మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం  | TRS Mandal Convention Function In Ghatkesar | Sakshi
Sakshi News home page

మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం 

Published Thu, Mar 28 2019 2:41 PM | Last Updated on Thu, Mar 28 2019 2:42 PM

TRS Mandal Convention Function In Ghatkesar - Sakshi

మాట్లాడుతున్న మంత్రి మల్లారెడ్డి, పక్కన ఎంపీ అభ్యర్థి రాజశేఖర్‌రెడ్డి  

సాక్షి, ఘట్‌కేసర్‌: మేడ్చల్‌ను రాష్ట్రంలోనే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ పట్టణంలోని ఎస్వీఎస్‌ ఫంక్షన్‌ హాల్‌లో పార్టీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం రాత్రి జరిగిన టీఆర్‌ఎస్‌ మండల సమావేశానికి హాజరై మాట్లాడుతూ... పేదల పెన్నిధి కేసీఆర్‌ వెన్నంటే ప్రజలు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి అభ్యర్థిని రూ. 5 లక్షల మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలందరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలు అభ్యర్థి విజయానికి దోహదపడతాయన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచులు రాంరెడ్డి, యాదగిరియాదవ్, బట్టె శంకర్, నియోజకవర్గ ఇన్‌చార్జి జహంగీర్, రేసు లక్ష్మారెడ్డి, సర్పంచులు సురేష్, వెంకట్‌రెడ్డి, యాదగిరి, రమాదేవి, శివశంకర్, మంగమ్మ, కొంతం అంజిరెడ్డి, ఎంపీటీసీలు మంకం రవి, కొట్టి గోపాల్‌రెడ్డి, నర్రి శ్రీశైలం, రమేష్, ఆకిటి నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, బాలేశ్, ప్రభాకర్‌రెడ్డి, మంకయ్య, అనురా«ధ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement