
గుజరాత్‌లో గాయకుడిపై నోట్ల వర్షం
సాక్షి, అహ్మదాబాద్ : గుజరాత్‌లోని నవ్‌సారిలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. గాయకుడు క్రితిదన్ గాడ్వి గొంతు సవరించుకున్నాడో లేదో సభికుల నుంచి నోట్లు వేదికపై వెల్లువెత్తాయి. హార్మోనియం వాయిస్తూ గాడ్వి పాడుతున్నంత సేపూ ప్రేక్షకులు నోట్లు విసరడంతో వేదిక మొత్తం కరెన్సీ నోట్లతో నిండిపోయింది. ఆయన పాడుతుండగా ఓ మహిళా ప్రేక్షకురాలు, మరో యువతి వేదిక నుంచే గాడ్విపై నోట్లు విసురుతూ కనిపించారు.
కాగా గాడ్వి ప్రదర్శనల్లో ఇలాంటివి మామూలేనని ఆయన అభిమానులు చెబుతున్నారు. గతంలోనూ ఆయన ప్రదర్శనకు మైమరిచిన ప్రేక్షకులు నోట్లు విసిరి తమ సంతోషం వ్యక్తపరిచిన వీడియోలున్నాయి.