
బెంగళురు: నటనలో జీవించడం అనే మాట సాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్న వారిని చూశాం. కానీ ఇక్కడ నటించమంటే ఏకంగా జీవించి తోటి నటుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టిన ఘటన చర్చకు దారితీసింది. ఒక రంగస్థల నటి తన పాత్రలో లీనమైపోయి సహనటుడినే చంపబోయిన వైనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీంతో ఆమెను ‘మహనటి’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు..
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో నాల్వడి కృష్ణరాజ ఒడయార్ బృందం కౌండలీకన వధ అనే నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంలో ద్రౌపది పాత్రధారి సహనటుడిని త్రిశూలంతో పొడవబోయింది. అయితే అక్కడి నాటక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అతనికి ప్రమాదం తప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది.
Comments
Please login to add a commentAdd a comment