణించారని ఆయన రాశారు.కల్నల్ గ్రేసీ ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ, అతితక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గాయాల వల్ల ఆరోగ్యం పాడైంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్యలతో.. డిసెంబర్ 1912లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఈ లేఖ భారీ మొత్తానికి అమ్ముడైంది.

Merugu Nagarjuna Says Chandrababu Govt Neglecting Students Welfare7
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’

సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్‌ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్‌ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్‌ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్‌కిన్‌ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్‌ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

What Happened Wife And Husband Suspicious Death In Vishakha8
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?

విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్‌నగర్‌ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్‌ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్‌) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్‌ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్‌ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్‌ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్‌ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

What Happens When You Leave Your Bank Account Unused9
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి

సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి.

Pak Minister Hanif Abbasi Open Threat To India10
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్‌ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్‌ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్‌ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్‌ ఇండస్ వాటర్‌ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement