
ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి
భిక్కనూరు: యునివర్సిటీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సౌత్‌క్యాంపస్‌లో బుధవారం నిరసన కార్యక్రమాలను చేపట్టారు.ఈ సందర్బంగా విద్యార్థులు పార్ట్ టైం అధ్యాపకుల సమ్మెకు మద్దతుగా తరగతులు బహిష్కరించి ర్యాలీ నిర్వహించి సమ్మె శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. తదుపరి పార్ట్ టైం అధ్యాపకులు కామారెడ్డికి వెళ్లి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిని కల్సి తమకు ఉద్యోగ భధత్ర కల్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.కార్యక్రమంలో పార్ట్ టైం అధ్యాపకుల సంఘం రాష్‌ట్ర కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రతినిధులు కనకయ్య, శ్రీను రమేష్, శ్రీకాంత్‌గౌడ్, పోతన వెంకట్‌రెడ్డిలు పాల్గొన్నారు.