
‘‘పురుషోత్తం– హి, ది విక్టిమ్ ఆఫ్ స్పైడర్స్ అండ్ ప్రెజర్ కుకర్స్’ నాటకం తెలియని నాటక ప్రియులు ఉండరేమో! ఒక నేరస్థుడు ఏమాత్రం అపరాధ భావన, పశ్చాత్తాపం లేకుండా తను చేసిన నేరం గురించి చెప్పేదే ఆ నాటకం. ఇది న్యూజర్సీ, రట్గర్స్ యూనివర్సిటీలో బీఎఫ్‌ఏ, ఎమ్‌ఎఫ్‌ఏప్రోగ్రామ్‌లో భాగమైంది. దీనికోసం అయిదు ఖండాల నుంచి ఒక్కో నాటకాన్ని తీసుకున్నారు.
ఆసియా నుంచి ఆ గౌరవం ఈ నాటకానికి దక్కింది. రచయిత.. అంజలి పార్వతి కోడా! ఆమె తన పద్దెనిమిదో ఏట ఆ నాటకాన్ని రాశారు. సాధారణంగా మనది సినిమాలే ప్రధానమైన సమాజం కాబట్టి నాటకాల గురించి, నాటక రచయితల గురించి అంతగా తెలియదు. అందుకే ప్లే రైట్, స్టాండప్ కమెడియన్, రైటర్, డైరెక్టర్, ‘సమాహార’ థియేటర్ కోఫౌండర్ అంజలి పార్వతి కోడాను పరిచయం చేస్తున్నాం.
సందర్భం.. ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సమాహార’ థియేటర్ గ్రూప్ నాటినుంచి నేటి వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్, రవీంద్రభారతిలో నాటకాలను ప్రదర్శించనుంది.
అంజలి పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే! సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్ చదివారు. వాళ్ల నాన్న మోహన్ కోడా (ఇప్పుడు లేరు) యాడ్ అండ్ ఫిల్మ్ మేకర్. ఆమె మీద తండ్రి ప్రభావం చాలా ఉంది. అంజలి చిన్నప్పుడు వాళ్ల కుటుంబం.. తమ కోసమే ఒక మ్యాగజీన్ నడిపేది. అందులో ఆమె కామిక్ స్ట్రిప్స్ రాసేవారు. తండ్రి పుస్తక పఠనాన్నిప్రోత్సహించేవారు. అందులో రోజుకో బుక్‌తో అంజలిది ట్రాక్ రికార్డ్. ఇంటర్ నుంచే ఆమె సీరియల్స్, టెలీఫిల్మ్స్‌కు పనిచేయడం మెదలుపెట్టారు. డిగ్రీకి వచ్చేసరికి ఒక వెబ్‌సైట్‌లో ఉద్యోగంలో చేరారు. సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేసేవారు. దాంతో ఆమెకు సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.
సమాహార... అంజలి ఒకసారి వాళ్ల నాన్నను ‘యాక్టర్స్‌ని ఎలా డైరెక్ట్ చేయాలో నేర్పించండి’ అని అడిగారు. ‘అది తెలుసుకోవాలంటే ముందు నువ్వు రంగస్థలం మీద పనిచేయాలి’ అని చె΄్పారాయన. అప్పుడే రత్న శేఖర్ రెడ్డి (అంజలి భర్త, సమాహార కోఫౌండర్) న్యూయార్క్‌లో థియేటర్, ఫిల్మ్ స్టడీస్ చేసి వచ్చారు. అతను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కొంతమంది కలిసి నాటకాలు వేస్తున్నారు. అందులో అంజలి కూడా జాయిన్ అయ్యారు. అప్పుడే అంజలి ఒక సోలో ప్లే రాసి రత్న శేఖర్‌కు ఇచ్చారు. దాంతోనే ‘సమాహార’ స్టార్ట్ అయ్యి.. కొనసాగుతోంది.
స్టాండప్ కామెడీ.. సినిమా... అంజలి అమెరికన్ స్టాండప్ కామెడీ షోస్‌ను బాగా ఫాలో అయ్యేవారు. హాస్య నాటకాలు ఎక్కువగా రాసేవారు. 2013ప్రాంతంలో ‘సమాహార కామెడీ నైట్స్’ని స్టార్ట్ చేశారు. అందులో నాలుగైదు నాటికలు ప్రదర్శించేవారు. నాటకానికి నాటకానికి మధ్య అంజలి కామెడీగా ఒక స్టోరీ చెబుతూ ఆ నాటకాలను పరిచయం చేసేవారు. అలా ఆమె స్టాండప్ కమేడియన్‌గానూ మారారు. సినిమా డైరెక్షన్ అంటే అంజలికి చాలా ఇష్టం. నాటక రంగానికి వచ్చిందే సినిమా డైరెక్షన్ కోసం. అందుకే సినిమా వైపు అడుగులు వేశారు.
ఎక్స్‌పరిమెంట్స్ జరగాలి..
‘ఎన్నో నాటకాలు, నలభై యాభై యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసుంటాను. కార్పొరేట్ నాటకాలు కూడా రాస్తుంటాను. ఈ మొత్తంలో నాకు అర్థమైంది మన లిటరేచర్ అప్‌డేట్ కావాలని. జెన్ జీకి సరిపోయే కంటెంట్ రావాలి. థియేటర్‌లో అయితే ఇప్పటికీ 60, 70ల్లో రాసిన నాటకాలనే వేçస్తున్నాం. సినిమా విషయానికి వస్తే తమిళంలోనో.. మలయాళంలోనో వస్తే దాన్ని అప్రిషియేట్ చేసి, ఆ రైట్స్ కొనుక్కుని ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం. కానీ తెలుగులో ఆలా రాస్తే మాత్రం ఇష్టపడరు. సినిమా రంగంలో మహిళల అవకాశాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మగవాళ్ల కన్నా రెండింతలు కష్టపడితే కానీ గుర్తింపు రాదు.
అదీగాక ఇది అనార్గనైజ్డ్ సెక్టార్. సేఫ్టీ, ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటినీ ఓవర్‌కమ్ చేయడానికి నేనొక అబ్బాయిలా బిహేవ్ చేశాను. వర్కవుట్ అవలేదు. ఒకటి మాత్రం గ్రహించాను.. సబ్జెక్ట్, మేకింగ్ మీద క్లారిటీ ఉంటే అమ్మాౖయెనా.. అబ్బాౖయెనా రెస్పెక్ట్ ఇస్తారు. సో నాకు ఆ క్లారిటీ ఉంది. కాబట్టి నా ఐడెంటిటీతోనే చాన్సెస్ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. టాలెంట్‌కు బోలెడంత స్కోప్ ఉంది. యంగ్‌స్టర్స్ రావాలి. ఎక్స్‌పరిమెంట్స్ జరగాలి. ఏ క్రియేటివ్ మీడియ్‌లోకైనా అన్ని క్రాఫ్ట్స్‌లో అమ్మాయిల ప్రవాహం ఉండాలి. యు కాంట్ అలో మెన్ టు రైట్ ఫర్ విమెన్.. అబౌట్ విమెన్.. హౌ విమెన్ షుడ్ బీ!’
– అంజలి పార్వతి కోడా