
మామను చంపిన అల్లుడు
నవీపేట: మండలంలోని అనంతగిరి గ్రామంలో మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో మామ హతమయ్యాడు. నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్‌లు సోమవారం వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని కచర్‌దాం జిల్లా చిర్పాలి గ్రామానికి చెందిన బిలంసింగ్ మరవి(48) కూతురు గోమతి దుర్వే, అల్లుడు రాజేష్ దుర్వేలతో కలిసి మండలంలోని గోదాం నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజేష్ దుర్వే తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈవిషయమై ఆదివారం రాత్రి మద్యం సేవించాక మామ, అల్లుడు గొడవపడ్డారు. ఆగ్రహానికి లోనైన అల్లుడు ఇటుకను తీసుకొని మామ తలపై విచక్షణరహితంగా బాదాడు. దీంతో మామ బిలం సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.