
పనులు త్వరగా పూర్తిచేయాలి
పసుపు వాగు అంచున నా పొలాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మిస్తామంటే కాంట్రాక్టరుకు నా సొంత సాగు భూమిని ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిల్వ కోసం కౌలు ధరకు ఇచ్చాను. ఏడాదిన్నర కావస్తున్న పనులు ముందుకు సాగడం లేదు. సామగ్రి పంట పొలంలోనే మిగిలిపోయి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి రావాల్సిన కౌలు డబ్బులు రూ.లక్షా 35 వేలు కాంట్రాక్టరు చెల్లించడం లేదు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతోంది.
– బుర్క చిన్న లింగాగౌడ్, రైతు, పాన్‌గల్లీ, బోధన్