రేగుతున్న నీటి'మంటలు' | tdp playing drama on IAB | Sakshi
Sakshi News home page

రేగుతున్న నీటి'మంటలు'

Published Tue, Oct 18 2016 1:04 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

tdp playing drama on IAB

  • సోమిరెడ్డి ఆగ్రహం
  • ఐఏబీపై రాజకీయం
  • 20న కార్యాలయ దిగ్భందనం
  •  
    నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సకాలంలో నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిన నాయకులు ఆధిపత్య పోరుతో రైతులకు అన్యాయం చేయడాన్ని జిల్లా రైతులు జీర్ణించుకోలేకున్నారు. ఐఏబీ సమావేశం తేదీని నిర్ణయించడంలో రెండువర్గాలైన టీడీపీ నాయకులపై రైతులు మండిపడుతున్నారు.
    జిల్లా ఇన్‌చార్జి మంత్రి , ఎమ్మెల్సీలు ప్రకటించిన ఐఏబీ సమావేశం తేదీని రాజకీయ కారణాలతో వాయిదా వేశారు. ఆ తర్వాత  మంత్రి నారాయణ 20వ తేదీన సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం ఇరిగేషన్‌ కార్యాలయంలో ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ ఆధ్వర్యంలో ముందస్తు సమావేశాన్ని నిర్వహించారు. సమావేశం నిర్వహణతీరు, రైతు నాయకులు, నీటి యాజమాన్య సంఘాల నాయకుల మధ్య జరిగిన వాగ్వాదం టీడీపీ నాయకులకు కొత్త తలనొప్పులు తెచ్చాయి. ఈ క్రమంలో పెన్నాడెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌ ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తలంటారు. సాక్షాత్తు మంత్రి కొల్లు రవీంద్ర ముందు చోటుచేసుకున్న ఈ సంఘటనతో టీడీపీ ఇరువర్గాల నాయకులు నోళ్లు వెళ్లబెట్టారు. పెన్నా డెల్టా సంగతి చూసుకోకుండా, డెల్టా, నాన్‌ డెల్టాలకు నీటి విషయం నీ కెందుకని ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని సోమిరెడ్డి ప్రశ్నించారు రైతుల ఆగ్రహానికి గురికావద్దని సూచించారు. అధికారం ఉన్న పార్టీలోనే పొంతన లేని నిర్ణయాలు తీసుకుంటే రైతుల్లో చులకనభావం ఏర్పడుతుందని, రైతుల వ్యతిరేకతకు గురికావద్దని హితవు పలికారు. గత ఐఏబీ సమావేశం విషయంలో జరిగిన గందరగోళం దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వానికి రావాల్సిన మైలేజీ రాకపోవడంపై ఎమ్మెల్సీసోమిరెడ్డి విలేకరుల ముందే ఎర్రంరెడ్డిపై విరుచుకుపటం అక్కడున్న వారిని విస్మయపరిచింది.
    నీరు లేదన్న సాకుతో..
    సోమశిల జలాశయంలో నీరు లేదన్న సాకుతో ఐఏబీ మీటింగ్‌ జరపకుండా చూడాలని అధికారపార్టీలో ఓ వర్గం ప్రయత్నిస్తోంది. మరో వర్గం మంత్రి చెప్పినట్లుగా మీటింగ్‌ ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో గతంలో జరిగిన విధంగానే రైతులకు అన్యాయం జరుగుతుందని రైతుసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియమనిబంధనల ప్రకారం అక్టోబరు నెలలో నీళ్లున్నా లేకున్నా ఐఏబీ మీటింగ్‌ జరపాలన్న విషయాన్ని రైతులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
    ఇరిగేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
    మంత్రి నారాయణ ప్రకటించినట్లుగా 20వ తేదీన ఐఏబీ మీటింగ్‌ను నిర్వహించకుంటే ఇరిగేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతుసంక్షేమ సంఘ నాయకులు హెచ్చరిస్తున్నారు. వర్గపోరులో రైతులకు అన్యాయం జరిగే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మంత్రులు,ఎమ్మెల్సీల నిర్ణయాలకే విలువ లేకుండా పోతే రైతులు నీటి కోసం రోడ్లెక్కక తప్పదని వారి వాదన. కేవలం ఓ అండ్‌ ఎం. నీరు-చెట్టు నిధులు స్వాహా చేసేందుకే అధికారపార్టీ నాయకులు ఉత్సాహం చూపడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు నీటిని సకాలంలో అందించాలని వారు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement