పాక్‌ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో) | Pakistan Official Taimur Rahat Over Action With Protestors In UK, Watch Video Inside Went Viral | Sakshi
Sakshi News home page

పాక్‌ అధికారి బలుపు సైగలు.. భారతీయుల పీక కోస్తా అంటూ.. (వీడియో)

Published Sat, Apr 26 2025 1:19 PM | Last Updated on Sat, Apr 26 2025 3:40 PM

Pakistan Official Taimur Rahat Over Action With Protestors In UK

లండన్‌: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా పలు దేశాల్లో భారతీయులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయులపై పలుచోట్ల కవ్వింపు చర్యలకు దిగుతున్నారు పాకిస్తానీలు. తాజాగా యూకేలో(Pakistan High Commission in London) ప్రవాస భారతీయులను ఉద్దేశించి.. పాక్‌ చెందిన ఓ అధికారి ఓవరాక్షన్‌కు దిగాడు. పీక కోస్తానంటూ బహిరంగా సైగలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ భారతీయులు లండన్‌లోని పాకిస్థాన్ హైకమిషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం, యూకేలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్(Colonel Taimur Rahat) నిరసనలు తెలుపుతున్న ప్రదేశానికి వచ్చారు. అందరూ చూస్తుండగాకల్నల్ తైమూర్ రహత్.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ ఫ్లెక్సీని భారతీయులకు చూపిస్తూ.. పీక కోస్తామంటూ సైగలు చేశాడు. ప్రవాస భారయుతీలను ఉద్దేశించి ఇలా ప్రవర్తించాడు. దీంతో, అక్కడున్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక, పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భారతీయులు నిరసనలు తెలుపుతున్న సమయంలో ఆఫీసులో ఉన్న పాక్‌ అధికారులు భారీ సౌండ్‌తో మ్యూజిక్‌ వింటున్న శబ్దాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. నిరసనలు వారికి వినిపించకుండా ఉండేందుకే ఇలా చేసినట్టు సమాచారం. లండన్‌లోని పాక్‌ హైకమిషన్‌ వద్ద దాదాపు 500 మంది భారతీయులు నిరసనలు చేపట్టినట్టు సమాచారం. మరోవైపు, పహల్గాం దాడి తర్వాత.. ఢిల్లీలోని పౌక్ దౌత్య కార్యాలయంలో కేక్ తెచ్చుకుని సంబరాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీన్ని బట్టి చూస్తే భారతీయుల విషయంలో పాక్ అధికారులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. పాక్‌ అధికారుల తీరుపై అక్కడున్న సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.  

పహల్గాం ఉగ్రదాడి నిరసనకారులకు పాక్ బెదిరింపులు


 

 

సింధూ నదిలో పారేది రక్తమే.. 
ఇక, అంతకుముందు.. పాక్‌ మాజీ విదేశాంగ మంత్రి, పాక్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ భిలావల్ భుట్టో (Bilawal Bhutto) జర్దారీ భారత్‌పై నోర పారేసుకున్నారు. సింధూ (Indus Water treaty) నదిలో నీరు పారకపోతే.. రక్తం పారుతుందంటూ ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు.

కాగా.. అంతకుముందు పాక్‌ (Pakistan) రక్షణ మంత్రి కూడా ఇదేతరహా ప్రేలాపనలు చేశారు. సింధూ నదిలో ప్రతి చుక్కా తమదేనని, భారత్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని మరో మంత్రి ఆరోపించారు. ఇక, మన దేశంపై విషం చిమ్ముతూ లష్కరే తోయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ సింధూ నది (Indus River) గురించి మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. ‘కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’ అని హఫీజ్‌ అందులో బెదిరింపులకు పాల్పడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement