
భరోసా కల్పించడానికే భూభారతి
దోమకొండ/బీబీపేట: రైతులకు భరో సా కల్పించడానికే ప్రభుత్వం భూభార తి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేటలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల లో ఆయన పాల్గొన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండలాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారాలు ఉన్నాయన్నారు.
ఫాం పాండ్స్ నిర్మించుకోవాలి
రైతులు పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేసి భూగర్భ జలాలను పెంచేందుకు ఫాం పాండ్స్, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపా ధి హామీ పథకం కింద కనీసం 5 ఫాం పాండ్స్ నిర్మించాలని సూచించారు. కా ర్యక్రమంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజు, ఆర్డీవో వీణ, దోమకొండ మండల ప్రత్యేకాధికారి జ్యోతి, తహసీ ల్దార్లు సంజయ్‌రావు, సత్యానారాయణ, ఎంపీడీవోలు ప్రవీణ్‌కుమార్, పూర్ణచంద్రోదయ కుమార్, నాయకులు తిర్మల్ గౌడ్, ఐరేని నర్సయ్య పాల్గొన్నారు.
మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్
దోమకొండలో కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు రైతులు తమ భూ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు వారికి సర్దిచెప్పినా వినలేదు. దీంతో కలెక్టర్ తన ప్రసంగం ముగించి మధ్యలోనే వెళ్లిపోయారు.