drama
-
నాటక సమాహార
‘‘పురుషోత్తం– హి, ది విక్టిమ్ ఆఫ్ స్పైడర్స్ అండ్ ప్రెజర్ కుకర్స్’ నాటకం తెలియని నాటక ప్రియులు ఉండరేమో! ఒక నేరస్థుడు ఏమాత్రం అపరాధ భావన, పశ్చాత్తాపం లేకుండా తను చేసిన నేరం గురించి చెప్పేదే ఆ నాటకం. ఇది న్యూజర్సీ, రట్గర్స్ యూనివర్సిటీలో బీఎఫ్ఏ, ఎమ్ఎఫ్ఏప్రోగ్రామ్లో భాగమైంది. దీనికోసం అయిదు ఖండాల నుంచి ఒక్కో నాటకాన్ని తీసుకున్నారు. ఆసియా నుంచి ఆ గౌరవం ఈ నాటకానికి దక్కింది. రచయిత.. అంజలి పార్వతి కోడా! ఆమె తన పద్దెనిమిదో ఏట ఆ నాటకాన్ని రాశారు. సాధారణంగా మనది సినిమాలే ప్రధానమైన సమాజం కాబట్టి నాటకాల గురించి, నాటక రచయితల గురించి అంతగా తెలియదు. అందుకే ప్లే రైట్, స్టాండప్ కమెడియన్, రైటర్, డైరెక్టర్, ‘సమాహార’ థియేటర్ కోఫౌండర్ అంజలి పార్వతి కోడాను పరిచయం చేస్తున్నాం. సందర్భం.. ఏప్రిల్ 16 తెలుగు నాటకరంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సమాహార’ థియేటర్ గ్రూప్ నాటినుంచి నేటి వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్, రవీంద్రభారతిలో నాటకాలను ప్రదర్శించనుంది.అంజలి పుట్టి, పెరిగింది హైదరాబాద్‌లోనే! సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్‌లో మాస్ కమ్యూనికేషన్ చదివారు. వాళ్ల నాన్న మోహన్ కోడా (ఇప్పుడు లేరు) యాడ్ అండ్ ఫిల్మ్ మేకర్. ఆమె మీద తండ్రి ప్రభావం చాలా ఉంది. అంజలి చిన్నప్పుడు వాళ్ల కుటుంబం.. తమ కోసమే ఒక మ్యాగజీన్ నడిపేది. అందులో ఆమె కామిక్ స్ట్రిప్స్ రాసేవారు. తండ్రి పుస్తక పఠనాన్నిప్రోత్సహించేవారు. అందులో రోజుకో బుక్‌తో అంజలిది ట్రాక్ రికార్డ్. ఇంటర్ నుంచే ఆమె సీరియల్స్, టెలీఫిల్మ్స్‌కు పనిచేయడం మెదలుపెట్టారు. డిగ్రీకి వచ్చేసరికి ఒక వెబ్సైట్లో ఉద్యోగంలో చేరారు. సినిమా రివ్యూలు, ఇంటర్వ్యూలు చేసేవారు. దాంతో ఆమెకు సినిమా మీద ఆసక్తి ఏర్పడింది.సమాహార... అంజలి ఒకసారి వాళ్ల నాన్నను ‘యాక్టర్స్‌ని ఎలా డైరెక్ట్ చేయాలో నేర్పించండి’ అని అడిగారు. ‘అది తెలుసుకోవాలంటే ముందు నువ్వు రంగస్థలం మీద పనిచేయాలి’ అని చె΄్పారాయన. అప్పుడే రత్న శేఖర్ రెడ్డి (అంజలి భర్త, సమాహార కోఫౌండర్) న్యూయార్క్‌లో థియేటర్, ఫిల్మ్ స్టడీస్ చేసి వచ్చారు. అతను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కొంతమంది కలిసి నాటకాలు వేస్తున్నారు. అందులో అంజలి కూడా జాయిన్ అయ్యారు. అప్పుడే అంజలి ఒక సోలో ప్లే రాసి రత్న శేఖర్‌కు ఇచ్చారు. దాంతోనే ‘సమాహార’ స్టార్ట్ అయ్యి.. కొనసాగుతోంది.స్టాండప్ కామెడీ.. సినిమా... అంజలి అమెరికన్ స్టాండప్ కామెడీ షోస్‌ను బాగా ఫాలో అయ్యేవారు. హాస్య నాటకాలు ఎక్కువగా రాసేవారు. 2013ప్రాంతంలో ‘సమాహార కామెడీ నైట్స్’ని స్టార్ట్ చేశారు. అందులో నాలుగైదు నాటికలు ప్రదర్శించేవారు. నాటకానికి నాటకానికి మధ్య అంజలి కామెడీగా ఒక స్టోరీ చెబుతూ ఆ నాటకాలను పరిచయం చేసేవారు. అలా ఆమె స్టాండప్ కమేడియన్గానూ మారారు. సినిమా డైరెక్షన్ అంటే అంజలికి చాలా ఇష్టం. నాటక రంగానికి వచ్చిందే సినిమా డైరెక్షన్ కోసం. అందుకే సినిమా వైపు అడుగులు వేశారు. ఎక్స్పరిమెంట్స్ జరగాలి..‘ఎన్నో నాటకాలు, నలభై యాభై యాడ్స్, కార్పొరేట్ ఫిల్మ్స్ చేసుంటాను. కార్పొరేట్ నాటకాలు కూడా రాస్తుంటాను. ఈ మొత్తంలో నాకు అర్థమైంది మన లిటరేచర్ అప్డేట్ కావాలని. జెన్ జీకి సరిపోయే కంటెంట్ రావాలి. థియేటర్లో అయితే ఇప్పటికీ 60, 70ల్లో రాసిన నాటకాలనే వేçస్తున్నాం. సినిమా విషయానికి వస్తే తమిళంలోనో.. మలయాళంలోనో వస్తే దాన్ని అప్రిషియేట్ చేసి, ఆ రైట్స్ కొనుక్కుని ఇక్కడ రిలీజ్ చేసుకుంటాం. కానీ తెలుగులో ఆలా రాస్తే మాత్రం ఇష్టపడరు. సినిమా రంగంలో మహిళల అవకాశాల గురించి మాట్లాడాల్సి వస్తే.. మగవాళ్ల కన్నా రెండింతలు కష్టపడితే కానీ గుర్తింపు రాదు. అదీగాక ఇది అనార్గనైజ్డ్ సెక్టార్. సేఫ్టీ, ఇమేజ్ ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటినీ ఓవర్‌కమ్ చేయడానికి నేనొక అబ్బాయిలా బిహేవ్ చేశాను. వర్కవుట్ అవలేదు. ఒకటి మాత్రం గ్రహించాను.. సబ్జెక్ట్, మేకింగ్ మీద క్లారిటీ ఉంటే అమ్మాౖయెనా.. అబ్బాౖయెనా రెస్పెక్ట్ ఇస్తారు. సో నాకు ఆ క్లారిటీ ఉంది. కాబట్టి నా ఐడెంటిటీతోనే చాన్సెస్ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. టాలెంట్‌కు బోలెడంత స్కోప్ ఉంది. యంగ్‌స్టర్స్ రావాలి. ఎక్స్పరిమెంట్స్ జరగాలి. ఏ క్రియేటివ్ మీడియ్లోకైనా అన్ని క్రాఫ్ట్స్‌లో అమ్మాయిల ప్రవాహం ఉండాలి. యు కాంట్ అలో మెన్ టు రైట్ ఫర్ విమెన్.. అబౌట్ విమెన్.. హౌ విమెన్ షుడ్ బీ!’– అంజలి పార్వతి కోడా -
అంతర్జాతీయ బాలల నాటకోత్సవం.. ముఖ్య అతిథిగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా
నాటకరంగంలో బాల బాలికల ప్రతిభను పెంపొందించేందుకు అంతర్జాతీయ బాలల నాటక ఉత్సవం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో ప్రముఖ నటనా శిక్షణ సంస్థ "నిశుంబితా స్కూల్ ఆఫ్ డ్రామా" హైదరాబాద్‌లో మొదటిసారిగా ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, నటుడు అనీష్ కురువిల్ల, డైరెక్టర్లు వినయ్ వర్మ, వెంకట్ గౌడ, రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో కోల్ కతా, భోపాల్, కేరళ ప్రాంతాలతో పాటు నేపాల్, జపాన్ తదితర దేశాల్లోని కళాకారులు, నాటక బృందాలు సైతం పాల్గొంటున్నాయి.ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ రవీంద్రభారతి ఆడిటోరియంలో ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. థియేటర్, స్టోరీ టెల్లింగ్, నాటక ప్రదర్శనలతో చిన్నారులను అలరించే ఓ అద్భుతమైన వేదికగా ఈ నాటక ఉత్సవం నిలవనుంది. కొత్తతరం కళాకారుల్లో సృజనాత్మకత, సాంస్కృతిక విలువలను పెంపొందించే ఈ వేదికపై వీక్షకులను మంత్రముగ్ధులను చేసే నాటకాలు ఈవెంట్లో ప్రదర్శించనున్నారు. -
‘రికార్డు’ స్థాయి నాట్యం
శంషాబాద్ రూరల్ (హైదరాబాద్): మూడు వేల మంది చిన్నారులు.. నర్తించిన వివిధ నృత్య రూపకాలు నాలుగు రికార్డులను నమోదు చేశాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శివారులోని సమతాస్ఫూర్తి కేంద్రం ఇందుకు వేదిక గా మారింది. సమతాకుంభ్–2025 తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఘంటసాల పవన్‌కుమార్ ఆధ్వర్యంలో మూడు వేల మందితో మహాబృందం చే సిన నాట్యం ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాలల చిన్నారులు వివిధ నృత్య రూపకాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇండియన్ వరల్డ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నృత్య గోల్డెన్ స్టార్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌ను నమోదు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చిన్నారులకు మంగళశాసనాలు అందజేశారు. -
పవన్ మరో కొత్త డైవర్షన్ డ్రామా
-
యాభైఏళ్ల రాజీనామా
కొణిదెల శివ శంకర వరప్రసాద్.... ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. హీరో చిరంజీవి అసలు పేరు ఇదే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాగా శివ శంకర వరప్రసాద్‌గా రంగస్థలంపై ‘రాజీనామా’ అనే నాటకంతో మొదలైన ఆయన నట ప్రస్థానం యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఓ ఫొటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, ‘‘1974లో నర్సపూర్‌లోని వైఎన్ఎమ్ కళాశాలలో బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నప్పుడు రంగస్థలం మీద నేను వేసిన తొలి నాటకం ‘రాజీనామా’. కోన గోవిందరావుగారు రచించారు. నాకు నటుడిగా తొలి గుర్తింపు ఇచ్చింది ‘రాజీనామా’. అది కూడా బెస్ట్ యాక్టర్‌గా అవార్డు రావడం ఎనలేని ప్రోత్సాహం ఇచ్చింది. 1974–2024... యాభై సంవత్సరాల నట ప్రస్థానం ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది’’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఇదిలా ఉంటే.. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్ళు’. ఈ సినిమాకి గూడ΄ాటి రాజ్‌కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు’ సినిమా మొదట రిలీజ్ అయింది. ప్రాణం ఖరీదు’ చిత్రం 1978 సెప్టెంబరు 22న విడుదల కాగా ‘పునాది రాళ్ళు’ 1979 జూన్ 21న రిలీజ్ అయింది. కాగా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, విక్కీ నిర్మిస్తున్నారు. -
‘చంద్ర’ డ్రామాలు.. దొరికి పోతామనే భయంతో నో కేసు ..
-
బెడిసికొట్టిన టీడీపీ రాజీనామా డ్రామాలు
-
Chandrababu: రెడీ.. లైట్స్ ఆన్ స్టార్ట్ యాక్షన్!
సాక్షి, అమరావతి: టీవీల్లో వరదలు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఓ ఫొటో..! ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఓ వీడియో క్లిప్..! మీడియా ప్రతినిధులను పిలిచి చేతులు అటూ ఇటూ ఊపుతూ ఏదో వివరిస్తుంటే 360 డిగ్రీల్లో కెమెరా రోల్ చేస్తూ షూట్..! ఎవరక్కడ? అనడమే ఆలస్యం.. ‘సిద్ధం దొరా..!’ అంటూ సదా అందుబాటులో ఉంటున్న కలెక్టర్, పోలీస్ కమిషనర్ నుంచి యావత్ యంత్రాంగం...!!ఇదెక్కడో హైదరాబాద్ శివారులోని ఫిల్మ్ సిటీలో సినిమా షూటింగ్ అనుకునేరు! కానే కాదు.. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో రెండు రోజులుగా సాగుతున్న సీను ఇదీ! ఓవైపు కనీవినీ ఎరుగని రీతిలో వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది ‘అన్నమో రామచంద్రా’ అని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు యావత్ యంత్రాంగాన్ని తన చుట్టూ మోహరించి కలెక్టరేట్లో పండిస్తున్న ప్రచార సీన్ ఇదీ..!!నా ఫొటోలూ.. నా వీడియోలూ.. అంతా నేనేపీక్స్కు చేరిన చంద్రబాబు ప్రచార పిచ్చిస్పైడర్ సినిమాలో విలన్ ఎస్జే సూర్య ప్రజల హాహాకారాలు, ఆర్తనాదాలు వింటూ పైశాచిక ఆనందంతో పరవశించిపోతుంటాడు. సినిమాలో అది ఊహాజనిత పాత్ర కావచ్చుగానీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి అందుకే మాత్రం భిన్నంగా లేదన్న విమర్శలు మరోసారి బలంగా వినిపిస్తున్నాయి.వరద బాధితులు ఎలా పోతేనేం..! కరకట్టలు తెగి ఊళ్లు, చేలూ కొట్టుకుపోతేనేం... పేపర్లలో నా ఫొటోలు రావాలి..! టీవీ చానళ్ల తెర నిండా నేనే కనిపించాలి..! సోషల్ మీడియాలో నేనే వైరల్ కావాలి!! అనే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తుండటం ఆయన ప్రచార కండూతికి నిదర్శనం. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలోనో ఉండవల్లి కరకట్ట మీద ఉన్న తన క్యాంప్ ఆఫీసు నుంచో నిరభ్యంతరంగా సమీక్షించవచ్చు. కానీ అలా చేస్తే చంద్రబాబు ఫొటోలు, వీడియోలు మీడియాలో పెద్దగా రావు కదా!! ఇక టెక్నాలజీకి తాను బ్రాండ్ అంబాసిడర్‌నని తరచూ చెప్పుకునే చంద్రబాబు విజయవాడకు భారీ వరద ఐఎండీ రెండు రోజులు ముందు నుంచే హెచ్చరిస్తున్నా ముప్పును అంచనా వేయడంలో ఘోర వైఫల్యం చెందారు. కూటమి సర్కారు వైఫల్యం విజయవాడ ప్రజల పాలిట శాపంగా మారింది. దాంతో తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చేందుకు దీంతో చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెరతీశారు. విజయవాడ కలెక్టరేట్‌కు మకాం మార్చి తానేదో ఒంటి చేత్తో వరదను అడ్డుకుంటున్నట్లు ‘బిల్డప్ బాబాయ్’ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు.టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులతోపాటు అప్పటికప్పుడు జాతీయ మీడియాను కూడా పిలిపించుకుని చుట్టూ కూర్చొబెట్టుకుని మరీ ప్రచార సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. బోటులో తిరుగుతున్న చంద్రబాబు... బుల్ డోజర్పై ఎక్కి చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు... లైఫ్ జాకెట్ వేసుకుని వరద ప్రాంతాలను పరిశీలిస్తున్న చంద్రబాబు... అధికారులతో మాట్లాడుతున్న చంద్రబాబు... డ్రోన్లను పరిశీలిస్తున్న చంద్రబాబు.. ఇలా సాగుతోంది ఈ ప్రహసనం. ముఖ్యమంత్రి వస్తున్నారంటే సహాయక చర్యలు వేగంగా చేపట్టి ఆర్థిక సహాయం చేస్తారని, వైద్య సేవలు అందేలా చూస్తారని బాధితులు ఆశిస్తారు. కానీ చంద్రబాబు మాత్రం చేతులు ఊపుతూ కెమెరాలకు ఫోజులిస్తూ వెళ్లిపోయారు. దీంతో బాధితులు తమను సురక్షిత ప్రాంతాలకు తరలించేవారు లేక.. ఆహారం అందక, తాగునీరు లేక అల్లాడుతున్నారు.బాబు సేవలో యంత్రాంగం ముఖ్యమంత్రే వచ్చి కలెక్టరేట్లో తిష్ట వేయడంతో అధికార యంత్రాంగం అంతా ఆయన చుట్టూ చేతులు కట్టుకుని నిలబడి వరద బాధితులను గాలికి వదిలేసింది. ఇక ఓ వందమందితో కూడిన చంద్రదండు అనే ప్రైవేట్ సైన్యం అక్కడే మోహరించి చంద్రబాబు ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. కేవలం 24 గంటల్లో వందల సంఖ్యలో చంద్రబాబు ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయడం గమనార్హం. సీఎం ఆఫీసు మునక... కరకట్ట ఇంట్లోకి వరదఅమరావతిని వరదలు ముంచెత్తడంతో అక్కడ రాజధాని నిర్మాణంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరకట్ట మీద చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. అటు సచివాలయం ఇటు కరకట్ట నివాసం రెండూ చంద్రబాబు అవినీతి, వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తుండటంతో విజయవాడ కలెక్టరేట్లో మకాం వేసి హైడ్రామాకు తెరతీశారు. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు ప్రచార కండూతి ఏకంగా 29 మంది భక్తుల ప్రాణాలను బలిగొన్న విషయం మరోసారి అందరికీ గుర్తుకొస్తోంది. ఇప్పుడు కూడా దాదాపు అదే రీతిలో ప్రచార కండూతితో వ్యవహరిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది.తన ప్రచారానికే సీఎం ప్రాధాన్యంసీఎం చంద్రబాబు చేసేది తక్కువ.. ప్రచారం చేసుకునేది ఎక్కువ అని చెప్పేందుకు తాజా వరద ప్రత్యక్ష సాక్ష్యం. విజయవాడలో బుడమేరు వరద ధాటికి సింగ్నగర్తో పాటు పలు ప్రాంతాలు ముంపునకుగురై ప్రజలు విలవిల్లాడుతున్నారు. వారికి అందించే సహాయ చర్యలను పర్యవేక్షించడానికంటూ చంద్రబాబు అవసరం లేకపోయినా అతిగా పర్యటనలు చేస్తున్నారు. కానీ అదంతా కేవలం చంద్రబాబు ప్రచార పిచ్చి కోసమేనని అర్థమైంది. టీడీపీ సోషల్ మీడియాలో రెండు రోజులుగా పెడుతున్న ఫొటోలు, వీడియోలే ఇందుకు సాక్ష్యం.టీడీపీ అధికారిక ‘ఎక్స్’ లో 225 టీడీపీ ఫేస్బుక్ గ్రూపులో 245ఐటీడీపీ ఫేస్బుక్లో 52సీఎంఓ అధికారిక ‘ఎక్స్’లో 30రాష్ట్ర ప్రభుత్వ సమాచార శాఖ వాట్సప్ గ్రూపులో వందలాది ఫొటోలు, వీడియోలు పోస్ట్ -
చంద్రబాబు ప్రభుత్వం దొంగాట..
-
బాబు హ్యాపీ.. తల్లులు అన్ హ్యాపీ
-
డల్లాస్‌లో నాట్స్ ఆధ్వర్యంలో నృత్య, నట శిక్షణా శిబిరం
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా డల్లాస్‌లో నృత్య, నటన, శిక్షణ శిబిరం నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక అవర్ కిడ్స్ మాంటిస్సోరిలో రోబో గణేశన్ నృత్య, నటన శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరంలో 20 మందికి పైగా పిల్లలు, పెద్దలు పాల్గొని రోబో డాన్స్, మైమింగ్, నటన, యానిమల్ మూవ్స్, రాంప్ వాక్, డాన్స్ మూవ్స్, వాయిస్ యాక్టింగ్ లాంటి పలు విభాగలలో శిక్షణ పొందారు. ఎంతో మంది ఔత్సాహికులు ఈ శిక్షణా శిబిరంలో నృత్యం, నటనలోని మెళుకువలు నేర్చుకున్నారు. తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్నారు.. ఈ శిక్షణ శిబిరాన్ని చక్కగా నిర్వహించిన రోబో గణేశ్‌ని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డల్లాస్ చాప్టర్ కో-కోఆర్డినేటర్ రవి తాండ్ర, ఈవెంట్ కోఆర్డినేటర్ కిశోర్ నారేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణకు సహకారాన్ని అందించిన నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, జాతీయ కార్యవర్గ సభ్యులు కవిత దొడ్డ, డీవీ ప్రసాద్, ఇతర డల్లాస్ కార్యవర్గ సభ్యులు శ్రవణ్ కుమార్ నిదిగంటి, శ్రీనివాస్ ఉరవకొండ, స్వప్న కాట్రగడ్డ, సత్య శ్రీరామనేని, తదితరులను బాపు నూతి ప్రత్యేకంగా ప్రశంసించారు. డల్లాస్‌లో తెలుగువారి కోసం ఇంత చక్కటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన డల్లాస్ నాట్స్ విభాగ సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!) -
కేంద్రం టైటిల్‌తో బాబు డ్రామా
అమలులోకి రాని చట్టంపైఇంత దుష్ప్రచారమెందుకు? ల్యాండ్ టైట్లింగ్ చట్టం తేవాలని కేంద్రం స్పష్టంగా అన్ని రాష్ట్రాలకూ చెబుతున్న నేపథ్యంలో.. జనానికి నచ్చినా, నచ్చకపోయినా.. బలవంతంగానైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం ఎవరి హయాంలో ఉంటుంది? బీజేపీతో కలిసి పోటీ చేస్తూ.. ఎన్డీఏతో కూటమి గట్టిన చంద్రబాబు నాయుడి హయాంలోనే కదా? ఏ పార్టీతోనూ సంబంధం లేకుండా స్వతంత్రంగాఎన్నికల బరిలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆ చట్టాన్ని ప్రజల ఇష్టాయిష్టాల మేరకు అమల్లోకి తేవటమో, తేకుండా నిలిపేయటమో ఏదైనా చేయగలరు. కానీ చంద్రబాబు పరిస్థితి అలా కాదు కదా! బీజేపీతో కూటమి గట్టి పోటీ చేస్తున్నారు గనక.. ఎన్డీఏ పేరుతో ఓట్లడుగుతున్నారు కనక.. ప్రజలకు ఇష్టం ఉన్నా, లేకున్నా చచ్చినట్టు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాలి. ఇది వాస్తవం. ఇది పచ్చి నిజం. మరి దొంగ మాటలెందుకు చంద్రబాబూ? పైపెచ్చు అమల్లోకి రాని ఈ చట్టాన్ని రద్దు చేస్తాననే ఓ పిచ్చి హామీని మేనిఫెస్టోలో పెట్టారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మీ మానసిక స్థితి సరిగానే ఉందా? అసలు అమల్లోకే రాని ఈ చట్టంపై ఉన్నవీ లేనివీ చెబుతూ...దాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి ఆపాదిస్తూ.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేసిందని, అందరి భూములూ లాక్కుంటోందని దిగజారిపోయి దౌర్భాగ్యపు ప్రచారానికి దిగటం ఎంత నీచం? ఈ చంద్రబాబు నాయుడి నైచ్యానికి అంతూ పొంతూ ఉండదా? మనిíÙగా పుట్టాక కాస్తయినా సిగ్గూ శరం ఉండాలి కదా? 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని చెబుతున్న ఈ పెద్ద మనిíÙ.. ఇంత కుళ్లూ కుతంత్రాలతో.. జనం సాక్షిగా కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పేస్తూ విషం కక్కుతుండటం హేయం కాదా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: వాస్తవానికి ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి పునాది పడింది 1989లోనే. భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలకటానికి, ఎవరి పేరుతో భూమి ఉందో వారి పేరిట టైటిల్ ఇచ్చి.. ఆ టైటిల్‌కు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చేలా చట్టాన్ని చేయాలని, దీనికోసం ల్యాండ్ రికార్డులన్నిటినీ డిజిటల్ చేయాల్సి ఉంటుందని అప్పట్లోనే తీర్మానించారు. ఆ తీర్మానాలకు కొనసాగింపుగా.. 2004లో జాతీయ ల్యాండ్ రికార్డుల కంప్యూటరీకరణ (ఎన్ఎల్ఆర్ఏపీ) పథకాన్ని రూపొందించారు.దాని ప్రకారం 2009లో తొలి మోడల్ చట్టం తయారైంది. ఈ మోడల్ చట్టాన్ని అనుసరిస్తూ 2011లో నాటి యూపీఏ ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. దానికి కొన్ని సవరణలు చేస్తూ 2015లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని తెచ్చింది. అదిగో ఆ తర్వాతే...అంటే 2015లో ముసాయిదా తెచ్చాకే కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ దీనికో రోడ్ మ్యాప్ ఇచ్చింది. టైటిల్ గ్యారంటీకి ఏమేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఏం చేస్తే మనం ఆ దశకు చేరుకోగలమనే రోడ్డు మ్యాప్ అది. ఆ రోడ్ మ్యాప్‌కు తగ్గట్టుగానే 2019లో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మరో ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. ఈ ముసాయిదాకు అనుగుణంగా.. ఈ చట్టాన్ని తేవాలంటే రాష్ట్ర భూముల సర్వేను పూర్తి చేయటం తప్పనిసరి కనక... ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రీ సర్వే పూర్తయితేనే ‘ల్యాండ్ టైట్లింగ్’ వాస్తవానికి రాష్ట్రంలో 17,000 గ్రామాలుండగా వాటిలో ఇప్పటికే 6 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే జరగాల్సి ఉంది. రీ సర్వే జరిగి.. ఆ సందర్భంగా తలెత్తే వివాదాలన్నీ పరిష్కారం కావటానికి చాలా సమయం పడుతుంది. అదంతా పూర్తయ్యాక, రీ సర్వేలో పేర్కొన్న వ్యక్తులకు భూ హక్కు పత్రాలిస్తారు. ఆ పత్రాల ఆధారంగానే.. ప్రతి ఒక్కరికీ ఆయా భూముల టైటిల్‌ను వారి పేరిట మంజూరు చేస్తారు. అంటే.. రీ సర్వే పూర్తి కాకుండా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తేవటం అసాధ్యం. రీ సర్వే పూర్తయి.. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే... భూములపై సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలు, ఇవేవీ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఇదీ వాస్తవం. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అవసరమా? నిజానికిప్పుడు భూమికి సంబంధించి రకరకాల పత్రాలుంటున్నాయి. 10(1), అడంగల్ వంటివి రెవెన్యూ విభాగం ఇచ్చేవి. ఇక రిజిస్ట్రేషన్ శాఖ విషయానికొస్తే ఆ శాఖ రిజిస్టరైన ప్రతిసారీ ఒక డాక్యుమెంట్ నెంబరు కేటాయిస్తుంది. అంతేకాదు.. సర్వే సెటిల్మెంట్, ఎండోమెంట్, అటవీ శాఖ, వక్ఫ్, స్థానిక సంస్థలు.. వీటన్నిటి వద్దా ఒకే భూమికి సంబంధించి వేర్వేరు రికార్డులు ఉంటున్నాయి. ఆ భూమిని ఒకరు కొన్నప్పుడో, అమ్మినప్పుడో అన్ని రికార్డుల్లోనూ ఒకేసారి నమోదయ్యే అవకాశం లేదు.దీంతో కొన్ని రికార్డుల్లో ఆ లావాదేవీలు నమోదవుతాయి. కొన్ని రికార్డుల్లో నమోదు కావటం లేదు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఒక భూమిని కొన్నాక... రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయాక... వేరెవరో వచ్చి అది తాను ముందే కొన్నానని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాక... అది అసైన్డ్ భూమి అనో, గ్రామ కంఠం భూమి అనో, లేదా చుక్కల భూమి అనో తెలుస్తోంది. ఒక భూమికి సంబంధించిన రికార్డులు పలు చోట్ల పలు రకాలుగా ఉండటం వల్ల వస్తున్న సమస్య ఇది. ఇక రుణాల సంగతి తీసుకుంటే.. ఒక బ్యాంకు దగ్గరకు వెళ్లి డాక్యుమెంట్లు పెట్టి రుణాలు తీసుకుంటే ఆ సమాచారం రిజి్రస్టార్ కార్యాలయంలో అప్డేట్ కాదు. కొన్ని సందర్భాల్లో డాక్యుమెంట్లు పోయాయని చెప్పి డూప్లికేట్ డాక్యుమెంట్ తీసుకుని దాని ఆధారంగా మరోసారి రుణం తీసుకోవటమో, రుణం తీçర్చకుండానే ఆ భూమిని అమ్మేయటమో జరుగుతోంది. నిజంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వస్తే ఇలాంటి అక్రమాలçకు ఆస్కారం ఉండదు. అన్ని రికార్డులూ ఒకే రిజిస్టర్లో... ల్యాండ్ టైట్లింగ్ చట్టం వస్తే... టైటిల్ రిజిస్టరులో ప్రతి భూమికీ ఒక యునిక్ నంబరును (రీ సర్వేలో పేర్కొన్న మేరకు) కేటాయిస్తారు. ఆ రిజిస్టరు భూములతో సంబంధం ఉండే ప్రతి విభాగానికీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రతి బ్యాంకుకూ, ఆర్థిక సంస్థకూ అందుబాటులో ఉంటుంది. దీంతో ఆయా సంస్థలు తామిచ్చే రుణాలతో సహా ఆ భూమికి సంబంధించిన లావాదేవీలన్నిటినీ ఆ రిజిస్టరులో నమోదు చేస్తాయి. కాబట్టి తదుపరి మోసాలకు, వివాదాలకు తావుండదు. అందుకే ప్రభుత్వ గ్యారంటీ మోసాలకు తావుండదు కనక.. ఈ చట్టం ప్రకారం ప్రతి భూమికీ ప్రభుత్వం ఆయా టైటిల్ దారు పేరిట బీమా చేయిస్తుంది. కాబట్టి ఊహించని పరిస్థితుల్లో ఆ భూమి తనదంటూ వేరెవరైనా వివాదం తెచ్చినా... ఒకవేళ అది ఏ అసైన్డ్ భూమో అని తేలినా.. టైటిల్ దారుకు ప్రభుత్వమే పరిహారం చెల్లిస్తుంది. అంటే ఆ టైటిల్దారుకు ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుందన్న మాట. ఇదీ చంద్రబాబు సహా ఎల్లో ముఠా ఎక్కడా చెప్పని పచ్చి నిజం.మోదీతో చెప్పించు బాబూ? అసలు ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తయారు చేసింది కేంద్రమే కదా? దానిపై వివిధ రాష్ట్రాలతో కమిటీ వేసి మరీ.. తగిన మార్గదర్శకాలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థ ‘నీతీ ఆయోగ్’ కదా? ఆ కమిటీ నివేదిక మేరకు.. దానికి రకరకాల ముసాయిదాలు రూపొందించి.. దాన్ని అన్ని రాష్ట్రాలకూ పంపించింది అబద్ధమా? దానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన రాష్ట్రానికి సంబంధించిన ముసాయిదా చేయటం అబద్ధమా? ఆ కోవలోనే కదా! ఈ చట్టం తేవాలంటే ముందుగా రాష్ట్రం మొత్తాన్ని రీ సర్వే చేయాల్సి ఉంటుంది కనక ఆ సర్వే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంత మాత్రానికే ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమల్లోకి వచ్చేసిందంటూ అన్ని భూములనూ జగన్ ప్రభుత్వం తన పేరిట రాసేసుకుంటోందని చెబుతూ ఎన్నికల ముందర చంద్రబాబు, ఆయన పచ్చ ముఠా వికృత క్రీడ మొదలు పెట్టింది. లేని చట్టాన్ని రద్దు చేస్తామంటూ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేయటం లేదు. బీజేపీతో, జనసేనతో కలిసి పోటీ చేస్తోంది. పైపెచ్చు రాష్ట్రంలో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీనీ పిలిపిస్తోంది.ఇప్పటికే ఒకసారి ప్రచారం చేసి వెళ్లిన నరేంద్ర మోదీ.. త్వరలో మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మరి ఆ రోజున ప్రధాన మంత్రి ముందే ఈ చట్టాన్ని మేం అమలు చేయబోమని చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టాన్ని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయబోమని మోదీతో చెప్పించగలవా? ల్యాండ్ టైట్లింగ్ అంటూ ఊగిపోతున్న పవన్ కల్యాణ్.. మోదీ ముందు అదే నటనను కొనసాగించగలరా? ఎన్నాళ్లీ పనికిమాలిన డ్రామాలు?ఇదీ... ఎల్లో ముఠా సాగిస్తున్న విష ప్రచారం 1. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ద్వారా భూములన్నీ లాగేసుకుంటారు. రాత్రికి రాత్రి ఆన్లైన్లో రికార్డులను మార్చేస్తారు. 2. సివిల్ కోర్టులకు ఇక భూములపై అధికారాలు ఉండవు. ల్యాండ్ టైటిల్స్ కోర్టులు ఇవ్వాలి గానీ, రెవెన్యూ శాఖ ఎలా ఇస్తుంది.. 3. భూములకు సంబంధించిన అన్ని అధికారాలు తీసుకెళ్లి టైటిల్ రిజిస్టర్ అధికారికి ఇస్తున్నారు.. ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, అధికార పార్టీ వాళ్లు చెప్పిన ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేస్తారు. 4. ఈ చట్టం వచ్చాక భూములున్న వారంతా మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.అసలు వాస్తవాలు ఇవీ.. 1. ప్రభుత్వం భూములెలా లాక్కుంటుంది? 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, గిరిజనులకు 3.22 లక్షల ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందజేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం కలలోనైనా ఇలాంటి ఆలోచన చేస్తుందా? నిజానికి రీసర్వే చేసేటపుడే ఆ భూమి ఎవరిదో తేల్చి.. వారి పేరిట హక్కు పత్రాలు ఇస్తోంది. ఆ హక్కుదారు పేరే కదా రికార్డుల్లో ఉంటుంది. మరి ఆ పేరును మార్చేయటం సాధ్యమా? రాత్రికి రాత్రి ఆన్లైన్లో ఎలా మార్చేస్తారు? మన పేరిట హక్కు పత్రం ఇచ్చినపుడు...ఆ పత్రం మనదగ్గర ఉన్నపుడు రికార్డుల్లో మన పేరు మార్చేయటం ఎలా సాధ్యం? ఏ కొంచెం ఆలోచన ఉన్నా ఇది తెలిసిపోతుంది కదా! 2. రికార్డుల్లో జరిగే తప్పులపై ఇప్పుడు ఫిర్యాదు చేస్తున్నది తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టరు ప్రభుత్వ అధికారులకే కదా? వీళ్లతో పాటు ఉండే టైటిల్ రిజి్రస్టారు కూడా ప్రభుత్వాధికారే ఉంటారు. దీన్లో తప్పేముంది? ఇక భూమి యాజమాన్యంపై వచ్చే సివిల్ వివాదాలు ఇప్పటి మాదిరే కోర్టుల్లోనే పరిష్కారమవుతాయి. దీన్లో ఎలాంటి తేడా ఉండదు. మరి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదనటం పచ్చి అబద్ధం కాదా? 3. అన్ని అధికారాలూ టైటిల్ రిజి్రస్టారుకు ఎందుకుంటాయి? ఇప్పుడు భూముల రిజిస్టరు సబ్ రిజి్రస్టారు కార్యాలయంలో ఉంటోంది. ఆయన కూడా ప్రభుత్వాధికారే. మరి ఆయన ఎమ్మెల్యే, ఎంపీలు చెప్పినట్లు రికార్డుల్లో పేర్లు మార్చేయగలుగుతున్నారా? ఎవరికి కావాలంటే వారికి భూములు రాసేయగలుగుతున్నారా? రికార్డుల్లోని వివరాల నిర్వహణకు ప్రభుత్వం నియమించే గుమాస్తాగానే ఆయన్ను చూడాలి తప్ప.. రికార్డులు మార్చే అధికారం తనకు ఎందుకుంటుంది? 4. మళ్లీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు? అసలు ఆ అవసరం ఎందుకుంటుంది? వివిధ కార్యాలయాల్లో ఉండే వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించి.. రీ సర్వేలో ఇచ్చిన హక్కు పత్రాల ఆధారంగా రిజిస్టరులో ప్రభుత్వమే నమోదు చేసుకుంటుంది. మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. -
ఇన్సూరెన్స్ డబ్బు కోసం చావు డ్రామా
పాములపాడు: నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోదాంలో ఈ నెల 1న రాత్రి మంటల్లో సజీవ దహనమైన వ్యక్తిగా భావించిన ఫారుక్‌బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవ దహనమైన వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్‌గా గుర్తించారు. అప్పుల్ని ఎగ్గొట్టడంతోపాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్‌బాషా తాను చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. వివరాల్లోకి వెళితే.. పాములపాడుకు చెందిన ఫారుక్‌బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. అతడు రైతులకు దాదాపు రూ.కోటి వరకు బకాయి పడినట్టు తెలుస్తోంది. అప్పులు తీర్చకుండా ఎగ్గొట్టడంతోపాటు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారుక్‌బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారుక్‌బాషానే అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి.. మృతదేహాన్ని కుటుంబ çసభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి.. కాగా.. చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైనట్టు అతడి భార్య స్వరూప ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపించగా.. చొక్కా, ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తగానే గుర్తించింది. ఫారుక్‌బాషా తన భర్తను సజీవ దహనం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్‌దేననే నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారుక్‌బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్‌లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విషయమై ఎస్ఐ అశోక్‌ను వివరణ కోరగా.. దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
నేడు వరల్డ్ థియేటర్ డే
పెద్దలు ఇష్టపడే కళగా గుర్తింపు పొందిన ‘నాటక కళ’పై యువత ఆసక్తి ప్రదర్శించడమే కాదు అందులో ఇష్టంగా భాగం అవుతోంది. పాశ్చాత్య నాటకాల పరిశీలన నుంచి మన నాటకాలలో ప్రయోగాల వరకు నాటకరంగంపై యువ సంతకం మెరుస్తోంది.... తిరువనంతపురంలోని ‘నిరీక్షణ ఉమెన్స్ థియేటర్’ వారి నాటకమహోత్సవానికి హాజరైన రోజు నుంచి నందినికి నాటకరంగంపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. దేశ నలుమూలల నుంచి ఎనిమిది మంది మహిళా దర్శకుల నాటకాలను ఈ నాటక మహోత్సవంలో ప్రదర్శించారు. ఇందులో మూడు స్ట్రీట్ప్లేలు కూడా ఉన్నాయి. ఇరవై నాలుగు సంవత్సరాలుగా కళాప్రియులను ఆకట్టుకుంటున్న ‘నిరీక్షణ’ నిర్వహించే వర్క్‌షాప్‌లకు యువతరం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ‘నాటకాలు చూడడం తప్ప ఎప్పుడూ ఆడలేదు. స్వాతి తిరునాల్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో నిరీక్షణ నిర్వహించిన వర్క్‌షాప్‌కు హాజరైన తరువాత నటనపై ఆసక్తి పెరిగింది’ అంటుంది మనీష. ఎంబీఏ చేస్తున్న మనీష రంగస్థల పాఠాలపై కూడా దృష్టి పెడుతోంది.నాటకరంగంపై యువతకు ఆసక్తి కలిగించడానికి భూపేష్ రాయ్, ప్రియాంక సర్కార్లు లక్నోలో నిర్వహించిన థియేటర్ ఫెస్టివల్‌కు మంచి స్పందన లభించింది. ‘ఒకప్పుడు థియేటర్ ఫెస్టివల్ అంటే పెద్దవాళ్లు ఎక్కువగా కనిపించేవారు. ఇప్పుడు యూత్ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నాటకాలపై చర్చించుకుంటున్నారు’ అంటున్నాడు భూపేష్ రాయ్. బెంగళూరులోని ఆల్–ఉమెన్ ట్రూప్ ‘ది అడమెంట్ ఈవ్స్’ యువతలో నాటకరంగంపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ట్రూప్‌లో సభ్యురాలైన బాలశ్రీ యూఎస్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు నాటకాలకు సంబంధించిన ఒక వర్క్‌షాప్‌కు హాజరైంది. ఇక అప్పటినుంచి నాటకరంగం ఆమెకు ఇష్టంగా మారింది. ఒకవైపు అనలిస్ట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే నాటకాల్లో నటిస్తోంది. పిల్లల నుంచి యువతకు వరకు ఎంతోమందిలో నాటకరంగంపై ఆసక్తి కలిగిస్తోంది కావ్య శ్రీనివాసన్. ఆమె థియేటర్ యాక్టర్, ప్లేరైటర్, స్టోరీ టెల్లర్. మధు శుక్లా థియేటర్ ప్రాక్టీషనర్, కోచ్, స్టోరీ టెల్లర్. వృత్తిరీత్యా అనలిస్ట్ అయిన లక్ష్మీ ప్రియా మంచి నటి. ఉద్యోగ సమయం తరువాత ఈ బృందం రిహార్సల్స్, ప్లానింగ్, ఇంప్రూవ్డ్ షోలు చేస్తుంది. ప్రతి మంగళ, గురువారాల్లో ఏదో ఒక మెంబర్ ఇంట్లో రిహార్సల్ కోసం సమావేశం అవుతారు. ‘వేదికపై ఉన్నప్పుడు సౌకర్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో ఉండడానికి తమ నైపుణ్యాలను నటులు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడం అవసరం’ అంటుంది బాలశ్రీ. కావ్య శ్రీనివాస్ నుంచి బాలశ్రీ వరకు ఎంతోమంది నాటకరంగ కళాకారులు యువతకు స్ఫూర్తిని ఇస్తున్నారు.నాటకరంగంలో చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు క్వాసర్ ఠాకూర్ పదంసీ. ఇరవై సంవత్సరాల వయసులో సెక్యూర్డ్ జాబ్‌ను వదిలేసి నాటకరంగానికి అంకితం అయ్యాడు ‘వ్యక్తుల జీవిత కథలను మరింత శక్తిమంతంగా చెప్పే దిశగా భారతీయ నాటకరంగం ప్రయాణిస్తోంది. మన నాటకం కాలంతోపాటు పయనిస్తూ ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతికతను సొంతం చేసుకుంటుంది. లైవ్ కెమెరాలు, ప్రొజెక్షన్లు నాటకరంగంలో భాగం అయ్యాయి’ అంటాడు పదంసీ. మన నాటకరంగ విశిష్ఠతను ఒకవైపు చెబుతూనే మరోవైపు... ‘కష్టాలు ఉంటాయి. ఇదేమీ లాభసాటి వృత్తి కాదు’ అంటాడు. అయితే అభిరుచులు, ఆసక్తులను వాణిజ్య కొలమానాలతో చూడడానికి ఇష్టపడని యువత నాటకరంగాన్ని అమితంగా ప్రేమిస్తోంది. నాటక సమాజాలతోపాటు అవి చేస్తున్న ప్రయోగాల గురించి కూడా ఆసక్తిగా తెలుసుకుంటోంది. రేపటి నాటకానికి తమ వంతుగా సన్నద్ధం అవుతోంది. తమాషాగా సంతోషంగా... ముంబైకి చెందిన సపన్ శరణ్ పోయెట్, రైటర్, యాక్టర్. థియేటర్ కంపెనీ ‘తమాషా’ ఫౌండింగ్ మెంబర్లలో ఒకరు. కొత్త రకం ఐడియాలకు ‘తమాషా’ పుట్టిల్లుగా మారింది. శరణ్ మొదటి నాటకం క్లబ్ డిజైర్. క్రమం తప్పకుండా నాటకాలు ప్రదర్శించే శరణ్ మోడలింగ్ చేస్తుంది, సినిమాల్లో నటిస్తుంది. కవితలు కూడా రాస్తుంటుంది. నాటకరంగానికి సంబంధించి కొత్త ప్రయోగాలు చేయడంలో యువతరానికి స్ఫూర్తి ఇస్తున్న వారిలో సపన్ శరణ్ ఒకరు. తోడా ధ్యాన్ సే... సమకాలీన సామాజిక అంశాలను చర్చించడానికి నాటకాన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటున్న వారిలో దిల్లీకి చెందిన థియేటర్ ప్రాక్టీషనర్ మల్లికా తనేజా ఒకరు. పురుషాధిక్యత నిండిన కళ్లతో స్త్రీని ఎలా చూస్తారు? స్త్రీ భద్రతకు వస్త్రధారణకు ఎలా ముడిపెడతారు? అదృశ్య అణచివేతరూపాలు... మొదలైన అంశాలను తన సోలో నాటకం ‘తోడా ధ్యాన్ సే’ ప్రతిబింబిస్తుంది. మల్లిక వ్యక్తిగత అనుభవాలే ఈ నాటకానికి పునాది. రంగస్థలమే పాఠశాల మన దేశంలోని ప్రతిభావంతులైన యువనటులలో ఐరా దూబే ఒకరు. ‘యేల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో చదువుకుంది. ‘9 పార్ట్స్ ఆఫ్ డిజైర్’ లో ఆమె సోలో పెర్ఫార్మెన్స్కు మంచి పేరు వచ్చింది. దూబే కుటుంబంలో చాలామంది నటులు ఉన్నారు. అందుకే సరదాగా ‘నాటకాల ఫ్యామిలీ’ అని పిలుస్తారు.‘‘థియేటర్ ఆర్ట్స్‌పై యంగ్ పీపుల్ ఆసక్తి ప్రదర్శించడమే కాదు నాటకకళ పట్ల తమ నిబద్ధతను చాటుకుంటున్నారు. యువనటులకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. మనం ఒక నాటకం చేస్తే ఏ కారణం కోసం చేస్తున్నామో, ఏ ప్రేక్షకుల కోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. టార్గెట్ ఆడియెన్స్ గురించి అవగాహన కూడా ముఖ్యం. యాక్టింగ్ స్కూల్ ద్వారా మాత్రమే నటన వస్తుంది అనే దాన్ని నేను నమ్మను. రంగస్థలమే పాఠశాల. అక్కడే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటుంది ఐరా దూబే. -
రంగస్థల నాటకానికి రక్షాకంకణం
సినీ’మాయే’ – విస్తృతమై, ‘నాటు నాటు’ అంటూ నాటుకుంటున్న ఈ కాలాన నీటుగా, ఉదాత్త విలువల దీటుగా – నాటకం పట్ల సమాజంలో కళాభిరుచులకు ఆస్కారంగా, ఆదరాభిమానాలు పాదుకు నేలా రంగస్థల నాటకానికి ప్రాపుగా ఒక కాపు కాస్తూ, కృషి చేస్తున్న సంస్థల్లో ఒకటి ‘రసరంజని’. జీవధార కళగా రంగస్థల నాట కాన్ని పరివ్యాప్తం చేస్తూ, సొంత రిపర్టరీ నిర్వహణతో బాటు – ఎన్నో నాటక సమా జాలకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహిస్తూ, మూడు దశాబ్దాలుగా నాటక రంగాభి మానుల మన్ననలు అందుకుంటున్న సంస్థ రసరంజని. ‘వరల్డ్ థియేటర్ డే’ను మార్చి 27న జరుపుకొంటున్న సందర్భంగా రసరంజని 3 రోజులపాటు నాటకోత్సవాలు నిర్వహిస్తోంది. పౌరాణిక నాటకాలు, చారిత్రకాలు, సాంఘిక నాటకాలు ఎన్నో సమాజాభివృద్ధిలో, సామాజిక చైతన్యంలో గణనీయమైన పాత్ర పోషించాయి. నాటక ప్రదర్శన అన గానే జనం ఒకప్పుడు తండోపతండాలుగా బండ్లు కట్టుకుని మరీ తరలి వెళ్లేవారు. ఆ రోజుల్లో సురభి వంటి నాటక సమాజాల కీర్తి సురభిళాలు పరివ్యాపితమై విరాజిల్లేవి.పాండవోద్యోగ విజయాలు, శ్రీకృష్ణరాయ బారం వంటి పద్యనాటకాల లగాయితు కన్యాశుల్కం, వరవిక్రయం, చిల్లర దేవుళ్ళు ఇలా చెప్పుకుంటూపోతే అంతులేని పట్టి కగా... జనాదరణ పొంది సమాజంపై ప్రభా వం చూపిన రంగస్థల నాటకాలు ఎన్నో. ఈ తరానికి వాటిని (ప్ర)దర్శింపచేయడంలో ‘రసరంజని’ పాత్ర అవిస్మరణీయం. నాటక రంగ అభివృద్ధి కోసం, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ నాటకం విస్తృతంగా ప్రదర్శింపబడాలనీ, నాటకం ప్రజల మధ్యకి వెళ్లాలనీ, నాటకం ద్వారా సమాజ చైతన్యం జరగాలనీ ముఖ్యంగా ఎన్ని ఇక్కట్లున్నా టిక్కెట్టు కొని నాటకం చూడడం అనే ఉత్తమాభిరుచిని జనం విడనాడకూడదనే సంకల్పంతో నేటికీ రంగస్థల నాటక ప్రదర్శ నలకే కట్టుబడి 31 ఏళ్లుగా నెలనెలా రసరంజని నిర్వహిస్తున్న కార్యక్రమాలు నాటకరంగానికే తలమానికాలు.‘రసరంజని’ 1993 మార్చి 8న నెల కొల్పబడింది. ఈ మూడు దశాబ్దాల ప్రయా ణంలో దాదాపు 700 నాటకాలు, మూడు వేల అయిదువందల ప్రదర్శనలు – సంస్థ కళాకారులతోనే కాక అనేక నాటక సమా జాల వారితో ప్రదర్శించడమైంది. సొంత రిపర్టరీ నెలకొల్పడం ద్వారా ఎందరో నటీనటులకు, రచయితలకు, దర్శ కులకు, రంగస్థల సాంకేతిక నిపుణులకు శిక్షణ ఇచ్చి, తద్వారా వారు నాటకరంగంలో స్థిరపడి వన్నెవాసికెక్కడానికి రసరంజని దోహదపడింది. రంగస్థలంపై రసరంజని కథానాటక సప్తాహాలు, కథానాటక శరన్న వరాత్రులు, తెలుగు హాస్య నాటకోత్సవాలు, జాతీయ నాటక ప్రదర్శనలు, జాతీయహిందీ నాటకోత్సవాలు వంటి కార్యక్రమాల ద్వారా ప్రదర్శనలు అందించి తనదైన ప్రత్యే కతను చాటుకుంది. ‘ప్రపంచమే ఒక నాటక రంగం. ప్రతి ఒక్కరం పాత్ర ధారు లమే!’ దర్శకుడు వేర యినా, మనమే అయినా, జీవితం అనే తెర పడే వరకూ అంకాలు మారుతూ బ్రతుకు దృశ్యాలు ఘటనలూ, సంభా షణలూ వెలుగు నీడలతో వివిధ రసా లతో సాగుతూనే ఉంటాయి అనే మాట మనం వింటూ వస్తున్నదే ! అటువంటప్పుడు నాటకమే ప్రపంచంగా, సమాజహిత చింతనతో కృషి చేస్తున్న నాటకరంగం సంస్థలను సమాదరించడం జనకర్తవ్యం. వారు కోరుతున్నది నాటకం చూడమని! నాటకాన్ని సమాదరించడం అంటే జీవితాన్ని సమాదరించడమే! మనిషినీ, మానవతనూ సమాదరించడమే! - వ్యాసకర్త ఆకాశవాణి విశ్రాంత అధికారి -సుధామ -
దస్తగిరి కొత్త డ్రామా
-
అల్లుడితో షూట్ చేయించుకున్న మామ..ఎందుకంటే..?
న్యూఢిల్లీ : అప్పులోళ్లను ఇరికించేదుకు ఓ వ్యక్తి తన అల్లుడితో కలిసి పెద్ద కుట్రే పన్నాడు. కానీ పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కించే పరిస్థితి తెచ్చుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన అల్లుడికి తుపాకీ ఇచ్చి చేతిపై ఘూట్ చేయించుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి అప్పు కోసంవేధిస్తూ అప్పులోళ్లే తనను కాల్చారని చెప్పాడు. ఈ ఘటన ఢిల్లీలోని నంద్ నగ్రీ తాహీర్‌పూర్‌లో జరిగింది. కాల్పులు జరిగాయని ఫోన్ వచ్చిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లి చూశారు. చేతికి గాయంతో ఉన్నసుందర్ కనిపించాడు. 315 బోర్ తుపాకీకి చెందిన ఖాళీ షెల్ అక్కడే పడి ఉంది. గాయపడిన సుందర్‌తో పాటు అతడి అల్లుడు హిమాన్షు కూడా అక్కడే ఉన్నాడు. ఏం జరిగందని అడగ్గా మేమిక్కడ చేపలకు ఆహారం వేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి తనను తిడుతూ తుపాకీతో కాల్చాడని చెప్పాడని డీసీపీ తెలిపారు. సుందర్‌ను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిచినట్లు చెప్పారు. ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. గాయపడ్డ సుందర్‌కు కొన్ని అప్పులున్నాయని, అప్పులు ఇచ్చిన వారిని కేసులో ఇరికించేందుకే అల్లుడితో కాల్పులు జరిపించుకుని డ్రామా ఆడాడని తేలింది. సుందర్ అల్లుడు హిమాన్షు ఇంటరాగేషన్‌లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. కాల్చిన తర్వాత తుపాకీని అక్కడే ఉన్న చెరువులో పడేసినట్లు వెల్లడించాడు. అక్కడికి వెళ్లి వెతికిన పోలీసులకు తుపాకీ దొరికింది. దీంతో పోలీసులు సుందర్‌తో పాటు హిమాన్షుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇదీచదవండి..జర్నలిస్టు సౌమ్య హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు -
అనారోగ్యం పేరుతో చంద్రబాబు కొత్త డ్రామా
-
బెయిల్ రాదని తెలిసిపోయింది !..అందుకే బాబు గారి కొత్త డ్రామా..?
-
బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి
సాక్షి, అమరావతి: అవినీతికి పాల్పడి సాక్ష్యాధారాలతో సీఐడీకి దొరికిపోయిన మాజీ సీఎం చంద్రబాబు బయటపడే మార్గం కానరాకపోవడంతో అనారోగ్యమంటూ సానుభూతి నాటకానికి తెర తీశారు! స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణకు సహకరించకుండా అసలు కేసునే కొట్టివేయాలని ఒకవైపు వాదిస్తూ మరోవైపు రాజకీయ ప్రయోజనాల కోసం సరికొత్త ఎత్తుగడ వేశారు. అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాజేసింది కాకుండా తప్పులనుకప్పిపుచ్చుకునేందుకు ఆయన చేస్తున్న యత్నాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. డీ హైడ్రేషన్.. స్కిన్ అలర్జీ.. బరువు తగ్గిపోయారంటూ రకరకాల అంశాలను ఆయన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేతలు తెరపైకి తెచ్చి హడావుడి చేశారు. దీనిపై జైళ్ల శాఖ అధికారులు సత్వరమే స్పందించి వాస్తవాలను బహిర్గతం చేయడం ద్వారా దుష్ప్రచారానికి తెర దించారు. వాస్తవానికి జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు బరువు మరో కిలో పెరగడం గమనార్హం. చంద్రబాబు తీసుకునే ఆహారం ఇంటి నుంచే వస్తోంది. ఆయనకు ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బయట తిరగడం లాంటి శారీరక శ్రమ ఏమాత్రం లేదు. అలాంటప్పుడు బరువు ఎందుకు తగ్గుతారనే స్పృహ లేకుండా నిస్సిగ్గుగా ఆరోపణలు చేయడంపై అంతా విస్తుపోతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబు యథేచ్ఛగా పాల్పడ్డ కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటంతో టీడీపీ బెంబేలెత్తుతోంది. చంద్రబాబు 34 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతోనే టీడీపీ నేతలు, కార్యకర్తలు కాడి వదిలేశారు. మరోవైపు లోకేశ్ రాజకీయ కార్యక్షేత్రం కాడి వదిలేసి ఢిల్లీలో తలదాచుకోవడంతో భవిష్యత్‌పై టీడీపీ ఆశలు వదిలేసుకుంది. చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఏమాత్రం సానుభూతి కలసి రావడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. గత్యంతరం లేక ఏదో ఒక ఆందోళన నిర్వహిస్తున్నా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కనిపిస్తున్నారని, సామాన్యులు ఎవరూ ఇందులో పాలు పంచుకోవడం లేదని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో దింపుడు కళ్లెం ఆశతో టీడీపీ చివరి అస్త్రంగా చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదనే అవాస్తవ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. వైద్యుల నివేదికలు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు అధికారుల ప్రకటనతో ఆ యత్నం కూడా బెడిసికొట్టింది. మొన్ననే బాగున్నారన్న పయ్యావుల.. మూడు రోజులుగా చంద్రబాబుకు అరోగ్యం బాగా లేదంటూ వ్యూహాత్మకంగా ప్రచారాన్ని టీడీపీ తెరపైకి తెచ్చింది. గతవారం రెండో ములాకత్తో చంద్రబాబును కలిసిన లోకేశ్, పయ్యావుల కేశశ్ మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన వద్దని, చంద్రబాబు పార్టీ కోసం, రాష్ట్రం కోసం ఆలోచిస్తున్నారని కూడా వ్యాఖ్యానించారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం హఠాత్తుగా చంద్రబాబు ఆరోగ్యం సరిగా లేదంటూ ప్రచారానికి దిగారు. ఎంత పకడ్బందీగా దీన్ని వ్యాప్తిలోకి తెచ్చారంటే.. చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి వరుసగా ట్వీట్లు పెట్టారు. ఆ వెంటనే యనమల రామకృష్ణుడు అందుకున్నారు. అచ్చెన్నాయుడుతోపాటు పార్టీ సీనియర్ నేతలు సమావేశమై చంద్రబాబు ఆరోగ్యం బాగా లేదంటూ ప్రకటనలు చేశారు. చంద్రబాబు ఏకంగా ఐదు కిలోల బరువు తగ్గారని, కిడ్నీలు దెబ్బ తింటాయంటూ తామే వైద్యులమనే తరహాలో హడావుడి చేశారు. బాబు శరీరంపై దద్దుర్లు వచ్చాయని, ఏసీ లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందని నిర్ధారించేయడం విస్మయ పరుస్తోంది. చంద్రబాబుకు స్టెరాయిడ్లు ఇస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తేవడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనం. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుపై గుర్తు తెలియని డ్రోన్లు తిరిగాయని ఆరోపిస్తూ చంద్రబాబు భద్రతపై ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికిగానీ ఏదైనా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికిగానీ తరలించాలని డిమాండ్ చేశారు. తద్వారా ఆసుపత్రి నుంచి రాజకీయం నెరపవచ్చన్నది టీడీపీ ఉద్దేశం. అందుకోసమే అనారోగ్యం, భద్రతకు ప్రమాదం అంటూ అసత్య ఆరోపణలు ప్రచారంలోకి తెచ్చారు. మాన్యువల్ ప్రకారం సదుపాయాలు చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ కుట్రపూరితంగా చేసిన అసత్య ఆరోపణలను జైళ్ల శాఖ సమర్థంగా తిప్పికొట్టింది. జైలు మాన్యువల్‌లోని నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నామని వివరించింది. జైళ్ల శాఖ మాన్యువల్‌లోని 1037, 385, 386 నిబంధనల్లో పేర్కొన్న ప్రకారం వీఐపీ ఖైదీలకు నిర్దేశించిన అన్ని సదుపాయాలను ఆయనకు కల్పిస్తున్నట్లు తెలిపింది. జైలు గదిలో ఫర్నిచర్, ఇతర వసతులను కూడా ఆమేరకు సమకూర్చినట్లు పేర్కొంది. జైళ్ల శాఖ మాన్యువల్ ప్రకారం జైలులో ఏసీగానీ ఎయిర్ కూలర్గానీ కల్పించే వెసులుబాటు లేదని వెల్లడించింది. మాన్యువల్‌కు విరుద్ధంగా వ్యవహరించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. చంద్రబాబు ఉన్న జైలు గదిలో 8 ఫ్యాన్లు ఏర్పాటు చేశామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇంటి నుంచి భోజనాన్ని అనుమతిస్తున్నామని తెలిపింది. రోజూ జైలు వైద్య అధికారులు, సిబ్బంది చంద్రబాబును పరీక్షిస్తున్నారని, ఆయనకు ఎలాంటి అనారోగ్యం లేదని వెల్లడించింది. సెకండ్ ఓపీనియన్ కోసం జీజీహెచ్ వైద్యులను కూడా పిలిపించి పరీక్షలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసింది. చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యుల నివేదిక కూడా వెల్లడించింది. ఇక జైలుకు వచ్చినప్పటి కంటే ప్రస్తుతం చంద్రబాబు ఒక కేజీ బరువు పెరిగి ప్రస్తుతం 67 కిలోల బరువు ఉండటం గమనార్హం. ఈమేరకు పూర్తి ఆధారాలు, వైద్య పరీక్షల నివేదికలను న్యాయస్థానానికి సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం జైళ్ల శాఖ నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తోంది. బాలయ్య దూకుడుతో.. పూర్తి ఆధారాలతో చంద్రబాబు అవినీతిని వెలికి తీసిన సీఐడీ పకడ్బందీగా కేసులు నమోదు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలులో ఉండగా ఫైబర్‌నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్ల అల్లర్ల కేసులు వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి. మరోవైపు అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు కూడా ఉంది. సీఆర్పీసీ, అవినీతి నిరోధక చట్టాల్లోని సెక్షన్లకు వక్రభాష్యం చెబుతూ ఢిల్లీ నుంచి రప్పించిన న్యాయవాదులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ రావడం సాధ్యం కాదని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. పోనీ చినబాబును పట్టుకుని రాజకీయ గోదారి ఈదుదామనుకుంటే ఆయనేమో కేసుల భయంతో దేశ రాజధానిలో దాక్కున్నారు. ఇదే అవకాశంగా టీడీపీలో ఆధిపత్యం కోసం నందమూరి బాలకృష్ణ దూకుడుగా వ్యవహరించడం నారా కుటుంబాన్ని బెంబేలెత్తించింది. దాంతో తెలంగాణ ఎన్నికల సాకుతో బాలయ్యను ఆ రాష్ట్రానికే పరిమితం చేశారు. కిలో బరువు పెరిగారు: జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు. జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, జిల్లా ఎస్పీ పి.జగదీష్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హై ప్రొఫైల్ ఖైదీ అయినందున తొలి రోజే ఆయనకు స్నేహ బ్యారక్‌ను కేటాయించామని గుర్తు చేశారు. ఆయన వద్ద 24 గంటలూ ఒక హెడ్ వార్డర్, ఆరుగురు వార్డర్లుంటారని, ఒక జైలర్ స్థాయి అధికారి విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. ఆయనకు వచ్చే ఆహారం, ఇతరత్రా అన్నీ ఆయనే తనిఖీ చేసి చంద్రబాబుకు అందిస్తారని తెలిపారు. ములాఖత్‌కు చంద్రబాబు బయటకు వచ్చే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతర ఖైదీలు, ఇతరులు ఆ ప్రాంతంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా ఎస్పీతో వారానికోసారి భద్రతపై చర్చిస్తున్నామన్నారు. చంద్రబాబు భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటున్నారని స్పష్టం చేశారు. ఖైదీలతో చంద్రబాబుకు ఇబ్బందులు వస్తున్నాయన్న వార్తలు అవాస్తవమని చెప్పారు. రోజుకు మూడుసార్లు పరీక్షలు.. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు ఆయన ఆరోగ్యం, మందుల వివరాలను సేకరించామని డీఐజీ తెలిపారు. జైలులో వైద్యాధికారులు చంద్రబాబుతో మాట్లాడమే కాకుండా ఆయనకు చికిత్స అందించిన వ్యక్తిగత వైద్యుడితోనూ సంప్రదించినట్లు చెప్పారు. ఆయన మందులు వేసుకుంటున్నారా లేదా? అనేది జైలు వైద్య సిబ్బంది పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. రోజుకు మూడుసార్లు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారని వెల్లడించారు. జైలుకు వచ్చినప్పుడు చంద్రబాబు 66 కేజీల బరువు ఉండగా ప్రస్తుతం 67 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. బరువు తగ్గిపోయారంటూ వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. రెండు రోజుల క్రితం డీహైడ్రేషన్ అని తెలియజేయగానే వైద్యాధికారులతో మాట్లాడి తగిన లిక్విడ్లు ఇచ్చినట్లు చెప్పారు. చర్మంపై దద్దుర్లకు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్య పరీక్షలు చేశారని, అవేమీ ప్రమాదరకర స్థాయిలో లేవన్నారు. చంద్రబాబు గదిలో 8 ఫ్యానులతో పాటు దోమ తెర కూడా ఏర్పాటు చేశామన్నారు. జైల్లోకి వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్న మందులను ఆయన కొనసాగిస్తున్నారని వివరించారు. తప్పుడు వార్తలపై చర్యలు చంద్రబాబుకు ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు సంబంధించి కోర్టు సీలు, న్యాయమూర్తి సంతకం లేనందున వివరణ కోరినట్లు డీఐజీ తెలిపారు. సెంట్రల్ జైల్లో 2,039 మంది ఖైదీలున్నారని, వారిలో చంద్రబాబు ఒకరని, రిమాండ్ ఖైదీ పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలానే తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోరిక మేరకు ఆయనను ప్రత్యేకంగా ఆస్పత్రికి పంపలేమన్నారు. తమపై ఒత్తిళ్లు ఉన్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. సోషల్ మీడియా, పత్రికల్లో వస్తున్న తప్పుడు వార్తలపై చర్యలు తీసుకుంటామని రవికిరణ్ హెచ్చరించారు. -
నాటక సమాజాలకు ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’
సాక్షి, అమరావతి: ఏపీలోని నాటక రంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తోన్న రంగస్థల సమాజాలు, పరిషత్‌లకు ఈ ఏడాది నుంచి ‘వైఎస్సార్ రంగస్థల పురస్కారం’ అవార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కే పరిమితమైన కళా ప్రదర్శనలను ఆడిటోరియంలు, కళా వేదికలు నిర్మించడం ద్వారా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. కళాకారుల అభ్యున్నతిలో వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ రూ.5 లక్షల నగదు బహుమతితో ‘వెఎస్సార్ రంగస్థల పురస్కారం’ అందజేస్తామని చెప్పారు. దీనితో పాటు నాటక రంగంలో రాణిస్తోన్న కళాకారులకు ఇప్పటికే ఉన్న ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం కింద రూ.1.50 లక్షలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే పురస్కారాలకు ఎంపికలను ప్రారంభిస్తామన్నారు. గుంటూరులో నంది అవార్డుల నాటక పోటీలు రంగస్థల నంది నాటక అవార్డులకు తుది ఎంపిక పోటీలను నవంబర్ చివరి వారం/డిసెంబర్ మొదటి వారంలో గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే 115 నాటకాలు, నాటికల్లో ప్రాథమిక ఎంపిక పూర్తయిందని, న్యాయ నిర్ణేతలు పరిశీలన అనంతరం 38 నాటకాలు, నాటికలను తుది ప్రదర్శనకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని కళాకారులు, నటీనటులకు ఎటువంటి సభ్యత రుసుము లేకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను జారీ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి ఆన్లైన్లో కళా కారులు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. ఇందు కోసం ప్రత్యేకంగా www.apsftvtdc.in పోర్టల్‌ను సిద్ధం చేశామని చెప్పారు. జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, దర్శక, నిర్మాతల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైతే కళాకారులకు బస్సు ప్రయాణంలో రాయితీ కల్పించేందుకుకృషి చేస్తామన్నారు. చిత్ర పరిశ్రమను రావాలనే కోరారు.. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని విలేకరుల ప్రశ్నలకు పోసాని బదులిచ్చారు. గతంలో చిత్ర పరిశ్రమలోనే ప్రముఖులతో సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఏ ప్రాంతంలోనైనా స్టూడియోల నిర్మాణానికి ముందుకొస్తే ఎంతైనా స్థలం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారని గుర్తు చేశారు. కళాకారులు ఇక్కడికే వచ్చి స్థిరపడితే వారికి ఇళ్ల స్థలాలతో పాటు ఇతర ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారని వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ విశాఖకు వచ్చే అంశాన్ని పరిశీలించాలని మరోసారి కోరతామన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు పెద్ద సమస్య లేకుండా సినీ పరిశ్రమ తరలివచ్చిందన్నారు. ఏపీ, తెలంగాణలు రెండూ తెలుగు ప్రాంతాలే కావడం..హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్తామంటే అక్కడి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు ఇచ్చిన స్థలాలను వెనక్కి ఇవ్వాలని కోరితే ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి తలెత్తుతుందన్నారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే తరలింపుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వంతో చర్చించి అవసరమైతే వచ్చే ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగ స్థల పురస్కారం నగదు ప్రోత్సాహక పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. -
వినోదాల ప్రేమ
కార్తీక్ రత్నం, సుప్యర్ద సింగ్ జంటగా ఆనంద్ బడా దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘లింగొచ్చా..’. ‘గేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. జె.నీలిమ సమర్పణలో యాదగిరి రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఆనంద్ బడా మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్ నేపథ్యంలో సాగే లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ‘లింగొచ్చా..’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: బికాజ్ రాజ్, సహ నిర్మాత: మల్లేష్ కంజర్ల. -
అడ్డంగా దొరికినా కతలే..!
-
దొంగ ఓట్ల పేరుతో బాబు కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల వివరాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తోందని.. ఆ సర్వేలోనే దొంగ ఓట్లు, అసలు ఓట్ల సంగతేంటో తెలిసిందని.. అలాంటిది టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కొత్తగా డ్రామాలాడటమేంటని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఆడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసీకి లేఖలు, ఢిల్లీ పర్యటనలు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డేటాను టీడీపీ చౌర్యం చేసి, ఎలా దొరికిపోయిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలేదు. బౌన్సర్లతో, కిరాయి జనంతో, రాజకీయ కూలీలతో లోకేశ్ చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? ధర్మ ప్రచార పర్యవేక్షణకు ఏడుగురితో కమిటీ.. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈనెల 6న అన్నవరంలో ప్రారంభమైన ధర్మ ప్రచార కార్యక్రమం అన్నిచోట్లా కొనసాగుతాయి. ఈ ధర్మ ప్రచార కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాం. అలాగే, ఐదు లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటివరకు వంశపారంపర్య ధర్మకర్తలు లేదా అర్చకుల నుంచి 37 దరఖాస్తులు అందాయి. -
హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే, అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా, ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో.. ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె ఆ బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది.. నిన్నటి వరకు తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా పోలీసులు తేల్చేశారు. అతనితో కలిసి వెళ్లి.. బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్‌లో ఇరువురు ఫొటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద రాగా.. అతనితో కలిసి వెళ్లింది. చదవండి: నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి.. ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అసలు నాటకం అక్కడే మొదలైంది.. ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. తప్పించుకుని వచ్చానని తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ బాలికకు ధైర్యం చెప్పి.. పోలీసులకు సమాచారం అందించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. విచారణలో అసలు నాటకం బయటపడింది. చదవండి: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్! -
హైదరాబాద్ యూత్‌ను ఫిదా చేస్తున్న ‘కొరియన్’ ట్రెండ్..
హైదరాబాద్.... మినీ ఇండియాగా ప్రసిద్ధి. అనేక ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలకు పుట్టినిల్లు. కొత్తగా ఏ ట్రెండ్ వచ్చినా దాన్ని వెంటనే ఫాలో అవుతుంటారు. ఇప్పుడు అదే కోవలోకి చేరిపోయింది కొరియన్ ట్రెండ్. 2012లో వచ్చిన గంగ్నమ్ స్టైల్ నుంచి ఇప్పటి బీటీఎస్ మ్యూజిక్ దాకా.. వీటికి మనోళ్లు తెగ ఫిదా అవుతున్నారు. కె–పాప్, కె–డ్రామా, కె– ఫుడ్, కె– ఫ్యాషన్లపై మన హైదరాబాదీ యువత మోజు పెంచుకుంది. సిటీలో కొరియన్ ట్రెండ్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం!! – సాక్షి, సిటీడెస్క్ దక్షిణ కొరియా సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు నగరాన్ని తుపానులా చుట్టేస్తున్నాయి, లాక్డౌన్ టైమ్‌లో చాలా మంది అనేక భారత మెట్రోల్లానే నగరవాసులు కూడా ఆన్లైన్ వినోదం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. అదే క్రమంలో కె–డ్రామాల క్రేజ్‌లో చిక్కుకున్నారు. దక్షిణ కొరియా టెలివిజన్ ధారావాహిక ‘క్రాష్ ల్యాండింగ్ ఆన్ యు’ ముగింపును చూస్తూ హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని మణి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ‘దక్షిణ కొరియా వారసురాలు ఉత్తర కొరియా సైన్యానికి చెందిన తీపి–విషాద ప్రేమకథలో లీనమైపోయి ఏడ్చాను’ అంటోందామె! మన సినిమాల్లాగే... మసాలా మెలోడ్రామాకు అలవాటు పడిన మనకు తగ్గట్టే విదేశీ లొకేషన్స్‌లో పాటలు, మిల్స్ – బూన్ రొమాన్స్, మన సినిమాల్లో తరహాలోనే హాస్యం, ట్రయాంగిల్ లవ్ స్టోరీస్, కిడ్నాప్‌లు, ఆకస్మిక మతిమరుపు, సంకల్ప శక్తి కలిగిన తల్లులు, కుటుంబ గౌరవం కోసం ప్రతీకారం తీర్చుకోవడాలు అన్నీ వీటి లోనూ ఉండడం విశేషం. యూరోమానిటర్ ప్రకారం, కె–డ్రామాలను భారతీయులు ఎక్కువగా వీక్షించడంతో, నెట్‌ఫ్లిక్స్‌లో కె–డ్రామాల వీక్షకుల సంఖ్య 370 శాతం పెరిగింది. వీటిని హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అనువాదం చేయడంతో నగర యువత కె–డ్రామాకు పెద్ద ఎత్తున అభిమానులయ్యారు. నాటకాల నుంచీ నాలుగు విధాలుగా... తినే ఆహారం, ధరించే దుస్తులు, ఆభరణాలు, ఇంకా ముందుకెళ్లి వారు తాగే సోజు (కొరియన్ ఆల్కహాలిక్ పానీయం), వారు మాట్లాడే భాష వారు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తులు ఇలా ప్రతిదీ సిటీ యూత్‌కి ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా మారాయి. దేశంలో ఒక్క దక్షిణ కొరియా నూడిల్ బ్రాండ్ నోంగ్‌షిమ్ మాత్రమే 1 మిలియన్ డాలర్ల విక్రయాలను నమోదు చేసింది. భాషపై సిటీజనుల ఆసక్తి ఈ కె డ్రామాల క్రేజ్‌తో సిటీలో కొరియన్ భాషా తరగతులపై ఆసక్తి కూడా బాగా పుంజుకుంది. ‘‘కొరియన్ భాషను నేర్చుకునే వారు తమకు నచ్చిన భాషా చిత్రాల్లో వారి చిహ్నాలు ఏమి చెబుతున్నాయి, గాయకులు ఏమి పాడుతున్నారనేది అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అలాగే భాష ద్వా రా కొరియాతో నేరుగా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారని ఇండో–కొరియన్ కల్చరల్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన నగరశాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. సిటీలో కొరియన్ స్టోర్స్ కొరియన్ ట్రెండ్‌కు అనుగుణంగా నగరంలోని బాలానగర్, మాదాపూర్, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, గచ్చిబౌలి, అమీర్‌పేట, సికింద్రాబాద్, తిరుమలగిరి వంటి ప్రాంతాల్లో గ్రాసరీ స్టోర్స్, ఆర్గానిక్ ఫుడ్, కాస్మోటిక్, ఫుడ్, బేకరీ, కేక్, కిచెన్ స్టోర్స్ వెలిశాయి. జూబ్లీహిల్స్‌లో చబ్బీ చో, బంజారాహిల్స్‌లో సెవెన్ సిస్టర్స్, గచ్చిబౌలిలో హైకూ రెస్టారెంట్లు కొరియన్ వంటకాలు ఇష్టపడే నగరవాసుల అభిరుచులకు తగ్గ ఆతిథ్యాన్ని అందిస్తోంది. నాటకాలే ప్రధాన కారణం కొరియన్ కల్చర్ విజృంభణ వెనుక మొత్తం ఆ దేశపు నాటకాలే ప్రధాన కారణంగా విశ్లేషకులంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న 500 కొరియన్ డ్రామాలలో డిసెండెంట్స్ ఆఫ్ ది సన్, బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్, రిప్లై 1988, కింగ్డమ్, స్కై కాజిల్... వంటివి వీక్షకుల క్రేజ్‌కు పునాది రాళ్ల వంటివిగా చెప్పొచ్చు. ‘ఒత్తిడితో కూడిన పరిస్థితిలో కొరియన్ నాటకాలు నన్ను నవ్విస్తాయి’ అని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థిని వర్షి అంటోంది. బీటీఎస్ హోరులో... కొరియన్ మ్యూజిక్ సెన్సేషన్ బీటీఎస్ (బుల్లెట్ ప్రూఫ్ బాయ్ స్కౌట్స్ లేదా బ్యాంగ్టన్ బాయ్స్) ఇప్పుడు ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. 21వ శతాబ్దిలో పాప్ ఐకాన్‌గా నిలిచింది. 2010లో ఓ గ్రూపుగా ఏర్పడిన ఏడుగురు సభ్యుల బృందం జూన్ 2013లో తమ మొదటి ఆల్బమ్ ‘2కూల్ 4స్కూల్’ పేరుతో దూసుకొచ్చారు. ఈ ఆల్బమ్ ప్రపపంచ వ్యాప్తంగా మిలియన్ల సంఖ్యలో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. హిప్ హాప్ బ్యాండ్ గ్రూప్‌గా మొదలు పెట్టి కే–పాప్(కొరియన్ పాపులర్ మ్యూజిక్), పాప్(పాపులర్ మ్యూజిక్), ఆర్ అండ్ బీ (రిథమ్ అండ్ బ్లూస్), ఈడీఎం(ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మూజిక్) వంటి అనేక రూపాల్లో తమ సత్తాను చాటుకుంది. ఫుడ్‌కు యమా క్రేజ్ నటీనటులు తమ చాప్‌స్టిక్‌లతో వేడి వేడి కప్పు రమ్యున్ నూడుల్స్‌పై చప్పరించడం లేదా కిమ్చీని తినే సన్నివేశాల వీక్షణ ద్వారా పుట్టుకొస్తున్న అభిరుచులు నగరవాసుల్ని పట్టి కుదిపేస్తున్నాయి. దశాబ్దానికి పైగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్న కొరియన్ జాతీయురాలు చో మిన్ యున్ నగరంలో కొరియన్ వంటకాలకు ప్రత్యేకించిన గోగురియో రెస్టారెంట్‌ను ఇటీవలే హైటెక్ సిటీలో ప్రారంభించారు. ‘ కె–డ్రామా కె–పాప్‌ల జనాదరణతో, కొరియన్ ఫుడ్‌పై కూడా ఆసక్తి పెరుగుతోంది అందుకే రెస్టారెంట్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను’ అని చో మిన్ యున్ వివరించారు. పాల వినియోగం ఉండదు కొరియన్ ఆహార సంస్కృతి చైనీస్, జపనీస్ సంస్కృతుల నుంచి ప్రేరణ పొందింది. ఆహారంలో, పాల అతి వినియోగం ఉండదు. కొరియన్ మిరపకాయ పేస్ట్ అయిన గోచుజాంగ్ గోచుగారు – కాల్చిన మిరప పొడి, ఇది భారతీయ మిరపకాయ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆహారం ఎల్లప్పుడూ కిమ్చితో వడ్డిస్తారు, కొరియన్ల కోసం చాలా ప్రత్యేకమైన పులియబెట్టిన సైడ్ డిష్ సంప్రదాయకంగా చేప నూనెతో వడ్డిస్తారు. ఇక్కడి ప్రజలు దాన్ని ఎక్కువగా ఇష్టపడరు, దీంతో చేప నూనెను వాడటం మానేశాను. – బెంజమిన్, జూబ్లీహిల్స్‌లోని ఓ కొరియన్ రెస్టారెంట్ చెఫ్ బీటీఎస్‌కు పెద్ద ఫ్యాన్ మొదటి నుంచి పాప్ సంగీతం అంటే ఇష్టం. ఇక కొరియన్ బీటీఎస్, ఎక్సో, బ్లాక్ పింక్, రెడ్ వెల్వెట్, షిండీ గ్రూపుల పాటలు వింటాను. మొదట్లో భాష అర్థం కాకపోయేది. క్రమక్రమంగా అలవాటు అయ్యింది, ఆ పాటలు నేర్చుకున్నా. బీటీఎస్‌లో సుగా అంటే ఇష్టం. వాళ్ల కాన్సర్ట్ వెరీ గుడ్. ఇక ఈ బృందంలోని ఏడుగురిది ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిదాయక చరిత్ర. చాలా కష్టాలకు ఎదురొడ్డి ఈ స్థాయికి వచ్చారు. –పి.రితిక, బీఎస్సీ ఫస్ట్ ఇయర్, నారాయాణగూడ -
సమంత సింపతీ డ్రామా....?
-
అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!
సాక్షి, మియాపూర్: బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు అందుకోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులకు పట్టుబడిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచి్చంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన సంజీవరావు, అంకమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. సంజీవరావు స్థానికంగా సెంట్రింగ్ పనులు చేసేవాడు. అతని చిన్న కుమారుడు పవన్ బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పవన్ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతడి తండ్రి సంజీవరావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో పవన్ తల్లి అంకమ్మకు గుర్తుతెలియని మహిళ ఫోన్ చేసి మీ కుమారుడు పవన్ నా దగ్గరే ఉన్నాడని, రూ.50వేలు ఇచ్చి తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ముందుకెళ్లిన దర్యాప్తు బృందం ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పవన్‌తో పాటు గుర్తుతెలియని మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా అసలు విషయం వెల్లడించారు బస్టాప్‌లో పరిచయంతో.. మూడు నెలల క్రితం కూకట్‌పల్లికి చెందిన కలిబింది వరలక్ష్మితో కూకట్పల్లి బస్‌స్టాప్‌లో పవన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిరువురు ప్రతిరోజూ కలుసుకునే వారు. బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన పవన్ పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వరలక్ష్మి వద్ద రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బులు తిరిగి ఇవ్వాలని వరలక్ష్మి అతడిపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఇంట్లో డబ్బులు ఇవ్వరని భావించిన పవన్ ఆమెతో కలిసి కిడ్నాప్ డ్రామాకు పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పవన్ వరలక్ష్మీని కలిశాడు. ఇద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. పథకంలో భాగంగా వరలక్ష్మి పవన్ తల్లికి ఫోన్ చేసి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..) -
ఆల్ ఉమెన్ టీమ్
కొన్ని నాటకాలు మన జీవితాల్లో నుంచే నడిచొస్తాయి. మన జీవితాన్ని కొత్తగా చూపుతాయి. ఆలోచనలకు పదును పెడతాయి. ఆల్–ఉమెన్ బృందం ‘దేఖ్ బహెన్’ అచ్చంగా అలాంటి నాటకమే! తల్లి, కూతురు, భార్య, సోదరి, ప్రియురాలు... ఇలా రకరకాల పాత్రలలో ఉన్న మహిళలకు సంబంధించిన నాటకం దేఖ్ బహెన్. ఎనభై నిమిషాల నిడివిగల ఈ ఆల్–ఉమెన్ ప్లే రకరకాల మహిళలకు సంబంధించి రకరకాల భావోద్వేగాల సమ్మేళం. జీవితంలోని తీపి, చేదుల కలయిక. అస్త అరోర, ప్రీతి చావ్లా, ప్రేరణ చావ్లా, శిఖా తల్పానియా, తహీరనాథ్ కృష్ణన్ ఈ నాటకంలో నటించారు. ‘రచన అనేది సులువైన పనేమీ కాదు. కత్తి మీద సాము. కొన్నిసార్లు మనతో మనమే పోరాడవలసి ఉంటుంది. ఇది కఠినమైన ప్రయాణమే అయినప్పటికీ మంచి అనుభూతిని కలిగించే ప్రయాణం. ఎన్నో విలువైన జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునే ప్రయాణం’ అంటుంది ప్లే రైటర్ దిల్షాద్ ఎడిబమ్ ఖురానా. నాటక రచనలో ఖురానాకు కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ సహకరించారు. ఈ ఆప్తమిత్రులు నాటకరచన సమయంలో కొన్నిసార్లు ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించుకుంటారు. అలా అని మొండిగా వ్యవహరించరు. ఒకరి కాన్సెప్ట్ మరొకరికి నచ్చితే మళ్లీ ఆప్తమిత్రులు అవుతారు.‘నాటక రచనలో ఇద్దరు వ్యక్తులు పాలుపంచుకున్నప్పుడు వాదోపవాదాలు సహజమే. అలా ఉంటేనే నాటకం బలంగా వస్తుంది. కొన్ని విషయాల్లో మా ఇద్దరి ఆలోచనల్లో తేడా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో మేము ఒకేలా ఆలోచిస్తాం. ఇదే మా బలం’ అని కో–రైటర్ తహీరనాథ్ క్రిష్ణన్ గురించి చెబుతుంది దిల్షాద్. ‘మహిళల బృందానికి సంబంధించిన నాటకం ఇది. నేల విడిచి సాము చేయని నాటకం. హృదయానికి దగ్గరయ్యే నాటకం. రంగస్థలంపై కనిపించే దృశ్యాలు మనల్ని నిజజీవిత దృశ్యాలతో మమేకమయ్యేలా చేస్తాయి. కొత్తగా ఆలోచించేలా చేస్తాయి. అతి నాటకీయత లేకుండా డైలాగులు సహజంగా ఉంటాయి’ అంటుంది కో–రైటర్ తహీరనాథ్ కృష్ణన్. ముంబైకి చెందిన ప్రేరణ చావ్లా ఈ నాటకానికి దర్శకత్వం వహించింది. ‘నన్ను సవాలు చేసే పనులను నెత్తికెత్తుకోవడం అంటే నాకు మొదటి నుంచి ఇష్టం. ఈ నాటకానికి డైరెక్టర్‌గా బాధ్యత తీసుకోవడం కూడా అలాంటిదే. టీమ్ నన్ను బలంగా నమ్మింది. ఆ నమ్మకమే నాకు మరింత బలాన్ని ఇచ్చింది. గొప్ప నటులతో పనిచేయాలనే నా కల దేఖ్ బహెన్ నాటకంతో నిజమైంది’ అంటుంది ప్రేరణ చావ్లా. నాటక రిహార్సెల్ కార్యక్రమాలు ముంబైలో మిలిటరీ క్రమశిక్షణ ప్రమాణాలతో సాగాయి. ‘మూస విధానంలో ఈ నాటకాన్ని రూపొందించలేదు. మహిళలకు సంబంధించిన అన్ని కోణాలను వ్యక్తీకరించే నాటకం ఇది’ అంటున్నారు నిర్మాత ఆకర్ష్. ఆకర్ష్ తప్ప ఈ నాటకానికి సంబంధించిన దర్శకులు, సాంకేతిక నిపుణులు, డిజైనర్లు, నటులు అందరూ మహిళలే. ‘స్క్రిప్ట్ నచ్చిన తరువాత నాటకం విషయంలో జోక్యం చేసుకోలేదు. వారికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాను. ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ నాటకం గొప్పగా వచ్చేలా చేశారు. ఈ నాటకం ద్వారా మేము ముందడుగు వేసినట్లుగా భావిస్తున్నాం’ అంటున్నాడు ఆకర్ష్. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
గన్ షాట్ : కుప్పం డ్రామా ఎందుకు బెడిసికొట్టింది..?
-
బెడిసికొట్టిన చంద్రబాబు పన్నాగం..
-
బెడిసికొట్టిన పచ్చ బాబుల అక్రమ మైనింగ్ డ్రామా
-
వీధుల్లో కరోనా ఫై డ్రామా అవగాహనా .... కరోనా ఎఫెక్ట్
-
తిరుపతి సభలో రాళ్ల విసిరారు అంటూ చంద్రబాబు డ్రామా : విష్ణువర్ధన్ రెడ్డి
-
సీఎం వైఎస్ జగన్ ఫై వ్యక్తిగత దాడికి దిగడం ప్రతిపక్షాల నీచ రాజకీయం
-
వైరల్: యాక్టింగ్‌లో లీనమై త్రిశూలంతో..
బెంగళురు: నటనలో జీవించడం అనే మాట సాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్న వారిని చూశాం. కానీ ఇక్కడ నటించమంటే ఏకంగా జీవించి తోటి నటుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టిన ఘటన చర్చకు దారితీసింది. ఒక రంగస్థల నటి తన పాత్రలో లీనమైపోయి సహనటుడినే చంపబోయిన వైనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీంతో ఆమెను ‘మహనటి’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో నాల్వడి కృష్ణరాజ ఒడయార్ బృందం కౌండలీకన వధ అనే నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంలో ద్రౌపది పాత్రధారి సహనటుడిని త్రిశూలంతో పొడవబోయింది. అయితే అక్కడి నాటక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అతనికి ప్రమాదం తప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. చదవండి: నటుడి ప్రేమ వివాహం: ఇప్పటికీ నమ్మలేకపోతున్నా -
అబద్ధాల బాబు
-
రమణీయం.. రామాయణం
-
చలో ప్రగతి భవన్: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ డ్రామ
-
ముగిసిన నాటకోత్సవాలు
-
మోరియా...ఓ ధీర వనిత గాథ
-
మనోహరం.. మంత్రముగ్ధం
-
కడప ఉక్కు కర్మాగారం డ్రామా
-
హోదాపై పోరు అంటూ బాబు నాటకాలాడుతున్నారు
-
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి పరకాల గుడ్‌బై
-
పరాకాష్టకు చేరుకున్న టీడీపీ నాటకాలు
-
అఖిల సంఘం పేరుతో టీడీపీ కొత్త నాటకం
-
ఉద్దానంపై బాబు కపట నాటకం
-
హృదయాలను హత్తుకున్న ‘సరికొత్త మనుషులు’
అలరించిన బాలల నృత్య ప్రదర్శన కాకినాడ కల్చరల్ : స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను గురువారం శుభోదయ ఫౌండేషన్ చైర్మన్ వాసా సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి మాట్లాడుతూ నాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరిషత్ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. ముందుగా ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. బుద్ధరాజు చేస్తున్న సేవలను పరిషత్ కార్యదర్శి పంపన దయానందబాబు కొనియాడారు. తదుపరి అభినయ ఆర్ట్స్(గుంటూరు) సారథ్యంలో శిష్టా చంద్రశేఖర్ రచించిన ‘సరికొత్త మనుషులు’ నాటికను ఎన్.రవీంద్రారెడ్డి దర్శకత్వంలో ప్రదర్శించారు. భారత దేశంలో అనాథశరణాలయాల ఆవశ్యతను చక్కగా చిత్రీకరించారు. మగవాడి పశువాంఛకు బలై గర్భం దాల్చిన కన్యలు పడుతున్న మనోబాధలను చక్కగా చిత్రీకరించారు. చేసిన తప్పుకు ఫలితంగా జన్మించిన పిల్లలను సమాజంలో గౌరవంగా సాకలేక, అలా అని వదిలిపెట్టలేక మనస్సు చంపుకొని అనాథ శరణాలయాలకు దొంగచాటుగా అప్పగిస్తున్న యధార్థ సంఘటనలను ఈ నాటికలో చిత్రీకరించారు. అనంతరం శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్రనాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్యులు ప్రదర్శించిన వినాయక శబ్ధం, శివ పంచాక్షరి నృత్యాలు అకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరీష, బాజిబోయిన వెంకటేష్ నాయుడు, తురగా సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘చాలు ఇక చాలు’ స్ధానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజల నుంచి నిర్వహిస్తున్న నాటిక పోటీలు గురువారంతో ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా చాలు ఇక చాలు నాటికను ఎంపిక చేసారు. ద్వితీయ ప్రదర్శనగా గోవు మాలచ్చిమి, తృతీయ ప్రదర్శనగా తేనేటీగలూ పగబడతాయి నాటికలు ఎంపిక చేసారు.అలాగే ఉత్తమ దర్శకులుగా చాలు ఇక చాలు నాటికకు దర్శకత్వ చేసిన గోపారాజు విజయ్, ఉత్తమ నటుడుగా చాలు ఇక చాలు కథానాయకుడు రమణ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నటిగా గోవు మాలచ్చిమి నాటికలో వెంకట లక్ష్మి పాత్రదారిణి అమృతవర్షిణి, ద్వితీయ ఉత్తమ నటిగా సరికొత్త మనుషులు లో నటించిన టి.లక్ష్మి ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ రచనకు గాను గోవుమాచ్చిమి నాటిక రచించిన చెరుకూరి సాంబశివరావు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ విలన్ గా తేనేటీగలూ పగబడతాయి నాటికలో దొర పాత్రదారి అమరేంద్ర ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటులుగా తేటేటీగలూ పగబడతాయి నాటికలో పాముల ఆదియ్య పాత్ర దారి బి.మోహాన్ ఎంపికయ్యారు. వీరికి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అవార్డులను ప్రధానం చేసి ఘనంగా సత్కరించింది. ఈకార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు గ్రంధి బాబ్జి, కార్యదర్శి పంపన దయానందబాబు, సభ్యులు తదితరలు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న ‘అంతిమ తీర్పు’
రెండోరోజు ఉత్సాహంగా నాటికల పోటీలు కాకినాడ కల్చరల్: స్థానిక సూర్యకళామందిర్‌లో అల్లూరి సీతారామరాజు నాటక పరిషత్ ఆధ్వర్యంలో రెండు రోజుల నుంచి రాష్ట్రస్థాయి నాటిక పోటీలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా బుధవారం ప్రదర్శించిన నాటికల పోటీలను కరప సర్పంచ్ పోలిశెట్టి నారయ్య(తాతీలు) జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పంపన దయానందబాబు మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందకు తమ సంస్థ కృషి చేస్తోందన్నారు. ముందుగా శ్రీమూర్తి అసోసియేషన్(కాకినాడ) సారధ్యంలో పీవీ భవానీ ప్రసాద్ రచించిన ‘అంతిమతీర్పు’ నాటికను డా.సి.ఎస్.ప్రసాద్ దర్శకత్వంలో ప్రదర్శించారు. ఒక దురదృష్ట సంఘటనకు లోనై తనలో తాను కుమిలిపోతు.. కసి, కోపం,ద్వేషం పెంచుకొని చివరకు కట్టుకున్న భర్తని, కన్న కొడుకును దరికి చేర్చుకోలేక , మనశ్శాంతికి దూరమైన ఒక జనని కథ అంతిమ తీర్పు నాటిక. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక (శ్రీకాకుళం) సారధ్యంలో కేకేఎల్ ప్రసాద్ దర్శకత్వం, రచన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’నాటిక ప్రదర్శించారు. భూస్వాముల దోపిడికి బడుగు, బీద వర్గం బలైపోయే సన్నివేశాలను చాలా అద్భుతంగా చిత్రికరించారు. తదుపరి ఉషోదయా కళానికేతన్(కట్రపాడు) సారధ్యంలో చెరుకూరి సాంబశివరావు రచన, దర్శకత్వం వహించిన ‘గోవు మాలచ్చిమి’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ప్రస్తుతం సమాజంలో అద్దె గర్భాలతో మన సంస్కృతిక, సాంప్రదాయలను మంట గలుపుతున్నారనే భావంతో ఈ నాటికను రూపొందించారు. పేద మహిళలు మనస్సు చంపుకొని ఏవిధంగా ఇటువంటి అద్దె గర్భాలకు అంగీకరిస్తోన్నారు కళ్ళకు కట్టినట్టు నాటిక ప్రదర్శించారు. తదుపరి శ్రీసాయి ఆర్ట్స్ (కొలుకులూరు) సారధ్యంలో పి.వి.భవానీ ప్రసాద్ రచించిన ‘చాలు–ఇకచాలు’ నాటిక గోపరాజు విజయ్ దర్శకత్వంలో ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా బొర్రా పద్మనాభం, కొల్లి వెంకట్రావు, ఎం.జానకీరామ్‌లు వ్యవహరించారు. కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరావు, శిరిష, తురగా సూర్యారవు తదితరులు పాల్గొన్నారు. నేడు సరికొత్త మనుషులు నాటిక స్థానిక సూర్యకళామందిర్‌లో గురువారం సాయంత్రం ఎన్.రవీంద్రా రెడ్డి దర్శకత్వంలో ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు సేవారత్న అవార్డు ప్రధానం చేస్తారు. 05కెకెడి197–270025: తేనేటీగలు పగబడతాయి నాటికలో ఒక సన్నివేశం 05కెకెడి198–270025: గోవు మాలచ్చిమి నాటికలో ఒక సన్నివేశం -
బ్రెజిల్ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి
నంగునూరు (సిద్దిపేట): నాటక రంగంలో జరుగుతున్న పరిశోధ నలు, పరిణామాలపై ఈనెల 10న జరిగే అంతర్జాతీయ సదస్సు కు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన పీహెచ్డీ విద్యార్థి కొండల్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ థియేటర్ రిసెర్చ్ (ఐఎఫ్‌టీఆర్) ఆధ్వర్యంలో ఈ నెల 10–15 వరకు బ్రెజిల్‌లోని సౌఫా వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న కొండల్‌రెడ్డి ‘షైలాక్ ఇన్ ఫిమేల్ బాడీ’ అంశంపై సదస్సులో ప్రసంగించనున్నారు. యూజీసీ, జేఆర్సీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో కొండల్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా, తెలుగు వర్సిటీల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభ చాటడంతో అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. -
రేపటి నుంచి నాటికల పోటీలు
కాకినాడ కల్చరల్ : కళాకారులను ప్రోత్సహిస్తూ, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి బాబ్జి, పంపన దయానంద బాబు తెలిపారు. స్థానిక యంగ్మెన్స్ క్లబ్ సమావేశపు మందిరంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థల సౌజన్యంతో ఈ నెల 4 నుంచి 6 వరకూ స్థానిక సూర్యకళామందిర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరప గ్రామంలోని శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 4న గోవాడ క్రియేషన్స్ వారి ‘రచ్చబండ’ నాటిక, ఎస్ఎన్ఎం క్లబ్ వారి ‘గడి’ నాటిక, 5న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక రూపకల్పన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’ నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ వారి ‘అంతిమ తీర్పు’ నాటిక, 6న ఉషోదయ కళానికేతన్ వారి ‘గోవు మాలచ్చిమి’ నాటిక, శ్రీసాయి ఆర్ట్స్ వారి ‘చాలు–ఇకచాలు’ నాటిక, అభినయ ఆర్ట్స్ వారి ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు. శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్ర నాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్య బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులకు ‘సాహితీ కళాభిజ్ఞ’ పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు ‘సేవారత్న’ ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, భీమశంకర్, తురగా సూర్యారావు, టి.ఎల్.ఆచారి తదితరులు పాల్గొన్నారు. -
‘డ్వామా’లో మెగా డ్రామా
- ఉపాధి సిబ్బందికి ప్రభుత్వ ప్రోత్సాహకం - జిల్లాకు సుమారు రూ.74 లక్షలు విడుదల - ఖాతాల్లోకి వేయడంలో అధికారుల నిర్లక్ష్యం - ‘మెగా చెక్’ పేరుతో ప్రచార ఆర్భాటానికి ఏర్పాట్లు - బాబు, చినబాబుతోనే ఇప్పించాలని ప్లాన్ సంక్షేమ పథకాలను నిరుపేదల దరికి చేర్చడంలో విఫలమవుతున్న ప్రభుత్వం... ఆ అప్రతిష్టను తొలగించుకునేందుకు నానా పాట్లు పడుతోంది. అందువల్లే అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ప్రచారం చేసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగానే ‘డ్వామా’లో మెగా డ్రామా ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉపాధిహామీ సిబ్బందికి మంజూరైన ప్రభుత్వ ప్రోత్సాహక మొత్తాన్ని పంపిణీ చేసేందుకు ‘మెగా’ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. - అనంతపురం టౌన్ కరువు జిల్లాలో వలసలు నివారించేందుకు చేపట్టిన ‘ఉపాధి’ హామీ పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల అబాసుపాలవుతోంది. ఈ క్రమంలోనే దిద్దుబాటు చర్యలకు దిగిన గ్రామీణాభివృద్ధి శాఖ బాగా పని చేస్తున్న ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇచ్చి పని దినాలు పెంచేలా ప్రణాళిక సిద్ధ౾ చేసింది. అందులో భాగంగా ఉపాధిహామీ పథకం సిబ్బంది గ్రామాల్లో ఎన్ని కుటుంబాలకు, ఎన్ని వంద రోజులు పని కల్పిస్తే అన్ని వందల రూపాయలు మంజూరు చేసింది. జిల్లాకు రూ.74 లక్షలు జిల్లాలో 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను ఉపాధి హామీ పథకంలో 73,971 కుటుంబాలకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 73,971 కుటుంబాలకు వంద రోజులు కల్పించినందుకు రూ.100 చొప్పున రూ.73,97,100 మంజూరు చేసింది. వంద రోజులు పనిదినాలు కల్పించడంలో భాగస్వాములైన మేట్లు /జూనియర్ మేట్లు /సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.30 చొప్పున, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ.15 చొప్పున, ఈసీకి రూ.10, ఏపీఓలకు రూ.10, కంప్యూటర్ ఆపరేటర్‌కు రూ.5 చొప్పున పారితోషకం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కలను బట్టి చూస్తే ఏపీఓ, జేఈ, కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.వేలల్లో పారితోషకాలు అందుతాయి. వీలైతే బాబు..లేదంటే చినబాబు జిల్లాకు మంజూరు చేసిన ప్రోత్సాహక మొత్తాన్ని 15 రోజుల్లోపు సిబ్బందికి అందజేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు నెలలైనా నేటికీ ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. అసలు విషయం ఏంటని ఆరా తీస్తే.. విడుదలైన మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేస్తే ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ రాదు. అదే ప్రత్యేక కార్యక్రమం చేపడితే కొద్దోగొప్పో ప్రచారం దక్కుతుంది. ఈ మేరకు డ్వామా అధికారులు కూడా సన్నాహాలు చేస్తున్నారు. వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కాకుంటే గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ‘మెగా’ చెక్ ఇప్పించాలని భావిస్తున్నారు. పనిలో పనిగా ‘థ్యాంక్యూ సీఎం’ కార్యక్రమం కూడా చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే చంద్రబాబు కన్నా చినబాబు చేతుల మీదుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రాజకీయంగా ఆయనకు కాస్త మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుందని, ఆ దిశగానే జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. మరోవైపు నిధులు విడుదలైనా మంజూరులో జాప్యంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. -
నాటకం..రసాత్మకం
- కర్నూలులో జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం కర్నూలు(హాస్పిటల్): నాటకాలను ప్రజలు ఆదరించాలని, అప్పుడే కళాకారులకు మనుగడ ఉంటుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. టీజీవీ కళాక్షేత్రంలో స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జాతీయ స్థాయి నాటిక పోటీలను జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటకం రసాత్మకమైనదన్నారు. అయితే దీనిని ఆదరణ తగ్గడం ఆవేదన కలిగిస్తోందన్నారు. 11 సంవత్సరాల నుంచి లలిత కళాసమితి నాటకాలను ప్రోత్సహిస్తూ నగర ప్రజలకు వినోదాలను అందిస్తోందని తెలిపారు. ఈ నాటికలు సకుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉన్నాయన్నారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ.. కావ్యం రెండు రకాలని, ఒకటి దృశ్య, రెండోది శ్రవ్య కావ్యమన్నారు. ఈ నాటికలు శ్రవ్య నాటికలని చెప్పారు. ఇవి చక్కటి సందేశాలను ఇచ్చే విధంగా ఉన్నాయని కొనియాడారు. అనంతరం నాటిక దర్శకులు శ్రీజ సాదినేని, భాస్కర్నాయక్లను సన్మానించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, సభ్యులు డి. ఈశ్వరయ్య, శ్రీనివాసరావు, క్రిష్టఫర్, టీవీ రెడ్డి పాల్గొన్నారు. డబ్బు విలువ తెలిపే సందడే సందడి శ్రీ జయ ఆర్ట్స్(హైదరాబాద్) వారి సందడే సందడి నాటిక విశేషంగా ఆకట్టుకుంది. శ్రీజా సాదినేని రచన, దర్శకత్వం వహించిన ఈ నాటికలోని ఇతి వృత్తం ఇది. సులభంగా డబ్బు సంపాదించాలని ముందు, వెనకా ఆలోచించకుండా ప్లాట్లు, ఫ్లాట్లు కొనేయడం,,రిజిస్టర్ కాని చిట్‌ఫండ్ కంపెనీల్లో, మోసపూరితమైన బ్యాంకుల్లో ధనాన్ని పెట్టడం ఎంత ప్రమాదమో ఈ నాటిక వివరిస్తుంది. దైనందిక జీవితంలో టీవీని ఒక ప్రధాన భాగంగా మార్చుకున్న సుశీల తన భర్తను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటుంది. భార్యపై పిచ్చి ప్రేమతో ఆమె భర్త చంద్రశేఖర్ ఆమె మాటను కాదనలేడు. సుశీల తమ్ముడు భగవాన్ తన తెలివితేటలతో అక్కను, భావను ఎలా మార్చాడన్నదే ఈ కథ. హాస్య ప్రదానంగా సాగే కథనం సామాజిక ఇతివృత్తాన్ని చాపకింద నీరులా నడిపిస్తుంది. భారతీయ వివాహ వ్యవస్త గొప్పతనాన్ని తెలిపే సప్తపది శ్రీ అంజన రాథోడ్ థియేటర్స్ వారి సప్తపది నాటిక భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థ గొప్పతనం గురించి చెబుతుంది. తాళాబత్తుల వెంకటేశ్వరరావు ఈ నాటికను రచించారు. బలహీనమైన ఆలోచనలతో, చిన్న చిన్న కారణాలతో విడాకుల పేరుతో విలువైన వైవాహిక జీవితాన్ని భగ్నం చేసుకుంటున్నారని, మన వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్ని, సప్తపదుల పవిత్రత మహోన్నతమైనవని గుర్తు చేస్తూ ఈ నాటిక సాగుతుంది. నేటితరం సప్తపదుల సాక్షిగా చేసిన వాగ్దానాన్ని గౌరవిస్తూ, వైవాహిక జీవితాన్ని ఆనందంగా సాగిస్తూ ఆదర్శదంపతులుగా వర్దిల్లాలని సందేశమిచ్చేదే ఈ నాటిక సారాంశం. -
నేటి నుంచి జాతీయ స్థాయి నాటిక పోటీలు
–మూడురోజుల పాటు ప్రదర్శనలు కర్నూలు(హాస్పిటల్): టీజీవీ కళాక్షేత్రం(లలితకళాసమితి) స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 14, 15, 16వ తేదీల్లో జాతీయ స్థాయి నాటిక పోటీలను నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ టీజీ భరత్, అధ్యక్షుడు పత్తి ఓబులయ్య చెప్పారు. శనివారం స్థానిక మౌర్య ఇన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జాతీయ స్థాయి నాటిక పోటీలు నిర్వహించడం 11వ సారన్నారు. నేటితరం, భావితరాలు మన సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. 14న సాయంత్రం 6గంటలకు ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, 16వ తేదీన ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ హాజరవుతారని వెల్లడించారు. నాటక ప్రదర్శనల వివరాలు –14వ తేది రాత్రి 7.30 గంటలకు శ్రీ జయ ఆర్ట్స్, హైదరాబాద్ వారి ‘సందడే సందడి’ –14వ తేది రాత్రి 8.30 గంటలకు శ్రీ అంజన రాథోడ్ థియేటర్స్ వారి ‘సప్తపది’ –15వ తేది సాయంత్రం 6.30 గంటలకు శ్రీ ఉషోదయ కళానికేతన్, కాట్రపాడు వారి ‘గోవు మాలక్ష్మి’ –15 రాత్రి 8 గంటలకు శ్రీ శాలివాహన కళామందిర్, చెన్నూరు, నెల్లూరు వారి ‘మనిషి కాటు’ –15 రాత్రి 9 గంటలకు నెల్లూరు వారి ‘మాతృవందనం’ –16వ తేది ఉదయం 10.30 గంటలకు శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరి వారి ‘చాలు ఇక చాలు’ –16వ తేది మధ్యాహ్నం 11.45 గంటలకు శ్రీమూర్తి కల్చలర్ అసోసియేషన్ వారి ‘అంతిమతీర్పు’ –16వ తేది మధ్యాహ్నం 12.45 గంటలకు సిరిమువ్వ కల్చరల్స్, హైదరాబాద్ వారి ‘కల్లం దిబ్బ’ -
ఉత్తమ నాటిక ‘చాలు ఇక చాలు’
తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు గొల్లప్రోలు : శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో తాటిపర్తి గ్రామంలో నిర్వహిస్తున్న 12వ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు మంగళవారం రాత్రితో ముగిశాయి. స్థానిక అపర్ణా కళాతోరణం, బత్తుల మురళీకృష్ణ కళావేదికపై మూడు రోజులుగా నాటిక పోటీలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజున ‘చాలు ఇక చాలు’, ఖాళీలు పూరించండి నాటికలను ప్రదర్శించారు. నాటిక పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు, కళాభిమానుల తరలివచ్చారు. ఉత్తమ ప్రదర్శన చాలు ఇక చాలు పోటీల్లో ఉత్తమ నాటికగా కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక ఎంపికైంది. ద్వితీయ ఉత్తమ నాటికగా తాడేపల్లి వారి అరవింద ఆర్ట్స్ ‘ఆగ్రహం’, తృతీయ ఉత్తమనాటికగా సికింద్రాబాద్ వారి కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారి ‘ఖాళీలు పూరించండి’ ఎంపికైంది. ఉత్తమ నటుడు– కరణం సరేష్(అనంతం), ఉత్తమ నటి–సాదినేని శ్రీజ(ఖాళీలు పూరించండి) , ఉత్తమ రచన– పి.మృత్యుంజయరావు(అనగనగా..), ఉత్తమదర్శకుడు ఆర్ వాసు (అనగనగా..) ఉత్తమ క్యారెక్టర్ నటుడు బీవీ లక్ష్మయ్య(ఆగ్రహం), ప్రతినాయకుడు –పి.భద్రేశ్వరరావు(చేతిరాత ), రంగాలంకరణ యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్(అనగనగా..) ఆహార్యం– పి.మోహనేశ్వరరావు(అనగనగా), ఉత్తమ సంగీతం– కేఎస్ఎన్ రావు(పితృదేవోభవ) ఎంపికయ్యాయి. అనగనగా నాటిక ప్రత్యేక జ్యూరీ అవార్డును కైవసం చేసుకుంది. నాటికలకు న్యాయనిర్ణేతలుగా రాజాతాతయ్య, కట్టా కృష్ణారావు వ్యవహరించారు. విజేతలకు శ్రీమార్కండేయ నాటక కళాపరిషత్ అధ్యక్షులు పడాల రవి, ప్రధానకార్యదర్శి జక్కా సాంబశివరావు, రాజాతాతయ్య, బత్తుల వెంకటశివరామారావు తదితరులు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. కుటుంబభావోద్వేగాలను చాటిన ‘చాలు ఇక చాలు ’: కొలకలూరుకు చెందిన శ్రీసాయిఆర్ట్స్ వారు ప్రదర్శించిన ‘చాలు ఇక చాలు’ నాటిక కుటుంబభావోద్వేగాలను చాటింది. ఈ లోకంలో ప్రతి దానికి మితం ఉందని.. కానీ పిల్లలు ఏదడిగినా తల్లిదండ్రులు కాదు.. లేదు..కుదరదు అని చెప్పలేరని... అదే పిల్లలు ఎదిగి పెద్దవారయ్యాక తల్లిదండ్రులు ఏది అడిగినా ‘కాదు.. లేదు..కుదరదు’ అని ఎంతో సులువుగా తప్పించుకుంటున్నారనే ఇతి వృత్తంతో నాటిక సాగింది. ఈ నాటికకు గోపరాజు విజయ్ దర్శకత్వం వహించగా, పీవీ భవానీ ప్రసాద్ రచించారు. ఆలోచింపజేసిన ‘ఖాళీలు పూరించండి’.. సికింద్రాబాద్‌కు చెందిన కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ వారు ప్రదర్శించిన ‘ఖాళీలు పూరించండి’ నాటిక ఆద్యంతం ఆలోచింపజేసింది. సమాజంలో జరుగుతున్న నేరాలు..వాటి పరిణామాలను ఇతి వృత్తంగా చేసుకుని నాటిక సాగింది. రచయిత భాగవతుల ఉదయ్ నాటిక ద్వారా చక్కని సందేశమిచ్చారు. హాస్యాస్పదంగా సాగిన‘ అంతా మన సంచికే ’.. గుంటూరుకు చెందిన గణేష్ ఆర్ట్స్‌వారు ‘అంతా మన సంచికే ’ నాటిక ప్రత్యేక ప్రదర్శనగా ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం హాస్యాస్పదంగా.. సందేశాత్మకంగా సాగింది. డబ్బు కంటే మమతానురాగాలు ముఖ్యమని నాటిక తెలియచెప్పింది. -
సీఆర్సీ కళాసేవ అభినందనీయం
-ఎమ్మెల్యే చిర్ల, నటుడు ఎల్బీ శ్రీరామ్ -రాష్ట్రస్థాయి ఉగాది నాటిక పోటీలు ప్రారంభం రావులపాలెం : అంతరించి పోతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించేందుకు సీఆర్సీ కాటన్ కళాపరిషత్ చేస్తున్న కృషి అభినందనీయం అని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రముఖ సినీనటుడు ఎల్బీ శ్రీ రామ్ ప్రశంసించారు. బుధవారం రాత్రి రావులపాలెంలోని కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్(సీఆర్సీ) కాటన్ కళాపరిషత్ ఆధ్వర్యంలో 19వ ఉగాది ఆహ్వాన రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. సీఆర్సీ ఏసీ ఆడిటోరియంలో జగ్గిరెడ్డి, శ్రీరామ్ జ్యోతి ప్రజ్వలన చేసి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాపరిషత్ కన్వీనర్ డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు 19 వసంతాలుగా నాటికలను పరిచయం చేస్తు వారిలో ఆలోచన రేకెత్తిస్తున్న సీఆర్సీ సేవలు ప్రశంసనీయం అన్నారు. శ్రీరామ్ మాట్లాడుతూ స్వాతంత్రోద్యమం కాలంలో నాటక రంగం కీలక పాత్ర వహించిందన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సీఆర్సీ కార్యవర్గ సభ్యులు శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. సినీ నటుడు జెన్నీ, రామచంద్రపురం డీఎస్సీ ఎన్బీ మురళీకృష్ణ, ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, సీఆర్సీ అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి ఆశోక్‌రెడ్డి, సేవా విభాగం డైరెక్టర్ కర్రి సుబ్బారెడ్డి, కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, సత్తి రామకృష్ణారెడ్డి(మారుతి), మల్లిడి వీర్రెడ్డి, నల్లమిల్లి వీరాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, మంతెన రవిరాజు, పలివెల త్రిమూర్తులు, మన్యం సుబ్రహ్మణ్శేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. అలరించిన నాటికలు మొదటిరోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను అలరించాయి. గుంటూరు జిల్లా కట్రపాడు ఉషోదయ కళానికేతన్ ‘గోవు మాలచ్చిమి’ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వహించారు. ఒకప్పుడు సైకిల్ అద్దెకు తీసుకుని అద్దె చెల్లించేవాళ్ళమని ఇప్పుడు ఆడదాన్ని గర్భాన్ని అద్దెకు తీసుకుని వ్యాపారంగా మార్చి అమ్మతనాన్ని మంటకలుపుతున్నామని ఈ నాటిక ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అద్దె గర్భ వ్యాపారానికి సంకెళ్ళు వేసి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని తెలియజేప్పారు. అనంతరం హైదరాబాద్ శ్రీ మురళీ కళానిలయం వారు ప్రదర్శించిన ‘అం అః కం కః’ నాటిక హాస్యభరితంగా సాగింది. కష్టపడకుండా కోట్లు సంపాదించాలని దురాశతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి చివరకు బాకీదారులను తట్టుకోలేక చనిపోయినట్టు నాటకం ఆడిన విశ్వపతికి అప్పుల వాళ్ళు ఎలా బుద్ధి చెప్పారో చూపారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. వారికి సీఆర్సీ సభ్యులు ఆల్పాహారం ఏర్పాటు చేశారు. పోటీలకు అదృష్టదీపక్, పోల్నాటి గోవిందరావు, బొడ్డు రాజబాబు నాయ్యనిర్ణేతలుగా వ్యవహరించారు. -
ముగిసిన రాష్ట్రస్థాయి నాటిక పోటీలు
ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) : ద్రాక్షారామ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. ఉత్తమ ప్రదర్శనగా సికింద్రాబాద్ కేజేఆర్ కల్చరల్ అసోసియేషన్ ‘ఎవరిని ఎవరు క్షమించాలి,’ ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ ‘కేవలం మనుషులం,’ ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు ఉషోదయా కళానికేతన్ కట్రపాడు ‘గోవు మాలచ్చిమి,’ ఎంపికయ్యాయి. ఉత్తమ నటిగా ‘గోవు మాలచ్చిమి’ నాటికలో వెంకటలక్ష్మి పాత్రధారి ఎస్.అమృతవర్షిణి. ఉత్తమ నటుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటికలో పుణ్యదాసు పాత్రధారి జోగారావు, ఉత్తమ దర్శకుడిగా ‘ఎవరిని ఎవరు క్షమించాలి’ నాటిక దర్శకుడు ఉదయ్ భాగవతులు, ఉత్తమ రచనకు ‘కేవలం మనుషులం’ నాటిక రచయిత శిష్టా చంద్రశేఖర్, ఉత్తమ సంగీతం బహుమతి ‘గోవు మాలచ్చిమి’ నాటికకు పి.లీలామోహన్. ఉత్తమ విలన్‌గా ఒంగోలు జనచైతన్య ‘చేతిరాత’ నాటికలో గోవిందరాజు పాత్రధారి పి. భద్రేశ్వరరావు, ఉత్తమ కారెక్టర్ నటుడు ‘కేవలం మనుషులు’ నాటికలో మీర్జా ఆలీఖాన్ పాత్రధారి వీసీహెచ్‌కే ప్రసాద్, ఉత్తమ ద్వితీయ నటి ‘చేతిరాత నాటిక’లో దుర్గ పాత్రధారి ఎల్.పద్మావతి. ఉత్తమ ద్వితీయ నటుడు ‘గోవు మాలచ్చిమి’ నాటికలో నారాయణ పాత్రధారి చిరుకూటి సాంబశివరావుకు లభించాయి. ‘సప్తపది’ నాటికలో ముకుందం పాత్రధారి ఎ.హరిబాబు, ‘చేతిరాత’ నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి సీహెచ్ సుబ్బారావు, ‘కేవలం మనుషులం’ నాటికలో అమల్రాయ్ పాత్రధారి ఎ.లక్ష్మణశాస్త్రికి జ్యూరీ బహుమతులు లభించాయి. నాగిరెడ్డికి ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం ముగింపు సమావేశంలో ద్రాక్షారామ నాటక కళాపరిషత్ అధ్యక్షడు నాగిరెడ్డి సత్యనారాయణకు ‘రంగస్థల సేవారత్న’ బిరుదు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ నాగిరెడ్డి ఈ పరిషత్ స్థాపించి 80 ఏళ్ల వయసులో కూడా చేస్తున్న సేవలను కొనియాడారు. పరిషత్ ఉపా«ధ్యక్షుడు వైఎన్వీవీ సత్యనారాయణ (కొండ), కార్యదర్శి, సినీనటి వై.సరోజ, పరిషత్ కోశాధికారి అయినవిల్లి సతీష్, సంయుక్త కార్యదర్శి వేమవరపు రాంబాబు, పరిషత్ ఆర్గనైజర్ నాగిరెడ్డి సతీష్‌రావు, పరిషత్ సభ్యులు మాకినీడి రామారావు, ఉంగరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనను చిక్కాల సత్కరించారు. పెద్దిరెడ్డి సూరిబాబు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు స్టాలిన్, చింతపల్లి వీరభద్రరావు, చింతపల్లి ఈశ్వరరావు కాజులూరు ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, ఆళ్ల రాంబాబు, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మీర్జాఖాసిం హుస్సేన్, కోటిపల్లి అబ్బు తదితరులు పాల్గొన్నారు. -
కళలకు పుట్టినిల్లు.. పాలకొల్లు
పాలకొల్లు టౌన్ : కళలకు పుట్టినిల్లైన పాలకొల్లు నుంచి ఎందరో కళాకారులు సినీ రంగంలో ప్రవేశించి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటారని కేంద్ర మంత్రి వై.సుజనాచౌదరి, శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, రాష్ట్ర మంత్రి పీతల సుజాత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురదేశ్వరి, ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. శనివారం రాత్రి పాలకొల్లులో డాక్టర్ గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ 10వ జాతీయ నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో వారు పాల్గొని మాట్లాడారు. సభకు పరిషత్ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాస చౌదరి అధ్యక్షత వహించారు. నేటి హైటెక్ యుగంలో కూడా ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ కళాపరిషత్‌లు నాటకాలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, బి.గోపాల్, మాటల రచయిత చింతపల్లి రమణ, నిర్మాత అడ్డాల చంటిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, అంగర రామమోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ, డాక్టర్ కేఎస్‌పీఎన్ వర్మ, విన్నకోట వేంకటేశ్వరరావు, మానాపురం సత్యనారాయణ, మునిసిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, వైస్‌చైర్మన్ కర్నేన రోజారమణి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సందేశాత్మకంగా సాగిన నాటికలు సమాజంలోని పలు అంశాలను లేవనెత్తుతూ కళాకారులు నాటకాలు ప్రదర్శించారు. విలువైన మానవ దేహాలను మట్టికో...కట్టెకో బలి చేయకుండా వైద్య పరిశోధనలకు ఇస్తే భావితరాల భవిష్యత్తుకు ఉపయోగకరమని ‘స్వర్గానికి వంతెన’ నాటిక సందేశాన్నిచ్చింది. దీనికి రచన వల్లూరి శివప్రసాద్, దర్శకత్వం గంగోత్రి సాయి. ద్రాక్షారామ కళాపరిషత్ కళాకారులు ప్రదర్శించిన ‘అతనికి అటు..ఇటు’ నాటిక సంసారంలో రేగిన కలతలను సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకతను కళ్లకు కట్టింది. మూడో ప్రదర్శనగా ‘సందడే సందడి’ నాటిక ప్రదర్శించారు. జయశ్రీ శ్రీజ సాధినేని రచన, దర్శకత్వంతోపాటు సుశీల పాత్రను పోషించారు. హాస్యభరితంగా సాగిన ఈ నాటిక ద్వారా దురాశ వల్ల కలిగే నష్టాలను వివరించారు. -
ఉత్తమ ప్రదర్శన ఇంటింటి కధ
తాటిపర్తిలో ముగిసిన రాష్ట్రస్థాయి నాటకపోటీలు గొల్లప్రోలు (పిఠాపురం) : తాటిపర్తిలోని అపర్ణ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న 6వ రాష్ట్రస్థాయి నాటకపోటీలు ముగిసాయి. ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన విజయాదిత్య ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘ఇంటింటి కధ’ ఎంపికకాగా ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా హైదరాబాద్‌కు చెందిన కళాంజలి బృందం ప్రదర్శించిన ‘జారుడుమెట్లు ’ ఎంపికైంది. ఉత్తమనటుడుగా ఇంటింటి కధ పాత్రధారి గోపరాజు విజయ్, ఉత్తమనటిగా జారుడుమెట్లు పాత్రధారి నవీన, ఉత్తమ రచనకు ఎస్ఎస్ఆర్కే గురుప్రసాద్ (ఇంటింటి కధ), ఉత్తమ దర్శకత్వానికి కొల్లా రాధాకృష్ణ (జారుడుమెట్లు), ఉత్తమ సంగీతం –సాంబశివరావు (ఇంటింటి కధ), రంగాలంకరణ–పిఠాపురం బాబూరావు (మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఉత్తమ ప్రతినాయకి– రజనీ శ్రీకళ (జారుడుమెట్లు), ఉత్తమ హాస్యనటుడు– పీఎస్ సత్యనారాయణ (ఇంటింటి కధ), సహాయ నటి–రమాదేవి æ(ఇంటింటి కధ), సహాయనటుడు–వరప్రసాద్ (జారుడుమెట్లు), ఆహార్యం– పరమేశ్వరరావు(మళ్లీ మరోజన్మంటూ ఉంటే), ఎంపికయ్యారు. విజేతలకు ప్రముఖసినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు, నాటకపరిషత్ కార్యదర్శి బత్తుల వీరభద్రం, ఆకొండి వెంకటేశ్వరశర్మ, దాసం కామరాజు, బాబూరావు, ఆకొండి వెంకటేశ్వరరావు, అమరాది గోపాలకృష్ణ, ప్రభాకరశాస్త్రి, సిద్దా నానాజీ, న్యాయనిర్ణేతలు రాజా తాతయ్య, సీఎ¯ŒS మూర్తి, కె పుల్లారావు తదితరులు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. హరనాథరావు మాట్లాడుతూ అపర్ణ నాటకకళాపరిషత్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నాటకపోటీలు రసవత్తరంగా సాగాయన్నారు. ప్రతీ సంవత్సరం నాటకాలను ఎంతగానో ఆదరిస్తున్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ నాటకరంగం రక్షించబడుతుందో అక్కడ కళారంగం అభివృద్ధి చెందుతుందన్నారు. కళాపరిషత్‌లు నాటక రంగానికి జీవం పోస్తున్నాయని తెలిపారు. -
సత్కారాలు రాజకీయాలు కాకూడదు
సినీ గేయ రచయిత అదృష్టదీపక్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలు ప్రారంభం రామచంద్రపురం : కళాకారులను సత్కరించటంలో రాజకీయాలకు తావులేకుండా ఉండాలని ప్రముఖ సినీగేయ రచయిత, విమర్శకులు అదృష్టదీపక్ సూచించారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలలోని బుద్దవరపు మహాదేవుడు కళావేదికలో మూడు రోజులు పాటు మయూర కళాపరిషత్ ఆధ్వర్వంలో నిర్వహించే 14వ రాష్ట్ర స్థాయి నాటికల పోటీలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. పరిషత్ అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ రంగస్థల నటుడు, వై.ఎస్.కృష్ణేశ్వరరావును కళాపరిషత్ ఆధ్వర్యంలో సత్కరించడం అభినందనీయమన్నారు. నాటికల రచన, దర్శకత్వం, నటనలో కృష్ణేశ్వరరావు తనదైన శైలిలో ప్రేక్షకులను రంజిపజేస్తారని కొనియాడారు. నాటిక పోటీల ద్వారా ప్రజలకు సందేశాలను అందించటమే కళాకారుల విధి అని, అటువంటి నాటిక పోటీలను నిర్వహిచండంలో మయూర కళా పరిషత్ ముందున్నదన్నారు. పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి శృంగారం అప్పలాచార్యర్ పరిషత్ ముందుమాటను వివరించారు. అధ్యక్షుడు సత్తి వెంకటరెడ్డి నాటిక పోటీల విశిష్టతను వివరించారు. సినీ రంగస్థల నటుడు కృష్ణేశ్వరరావును ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ‘చాలు... ఇక చాలు’, ‘మాకంటూ ఓ రోజు’ నాటికలను ప్రదర్శించారు. మున్సిపల్ చైర్మన్ మేడిశెట్టి సూర్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ జి.సూర్యనారాయణ, కమిషనర్ సిహెచ్.శ్రీరామశర్మ, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నందుల రాజు, మోడరన్ విద్యా సంస్థల అధినేత జీవీ రావు, చిలుకూరి సేవా సమితి అధ్యక్షుడు చిలుకూరి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేత అదృష్టదీపక్ వ్యవహరిస్తున్నారు. -
నాటక శిల్పం.. రస రమ్యం
- అలరించిన నందినాటకోత్సవాలు - ముగిసిన సాంఘిక నాటకాలు - నేటి నుంచి పద్యనాటికలు మొదలు కర్నూలు(హాస్పిటల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సాంఘిక నాటికలు ప్రేక్షకులను అలరించాయి. సాంఘిక దురాచారాలు, కుటుంబ కలహాలు, డబ్బు వ్యామోహం, గిరిజనులపై జరుగుతున్న దాడులను తెలిపే ఇతివృత్తాలతో నాటకాలు నడిచాయి. ఈ నెల 18వ తేదీ నుంచి గురువారం వరకు సాంఘిక నాటకాలతో అలరించిన నందినాటకోత్సవాలు శుక్రవారం నుంచి పద్యనాటికలతో ఆకట్టుకోనున్నాయి. డబ్బుకోసం భర్తను కోర్టుకీడ్చే భార్య కథ ‘సైకతశిల్పం’ నంద్యాల కళారాధన వారి ‘సైకతశిల్పం’అనే సాంఘిక నాటికను తాళా బత్తుల వెంకటేశ్వరరావు రచించగా, డాక్టర్ జి. రవికృష్ణ దర్శకత్వం వహించారు. డబ్బుపై వ్యామోహంతో భర్తను, కుటుంబాన్ని కోల్పోయిన ఓ మహిళ కథే ఇది. వరప్రసాద్, సుధాకర్, తాళాబత్తుల వెంకటేశ్వరరావు, ఎస్ఎం బాషా, డీసీపీ శర్మ, సురభిప్రభావతి, జ్యోతి, పి. నాగలింగేశ్వరి నటించారు. ఏకాకిగా బతుకుతున్న వృద్దుడికి కథే ‘ఒయాసిస్’ ప్రొద్దుటూరు కళాభారతి వారి ‘ఒయాసిస్’ సాంఘిక నాటకను.. వైజి ప్రకాశ్ రచించి, దర్శకత్వం వహించారు. వృద్ధాప్యం ఎడారిలో ప్రయాణం లాంటిది. గుక్కెడు నీటి కోసం జానెడు నీడకోసం తల్లడిల్లిపోతూ అన్వేషించడం లాంటిది. అలాంటి పరిస్థితుల్లో ఒయాసిస్సు కనిపిస్తే ఇక అతడు దాన్ని వదిలి వెళ్లగలడా..? అనేదే ఈ నాటిక వృత్తాంతం. కడుపున పుట్టిన కొడుకు నిరాదరణతో ఒంటరిగా బతుకునీడుస్తున్న ఓ వృద్ధుడి జీవిత గాథ ఇది. నవీన, వైజి ప్రకాష్, కె. సుభాష్ చంద్రబోస్, ఎం. నరసింహాచార్లు, ఎ. కృష్ణారావు, కె. శ్రీను నటించారు. గిరిజనుల దోపిడికి నిదర్శనం ‘రేలపూలు’ హైదరాబాద్ సిరిమువ్వ కల్చరల్స్ వారి రేలపూలు సాంఘిక నాటకంను రావినూతల ప్రేమకిశోర్ రచించగా, ఎం. భజారప్ప దర్శకత్వం వహించారు. ఈ కథంతా గిరిజనుల చుట్టూ సాగుతుంది. అందమైన రేలపూలతో అలరారుతున్న అడవిలో నివసిస్తున్న అమాయక గిరిజనులు సంతోషంగా జీవిస్తుంటారు. ఈ సమయంలో పల్లపోళ్ల రాకతో అడవి సంపద మాయమై ఆ గిరిజన బతుకులు దోపిడికి గురై పరాయీకరణ చెందుతాయి. ఆడకూనల ఉసురు తీస్తున్న నెత్తుటి కోనలో కడుపు పంటలను కబళిస్తున్న వైనాన్ని చక్కగా ప్రదర్శించారు. ఈ రేలపూల గాయాలకు సూత్రదారులెవరు..?, ఈ కమురు వాసనల కాలానికి కారణభూతులెవ్వరు..?, అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నాటిక. ఇందులో పాత్రదారులుగా మంజునాథ్, రామశాస్త్రి, రాధాకృష్ణ, రామకృష్ణ, శివరామకృష్ణ, ప్రసాద్, సుసర్ల కామేశ్వరశర్మ,కె. కోటేశ్వరరెడ్డి, కళానవీన్, హరిశ్చంద్రప్రసాద్, సురభిప్రభావతి నటించారు. వరకట్న వేదింపులకు సమాధానం ‘తర్జని’ ఉయ్యూరు, కళావర్షిణి వారి తర్జని సాంఘిక నాటిక వరకట్న వేధింపులపై కొనసాగుతుంది. ఈ నాటికను ఇసుకపల్లి మోహన్‌రావు రచించగా, జెట్టి హరిబాబు దర్శకత్వం వహించారు. ఇందులో జీఎస్ చలపతి, జె.హరిబాబు, డి. జార్జి, డి. శివాజీరావు, ఎన్.నవీన నటించారు. నాటకమే తన జీవితమని చెప్పే ‘రసరాజ్యం’ ఇప్పటికే వందకు పైగా ప్రదర్శనలు పూర్తి చేసుకున్న గుంటూరు శాస్త్రీయం వారి రసరాజ్యం నాటకంలో కిరీటి పాత్రలో ప్రముఖ సినీనటుడు కోట శంకరరావు జీవించారు. ఇతర పాత్రదారులుగా జ్యోతి, జయశ్రీతేజ, రాజర్షి, కార్తీక్ జీవం పోశారు. నాటకరంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన ఓ మహానటుడు కిరిటీ పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఆలోచనాత్మకం.. ‘పుట్టలోని చెదలు’ తిరుపతిలోని అక్కల ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘పుట్టలోని చెదలు’ అనే సాంఘిక నాటికను అక్కల తామేశ్వరయ్య రచించగా, టీఎస్ఎన్విపి మూర్తి దర్శకత్వం వహించారు. తన తండ్రి ఉద్యోగం తనకు వీఆర్ఎస్ ద్వారా ఇమ్మని ఒత్తిడి చేసే కొడుకు కథే ఇది. తండ్రి ససేమిరా అనడంతో తండ్రీకొడుకులు ఘర్షణపడతారు. చివరకు తండ్రిని చంపడానికి సైతం కుమారుడు సిద్ధపడతాడు. ఈ నేపథ్యంతో తన కొడుకును పంపిస్తాడు తండ్రి. పాత్రదారులుగా టీఎస్ఎన్విపి మూర్తిరాజు, యశోద, ఎం. సహాశిత్, అక్కల తామేశ్వరయ్య, ఆనంద్, కె. వాసుదేవాచారి, అడివి శంకరరావు నటించారు. నేటి నుంచి పద్యనాటికలు ఇప్పటి వరకు ఎనిమిదిరోజుల పాటు సాంఘిక నాటికలతో అలరించిన నందినాటకోత్సవాల్లో శుక్రవారం నుంచి పద్యనాటికలు ఉర్రూతలూగించనున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీ మైత్రి కళాపరిషత్ వారి శ్రీ కృష్ణాంజనేయయుద్ధం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ వంశీ కళాక్షేత్రం వారి రావణబ్రహ్మ, రాత్రి 6.30 గంటలకు మేకా ఆర్ట్స్ వారి హరిశ్చంద్ర పద్య నాటక ప్రదర్శనలు ఉంటాయి. -
బాలలు.. భళా!
- నంది నాటకోత్సవాల్లో అలరించిన బాలలు - ఆలోచింపజేసిన బాలల నాటికలు కర్నూలు(హాస్పిటల్): నందినాటకోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు జరిగిన బాలల నాటికలు పిల్లలు, పెద్దలను ఆలోచింపజేశాయి. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోకుండా వారిపై చదువును రుద్దే పెద్దల గురించి బంగారు కొండ, బాలకార్మికుల ఇతివృత్తాన్ని తెలిపే పసిమొగ్గలు, చెట్ల పరిరక్షణతో ప్రయోజనాలు, నిర్మూలించడం వల్ల నష్టాలపై వృక్షో రక్షతి రక్షితః అనే నాటికలు ఆకట్టుకున్నాయి. పాఠశాల, డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో హృద్యంగా నాటికల్లో నటించి చూపించారు. పిల్లల అభిప్రాయాలను తెలుసుకోవాలని చెప్పే బంగారుకొండ.. కడప జిల్లా నందలూరులోని అమరావతి సొసైటీ ఆఫ్ కల్చరల్ ఆర్ట్స్ వారి బంగారు కొండ బాలల సాంఘిక నాటిక ఇటు పిల్లలు, అటు పెద్దలను అలరించింది. నేటి సమాజం, కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లల అభీష్టాలు, ప్రవర్తనలను ఈ నాటిక ప్రతిబింబించింది. బిడ్డల అభిప్రాయాలు, ఆసక్తిని తెలుసుకోకుండా వారిని ఉన్నతంగా తీర్చిదిద్ది లక్షలు ఆర్జించాలనే తల్లిదండ్రుల నటన ఆకట్టుకుంటుంది. బిడ్డను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం తండ్రి అవినీతికి పాల్పడటం, తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక కుమారుడు అనుభవించిన మానసికక్షోభను కళ్లకు కట్టినట్లు చూపించారు. తల్లిదండ్రులుగా ఎస్. రమ్యశ్రీ, ఎ. సాయిప్రణయ్, కుమారునిగా బి. ఉమర్ ఫరూక్ నటించారు. రచన బీఎం బాషా, దర్శకత్వం బి.సాయిసందీప్, దృశ్యబంధం ఎం. వెంకటేష్, మేకప్ హిమకుమార్, సంగీతం పీడీఆర్ ప్రసాద్ అందించారు. బాలకార్మిక ఇతివృత్తం ‘పసిమొగ్గలు’ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ మండలం హాజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు నటించిన ‘పసిమొగ్గలు’ నాటిక బాలకార్మిక వ్యవస్థను కళ్లకు కట్టింది. పసితనంలోనే పనుల్లో పెట్టుకుని బాలలను చదువుకు దూరం చేయకూడదనేది ఇతివృత్తం. పత్తిపొలంలో పనిచేసే పిల్లలు అక్కడి ఘాటైన రసాయనిక మందులతో ఏ విధంగా చనిపోతున్నారో చూపించారు. దేవీ రచించిన ఈ నాటికకు టీవీ రంగయ్య దర్శకత్వం వహించారు. పాత్రదారులుగా సుజాత, నవీన్, మౌనిక, నందిని, భారతి, అక్షయ్, సాయిక్రిష్ణ నటించారు. చెట్ల ఉపయోగాలను తెలిపే ‘వృక్షో రక్షతి రక్షితః’ మనిషి అవివేకంతో వృక్షాలను నాశనం చేస్తున్న క్రమంలో వనదేవత మానవుని చర్యలకు బాధపడి అనాదిగా తాను పడిన ఆవేదనను మూడు ఘటనల ద్వారా తెలియజేయడమే ‘వృక్షో రక్షతి రక్షితః’ నాటిక సారాంశం. నాటకాన్ని అనంతపురం ఎస్ఎస్బీఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు రణగ్య, పల్లవి, గిరీష్, సుశీల, కావ్యశ్రీ, దివ్యశ్రీ, శృతి, శిరీష ప్రదర్శించారు. రచన, దర్శకత్వం ఆముదాల సుబ్రహ్మణ్యం. నేటి నాటికలు ఉదయం 10.30 గంటలకు శ్రీ మల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ‘పవిత్ర భారతదేశం’, మధ్యాహ్నం 12 గంటలకు స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ వారి ‘సత్య స్వరాలు’, మధ్యాహ్నం 2 గంటలకు పాలేమ్ జెడ్పీహెచ్ఎస్ వారి ‘స్ఫూర్తి’ బాలల నాటిక, మధ్యాహ్నం 3.30 గంటలకు నాగర్‌కర్నూలు వారి ‘స్వయంకృతం’ బాలల నాటిక’ ఉంటాయని ఎఫ్డీసీ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
రేపటి నుంచి కర్నూలులో నంది నాటకోత్సవాలు
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): నందినాటకోత్సవాలను బుధవారం నుంచి కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఫిబ్రవరి 2 వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 9.30 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. వీటిని 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రారంభిస్తారని తెలిపారు. నాటకోత్సవాలకు కర్నూలు ఆర్డీఓ రఘుబాబు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. నందినాటకోత్సవాలను అన్ని వర్గాల ప్రజలు తిలకించవచ్చని తెలిపారు. -
18 నుంచి నంది నాటకోత్సవాలు
- విజయవంతానికి ఆర్డీఓ రఘుబాబు పిలుపు - ఉత్సవ సమన్వయ కమిటీల ఏర్పాటు కర్నూలు సీక్యాంప్: ఈ నెల 18నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కర్నూలు ఆర్డీఓ రఘుబాబు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న కళాకారులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణ కోసం మంగళవారం ఆయన తన కార్యాలయంలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. నాటకోత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి కళాకారులు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని సమన్వయ కమిటీ సభ్యులకు సూచించారు. సీక్యాంప్ టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంలో 25పద్యనాటకాలు, 11సాంఘిక నాటకాలు, 27సామాజిక నాటకాలు, 9చిన్నపిల్లల నాటకాలు, 4కళాశాల, వర్సిటీ నాటకాలు మొత్తం 76 ప్రదర్శనలుంటాయన్నారు. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని సమాచార శాఖ డీడీకి విన్నవించామన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆ శాఖాధికారులను కోరామన్నారు. రాష్ట్రంలో విజయనగరం, గుంటూరు, కర్నూలు జిల్లాలో నందినాటకోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎఫ్.డీ.సి మేనేజర్ శ్రీనివాసులు, సమాచార శాఖ డీడీ శామ్యూల్సుకుమార్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, పోలీస్, మెడికల్ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. -
శ్రీప్రకాష్‌లో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ప్రారంభం
తుని : సినిమారంగంలో మహానటులుగా ప్రజల అభిమానాన్ని పొందిన ఎందరికో నాటకరంగం మాతృమూర్తి వంటిదని జూనియర్ సివిల్ జడ్జి ప్రమీలారాణి అన్నారు. పాయకరావుపేట శ్రీప్రకాష్ విద్యాసౌధంలో గురువారం రాత్రి ‘అజో- విభో కందాళం ఫౌండేషన్, శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్, కల్చరల్ అసోసియేషన్’ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటిక పోటీలను ఆమె జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలుగు నాటకరంగంలో ఒక విశిష్ట వ్యక్తికి చిరు సత్కారం పేరిట శ్రీ ప్రకాష్ పూర్వ విద్యార్థి, రాజస్థాన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ తూము శివ ప్రసాద్‌ను సత్కరించారు. విదేశాల్లో ఉంటూ అజో విభో కందాళం ఫౌండేషన్ స్థాపించి తెలుగు నాటికలను ప్రజలకు అందించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోస్యుల సత్యనారాయణకు అభినందనలు తెలిపారు. ఫౌండేషన్ రూపొందించిన వైజయంతి సమ్మోనోత్సవ విశేష సంచికను విజయ్‌ప్రకాష్, కథానాటికలు–2017 పుస్తకాన్ని దంటు సూర్యారావు ఆవిష్కరించారు. దంటు సూర్యారావు, కేఆర్జే శర్మ, ఎన్.తారకరామారావు, డి.రామకోటేశ్వరరావు, డాక్టర్ కె.వీర్రాజు, ఆహ్వానసంఘం కన్వీనర్ డీఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి పాల్గొన్నారు. తొలిరోజు ‘నాన్నా! నువ్వు సున్నావా?’, ‘గోవు మాలచ్చిమి’, ‘దగ్ధగీతం’ నాటికలను ప్రదర్శించారు. -
ఎన్టీఆర్ పరిషత్‌కు కర్నూలు నాటకం
కర్నూలు (కల్చరల్): కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన ప్రమీలార్జన పరిణయం నాటకం ఎన్టీఆర్ కళా పరిషత్ ఒంగోలులో జరపనున్న రాష్ట్రస్థాయి నాటకోత్సవాలకు ఎంపికైంది. ఇటీవల తిరుపతిలో గరుడ నాటక పోటీలు నిర్వహించారు. అందులో ప్రమీలార్జన పరిణయం నాటకం ఉత్తమ నాటకంగా ఎంపికై పలవురి ప్రశంసలు పొందింది. ప్రతి యేటా ఒంగోలులో జరిగే ఎన్టీఆర్ కళా పరిషత్ నాటక పోటీలలో రెండు తెలుగు రాష్ట్ర్రాల నాటక సమాజాలు పాల్గొంటాయి. జనవరి 22న ఒంగోలులో జరిగే నాటకోత్సవాలలో ఈ నాటకాన్ని ప్రదర్శించనున్నామని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. గాయని సాయి హారికకు సన్మానం: కర్నూలు మెడికల్ కళాశాలలో మెడిసిన్ చదువుతూ పాడుతా తీయగా అనే ఒక చానల్ సంగీత కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని సాయిహారికను లలిత కళా సమితి ఘనంగా సన్మానించింది. ఆదివారం సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన లవకుశ చిత్రప్రదర్శన సందర్భంగా ఈ సత్కారం చేశారు. సాయిహారికను లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, రంగ స్థల నటులు ఆదినారాయణ, శ్రీనివాసరావు, మహమ్మద్‌మియా, బాల వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు. -
రాష్ట్రస్థాయి 9వ ఆహ్వాన నాటిక పోటీలు ఆరంభం
తెనాలి: పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళా పరిషత్‌ల ఆధ్వర్యంలో 9వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు పోటీలు మొదలయ్యాయి. తొలుత విశాఖపట్నం, మాతృశ్రీ కళానికేతన్ కళాకారులు సంగమేశ్వరరావు దర్శకత్వంలో 'మాకొద్దీ నాగరికత' నాటికను ప్రదర్శించారు. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక కళాకారులు వెనిగళ్ల దర్శకత్వంలో 'మధురస్వప్నం' నాటికను ప్రదర్శించారు. చివరగా వెలగనేరు థియేటర్ ఆర్ట్స్ కళాకారులు 'ఎవరికి ఎవరు' నాటికను ప్రదర్శించారు. ప్రారంభ సభకు కళా పరిషత్ కన్వీనర్ షేక్ జానిబాషా అధ్యక్షత వహించారు. అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగత వచనం పలికారు. కౌన్సిలరు ముదిగొండ శైలజ జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎస్ఆర్ కృష్ణయ్య, కౌన్సిలర్ గుమ్మడి రమేష్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, క్యాపిటల్ స్టూడియో అధినేత ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
ఉత్సాహభరితంగా నాటిక ప్రదర్శనలు
కర్నూలు(కల్చరల్): కర్నూలులో తొలిసారిగా నిర్వహించిన తెలుగు నాటిక పోటీలు ఉత్సాహ భరితంగా సాగినట్లు లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో శనివారం ఉదయం 10 గంటలకు తానా జాతీయ స్థాయి నాటిక పోటీల మూడో రోజు ప్రదర్శనలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పోటీలకు విశేష స్పందన లభించిందన్నారు. కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి నాటిక సమాజాలు తరలివచ్చాయన్నారు. ఉల్లాసం నింపిన నాటికలు శనివారం ఉదయం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు సాయి ఆర్ట్స్ కొలకలూరు కళాకారులు ప్రదర్శించిన ఒక్క మాటే చాలు నాటిక ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపింది. మాటలతో బంధాలను పంచుకోవాలే కానీ తెంచుకోకూడదు అనే సందేశాన్నిచ్చిన ఈ నాటికను భవానీ ప్రసాద్ రచించగా గోపరాజు విజయ్ దర్శకత్వం వహించారు. అనంతరం నంద్యాల కళారాధన సంస్థ కళాకారులు ప్రదర్శించిన సైకత శిల్పం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. భార్యాభర్తల బంధాలు ఆర్థిక, వ్యాపార సంబంధాలుగా మారితే అది కుటుంబాలకు ఎంత ప్రమాదకరమో ఈ నాటిక కళ్లకు కట్టింది. మురళీకృష్ణ నిలయం నిజామాబాద్ కళాకారులు ప్రదర్శించిన పొద్దు పొడిచింది నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆద్యంతం తెలంగాణ మాండలికంలో సాగిన ఈ నాటిక అలనాటి నిజాం పాలనలో పటేళ్ల దౌర్జన్యాలను తూర్పారపట్టింది. దొర పెత్తనాలు, దౌర్జన్యాలకు దొరసానే తిరగబడి పేదల పక్షాన నిలబడి, పేదలకు మంచి రోజులు వచ్చే 'పొద్దు పొడిచింది' అనే సందేశంతో అంతమైన ఈ నాటకం ప్రేక్షకుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమంలో లలిత కళాసమితి కార్యదర్శి మహమ్మద్ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, కోశాధికారి బాలవెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు యాగంటీశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు నాటకానికి బంగారు గరుడ అవార్డు
– సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు కర్నూలు (కల్చరల్): కర్నూలు లలిత కళా సమితి కళాకారులు తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రదర్శించిన ప్రమీలార్జున పరిణయం నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించిందని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఎంపీ శివప్రసాద్ చేతుల మీదుగా నాటకంలోని శ్రీకృష్ణ పాత్రధారి శ్రీనివాసరెడ్డి ఈ అవార్డును అందుకున్నారన్నారు. ఈ నాటకాన్ని ప్రముఖ రచయిత పల్లేటి లక్ష్మి కుల శేఖర్ రచించగా, పత్తి ఓబులయ్య దర్శకత్వం వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 13 నాటకాలు ప్రదర్శించగా కర్నూలుకు చెందిన ఈ నాటకానికి బంగారు గరుడ అవార్డు లభించండం హర్షణీయమని టీజీవీ కళాక్షేత్రం చైర్మెన్ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు నాటక దర్శకులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియా, సహాయ కార్యదర్శి ఇనాయతుల్లా, రంగస్థల నటులు వన్నెం బలరామ్ తెలిపారు. నాటకంలో హాస్యపాత్ర పోషించిన సంగా ఆంజనేయులకు ఉత్తమ హాస్య నటుడు అవార్డు లభించింది. ఈ నాటకానికి రూ.70 వేల నగదు పారితోషికం వెంకటేశ్వర కళా పరిషత్ అందించింది. -
కర్నూలులో తొలిసారిగా 'తానా'
– నేటి నుంచి ప్రారంభం కానున్న తానా జాతీయ స్థాయి నాటిక పోటీలు – ప్రతి రోజు మూడు నాటికలు – 24న బహుమతి ప్రదానం – ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం కర్నూలు(కల్చరల్): కళల కాణాచియైన కర్నూలు జిల్లా తొలిసారిగా 'తానా' జాతీయ స్థాయి నాటిక పోటీలకు వేదికగా మారింది. తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) సంస్థ ప్రతి రెండేళ్లకొకసారి ఆంధ్రప్రదేశ్‌లోని విశిష్టాత్మకమైన నగరాల్లో కళా ప్రదర్శనలు చేపడుతోంది. తొలిసారిగా రాయలసీమ ముఖద్వారమైన కర్నూలునగరంలోని స్థానిక సీ.క్యాంపు సెంటర్లో ఉన న టీజీవీ కళాక్షేత్రంలో ఇవి జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ నాటక సమాజాలుగా గుర్తింపు పొందిన ఎనిమిది నాటక సంస్థలు ఈ పోటీలలో పాల్గొననున్నాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు తానా నాటిక పోటీలు ప్రారంభోత్సవం జరగనున్నది. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎస్పీ ఆకె రవికృష్ణ, తానా అధ్యక్షుడు డా.జంపాల చౌదరి, తానా నియమిత అధ్యక్షుడు సతీష్ వేమన, సహాయ కార్యదర్శి రవి పొట్లూరి, చైర్మన్ టీజీ భరత్, కన్వీనర్ ముప్పా రాజశేఖర్, లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఈ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన లలిత కళా సమితి: గత నాలుగు దశాబ్దాలుగా కర్నూలులో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, జానపద, శాస్త్రీయ నృత్య కళారూపాలను ప్రదర్శిస్తూ లలిత కళాసమితి రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళా సంస్థగా గుర్తింపు పొందింది. ప్రముఖ రంగస్థల నటుడు సయ్యద్ అహ్మద్, స్థాపించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి నంది నాటకోత్సవాల్లో స్వర్ణ నందిని, రజతనంది, తామ్రనందిని కైవసం చేసుకుంది. పులిస్వారీ అనే ఒక సాంఘిక నాటకాన్ని నూట ఇరవై సార్లు ప్రదర్శించి అరుదైన రికార్డులను దక్కించుకుంది. ప్రతియేటా మే నెలలో రాష్ట్రస్థాయి నాటక పోటీలను నిర్వహిస్తూ రంగస్థల నటలను ప్రోత్సహిస్తోంది. ముస్తాబైన టీజీవీ కళాక్షేత్రం : గురువారం సాయంత్రం నుంచి ప్రారంభం కానున్న తానా నాటిక పోటీలు మూడు రోజుల పాటు కొనసాగుతాయని లలిత కళా సమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ప్రకటనలో తెలిపారు. సురభవారి ఆధ్వర్యంలో వేదికను ప్రత్యేక కర్టన్లతో ముస్తాబు చేశామన్నారు. కుటుంబ సమేతంగా ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రేక్షకులు నాటికలను వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రోజు మూడు నాటికలను ప్రదర్శిస్తారని, ఇద్దరు ప్రముఖ రంగస్థల నటులను సన్మానిస్తారని ఆయన తెలిపారు. 22, 23న సాయంత్రం, 24న ఉదయం 10 గంటల నుంచి ప్రదర్శనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 24న సాయంత్రం నాటిక పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేస్తామన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు గుంటూరు రంగయాత్ర సంస్థ కళాకారులు 'అనంతం' నాటికను 7.30 గంటలకు చైతన్య భారతి, కరీంనగర్ కళాకారులు 'దొంగలు' నాటికను 8.30 గంటలకు గణేష్ ఆర్ట్స్ గుంటూరు కళాకారులు 'అంతాబ్రాంతియే' నాటికను ప్రదర్శిస్తారన్నారు. కళాభిమానులు వీటిని తిలకించి జయప్రదం చేయాలని ఆయన విజ్ఞాప్తి చేశారు. -
22 నుంచి జాతీయస్థాయి సాంఘిక నాటిక పోటీలు
కర్నూలు(టౌన్): తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉత్తర అమెరికా (తానా) ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 24 వరకు స్థానిక సి.క్యాంపులోని టి.జి.వి. కళాక్షేత్రంలో జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం చైర్మన్ టి.జి. భరత్ వెల్లడించారు. సోమవారం స్థానిక మౌర్య ఇన్‌లోని పరిణయ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. 22 వ తేదీ సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలన, 7 గంటలకు సభా కార్యక్రమం ఉంటుందన్నారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్, రాయలసీమ ఐజీ శ్రీధర్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శివకోటిబాబురావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్‌తోపాటు తాను కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో 9 టీమ్‌లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ప్రతిరోజు మూడు టీమ్‌లు మూడు రోజుల పాటు నాటికలను ప్రదర్శిస్తారన్నారు. 24న ముగింపు రోజు ఉత్తమ నాటిక ప్రదర్శన, బహుమతి ప్రదానం, హైదరాబాదు వారిచే సంగీత విభావరి ఉంటుందని తెలిపారు. ముగింపు కార్యక్రమంలో సిని నటుడు, యువ హీరో నిఖిల్, మిమిక్రీ కళాకారుడు రమేష్, అమెరికా నుంచి తానా అధ్యక్షులు చౌదరి జంపాల, సతీష్ వేమన, సంయుక్త కార్యదర్శి రవి పోట్లూరి, గోగినేని శ్రీనివాసు హాజరవుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కో-ఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ పాల్గొన్నారు. -
22 నుంచి తానా నాటక పోటీలు
కర్నూలు (కల్చరల్): స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు తానా నాటక పోటీలు నిర్వహించనున్నట్లు నాటక పోటీల కమిటీ చైర్మెన్ టీజీ భరత్, లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తానా కన్వీనర్ ముప్పా రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో భాగంగా 22న సాయంత్రం 6 గంటలకు గుంటూరు నాటక సమాజం వారు అనంతం నాటికను, కరీంనగర్ చైతన్య కళాభారతి వారు దొంగలు నాటికను ప్రదర్శిస్తారన్నారు. అదే రోజు రాత్రి 8.30 గంటలకు గణేష్ ఆర్ట్ థియేటర్ వారు అంతా భ్రాంతియే అనే నాటికను ప్రదర్శిస్తారన్నారు. 23న సాయంత్రం 6 గంటలకు అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు రెండునిశ్శబ్దాల మధ్య అనే నాటికను, యంగ్ థియేటర్స్ అసోసియేషన్ విజయవాడ వారు అనగణగా అనే నాటికను రాత్రి 8.30 గంటలకు, సిరిమువ్వా కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారు మాతృక నాటికను ప్రదర్శిస్తారన్నారు. 24న శనివారం ఉదయం 10.30 గంటలకు నంద్యాల కళారాధన వారు సైకథ శిల్పం నాటికను, 11.30 గంటలకు కొలకలూరు సాయిఆర్ట్స్ క్రియేషన్ వారు ఒక్క మాట చాలు అనే నాటికను, 12.30 గంటలకు నిజామాబాద్ మురళీకృష్ణ కళానిలయం వారు పొద్దు పొడిచింది అనే నాటికలను ప్రదర్శిస్తారని తెలిపారు. 24న సాయంత్రం టీజీవీ కళాక్షేత్రంలో ప్రముఖ సినీ నటులు బహుమతి ప్రదానోత్సవంలో పాల్గొంటారన్నారు. కళాభిమానులు ఈ నాటకాలను తిలకించి జయప్రదం చేయాలని లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య కోరారు. -
కర్నూలులో నంది నాటకోత్సవాలు
– జనవరి 18 నుండి ప్రారంభం కర్నూలు(కల్చరల్): నవ్యాంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కర్నూలులో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎస్ఎఫ్డీసీ) జనరల్ మేనేజర్ శేషసాయి తెలిపారు. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో శనివారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నంది నాటకోత్సవాల విశేషాలను తెలిపారు. జనవరి 18, 2017 నుండి రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో నంది నాటకోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతానికి కర్నూలు, గుంటూరు ప్రాంతాలను నిర్ణయించామని, మరొక ప్రాంతాన్ని ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. 2017 జనవరి 18 నుండి కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో పద్యనాటకం, సాంఘిక నాటకం, బాలల నాటకం, యువజన నాటకాలలో పోటీలు ఉంటాయన్నారు. పద్య నాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు.. బాలల, యువజన నాటకాలకు రూ.15 వేల పారితోషికాన్ని అందిస్తామన్నారు. నంది నాటక పోటీలలో పాల్గొనదలచిన నాటక సమాజాలు డిసెంబర్ 15లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో స్క్రూటినీ కమిటీ ఎంపిక చేసిన నాటకాలనే నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించేవారన్నారు. కానీ ఈ సంవత్సరం నుంచి ఒకసారి ప్రదర్శన చేసిన ఏ నాటకాన్నైనా నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించవచ్చన్నారు. యువజన నాటక పోటీల్లో కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తామన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు 16–25 ఏళ్ల లోపు వయస్కులై ఉండాలన్నారు. కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో ఈ పోటీలు నిర్వహించేందుకు కర్నూలు ఆర్డీఓ రఘుబాబును జిల్లా కలెక్టర్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారన్నారు. విలేకరుల సమావేశంలో లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, నంద్యాల కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, రంగస్థల నటుడు ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, ఎం.ఎస్.ప్రసాద్, సురభి శంకర్ పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై నీలినీడలు
–పొంతన లేని అంశాలతో చిక్కులు వేసే యత్నంలో ప్రభుత్వం - జేఎన్టీయూ పరిధిలో తాత్కాలికంగా నిలుపుదల జేఎన్టీయూ : వర్సిటీల పరిధిలో బోధన పోస్టుల భర్తీకి నీలినీడలు కమ్ముకున్నాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన తీర్మానాల ప్రతులు వర్సిటీకి అందాయి. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో భర్తీ ఆగిపోయింది. పొంతన లేని అంశాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ రోస్టర్ పాయింట్లు, అసోసియేట్ ప్రొఫెసర్‌కు వేర్వేరు రోస్టర్ పాయింట్లు నిర్ధారించాల్సి ఉంది. అయితే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి రోస్టర్ పాయింట్లు అవసరం లేదు. ఆయా వర్సిటీలే నేరుగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీ చేసుకునే వీలుది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్సిటీలు ఇదివరకే ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశాయి. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలని నవంబర్ 2న జరిగిన పాలకమండలి సమావేశంలో ప్రతిపాదన తెచ్చారు. ఇందుకు పాలకమండలి సైతం ఆమోదం తెలిపింది. తీర్మానాలు (రిజల్యూషన్స్) వచ్చాక నోటిఫికేషన్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ప్రతిబంధకంగా మారాయి. కామన్ రిక్రూట్మెంట్ (అసిస్టెంట్, అసోసియేట్ పోస్టుల భర్తీ) కు, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఎలాంటి పొంతన లేకపోయినప్పటికీ అనివార్యంగా ఉద్యోగాల భర్తీకి కాలయాపన చేయడానికి ఇలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. కలికిరి ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రొఫెసర్లు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కేవలం ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో 10 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ప్రత్యేకంగా విన్నవించాం ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి అనుమతివ్వాలని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరాం. కలికిరి ఇంజినీరింగ్ కళాశాలలో నెలకొన్న బోధన సిబ్బంది కొరతను తీర్చాలని విన్నవించాం.– ఆచార్య ఎస్ కృష్ణయ్య, రిజిస్ట్రార్, జేఎన్టీయూ అనంతపురం -
కథలకూ ఆన్లైనే!
• కథలు, సీరియల్స్, నవలలకు వేదిక కహానియా • ఇందులో 15 వేల కథలు, 250 సీరియళ్లు, 50 నవలలు • రచరుుతలకు, పాఠకులకు మధ్య వారధి సేవలు • 2 వారాల్లో రూ.కోటి నిధుల సమీకరణ పూర్తి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : కథ.. నాటిక.. నవల.. ఏదైనా సరే భావాలను, సామాజిక పోకడలను ప్రతిబింబిస్తుందంటారు. అందుకే అవి రాయాలంటే వివేకమే కాదు పాఠకులను ఆకట్టుకునే నేర్పూ కావాలి మరి. అలా అని రాసిన ప్రతి కథా అచ్చు వేసుకోలేం కదా! మరి, అవి పాఠకులను చేరేదెలా? పోనీ, ఆన్లైన్లో సొంత బ్లాగ్‌లో రాస్తే.. అవి చేరే రీడర్స్ సంఖ్యెంత? ⇔ మీలాంటి రచరుుతల అవసరాలనే తీరుస్తోంది కహానియా.కామ్! ఇందులో తెలుగులోనే కాదు ప్రపంచలోని ఏ భాషలోనైనా కథలు, నవలలు, నాటికలు రాసుకోవచ్చు. కేవలం రాయటమే కాదు.. మీ కథలను అమ్ముకోవచ్చు కూడా. ⇔ పాఠశాల నుంచి మిత్రులైన దేవెందర్, జెస్వంత్, పల్లవ్, సందీప్ నలుగురు కలిసి ఈ ఏడాది మేలో హైదరాబాద్ కేంద్రంగా కహానియా.కామ్‌ను ప్రారంభించారు. రచరుుతలను, పాఠకులను కలపటమే కహానియా.కామ్ ప్రత్యేకత. ⇔ తెలుగు, ఇంగ్లీష్, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాళీ, మరాఠీ, గుజరాతీ, ఓడియా, పంజాబి 11 భాషల్లో కథలు రాసుకోవచ్చు. చదువుకోవచ్చు కూడా. ప్రింట్ చేసుకునే అవకాశం లేదు. కనీసం కాపీ చేసుకునే వీలు కూడా ఉండదు. సో.. మీరు రాసిన కథకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కథలు, నవలలు, సీరియల్స్ కహానియాలో చదువుకోవచ్చు, రాసుకోవచ్చు కూడా. ⇔ {పస్తుతం కహానియాలో 15 వేల కథలు, 250 సీరియళ్లు, 50 నవలలున్నారుు. ఇందులో పిల్లల కథలు, హాస్య, నాటక, కాల్పనిక, ప్రేరణాత్మక, జానపద, చారిత్రక, శృంగార, సామాజిక.. ఇలా అన్ని రకాల కథలున్నారుు. కొత్త రచరుుతలే కాకుండా మల్లాది వెంకటకృష్ణ మూర్తి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, శ్రీరమణ, ఖదీర్‌బాబు వంటి ప్రముఖుల రచనలూ ఉన్నారుు. సుమారు 450 మంది రచరుుతలున్నారు. ⇔ కహానియాలో ఫ్రీ, పెరుుడ్ రెండు రకాల కథలుంటారుు. పెరుుడ్ స్టోరీస్‌లో మాకు ఆదాయం వస్తుంది. ఒక్కో కథపై 50-60 శాతం కమీషన్ రూపంలో తీసుకుంటాం. ఇలా గత నెలలో రూ.1.10 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాం. విస్తరణలో భాగంగా మరో 3 నెలల్లో అనువాదకుల కోసం ఆదాయ మార్గాన్ని తీసుకొస్తున్నాం. ఇదేంటంటే.. ఇతర భాషల్లోని కథలను స్థానిక భాషల్లో తర్జుమా చేసి కొంత ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం కహానియాలో ఉద్యోగుల సంఖ్య 7 మంది. ఈ నెలాఖరుకల్లా నిధుల సమీకరణ పూర్తి చేయనున్నాం. ప్రైవేట్ ఇన్వెస్టర్ నుంచి రూ.కోటి పెట్టుబడులు సమీకరించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.comకు మెయిల్ చేయండి... -
'ఆ నటి బుగ్గల్లా రోడ్లు ఉండాలి'
పాట్నా: బాలీవుడ్ నటి హేమమాలిని మంగళవారం సాయంత్రం పాట్నాలో తన ఇద్దరు కుమార్తెలతో 'ద్రోపది' నాటక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ షోకు బీహార్ నాయకులంతా వెళ్తుండగా.. అందరి దృష్టి ఒకరి మీదే ఉంది. ఆయనే రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్.హేమ మాలిని స్టేజ్ షోకి లాలూ ప్రసాద్ యాదవ్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?. ఈ విషయం తెలుసుకోవాలంటే కొద్ది సంవత్సరాలు వెనుకకు వెళ్లాలి. 1990లో లాలూ బీహార్ సీఎంగా పనిచేస్తున్న సమయంలో బీహార్ రోడ్లను హేమమాలిని బుగ్గల్లా మెత్తగా తయారు చేయాలని చమత్కరించారు. ఆ తర్వాత ప్రభుత్వం స్పాన్సర్ చేసిన కార్యక్రమంలో మాలిని భర్త తనకు అన్నయ్య అవుతారని వ్యాఖ్యానించి ధర్మేంద్ర-హేమమాలినిలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాగా, ఆ తర్వాత మంగళవారం రాత్రి బీహార్ రాజధానిలో మాలిని(68) తన కూతుళ్లు ఈషా డియోల్, ఆహానా డియోల్ లతో కలిసి నాటక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ నాటకానికి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారులు హాజరుకానున్నారు. -
రేగుతున్న నీటి'మంటలు'
సోమిరెడ్డి ఆగ్రహం ఐఏబీపై రాజకీయం 20న కార్యాలయ దిగ్భందనం నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సకాలంలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిన నాయకులు ఆధిపత్య పోరుతో రైతులకు అన్యాయం చేయడాన్ని జిల్లా రైతులు జీర్ణించుకోలేకున్నారు. ఐఏబీ సమావేశం తేదీని నిర్ణయించడంలో రెండువర్గాలైన టీడీపీ నాయకులపై రైతులు మండిపడుతున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి , ఎమ్మెల్సీలు ప్రకటించిన ఐఏబీ సమావేశం తేదీని రాజకీయ కారణాలతో వాయిదా వేశారు. ఆ తర్వాత మంత్రి నారాయణ 20వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ఇరిగేషన్ కార్యాలయంలో ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం నిర్వహణతీరు, రైతు నాయకులు, నీటి యాజమాన్య సంఘాల నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం టీడీపీ నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చాయి. ఈ క్రమంలో పెన్నాడెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి టీడీపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలంటారు. సాక్షాత్తు మంత్రి కొల్లు రవీంద్ర ముందు చోటుచేసుకున్న ఈ సంఘటనతో టీడీపీ ఇరువర్గాల నాయకులు నోళ్లు వెళ్లబెట్టారు. పెన్నా డెల్టా సంగతి చూసుకోకుండా, డెల్టా, నాన్ డెల్టాలకు నీటి విషయం నీ కెందుకని ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని సోమిరెడ్డి ప్రశ్నించారు రైతుల ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. అధికారం ఉన్న పార్టీలోనే పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటే రైతుల్లో చులకనభావం ఏర్పడుతుందని, రైతుల వ్యతిరేకతకు గురికావద్దని హితవు పలికారు. గత ఐఏబీ సమావేశం విషయంలో జరిగిన గందరగోళం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రాకపోవడంపై ఎమ్మెల్సీసోమిరెడ్డి విలేకరుల ముందే ఎర్రంరెడ్డిపై విరుచుకుపటం అక్కడున్న వారిని విస్మయపరిచింది. నీరు లేదన్న సాకుతో.. సోమశిల జలాశయంలో నీరు లేదన్న సాకుతో ఐఏబీ మీటింగ్ జరపకుండా చూడాలని అధికారపార్టీలో ఓ వర్గం ప్రయత్నిస్తోంది. మరో వర్గం మంత్రి చెప్పినట్లుగా మీటింగ్ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన విధంగానే రైతులకు అన్యాయం జరుగుతుందని రైతుసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియమనిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో నీళ్లున్నా లేకున్నా ఐఏబీ మీటింగ్ జరపాలన్న విషయాన్ని రైతులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం మంత్రి నారాయణ ప్రకటించినట్లుగా 20వ తేదీన ఐఏబీ మీటింగ్‌ను నిర్వహించకుంటే ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతుసంక్షేమ సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. వర్గపోరులో రైతులకు అన్యాయం జరిగే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు,ఎమ్మెల్సీల నిర్ణయాలకే విలువ లేకుండా పోతే రైతులు నీటి కోసం రోడ్లెక్కక తప్పదని వారి వాదన. కేవలం ఓ అండ్ ఎం. నీరు-చెట్టు నిధులు స్వాహా చేసేందుకే అధికారపార్టీ నాయకులు ఉత్సాహం చూపడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు నీటిని సకాలంలో అందించాలని వారు కోరుతున్నారు. -
పదవిలో పదిలం పింఛన్ కోసం మరణం
బతికుండగానే ‘చచ్చిపోయాడట!’ భార్య పేరుతో వితంతు పింఛన్ జన్మభూమి సభ్యుడి కక్కుర్తి ఇదేమి చోద్యమంటున్న జనం కాకినాడ : ‘ఫ్రీగా వస్తే ఫినాయిలైనా’ తాగేస్తాడన్న సామెతను అక్షరాలా నిజం చేశాడో జన్మభూమి కమిటీ సభ్యుడు. రూ.వెయ్యి పింఛన్ సొమ్ము కోసం బతికుండి కూడా చనిపోయినట్టుగా అధికారులను తప్పుతోవ పట్టించి భార్య పేరుతో వితంతు పింఛన్ మంజూరు చేయించుకున్నాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని పింఛన్ పొందిన సదరు వ్యక్తి వ్యవహారం బయటపడడంతో స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే... కాకినాడ సూర్య నారాయణపురానికి చెందిన మేడిశెట్టి అప్పలరాజు 32వ డివిజన్ జన్మభూమి కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నాడు. పింఛన్ల మంజూరు, పంపిణీలో పెత్తనం చలాయిస్తున్న సదరు అప్పలరాజు పనిలోపనిగా తన కుటుంబంలో ఓ పింఛన్ మంజూరు చేయించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్య మేడిశెట్టి సత్యవతి పేరిట వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేయించాడు. జన్మభూమి కమిటీ సభ్యునిగా ఇతని సిఫార్సుకు కార్పొరేషన్ సిబ్బంది కూడా తలాడించడంతో ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లలో అతని భార్య సత్యవతి పేరిట (ఐడి నెంబర్ 104807376) పింఛన్ కూడా వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన 32వ డివిజన్‌కు సంబంధించిన శెట్టిబలిజ రామాలయం వద్ద పింఛన్ల పంపిణీ కేంద్రంలో ఆమె రూ.వెయ్యి పింఛన్ కూడా తీసుకుంది. కొత్త పింఛన్ కావడంతో ఈమె ఎవరా? అని ఆరా తీస్తే జన్మభూమి కమిటీ సభ్యుని భార్య అని తేలింది. ఎంతో మంది అర్హులైన వితంతువుల పింఛన్ కోసం ఎదురుచూస్తుండగా వారందరినీ పక్కన పెట్టి ఈమెకు పింఛన్ మంజూరు చేయడంపై స్థానికులు విస్మయ వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జన్మభూమి కమిటీ సభ్యునిగా ఉంటూనే తన భార్యపేరుతో ఎలా పింఛన్ తీసుకుంటాడని స్థానకులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే డివిజన్‌కు చెందిన మరో వ్యక్తి కూడా బతికుండగానే ఏడాది నుంచి వితంతు పింఛన్ పొందుతున్నట్టు ఆరోపణలున్నాయి. అతను కూడా జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజుకు సన్నిహితంగా మెలిగే వ్యక్తేనని స్థానికులు చెబుతున్నారు. ఎలా మంజూరైంది? వితంతు పింఛన్ మంజూరు కావాలంటే తప్పనిసరిగా భర్త మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్, రేషన్‌కార్డు, ఆధార్ కార్డులను దరఖాస్తుతోపాటు జతచేయాల్సి ఉంటుంది. అవన్నీ సక్రమంగా ఉంటేనే పింఛన్ కోసం సిఫార్సు చేసి మంజూరు చేస్తారు. బతికున్న మేడిశెట్టి సత్యవతి భర్త అప్పలరాజు పేరిట డెత్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది?. నకిలీ సర్టిఫికెట్ జత చేశారా? ఇవేమీ లేకుండా సిఫార్సు చేశారా? అన్న అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మంజూరు చేసిన విధానంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు డిమాండ్ చేస్తున్నారు విచారణ చేసి చర్యలు... జన్మభూమి కమిటీ సభ్యుని భార్య వితంతు పింఛన్ పొందుతున్నారనే అంశం మా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – ఎస్. అలీమ్ భాషా, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ -
గోరంట్ల ‘గృహ’తంత్రం
పేదల ఇళ్లపై ప్రజాప్రతినిధి కన్ను తన వాళ్లకు కట్టబెట్టేందుకు కుటిలయత్నం లబ్ధిదారుల ఎంపిక ముగిసినా తిరిగి సర్వే జాబితాల్లో పేర్లు తారుమారు ఏకంగా 700 మంది అనర్హులని తొలుత ప్రచారం సీఎం బాబు సమక్షంలో 75 మందే అనర్హులని అధికారుల ప్రకటన తాజాగా492 మందిని దూరం చేయడానికి రాజకీయ క్రీడ శాపనార్థాలు పెడుతున్న లబ్థిదారులు రాజకీయం కన్నెర్ర చేస్తే అధికారం వెనకడుగు వేయాల్సిందేననడానికి రాజమహేంద్రవరం ఆవరోడ్డులోని గృహాల వ్యవహారమే ఉదాహరణ. తొలుత 700 మందితో సిద్థమైన జాబితాలో కేవలం 75 మందేనని అనర్హులని తేల్చిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఆ సంఖ్యను ఏకంగా 492కు పెంచేసి తమ లెక్కలను తామే చెరిపేపుకుంటున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల ‘గృహ’ తంత్రానికి సై అంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం : పలుమార్లు సర్వేలు చేసి పేదలకు కేటాయించిన ఇళ్లను అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తమ వారికి కట్టబెట్టాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుటిలయత్నాలకు పాల్పడుతున్న వైనం బయటపడింది. రాజమహేంద్రవరంలోని ఆవరోడ్డులో ఉన్న దేవాదాయ స్థలంలో 2,256 గృహాలకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. 2009లో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వీరిలో అర్హులైన వారిని ఎంపిక చేశారు. 2014లో ఇళ్ల కేటాయింపునకు సంబంధించి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల సమక్షంలో లాటరీ తీశారు. ఇళ్లు వచ్చిన లబ్ధిదారుల అర్హతపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నాలుగుసార్లు సర్వే చేసి వారి నుంచి కొంత నగదు కట్టించుకున్నారు. గత నెల గోదావరి అంత్యపుష్కరాల ముగింపు కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ గృహాలను లబ్థిదారులకు లాంఛనంగా పంపిణీ చేశారు. ఆ సమయంలో గృహా నిర్మాణ శాఖాధికారులు చేసిన సర్వేలో 2,256 మందిలో 75 మందిని అనర్హులుగా తేల్చారు. ఈ 75 మందికి మినహా మిగతా వారికి గృహాల నంబర్‌తో స్లిప్పులు కేటాయించారు. అనర్హుల స్థానంలో తిరిగి అర్హులకు ఇళ్లు కేటాయిస్తామని అప్పుడు గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తమ వాళ్ల కోసం కుయుక్తులు 2014లో లబ్థిదారుల ఎంపిక కోసం తీస్తున్న లాటరీని కూడా గోరంట్ల అడ్డుకున్నారు. ఆ సమయంలో లబ్థిదారులు ప్రతిఘటించడంతో పలాయనం చిత్తగించారు. ఇప్పుడు తాజాగా ఆ ఇళ్లపై కన్నేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని జాబితాలో పేర్లు తారుమారు చేసేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అధికారులు కూడా ఎమ్మెల్యేకు వత్తాసు పలుకుతున్నారు. సుమారు 700 మంది లబ్థిదారులను అనర్హులుగా ఎమ్మెల్యే ప్రచారం చేయించారు. 75 మంది అనర్హులని సీఎం పర్యటన సమయంలో తేల్చిన అధికారులు ఇప్పుడు 492 మంది లబ్ధిదారులపై తిరిగి సర్వే చేయాలని జాబితా కూడా సిద్ధం చేయాడాన్ని బట్టి వారిపై ఎమ్మెల్యే ఒత్తిడి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అనర్హుల పేరుతో వీరిని తొలగించి తమ వారికి ఇళ్లు కట్టబెట్టాలని గోరంట్ల కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నాలుగుసార్లు సర్వే చేసినా.. లబ్ధిదారులు తమ వాటాను అప్పులు చేసి పూర్తిగా చెల్లించారు. ఏడేళ్లుగా ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగు సార్లు సర్వే చేసి ఇళ్లు కేటాయిస్తూ స్లిప్పులు కూడా పంపిణీ చేసి ఇప్పుడు తరిగి సర్వే చేస్తామనడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అధికారుల సహాయంతో తమకు ఇళ్లు రాకుండా చేయాలని చూస్తున్నాడని వాపోతున్నారు. రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇళ్లు కేటాయించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్న గోర ంట్లకు తమ పిల్లల ఉసురు తప్పకుండా తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. లబ్ధిదారులకు జరుగుతున్న అన్యాయాన్ని రాజమహేంద్రవరం సిటీ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణన్ దృషికి తీసుకెళ్లి వారికి న్యాయం చేయాలని కోరారు. ––––––––––––––––––– స్లిప్పులు ఇచ్చి ఇళ్లు అప్పగించడంలేదు అప్పులు చేసి డీడీలు, వాయిదాలు కట్టాం. ఇళ్లు కేటాయించినట్లు గత నెల్లో సీఎం చంద్రబాబు వచ్చినప్పుడు స్లిప్పులు కూడా ఇచ్చారు. కానీ ఇళ్లు అప్పజెప్పడంలేదు. తప్పుడు సర్వేలు చేస్తున్నారు. తమను అనర్హులుగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. మా ఉసురు తగలకపోదు. – మాధవి. లబ్ధిదారు. ––––––––––––––––––––– లబ్థిదారులు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే గోరంట్లదే బాధ్యత పలుమార్లు సర్వే చేసి లబ్థిదారులను ఎంపిక చేశారు. ఇళ్లు కేటాయించి ఇప్పడు మళ్లీ సర్వే చేయడం తగదు. ఒక్కొక్కరు అప్పులు చేసి రూ. 60 వేలు కట్టారు. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పడు ఇళ్లు రాలేదని వారు ఏౖ§ð నా అఘాయిత్యం చేసుకుంటే దానికి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాజమహేంద్రవరం సిటీ కోఆర్డినేటర్. –––––––––––––––––––– ఉన్నతాధికారుల ఆదేశాలతో సర్వే చేస్తున్నాం లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ నుంచి ఆదేశాలు రావడంతో ఈ నెల 26 నుంచి సర్వే చేపట్టాం. నాలుగేళ్ల క్రితం లబ్థిదారులకు స్లిప్పులు ఇచ్చారు. గతంలో లబ్థిదారుల అర్హతపై సర్వే చేసినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలతో తిరిగి సర్వే చేపడుతున్నాం. వారం రోజుల్లో పూర్తి చేస్తాం. – శ్రీనివాస్. ఈఈ, గృహనిర్మాణశాఖ -
ఢిల్లీలో ప్రదర్శనకు ‘సీతాకోక చిలుక’
నూనెపల్లె: దేశ రాజధాని ఢిల్లీలో శ్రీకృష్ణ తెలుగు థియేటర్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించే నాటక ప్రదర్శనకు సీతాకోక చిలుక నాటకం ఎంపికైనట్లు కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ తెలిపారు. స్థానిక కళారాధన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24, 25వ తేదీల్లో ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివద్ధి సంస్థ సహకారంతో నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో నంద్యాల కళారాధన–గురురాజ కాన్సెప్ట్ స్కూల్ సంయుక్త నిర్వహణలో రూపొందించి బంగారు నంది అవార్డు పొందిన సీతాకోక చిలుక బాలల సాంఘిక నాటిక ప్రదర్శనకు ఆహ్వానం లభించిందన్నారు. ఢిల్లీలో నిర్వహించే ఇలాంటి ప్రదర్శనకు ఆహ్వానం రావడం గర్వకారణమన్నారు. గురురాఘవేంద్ర విద్యాసంస్థల చైర్మన్ దస్తగిరిరెడ్డి, డైరెక్టర్ మౌలాలిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థుల నాటకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో కళారాధన అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రావు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భవనాశి నాగమహేష్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేరుకు పర్యాటకం.. ఆ వెనుక నాటకం
ఏలూరు రూరల్ : పేదవాడికి 50 గజాల స్థలం ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మెల్యే, ఎంపీ తదితరులతో కూడిన అసైన్డ్ కమిటీ అంగీకరించాలి. అప్పుడే లబ్ధిదారుణ్ణి గుర్తించి రెవెన్యూ అ«ధికారులు భూమిని పంపిణీ చేస్తారు. కానీ.. ఇవేమీ లేకుండానే పర్యాటక కాంట్రాక్టర్‌కుS8 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు ధారాదత్తం చేశారు. సదరు వ్యక్తి ఆ భూమిలో చేపల చెరువులు తవ్వి దర్జాగా సాగు చేపట్టాడు. ఏలూరు మండలం గుడివాకలంకలో ఈ అక్రమ వ్యవహారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. కొల్లేరు సరస్సును వీక్షించేందుకు వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుడివాకలంక సమీపంలో ‘హరిత’ పేరిట రిసార్ట్స్ నిర్మించింది. పర్యాటకులను ఆకర్షిం చేందుకు నీటిమధ్యలో రెండు అంతస్తుల చొప్పున నాలుగు భవనాలు కట్టారు. ఒక్కొక్క భవనంలో నాలుగు గదులు ఉండేలా డిజైన్ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.కోటిన్నర వెచ్చిం చింది. రిసార్ట్స్‌లో విడిది చేసే పర్యాటకులు కొల్లేరు అందాలు తిలకించేందుకు వీలుగా బోటు షికారు ఏర్పాటు చేసింది. రిసార్ట్ వెనుక నుంచి నేరుగా కొల్లేరు సరస్సులోకి వెళ్లేందుకు ప్రభుత్వానికి చెందిన 212/1 సర్వే నంబర్లో 4.12 ఎకరాలు, 212/2లో 26 సెంట్లు, 213/3లో 3 ఎకరాల 60 సెంట్ల భూమిలో కాలువ తవ్వారు. రిసార్ట్స్ నిర్వహణను పర్యాటక శాఖ ప్రైవేట్ వ్యక్తికి కాంట్రాక్ట్‌కు ఇచ్చింది. సదరు వ్యక్తి టీడీపీ నేతల అండదండలతో రిసార్ట్స్ వెనుక బోటు షికారుకు కేటాయించిన ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. కొల్లేరులోకి వెళ్లేందుకు వీలుగా తవ్విన కాలువకు గట్లువేసి.. ఆ కాలువతోపాటు సమీపంలోని భూమిని చేపల చెరువులుగా మార్చేశాడు. ఈ విషయమై స్థానికులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ఆర్ రవిచంద్రకు ఫిర్యాదు చేయగా ఆయన వెళ్లి చెరువులను పరిశీలించారు. అయినా, అక్కడ సాగుతున్న అక్రమ వ్యవహారానికి అడ్డుకట్ట పడలేదు. రూ.లక్షల్లో లీజు గుడివాకలంక ప్రాంతంలో ఎకరం చేపల చెరువు లీజు ఏడాదికి రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఉంది. ఈ లెక్కన రిసార్ట్స్ కాంట్రాక్టర్ ఆక్రమించిన 8 ఎకరాల ద్వారా ఏడాదికి కేవలం లీజు రూపంలోనే రూ.5.60 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు లబ్ధి పొందుతున్నట్టు అంచనా. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. సదరు వ్యక్తికి రిసార్ట్స్ నిర్వహణ బాధ్యతను పర్యాటక శాఖ అప్పగించిందని చెప్పారు. ఆ భూమిని లీజు లేదా ఏ ఇతర రూపంలోనూ అతడికి కేటాయించలేదన్నారు. సెక్రటేరియట్ నుంచి అనుమతి తెచ్చుకున్నాడట ఆ భూమిని పరిశీ లించాను. అది పూర్తిగా ప్రభుత్వ భూమే. రిసార్ట్స్ యజమానితో మాట్లాడాను. రిసార్ట్స్‌తోపాటు భూమిని కూడా తనకు లీజుకు ఇచ్చినట్టు కాంట్రాక్టర్ చెప్పారు. ఇందుకు సంబంధించి ఏపీ సెక్రటేరియట్ అధికారులు జారీ చేసిన మంజూరు పత్రాలు ఉన్నాయని, వాటిని చూపిస్తానని అన్నారు. – ఎన్ఎస్ఆర్ రవిచంద్ర, ఆర్ఐ -
ముగిసిన మినీ నంది నాటకోత్సవం
– అలరించిన నృత్యాలు – ఆకట్టుకున్న నాటక ప్రదర్శన – డాక్టర్ మధుసూదనరావుకు పురస్కారం నంద్యాల: చిన్నారుల అద్భుత నృత్యాలు.. ఏకపాత్రాభినయాలు.. సామాజిక అంశాలపై ప్రముఖుల చర్చ.. రాష్ట్రస్థాయి బంగారు, వెండి నంది అవార్డులు సాధించిన నాటకాల ప్రదర్శనలతో మినీ నందినాటకోత్సవం కనుల పండువగా ముగిసింది. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో సోమవారం అర్థరాత్రి వరకు జరిగిన కార్యక్రమాలను ప్రేక్షకులు తిలకించారు. తెలుగుభాష దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ప్రముఖ రచయితలు డాక్టర్ ఉదయ్‌శంకర్, శ్రీదేవి, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ రవికృష్ణ, కరీముద్దీన్ ఉరఫ్ చందన్, రామకృష్ణారెడ్డి, అన్నెం శ్రీనివాసరెడ్డి, నీలకంఠాచారి, మహబూబ్‌బాషా, రవికుమార్, జానపద కవి ప్రదీప్‌లు తమ కవితా మాధుర్యంతో అలరించారు. వీరిని లయన్స్ క్లబ్ సభ్యులు భవనాశి మహేష్, పెసల శ్రీకాంత్, ఆంజనేయులు గుప్త, రవిప్రకాష్, శ్రీకాంత్, ఉపేంద్రనాథరెడ్డి సన్మానించారు. డాక్టర్ మధుసూదనరావుకు పురస్కారం... కళారాధన అధ్యక్షుడిగా, ఈఎన్టీ సర్జన్‌గా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ మధుసూదనరావు అందించిన సేవలకు మదర్‌థెరిసా జీవిత కాల సాఫల్య సేవా పురస్కారాన్ని ఎంపీ ఎస్పీవైరెడ్డి, రోటరీ క్లబ్ గవర్నర్ కందుకూరి శ్రీరామ్మూర్తి, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ ఏవీఆర్ ప్రసాద్, కళారాధన కార్యదర్శి డాక్టర్ రవికృష్ణ అందజేశారు. ఆయనకు గజమాల, పూలకిరీటం, జ్ఞాపిక, అందజేశారు. క్రీడలకు ప్రాథమిక దశ నుండే ప్రాముఖ్యతను ఇవ్వాలి.. క్రీడలకు ప్రాథమిక దశ నుండే ప్రాముఖ్యతను ఇవ్వాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ధ్యాన్‌సింగ్, మిల్కాసింగ్ చర్చావేదికపై మనదేశ క్రీడా విధానం ఆశాజనక ఫలితాలు, లోపాలు అనే అంశంపై లయన్స్ క్లబ్ అధ్యక్షుడు భవనాశి నాగమహేష్ అధ్యక్షతన చర్చావేదిక జరిగింది. అందులో రామకష్ణ విద్యాసంస్థల అథినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, రిటైర్డు పీఈటీ టీచర్ దివాకర్, డాక్టర్ రవికృష్ణ, గురురాఘవేంద్ర, రావూస్విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న సైకత శిల్పం... కళారాధన సంస్థ రూపొందించిన సైకత శిల్పం సాంఘిక నాటకం ఆకట్టుకుంది. భార్యభర్తల బంధం సంజీవ శిల్పంగా చిరకాలం ఉండాలని సైకత శిల్పంలా తాత్కాలికంగా మారకూడదని దర్శకుడు డాక్టర్ రవికష్ణ ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు తెలియజేశారు. మినీ నంది నాటకోత్సవాల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. లాఫింగ్ క్లబ్ కార్యదర్శి మాలేపాటి రాజశేఖర్, గురురాఘవేంద్ర విద్యాసంస్థల కో డైరెక్టర్లు మౌలాలిరెడ్డి, షేక్షావలీరెడ్డి పాల్గొన్నారు. -
రామా.. ఏమిటీ డ్రామా
నగలు ఆ బీరువాలోనే ప్రత్యక్షం ఈఓ వార్నింగ్‌తో బయటపడ్డ వైనం అధికారులు, అర్చకుల తీరుపై భక్తుల ఆగ్రహం భద్రాచలం : తొమ్మిది రోజులు.. ఆలయాధికారులు, పోలీసుల తనిఖీలు.. ఎంతకూ కనిపించని ఆభరణాలు.. చివరకు దేవస్థానం ఈఓ సీరియస్ వార్నింగ్.. ఇంతలోనే బయటపడ్డ నగలు.. రామా.. మీ సన్నిధిలోనే ఏమిటీ డ్రామా అని పలువురు చర్చించుకుంటున్నారు. శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలోని గుర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోనే సీతమ్మ పుస్తెలతాడు, లక్ష్మణ స్వామి లాకెట్ దొరికినట్లు దేవస్థానం ఈఓ రమేష్‌బాబు శనివారం ప్రకటించారు. సీఐ శ్రీనివాసులు, పట్టణ ఎస్సై కరుణాకర్ ఆలయానికి చేరుకొని దొరికిన ఆభరణాలను పరిశీలించి, ఆలయ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. తొమ్మిది రోజుల హైడ్రామాకు తెరపడినప్పటికీ.. బంగారు ఆభరణాలు దొరికాయని అర్చకులు చెబుతున్న తీరు సినిమా కథను తలదన్నేలా ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈనెల 19న నిత్యకల్యాణోత్సవంలో స్వామివారి అలంకరణ కోసం గర్భగుడిలోని బీరువా నుంచి బంగారు ఆభరణాలు తీసే క్రమంలో రెండు నగలు మాయమైనట్లు గుర్తించారు. సీతమ్మవారి మంగళసూత్రం, లక్ష్మణస్వామి లాకెట్ కనిపించకపోవటంతో దీనిపై దేవస్థానం ఈఓ రమేష్‌బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భద్రాద్రి ఆలయంలో రెండు ఆభరణాలు మాయం కావటం, సీతమ్మవారి పుస్తెల తాడును అర్చకులే మాయం చేశారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగటంతో.. దీనిపై దేవస్థానం అధికారులతోపాటు మరో పక్క పోలీసులు సైతం తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. ఈఓ వార్నింగ్‌తో.. ఈఓ రమేష్‌బాబు శనివారం తన చాంబర్లో అర్చకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్వామి వారి నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు వంశపారం పర్యంగా కొనసాగుతున్న కొందరు అర్చకుల ఆధీనంలోనే ఉన్నందున, దీనికి మీరే బాధ్యత వహించాలన్నారు. దీనిపై చర్చించిన అర్చకులంతా కలిసి గర్భగుడిలోకి వెళ్లి, నగలు భద్రపరిచే బీరువాను పరిశీలించామని, అందులోని ఓ లాకర్లో ఈ నగలు కనిపించాయని, ఇదే విషయాన్ని తనతో అర్చకులు చెప్పారని ఈఓ వెల్లడించారు. అయితే దేవాదాయ శాఖ ఆభరణాల తనిఖీ అధికారి(జేవీఓ) భాస్కర్ సమక్షంలో రెండు రోజులపాటు పరిశీలన చేసినా, తొమ్మిది రోజులపాటు అర్చకులంతా Ðð తికినా కనిపించని నగలు.. ఈఓ వార్నింగ్‌తో ఎలా బయటకు వచ్చాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. కాగా, అధికారులు, అర్చకుల తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలతోనే... ఆలయంలో పనిచేసే కొందరు అర్చకుల మధ్య విభేదాలే బంగారు నగలు మాయం కావటానికి ప్రధాన కారణమని ఈఓ వెల్లడించారు. దీనికి బాధ్యులైన వారిపై సస్పెన్షన్ వేటు వేస్తామని, దీనిలో ప్రమేయం ఉన్న మిగతా అర్చకులను వేర్వేరు ఆలయాలకు బదిలీ చేస్తామని చెప్పారు. ఆ ఆభరణాలతో నిత్యకల్యాణం మాయమైన సీతమ్మ మంగళసూత్రం, లక్ష్మణస్వామి లాకెట్ లభ్యం కావటంతో కొన్ని రోజులపాటు ఆ ఆభరణాలను స్వామివారి నిత్యకల్యాణంలో వినియోగిస్తామని ఈఓ తెలిపారు. ఆభరణాలు లభించిన వెంటనే వాటిని గర్భగుడిలో స్వామివారి మూలవరుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని తిరిగి లాకర్లో భద్రపరిచారు. -
రవీంద్రభారతిలో 24న కర్రిగాడు(ఒథెలో) నాటక ప్రదర్శన
ప్రముఖ రచయిత విలియమ్ షేక్స్ స్పియర్ రాచించిన ఒథేలో నాటకాన్ని ఆడాప్ట్ చేసుకొని దాన్ని పూర్తి తెలంగాణ భాషలో ఈ ప్రాంత ప్రజల కష్టాలు పెందుపరిచి ‘కర్రిగాడు పేరుతో నాటకాన్ని ప్రద ర్శిస్తున్నట్లు నిశుంభుతి బ్యాలెట్ అండ్ థియేటర్ గ్రూఫ్ నిర్వాహకులు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. నీటి కోసం పడుతున్న కష్టాలతో పాటు కర్రిగాడి ప్రేమ గాథ సన్నివేశాలతో నాటకం సాగుతుందని తెలిపారు. 24 న రాత్రి 7.30కి రవీంద్రభారతిలో ప్రద ర్శిస్తున్నట్లు చెప్పారు. -
నాటకానికి జవసత్వాలు అందించాలి
సినీ,రంగ స్థల నటుడు జయప్రకాష్‌రెడ్డి కరీంనగర్‌కల్చరల్: నాటక రంగానికి కళాపోషకులు జీవం పోయాలని సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో టీఎస్‌ఎన్‌పీడీఎల్ స్పోర్ట్స్, కల్చరల్ కౌన్సిల్ కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో ‘ఈ లెక్క ఇంతే’ నాటక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి జయప్రకాష్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నాటకం ఇంకా బతికే ఉందని.. దానికి జీవసత్వాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంచి నాటకానికి ఆదరణ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. అనంతరం ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్న విద్యుత్ శాఖ ఎస్ఈ స్వర్గం రంగారావును విద్యుత్ ఉద్యోగులు ఘన ంగా సన్మానించారు. కార్యక్రమంలో బుల్లితెర నటులు ఆర్.అప్పారావు, టి.మురళి, సినీ రంగ స్థల నటులు రొడ్డ యాదగిరి, కేతిరి మల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘ఈ లెక్క ఇంతే’ నాటకంలో మంచాల రమేశ్, జ్యోతి, కొత్తకొండ సత్యనారాయణ, కిషన్‌రెడ్డి ప్రధానపాత్ర పోషించారు. అంతకుముందు నటుడు జయప్రకాష్‌రెడ్డిని కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, రంగస్థల నటులు రోడ్డ యాదగిరి, ఆగస్టీన్, మల్లారెడ్డి తదితరులు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. -
ఆలోచింపజేసే మత్స్య గంధి
సాక్షి, సిటీబ్యూరో: అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ –2016 ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జాతీయ బహుభాషా నాటకోత్సవాలు ఆలరించాయి. మంగళవారం రవీంద్రభారతి ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా ప్రదర్శించిన మత్స్య గంధి కన్నడ నాటకం రక్తికట్టించింది. నాటకానికి కేఎస్డీఎల్ చందు దర్శకత్వం వహించారు. మత్స్య గంధి రంజిత సూర్య వంశీ, పరాచరానిగా హరేష్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సభ ప్రారంభంలో చిన్నారి మధుమిత కూచిపూడి నృత్యం అలరించింది. -
కళాభారతిలో రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016
విశాఖలో అపూర్వ ఘట్టం ఆవిష్కరణ ఆగస్టు1నlనిరంతరాయంగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు రంగస్థలం పరవశించే రోజు అది.. ఎనిమిది విభిన్న కళా అంశాలను ఒకే వేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించే అద్భుత దశ్యాన్ని వీక్షించే అరుదైన అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. దాదాపు ఆరున్నర గంటలపాటు నిర్విరామంగా ఎనిమిది రంగస్థల అంశాలను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఏకపాక్రాభినయం, కామెడీస్కిట్, విచిత్ర వేషధారణ, లఘునాటిక, ప్రహసనం, మిమిక్రీ, నాటిక, మూకాభినయం, సాంఘిక నాటకం.. విభాగాలలో ఆగస్టు1న కళాకారులు స్టేజీని పండించనున్నారు.l –డాబాగార్డెన్స్ రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016ను ఆగస్టు 1న కళాభారతి ఆడిటోరియం వేదికగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆర్థిక సాయంతో నిర్వహించే ఈ బహత్కార్యక్రమం కళాభిమానులను కనువిందు చేయనుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించనున్నార. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. ఆ రోజు ప్రదర్శితమయ్యే కళా అంశాల సంక్షిప్త పరిచయమిది.. 85ఏళ్ల వయసులోనూ ..‘చాణక్యు’నిగా రాణింపు ప్రదర్శన సమయం..మధ్యాహ్నం..3.30 గంటల 3.50 వరకూ.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆంధ్రశ్రీ, అపర చాణక్యుడు చల్లా పాపారావు ‘చాణక్య’ పేరిట ఏకపాత్రాభినయం నిర్వహించనున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఏకపాత్రాభినం నిర్వహిస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా ప్రదర్శనలిచ్చారు. ముంబయి, బెంగళూరుతో పాటు దేశం నలుమూలల పలు ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకున్నారు. 2012 తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో పాపారావు ఏకపాత్రాభినయానికి ప్రభుత్వం రూ.15వేలు అందజేసి సత్కరించింది. ‘చాణక్య’ ఏకపాత్రాభినయం మధ్యాహ్నాం 3.30 నుంచి 3.50 గంటల వరకు జరగనుంది. అదిగో.. ‘ప్లాస్టిక్ భూతం’ ప్రదర్శన సమయం మధ్యాహ్నం 3.50 గంటలకు.. కోరుకొండ రంగారావుæ విశాఖవాసులకు చిరపరిచితులు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ లాఫ్టర్స్ ఫన్క్లబ్లో ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. 2005లో ఐదుగురు సభ్యులతో లాఫ్టర్స్ ఫన్క్లబ్ను స్థాపించి ఇప్పటి వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో 2 వేలకు పైగా వినోద కార్యక్రమాలు (కామెడీ స్కిట్స్) నిర్వహించారు. 2011 మే నెలలో 35 గంటల 15 నిమిషాల పాటు జోక్స్ చెప్పి లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించారు. 2013 సెప్టెంబర్‌లో గంటలో 654 జోకులు చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.2008లో శ్రీకష్ణదేవరాయ కల్చరల్ ట్రస్ట్ ద్వారా అప్పటి ఎయూ రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా ‘వికటకవి పురస్కారం’అందుకున్నారు. అనగనగా ఓ ధీరుడు, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘కత్రిన కరీనా మధ్యలో కమల్ హాసన్’ సినిమాలో నటించారు. ప్లాస్టిక్ భూతం పేరిట విచిత్ర వేషధారణ ద్వారా ఆయన కనువిందు చేయనున్నారు. నటులున్నారు జాగ్రత్త (లఘు నాటిక) ప్రదర్శన సమయం: సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు.. నవరస థియేటర్స్ ఆర్ట్స్, ఎండాడ మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో ‘నటులున్నారు జాగ్రత్త’ లఘునాటిక ప్రదర్శన నిర్వహించనున్నారు. రచన బళ్లా షణ్ముఖరావు, దర్శకత్వం పి.వి.ఆర్.మూర్తి. లఘు నాటిక విశేషమేమిటంటే..నాటకమంటే తెలియని పిల్లలు ప్రదర్శన ఇవ్వటం. ‘కన్యాశుల్కం’(ప్రహసనం).. రచన..కందుకూరి వీరేశలింగం, దర్శకత్వం..చలసాని కష్ణప్రసాద్ ప్రదర్శన సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి.. 19వ శతాబ్ద తొలిరోజుల్లోని సంఘటనల సమాహారం. ఆడపిల్లలు రజస్వల కాకముందు అంగట్లో అమ్ముకునే రోజులవి. ఆ రోజుల్లో ఆడపిల్లలే పంట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అగ్రహారాల్లో జరుగుతున్న ఈ దురాచారాలను రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి విరేశలింగం ప్రహసనం రచించారు. 15 నిమిషాల నిడివిలో నిర్వహించనున్న ప్రహసనంలో అమ్ముకునేవాడు..కొనుగోలు చేసేవాడు..కందుకూరి పాత్రలో మరొకరు ముగ్గురు క్యారెక్టర్లతో ప్రదర్శన ఉంటుంది. మధురవాడ సుదర్శన కల్చరల్ అసోసియేషన్ కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు.l ధ్వన్యనుకరణ (మిమిక్రీ).. సమయం..సాయంత్రం 4.50 గంటల నుంచి.. నగరానికి చెందిన సీనియర్ మిమిక్రీ కళాకారుడు వై.కె.రాజు ధ్వన్యనుకరణ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 1800కు పైగాప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపంలో మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినీ, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతల వాయిస్..డ్యాన్స్ రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. జోక్స్..ప్రకటనలు..సన్నివేశాలను మిమిక్రీ ద్వారా తెలియజేయనున్నారు. పేరడీ పాటలు, మిమిక్రీతో డ్యాన్స్‌లు కూడా చేయనున్నారు. స్వాగతం నాటిక ప్రదర్శనl సమయం సాయంత్రం 5 గంటలకు.. కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన బి. రామకష్ణ, దర్శకత్వం పి.శివప్రసాద్. కళల కోసమే స్వాగతం నాటిక ప్రేక్షకులను అలరిస్తుంది. మూకాభినయం.. సమయం సాయంత్రం 6.45 గంటల నుంచి.. విజయనగరానికి చెందిన ఆదయ్య మాస్టారు ముకాభినయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో ఫేమస్. చిన్నదాని సింగారం, వెయిట్ లిఫ్టింగ్ అంశాలపై మైమ్ ప్రదర్శన. 65 మంది కళాకారుల ‘అశ్శరభ శరభ’ విజయవాడ మహేశ్వరి ప్రసాద్ యంగ్ «థియేటర్ ఆర్గనైజేషన్‌కు చెందిన 65 మంది కళాకారులతో రెండున్నర గంటల పాటు ‘అశ్శరభ శరభ’ సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆరు నంది అవార్డులు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక కళాపరిషత్‌లో ఏడు అవార్డులు పొందిన సాంఘిక నాటకం. రచన ఎన్.ఎస్. నారాయణబాబు, దర్శకత్వం వాసు, సారథ్యం రాంపిళ్ల మోహనకష్ణ. ఇది ఓ పాపాయి కథ. కన్నె కథ. ఓ కూతురు..ఓ అక్క..ఓ భార్య..ఓ తల్లి కథ. మొత్తంమీద ఒక మహిళా/స్త్రీమూర్తి కథ. స్త్రీ శక్తిని దుర్నిరీక్ష్యంగా వెలిగించే తూర్పు కోసం..స్త్రీ మూర్తిని సాటి మనిషిగా పరిగణించే మార్పు కోసమే. స్త్రీ మూర్తిని మహోన్నతంగా దర్శించి, ఆవిష్కరించిన మహిళా నాటకం. మహిళా లోకాన్ని ఆదుకునే మహాద్భుత తరానికి ఆవాహనగా నిలవనుంది. నాటకం సారాంశం లక్ష్మి అనే వివాహిత కోమాలో పడి ఉంది. అమె ఒంటికి నిప్పంటించుకొని చావబోయిందని పోలీసులు ధ్రువీకరిస్తారు. అయితే ఆమెను భర్తే చంపబోయాడని లక్ష్మి తండ్రి, తమ్ముడు గ్రహిస్తారు. ఆశక్తుడైన తండ్రి నిలదీయలేకపోతాడు. స్వార్థపరుడైన తమ్ముడు మిన్నకుండిపోతాడు. ఆస్పత్రి బర్న్స్ వార్డులో దయనీయంగా ఉన్న లక్ష్మి శరీరం నుంచి ఆత్మ వెలుపలికి వచ్చి కాలిపోయిన తన శరీరాన్ని చూసుకొని ప్రస్తుత తన నిస్సహాయతను తెలుసుకుని ఏడుస్తుంది. ఆమెకు తన జీవితంలో కొన్ని సంఘటనలు, స్మతులు, తలపుకొస్తాయి. ఆ తలపుల్లో ఆమె జీవితం ఆవిష్కతమవుతుంది. లక్ష్మిది ఆత్మహత్యా ప్రయత్నంగా చిత్రీకరించి భర్త రాజు జనాన్ని నమ్మిస్తాడు. ఇంకా చావదేమిటన్న అసహనంతో ఏ క్షణంలోనైనా చస్తుందన్న నమ్మకంతో దొంగ ఏడ్పులు, విచారం నటిస్తూ హాస్పటల్‌కు వస్తుంటాడు. చివరకు లక్ష్మి చనిపోతుంది. అమె భర్త, హంతకుడైన రాజు నిశ్చితంగా ఉంటాడు. గతంలోనూ..ఇప్పుడూ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తున్న అభాగ్య వనితలకు న్యాయం చేయలేకపోతున్న సమాజం నుంచి వచ్చే కొత్త తరం కోసమే ఈ నాటకం. రంగస్థలమే నా ప్రాణం నాటకం మంచిని బోధిస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. కష్టాన్ని మరిపిస్తుంది. వినోదాన్నిస్తుంది. సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తుంది. ‘రంగస్థలమే నా ప్రాణం. రంగస్థలమే నా ఊపిరి. రంగస్థల కళాకారులగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 500కు పైగా వివిధ సంస్థలతో విభిన్న సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాం. వీలైనంతగా నాటక రంగానికి సేవలందించటమే రంగసాయి నాటక సంఘం లక్ష్యం. ∙– బాదంగీర్ సాయి, రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకుడు -
రంగస్థలం .. మెరిసి మురిసే రోజు
–విశాఖలో అపూర్వ ఘట్టం ఆవిష్కరణ –ఆగస్టు1నlనిరంతరాయంగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు –కళాభారతిలో రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016 రంగస్థలం పరవశించే రోజు అది.. ఎనిమిది విభిన్న కళా అంశాలను ఒకే వేదికపై పలువురు కళాకారులు ప్రదర్శించే అద్భుత దశ్యాన్ని వీక్షించే అరుదైన అవకాశం విశాఖవాసులకు దక్కనుంది. దాదాపు ఆరున్నర గంటలపాటు నిర్విరామంగా ఎనిమిది రంగస్థల అంశాలను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమైంది. ఏకపాక్రాభినయం, కామెడీస్కిట్, విచిత్ర వేషధారణ, లఘునాటిక, ప్రహసనం, మిమిక్రీ, నాటిక, మూకాభినయం, సాంఘిక నాటకం.. విభాగాలలో ఆగస్టు1న కళాకారులు స్టేజీని పండించనున్నారు.l –డాబాగార్డెన్స్ రంగసాయి థియేటర్ ఫెస్టివల్–2016ను ఆగస్టు 1న కళాభారతి ఆడిటోరియం వేదికగా విభిన్న అంశాల రంగస్థల ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కతిక శాఖ ఆర్థిక సాయంతో నిర్వహించే ఈ బహత్కార్యక్రమం కళాభిమానులను కనువిందు చేయనుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా ఎనిమిది రంగస్థల ప్రదర్శనలు ఒకే వేదికపై నిర్వహించనున్నార. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా ప్రదర్శనలు జరగనున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మునుపెన్నడూ లేని విధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు సాంస్కతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రదర్శించనున్నారు. ఆ రోజు ప్రదర్శితమయ్యే కళా అంశాల సంక్షిప్త పరిచయమిది.. 85ఏళ్ల వయసులోనూ ..‘చాణక్యు’నిగా రాణింపు ప్రదర్శన సమయం..మధ్యాహ్నం..3.30 గంటల 3.50 వరకూ.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆంధ్రశ్రీ, అపర చాణక్యుడు చల్లా పాపారావు ‘చాణక్య’ పేరిట ఏకపాత్రాభినయం నిర్వహించనున్నారు. 85 ఏళ్ల వయస్సులో కూడా ఏకపాత్రాభినం నిర్వహిస్తూ ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 450కి పైగా ప్రదర్శనలిచ్చారు. ముంబయి, బెంగళూరుతో పాటు దేశం నలుమూలల పలు ప్రదర్శనలిచ్చి భళా అనిపించుకున్నారు. 2012 తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభల్లో పాపారావు ఏకపాత్రాభినయానికి ప్రభుత్వం రూ.15వేలు అందజేసి సత్కరించింది. ‘చాణక్య’ ఏకపాత్రాభినయం మధ్యాహ్నాం 3.30 నుంచి 3.50 గంటల వరకు జరగనుంది. అదిగో.. ‘ప్లాస్టిక్ భూతం’ ప్రదర్శన సమయం మధ్యాహ్నం 3.50 గంటలకు.. కోరుకొండ రంగారావుæ విశాఖవాసులకు చిరపరిచితులు.. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ లాఫ్టర్స్ ఫన్క్లబ్లో ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. 2005లో ఐదుగురు సభ్యులతో లాఫ్టర్స్ ఫన్క్లబ్ను స్థాపించి ఇప్పటి వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో 2 వేలకు పైగా వినోద కార్యక్రమాలు (కామెడీ స్కిట్స్) నిర్వహించారు. 2011 మే నెలలో 35 గంటల 15 నిమిషాల పాటు జోక్స్ చెప్పి లిమ్కా బుక్ఆఫ్ రికార్డ్సులో స్థానం సాధించారు. 2013 సెప్టెంబర్‌లో గంటలో 654 జోకులు చెప్పి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.2008లో శ్రీకష్ణదేవరాయ కల్చరల్ ట్రస్ట్ ద్వారా అప్పటి ఎయూ రిజిస్ట్రార్ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా ‘వికటకవి పురస్కారం’అందుకున్నారు. అనగనగా ఓ ధీరుడు, ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ‘కత్రిన కరీనా మధ్యలో కమల్ హాసన్’ సినిమాలో నటించారు. ప్లాస్టిక్ భూతం పేరిట విచిత్ర వేషధారణ ద్వారా ఆయన కనువిందు చేయనున్నారు. నటులున్నారు జాగ్రత్త (లఘు నాటిక) ప్రదర్శన సమయం: సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు.. నవరస థియేటర్స్ ఆర్ట్స్, ఎండాడ మండల ప్రజాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులతో ‘నటులున్నారు జాగ్రత్త’ లఘునాటిక ప్రదర్శన నిర్వహించనున్నారు. రచన బళ్లా షణ్ముఖరావు, దర్శకత్వం పి.వి.ఆర్.మూర్తి. లఘు నాటిక విశేషమేమిటంటే..నాటకమంటే తెలియని పిల్లలు ప్రదర్శన ఇవ్వటం. ‘కన్యాశుల్కం’(ప్రహసనం).. రచన..కందుకూరి వీరేశలింగం, దర్శకత్వం..చలసాని కష్ణప్రసాద్ ప్రదర్శన సమయం సాయంత్రం 4.30 గంటల నుంచి.. 19వ శతాబ్ద తొలిరోజుల్లోని సంఘటనల సమాహారం. ఆడపిల్లలు రజస్వల కాకముందు అంగట్లో అమ్ముకునే రోజులవి. ఆ రోజుల్లో ఆడపిల్లలే పంట. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అగ్రహారాల్లో జరుగుతున్న ఈ దురాచారాలను రూపుమాపేందుకు నవయుగ వైతాళికుడు కందుకూరి విరేశలింగం ప్రహసనం రచించారు. 15 నిమిషాల నిడివిలో నిర్వహించనున్న ప్రహసనంలో అమ్ముకునేవాడు..కొనుగోలు చేసేవాడు..కందుకూరి పాత్రలో మరొకరు ముగ్గురు క్యారెక్టర్లతో ప్రదర్శన ఉంటుంది. మధురవాడ సుదర్శన కల్చరల్ అసోసియేషన్ కళాకారులు దీనిని ప్రదర్శిస్తారు.l ధ్వన్యనుకరణ (మిమిక్రీ).. సమయం..సాయంత్రం 4.50 గంటల నుంచి.. నగరానికి చెందిన సీనియర్ మిమిక్రీ కళాకారుడు వై.కె.రాజు ధ్వన్యనుకరణ నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు 1800కు పైగాప్రదర్శనలిచ్చారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ప్రభుత్వ పథకాలపై ప్రచార రూపంలో మిమిక్రీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. సినీ, రాజకీయ ప్రముఖులు, రాజకీయ నేతల వాయిస్..డ్యాన్స్ రూపంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. జోక్స్..ప్రకటనలు..సన్నివేశాలను మిమిక్రీ ద్వారా తెలియజేయనున్నారు. పేరడీ పాటలు, మిమిక్రీతో డ్యాన్స్‌లు కూడా చేయనున్నారు. స్వాగతం నాటిక ప్రదర్శనl సమయం సాయంత్రం 5 గంటలకు.. కె.వి.మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాగతం నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన బి. రామకష్ణ, దర్శకత్వం పి.శివప్రసాద్. కళల కోసమే స్వాగతం నాటిక ప్రేక్షకులను అలరిస్తుంది. మూకాభినయం.. సమయం సాయంత్రం 6.45 గంటల నుంచి.. విజయనగరానికి చెందిన ఆదయ్య మాస్టారు ముకాభినయం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో ఫేమస్. చిన్నదాని సింగారం, వెయిట్ లిఫ్టింగ్ అంశాలపై మైమ్ ప్రదర్శన. 65 మంది కళాకారుల ‘అశ్శరభ శరభ’ విజయవాడ మహేశ్వరి ప్రసాద్ యంగ్ «థియేటర్ ఆర్గనైజేషన్‌కు చెందిన 65 మంది కళాకారులతో రెండున్నర గంటల పాటు ‘అశ్శరభ శరభ’ సాంఘిక నాటకం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఆరు నంది అవార్డులు, పరుచూరి రఘుబాబు స్మారక నాటక కళాపరిషత్‌లో ఏడు అవార్డులు పొందిన సాంఘిక నాటకం. రచన ఎన్.ఎస్. నారాయణబాబు, దర్శకత్వం వాసు, సారథ్యం రాంపిళ్ల మోహనకష్ణ. ఇది ఓ పాపాయి కథ. కన్నె కథ. ఓ కూతురు..ఓ అక్క..ఓ భార్య..ఓ తల్లి కథ. మొత్తంమీద ఒక మహిళా/స్త్రీమూర్తి కథ. స్త్రీ శక్తిని దుర్నిరీక్ష్యంగా వెలిగించే తూర్పు కోసం..స్త్రీ మూర్తిని సాటి మనిషిగా పరిగణించే మార్పు కోసమే. స్త్రీ మూర్తిని మహోన్నతంగా దర్శించి, ఆవిష్కరించిన మహిళా నాటకం. మహిళా లోకాన్ని ఆదుకునే మహాద్భుత తరానికి ఆవాహనగా నిలవనుంది. నాటకం సారాంశం లక్ష్మి అనే వివాహిత కోమాలో పడి ఉంది. అమె ఒంటికి నిప్పంటించుకొని చావబోయిందని పోలీసులు ధ్రువీకరిస్తారు. అయితే ఆమెను భర్తే చంపబోయాడని లక్ష్మి తండ్రి, తమ్ముడు గ్రహిస్తారు. ఆశక్తుడైన తండ్రి నిలదీయలేకపోతాడు. స్వార్థపరుడైన తమ్ముడు మిన్నకుండిపోతాడు. ఆస్పత్రి బర్న్స్ వార్డులో దయనీయంగా ఉన్న లక్ష్మి శరీరం నుంచి ఆత్మ వెలుపలికి వచ్చి కాలిపోయిన తన శరీరాన్ని చూసుకొని ప్రస్తుత తన నిస్సహాయతను తెలుసుకుని ఏడుస్తుంది. ఆమెకు తన జీవితంలో కొన్ని సంఘటనలు, స్మతులు, తలపుకొస్తాయి. ఆ తలపుల్లో ఆమె జీవితం ఆవిష్కతమవుతుంది. లక్ష్మిది ఆత్మహత్యా ప్రయత్నంగా చిత్రీకరించి భర్త రాజు జనాన్ని నమ్మిస్తాడు. ఇంకా చావదేమిటన్న అసహనంతో ఏ క్షణంలోనైనా చస్తుందన్న నమ్మకంతో దొంగ ఏడ్పులు, విచారం నటిస్తూ హాస్పటల్‌కు వస్తుంటాడు. చివరకు లక్ష్మి చనిపోతుంది. అమె భర్త, హంతకుడైన రాజు నిశ్చితంగా ఉంటాడు. గతంలోనూ..ఇప్పుడూ ఇలా అర్ధంతరంగా కన్నుమూస్తున్న అభాగ్య వనితలకు న్యాయం చేయలేకపోతున్న సమాజం నుంచి వచ్చే కొత్త తరం కోసమే ఈ నాటకం. రంగస్థలమే నా ప్రాణం నాటకం మంచిని బోధిస్తుంది. విశ్రాంతిని కలిగిస్తుంది. కష్టాన్ని మరిపిస్తుంది. వినోదాన్నిస్తుంది. సామాజికాభ్యుదయాన్ని కాంక్షిస్తుంది. ‘రంగస్థలమే నా ప్రాణం. రంగస్థలమే నా ఊపిరి. రంగస్థల కళాకారులగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. ఇప్పటి వరకు 500కు పైగా వివిధ సంస్థలతో విభిన్న సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించాం. వీలైనంతగా నాటక రంగానికి సేవలందించటమే రంగసాయి నాటక సంఘం లక్ష్యం. ∙– బాదంగీర్ సాయి, రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకుడు -
జేవీ రమణమూర్తి కన్నుమూత
నాలుగేళ్లుగా కేన్సర్‌తో అస్వస్థత సాక్షి, హైదరాబాద్/ విజయనగరం: కన్యాశుల్కం గిరీశం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన ప్రముఖ రంగస్థల, సినీనటుడు జేవీ రమణమూర్తి(83) కన్నుమూశారు. గత నాలుగేళ్లుగా క్యాన్సర్ (సామస్సెల్ కాన్షినోమా)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ సమయంలో ఇంట్లో కుమార్తె శ్రీదేవి మాత్రమే ఉన్నారు. తండ్రి పడుతున్న ఇబ్బందిని గమనించి ఆమె అంబులెన్స్‌లో స్థానిక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న పది నిమిషాల్లోనే (రాత్రి 7.30 గంటలకు) ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆయన కుమారుడు, అల్లుడు అందుబాటులో లేరు. వారు వచ్చే వరకు భౌతిక కాయాన్ని ఆస్పత్రి మార్చురీలోనే భద్రపర్చనున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. నటుడు సోమయాజులుకు రమణమూర్తి స్వయానా సోదరుడు. ఆయన 1933 మే 20న విజయనగరం జిల్లాలో జన్మించారు. గురజాడ రచించిన కన్యాశుల్కం నాటకం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. అదే ఇష్టంతో ఆయన నటరాజ కళాసమితిని స్థాపించి 42 ఏళ్ల పాటు దాదాపు వెయ్యిసార్లకు పైగా కన్యాశుల్కం నాటకాన్ని ప్రదర్శించారు. కె.బి.తిలక్ సహకారంతో 1957లో సినీరంగ ప్రవేశం చేసి దాదాపు 200 సినిమాల్లో నటించారు. ఎమ్మెల్యే, మంచి మనసుకు మంచి రోజులు, మాంగళ్య బలం, బాటసారి, బావా మరదళ్లు, అమాయకులు, దొంగల దోపిడి, కటకటాల రుద్రయ్య, మరో చరిత్ర, సిరిసిరిమువ్వ, గోరింటాకు, గుప్పెడు మనసు, ఇది కథకాదు, శుభోదయం, ఆకలి రాజ్యం, గడసరి అత్త సొగసరి కోడలు, సప్తపది, శుభలేఖ, మాయాజాలం, శంకర్‌దాదా జిందాబాద్.. అందులో కొన్ని. రమణమూర్తి మృతిపట్ల కళాకారులు, కవులు, అభిమానులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. -
అభినయకళామూర్తి
నివాళి : జె.వి. రమణమూర్తి (1933-2016) గురజాడ ‘కన్యాశుల్కం’ నాటకాన్ని భుజానికెత్తుకొని, దేశవిదేశాల్లో కొన్ని పదుల ఏళ్ళు, కొన్ని వందల ప్రదర్శన లిచ్చిన ఘనత జె.వి. రమణమూర్తిదే. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 200 సినిమాల్లో నటించినా, నడిచొచ్చిన దారిని మర్చిపోని మధ్యతరగతి మనిషి. ‘శంకరాభరణం’ శంకరశాస్త్రి’ పాత్రతో తోడబుట్టిన అన్నయ్య తన కన్నా ముందుకు దూసుకుపోయినా, అన్న చాటు తమ్ముడిగా ఆనందించిన మమతానురాగాల మూర్తి. ఒక తరానికి ఆయన రంగస్థల నటుడు. బ్లాక్ అండ్ వైట్ సినిమా తరానికి ఆయన హీరో... సెకండ్ హీరో పాత్రల ఫేమ్. కలర్ సినిమాల యుగానికి వచ్చేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్. నిన్న మొన్నటి దాకా - టీవీ, రేడియో ఆర్టిస్ట్. అందుకే, జె.వి. రమణమూర్తిగా సుప్రసిద్ధుడైన అభినయమూర్తి జొన్నలగడ్డ వెంకట రమణమూర్తి గురించి ఒక్క మాటలో, ఒక్క ముక్కలో చెప్పడం, నిర్వచించడం కష్టం. శ్రీకాకుళం జిల్లా లుకులామ్ అగ్రహారంలో మొదలై మద్రాస్ మీదుగా హైదరాబాద్ దాకా వివిధ ప్రాంతాల మీదుగా విభిన్న రంగాల్లో విస్తృత ప్రయాణం, కాలంతో పాటు మారుతూ బహుపాత్ర పోషణ చేయడం ఆయన ప్రత్యేకత. చిన్నప్పటి నుంచి... నాటకమే జీవితం ఎక్సైజ్ ఇన్‌స్పెక్టరైన జె.వి. శివరామమూర్తి ఆరుగురు సంతానంలో రెండోవారు జె.వి. సోమయాజులైతే, నాలుగోవారు రమణమూర్తి. గమ్మత్తే మిటంటే, సోమయాజులు, రమణమూర్తి, రమణమూర్తి తరువాతి వాడైన జె.వి. శ్రీరామ్మూర్తి - ముగ్గురూ రంగస్థల నటులే. చిన్నప్పటి నుంచి రమణమూర్తికి నాటకాలంటే అభిమానం. విజయనగరంలో పెరగడం అందుకు దోహదం చేసింది. శ్మశానమైన గురాచారి తోటలో ప్రాక్టీస్ చేసి, మహారాజా వారి ఒకప్పటి ఏనుగులశాలైన ‘హస్తబల్ హాలు’లో తొలిసారి నాటకం వేయడంతో ఆయన అభినయ ప్రస్థానం మొదలైంది. పదిహేనో ఏట 1948లో ‘కవిరాజు మెమోరియల్ క్లబ్’ పెట్టి నాటకాలు వేశారు. ఆ సమాజం విజయనగరంలో ఇప్పటికీ నడుస్తుండడం విశేషం. అన్నయ్య సోమయాజులుతో కలసి ఆత్రేయ ‘ఎన్జీవో’, కవిరాజు ‘దొంగాటకం’, డి.వి. నరసరాజు ‘నాటకం’, ప్రఖ్య శ్రీరామ్మూర్తి ‘కాళరాత్రి’ లాంటివన్నీ ప్రదర్శించారు. బి.ఎస్సీ చదివిన రమణమూర్తి ఆ రోజుల్లోనే ప్రదర్శనకు కావాల్సినవన్నీ సమకూర్చి, అన్నీ అందరికీ చెబుతూ తెలియ కుండానే ‘డెరైక్టర్’ అయ్యారు. హైదరాబాద్‌లో 1955లో జరిగిన ‘ఆంధ్ర నాటక కళాపరిషత్’ పోటీల్లో ‘కాళరాత్రి’ ప్రదర్శనతో ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం అనుకోకుండా ఆయన సినీరంగానికి బాట వేసింది. హీరోగా 20 సినిమాలు... ఆ ప్రదర్శన చూసిన రచయిత డి.వి. నరసరాజు, దర్శకుడు తాతినేని ప్రకాశరావుల పరిచయం రమణమూర్తి పేరును దర్శక - నిర్మాత ఎల్వీ ప్రసాద్ దాకా తీసుకెళ్ళింది. ఎల్వీ దగ్గర అవకాశం రావాల్సింది, చివరకు ఆయన మేనల్లుడు కె.బి. తిలక్ దర్శకత్వంలోని ‘ఎం.ఎల్.ఎ’ దగ్గర వచ్చింది. ఆ సినిమా హిట్టవడంతో వచ్చిన గుర్తింపు... ఆ తర్వాత ‘అత్తా ఒకింటి కోడలే’, ‘బావామర దళ్ళు’, ‘పెళ్ళి మీద పెళ్ళి’ ఇలా 20 సినిమాల్లో హీరో వేషాలొచ్చేలా చేసింది. ఎన్టీఆర్‌తో కలసి ‘మంచి మనసుకు మంచి రోజులు’, ‘శభాష్ రాముడు’ లాంటి చిత్రాల్లో నటించారు. ‘శభాష్ రాముడు’లో తమ్ముడి పాత్ర వేయడంతో ఆ తరువాత నుంచి ఎన్టీఆర్ తనను ఆప్యాయంగా ‘తమ్ముడూ’ అని పిలిచేవారని రమణమూర్తి గుర్తుచేసుకొనేవారు. అలాగే, ఏయన్నార్ సైతం అవకాశాలివ్వమంటూ అందరికీ చెప్పడమే కాక, ‘మాంగల్యబలం’, ‘అమాయకురాలు’ లాంటి చిత్రాల్లో మంచి వేషాలిచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘మరో చరిత్ర’ కుడికాలికి యాక్సిడెంటై కొన్నేళ్ళు మంచం మీద ఉండాల్సి రావడం ఆయన కెరీర్‌ను ఇబ్బంది పెట్టింది. ఆ తరువాత ‘అనురాగాలు’ చిత్రంతో క్యారెక్టర్ యాక్టర్‌గా రెండో దశ మొదలుపెట్టారు. కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ నుంచి మళ్ళీ ఒక ఊపందుకొని, ‘మన ఊరి పాండవులు’, ‘మరో చరిత్ర’, ‘ఆకలిరాజ్యం’, ‘గుప్పెడు మనసు’, ‘సిరివెన్నెల’, ‘వంశగౌరవం’, ‘శ్రీదత్తదర్శనం’ లాంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు. 1933 మే 20న జన్మించిన రమణమూర్తి, అన్నయ్య జె.వి. సోమ యాజులు కన్నా అయిదేళ్ళు చిన్న. రమణమూర్తి ముందుగా సినిమాల్లోకి వచ్చి, పేరు గడించినా, ఆలస్యంగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన అన్నయ్యకు ‘శంకరాభరణం’ సినిమా పుణ్యమా అని మరింత ఎక్కువ పాపులారిటీ వచ్చింది. ఆ క్రమంలో అన్నదమ్ములిద్దరూ రంగస్థలం మీద లానే సినిమాల్లోనూ ‘సప్తపది’ లాంటి పలు చిత్రాల్లో కలసి నటించారు. అప్పుడిక పాపులారిటీలో అన్న చాటు తమ్ముడిగానే తెరపై మిగిలిపోయినా, తన మార్కు అభినయంతో అలరిస్తూనే వచ్చారు. కన్యాశుల్కంతో చిరకీర్తి ఎన్ని సినిమాలు, సీరి యల్స్‌లో చేసినా, ‘కన్యాశుల్కం’ నాటకాన్ని మూడు గంటలకు కుదించి, 1953 నుంచి 1995 దాకా 42 ఏళ్ళపాటు ‘నటరాజ కళాసమితి’గా ఏక ధాటిగా ప్రదర్శనలివ్వడం రమణమూర్తిని చిరస్మరణీయుణ్ణి చేసింది. సోమయాజులు రామప్ప పంతులైతే, రమణమూర్తి గిరిశం. టీవీకి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాసుకొని, 1990లలో దూరదర్శన్‌కు 19 భాగాల సీరియల్‌గా కూడా ‘కన్యాశుల్కా’న్ని అందించారు. రెండేళ్ళ క్రితం కూడా తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు ఆ నాటక ప్రదర్శనలో 6 నెలలు శిక్షణ నిచ్చారు. ఆఖరుదాకా రంగస్థలాన్ని ఊపిరిగా శ్వాసించి, ఒకానొక దశలో అన్నయ్యతోనే ఆ విషయంలో తేడా వచ్చినా అంకితభావం వీడని ఈ అభినయ కళామూర్తికి అశ్రునివాళి. - రెంటాల జయదేవ -
పాక్ కెప్టెన్ అజహర్ అలీ రాజీనామా తిరస్కరణ
లాహోర్: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి శిక్షా కాలం పూర్తి చేసుకున్న పాకిస్తాన్ పేసర్ మొహమ్మద్ ఆమిర్ పునరాగమనంపై ఆ జట్టులో డ్రామా కొనసాగుతోంది. ఆమిర్‌ను జాతీయ శిక్షణ శిబిరంలో చేర్చడాన్ని నిరసిస్తూ తాజాగా వన్డే కెప్టెన్ అజహర్ అలీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ బుజ్జగింపులతో అతను తన రాజీమానాను వెనక్కి తీసుకున్నాడు. జాతీయ శిబిరంలో ఆమిర్ ఉంటే తాము హాజరుకామని గత గురువారం అజహర్, హఫీజ్‌లు నిరసన ప్రకటించారు. అయితే పాక్ బోర్డు జోక్యంతోనే ఇది సద్దుమణిగింది. న్యూజిలాండ్ పర్యటన కోసం సిద్ధమవుతున్న 26 మంది సభ్యుల పాక్ బృందంలో ఆమిర్‌ను ఎంపిక చేశారు. తన తప్పును క్షమించాలని, నిజంగా తన వల్ల సమస్య ఉంటే తానే వెళ్లిపోతానని కూడా ఆమిర్ నేరుగా అజహర్, హఫీజ్‌లకు క్షమాపణ కూడా చెప్పాడు. -
సినీ భస్మాసుర..
సిటీలో తెలుగు నాటక ప్రదర్శన పాత్రధారులుగా పలువురు సినీ నటులు బెంగాళీ, తమిళ్, మరాఠి భాషల్లో ఊపు మీదున్న నాటకం తెలుగులో మాత్రం చతికిల పడిందేం? హైదరాబాద్‌లో అన్య భాషల నాటకాలు ప్రదర్శిస్తే టిక్కెట్టు కొని మరీ చూస్తారు..మరి తెలుగు నాటకాన్ని ఎందుకు ఆదరించరు? ఈ ప్రశ్నలు రంగస్థల అభిమానుల మదిలో ఎప్పటి నుంచో ఉన్నవే. అప్పుడప్పుడు మాత్రం వారిలో కొందరు దీనికి సమాధానం చెప్పాలనే బాధ్యతను తీసుకుంటారు. ఈ సారి ఆ బాధ్యతను తీసుకున్నారు సీమా అజారుద్దీన్. నగరంలోని రవీంద్రభారతిలో ‘సినీ భస్మాసుర’ నాటకాన్ని ఈ నెల 21, 22 తేదీల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు నాటకం స్థితిగతులపై పలువురి అభిప్రాయాలు, అనుభవాలు...మీకోసం - సాక్షి, వీకెండ్ ప్రతినిధి అమెరికా నుంచి 32 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన కర్తాల్ ప్రొడక్షన్స్ అధినేత్రి సీమా అజారుద్దీన్ తెలుగు నాటకానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకు రావాలని ఎంతో తపన పడుతున్నారు. అదే లక్ష్యంతో ఆమె టాలీవుడ్ గ్లామర్‌ని, ఇటు థియేటర్ నటీనటులను కలిపి ‘సినీ భస్మాసుర’ నాటక ప్రదర్శనకు సంకల్పించారు. మొత్తం 10 మంది టాలీవుడ్ నటులు, 15 మంది థియేటర్ ఆర్టిస్టులు నటిస్తున్నారు. ప్రపంచంలోని 12 కోట్ల మంది తెలుగు వారికి తెలుగు నాటకాన్ని దగ్గర చెయ్యాలని, ఇక్కడ ఉన్న చిన్నా పెద్దా నాటక గ్రూప్‌లు అన్నిటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి ఒక రంగస్థల అనుబంధ వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు సీమ. కళలు వినోదాన్ని మాత్రమే కాదు వికాసాన్ని, జ్ఞానాన్ని ఇస్తాయని చెప్పే సీమా...ప్రయత్నానికి తెలాంగాణ ప్రభుత్వం సానుకులంగా స్పందించి సహకారాన్ని అందిస్తోంది. మరోవైపు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటీనటులు ఈ నాటకానికి గ్లామర్ జోడిస్తున్నారు. గత 40 రోజులుగా ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్స్ హాల్లో జరుగుతున్న రిహార్సల్స్‌లో నటీనటులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కలిసిన కళామతల్లి ముద్దు బిడ్డలతో ముచ్చటించినప్పటి విశేషాలివీ... ఇగోలను తుడిచేస్తుంది... యాక్టర్ అంటే ఇగో ఉంటుంది. సినిమాలో ఇది మరి ఎక్కువ. కానీ వాళ్లు థియేటర్‌కి వచ్చే సరికి చాలా హంబుల్‌గా మారిపోతారు. అది థియేటర్ గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ ఆర్టిస్ట్ క్యారెక్టర్ పూర్తిగా ఆర్టిస్ట్ సొంతం. కెమెరా లేదు, డబ్బింగ్ లేదు. డూప్ ఉండరు. అందుకే నటుడు తనలో ఉన్న బెస్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతాడు. సింగిల్ టేక్‌లో తన టాలెంట్ ప్రదర్శించడానికి అన్నీ నేర్చుకుంటాడు. - సీమా అజారుద్దీన్ నటన అంటే సినిమా ఒక్కటే కాదు... యాక్టింగ్ అంటే సినిమా అనే పరిస్థితి మారాలి. నటనకు అవకాశం ఇచ్చే వేదికలు పెరగాలి. అవి సిద్ధం చేయడానికి ఇది ప్రారంభం కావాలని కోరుకుంటున్నాం. వేరే రాష్ట్రంవాళ్లు వచ్చి చేసిన నాటకానికి పోస్టర్స్, హోర్టింగ్స్, మీడియాలో పూర్తి కవరేజ్. కానీ ఇక్కడి నాటకాలు ఏదో గుట్టుగా అయిపోయితాయి అంతే.. మన తెలుగు నాటకాలకు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎందుకు అని అందరూ అలోచించాలి. అప్పుడే నాటకాన్ని నిలబెట్టడానికి మరి కొంత మంది ఆలోచిస్తారు. -రమాదేవి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పాత కథకు కొత్త హంగులు... ఇది 18 ఏళ్ల క్రితం వేసిన నాటకం. దీన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నాం. సుమ మినహా మిగతా వాళ్లంతా ఈ నాటకంలో కొత్త వాళ్లే. అప్పటి కథలో సెల్ఫోన్లు, మీడియా హడావుడిలేదు. వాటిని దీంట్లో చేర్చాం. ఈ సబ్జెక్టు కాంటెంపరరీ. రెండు గంటలపాటు ఉండే నాటకం ఇది. దీనిలో కోట శంకర్ రావ్, బాబూమోహన్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, సుమ, శివాజీరాజా, రవి వర్మ, రాళ్లపల్లి, ఢిల్లీ రాజేశ్వరి, వైజాగ్ ప్రసాద్, నంద కుమార్ ఇలా తెలిసిన నటులతో పాటు థియేటర్ ఆర్టిస్టులు ఉన్నారు. - ఉదయభాను గరికపాటి, నాటక దర్శకులు ఆ థ్రిల్ వేరు... గత కొంతకాలంగా సినిమాలు, సీరియల్స్ చేయడం తగ్గింది. నేను నా లాగే,..అంటే సుమ లాగే స్క్రీన్ మీద యాంకరింగ్ చేస్తున్నాను. యూంకరింగ్లో డైలాగ్, క్యారెక్టర్లు ఉండవు. అందుకే నాటకంలో క్యారెక్టర్ చేస్తావా అంటే వెంటనే ఒప్పుకున్నాను. ఉదయభాను గారి దర్శకత్వంలో అనురాధ పాత్ర 18 ఏళ్ల తర్వాత చేస్తున్నాను. లైవ్ పర్ఫార్మన్స్లో థ్రిల్ వేరుగా ఉంటుంది. ఆడియెన్స్ ఎలా రియాక్ట్ అయినా స్పందించకుండా మా పాత్రలో మేం లీనమయి నటించడం నాటకంలో స్పెషల్. - సుమ. యాంకర్ వాచీలు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం నాటకం చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. అయితే చేసేవాళ్లేరి? ఎందుకంటే...నాటకంలో వేషం వేసినా, రాసినా ఏం రాదు. సీరియల్స్‌కి, సినిమాలకు రాస్తే ఆదాయం వస్తుంది. అప్పట్లో మేం వాచీలు, ఉంగరాలు, సైకిల్లు తాకట్టు పెట్టి నాటకాలు వేశాం. ముందు మంచి నాటకం చూడటం జనానికి అలావాటు చేస్తే, తర్వాత టిక్కెట్టు ఖర్చు పెట్టడానికి ప్రేక్షకులు సిద్ధమని ఇతర భాషల నాటక ప్రదర్శనలు చూస్తే తెలుస్తుంది. - తనికెళ్ల భరణి, నటుడు, రచయిత -
11న పౌరాణిక పద్య పోటీలు
చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత డాక్టర్ వి.ఆర్.రాసాని రూపొందించిన ప్రసిద్ధ తెలుగు నాటక పద్యాలు పుస్తకాన్ని ఈనెల 11న తెనాలిలో ఆవిష్కరించనున్నట్లు పట్టణ రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు షేక్ జానీబాషా, ఎం.సత్యనారాయణశెట్టి చెప్పారు. తెనాలిలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అదేరోజు ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రస్థాయి పౌరాణిక పద్య పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పౌరాణిక నటుడు ఉప్పాల నాంచారయ్యను సత్కరిస్తామని చెప్పారు. -
కమల్,మౌళి కలయికలో కామెడీ చిత్రం?
విశ్వనాయకుడు కమలహాసన్, విభిన్న కథా చిత్రాల దర్శకుడు మౌళి కాంబినేషన్లో కామెడీ కథా చిత్రం తెర కెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తూంగావనం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కమలహాసన్ తదుపరి చిత్రం గురించి చర్చలు మొదలయ్యాయి. ఇటీవల కమర్షియల్, కుటుంబ కథా చిత్రాలను చేస్తున్న కమల హాసన్ దృష్టి మరోసారి హాస్యంపై మళ్లిందని సమాచారం. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్న చందాన కమల్ కోసం ఐదారుగురు దర్శకులు హాస్యభరిత కథలను వండి ఆయన కను సైగల కోసం ఎదురు చూస్తున్నారట. అయితో కమలహాసన్ మాత్రం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, మౌళిలలో ఒకరి దర్శకత్వంలో నటించాలని భావిస్తునట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవల కమల్, దర్శకుడు మౌళి కలిసి కథా చర్చలు జరిపినట్లు తెలిసింది. ఇంతకు ముందు వీరి కలయికలో పంబల్ కే సంబంధం, నలదమయంతి వంటి వైవిధ్య భరిత చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా కమలహాసన్, మౌళి మరో వినోదభరిత చిత్రానికి సృష్టి కర్తలు కావచ్చుననే టాక్ కోడంబాక్కంలో వినిపిస్తోంది. -
నాటకాలాడడంలో నేర్పరి
సుష్మా స్వరాజ్‌పై సోనియా గాంధీ ధ్వజం * లలిత్ మోదీ ఎంత డబ్బిచ్చాడో చెప్పాలన్న రాహుల్ న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ ఇచ్చినప్పటికీ ఆమెపై కాంగ్రెస్ తన దాడిని ఆపలేదు. సుష్మ వివరణను కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ తోసిపుచ్చారు. ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సుష్మ నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు రాహుల్‌గాంధీ సైతం తల్లి సోనియా బాటలో కొనసాగుతూ సుష్మపె మాటల దాడి కొనసాగించారు. ఒక దొంగతనం విషయంలో ఎలా వ్యవహరిస్తారో, అదేమాదిరిగా ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా ఉంచారని ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం కూడా పార్లమెంటు ఆవరణలో తమ ఆందోళన కొనసాగించారు. మీడియాతో సోనియా మాట్లాడుతూ సుష్మ నాటకాలాడుతున్నారని, ఆమె అందులో నేర్పరి అంటూ విమర్శించారు. ఒకవేళ తానే కనుక సుష్మ స్థానంలో ఉండి ఉంటే.. ఆపదలో ఉన్న మహిళకు తప్పక సహాయం చేసేదాన్నని, అదే సమయంలో చట్టపరిధిని మాత్రం అతిక్రమించేదాన్ని కాదని అన్నారు. కేవలం మానవతా దృక్పథంతో లలిత్‌కు సాయం చేశానని, తన స్థానంలో మీరున్నా ఇలాగే చేసేవారన్న సుష్మ వ్యాఖ్యలకు ప్రతిగా సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ.. లలిత్ నుంచి సుష్మ కుటుంబం ఎంత సొమ్ము పొందారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి తన మంత్రిత్వశాఖలో, తన పేషీలో కూడా సుష్మ ఎవరికీ ఏమీ చెప్పలేదని, అంత గోప్యత ఎందుకని ప్రశ్నించారు. లలిత్ జైలు పాలవకుండా చూసేందుకోసం తన కుటుంబానికి, తన కుమార్తెకు, తన భర్తకు ఎంత ముట్టజెప్పారో సుష్మ చెప్పాలని డిమాండ్ చేశారు. తన స్థానంలో సోనియా ఉంటే ఏం చేసేవారన్న సుష్మ మాటల్ని రాహుల్ ప్రస్తావిస్తూ.. తన తల్లి ఆమెలా చట్ట వ్యతిరేకమైన పని చేసేవారు కాదన్నారు. సోనియా, రాహుల్‌ల వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ.. సుష్మపై సోనియా, రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. దీనిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రతిస్పందిస్తూ.. సుష్మపై సోనియా చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు గౌరవాన్ని తగ్గిస్తాయని ఆమె అన్నారు. లలిత్ మోదీ నుంచి సుష్మ కుటుంబం డబ్బు తీసుకున్నారన్న రాహుల్ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. సామాన్య కుటుంబాలకు చెందినవారిలో కుటుంబ సభ్యులంతా జీవనం కోసం తమ వంతుగా కష్టపడి సంపాదించుకోవాలని, అయితే ఇందుకు గాంధీ కుటుంబం అతీతమని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ‘సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ మహిళ సమాజంలోనేగాక, ఆర్థికపరంగా నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందన్నది దేశ ప్రజలందరికీ తెలుసు. ఆయా మహిళల పిల్లలు సైతం తమ వంతుగా కష్టపడడం అంతా చూస్తున్నదే. అయితే గాంధీ కుటుంబం ఇందుకు అతీతం. తమ జీవనంకోసం వారు కష్టపడాల్సిన అవసరం లేదాయె’ అని ఆమె వ్యాఖ్యానించారు. -
నాటకాలాడటంలో సుష్మా నేర్పరి
-
నాటకాలాడటంలో సుష్మా నేర్పరి: సోనియా గాంధీ
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన 25 మంది ఎంపీల సస్పెన్షన్లను నిరసిస్తూ గడిచిన నాలుగు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ శుక్రవారం మరింత దూకుడు పెంచింది. ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు మరోసారి నిరసన దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ పై తీవ్ర స్వరంతో, అనూహ్యరీతిలో విరుచుకుపడ్డారు. సుష్మా స్వరాజ్ నాటకాలాడటంలో నేర్పరి అని దుయ్యబట్టారు. 'ఒకవేళ నేనే గనుక సుష్మా స్థానంలో ఉండి ఉండేదుంటే ఆపదలో ఉన్నవారికి తప్పక సహాయం చేసేదాన్ని.. అయితే చట్టపరిధిని మాత్రం మీరేదాన్ని కాదు' అని సోనియా అన్నారు. కేవలం మానవతా దృక్పథంతోనే లలిత్ మోదీకి సహాయం చేశానని, నా స్థానంలో మీరున్నా ఇలానే చేసేవారన్న సుష్మా వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోనియా ఈ కామెంట్లు చేయడం గమనార్హం. లలిత్ గేట్, వ్యాపం కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, బీజేపీ మంత్రులు వసుంధర రాజే, శివారాజ్ సింగ్ చౌహాన్ లు రాజీనామా చేయాల్సిందేనని పట్టుబట్టిన కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం, ప్రతిగా స్పీకర్ సుమిత్రా మహాజన్ 25 మంది కాంగ్రెస్ సభ్యులను సస్సెండ్ చేయడం తెలిసిందే. సదరు ఆరోపితులు రాజీనామాలు చేసేంతవరకు తమ నిరసన కొనసాగిస్తునే ఉంటామని కాంగ్రెస్ స్పష్టం చేసింది. -
ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం?
తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ, పారశీకం, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ భాషల ప్రభావం ఉంది. ఈ అంశంపై గత డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌లో రెండు ప్రశ్నలు, లాంగ్వేజ్ పండిట్లో మూడు ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టి సారించి సన్నద్ధతకు మెరుగులు దిద్దుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. తెలుగు సాహిత్యంపై ఇతర భాషల ప్రభావం సంస్కృతం ప్రభావం: ప్రపంచ భాషా కుటుంబాల్లో పెద్దది ఇండో ఆర్యన్ లేదా హిందార్య కుటుంబం. వీటిలో అతి ప్రాచీనమైంది సంస్కృతం. దీనికి సంబంధించి రెండు భేదాలున్నాయి. అవి: 1. వైదిక సంస్కృతం 2. లౌకిక సంస్కృతం వైదిక సంస్కృతం: వైదిక ఆచార వ్యవహారాల్లో ఉపయోగించేది వైదిక సంస్కృతం. కావ్యాల్లోని భాష లౌకిక సంస్కృతం. భారతీయ భాషలన్నింటిపై సంస్కృతం ప్రభావం ఉంది. తెలుగు భాషపై ప్రత్యేకించి ఎక్కువ. మన దేశంలో అతి ప్రాచీనగ్రంథం ‘రుగ్వేదం’. ఇది క్రీ.పూ. 1500 నాటిదని భాషా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వేదాలన్నీ మౌఖికాలు. పూర్వకాలంలో వాటిని విని, వల్లెవేసేవారు కాబట్టి వేదాలను ‘శ్రుతులు’ అని కూడా అంటారు. మన దేశంలో లిఖిత పూర్వకంగా ముద్రణలో లభించిన మొదటి గ్రంథం యాస్కుని నిరుక్తం.రుగ్వేదం తర్వాత యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలు వచ్చాయి. వేదాలకు వి వరణాత్మక వ్యాఖ్యానాలుగా బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఆవిర్భవించాయి. లౌకిక సంస్కృతం: కావ్యాల్లో వాడిన భాష లౌకిక సంస్కృతం. దీని కాలం క్రీ.పూ. 1000 నుంచి 600 నాటిదని భాషాశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాల్మీకి రామాయణం, వ్యాసుడి మహాభారతం, ‘పాణి’ని అష్టాధ్యాయి వంటి గ్రంథాలు లౌకిక సంస్కృతంలోనే ఉన్నాయి. పాణిని అష్టాధ్యాయి వ్యాకరణం ప్రపంచంలో ప్రముఖ భాషా శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకుంది. ‘మానవ మేధాశక్తికి మహత్తర గోపురం’ పాణిని వ్యాకరణం అని ‘బ్లూమ్‌ఫీల్డ్’ అభివర్ణించాడు. మహాకవి కాళిదాసు కుమార సంభవం, రఘు వంశం, రుతు సంహారం లాంటి ప్రసిద్ధ కావ్యాలను రచించారు. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం, విక్రమోర్వశీయం లాంటి గొప్ప నాటకాలు రాశారు. భాసుడు రచించిన ‘ప్రతిమ’, ‘స్వప్న వాసవదత్తం’ నాటకాలు కూడా ప్రసిద్ధికెక్కాయి. భర్తృహరి ‘సుభాషితాలు’, శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ నాటకం పండితుల ప్రశంసలు పొందాయి. తెలుగు భాషా సాహిత్యంపై సంస్కృత భాషా సాహిత్యాల ప్రభావం ఎక్కువగా ఉంది. తొలిదశలో తెలుగు సాహిత్యం సంస్కృత సాహిత్యాన్ని అనుసరించింది. పురాణాలు, కావ్యాలు, నాటకాల్లో సంస్కృత ప్రభావం కనిపిస్తుంది. ఆదికవి నన్నయ భారతాంధ్రీకరణలో ఐదింట నాలుగుపాళ్లు తత్సమ పదాలను ప్రయోగించారు. భారత, భాగవత, రామాయణ గ్రంథాలన్నీ సంస్కృతం నుంచి అనువాదమైనవే. తిక్కన, ఎర్రన, శ్రీనాథ యుగం సంస్కృత కావ్యాలనే అనుసరించింది. శ్రీనాథుడి శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం కావ్యాలు సంస్కృత అనుసరణలుగా, సంస్కృత సమాస భూయిష్టమైన నారికేళ పాకంలో సాగాయి. శ్రీనాథుడు ‘క్రీడాభిరామం’ కావ్యంలో అన్ని భాషలకు సంస్కృతం అమ్మ లాంటిదని (జనని సంస్కృ తంబు సకల భాషలకును) ప్రశంసించారు. 19 వ శతాబ్ది చివరలో బిషప్ కాల్డ్వెల్ తెలుగు ద్రావిడ భాషా జన్యమని సిద్ధాంతీకరించేంత వరకు పండితులంతా సంస్కృత భాష నుంచి పుట్టిందనే అభిప్రాయంతో ఉన్నారు. ప్రబంధ కవులు చాలా వరకు సంస్కృత కావ్యాల ఆధారంగా రచనలు సాగించారు. శ్రీ కృష్ణ దేవరాయల ఆముక్త మాల్యద, రామరాజభూషణుడి వసుచరిత్ర సంస్కృత సమాస భూయిష్టంగా నారికేళపాకంలో సాగాయి. మనుచరిత్రలో పెద్దన కొంత కదళీపాకాన్ని, కొంత నారికేళ పాకాన్ని మిళితం చేశారు. రాజకీయ, సాంస్కృతిక, భౌగోళిక సంబంధాల వల్ల తెలుగులో సంస్కృత పదాలు ప్రవేశించాయి. ప్రస్తుతం పూజలు, కర్మకాండలకే సంస్కృతాన్ని ఉపయోగిస్తున్నారు. ఆంగ్ల భాషా ప్రభావం: సంస్కృతం తర్వాత తెలుగు సాహిత్యంపై అత్యధికంగా ప్రభావితం చేసిన భాష ఆంగ్లం. 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్య ప్రభావం సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసింది. వీరేశలింగం, గురజాడ, గిడుగు, చిలకమర్తి లాంటి కవులు ఆంగ్ల భాషా సాహిత్యాలను అధ్యయనం చేశారు. వీరేశలింగం ఆంగ్ల సాహిత్య ప్రభావంతో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర ప్రక్రియలను తెలుగులో రాశారు. గురజాడ పాశ్చాత్యుల హేతువాద దృక్పథాన్ని ప్రశంసిస్తూ ‘కన్నుగానని వస్తు తత్వము కాంచ నేర్వరు/ లింగిరీజులు’ అని మెచ్చుకున్నారు. పాశ్చాత్యుల సంస్కరణ దృక్పథానికి ప్రభావితుడై బాల్య వివాహాలు, కన్యాశుల్కాన్ని నిరసించారు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని శిల్పవంతంగా తీర్చిదిద్దారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం వీరేశలింగం అడుగుజాడల్లో ప్రసిద్ధ నవలలు, ప్రహసనాలు, నాటకాలను రాశారు. గిడుగు రామ్మూర్తి పంతులు ఆంగ్లభాషా ప్రభావంతో గ్రాంథిక భాష వద్దన్నాడు. వ్యావహారిక భాషా ఉద్యమాన్ని చేపట్టి విజయాన్ని సాధించారు. వ్యావహారిక భాషా ఉద్యమ ఫలితంగా తెలుగు ప్రాంతాల్లో అక్షరాస్యత పెరిగింది. సృజనాత్మక వచన రచనలు వెలువడ్డాయి. 20వ శతాబ్ది మొదటి భాగంలో ఆధునిక కవులైన రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి, తల్లావజ్జల, కవికొండల వెంకట రావు మొదలైన కవులు షెల్లీ, కీట్స్, వర్‌డ్సవర్‌త, డ్రెడైన్ లాంటి రొమాంటిక్ కవుల ప్రభావంతో భావ కవితా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో ఆధునిక సాహితీ ప్రక్రియలైన నవల, కథానిక, నాటకం, వ్యాసం, విమర్శ లాంటి రచనలు అందుబాటులోకి వచ్చాయి. పాలనా పరమైన గవర్నర్, కమిషనర్, మేయర్, చైర్మన్, మినిస్టర్, న్యాయ సంబంధమైన కోర్టు, లాయర్, జడ్జి, డిక్రీ లాంటి పదాలు తెలుగులో కలిసిపోయాయి. అలాగే విద్యారంగంలో కాలేజీ, స్కూలు, యూనివర్సిటీ, ప్రొఫెసర్, లెక్చరర్, టీచర్ పదాలు చేరాయి. నిత్య వ్యవహారంలో మిళితమైన రోడ్డు, రైలు, బస్సు, పేపరు, పెన్ను, గన్ను పదాలను ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ‘నవీన తత్సమాలు’గా పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంపై ఆంగ్లం ప్రభావాన్ని తెలియజేసే ప్రసిద్ధ గ్రంథాలు: 1. తెలుగు సాహిత్యంపై ఇంగ్లిషు ప్రభావం - ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు 2. తెలుగులో ఆంగ్ల పదజాలం - ఆచార్య టి. అక్కిరెడ్డి 3. ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభా వం - ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 4. బాల వ్యాకరణం - వికాస వ్యాఖ్య - ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం ఉర్దూ ప్రభావం: అల్లాఉద్దీన్ ఖిల్జీ దండయాత్ర ప్రభావంతో ఉర్దూ భాష భారత దేశంలో ప్రవేశించింది. నవీన ఔత్తరాహ భాష హిందీ తర్వాత ప్రముఖమైంది ఉర్దూ. ఈ భాషా వ్యవహర్తలు దేశమంతా ఉన్నారు. మహమ్మదీయుల పాలనలో ఉర్దూ 13వ శతాబ్ది నుంచి పాలనా భాషగా ఉంది. మల్కీభరామ్ ఉర్దూతోపాటు తెలుగును ఆదరించారు. ఆయన పొన్నెగంటి తెలగన రచించిన ‘యయాతి చరిత్ర’ను అంకితం తీసుకున్నారు. ఆంగ్లేయుల పాలనలో 1835లో ఉర్దూను రాజభాషగా ప్రకటించారు. హిందీ బోధన కంటే ఉర్దూ బోధనకే ప్రాధాన్యమిచ్చారు. ముస్లిం ప్రభువుల పాలనలో సైనిక శిబిరాల్లో పుట్టిన ఉర్దూ సాంఘిక, రాజకీయ కారణాల వల్ల బాగా అభివృద్ధి చెందింది. క్రీ.శ. 15వ శతాబ్ది నాటికే ఉర్దూ సాహిత్యం ఉంది. ఈ భాషా సాహిత్య రూపాన్ని ‘దఖానీ’ అని పిలుస్తారు. ఉర్దూ, హిందీలు హిందూస్థానీ భాషలుగా ప్రసిద్ధి చెందాయి. రాజకీయ పాలనా పరంగా నవాబు, నౌకరు, తహసీల్దార్, దరఖాస్తు , రసీదు, కుర్తా, కండువా, లంగా మొదలైన ఉర్దూ పదాలు తెలుగులో పూర్తిగా కలిసిపోయాయి. అదేవిధంగా సాంస్కృతికపరంగా మసీదు, సలాం, మక్కా, నమాజు లాంటి పదాలు తెలుగులో చేరాయి.ఆధునిక కవితా రూపాలైన గజల్స్, రుబాయీలు ఉర్దూ సాహిత్య ప్రభావితాలే. ఆధునిక కవుల ప్రయోగాల్లో ఉర్దూ పదాలు విరివిగా ఉన్నాయి. ఉర్దూలో ఇక్బాల్చంద్, రాజేందర్ సింగ్ బేడీ ప్రముఖ రచయితలు. ప్రసిద్ధగ్రంథాలు - రచయితలు 1. తెలుగులో ఉర్దూ పదాలు - డాక్టర్ టి. స్వరాజ్యలక్ష్మి 2. తెలుగు భాషకు మహమ్మదీయుల సేవ - డాక్టర్ షేక్ మస్తాన్ 3. తెలుగుపై ఉర్దూ - పారశీకుల ప్రభావం - ఆచార్య కె. గోపాల కృష్ణారావు గత డీఎస్సీలో అడిగిన ప్రశ్నలు 1. తెలుగులో ప్రస్తుతం వాడుకలో ఉన్న లైటు, స్విచ్, కాఫీ అనే ఆంగ్ల పదాలు? (ఎస్.ఎ. - 2012) 1) నిత్యావసరాలకుసంబంధించినవి 2) సాంస్కృతిక సంబంధమైనవి 3) పరిపాలనా సంబంధ పదాలు 4) శాస్త్ర పరిభాషా సంబంధమైనవి 2. తెలుగు మాట ‘వేయి’ పదం? (ఎస్.ఎ. - 2012) 1) సంస్కృత పదం 2) తమిళ పదం 3) కన్నడ పదం 4) ద్రావిడ వ్యుత్పత్తి ఉన్న స్వతంత్ర పదం 3. ‘జమిలి’ శబ్దానికి మూలరూపం ‘యమల’. ఇది ఏ భాషా పదం? (ఎల్పీ - 2012) 1) కన్నడం 2) మలయాళం 3) సంస్కృతం 4) తమిళం 4. ‘చాకిరీ’ అనే పదం ఏ భాషలోనిది? (ఎల్పీ - 2012) 1) కన్నడం 2) మలయాళం 3) ఉర్దూ 4) తమిళం సమాధానాలు 1) 1; 2) 4; 3) 3; 4) 3. మాదిరి ప్రశ్నలు 1. సంస్కృతం ఏ భాషా కుటుంబానిది? 1) ఆర్య భాష 2) ఇండో ఆర్యన్ భాష 3) సినోటిబెటన్ 4) ఆస్ట్రో ఏషియాటిక్ 2. తెలుగులో ప్రవేశించిన పాలనా సంబంధ సంస్కృత పదం? 1) ఆదేశం 2) నిర్బంధం 3) పరిపాలన 4) పైవన్నీ 3. తెలుగుతో సంస్కృత భాషకు ఉన్న సంబంధం? 1) సజాతీయ భాష 2) విజాతీయ భాష 3) సమీప భాష 4) మత సంబంధ భాష 4. సంస్కృత సమాస భూయిష్టమైన శైలిని ఏమంటారు? 1) ద్రాక్షాపాకం 2) కదళీపాకం 3) నారికేళ పాకం 4) పాషాణ పాకం 5. సంస్కృతం నుంచి తత్సమాలుగా ఎలాంటి మార్పు లేకుండా తెలుగులోకి వచ్చిన మాటలు? 1) మకారాంత శబ్దాలు 2) సకారాంత శబ్దాలు 3) అకారాంత శబ్దాలు 4) దీర్ఘాచ్చులు ఉన్న ఏకాక్షర పదాలు 6. అన్య దేశ్యాల ద్వారా తెలుగులోకి వచ్చిన అనుబంధ రూపాలు? 1) దారు, నామా 2) పోతు, గారు 3) ఖానా, రికం 4) కోరు, పోతు 7. ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించిన తొలి నాటకం? 1) మర్చంట్ ఆఫ్ వెనిస్ 2) జూలియస్ సీజర్ 3) రోమియో జూలియట్ 4) కామెడీ ఆఫ్ ఎరర్స 8. జీవిత చరిత్ర - స్వీయ చరిత్రలకు మూలమైన ఆంగ్ల ప్రక్రియలు? 1) లైఫ్ హిస్టరీ - బయోగ్రఫీ 2) ఆటో బయోగ్రఫీ - లైఫ్ హిస్టరీ 3) బయోగ్రఫీ - ఆటో బయోగ్రఫీ 4) బయోగ్రఫీ - సెల్ఫ్ హిస్టరీ సమాధానాలు: 1) 2; 2) 4; 3) 2; 4) 3; 5) 4; 6) 1; 7) 2; 8) 3. -
రంగస్థలంపై రజనీ?
వెండితెరపై రజనీకాంత్ కనిపిస్తే చాలు... అభిమానుల పరవశానికి హద్దుండదు. తెరముందు నిలబడి మంగళహారతులిచ్చేస్తుంటారు. అలా కాకుండా...కళ్ల ముందే స్వయంగా నటిస్తే? ఇక చెప్పేదేముంది! వారి ఉద్వేగాన్ని మాటల్లో వర్ణించడం కష్టం. అందుకే సాధ్యమైనంతవరకూ సూపర్‌స్టార్ షూటింగ్‌లు అవుడ్డోర్‌లో పెట్టరు. ఈ కారణంగానే... ఆయన లైవ్ పెర్ఫార్మెన్స్ చూసే అదృష్టం జనానికి అరుదైపోయింది. అయితే... రజనీ తోడల్లుడు, నటుడు, రచయిత అయిన వైజీ మహేంద్రన్ ఆ అదృష్టాన్ని ప్రేక్షకులకు కల్పించే పనిలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ కోసం ఆయన ఓ నాటకం రాశారు. దీంట్లో రజనీకాంత్‌ని నటింపజేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు మహేంద్రన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘కొన్ని రోజుల క్రితం రజనీని కలిసినప్పుడు, ‘మీ కోసం ప్రత్యేకంగా ఓ నాటకం రాశా. అందులో మీరు నటించాలి’ అనడిగాను. త్వరలో ఆ విషయాన్ని గుర్తు చేయబోతున్నాను. నేను అడిగితే రజనీ కాదనరనే నమ్మకం ఉంది. బహుశా ‘లింగా’ తర్వాత నా నాటకంలో నటిస్తారేమో’’ అని చెప్పారు. అంటే... త్వరలోనే రంగస్థలంపై సూపర్‌స్టార్ సూపర్ స్టైల్‌ని ప్రేక్షకులు చూసే అవకాశం ఉందన్నమాట! -
ఎన్నోయేండ్లు గతించిపోయిననూ..
-
సెన్సారైనా.. ప్రజలకు చేరిన నాటకం
గ్రంథం చెక్క చెకోవ్, గోర్కీ లిద్దరూ తీరికగా కబుర్లు చెప్పుకుంటూ పట్టణ వీధుల్లో తెల్లటి చప్టాల మీద నడుస్తుండేవాళ్లు. రాత్రి అయేసరికి ఆర్టు థియేటర్ నాటకాలకి పోయి చూస్తూ కాలక్షేపం చేసేవాళ్లు. అప్పుడే చెకోవ్, గోర్కీని ఓ నాటకం రాయమని ప్రోత్సహించాడు. గోర్కీకి నాటక రంగం కొత్త. ప్లాటు తయారుచేశాడు. బెస్సిమినోవ్ కుటుంబ కఠినజీవితాన్ని చిత్రిస్తూ గోర్కీ తొలి నాటకం ‘ఫిలిస్టైన్స్’ (శిష్టులు) రచించాడు. నాటక రచనలో అతను చేయి తిరిగినవాడు కాడు. రాసి, మళ్ళీ రాసి మార్పులు చేసేడు. కానీ తృప్తి లేదు. ఒక గొప్ప సాహిత్యవేత్త నాటకరచన విషయంలో ఏమన్నాడంటే- ‘‘మొదట్లో అయిదంకాల కష్టాంత నాటకం రాయి. సంవత్సరం పోయేక దాన్నే మూడంకాల నాటకంగా మార్చు. ఇంకో ఏడాది పోనిచ్చి దాన్ని ఏకాంక సుఖాంత నాటికగా కత్తిరించుకో. మరో ఏడాది గడవనిచ్చి, ఏకాంకికను పొయ్యిలో పారేయ్!’’ గోర్కీ ఈ సలహానే అనుసరించాడు. కానీ తన నాటకాన్ని మాత్రం పొయ్యిలో మాత్రం పారేయలేదు. ‘శిష్టులు’లో గోర్కీ తన చిన్ననాటి నుంచి ఎరిగి వున్న మానవుల్ని చిత్రించాడు. పట్టణాలలో చిన్న యిళ్లలో వుంటూ ఉక్కిరి బిక్కిరిగా నివసిస్తూండే వాళ్ళే ఈ ‘శిష్టులు’. వాళ్ల జీవితం అందులో చిత్రితమైంది. అది తృప్తి నివ్వక, తరువాత కొత్త నాటకంలో కోటీశ్వరుల వీధిలో ఉన్న బికారుల జీవితాన్ని చిత్రించాడు, ‘నికృష్ట జీవితం’ అని పేరె ట్టాడు. ఇందులోని పాత్రలన్నీ గోర్కీ జీవితంలో సహచరులుగా గడిపినవారివే. ఆ నాటకంలోని ప్రతి వాక్యమూ ఏ సామాజిక విధానం కింద మానవుల్లో అత్యధిక సంఖ్యాకులు జీవించడానికి హక్కు లేకుండా చేయబడుతున్నారో, ఆ విధానం మీదే నిప్పులు చెరుగుతూ, దాన్ని దగ్ధపటలం చేసింది. నాటకంలోని కొన్ని వాక్యాలను ప్రభుత్వం సెన్సారైతే చేసింది కానీ, నాటక ముఖ్య సందేశం జనంలోకి వెళ్లకుండా మాత్రం చేయలేకపోయింది. - మహీధర జగన్మోహనరావు అనువాద రచన ‘గోర్కీ జీవితం’ నుంచి (ప్రపంచ ప్రసిద్ధ రచయిత మాగ్జిమ్ గోర్కీ వర్ధంతి రేపు) -
సీమాంధ్ర ఎంపీల బహిష్కరణ డ్రామానా?
-
ఇది కాంగ్రెస్ కుట్ర : సుష్మా స్వరాజ్
-
బిల్లు ఆమోదం సరికాదని చెప్పాం: సుష్మా
-
ఎంపీల బహిష్కరణ డ్రామా: గట్టు
సోనియా డెరైక్షన్లోనే ఎంపీల డ్రామాలు సీఎం, బొత్స, ఎమ్మెల్యేలను బహిష్కరించరేం? సాక్షి, హైదరాబాద్: పార్టీ నుంచి సస్పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ఢిల్లీలో సరికొత్త డ్రామాకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందున ఆరుగురు ఎంపీలను బహిష్కరిస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్ పార్టీ... అసెంబ్లీలో అదే బిల్లును వ్యతిరేకించిన ఎమ్మెల్యేలను, ఢిల్లీలో ధర్నా చేసిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలను ఎందుకు బహిష్కరించలేదని ప్రశ్నించారు. బహిష్కరణకు గురైన ఆరుగురు ఎంపీలు కూడా సోనియాగాంధీ ఆడిస్తున్న డ్రామాలో భాగంగానే ఇన్నాళ్లూ అవిశ్వాసం, ధర్నాలు అంటూ రకరకాల ఫీట్లు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిల్లును వ్యతిరేకిస్తున్నందువల్లే ఆరుగురిపై వేటు వేశారంటే... మిగతా సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రులు తెలంగాణకు అనుకూలమా? అని ప్రశ్నించారు. మైనారిటీలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి మెజారిటీ నిర్ణయాలు తీసుకునే అర్హత ఎక్కడిదని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే... పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలకు విందులు ఏర్పాటు చేస్తోంది. ప్రతిష్టాత్మకమైన మహిళాబిల్లు, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన తదితర బిల్లులెన్నో పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఆమోదం కోసం ఏనాడూ విపక్షాల మద్దతు కూడగట్టని కాంగ్రెస్ తెలుగుజాతిని చీల్చడం కోసం విందులు ఏర్పాటు చేస్తోంది. తెలుగుజాతిపై ఎందుకింత కక్షగట్టారు? ఏం పాపం చేసిందని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు? విభజన బిల్లుకు పార్లమెంటులో ఎలాంటి లీగల్ సమస్యలు ఎదురు కాకూడదనే పక్కా ప్రణాళికతో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబుల చేత అసెంబ్లీలో చర్చ జరిగేలా చేసి నాటకీయంగా పంపించారు. రాష్ట్రాన్ని విభజించడం కోసం కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న డ్రామాలన్నింటికీ టీడీపీ వంత పాడుతోంది. కాంగ్రెస్ మాదిరిగానే చంద్రబాబు కూడా ఇరు ప్రాంత నేతల చేత డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం సిగ్గుమాలిన పనికి ఒడిగడుతున్నారు. జాతీయనేతలను చంద్రబాబు ఎందుకు కలుస్తున్నారో చెప్పడంలేదు. విహారయాత్ర మాదిరిగా బాబు పర్యటిస్తున్నారు. రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా విభజించడానికి సోనియాగాంధీ, చంద్రబాబు, కేసీఆర్‌ల అబ్బ జాగీరు కాదు. ఆ ఎంపీలకు అభినందనలు: మోదుగుల సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమైక్యత కోసం పార్లమెంటులో ఆందోళన జరిపి, బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎంపీలను అభినందిస్తున్నానని టీడీపీ సీమాంధ్ర ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి చెప్పారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడే సభ్యులను బహిష్కరించడమే కాంగ్రెస్‌లోని అంతర్గత ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. -
పోటాపోటీ నిరసన
తమ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ సీనియర్ నాయకుడు అరుణ్‌జైట్లీ నివాసం ఎదుట నిర్వహించిన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు పార్టీల మధ్య తీవ్రవాగ్వాదం జరగడంతో పోలీసులు అందరినీ అదుపు చేయాల్సి వచ్చింది. ఆప్ ఎమ్మెల్యే మదన్‌లాల్ నివాసం ఎదుట బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు. సాక్షి, న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మంగళవారం భారీ ప్రదర్శన నిర్వహించారు. వీరి ఆందోళనను వ్యతిరేకించడానికి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆప్ కార్యకర్తలు జైట్లీకి వ్యతిరేకంగా, బీజేపీ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్ని ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ ఆప్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిర్వహించిన ఆందోళనలో స్మృతి ఇరానీ, పర్వేశ్ వర్మ పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన దృష్ట్యా అరుణ్ జైట్లీ నివాసం వద్ద పోలీసులు బారీ భద్రతా ఏర్పాట్లు చేసి బారికేడ్లు అమర్చారు. దక్షిణ ఢిల్లీలోని కైలాష్కాలనీలోని జైట్లీ నివాసం ఎదుట మంగళవారం ఉదయం నాటకీయ పరిణామాలు కనిపించాయి. బారికేడ్లకు ఓ వైపున ఆప్ కార్యకర్తలు, మరో వైపున బీజేపీ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. త మ ప్రభుత్వాన్ని కూల్చడానికి, తమ ఎమ్మెల్యేలను కొనడానికి హర్షవర్ధన్, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను బట్టబయలు చేయడానికి మంగళవారం నుంచి ‘పోల్ ఖోల్ అభియాన్’ను చేపట్టనున్నట్లు ఆప్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఆప్ కార్యకర్తలు మంగళవారం ఉదయం జైట్లీ నివాసం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. వీరంతా జైట్లీ నివాసానికి చేరుకున్న కాసేపటికి బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు ప్రారంభించారు. అరుణ్ జైట్లీ బయటకు వచ్చి తనకు మద్దతు పకలడానికి వచ్చిన బీజేపీ కార్యకర్తలతో మాట్లాడారు. పాలనలో విఫలమైన కేజ్రీవాల్ సర్కారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసత్య, మోసపూరిత ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. జైట్లీ ఇంటి ఎదుట పరస్పర వ్యతిరేక నినాదాలతో ఆప్, బీజేపీ కార్యకర్తలు జరిపిన ప్రదర్శన దాదాపు రెండుగంటలకు పైగా కొనసాగింది. ఈ సందర్భంగా ఇరుపార్టీల కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. పోలీసులు ఆందోళనకారులను దూరంగా తీసుకెళ్లారు. మదన్‌లాల్ నివాసం వద్ద బీజేపీ ఆందోళన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మదన్‌లాల్ నివాసం వద్ద బీజేపీ కార్యకర్తలు మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆప్ సర్కారును కూల్చడం కోసం అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో ఆరోపించడం తెలిసిందే. ‘ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సరిగ్గా ఒరోజు ముందు అంటే.. డిసెంబర్ ఏడు అర్ధరాత్రి 12.30 గంటలకు నాకు ఐఎస్డీ కాల్ వచ్చింది. మరుసటి ఉదయం అరుణ్‌జైట్లీతో మాట్లాడిస్తానని కాలర్ చెప్పాడు. నేను ‘షటప్’ అని ఫోన్ పెట్టేశాను. తరువాత రెండు రోజులకు.. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకమునుపు నన్ను సంప్రదించిన వ్యక్తి మళ్లీ మాట్లాడాడు. ఆప్‌కు ఎలాగూ మెజారిటీ లేదు కాబట్టి తమకు మద్దతు ఇస్తే అన్నీ ఇస్తామని అన్నాడు.తాజాగా పది రోజుల కిందట ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. వారిలో ఒకరు తనకు పరిచయస్తుడు. మరొకరు నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడు. తొమ్మిది మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని కూల్చేయాలని కోరాడు’ అని మదన్‌లాల్ వివరించారు. ఇందుకు ప్రతిఫలంగా తనను ముఖ్యమంత్రిని, మిగతావారిని మంత్రులను చేస్తానని ప్రతిపాదించాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకునేవారికి రూ.20 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చాడన్నారు. -
‘ముఖ్యమంత్రివి డ్రామాలు’
విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ విమర్శించారు. శనివారం ఆయన పట్టణంలోని ఆ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన కు అనుకూలంగా సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు సీఎం ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. విభజన నిర్ణయాన్ని కేం ద్రం ప్రకటించినప్పుడే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేసి, రాజ కీయ సంక్షోభం సృష్టిస్తే... పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదన్నారు. ఇప్పు డు తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేస్తానని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్లో విభజన బిల్లును అడ్డుకునే సత్తా ఒక్క టీడీపీకే ఉందన్నారు. జిల్లాలో గణతంత్ర దినోత్సవం నాడు ఏసీబీ కేసులు, అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ప్రశంసాపత్రాలు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వం నైజమన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ నాయకులు కెఎ నాయుడు, డీవీజీ శంకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మన్యాల కృష్ణ, ఎస్ఎన్ఎం రాజు, తదితరులు ఉన్నారు. -
47రోజుల నాటకానికి తెర
-
కాలం ఆమె చక్రాల కుర్చీ
లక్ష్యం వైపు నడిపించేది కదలిక. కానీ ఆ కదలిక దివ్యలో లేదు. చిన్నప్పుడే సెరిబ్రల్ పాల్సీఆమెను కదలకుండా చేసింది. పెద్దయ్యాక చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. అయితే ఆమె ఏం చేసిందో తెలుసా? కాలాన్నే తన చక్రాల కుర్చీగా మార్చుకుని ఉత్సాహంగా ముందుకు సాగిపోతోంది! ముంబైలోని ఓ థియేటర్... అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడెవరూ లేక కాదు. వందలమంది ఉన్నారు. కానీ ఎవ్వరూ చిన్న శబ్దం కూడా చేయడం లేదు. తీక్షణంగా స్టేజివైపే చూస్తున్నారు. ఒక్కక్షణం రెప్పవేసినా అద్భుతమైన దృశ్యమేదో మిస్సయిపోతామన్నట్టుగా మైమరచి చూస్తున్నారు. స్టేజిమీద నాటకం నడుస్తోంది. ఆరుగురు వ్యక్తులు తమ పాత్రల్లో లీనమై నటిస్తున్నారు. కానీ అందరి దృష్టి ఒకే ఒక అమ్మాయి మీద. వీల్ చెయిర్లో కూర్చుని ఉందామె. హావభావాలతోనే పాత్రను పండిస్తోంది. నిజమైన నటనకు భాష్యం చెబుతోంది. ఆమె ప్రతి కదలికలోనూ ప్రత్యేకత. ఆమె పలికే ప్రతి పదంలోనూ స్పష్టత. కానీ కొన్నేళ్ల క్రితం తను అలా లేదు. ఆమెలో ఆ కద లిక కొత్తగా వచ్చింది. ఆమె పదాలకంత స్పష్టత... తన కృషితో అబ్బింది. ఆమె పేరు దివ్య అరోరా. వీల్ చెయిర్లో కూర్చుని ఎందరి హృదయాలనో గెలిచిన విజేత! మీ దినచర్య గురించి చెప్పండి అని దివ్యను అడిగితే... ‘‘ఉదయం ఏడింటికి లేస్తాను, రెడీ అయ్యి, టిఫిన్ తిని, ట్యాక్సీలో ఆఫీసుకు వెళ్తాను, సాయంత్రం తిరిగొస్తాను’’ అంటూ చెబుతుంది. కానీ ఆమె చెప్పనివి, చెప్పాల్సినవి చాలానే ఉన్నాయి. ఉదయం లేచి ఆమె ఇల్లంతా సర్దుకుంటుంది. వంట చేసుకుంటుంది. టిఫిన్ తినేసి, లంచ్‌బాక్స్ పట్టుకుని ఆఫీసుకెళ్తుంది. సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ మార్కెట్టుకు వెళ్తుంది. కూరగాయలు, సరుకులు తెచ్చుకుంటుంది. మళ్లీ వంట చేసుకుంటుంది. రాత్రి ల్యాప్‌టాప్ ముందేసుకుని మెయిల్స్ చూసుకుంటుంది. స్క్రిప్టులు రాసుకుంటుంది. మూడున్నరేళ్ల వయసులో సెరెబ్రల్ పాల్సీ వ్యాధి బారినపడి, శరీరమంతా చచ్చుబడిపోయిన అమ్మాయి... తనకు తాను సత్తువ సమకూర్చుకుని, అవయవాలను అదుపులోకి తెచ్చుకుని, అందరిలానే అన్ని పనులూ చేసుకోవడం సామాన్యమైన విషయమా? న్యూఢిల్లో పుట్టింది దివ్య. పుట్టినప్పుడు అందరిలానే ఉంది. కానీ మూడున్నరేళ్లు వచ్చాక మాత్రం ఆమె అందరిలాంటిది కాదని అర్థమయ్యింది. సెరిబ్రల్ పాల్సీ అనే భయంకరమైన వ్యాధి ఆ చిన్నారి శరీరం నుంచి కదలికలను కాజేసింది. ఆమెకసలు మాటన్నదే రాకుండా చేసింది. తల్లిదండ్రులు కుంగిపోయారు. తానే శిల్పి... తానే శిల్పం... పదం పదం పట్టి పలుకుతుంటే తల్లిదండ్రులు చూసి విస్తుపోయారు. తమ కూతురు ఏదైనా సాధించగలదన్న నమ్మకం ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఎప్పుడూ వమ్ము చేయలేదు దివ్య. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్... వరల్డ్ సినిమా, ఫ్రెంచ్ భాషల్లో డబుల్ ఎమ్.ఎ. చేసింది దివ్య. ఒక ట్యూటర్ని పెట్టుకుని మరీ ఆరు భాషల్లో ప్రావీణ్యత సంపాదించింది. కలం పట్టి కథలు రాసింది. నాటకాలు అల్లింది. వాటిని డెరైక్ట్ చేసింది. వాటిలో నటించింది. డెబ్భై రెండు భాషల్లో ఉన్న ఓ ఫేమస్ ఫ్రెంచ్ నాటకాన్ని ‘మెలోడీ ఆఫ్ లవ్’ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది దివ్య. మరో కొత్త పయనం... మనదైన ముద్ర వేయడంలో ఉండే ఆనందం కోసం అనుక్షణం తపన పడుతుందామె. అందుకే మరో రంగంలో అడు పెట్టబోతోంది. ఈ యేడు ఒక సినిమా కూడా తీయబోతోంది దివ్య. కథ ఆమే రాసింది. డెరైక్షన్ కూడా తానే చేయబోతోంది. నిజానికి ఆమె ఎప్పుడో ఇది చేయాల్సింది. నాలుగేళ్ల క్రితమే కథ రెడీ చేసుకుని, దానికి దర్శకత్వం వహించమంటూ సంజయ్‌లీలా భన్సాలీ దగ్గరకు వెళ్లింది. ఆయన బిజీగా ఉండటంతో ఆమె కోరిక నెరవేరలేదు. అయితే అతడు గుజారిష్ సినిమా తీయాలనుకోవడం దివ్య లైఫ్‌కి మరో టర్న్ ఇచ్చింది. వీల్‌చెయిర్‌కి అంకితమైపోయిన వ్యక్తిగా ఎలా నటించాలో హీరో హృతిక్ నేర్పించమని దివ్యను అడిగాడు సంజయ్. అతడిని నీ దగ్గరకు పంపించాలా, నువ్వు వస్తావా అన్నాడు. తానే వస్తానంది దివ్య. ఢిల్లీని వదిలి ముంబై చేసింది. హృతిక్‌కి తర్ఫీదునిచ్చింది. అది ఆమె పేరు సినీ ప్రపంచానికి కూడా పరిచయం చేసింది. అదే నేడు సినిమా తీసేందుకు ఆమెకు దారి చూపింది. కార్ట్‌వీల్ ఎంటర్టైన్మెంట్ అనే యాడ్ ఏజెన్సీని నడుపుతుతోంది. సినీ అడిక్ట్స్ అనే సంస్థ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్స్‌లో దివ్య ఒకరు. వీటితో పాటు రచన, నటన, దర్శకత్వం, పాటలు రాయడం, తీరిక వేళల్లో చిత్రాలు గీయడం, సినిమా ప్లాన్లు... వీల్ చెయిర్లో కూర్చుని ఇదంతా ఎలా సాధించగలుగుతున్నారు అని ఎవరైనా అడిగితే... ‘‘ఓ వ్యక్తి ఏదైనా సాధించాలంటే అడ్డుపడేది అవకరం కాదు... అవగాహనా రాహిత్యం, ఆలోచనాలోపం’’ అంటుంది దివ్య నవ్వుతూ. ‘‘నా నాటకంలో ఏడుగురు ఉంటారు. నాతో కలిపి ఆరుగురు మనుషులు, ఏడోది నా వీల్ చెయిర్, అది కూడా ఎప్పుడో నా పనిలో భాగమైపోయింది, ఎందుకంటే అది లేకపోతే నేను లేను కదా’’ అనే దివ్య ఆత్మవిశ్వాసాన్ని కొలిచే ప్రమాణాలు ఉన్నాయా ప్రపంచంలో! - సమీర నేలపూడి దివ్య దృక్పథం గతంలో దివ్య కొన్నాళ్లు ఫ్రాన్స్‌లో నివసించింది. అక్కడి నుంచి వచ్చాక విదేశాలతో పోలిస్తే మన దేశంలో డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ పట్ల ప్రజల ఆలోచనలు, దృక్పథాలు ఎంత వేరుగా ఉన్నాయో ఆమెకు అర్థమైంది. వారికి తగిన ప్రోత్సాహం, ఓదార్పు అందడం లేదని ఆమెకి అనిపించింది. అందుకే తనలాంటి కొందరికి ధైర్యా న్నివ్వడానికి, ముందుకు నడిపించడానికి ‘ఎహెడ్’ అనే సేవాసంస్థను నడుపుతోంది. మీ సంస్థ ఏం చేస్తుంది అనడిగితే.. నాలాంటి (వైకల్యం ఉన్నవారు) కొందరిని నాలాగే (ప్రతిభావంతులుగా) తయారు చేస్తుంది అంటూ నవ్వేస్తుంది దివ్య. -
రిమ్స్‌లో అదే డ్రామా!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రిమ్స్‌లోని ట్రామాకేర్ విభాగంలో 43 పోస్టుల భర్తీకి అధికారులు చేపట్టిన ప్రక్రియలో డ్రామా కొనసాగుతున్నట్టు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చోటు చేసుకున్న అవకతవకలను ‘డ్రామా’కేర్!, ‘రోస్టర్ రచ్చ’ అనే శీర్షికలతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కంగుతిన్న అధికారులు ఎంపికైన అభ్యర్థులకు గురువారం కౌన్సెలింగ్ నిర్వహించకుండా కేవలం ధ్రువపత్రాల పరిశీలనతో సరిపెట్టారు. ఈ సందర్భంగా డైరక్టర్ టి.జయరాజ్ మాట్లాడుతూ నియామకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ముందుగా అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తామని, వచ్చిన అభ్యంతరాలను కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు నివేదిస్తామని వివరించారు. దీనివల్ల నియామకాల్లో మరో 10 రోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. అనుమానాలకు కారణాలివీ.. అన్ని విభాగాల మెరిట్ అభ్యర్థులను పిలవకుండా కొంతమంది ధ్రువపత్రాలను మాత్రమే గురువారం పరిశీలించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే గతంలో పలు అభియోగాలు ఎదుర్కొన్న సిబ్బంది ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొనటంపై మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం 43 పోస్టులకు 1848 దరఖాస్తులు రాగా పోస్టులను ఇప్పటికే జిల్లా చెందిన ఓ మంత్రి సోదరుడు, రిమ్స్‌లోని ముగ్గురు అధికారులు, జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి పంచుకున్నారని, అందుకే ఇన్ని అభియోగాలు వస్తున్నా స్పష్టమైన హామీ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని పలువురు అభ్యర్థులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ధ్రువపత్రాల పరిశీలనలో డెరైక్టర్ జయరాజ్తోపాటు సూపరింటెండెంట్ అరవింద్, డీన్ ప్రసాద్, ప్రొఫెసర్ సుజన, ఎస్.శ్రీనివాసరావు, ఎం.ఇంద్రాణి, జి.నీలాద్రి, జి.వెంకటరావు, రాజేశ్వరి పాల్గొన్నారు. ఇవీ అభ్యంతరాలు డ్రైవర్ పోస్టుకు సంబంధించి తనకు అన్ని అర్హతలు ఉండగా, తనకన్నా తక్కువ అర్హతలు కలిగినవారికి బీసీ-డీ కేటగిరీలో ఇచ్చారని కె.శాంతారావు అనే వ్యక్తి అభ్యంతరం తెలిపారు. ఈసీజీ విభాగంలో తనకు 71.28 మెరిట్ పాయింట్లు ఉండగా 65.61 పాయింట్లు ఉన్న మహిళ ఎంపిక జాబితాలో ఉన్నారని యు.భాస్కరరావు ఫిర్యాదు చేశారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు రోస్టర్‌ను ప్రకటించలేదని, అప్పటికప్పుడు మహిళకు కేటాయించారని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫార్మశీ విభాగంలో తమకు ఎక్కువ అర్హతలు, అనుభవం ఉండగా తమను కాదని వేరొకరికి కేటాయించారని ఝాన్సీరాణి, పుష్పలత అనే మహిళలు అభ్యంతరం తెలియజేశారు. రేడియోలజీ విభాగంలో వయోపరిమితి (45) పూర్తయిన అభ్యర్థిని ఎంపిక చేయడంపై పలువురు అభ్యంతర ం తెలిపారు. -
అఫీడవిట్లతో టీడీపీ నేతల్లో గుబులు
-
కొత్త డ్రామాలకు తెరతీసిన సీమాంద్ర మంత్రులు
-
రెండో రోజూ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
సాక్షి, తిరుపతి: 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాలో ని విద్యుత్ ఉద్యోగులు రెండవ రోజు శుక్రవారం కూడా సమ్మెలో పాల్గొనడంతో సేవలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని 2,500 మంది ఉద్యోగులు వందశాతం సమ్మెలో పాల్గొన్నారు. వసూళ్లు, బిల్లులను రూపొందించే పని పూర్తిగా అటకెక్కింది. విద్యుత్ బ్రేక్డౌన్లను పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటంతో ఉన్నతాధికారులు కూడా చేతులెత్తేయాల్సి వచ్చింది. తిరుపతి సర్కిల్లో తిరుపతి అర్బన్, రూరల్, శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, పలమనేరు, చిత్తూరు, పుంగనూరు, మదనపల్లె, పీలేరు సబ్ డివిజన్లతో పాటు కార్యాలయాల్లో, సబ్ స్టేషన్ల లో ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. తిరుపతి డిస్కం కార్యాలయం ఎదుట జేఏసీ కన్వీనర్ డీఈ మునిశంకరయ్య, చైర్మన్ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కార్పొరేట్, ఎస్ఈ కార్యాలయ ఉద్యోగులు, నగరంలోని ఏఈలు, లైన్మన్లు, కార్యాలయాల సిబ్బంది ధర్నా చేశారు. సమైక్య వాదాన్ని వినిపిస్తూ పాటలు పాడారు. జిల్లాలో ఎస్ఈ మినహా ఏ ఒక్కరూ విధులకు హాజరుకాకపోవడంతో విద్యుత్ శాఖ పరిపాలన పూర్తిగా స్తంభించింది. మాస్క్‌లతో నిరసన డిస్కం కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ, కేసీఆర్, డిగ్గీరాజ, కోదండరాం, హరీశ్‌రావు మాస్క్‌లు ధరించి వారు ఏ రకంగా రాష్ట్ర విభజనకు కుట్ర పన్నారనేది వివరిస్తూ స్క్రిప్ట్‌తో నాటకం వేశారు. సోనియా, కేసీఆర్, డిగ్గీరాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే నష్టపోయే రంగాల్లో ప్రధానంగా విద్యుత్ సంస్థ ఉందని పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీరి సమ్మెకు ఏపీఎన్జీవోలు ఉద్యోగ సంఘం జేఏసీ నాయకులు మద్దతు ప్రకటించారు. వారు సెంట్రల్ ఎక్సైజ్ ఆఫీసు నుంచి ర్యాలీగా ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం చేరుకున్నారు. అక్కడ విద్యుత్ ఉద్యోగులు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని, సంఘీభావం తెలిపారు. ఫ్యూజ్కాల్స్పై సమ్మె ప్రభావం విద్యుత్ సమ్మెతో జిల్లా వ్యాప్తంగా ఫ్యూజ్‌కాల్స్ సర్వీసులు నిలిచి పోయాయి. ఈ ఫిర్యాదులు తీసుకునేవారు లేరు. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను మరమ్మతు చేసే నాథుడే లేడు. కాంట్రాక్టు ఉద్యోగులకు వీటి నిర్వహణ చేతగాకపోవటంతో సమ్మె ముగిసేవరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం గృహ సర్వీసులకే కాకుండా హెచ్.టీ పారిశ్రామిక సర్వీసులు, వాణిజ్య, వ్యవసాయ సర్వీసుల నిర్వహణపైనా పడుతోంది. -
కాంగ్రెస్ డ్రామా కంపెని
-
కాంగ్రెస్ కనుసన్నల్లోనే కిరణ్,బాబు కొత్త నాటకం
-
ఢిల్లీ డ్రామా అండ్ కంపెనీ
-
తెలంగాం పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉందా?
-
రాజీనామాలన్నీ డ్రామాలే
సమైక్య ఉద్యమంలో భాగంగా ప్రజాప్రతినిధులు రాజీమాలు చేయడం అంతా డ్రామానేనని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు. సూళ్లూరుపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులు సంబంధిత లేఖలను తమ పార్టీ అధ్యక్షులకు మాత్రమే పంపుతున్నారన్నారు. ఏ ఒక్కరూ స్పీకర్ వద్దకు వెళ్లి అయ్యా..సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రజల ఒత్తిడితో రాజీనామా చేస్తున్నాం..ఆమోదించండి..అని ఎవరైనా కోరారా అని ప్రశ్నించారు. ప్రజాగ్రహం భయంతో రాజీనామా డ్రామాలు చేస్తున్నారు తప్ప, అన్ని పార్టీల నేతల్లోనూ చిత్తశుద్ధి కరువైందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తెలంగాణలో తెలంగాణ వాదం, సీమాంధ్రలో సమైక్య వాదం వినిపిస్తున్నాయన్నారు. తెలంగాణ కోసం అక్కడి ప్రజాప్రతినిధులు రాజీ లేని పోరాటం చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సకలజనులు రాజీలేని పోరాటం చేయాల్సిన సమయం అసన్నమైందన్నారు. పార్టీలకతీతంగా అఖిలపక్ష కమిటీ వేసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఎవరికి వారు జెండాల కోసమో, పార్టీ మనుగడ కోసమో మోసపూరిత పోరాటం చేస్తే ఫలితం ఉండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీపీఎం, ఎంఐఎం తప్ప మిగిలిన అన్ని పార్టీలు తమకు అభ్యంతరం లేవని చెప్పాయన్నారు. తెలంగాణ బిల్లును ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో పెట్టడం లేదని, శీతాకాలం సమావేశంలో పెట్టే అవకాశం ఉన్నందున, అప్పటి వరకు విరామం లేకుండా పోరాటం చేయాలని సూచించారు. సీపీఎం మాత్రమే నిజమైన సమైక్య పార్టీ అని అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన అనంతరం సీమాంధ్ర అగ్నిగుండంలా భగ్గుమంటుంటే చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీరు ఎప్పుడు రాజీనామా చేస్తారని విఠపును విలేకరులు ప్రశ్నించగా, ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తే శాసనమండలి కూడా రద్దు అవుతుందని సమాధానమిచ్చారు. ఆయన వెంట యూటీఎప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యు డు సి.చంద్రశేఖర్ ఉన్నారు.