
కొనుగోళ్లను వేగవంతం చేయండి
దోమకొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూ చించారు. శనివారం దోమకొండలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షా లు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్‌లు అందజేయాలన్నారు. తూకం వేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.