Stage show
-
సన్నీ లియోన్ కేసు విచారణపై కేరళ హైకోర్టు స్టే
కొచ్చి: బాలివుడ్ నటి సన్నీ లియోన్‌కి కోజికోడ్‌లో ఒక స్టేజ్ షోకి సంబంధించిన కేసు విషయంలో భారీ ఊరట లభించింది. ఆమెపై నాలుగేళ్ల క్రితం కోజికోడ్‌లో స్టేజ్ ఫెర్ఫార్మెన్స్‌కి ఒప్పందం విషయమై నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు నమోదైన కేసులో తదుపరి చర్యలపై కేరళ హైకోర్టు స్టే విధించింది. సన్నీ లియోన్‌పై కోజికోడ్‌లో రంగస్థల ప్రదర్శన కోసం ఒక సంస్థలో కుదుర్చుకున్న ఒప్పంద నిబంధనలను ఉల్లఘించారంటూ కార్యక్రమ నిర్వహకుడు షియాస్ కుంజుమహమ్మద్ నాలుగేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐతే సన్నీ లియోన్ తనపై దాఖలైన ఎఫ్ఆర్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ జియాద్ రెహమాన్ విచారణ నిలిపేశారు. ఈ మేరకు సన్నీ లియోన్ పిటిషన్లో..తాను, తన భర్త, తమ ఉద్యోగిపై వచ్చి ఆరోపణలను తిరస్కరించారు. ఇప్పటి వరకు తాము ఎలాంటి నేరాలకు పాల్పడలేదని వివరించారు. అలాగే తమను అరెస్టు చేసే విధంగా పోలీసులుకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అందువల్ల వారు ఏమి చేయలేకపోయారని చెప్పారు. తమను దీర్ఘకాలం విచారణ ఎదుర్కొనేలా చేయడంతో తమకు కోలుకోలేని నష్టం వాటిల్లందని వాపోయారు. ఐతే ఆమెపై ఎర్నాకులంకి చెందిన కార్యక్రమ నిర్వాహాకుడు షియాస్ కుంజుమహమ్మద్ ఫిర్యాదు మేరకు క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. షియాస్ సన్నిలియోన్ విదేశాలలో స్టేజ్ షోల ప్రదర్శనకు సుమారు రూ. 39 లక్షలు అదుకుని మరీ ఒప్పందం ఉల్లంఘించారంటూ కోర్టు మెట్లెక్కారు. (చదవండి: ఆప్ అభ్యర్థి కిడ్నాప్!...అంతా చేస్తోంది బీజేపీనే: సిసోడియా) -
వైరల్: యాక్టింగ్‌లో లీనమై త్రిశూలంతో..
బెంగళురు: నటనలో జీవించడం అనే మాట సాధారణంగా మనం వింటూనే ఉంటాం. ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అద్భుత నటనతో ప్రశంసలు అందుకున్న వారిని చూశాం. కానీ ఇక్కడ నటించమంటే ఏకంగా జీవించి తోటి నటుడి ప్రాణాలకే ముప్పు తెచ్చిపెట్టిన ఘటన చర్చకు దారితీసింది. ఒక రంగస్థల నటి తన పాత్రలో లీనమైపోయి సహనటుడినే చంపబోయిన వైనం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతొంది. దీంతో ఆమెను ‘మహనటి’ అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో నాల్వడి కృష్ణరాజ ఒడయార్ బృందం కౌండలీకన వధ అనే నాటకాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంలో ద్రౌపది పాత్రధారి సహనటుడిని త్రిశూలంతో పొడవబోయింది. అయితే అక్కడి నాటక సిబ్బంది సకాలంలో స్పందించడంతో అతనికి ప్రమాదం తప్పింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతొంది. చదవండి: నటుడి ప్రేమ వివాహం: ఇప్పటికీ నమ్మలేకపోతున్నా -
శ్రుతి లేదు.. భృతి లేదు
చీరాల అర్బన్: ఒక కమ్మని పాటకు శ్రుతి ఎంతో ప్రధానం. లయబద్దంగా సాగే పాటకు శ్రుతి సక్రమంగా ఉంటేనే ఆ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రుతి, లయను సమ్మోహనంగా మిళితం చేసి గానం చేస్తే ఆ పాట సంగీత ప్రియులను రంజింప చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సంగీతాన్ని అందరికీ పంచే కళాకారులు జిల్లాలో ఎందరో ఉన్నారు. అలానే జానపద కళాకారులు, సుమధుర గాత్రంతో రంగస్థలంపై ఏకపాత్రాభియం చేస్తూ నాటకాన్ని రక్తికట్టేంచే వారూ లేకపోలేదు. ఎంతో మంది ప్రముఖులతో సన్మానాలందుకున్న కళాకారులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రుతిలయలను నమ్ముకున్న వారు నేడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. సప్త స్వరాలను సమ్మోహనంగా ఆలపించడంతో పాటు సంగీత వాద్యాలను అలవోకగా పలికిస్తూ పలువురికి సంగీత, వాద్య విద్యను చెప్పే కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. సంగీత వాద్య కళాకారులకు లాక్డౌన్ కారణంగా ఉపాధి కరువైంది. చీరాల, వేటపాలెం మండలాలల్లో ఎంతో మంది సంగీత, రంగస్థల కళాకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంగీత, వాద్య కళాకారులు కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు చీరాలలోని వాణి కళానికేతన్ లో ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రస్తుతం వారందరూ వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడి మంచి సంగీత కళాకారులుగా రాణిస్తున్నారు. చీరాలలో వీణ, వయోలిన్‌తో పాటు సంగీతం చెప్పేవారు కళాకారులు ఉన్నారు. ఒకప్పుడు సంగీత కళలకు పెట్టింది పేరుగా ఉన్న చీరాలలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కళాకారులు ఉన్నారు. కొంతమంది ఇంటివద్దనే సంగీతం నేర్పుతుండగా, మరికొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంగీతం, వయోలిన్ నేర్పుతున్నారు. అలానే నాదస్వర కళాకారులకు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ కారణంగా నాలుగు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడంలేదు. కొంతమంది సంగీతం, నాట్యం ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. విజయవాడకు చెందిన నాట్యకళాకారిణి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఆన్లైన్లో నాట్యం నేర్పుతున్నారు. చీరాలకు చెందిన 20 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్లైన్లో చూస్తూ నాట్యం నేర్చుకుంటున్నారు. అలానే సంగీతం కూడా అదే మాదిరిగా ఆన్లైన్లో నేర్చుకుంటున్నారు. రంగస్థలంపై రాణించినా..! రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జానపద కళలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేసి అందరిని మెప్పించినా ప్రస్తుతం వారికి ఆదరణ కరువైంది. జాండ్రపేటలో నివసించే చల్లా రాజేశ్వరి రేడియో ఆర్టిస్ట్. ఆమెను కళాకారిణిగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించింది. ఎన్నో స్టేజి ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఇచ్చినా కళాకారుల పెన్షన్ మాత్రం రావడంలేదని వాపోయింది. ఐదు సంవత్సరాలుగా కళాకారులకు ప్రభుత్వం అందించే నగదు కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కళాకారులను కూడా కరోనా సమయంలో ఆదుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. అలానే వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల పట్టణంలోని 26 వార్డులో ఉన్న కళాకారులకు నిత్యవసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు. కళలకు జీవం పోసే కళాకారుల జీవనం కరోనా వైరస్ కారణంగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది. ఆన్లైన్లో సంగీత పాఠాలు.. చీరాల వైకుంఠపురంలోని బాలసాయినగర్కు చెందిన కొణికి సుష్మ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న వయస్సు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకున్న సుష్మ కర్నాటక సంగీతంలో డిప్లమో పొందింది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటూ తాను నేర్చుకున్న సంగీతాన్ని ఆన్లైన్ ద్వారా మరికొందరికి నేర్పుతోంది. -
రంగస్థలంపై ‘కొండంత’ అభిమానం
ఆ రోజుల్లో నాటకాలంటే భలే క్రేజ్.. ఎక్కడ నాటకాలు వేసినా గుంపులుగా జనం వెళ్లేవారు.. దాంతో అతడికి నాటకాలపై మక్కువ పెరిగింది. ఎలాగైనా నాటకాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నం చేశాడు. చివరకు అనుకున్నది సాధించి నాటక రంగంలో దూసుకుపోయాడు. తను ఏ పాత్ర వేసినా జనంలోంచి విజిల్స్ చప్పుడు.. కేకలు.. అరుపులు.. అవే అతడిలో మరింత ఆసక్తి పెంచాయి. నాటకాన్నే జీవనోపాధిగా మార్చుకున్నాడు. ఆరోజుల్లో నాటకాలకు ఉన్న ఆదరణ ప్రస్తుతం లేకపోవడంతో బతుకు భారమైంది. కల నుంచి బయటకు వచ్చి.. కళను వదిలిపెట్టి.. పొట్టనింపుకునేందుకు దర్జీ పని మొదలు పెట్టారు. మార్కెట్లో రెడీమేడ్ దుస్తుల పోటీని తట్టుకోలేక బతుకును భారంగా వెళ్లదీస్తున్నారు కొండల్రావు. రహమత్‌నగర్: రహమత్‌నగర్ డివిజన్లోని ఎన్ఎస్బీ నగర్‌కు చెందిన కొండల్రావు(75)కు భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఉన్న మక్కువతో ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు, సత్కారాలు పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా రంగస్థల సంస్థలతో సంబంధాలు పెంచుకొని రాష్ట్రవ్యాప్తంగా నాటకాలు వేసి శెభాష్ అనిపించుకున్నారు. ఈయన వేసిన క్రిష్ణార్జున యుద్దం, మాయాబజార్, చింతామణి, çసత్యహరిచంద్ర, నాటకాలు బహుమతులు అందుకొని ప్రశంసలు అందుకున్నారు. 2011 ఫిబ్రవరిలో రవీంద్రభారతిలో నంది నాటకోత్సవం ప్రశంస పత్రం అందుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మశంకర్ బస్తీలో టైలర్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఓవైపు వృద్ధాప్యం.. మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఆయనను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏళ్లుగా నాటక రంగంలో ఉన్నా కనీసం ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కళాకారులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
దట్ ఈజ్ డీజే షబ్బీర్
బంజారాహిల్స్: తరచి చూస్తే సమాజాన్ని మించిన పాఠశాల లేదు.. పేదరికాన్ని మించిన గురువు లేడు. అనుక్షణం పరీక్షలు పెట్టేఈ సమాజంలో తట్టుకుని నిలబడ్డం ఆషామాషీ కాదు.. బతుకు పోరులో ఎప్పటికప్పుడు ఎదురు దెబ్బలు తగులుతుంటే కొందరు తట్టుకోలేకఅక్కడే ఆగిపోతే.. మరికొందరు మాత్రం రాటుదేలి ఉన్నతంగా ఎదుగుతారు. ఈ రెండో కోవకు చెందినవాడే ‘డీజే షబ్బీర్’. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఇతడు కుటుంబానికిఆసరాగా ఉండేందుకు బడికి వెళ్లే వయసులోనే ఉపాధి బాట పట్టాడు. అక్షర జ్ఞానం లేకున్నా ఇప్పుడు సంగీత సామ్రాజ్యంలో డీజేగా వెలుగొందుతున్నాడు. అంతేనా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజిక్ లవర్స్ ఇష్టపడేస్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి స్టేజీ షో ఇచ్చే స్థాయికి ఎదిగాడు.ఆత్మవిశ్వాసంతో లక్ష్యం దిశగా సాగేవారికిపేదరికం, నిరక్షరాశ్యత అడ్డు రాలేవని నిరూపించాడు షబ్బీర్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–10లోని జహీరానగర్ బస్తీకి చెందిన షబ్బీర్‌ది నిరుపేద కుటుంబం. ఉపాధి కోసం స్టేజ్ డెకరేషన్, లైటింగ్ బిగించడం వంటి పనులు నేర్చుకున్నాడు. ఇలా నగరంలో పలు వేడుకలకు స్టేజీలు, లైటింగ్ అలంకరణలు చేసేవాడు. షబ్బీర్ బిగించిన స్టేజీలపై జరిగే ‘డీజే’ల కళను టెంటు చాటున ఉండి గమనించేవాడు. గురువంటూ ఎవరూ లేకుండా తాను వెళ్లిన కార్యక్రమాల్లో డీజేలు స్వరాలను ఎలా సంగీతంగా అందిస్తున్నారో తెలుసుకున్నాడు. అలా తన 22 ఏళ్ల వయసులో మ్యూజిక్‌పై పట్టు సాధించిన ఇతడు ఇప్పుడు నగరంలోనే ప్రముఖ డీజేగా మారాడు. ప్రస్తుతం నగరంలో ఏ సినిమా వేడుక జరిగినా షబ్బీర్ డీజే తప్పనిసరిగా ఉండే స్థాయికి చేరుకున్నాడు. ఇప్పటికీ బస్తీయే నా బడి.. డీజే షబ్బీర్ అంటే తరచూ వేడుకలు జరుపుకునేవారికి.. అక్కడ ఎంజాయ్ చేసేవారికి తెలియనివారు ఉండరు. పైగా ఎప్పుడూ ప్రోగ్రామ్స్‌తో బిజీగా ఉండే ఇతడు తాను పుట్టిన జహీరానగర్ బస్తీని మాత్రం వదలడు. తనకు ఉపాధినిచ్చింది.. ఉనికి చాటింది.. నడక నేర్పించింది ఈ బస్తీయే అని ఇక్కడ ఉండటానికే తాను ఇష్టపడతానంటాడు. సంగీత విభావరులు, సినీ కార్యక్రమాలు ఏది జరిగినా తనకు ఆహ్వానం ఉంటుందని, అయితే పబ్బులు, క్లబ్బుల్లో జరిగే వేడుకల్లో మాత్రం తన డీజేతో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టం ఉండదంటున్నాడు షబ్బీర్. కేవలం ప్రేక్షకులు వచ్చే బహిరంగ కార్యక్రమాలు మాత్రమే తాను అంగీకరిస్తానంటున్నాడు. తెలుగు, హిందీ పాటల రీమిక్స్.. ‘మియా భాయ్’ రీమిక్స్ పేరుతో తాను రూపొందించిన పాటలు మంచి ఆదరణ పొందాయని షబ్బీర్ తెలిపాడు. పాత పాటలు ‘రామయ్యా వస్తావయ్యా, మేరా జూటా హైజపానీ’ తదితర పాటల రీమిక్స్ విశేష ఆదరణ పొందాయన్నాడు. అలాగే ‘లెంబర్ గినీ’ పేరుతో మరో రీమిక్స్ కూడా చేసినట్టు వివరించాడు. డీజేలో తాను హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ పాటల్ని ప్లే చేస్తుంటానన్నారు. అవసరం కోసం సంగీతం కూడా నేర్చుకున్నానని, కొన్ని పాటలకు సొంతంగా స్వరాలు కడుతున్నట్టు వెల్లడించాడు. ‘హైదరాబాద్ నైస్ డీజే జాకీ’ పేరుతో తాను ముందుకు సాగుతున్నానని, ఒక బస్తీ నుంచి ఈ స్థాయికి ఎదిగినందుకు గర్వంగా ఉందన్నాడు. ‘‘రెండేళ్ల క్రితం ‘చెలియా’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక పార్క్ హయత్‌లో నిర్వహించారు. ఆ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. దాంతో వేడుకలో ఆయనా పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌కు నా డీజే ఏర్పాటు చేశాను. వేదికపై నా ప్రతిభను చూసి రెహమాన్ గారు ప్రత్యేకంగా అభినందించారు. డీజేలో కొన్ని సూచనలు కూడా చేశారు. ఆయనతోకలిసి స్టేజీ పంచుకునే అవకాశం రావడం ఒక వరం అనుకుంటే.. స్వర మాంత్రికుడే నన్ను మొచ్చుకోవడం అవార్డు తీసుకున్నంత ఆనందాన్నిచ్చింది.’’ -
ఈ చవకబారు షోలు పాడు చేస్తున్నాయి..
గాయని రేఖా భరద్వాజ్.. మ్యూజిక్ రియాల్టీ షోల నిర్వహణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర’ అంటూ ఈ చవకబారు షోలు పాలుగారే వయసును, పసి మనసుల్లోని అమాయత్వాన్ని పాడు చేస్తున్నాయని రేఖ ఆవేదన చెందారు. ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. ‘‘అది మ్యూజిక్ కాదు. ఒట్టి ధ్వని. నన్నెప్పుడూ అలాంటి షోలలో భాగస్వామిని చెయ్యొద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని కూడా ఆమె ట్వీట్ చేశారు. 55 ఏళ్ల రేఖా భరద్వాజ్ సినీ నేపథ్య గాయని. బాలీవుడ్‌తో పాటు బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళ సినిమాలకు పాడారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ భార్య. ఆయన కన్నా ఏడాదిన్నర పెద్ద. -
స్టేజ్ షో టు సినిమా
చిలకలగూడ: స్టేజ్ షోలతో ప్రస్థానం ప్రారంభించి.. షార్ట్ఫిల్మ్లలో కనిపించి.. వెండితెరపై మెరిపిస్తున్నాడు కార్తీక్‌రత్నం. రేపు విడుదల కానున్న ‘కేరాఫ్ కంచరపాలెం’ మూవీలో లీడ్ రోల్ చేసిన కార్తీక్‌ది సికింద్రాబాద్ చిలకలగూడలోని మైలార్‌గడ్డ. బాలనటుడిగా నంది అవార్డు అందుకున్న కార్తీక్.. ఇప్పటికే పలు సినిమాల్లో నటించినప్పటికీ పూర్తిస్థాయి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మాత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’లో చేశాడు. ప్రస్తుతం సీఏ చదువుతున్న ఆయన బుధవారం నామాలగుండు కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తల్లి నళినితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. మూడ్ క్యారీ కష్టమే... ‘తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడిన జోసెఫ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నం, కంచరపాలెంలోనే జరిగింది. డబ్బింగ్ లేకుండా నేచురల్‌గా మాట్లాడిన మాటలనే రికార్డు చేశారు. 2010లో ‘బొరుసు లేని బొమ్మ’ నాటికలో నటించి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నంది అవార్డు అందుకున్నాను. అప్పటి నుంచి తనికెళ్ల భరణి, రాళ్లపల్లి లాంటి మహామహుల సాన్నిహిత్యంతో నటనలో పరిపూర్ణత సాధించాను. రాళ్లపల్లి రచించిన ‘ముగింపు లేని కథ’, కోటశంకర్ దర్శకత్వంలో ‘రసరాజ్యం’ తదితర నాటకల్లో నటించి మన్ననలు పొందాను. షార్ట్‌ఫిల్మ్‌లో చూసి దర్శకుడు మహావెంకట్ కంచరపాలెంలో అవకాశమిచ్చారు. స్టేజ్ షో, సినిమా రెండు వేర్వేరు. స్టేజ్ షోలో కేవలం రెండు మూడు గంటలు మూడ్ క్యారీ చేస్తే సరిపోతుంది. అదే సినిమాలో అయితే షాట్ షాట్‌కు క్యారీ చేయాలి. మళ్లీ షాట్ గ్యాప్‌లో మూడ్ చెదిరిపోతుంటుంది. తిరిగి అదే మూడ్‌లోకి వచ్చి నటించడం కొంత కష్టమే. మా అమ్మానాన్న నళిని, పృథ్వీరాజ్ నన్నెంతో ప్రోత్సహించార’ని చెప్పారు కార్తీక్. -
నోట్ల కట్టలపై కచేరి
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్‌లోని నవ్సారిలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. గాయకుడు క్రితిదన్ గాడ్వి గొంతు సవరించుకున్నాడో లేదో సభికుల నుంచి నోట్లు వేదికపై వెల్లువెత్తాయి. హార్మోనియం వాయిస్తూ గాడ్వి పాడుతున్నంత సేపూ ప్రేక్షకులు నోట్లు విసరడంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆయన పాడుతుండగా ఓ మహిళా ప్రేక్షకురాలు, మరో యువతి వేదిక నుంచే గాడ్విపై నోట్లు విసురుతూ కనిపించారు. కాగా గాడ్వి ప్రదర్శనల్లో ఇలాంటివి మామూలేనని ఆయన అభిమానులు చెబుతున్నారు. గతంలోనూ ఆయన ప్రదర్శనకు మైమరిచిన ప్రేక్షకులు నోట్లు విసిరి తమ సంతోషం వ్యక్తపరిచిన వీడియోలున్నాయి. -
మలేషియాలో నాట్యకారిణి ప్రవల్లిక ప్రదర్శనలు
చెరుకుపల్లి: మలేసియాలో తెలుగుసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన పెదపూడి నాగశ్రీ ప్రవల్లిక ప్రతిభ కనపరించింది. ఈ నెల 7వతేదీన మలేసియాలోని కౌలాలంపూర్, 8న భగవాన్దత్లో, 9న కెనాంగ్ దీవిలో, 13వ తేదీన తుంగైపఠానీలో, 15న కౌలలంపూర్ సిటీలలో ప్రదర్శనలిచ్చి ఆ దేశప్రజల మన్ననలు పొందింది. ఈ సందర్భంగా నాగశ్రీ ప్రవల్లికను ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ఎంపీపీ మొఖమాటం పార్వతి, ఎంఈవో లాజరస్, వనజా చంద్ర పబ్లిక్ స్కూలు అధ్యాపక సిబ్బంది గురువారం అభినందించారు.