
అదృశ్యమైన వ్యక్తి.. నాలుగేళ్లకు ఆచూకీ లభ్యం
బోధన్‌టౌన్(బోధన్): పట్టణానికి చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఆదివారం తిరిగి తనవాళ్లకు వద్దకు చేరుకున్నాడు. అనం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్‌కు చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఖమ్మంలోని కారెపల్లిలో తిరుగుతూ ప్రజలపై దాడికి పాల్పడుతుండగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితిని గమనించి ఆనం సేవా ఫౌండేషన్‌కు అప్పగించారు. అక్కడ అతడికి వైద్య చికిత్స అందించగా కొద్ది రోజుల నుంచి తన కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తుండంతో ఆదివారం అతడిని బోధన్‌కు తీసుకు వచ్చి ఆచన్‌పల్లిలో నివాసం ఉంటున్న వరుసకు తమ్ముడైన అబ్దుల్ నయీమ్‌కు పోలీసుల సమక్షంలో అప్పగించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, రావట్ల జనార్ధన్, పద్మాసింగ్, పోలీసులు ఉన్నారు.