kondal reddy
-
బండ్లగూడలో రూ.50 లక్షల నగలు చోరీ
రాజేంద్రనగర్: ఇంట్లో పనికోసం వచ్చిన ఓ బిహార్ జంట అదును చూసి ఇంట్లోని విలువైన నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పనికి కుదిరిన 55 రోజుల్లోనే ఈ జంట దొంగతనానికి పాల్పడి ఉడాయించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..బండ్లగూడలోని మైఫీల్ టౌన్ విల్లా నంబర్ 20లో డాక్టర్ కొండల్ రెడ్డి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నవంబర్ 1వ తేదీన ఏజెంట్ బిట్టు ద్వారా ఇంట్లో పనిచేసేందుకు బిహార్‌కు చెందిన నమీన్ కుమార్ యాదవ్, భారతిలను నెలసరి జీతంపై ఇంట్లో పనికి తీసుకొచ్చారు. తమ విల్లాలోని ఓ గదిని ఇచ్చి వారిని ఇంట్లోనే ఉండనిచ్చారు. ఈ క్రమంలో సోమవారం కొండల్‌రెడ్డి భార్య తన కుమారుల వద్దకు వెళ్లగా... కొండల్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లాడు. రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచి్చన ఆయన తన గదిలోకి వెళ్లి నిద్రించాడు. ఉదయం కొండల్ రెడ్డికి కాఫీ ఇచ్చేందుకు నమీన్ కుమార్ రాకపోవడంతో కొండల్‌రెడ్డి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. కిందికి వెళ్లి చూడగా బయటి తలుపులు తెరిచి ఉండటంతోపాటు భార్యభర్తలిద్దరూ గదిలో కనిపించలేదు. ఇంట్లోని సీసీ కెమెరాలు పరిశీలించగా రాత్రి 8.52 గంటలకు భార్యభర్తలిద్దరూ బ్యాగ్‌లతో బయటికి వెళ్లినట్లు రికార్డు అయ్యింది. ఇంట్లోకి వచ్చి బీరువాను పరిశీలించగా..రూ.35 వేల నగదు, డైమండ్ బ్యాంగిల్స్, డైమండ్ రింగులు, రూబీ డైమండ్ నెక్లెస్, మంగళసూత్రం తదితర బంగారు వస్తువులు కనిపించలేదు. వీటి విలువ దాదాపు రూ.50 లక్షలు ఉంటుందని డాక్టర్ కొండల్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. ఏజెంటు బిట్టు వద్ద భార్యాభర్తలిద్దరి వివరాలను సేకరించారు. నిందితులిద్దరూ రైలు మార్గం ద్వారా వెళుతున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రత్యేక టీమ్ వీరిని పట్టుకునేందుకు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట
-
రేవంత్ రెడ్డి తమ్మున్ని చూశారా ?..సేమ్ టు సేమ్ ఉన్నరు ఇద్దరు..
-
టీఆర్ఎస్లో సైలెంట్ వార్
వికారాబాద్: స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి మధ్య కొనసాగుతున్ను గ్రూపు తగాదాలు మంత్రి సబితారెడ్డి ముందు మరోమారు బహిర్గతమయ్యాయి. పట్టణంలోని లైబ్రరీ ఆవరణలో రూ.కోటితో నిర్మించనున్న రీడింగ్ భవన నిర్మాణ శంకుస్థాపనకు జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఎవరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా మర్పల్లి మండలంలో ఎమ్మెల్యే ఆనంద్, కొడంల్‌రెడ్డి వర్గాలు రెండుగా విడిపోయారు. రెండు నెలల క్రితం మర్పల్లిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఎదుటే కొంతమంది ప్రజాప్రతినిధులు వేదిక కింద కూర్చుని ఎమ్మెల్యే తీరుపై నిరసన చేశారు. దీంతో ఎమ్మెల్యే, కొండల్‌రెడ్డి వర్గాల మధ్య మరింత గ్యాప్ పెరిగింది. ఎమ్మెల్యే ఆనంద్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటి ఉండే ద్వితీయశ్రేణి నాయకులెవరూ గ్రంథాలయం వద్ద జరిగిన శంకుస్థాపనకు హాజరు కాలేదు. ఈ విషయాన్ని ముందే గ్రహించిన కొండల్‌రెడ్డి తన సొంత మండలమైన మర్పల్లి నుంచి పెద్దఎత్తున అనుచరులను రప్పించారు. సుమారు వంద తుఫాన్ వాహనాల్లో కార్యకర్తలను తెప్పించుకుని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. -
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
సాక్షి, ఘట్కేసర్: మేడ్చల్‌ను రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ పట్టణంలోని ఎస్వీఎస్ ఫంక్షన్ హాల్లో పార్టీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన టీఆర్ఎస్ మండల సమావేశానికి హాజరై మాట్లాడుతూ... పేదల పెన్నిధి కేసీఆర్ వెన్నంటే ప్రజలు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ మల్కాజిగిరి అభ్యర్థిని రూ. 5 లక్షల మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలు అభ్యర్థి విజయానికి దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచులు రాంరెడ్డి, యాదగిరియాదవ్, బట్టె శంకర్, నియోజకవర్గ ఇన్చార్జి జహంగీర్, రేసు లక్ష్మారెడ్డి, సర్పంచులు సురేష్, వెంకట్‌రెడ్డి, యాదగిరి, రమాదేవి, శివశంకర్, మంగమ్మ, కొంతం అంజిరెడ్డి, ఎంపీటీసీలు మంకం రవి, కొట్టి గోపాల్‌రెడ్డి, నర్రి శ్రీశైలం, రమేష్, ఆకిటి నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, బాలేశ్, ప్రభాకర్‌రెడ్డి, మంకయ్య, అనురా«ధ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బ్రెజిల్ సదస్సుకు సిద్దన్నపేట విద్యార్థి
నంగునూరు (సిద్దిపేట): నాటక రంగంలో జరుగుతున్న పరిశోధ నలు, పరిణామాలపై ఈనెల 10న జరిగే అంతర్జాతీయ సదస్సు కు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన పీహెచ్డీ విద్యార్థి కొండల్‌రెడ్డి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ థియేటర్ రిసెర్చ్ (ఐఎఫ్‌టీఆర్) ఆధ్వర్యంలో ఈ నెల 10–15 వరకు బ్రెజిల్‌లోని సౌఫా వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న కొండల్‌రెడ్డి ‘షైలాక్ ఇన్ ఫిమేల్ బాడీ’ అంశంపై సదస్సులో ప్రసంగించనున్నారు. యూజీసీ, జేఆర్సీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో కొండల్‌రెడ్డి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి పీహెచ్డీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉస్మానియా, తెలుగు వర్సిటీల్లో జరిగిన జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రతిభ చాటడంతో అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. -
వీరులెవ్వరో..?
గ్రేటర్ రిజర్వేషన్లు..ఎన్నికల షెడ్యూల్ వచ్చేశాయ్. రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది. ఎవరికి వారు వ్యూహ ప్రతి వ్యూహాల్లో మునిగిపోయారు. కార్పొరేటర్ టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు రంగంలోకి దిగారు. రిజర్వేషన్ల కారణంగా కొందరు నిరాశకు గురైనా...వెంటనే తేరుకుని బంధువులను బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. ఇక ఆయా పార్టీల పెద్దలు..గెలుపు గుర్రాల కోసం వేట మొదలెట్టారు. ఎవరి బలం ఏమిటి.. టికెటిస్తే నిలిచి..గెలిచి సత్తా చాటుతారా.. వారి నేపథ్యం, స్తోమత, పలుకుబడి, ఆర్థిక, సామాజిక స్థితిగతుల గురించి ఆరా తీస్తున్నారు. రిజర్వేషన్లతో మారిన పరిస్థితులకనుగుణంగా మళ్లీ అభ్యర్థుల ఎంపిక, గెలుపోటములపై బేరీజులు... అంచనాలు వేస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ రాజకీయం వేడెక్కింది. - సాక్షి ప్రతినిధి, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో గెలిచే అభ్యర్థుల కోసం ఆయా పార్టీలు వేట మొదలుపెట్టాయి. ఊహకు భిన్నంగా డివిజన్ల రిజర్వేషన్లు రావటంతో అధికార పార్టీ సహా అన్నీ పార్టీలు ఒకింత అయోమయానికి గురయ్యాయి. దీంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తును మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన వర్గాల కోసం వెతుకులాట ముమ్మరం చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో మహిళలకు సగం స్థానాలు రిజర్వు కావటంతో (2011 చట్ట సవరణ మేరకు స్థానిక సంస్థల్లో 50 శాతం స్థానాలు) తాము పోటీ చేయదలుచుకున్న డివిజన్లలో తమ భార్యలు, తల్లులు, బిడ్డలు, కోడళ్లను పోటీలో నిలిపేందుకు కసరత్తు ప్రారంభించారు.గత పాలకవర్గంలో కార్పొరేటర్లుగా పనిచేసిన వారిలో నూటికి 90 శాతం మందికి ఈ మారు అదే కేటగిరీలో అవకాశం లేకుండా పోయింది. రెండో సారి కార్పొరేటర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న నాయకులు తమకు అనుకూల రిజర్వేషన్ వచ్చిన పక్క ప్రాంతానికి షిఫ్టవుతున్నారు. తాజా మాజీల స్థానమార్పిడి...: తాజా మాజీ కార్పొరేటర్లలో కేవలం పది శాతం మంది మాత్రమే మళ్లీ పోటీకి సిద్ధం అవుతున్నారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి(తార్నాక జనరల్ మహిళ)కు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినా ఆమె పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ భార్యకు(కవాడిగూడ ఎస్సీ మహిళ) అనుకూలంగా వచ్చినా ఆయన పోటీకి దూరంగానే ఉండే అవకాశం ఉంది. హఫీజ్‌పేట మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ ఈ మారు మాదాపూర్ నుంచి, శ్రీనగర్ కాలనీ మాజీ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి సోమాజిగూడ నుంచి, బంజారాహిల్స్ మాజీ కార్పొరేటర్ భారతి ఈమారు వెంకటేశ్వరనగర్ నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. తెరపైకి.. బంధుగణం నగరపాలక ఎన్నికల్లో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో నగరానికి చెందిన పలువురు నేతలు తమ కుటుంబసభ్యుల్ని బరిలోకి దించాలని నిర్ణయించారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గంలోని రాంనగర్(జనరల్) నుంచి పోటీ చేసేందుకు శనివారమే ప్రచారాన్ని ప్రారంభించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి అల్వాల్(మహిళా జనరల్), కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత అడ్డగుట్ట(ఎస్సీ మహిళ) లేదా కవాడిగూడలలో ఒకచోట నుంచి బరిలోకి దిగనున్నారు. మాజీ మంత్రి పి.జనార్దనరెడ్డి కూతురు పి.విజయారెడ్డి ఖైరతాబాద్ నియోకజవర్గంలోని వెంకటేశ్వరకాలనీ(మహిళ జనరల్) స్థానం నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఎంపీ కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్, మాజీ మంత్రి విజయరామారావు కూతురు అన్నపూర్ణ జూబ్లీహిల్స్ డివిజన్ నుంచి బరిలోకి దిగే యోచనలో ఉన్నారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు కేఎం ప్రతాప్ భార్య పద్మ జీడిమెట్ల, జీహెచ్ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి సర్వలత సైదాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే ఏర్పాట్లు చేసుకున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి, నగర బీజేపీ అధ్యక్షులు వెంకట్‌రెడ్డి సతీమణి పద్మ బాగ్ అంబర్ పేట నుంచి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అలాగే టీఆర్ఎస్ నేత గొట్టిముక్కల పద్మారావు సోదరుడు వెంకటేశ్వరరావు కూకట్పల్లి టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ నేత ఆనంద్‌కుమార్ గౌడ్ సతీమణి మంజుల కూడా టికెట్ ఆశిస్తున్నారు. -
ఏసీబి దూకుడుతో బెంబేలెత్తుతున్నపొలిటిషన్లు
-
పరారీలో ఓటుకు కోట్లు కేసు నిందితులు!
హైదరాబాద్: నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపులు ఇవ్వజూపుతూ పట్టుబడిన ఓటకు కోట్లు కేసులో నిందితుల్లోని ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కొండల్ రెడ్డి, జిమ్మిబాబులు నోటీసులు జారీ చేసినా.. వారు విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఓ ముఖ్య నేత నివాసంలో కొండల్ రెడ్డి తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జిమ్మిబాబు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నట్లు సమాచారం. జిమ్మిబాబుకు అవసరమైన ఆర్థిక సహాయం కూడా కొందరు నేతలు చేస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందినట్లు తెలుస్తోంది. మరో వైపు కొండల్ రెడ్డిని కూడా రాష్ట్రం దాటించేందుకు యత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈ కేసులో నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్న వారిపై తెలంగాణ ఏసీబీ దృష్టి సారించింది. -
ఏసీబీ విచారణకు లోకేశ్ డ్రైవర్ డుమ్మా
-
నారా లోకేశ్ కారు డ్రైవర్‌కు నోటీసులు
-
నారా లోకేశ్ కారు డ్రైవర్ కు నోటీసులు
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి ఏసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని 160 సీఆర్ పీసీ కింద నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ సింహ, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి, ఆయన కుమారుడు కృష్ణ కీర్తన్, జిమ్మిబాబు, తదితరులను ఏసీబీ విచారించింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.ఐదు కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్‌గా రూ. 50 లక్షలిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో రేవంత్‌తో పాటు తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు హ్యారీ సెబాస్టియన్, ఉదయ సింహ, మత్తయ్య (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)లను నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి విదితమే. -
వైఎస్సార్సీపీ మేడ్చల్ సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్(రంగారెడ్డి జిల్లా) శాసనసభా నియోజకవర్గం సమన్వయకర్తగా పోచంపల్లి కొండల్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇక్కడి ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకుని పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. -
నాలుగేళ్ల కూతురిపై తండ్రి లైంగిక దాడి
మునుగోడు : కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ తండ్రి కన్న కూతురుపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం తన కుమార్తెను ఎవరో అపహరించుకు వెళ్లారంటూ నాటకం ఆడాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించటంతో అసలు విషయం బయటపడింది. మునుగోడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం గోకారం గ్రామానికి చెందినకొండ యాదయ్య బతుకుదెరువు కోసం 20 రోజుల క్రితం మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి వచ్చి బొంతలు కుట్టుకుంటూ అక్కడే బస్‌షెల్టర్‌లో జీవనం కొనసాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున తన నాలుగు సంవత్సరాల పెద్ద కుమార్తెను గ్రామానికి రెండు కి.మీ దూరంలోని వ్యవసాయ భూమి వద్దకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు తిరిగి బస్‌షెల్టర్‌కు వచ్చి తన కూతురును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుక పోయారని గ్రామస్తులు, పోలీసులను నమ్మించాడు. తప్పిపోయిన తన కుమార్తెను వెతికి అప్పగించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ గ్రామంలోని చుట్టుపక్కల ప్రాంతాలలో వెతకగా మంగళవారం ఒంటిగంటకు పత్తి చేలో బాలిక కనిపించింది. ఆ బాలికకు తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు. అమ్మాయిపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు తెలపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రే లైంగికదాడి చేసినట్లు అనుమానించి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తానే లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ కొండల్‌రెడ్డి తెలిపారు.