
వాషింగ్టన్: అమెరికాలో 11 కాల్పుల ఘటనలకు సంబంధించి 17 మంది సిక్కులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ బ్రోకెన్ స్వోర్డ్ పేరుతో 20కి పైగా ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో మెషీన్ గన్, ఏకే–47లు సహా 42 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులంతా ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన మాఫియా సభ్యులని అధికారులు చెప్పారు. వీరు పలు హత్యా ఘటనలకు సంబంధించి భారత్ పంపిన వాంటెడ్ జాబితాలో ఉన్నారన్నారు. హింసాత్మక ఘటనలు, కాల్పులతోపాటు ఐదు హత్యాయత్నం ఘటనలతోనూ వీరికి ప్రమేయం ఉందన్నారు.