
● సారంగాపూర్‌ను మల్లారెడ్డి మండలంగా మార్చేందుకు కృషి ●
సారంగాపూర్: వానాకాలం ప్రారంభం వరకు రోళ్లవాగు ప్రాజెక్టుకు గేట్లు బిగించేలా చూస్తామని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కోండ్ర మల్లారెడ్డి 15 వర్ధంతి సభలో పాల్గొన్నారు. మల్లారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.60 కోట్లతో చేపట్టిన రోళ్లవాగు ప్రాజెక్టుకు అటవీవాఖ నుంచి కనీస అనుమతులు రాలేదని, దీంతో వ్యయం రూ.132 కోట్లకు చేరిందన్నారు. ఇటీవల గేట్ల బిగింపునకు రూ.19 కోట్లు విడుదలయ్యాయన్నారు. బీర్‌పూర్‌కు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సారంగాపూర్, బీర్‌పూర్ మండలాల అభివృద్ధికి మల్లారెడ్డి కృషి ఎనలేనిదన్నారు. గతంలో శ్రీధర్‌బాబు మంత్రిగా ఉన్న సమయంలో సారంగాపూర్‌ను మల్లారెడ్డి మండలంగా మార్చడానికి హామీ ఇచ్చారని, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఏకగ్రీవంగా తీర్మానించారని గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రి శ్రీధర్‌బాబు ద్వారా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి సారంగాపూర్‌ను మల్లారెడ్డి మండలంగా మార్చడానికి చర్యలు తీసుకునేలా కృషిచేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, నాయకులు మహంకాళి రాజన్న, మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, మాజీ జెడ్పీటీసీ భూక్య సరళ, ముక్క శంకర్, మాజీ వైస్ ఎంపీపీలు బల్మూరి లక్ష్మణ్‌రావు, బేతి పూర్ణచందర్‌రెడ్డి, కోండ్ర రాంచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్‌లు గుర్రాల రాజేందర్‌రెడ్డి, న్యారబోయిన గంగాధర్, మాజీ ఎంపీటీసీలు మానాల లక్ష్మణ్ పాల్గొన్నారు.
వానాకాలం వరకు రోళ్లవాగు గేట్లు బిగిస్తాం