
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం, మక్కలు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మార్కెట్‌కు సోమవారం, ధాన్యం, మక్కలు పోటెత్తాయి. రైతులు అధిక మొత్తంలో యార్డుకు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్‌లోని షెడ్లన్నీ సరుకులతో నిండిపోయాయి. స్థలం సరిపోకపోవడంతో ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోసుకున్నారు. కాగా 6,622 బస్తాల (3,973 క్వింటాళ్లు) మక్కలు, 3,533 బస్తాల (2,297 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. అదే విధంగా మిర్చి 4,451 బస్తాల (1,783 క్వింటాళ్లు) మేరకు కొనుగోలు జరిగాయి.
6,622 బస్తాల మక్కలు,
3,533 బస్తాల ధాన్యం కొనుగోలు

మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం, మక్కలు