
నాటకానికి జవసత్వాలు అందించాలి
నాటక రంగానికి కళాపోషకులు జీవం పోయాలని సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో టీఎస్‌ఎన్‌పీడీఎల్ స్పోర్ట్స్, కల్చరల్ కౌన్సిల్ కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో ‘ఈ లెక్క ఇంతే’ నాటక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి జయప్రకాష్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
- సినీ,రంగ స్థల నటుడు జయప్రకాష్‌రెడ్డి
కరీంనగర్‌కల్చరల్: నాటక రంగానికి కళాపోషకులు జీవం పోయాలని సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ కళాభారతిలో టీఎస్‌ఎన్‌పీడీఎల్ స్పోర్ట్స్, కల్చరల్ కౌన్సిల్ కరీంనగర్‌శాఖ ఆధ్వర్యంలో ‘ఈ లెక్క ఇంతే’ నాటక ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమానికి జయప్రకాష్‌రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. నాటకం ఇంకా బతికే ఉందని.. దానికి జీవసత్వాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మంచి నాటకానికి ఆదరణ ఎప్పటికీ ఉంటుందని అన్నారు. అనంతరం ఈనెలలో ఉద్యోగ విరమణ చేయనున్న విద్యుత్ శాఖ ఎస్‌ఈ స్వర్గం రంగారావును విద్యుత్ ఉద్యోగులు ఘన ంగా సన్మానించారు. కార్యక్రమంలో బుల్లితెర నటులు ఆర్.అప్పారావు, టి.మురళి, సినీ రంగ స్థల నటులు రొడ్డ యాదగిరి, కేతిరి మల్లారెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘ఈ లెక్క ఇంతే’ నాటకంలో మంచాల రమేశ్, జ్యోతి, కొత్తకొండ సత్యనారాయణ, కిషన్‌రెడ్డి ప్రధానపాత్ర పోషించారు. అంతకుముందు నటుడు జయప్రకాష్‌రెడ్డిని కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, నేతికుంట యాదయ్య, రంగస్థల నటులు రోడ్డ యాదగిరి, ఆగస్టీన్, మల్లారెడ్డి తదితరులు పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.