బ్రెజిల్‌ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి | Kondale Reddy going to Brazil Conference | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి

Published Tue, Jul 4 2017 2:27 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

బ్రెజిల్‌ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి

బ్రెజిల్‌ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి

నంగునూరు (సిద్దిపేట): నాటక రంగంలో జరుగుతున్న పరిశోధ నలు, పరిణామాలపై ఈనెల 10న జరిగే అంతర్జాతీయ సదస్సు కు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి కొండల్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఫర్‌ థియేటర్‌ రిసెర్చ్‌ (ఐఎఫ్‌టీఆర్‌) ఆధ్వర్యంలో ఈ నెల 10–15 వరకు బ్రెజిల్‌లోని సౌఫా వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న కొండల్‌రెడ్డి ‘షైలాక్‌ ఇన్‌ ఫిమేల్‌ బాడీ’ అంశంపై సదస్సులో ప్రసంగించనున్నారు. యూజీసీ, జేఆర్‌సీ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌లో కొండల్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించి పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా, తెలుగు వర్సిటీల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభ చాటడంతో అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement