
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
హుబ్లీ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన ధార్వాడ కామనకట్టి పంచకచేరి వీధిలో జరిగింది. ధార్వాడ తాలూకా చిక్కమల్లిగవాడ గ్రామానికి చెందిన కల్లప్ప గూళాప్ప కలయ్యనవర (59) పంచకచేరి వీధిలో ఉంటున్నాడు. ఈయన ఈనెల 13న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా జాడ కనిపించలేదు. దీంతో భార్య గంగుకల్లయ్య ధార్వాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ, హిందీ, మరాఠీ బాష తెలిసిన తన భర్త ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 08362233512, లేక పోలీస్ కంట్రోల్ రూంలో తెలియజేయాలని ఆమెతో పాటు పోలీసులు ఓ ప్రకటనలో కోరారు.
బస్సు ఢీకొని బైకిస్టు మృతి
హుబ్లీ: తాలూకాలోని కుసుగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాలూకాలోని ఇంగళహళ్లి గ్రామానికి చెందిన రవిబాళెకాయి (32) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్‌లో వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని హుబ్లీ గ్రామీణ పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రవి బాళెకాయి మృతికి మాజీ మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప సంతాపం వ్యక్తం చేశారు.
సభ్యుడిగా నియామకం
రాయచూరు రూరల్: హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్ సభ్యుడిగా గీరీష్ కనకవీడును నియమిస్తు కేంద్ర సర్కార్ అదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న గీరీస్ మరో మూడేళ్ల పాటు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలి
రాయచూరురూరల్: కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలని గంగాధరప్ప పిలుపు ఇచ్చారు. సరస్వతి దాసప్ప శైణీ ప్రతిష్టాన, కలాకుంచ సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో అదివారం దావణగేరలోని చెన్నగిరి విరూపాక్షప్ప కల్యాణ మంటపంలో జరిగిన సరస్వతి సాధక సిరిజాతీయస్థాయి అవార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటికీ తెలుగు, కన్నడ భాషలను కలిపి మాట్లడుతున్నారన్నారు. కన్నడ భాషను పరిరక్షించి భావితరాలకు అందించాలన్నారు. రాష్ట్ర సుగమ సంగీత సంస్థ అధ్యక్షుడు నాగరాజ్, నాగరత్న, సంగీత, అశా అడిగి, జ్యోతి గణేష్ శైణై, మంజునాథ్, సాలిగ్రామ గణేష్ శైణై, రాఘవేంద్ర, ఉమేష్ పాల్గొన్నారు.
ఈత కొలనుల్లో సందడి
సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు రావడంతో నగరంలో విద్యార్థులు, యువతతో స్విమ్మింగ్‌పూల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్మిమ్మింగ్‌పూల్స్ రద్దీగా ఉంటున్నాయి. నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ,ప్రైవేటు వారు ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. ఫీజు చెల్లించి పూల్‌లో జలకాలు ఆడవచ్చు. దీంతో పాటు ఈత నేర్పే కోచ్‌లకు కూడా గిరాకీ పెరిగింది. ఈత అనేది అందరూ నేర్చుకోవాలని, ఆరోగ్యానికి, ప్రాణరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. 10 రోజుల్లో ఈత పూర్తిగా నేర్చుకోవచ్చునని,ఈత,నీరు అంటే భయం తొలగిపోతుందని చెప్పారు.
కేంద్ర భద్రతా దళం
వైఫల్యంతోనే ఉగ్రదాడులు
రాయచూరురూరల్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు కేంద్ర భద్రతా దళం వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉగ్రప్ప ఆరోపించారు. అ దివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కశ్మీరుకు 200 కేజీల్ ఆర్‌డీఎక్స్ పేలుడు పదార్థాం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు

వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు