
రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాల పరిశీలన
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలాలను సీఐ రవీందర్‌నాయక్ ఆధ్వర్యంలో సోమవారం అధికారులు పరిశీలించారు. మండలంలోని హాజీపూర్, అడివిలింగాల, తిమ్మారెడ్డి, జంగమాయిపల్లి, భిక్కనూర్, మీసాన్‌పల్లి, మాచాపూర్ గ్రామ శివార్లలోని మూల మలుపులను వారు పరిశీలించారు. మూల మలుపుల వద్ద జరిగిన ప్రమాదాలలో మృతి చెందిన సంఘటన స్థలాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఆర్‌అండ్‌బీ ఏఈ ఐశ్వర్య, మున్సిపల్, పంచాయత్ రాజ్ అధికారులు ఆంజనేయులు, మల్లేష్ ఉన్నారు.