గూగుల్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ | Google Is Giving Its Employees Friday Off For Their well being | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌

Published Sat, Sep 5 2020 5:34 PM | Last Updated on Sat, Sep 5 2020 5:59 PM

Google Is Giving Its Employees Friday Off For Their  well being - Sakshi

కాలిఫోర్నియా:  కరోనా మహమ్మారి నేపథ్యంలో  టెక్‌ దిగ్గజం గూగుల్‌కీలక నిర‍్ణయం తీసుకుంది. తన ఉద్యోగులకు అదనంగా ఒక రోజు సెలవు ఇవ్వడానికి నిర్ణయించింది. కోవిడ్‌-19 సమయంలో వర్క​ ఫ్రం హోంతో ఇబ్బందిపడుతున్న ఉద్యోగులకు ఊరట నిచ్చేలా  ఈ  చర్యకు దిగింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉద్యోగులకు గూగుల్‌ అవకాశం కల్పించినట్లు  సీఎన్‌బీసీ నివేదించింది. 

కోవిడ్-19 మహమ్మారి ఏడవనెలలోకి ప్రవేశించిన తరుణంలో వారాంతానికి ముందు  ఒక రోజు  సెలవును అదనంగా ఉద్యోగులకు  ఇస్తోంది. ఉద్యోగులందరి శ్రేయస్సు దృష్ట్యా  సంస్థ శుక్రవారం  కూడా  సెలవుదినంగా ప్రకటించింది. ఇది ఉద్యోగులతో పాటు, ఇంటర్న్‌లకు కూడా వర్తిస్తుందని  గూగుల్‌ వెల్లడించింది. ఈ సెలవును వార్షిక క్యాలెండర్‌కు జోడించమని కూడా స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు మరొక రోజును వీక్‌ ఆఫ్‌గా గూగుల్‌ ప్రకటించింది. ఒక వేళ  శుక్రవారం రోజు అత్యవసర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తే.. వారు మరొక రోజు సెలవు తీసుకునే అవకాశం కల్పించింది. డే ఆఫ్‌ను కల్పించడంలో మేనేజర్లు తమ బృందం సభ్యులకు మద్దతుగా నిలవాలని కంపెనీ సూచించింది. 2021మధ్య వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపు మొగ్గు చూపుతూ సంబంధిత అవకాశాలను అన్వేషిస్తున్న తరుణంలో ఈ ఫోర్‌ డే వీక్‌ను కంపెనీ ప్రకటించింది.

కరోనా సమయంలో  దాదాపు ఐటీ సంస్థల ఉద్యోగులందరూ 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌'   ద్వారా తమ బాధ్యతలను నిర్వర్విస్తున్న సంగతి తెలిసిందే.  కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌  కారణంగా  అన్ని రావాణా సదుపాయాలు నిలిచిపోవడంతో దాదాపుగా ఆరు నెలల నుంచి గూగుల్ సిబ్బంది కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పనిభారం, అవిశ్రాంత పని గంటలపై ఉద్యోగులు ఫిర్యాదులు,  అసంతృప్తి నేపథ్యంలో గూగుల్‌ తన ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement