
ఉగ్రవాదంపై పెల్లుబికిన ఆగ్రహం
జమ్మూ కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై మంగళవారం జరిగిన ఉగ్రదాడిని నగరం ముక్తకంఠంతో ఖండించింది. ఉగ్రవాదంపై ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం నగర వ్యాప్తంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేశారు. మృతులకు నివాళులు అర్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్–ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు క్రీడాకారులు, రిఫరీలు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. సంతాప సూచికంగా ఈ మ్యాచ్‌కు చీర్ గర్ల్స్‌ను రద్దు చేశారు. – సాక్షి, సిటీబ్యూరో