
భూ భారతి చట్టం రైతులకు వరం
నిజాంసాగర్/బిచ్కుంద/లింగంపేట: భూ భారతి చట్టం రైతులకు వరమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. భూ సమస్యలను పరిష్కరించడానికి ప్రజల వద్దకే అధికారులు వస్తారన్నారు. శుక్రవారం బిచ్కుంద, జుక్కల్, లింగంపేటలలో నిర్వహించిన భూ భారతి సదస్సులలో ఆయన పాల్గొన్నారు. భూ భారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయా కార్యక్రమాలలో కలెక్టర్ మాట్లాడుతూ భూమికి సంబంధించిన ప్రతి సమస్యకు భూ భారతి చట్టంలో పరిష్కారం ఉందని పేర్కొన్నారు.
నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి
ప్రతి రైతు పొలంలో నీటి కుంటలు, కందకాలు, ఫాంపాండ్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీటిద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా ఫాంపాండ్స్ నిర్మించుకోవచ్చన్నారు. ప్రతి పంచాయతీ పరిధిలో ఐదు ఫాంపాండ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, మైన్స్ ఏడీ నగేశ్, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్లు హేమలత, వేణుగోపాల్, సురేశ్, ఎంపీడీవోలు శ్రీనివాస్, గోపాల్, ఏఎంసీ చైర్మన్ కవిత, ఏడీఎ అమీనాబీ తదితరులు పాల్గొన్నారు.
1,416 దరఖాస్తులు వచ్చాయి
అవగాహన సదస్సులలో కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
లింగంపేట: పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన లింగంపేట మండలంలో ఇప్పటివరకు 12 రెవె న్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించామని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. భూసమస్యలపై ఇప్పటివరకు 1416 దరఖాస్తులు వచ్చాయన్నా రు. శుక్రవారం ఆయన లింగంపేట తహసీల్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. రైతుల సమస్యలను కేటగిరీల వారీగా వేరు చేసి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈనెల 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా దరఖాస్తులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శుక్రవారం లింగంపేటతో పాటు భవానీపేట, ముంబోజీపేట గ్రామాల్లో సదస్సులు నిర్వహించారు. లింగంపేటలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.

భూ భారతి చట్టం రైతులకు వరం