
స్కావెంజర్ డబ్బులు కాజేత
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామంలోని ఎస్సీవాడ ప్రాథమిక పాఠశాలలో స్కావెంజర్ డబ్బులను హెచ్‌ఎం కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇలా..హజ్గుల్ గ్రామంలోని ఎస్సీవాడ ప్రాథమిక పాఠశాల ప్రారంభ సమయంలో వసీమాబేగం స్కావెంజర్‌గా చేరింది. వసీమా బేగంకు ప్రతినెల రూ.6 వేల వేతనాన్ని ప్రభుత్వం స్కూల్ అకౌంట్‌లో వేస్తుంది. స్కూల్ అమ్మఆదర్శ కమిటీ చైర్మన్ రాంబాయి, హెచ్‌ఎం సంజీవ్ ఇద్దరు సంతకాలతో డబ్బులు డ్రా చేయాల్సి ఉంటుంది. హెచ్‌ఎం సంజీవ్ నెలకు రూ.4 వేలు చొప్పున స్కావెంజర్‌కు వేతనం ఇచ్చిన మిగితా డబ్బులు మింగేశాడు. నవంబర్ నుంచి మార్చి వరకు రూ.6 వేల చొప్పున ఐదు నెలల వేతనం రూ.30 వేలు హెచ్‌ఎం డ్రా చేసుకొని స్కావెంజర్ వసీమా బేగంకు రూ.25 వేలు మాత్రమే ఇచ్చాడు. .
ఇప్పుడవి ఐదు వేలు, గతంలోనివి ఎనిమిది వేలు కలిపి మొత్తం రూ.13 వేలు హెచ్‌ఎం సంజీవ్ తన జేబులో వేసుకున్నాడని స్కావెంజర్ వసీమాబేగం వారం రోజుల క్రితం పాఠశాల తనిఖీకి వచ్చిన ఎంఈవో శ్రీనివాస్ రెడ్డి కి ఫిర్యాదు చేసింది. ఈవిషయమై హెచ్‌ఎం సంజీవ్‌ను ఎంఈవో మందలించి అక్రమంగా తీసుకున్న డబ్బులు చెల్లించాలని ఆదేశించినా ఇవ్వలేదని స్కావెంజర్ వసీమాబేగం తెలిపింది. ఈవిషయంపై ఉన్నతాధికారులు స్పందించి శాఖపరమైన చర్యలు తీసుకొని వసీమాబేగంకు డబ్బులు ఇప్పించాలని గ్రామస్తులు కోరతున్నారు.
హజ్గుల్ పీఎస్ స్కూల్
హజ్గుల్ ఎస్సీవాడ పీఎస్ స్కూల్‌లో
ఆలస్యంగా వెలుగులోకి..
చర్యలు తీసుకోవాలని వినతి
హెచ్‌ఎం డబ్బులు తీసుకున్నది వాస్తవమే
స్కావెంజర్ వేతనంలో కోత విధించి మిగతా డబ్బులు హెచ్‌ఎం సంజీవ్ సారు తీసుకున్నది నిజమే. నేను కూడా సార్‌కు చెప్పి బెదిరించిన.. డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. స్కావెంజర్ వేతనం కోత విధించి జేబులో వేసుకోవడం పద్ధతి కాదు. హెచ్‌ఎంపై అధికారులకు ఫిర్యాదు చేస్తాను. స్కూల్ గ్రాంట్ వివరాలు కూడా ఇవ్వడం లేదు.
– రాంబాయి, స్కూల్ చైర్మన్, హస్గుల్
చిల్లి గవ్వ ఇవ్వనన్నాడు
పనికి తగ్గట్టు వేతనం ఇస్తాను. ఇచ్చినన్ని తీసుకో చిల్లిగవ్వ ఇవ్వనని హెచ్‌ఎం సంజీవ్ సారు చెబుతున్నాడు. అప్పడప్పుడు వచ్చిన వేతనంలో నుంచి కొన్ని కట్ చేసి ఇస్తున్నాడు ఇప్పటి వరకు రూ.13 వేలు కట్ చేసి సారు జేబులో వేసుకున్నాడు. ఎంఈవో సార్ చెప్పినా ఇవ్వడం లేదు. –వసీమాబేగం, స్కావెంజర్

స్కావెంజర్ డబ్బులు కాజేత