నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక

Published Tue, Apr 29 2025 8:15 AM | Last Updated on Tue, Apr 29 2025 8:15 AM

నేడు

నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక

లింగంపేట: శెట్పల్లి గ్రామంలో మంగళవా రం నిర్వహించే రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రా నున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షు డు బుర్ర నారాగౌడ్‌ తెలిపారు. మంత్రి రాక నేపథ్యంలో సోమవారం శెట్పల్లిలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నారాగౌడ్‌ మాట్లాడుతూ మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే మ దన్‌మోహన్‌రావు సదస్సులో పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని రైతులను కోరారు. ఏర్పాట్లను పరిశీలించినవారిలో భూభారతి మండల ప్రత్యే కాధికారి రాజేందర్‌, తహసీల్దార్‌ సురేష్‌, ఎంపీడీవో నరేష్‌ తదితరులున్నారు.

ఒకటి నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ

కామారెడ్డి రూరల్‌ : మే నెలకు సంబంధించి న రేషన్‌ బియ్యం పంపిణీ ప్రక్రియను ఒక టో తేదీనుంచి ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తామని తెలిపారు. 15వ తేదీ వరకు బి య్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

డీఏవోకు పదోన్నతి

కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్‌కు పదోన్నతి లభించింది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌గా ఉన్న ఆయనకు జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌గా పదో న్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. కలెక్టరేట్‌లోని వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయనను జి ల్లాలోని ఏడీఏలు, మండలాల వ్యవసాయ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రైతుల శ్రేయస్సుకు కృషి

సదాశివనగర్‌ : రైతుల శ్రేయస్సు కోసం సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని డీసీవో రామ్మోహన్‌ పేర్కొన్నారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి సింగిల్‌ విండో కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీ సీవో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిందన్నారు. సహకార సంఘం చేపడుతున్న వివిధ రకాల కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో విండో చైర్మన్‌ సదాశివరెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఇర్షాదొద్దీన్‌, మా నిటరింగ్‌ అధికారి సాయిలు, సీఈవో భై రయ్య, డైరెక్టర్‌లు రాములు, ప్రవీణ్‌రెడ్డి, భాస్కర్‌, ఉమామహేశ్వర్‌రావు, సిబ్బంది లింగమూర్తి, భైరేశ్‌, గంగరాజు పాల్గొన్నారు.

లండన్‌లో తప్పిపోయిన రెంజర్ల విద్యార్థి

బాల్కొండ: ముప్కా ల్‌ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన విద్యార్థి నల్ల అనురాగ్‌రెడ్డి ఈనెల 25న లండన్‌లో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్‌రెడ్డి ఉన్నత చదువులో కోసం ఏడాదిన్నర క్రితం స్టూడెంట్‌ వీసాపై లండన్‌ వెళ్లాడు. ఈనెల 25న సా యంత్రం స్నేహితులతో కలిసి కార్డిప్‌ ప్రాంతానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అత డి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన తల్లి హరితారెడ్డి ఈ విషయా న్ని సోమవారం టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ ఈరవత్రి అనిల్‌ కుమార్‌ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈరవత్రి అనిల్‌ స్పందించి సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్‌లోని ఇండియా హైకమిషన్‌కు లేఖలు రాసినట్లు అనిల్‌ కుమార్‌ తెలిపారు.

నేడు శెట్పల్లికి  మంత్రి పొంగులేటి రాక 
1
1/3

నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక

నేడు శెట్పల్లికి  మంత్రి పొంగులేటి రాక 
2
2/3

నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక

నేడు శెట్పల్లికి  మంత్రి పొంగులేటి రాక 
3
3/3

నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement