
కథల్లో విన్న పులిని చూడాలని ఉంటుంది. పులి కోసం కాన్హా నేషనల్ పార్కుకు వెళ్లాలని కూడా ఉంటుంది. దట్టమైన అడవిలో బస చేసి రాత్రిళ్లు పులి సంచారాన్ని స్వయంగా వీక్షించాలని సరదా పడితే... అది గొంతెమ్మ కోరిక ఏమీ కాదు. ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న కాన్హా జంగిల్ స్టే ఎక్స్ రాయ్‌పూర్ (Sఏఏ069) టూర్ ప్యాకేజ్‌లో రెండు రోజులు కాన్హా అడవుల్లో బస చేయవచ్చు.
పులులు సంచరించే జోన్‌లో విహరిస్తూ గంభీరమైన పులి నడకను, పాదముద్రలను చూడవచ్చు. మూడు రోజుల ఈ టూర్ ప్యాకేజ్‌లో రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో రిసీవ్ చేసుకుని కాన్హా ఫారెస్ట్ టూర్ (రెండు రాత్రుల బస) పూర్తయిన తర్వాత మూడవరోజు రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టు లో దించే వరకు ఐఆర్‌సీటీసీదే బాధ్యత. కాన్హా మధ్యప్రదేశ్‌లోని రెండు వేల చదరపు కిలోమీటర ్లకు పైగా విస్తరించిన దట్టమైన అటవీ ప్రదేశం.