
ఐదుగురి ప్రాణాలు నిలబెట్టిన అవయవదానం
గాంధారి(ఎల్లారెడ్డి): తాను చనిపోయినా మరో ఐదుగురికి అవయవాలు దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు మండల కేంద్రానికి చెందిన యువకుడు మోచి చరణ్‌రాజ్(30). వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మోచి రవి, పద్మ దంపతుల చిన్న కుమారుడు చరణ్‌రాజ్ హైదరాబాద్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు సూచించడంతో శనివారం చరణ్ తల్లిదండ్రులు, భార్య పెద్ద మనసుతో అతడి అవయవాలు దానం చేసి మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం అతడి అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో నిర్వహించారు.