
సోనియా, రాహుల్‌పై తప్పుడు కేసులు
బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై తప్పుడు కేసులు పెట్టాయని ఆగ్రో ఇండస్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. గురువారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సంద ర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ కక్ష కట్టి కేసులు పెట్టిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగం గంగాధర్, ఖలేక్, గురువినయ్, మధుసూదన్‌రెడ్డి, కృష్ణరెడ్డి, నార్ల సురేష్, ఎజాస్, అలిబిన్‌అబ్దుల్లా, అజీం, సాయిబాబా, నర్సగొండ, ఉప్పరి లింగం, గడుమల లింగం, ఉదయ్, నర్సింలు, వాహాబ్, గంగుల గంగారం, కనుకుట్ల రాజు, కిరణ్ తదితరులున్నారు.
పీఎం దిష్టిబొమ్మ దహనం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని నంది విగ్రహం వద్ద పీఎం నరేంద్ర మోదీ దిష్టి బొమ్మను కాంగ్రెస్ ఆధ్వర్యంలో దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రధానమంత్రి దిష్టి బొమ్మను దహనం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారెడ్డి, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, సీడీసీ చైర్మన్ ఇర్షా దొద్దిన్, మండల నాయకులు పాల్గొన్నారు.
పగిలిన మిషన్ భగీరథ పైపు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్‌నగర్ మండల కేంద్రంలో గురువారం వేకువజామున మిషన్ భగీరథ పైపు పగలడంతో బస్టాండ్ ప్రాంతంతోపాటు ప్రధాన రహదారి జలమయమైంది. రెండు గంటల పాటు నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. భగీరథ పైపు పగిలిన విషయాన్ని తెలుసుకున్న ఏఈ రాజశేఖర్‌రెడ్డి సిబ్బందిని అప్రమత్తం చేసి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయించారు. అనంతరం పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయించి సరఫరాను పునరుద్ధరించారు.

సోనియా, రాహుల్‌పై తప్పుడు కేసులు

సోనియా, రాహుల్‌పై తప్పుడు కేసులు