
వైఎస్సార్‌సీపీ మేడ్చల్ సమన్వయకర్తగా కొండల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేడ్చల్(రంగారెడ్డి జిల్లా) శాసనసభా నియోజకవర్గం సమన్వయకర్తగా పోచంపల్లి కొండల్‌రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇక్కడి ఆయన నివాసంలో శుక్రవారం కలుసుకుని పార్టీలో చేరారు. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.