
గాయని రేఖా భరద్వాజ్.. మ్యూజిక్ రియాల్టీ షోల నిర్వహణపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘గురుబ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర’ అంటూ ఈ చవకబారు షోలు పాలుగారే వయసును, పసి మనసుల్లోని అమాయత్వాన్ని పాడు చేస్తున్నాయని రేఖ ఆవేదన చెందారు. ఇంత డ్రామా అవసరమా అని ప్రశ్నించారు. ‘‘అది మ్యూజిక్ కాదు. ఒట్టి ధ్వని. నన్నెప్పుడూ అలాంటి షోలలో భాగస్వామిని చెయ్యొద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని కూడా ఆమె ట్వీట్ చేశారు. 55 ఏళ్ల రేఖా భరద్వాజ్ సినీ నేపథ్య గాయని. బాలీవుడ్‌తో పాటు బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళ సినిమాలకు పాడారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ భార్య. ఆయన కన్నా ఏడాదిన్నర పెద్ద.