
తమలపాకు గారెలు తయారీకి కావల్సినవి:
తమలపాకులు – 10 (కడిగి, కచ్చాబిచ్చాగా తరిగి, కొద్దిగా మిరియాల పొడి కలిపి పెట్టుకోవాలి)
మినపగుళ్లు – 1 కప్పు (4 గంటలు నానబెట్టుకోవాలి)
పచ్చి మిర్చి – 2 (చిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి)
అల్లం – చిన్న ముక్క, కరివేపాకు – 1 రెబ్బ
ఉల్లిపాయ ముక్కలు – 1 టేబుల్ స్పూన్ (చిన్నచిన్నగా కట్ చేసుకోవాలి, అభిరుచిని బట్టి)
బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు – తగినంత
బేకింగ్ సోడా – చిటికెడు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం ఇలా..
ముందుగా నానబెట్టిన మినపగుళ్లను మిక్సీలో వేసి.. అల్లం ముక్క, కరివేపాకు వేసుకుని గారెల పిండిలా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో బియ్యప్పిండి, బేకింగ్ సోడా, తగినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, తమలపాకు మిశ్రమాన్ని జోడించి బాగా కలిపి.. గారెల్లా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.అంతే క్రిస్పీగా ఉండే తమలపాకు గారెలు రెడీ..