Mahabubabad District Latest News
-
షాపింగ్ చేసి వస్తూ.. అనంతలోకాలకు..
కురవి : శుభకార్యం నిమిత్తం ఓ యువకుడు.. తల్లి, తమ్ముడితో కలిసి షాపింగ్ చేశాడు. అనంతరం బైక్‌పై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మండలంలోని మొగిలిచర్ల సమీపంలో జరిగింది. కురవి ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. మండలంలోని రాజోలు శివారు పోలంపల్లి తండా గ్రామానికి చెందిన భూక్య ఈశ్వర్(17) మంగళవారం సాయంత్రం తన తల్లి సుజాత, తమ్ముడు ప్రభాస్‌తో కలిసి శుభకార్యం నిమిత్తం షాపింగ్ చేయడానికి బైక్‌పై మహబూబాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తయిన అనంతరం మహబూబాబాద్ నుంచి మొగిలిచర్ల వైపునకు వస్తున్నారు. ఈ క్రమంలో అదే మార్గంలో ఓ కోళ్ల వ్యాన్ డోర్నకల్ వైపునకు వెళ్తోంది. మొగిలిచర్ల గ్రామంలోని పెట్రోల్‌బంక్ సమీపంలో కోళ్ల వ్యాన్ డ్రైవర్ సడన్‌బ్రేక్ వేశాడు. దీంతో వెనుక నుంచి వస్తున్న ఈశ్వర్ బైక్‌ను ఆపే ప్రయత్నంలో వ్యాన్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఈశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో 108లో మాహబూబాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న బుధవారం పేర్కొన్నారు. -
పెళ్లిరోజు వేడుకకు వెళ్తూ.. మృత్యుఒడికి
● ఆటో, బైక్ ఢీ.. ఇద్దరు బాలికల దుర్మరణం ● మరో ఇద్దరి పరిస్థితి విషమం కొత్తగూడ: పెళ్లి రోజు వేడుకకు వెళ్తూ ఇద్దరు బాలికలు మృత్యుఒడికి చేరారు. ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరూ దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి మండలంలోని పెగడపల్లి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్ర కారం.. మండలంలోని పొగుళ్లపల్లికి చెందిన స్నేహితుడు గువ్వ ప్రేమేశ్ తల్లిదండ్రుల పెళ్లి రోజు వేడుకలో పాల్గొనేందుకు మండలంలోని లక్ష్మీపురం గ్రా మానికి చెందిన అన్నదమ్ముళ్ల పిల్లలు జంగ మౌనిక(17), జంగ నవ్య (17), జూల కార్తీక్, గువ్వ ప్రేమేశ్తో కలిసి బైక్‌పై పొగుళ్లపల్లికి వెళ్తున్నారు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కరుణాకర్ ట్రాలీ ఆటో కిరాయి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పెగడపల్లి సమీపంలో ట్రాలీ ఆటో, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈఘటనలో మౌనిక, నవ్య అక్కడికక్కడే మృతి చెందగా కార్తీక్, ప్రేమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వీరిని 108లో నర్సంపేట ఆస్పత్రికి తరలించారు. నవ్య తల్లిదండ్రులు ఎల్లయ్య–రజిత, మౌనిక తల్లిదండ్రులు సంపత్–ఎలేంద్ర ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన సంతోషం ఒక్కరోజు కూడా నిలువలేదంటూ గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై కుశకుమార్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను నర్సంపేట ప్రభు త్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వాతావరణం
ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి, వడగాలులు వీస్తాయి. రాత్రి ఉక్కపోత ఉంటుంది.మహిళా సాధికారతే లక్ష్యం ● పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కొత్తగూడ: మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో సీ్త్ర శక్తి క్యాంటీన్‌ను ప్రారంభిచారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామన్నారు. అదే బస్సులకు మహిళలను ఓనర్లుగా చేస్తూ కొత్తగూడ మండల సమాఖ్యకు బస్సును కేటాయించినట్లు తెలిపారు. సీ్త్ర శక్తి క్యాంటీన్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి.. కశ్మీర్ ప్రాంతంలో పర్యాటకులను నిర్దాక్షిణ్యంగా చంపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో విలేకరులతో ఆమె మాట్లాడారు. ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదన్నారు. కుల, మత ప్రాతిపదికన హత్యలు చేయడం హేయమైన చర్య అన్నారు. రాజకీయంగా మాట్లాడటం కన్నా రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, ఐకేపీ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 29న రాజ్యాంగ రక్షణ సభమహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని వీఆర్ఎన్ గార్డెన్లో ఈ నెల 29న ఉదయం 10గంటలకు రాజ్యాంగ రక్షణ సభ నిర్వహిస్తున్నామని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా చైర్మన్ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో బుధవారం ఉద్యమకారులు, ప్రజా, కుల సంఘాల నాయకులు ఆధ్వర్యంలో రాజ్యాంగ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాగం రక్షణ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరవుతున్నారన్నారు. -
3,374 ఎకరాల్లో పంట నష్టం
మహబూబాబాద్ రూరల్: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. అలాగే కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. ఈమేరకు వ్యవసాయ, హార్టికల్చర్ అధికారులు పంటలను పరిశీలించడంతో పాటు రైతుల నుంచి నష్టపోయిన పంటల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 3,374.30 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కాగా ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2,855 ఎకరాల్లో వరికి, 76.30 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం.. ఈదురుగాలుల బీభత్సం, గాలివాన, వడగండ్ల కారణంగా జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు మొత్తంగా 2,859 మంది రైతులకు సంబంధించి 2,931.30 ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో 2,855 ఎకరాల్లో వరి పంట, 76.30 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని మండలాల పరిధిలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేశారు. జిల్లాలోని మహబూబాబాద్, నెల్లికుదురు, ఇనుగుర్తి, పెద్దవంగర, కేసముద్రం, కొత్తగూడ మండలాల పరిధిలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం.. అకాల వర్షం వల్ల జిల్లాలో 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఇద్దరు రైతులకు చెందిన ఐదు ఎకరాల బొప్పాయి తోటకు వర్షం కారణంగా తీవ్ర నష్టం చేకూరినట్లు తెలిపారు. 128 మంది రైతులకు చెందిన 438 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు.‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది కేసముద్రం మండలం క ల్వల గ్రామానికి చెందిన రైతు పాల శ్రీనివాస్. నాలుగు ఎకరాల మేరకు వరి పంట సాగుచేశాడు. అకాల వర్షంతో పంట ఈనె దశలో మొత్తం నేలవాలిపోయింది. అదే విధంగా రెండు ఎకరాల మేరకు మొక్కజొన్న సాగుచేయగా వడిచుట్టుకుపోయింది. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రూ.3లక్షల మేరకు నష్టంవాటిల్లిందని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశాడు.’ అకాల వర్షంతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు -
మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా పొట్ల, రవళిరెడ్డి
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ పీసీసీ అబ్జర్వర్లుగా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, పీసీసీ స్పోక్స్‌పర్సన్ కూచన రవళిరెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నాటరాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వారు పని చేయనున్నారు. ప్రధానంగా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేయడంలో కీలక భూమిక పోషించనున్నారు. వీరిద్దరికి జిల్లాపై మంచి అవగాహన ఉండడం, జిల్లా నాయకులతో సత్సంబంధాలు ఉండడంతో పార్టీ కమిటీలు వేయడం, ఇతర కార్యక్రమాలు విజయవంతం చేయడం సులభం అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదేవిధంగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు బెల్లయ్యనాయక్ నాగర్ కర్నూల్, ఎమ్మెల్యే మురళీనాయక్ సూర్యాపేట జిల్లాల పరిశీలకులుగా నియమితులయ్యారు. ఎడ్లబండ్లకు స్వాగతం పలికిన సత్యవతిరాథోడ్ దంతాలపల్లి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సూర్యాపేట జిల్లా నుంచి తరలివెళ్తున్న ఎడ్లబండ్లకు బుధవారం మండల కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండ్లతో వెళ్తున్న రైతులకు ఆమె తినుబండారాలు అందజేశారు. సభకు వెళ్తున్న రైతులు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా ఎస్.ఆత్మకూరు మండలంలోని రామోజీతండా, నసీంపేట గ్రామాలకు చెందిన 18ఎడ్లబండ్లను సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారన్నా రు. తమకు అవసరమైన సరుకులను రెండు వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బండ్ల భిక్షం రెడ్డి, దొర యాకన్న, గుండగాని లింగయ్య, మాద వెంకన్న, గండి సతీష్, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల నాయకులు పాల్గొన్నారు. జిల్లా జడ్జిగా అబ్దుల్ రఫీ బాధ్యతల స్వీకరణ మహబూబాబాద్ రూరల్: జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహమ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా జడ్జిగా పనిచేస్తున్న మహమ్మద్ అబ్దుల్ రఫీ బదిలీపై వచ్చి మహబూబాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జిగా విధుల్లో చేరారు. జడ్జిని కలిసిన ఎస్పీ.. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్జికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన శాఖాపరమైన పలు అంశాలపై చర్చించారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ సరవయ్య, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, ఎస్సై జీనత్ కుమార్, కోర్టు డ్యూటీ అధికారులు ఉన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలిమహబూబాబాద్ అర్బన్: ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి తల్లిదండ్రులను కోరారు. మానుకోట మున్సిపల్ పరిధిలోని శనిగపురం జెడ్పీహెచ్ఎస్లో బుధవారం విద్యా సంవత్సరం ముగింపు తల్లిదండ్రుల సమావేశానికి డీఈఓ హాజరై మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి బలోపేతం చేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య, ఉచిత భోజనవసతి, పుస్తకాలు, బుక్కులు, స్కూల్ యూనిఫాంలు పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు దాశరథి, ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ అరుణ, మాజీ కౌన్సిలర్ హరిసింగ్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, మానిటరింగ్ అధికారి ఆజాద్‌చంద్రశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు వెంకన్న, పర్వతాలు, చైతన్య, ప్రభాకర్, విద్యార్థులు పాల్గొన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో పాఠశాల ముగింపు కార్యక్రమానికి జీసీడీఓ విజయ కుమారి హాజరై మాట్లాడారు. -
టార్గెట్ 2.50 లక్షలపైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘బీఆర్ఎస్ 14 ఏళ్ల రాష్ట్ర సాధన పోరాటం, సాధించిన రాష్ట్రంలో పదేళ్ల అద్భుత పాలన.. పార్టీని తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలం చేశాయి. అలాంటి పార్టీ 25 సంవత్సరాల వేడుకలు నిర్వహించుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. రజతోత్సవ వేడుకల్లో కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు కనీవిని ఎరుగని రీతిలో ప్రజలు హాజరయ్యేలా ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవారం ఎల్కతుర్తిలో రజతోత్సవ సభావేదిక ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన హనుమకొండ రాంనగర్‌లోని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ సభకు ఉమ్మడి వరంగల్‌నుంచి 2.50 లక్షల మందికిపైగా హాజరయ్యేలా చూడాలని కోరారు. ప్రతీ నియోజకవర్గంనుంచి 25 వేల మందికి తగ్గకుండా.. ఉమ్మడి వరంగల్‌లోని ప్రతీ గడపనుంచి జనాలను కదిలించాలని సూచించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల 27న నిర్వహించే సభకు సాయంత్రం 4.30 గంటలలోపే చేరుకుంటారని, ఆలోగా ప్రజలు సభావేదిక వద్దకు చేరేలా ప్లాన్ చేయాలన్నారు. ఒక్కొక్కరిగా జనసమీకరణపై ఆరా... మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్న ఈ సమీక్షసమావేశంలో జనసమీకరణపై ఇప్పటివరకు అమలు చేసిన కార్యాచరణపై నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. ఈ మేరకు 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తున్న నేతలను అడిగి తెలుసుకున్న ఆయన పలు సూచనలు చేసినట్లు సమాచారం. వాహనాల కొరత లేకుండా.. ట్రాఫిక్ సమస్య రాకుండా చూడడంతోపాటు జనం ఇబ్బందిపడకుండా చూడాలని, ఒక్కో వాహనానికి ఇన్‌చార్జ్‌ను నియమించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ నాయకులు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసమీకరణ, జనం తరలింపుపై ఫోన్ల ద్వారా సమీక్షించడం జరుగుతుందని, ఆందరూ తమ లక్ష్యాలను మించాలని కోరారు.సభా ఏర్పాట్లపై అభినందనలు.. ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు తక్కువ సమయంలో ఏర్పాట్లు జరిగాయన్న కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. సభ కోసం 1,250 ఎకరాలను ఇచ్చిన రైతులకు ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ.. భూసేకరణ కోసం రైతులను ఒప్పించిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీష్‌కుమార్, దాస్యం వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఇతర నాయకులను అభినందించారు. సమీక్ష సమావేశంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు డాక్టర్ బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీని వాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకట రమణారెడ్డి, శంకర్‌నాయ క్, నన్నపునేని నరేందర్, నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.జనసమీకరణపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం ఓరుగల్లు ప్రతి ఇంటి నుంచి జనం కదలాలే సిల్వర్ జూబ్లీ వేడుకలు మళ్లీ మళ్లీ రావు... రజతోత్సవ సభ దద్దరిల్లాలని పిలుపు సుమారు నాలుగు గంటల పాటు సమీక్ష... కీలక అంశాలపై చర్చ సభా వేదిక, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై అభినందనలు -
వాన ‘గండం’
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యంసాక్షి, మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే మోసపోతారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో ధాన్యం కొనేందుకు నానా కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఉదయం అంతా నిప్పులు కురిసేలా ఎండ.. తీరా సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతం కావడం, ఉరుములు, మెరుపులు, జల్లులు, గాలిదుమారం రావడంతో కల్లాల్లో ధాన్యం పోసుకున్న రైతులు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. కేంద్రాల్లో నిండిన ధాన్యం గిట్టుబాటు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. యాసంగిలో 23,633 ఎకరాల దొడ్డురకం వరి, 1,12,603 ఎకరాల్లో సన్న రకాలు మొత్తం 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. కాగా 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని లెక్కించారు. ఇందులో 84,577 మెట్రిక్ టన్నులు రైతులు, కూలీల అవసరాలకోసం వినియోగించవచ్చు. అదే విధంగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేస్తారు. ఇవి పోగా మిగిలిన 1.79లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. అయితే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతోపాటు, బోనస్ కూడా ఇవ్వడంతో గతం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఐకేపీ 61 సెంటర్లు, పీఏసీఎస్ 162, ఇతర సెంటర్లు 16 మొత్తం 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుటి వరకు 170 సెంటర్లు ప్రారంభించారు. దీంతో రైతులు పంట పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్టు అంచనా. మరో వారం రోజుల్లో వరి కోతలు పూర్తయి మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని రైతులు చెబుతున్నారు. కొనుగోలులో కొర్రీలు ఒకవైపు ఎప్పుడు అకాల వర్షం కురుస్తుందో అని భయ పడుతున్నామని, మరోవైపు నిర్వాహకులు కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 170 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు 63 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల తేమ శాతం 17కు లోపు ఉన్నా, జల్లెడ పట్టి మట్టి, చెత్త లేకుండా ధాన్యం శుభ్రం చేసినా.. కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొన్ని చోట్ల హమాలీల కొరత, మరికొన్ని చోట్ల లారీలు రావడం లేదని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కొనే కేంద్రాల్లో కూడా నాయకులో, అధికారులో చెప్పిన ధాన్యం మాత్రమే కొంటున్నారని, సామాన్య రైతులను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా 40.700 తూకం వేయాల్సిన బస్తాను 41.300 తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అంటే లారీలు వచ్చేవరకు మరింత బరువు తగ్గుతాయి, అలా అయితే ఇక్కడ అమ్మండి లేకపోతే తీసుకెళ్లండి అని బెదిరిస్తున్నారు. ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 4,454 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నెత్తురోడిన రహదారులు.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. – 10లోuన్యూస్రీల్జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు వివరాలు కొర్రీలతో కొనుగోళ్లలో జాప్యం చేస్తున్న నిర్వాహకులు ఎప్పుడు వర్షం వస్తుందోనని రైతుల ఆందోళన వారాల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షణ -
గ్రామస్థాయి నుంచే భూ సమస్యల పరిష్కారం
నెల్లికుదురు: భూ భారతి చట్టం ద్వారా గ్రామస్థాయి నుంచి భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తెచ్చిన ధరణితో భూ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో రైతులు పడిన ఇబ్బందులను తొలగించడానికే ప్రస్తుత ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టంలో జూన్ మొదటివారం నుంచి ప్రతీ గ్రామంలో గ్రామ పాలన అధికారి (జీపీఓ) ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో సభలు ఏర్పాటు చేసి విచారణ జరిపి అక్కడే సమస్య పరిష్కరిస్తారని, లేకుంటే తహసీల్దార్ వద్ద, అక్కడ కాకుంటే ఆర్డీఓ వద్ద, ఇంకా సమస్య పెద్దది అయితే కలెక్టర్ వద్ద ధరఖాస్తు చేసుకున్న నెల రోజుల లోపు ప్రతి భూ సమస్య పరిష్కారం కోసమే ప్రభుత్వం పకడ్బందీగా చట్టాన్ని రూపొందించినట్లు తెలిపారు. రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, తొర్రూరు ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ కె.రాజు, ఎంపీడీఓ బాలరాజు, డిప్యూటీ తహసీల్దార్ తరంగిణి, ఏడీఏ పాల్గొన్నారు. సద్వినియోగం చేసుకోవాలి నర్సింహులపేట: భూభారతి చట్టాన్ని ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతిచట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఈ చట్టం ద్వారా రైతులకు పారదర్శకంగా సులభతరమైన విస్తృత సేవలు అందుతాయని తెలిపారు. రెవెన్యూ సదస్సుకు హాజరైన రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు.అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓ గణేష్, ఏడీఏ శ్రీనివాస్, తహసీల్దార్ నాగరాజు, ఎ ంపీడీఓ యాకయ్య, ఏఓ వినయ్‌కుమార్ ఉన్నారు. సమస్యల పరిష్కారం.. కేసముద్రం: భూభారతి చట్టం ద్వారా ఎన్నోఏళ్లుగా పేరుకుపోయిన భూసమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఈ చట్టంలో ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ హరిప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ -
ఇంటర్లో అద్భుత ఫలితాలు సాధించాం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. సీనియర్, జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతోపాటు ఐఐటీ, జేఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. బుధవారం 55వ డివిజన్ కోమటిపల్లిలోని ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అభినంద సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేటర్ విద్యాసంస్థలకు దీటుగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు తక్కువ ఫీజుల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నాయన్నారు. సీనియర్ ఇంటర్ బైపీసీలో కళాశాలకు చెందిన జె. అంజనా 997 మార్కులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. ఎంపీసీ విభాగంలో కె. రుత్విక్ 996 మార్కులు, సేవితా 994 మార్కులు, కీర్తన 994 మార్కులు, జి.వర్షిణి 993 మార్కులు, సాత్విక 992 మార్కులు, పల్లవి 992 మార్కులు, గాయత్రేణి 992 మార్కులు, కె. హాసిని 992 మార్కులు సాధించినట్లు తెలిపారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో జి. తరుణ్ 468 మార్కులు, ఎ.నిచిత 468 మార్కులు, కె. సహస్ర 467 మార్కులు, శ్రీవర్షిణి 467 మార్కులు, పి.సిరిచందన 467 మార్కులు, దేషిమి 467 మార్కులు, కె.వర్షిత 467 మార్కులు, సాత్విక 467 మార్కులు, కె. శ్రీకాంత్ 467 మార్కులు, బన్ని 467 మార్కులు, ఎ.ధీరజ్ 467 మార్కులు, కె. గీతాంనిహారి 467 మార్కులు, హాసిని 467 మార్కులు, సాయినాథ్ 466 మార్కులు, బైపీసీ విభాగంలో తారీమ్ 438 మార్కులు, సామఫి రాధోస్ 438 మార్కులు, హాసిని 437 మార్కులు, మస్విని 436 మార్కులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి -
దక్షిణ మధ్య రైల్వే జోన్లో కాజీపేటకు ప్రాముఖ్యత ఇవ్వాలి
కాజీపేట రూరల్ : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌ను హైదరాబాద్‌లోని రైలు నిలయంలో బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడి యం కావ్య కలిశారు. పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్ రైల్వే సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు. కాజీపేట బస్టాండ్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని, అమృత్‌భారత్ పథకం కింద వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని, రైల్వే క్రూలింక్‌ల తరలింపు విషయంలో వివరణ, రైల్వే యూనియన్ల నాయకులతో సమావేశమై వారి సమస్యలు పరిష్కరించాలని జీఎంను కోరారు. మూడు రోజుల్లో నాయకులతో సమావేశం కానున్నట్లు జీఎం చెప్పారని ఎంపీ తెలిపారు. కాజీపేట లోకోరన్నింగ్ డిపో సిబ్బందిని విజయవాడ డిపోనకు బదిలీ చేయడం, కాజీపేటలో కొత్త పోస్టుల భర్తీకి అధికారులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంపై జీఎంను వివరణ కోరినట్లు తెలిపారు. కాజీపేటలో 709 మంది ఉద్యోగులకు 526మంది ఉద్యోగులు మాత్రమే పని చేస్తున్నారని, రన్నింగ్‌స్టాఫ్‌లో 184 కొత్త పోస్టింగ్‌లు మంజూరైన పోస్టుల భర్తీకి ఎలాంటి ప్రయత్నాలూ లేవని, దీంతో ఉద్యోగులపై పనిభారం పడుతుందని జీఎంకు వివరించారు. 2022 జూలై 14న రైల్వే అధికారులతో జరిగిన జాయింట్ కమిటీ సమావేశంలో రైల్వే అథారిటీ ఇచ్చిన హామీలను ఉల్లంఘించి కృష్ణా, ఎల్టీటీ, కోణార్క్, గౌతమి ఎక్స్‌ప్రెస్‌ల ను కాజీపేట నుంచి విజయవాడ డిపోనకు తరలిస్తున్నారన్నారు. కాజీపేట డివిజన్‌కు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని జీఎంను కోరినట్లు తెలిపా రు. ప్రస్తావించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని జీఎం హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. ఎంపీలు రఘురాంరెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రాణం తీసిన చుట్ట.. ● చుట్ట కోసం ఐరన్‌రాడ్ రంధ్రంలో చెయ్యి పెట్టిన వృద్ధురాలు.. ● విద్యుత్‌షాక్‌కు గురై మృతి కురవి: ఆ వృద్ధురాలికి రోజూ ఉదయం చుట్ట తాగే అలవాటు.. కొంత తాగిన అనంతరం మిగతా భాగాన్ని రేకుల షెడ్డుకు ఉన్న ఐరన్ రాడ్ రంధ్రంలో పెట్టే అలవాటు.. రోజు మాదిరిగానే బుధవారం ఉదయం నిద్రలేచిన ఆ వృద్ధురాలు.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చేయి పెట్టింది. ఈ క్రమంలో ఐరన్‌రాడ్‌కు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతి చెందింది. ఈ ఘటన కురవి మండలం రాజోలు శివారు స్టేషన్గుండ్రాతిమడుగులో చోటు చేసుకుంది. ఏఎస్సై వెంకన్న కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన జర్పుల చిలికి(62) అలియాస్ చి లుకమ్మ ఇంటి ఎదుట రేకుల షెడ్డుకు ఐరన్ రాడ్ అ మర్చి ఉంటుంది. ఆ ఐరన్ రాడ్‌కు ఫ్యాన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో చిలికి చుట్ట తాగిన అనంత రం మిగతా భాగాన్ని ఐరన్ రాడ్ రంధ్రంలో పెడుతుంది. బుధవారం ఉదయం నిద్ర నుంచి లేచిన చి లికి.. చుట్ట కోసం ఐరన్ రాడ్ రంధ్రంలో చెయ్యి పె ట్టింది. అయితే ఫ్యాన్‌కు అమర్చిన విద్యుత్ తీగ తెగి ఐరన్‌రాడ్‌కు ఆనుకుని ఉండడంతో చిలికి చెయ్యి పె ట్టగానే షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు అగ్గి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకన్న తెలిపారు. ● రైల్వే జీఎంను కోరిన వరంగల్ ఎంపీ కడియం కావ్య -
రన్నింగ్ రూంలో సకల సదుపాయాలు
● ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలో ఏర్పాటు చేసిన రన్నింగ్ రూంలో లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్ల కోసం సకల సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) ఆర్. గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం నిర్వహించిన త్రైమాసిక సమావేశం సందర్భంగా రన్నింగ్ రూంలోని వసతులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఆర్ఎం మాట్లాడుతూ లోకో పైలెట్లు, ట్రైన్ మేనేజర్లు, అసిస్టెంట్ లోకోపైలట్లతో కూడిన రన్నింగ్ సిబ్బంది సురక్షిత ఉద్యోగ నిర్వహణ కోసం రన్నింగ్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వే మార్గంలో 150 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఒకటి చొప్పున సికింద్రాబాద్ డివిజన్లో 22 రన్నింగ్ రూంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధుల్లో భాగంగా దూరప్రాంతాల నుంచి వచ్చే రన్నింగ్ సిబ్బంది ఇక్కడ సేదదీరేందుకు ఏసీ గదులు, రుచికర ఆహారం, యోగా, రీడింగ్ రూంతోపాటు ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, డోర్నకల్‌లో పలు రైళ్ల హాల్టింగ్‌కు సంబంధించి తమకు ప్రతిపాదనలు అందాయని వీటిని పరిశీలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ కోసురు చైతన్య, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ చరణ్‌నాయక్, స్టేషన్ సూపరింటెండెంట్ శోభన్ప్రసాద్, డీఆర్‌యూసీసీ సభ్యుడు ఖాదర్ పాల్గొన్నారు. -
రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొన్న కారు.. వృద్ధుడి దుర్మరణం
లింగాలఘణపురం: కారు.. బైక్ ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపం కాటన్‌మిల్లు వద్ద జరిగింది. ఎస్సై శ్రవణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్ నారపల్లికి చెందిన తీగల సోమనర్సయ్య(80), తన భార్య అన్నపూర్ణ, కుమారుడు శ్రీధర్, కోడలు ప్రణీతతో కలిసి కారులో తుంగతుర్తిలో బంధువుల వివాహానికి హాజరై తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో కారు నెల్లుట్ల సమీపంలో జనగామ నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న రఘునాథపల్లి మండలం బాంజీపేటకు చెందిన హరీశ్‌ను ఎ దురుగా ఢీకొని అదుపు తప్పి ఎదురుగా ఆగి ఉన్న రెడీమిక్స్ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న సోమనర్సయ్యతోపాటు కుటుంబ సభ్యులు, ద్విచక్రవాహనదారుడు హరీశ్ గాయపడగా 108 సిబ్బంది నరేశ్, బిల్లా రాజు జనగామ జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమనర్సయ్య మృతి చెందాడు. గాయాలైన అన్నపూర్ణ, శ్రీధర్, ప్రణీతను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. హరీశ్ జనగామ ఏరియా ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ వివరించారు. కాగా, జనగామ – సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల పరిధిలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్ర మాదాలతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. ఐ దు రోజుల్లో మూడు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
‘వడదెబ్బ’ బాధితులకు భరోసా!
సంగెం/కాజీపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడగాలులను ప్రత్యేక విపత్తుగా పరిగణించింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నివారణ విభాగం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వేసవిలో వడదెబ్బతో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేస్తోంది. ఇందుకోసం త్రిసభ్య కమిటీ పనిచేస్తోంది. ఈ కమిటీ వడదెబ్బతో చనిపోయిన వారి వివరాల నివేదికను కలెక్టర్‌కు పంపిస్తుంది. కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఇప్పటి వరకు ఆపద్భందు పథకం కింద రూ. 50 వేల పరిహారం చెల్లిస్తుండగా, ప్రభుత్వం ఇటీవల ఆ మొత్తాన్ని రూ. 4 లక్షలకు పెంచింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవగాహన లోపంతో పరిహారానికి దూరం.. వేసవిలో ఎండల తీవ్రతకు ఏటా పలుచోట్ల వృద్ధులు, రైతులు, హమాలీలు, ఉపాధిహామీ, వ్యవసాయ కూలీలు, ఇతర కార్మికులు వడదెబ్బకు గురవుతున్నారు. సకాలంలో చికిత్స అందక పలువురు మృతి చెందుతున్నారు. వీరికి గతంలో ప్రభుత్వం ఆపద్భందు పథకం కింద రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించేది. అధికారులు అందజేసిన నివేదిక ఆధారంగా అర్హుల జాబితా వరుస క్రమంలో నిధుల లభ్యతను బట్టి సాయం అందించేవారు. ఆపద్భందు పథకం కింద ప్రమాదవశాత్తు మరణించినా, వివిధ కారణాలతో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు దరఖాస్తులు చేసుకునేవారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకం నిలిచిపోయిందనే చెప్పొచ్చు. సాయం అందకపోవడం, పరిహారం తక్కువ ఉండడం, పోస్టుమార్టం వ్యయప్రయాసాలను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం పరిహారం పెంచిన నేపథ్యంలో బాధితుల కుటుంబసభ్యులు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. కాగా, వడదెబ్బతో మృతి చెందిన వ్యక్తి పేరిట రైతుబీమా ఉంటే రెండింటిలో ఒక పరిహారం పొందే అవకాశం ఉంటుంది. మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు గతంలో రూ. 50 వేలు.. ప్రస్తుతం రూ.4లక్షలు పోస్టుమార్టం రిపోర్టు తప్పనిసరి మృతిపై సమాచారం అందించాలి త్రిసభ్య కమిటీ, కలెక్టర్ నివేదిక ఆధారంగా పరిహారం చెల్లింపులుఇవీ నిబంధనలు... వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం అందించడం మృతుల కుటుంబాలకు కాస్త ఊరట కలిగించే అంశమే. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి వడగాలులు వీస్తున్న రోజులనే ప్రత్యేక విపత్తుగా పరిగణనలోకి తీసుకుంటారు. వడదెబ్బతో అస్వస్థతకు గురై మరణిస్తే తహసీల్దార్, వైద్యాధికారి, ఎౖస్సైతో కూడిన మండలస్థాయి త్రిసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలి. మృతుల కుటుంబ సభ్యులు ముందు ఈ కమిటీకి సమాచారం ఇవ్వాలి. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి పోలీస్ శాఖ అనుమతితో మండల వైద్యాధికారి ఆధ్వర్యంలో తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించాలి. ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందు వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించాలి. పోస్టుమార్టం నివేదికను వైద్యాధికారి పోలీసుస్టేషన్‌కు అందజేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. అనంతరం డెత్ సర్టిఫికెట్, నామినీ వివరాలను మండల కమిటీకి అందించాలి. పూర్తిస్థాయిలో విచారణ చేసి మండలస్థాయి కమిటీ సిద్ధం చేసిన నివేదికలను జిల్లా వైద్యాధికారి పరిశీలించి కలెక్టర్‌కు సమర్పించాలి. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించి ప్రభుత్వానికి పంపితే పరిహారం అందుతుంది.వడదెబ్బపై అవగాహన కల్పిస్తున్నాంవడదెబ్బ మృతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పరిహారం పెంచింది. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలు, ఉపాధిహామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. వైద్యశాఖ ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైనా వడదెబ్బతో మృతి చెందితే త్రిసభ్య కమిటీకి తెలపాలి. నిబంధనల మేరకు బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూస్తాం. –గనిపాక రాజ్‌కుమార్, తహసీల్దార్, సంగెం -
వడదెబ్బతో ముగ్గురి మృతి
కాజీపేట: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలోని బస్టాండ్‌లో బుధవారం ఓ గుర్తుతెలియని వృద్దుడు వడదెబ్బతో మృతి చెందాడు. రైల్వే పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ జీవించే వ్యక్తి వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు పేర్కొన్నారు. మృతుడి వయసు సుమారు 65 ఏళ్లు ఉంటాయని, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపర్చినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలకు 87126–85122 నంబర్‌కు ఫో చేయాలని సీఐ కోరారు. తిమ్మంపేటలో మహిళ .. దుగ్గొండి: వడదెబ్బతో ఓ మహిల మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిమ్మంపేటలో జరిగింది. గ్రామానికి చెందిన నాంపల్లి రవళి అలియాస్ కల్పన (35) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన ఇంటి పెరటితోటలో పనులు చేసింది. అనంతరం ఇంట్లోకి వచ్చిన కొద్ది సమయం తర్వాత అస్వస్థతకు గురైంది. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలికి భర్త రాజేందర్, ఇద్దరు కూతుళ్లు జ్యోతిప్రియ, లక్ష్మీప్రసన్న ఉన్నారు. ఘన్‌పూర్‌లో మరో మహిళ.. స్టేషన్‌ఘన్‌పూర్: వడదెబ్బతో ఘన్పూర్ డివిజన్ కేంద్రానికి చెందిన పులి రమ(50) మృతిచెందింది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. రమ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వడదెబ్బ తగలడంతో తీవ్ర అస్వస్తతకు గురైంది. దీంతో కుటుంబీకులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
రజతోత్సవానికి ముస్తాబు
భారత రాష్ట్ర సమితి పాతికేళ్ల పండుగకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి – చింతలపల్లి శివారులో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభావేదిక, సభకు హాజరయ్యే జనం కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మహిళలు, పురుషులు వేర్వేరుగా కూర్చునేందుకు బారికేడ్లు అమర్చారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్ శివార్లలో 1,200 ఎకరాలకు పైగా భూసేకరణ చేశారు. ఇందులో సుమారు వెయ్యి ఎకరాలకు పైగా పార్కింగ్ కోసమే కేటాయించారు. వేదికకు ఇరువైపులా కేసీఆర్, కేటీఆర్ నిలువు కటౌట్లతో రజతోత్సవ చిహ్నాలు ఏర్పాటు చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హన్మకొండ -
పుష్కరాల పనుల్లో వేగం పెరగడం లేదు
కాళేశ్వరం: ఆశించిన స్థాయిలో పుష్కరాల అభివృద్ధి పనుల్లో వేగం పెరగడం లేదని, పనులను అధికారులు, కాంట్రాక్టర్లు సీరియస్‌గా తీసుకోవాలని దేవా దాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించారు. బుధవారం సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, దార్మిక సలహాదారు గోవిందహరితో కలిసి కాళేశ్వరంలో పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించారు. వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద పుష్కర ఘాట్ విస్తరణ పనులు చూశారు. గోదావరి నీటిమట్టంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది ఉండదని ఇరిగేషన్ ఇంజనీర్లు తెలిపారు. గోదావరి వద్ద భక్తుల కోసం చలువ పందిళ్లు వేయాలని ఆదేశించారు. సరస్వతి విగ్రహం ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, 86 గదుల గెస్ట్‌హౌస్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని మూడు గంటల పాటు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రానున్న పది రోజులు చాలా ముఖ్యమని, ప్రతి రోజూ పనుల్లో ప్రగతి రావాలన్నారు. పనుల వివరాలు వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయాలని సూచించారు. మే 10వ తేదీ వరకు అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుపుతున్న కార్యక్రమమని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణ రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మల్చూర్‌నాయక్,ఇరిగేషన్ ఎస్ఈ సత్యనారాయణ, డీపీఓ నారాయణరావు, ఈఓ మహేశ్, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఈఈ కనక దుర్గాప్రసాద్, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూ ఎస్ఈఈ నిర్మల, ఇరిగేషన్ ఈఈ తిరుపతిరావు, డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, సీఐ రామచందర్‌రావు, ఎస్సై తమాషారెడ్డి పాల్గొన్నారు. పనులు సీరియస్‌గా చేయండి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి పరిశీలన మూడు గంటల పాటు అధికారులతో సమీక్ష -
మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు మంగళవారం ధాన్యం పోటెత్తింది. అలాగే మక్కల రాశులతో మార్కెట్ ప్రాంగణం కళకళలాడుతూ కనిపించింది. మార్కెట్ ఆవరణలోని కవర్ షెడ్డుతో పాటు ఇతర షెడ్లన్నీ ధాన్యం, మక్కలతో నిండిపోయాయి. స్థలం సరిపోకపోవడంతో రైతులు తాము తీసుకువచ్చిన ధాన్యం, మక్కలను వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో రాశులుగా పోసుకున్నారు. వ్యాపారులు 2,877 బస్తాల (1,869 క్వింటాళ్లు) ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే 3,668 బస్తాల (2,201 క్వింటాళ్లు) మక్కలను కొన్నారు. కాగా మార్కెట్ షెడ్లన్నీ నిండి ఉన్నాయని, బుధవారం ధాన్యం, పత్తి, మక్కలు, అపరాలను తీసుకురావద్దని, మిర్చి క్రయవిక్రయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ తెలిపారు. -
సివిల్స్‌లో మెరిశారు..
ఐదో ప్రయత్నంలో ఐఏఎస్.. ● ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి ● తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికై న జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు. జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్ఆర్ ఎడ్యు స్కూల్లో చదివారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు. నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూపీఎస్సీ ఫలితాల్లో మనోళ్ల సత్తా.. నలుగురు ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులకు అత్యుత్తమ ర్యాంకులు నెలరోజుల్లో డబుల్ ధమాకా ● మొన్న గ్రూప్ వన్, ఇప్పుడు సివిల్స్ ● సత్తాచాటిన వరంగల్ వాసి ● తెలుగు రాష్ట్రాల్లో టాపర్‌గా నిలిచిన శివాని సాక్షి, వరంగల్: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి సివిల్స్ ర్యాంక్‌ల్లో ఇట్టబోయిన సాయి శివాని టాపర్‌గా నిలవడంతో వరంగల్ పేరు ఒక్కసారిగా మార్మోగింది. నెలవ్యవధిలోనే ఆమె డబుల్ ధమాకా సాధించారు. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు, అవి కూడా గ్రూప్–1లో రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంకు, ఇప్పుడూ సివిల్స్‌లో ఏకంగా జాతీయ స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించారు. వరంగల్ శివనగర్ వాసవీ కాలనీలోని తమ ఇంట్లోనే చదువుకుంటూ, ఆన్లైన్ పాఠాలు వింటూ జాతీయస్థాయి ఘనత సాధించడం విశేషం. బీటెక్ పూర్తయిన మూడేళ్లలోనే రెండో ప్రయత్నంలో సివిల్స్ సాధించి వరంగల్‌కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. తండ్రి రాజు మెడికల్ రిప్రజంటేటివ్ పనిచేస్తుండగా, అమ్మ రజిత గృహిణిగా ఉంటూ తమ కుమార్తె సాయి శివాని కల సాకారం కోసం వెన్నుతట్టి ప్రోత్సహించారు. వారి ప్రోద్బలం, సాయి శివాని పట్టుదలతో చదవడంతోనే ఈ ఘనత సాధ్యమైంది. దేశ అత్యున్నత సర్వీస్ సివిల్స్‌లో మనోళ్లు మెరిశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసిన తుది ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నారు. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంకు, హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి 46, నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ 255, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ 855 ర్యాంకు సాధించారు. దీంతో కుటుంబీకులు, బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. నీరుకుళ్ల యువకుడు.. సివిల్స్ సాధించాడు ● తండ్రి ప్రోత్సాహంతో 255వ ర్యాంకు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్లకు చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ సాధించారు. తండ్రి ప్రోత్సాహంతో యూపీఎస్సీ ఫలితాల్లో జాతీయస్థాయిలో 255 ర్యాంకు సాధించారు. కాగా, హరిప్రసాద్‌కు ఐఏఎస్ పోస్టు దక్కనుంది. హరిప్రసాద్ తండ్రి కిషన్ నల్లబెల్లి మండలం నందిగామ జెడ్పీ హైస్కూల్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. తల్లి విజయ గృహిణి. వీరు హనుమకొండలోఉంటున్నారు. హరిప్రసాద్ పాఠశాల విద్య హనుమకొండలోని ఆర్యభట్ట పాఠశాలలో కొనసాగింది. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో చదివారు. ఐఐటీ ముంబైలో బీటెక్(ఎలక్రికల్)2016లో పూర్తి చేశారు. అనంతరం జపాన్‌లోని ఓ కంపెనీలో 2017 నుంచి 2019 వరకు పనిచేశారు. అనంతరం ఇంటికి వచ్చి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఇంటివద్దే చదువుకున్నారు. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. తాజా ఫలితాల్లో 255వ ర్యాంకు సాధించి తన కల సాకారం చేసుకున్నారు. నాన్న ప్రోత్సాహంతో.. మా నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ వైపు దృష్టి సారించా. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే ప్రణాళికతో ప్రిపేరయ్యా. 255 ర్యాంకు రావడం ఆనందంగా ఉంది. నాకు ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంది. – పోతరాజు హరిప్రసాద్, సివిల్స్ 255 ర్యాంకర్కొడుకు కలెక్టర్ కావాలనుకున్నా..నా కొడుకును కలెక్టర్ చేయాలనే కల నెరవేరింది. సివిల్స్‌తోనే సమాజ సేవ సాధ్యం. అందులోనే తృప్తి ఉంటుంది. మా గ్రామీణ ప్రాంతం నుంచి నా కొడుకు సివిల్స్ సాధించడం గర్వంగా ఉంది. – పోతరాజు కిషన్, హరిప్రసాద్ తండ్రి సొంతంగా ప్రిపేర్.. ● సివిల్స్‌లో 855 ర్యాంకు సాధించిన జితేందర్ నాయక్ భూపాలపల్లి అర్బన్: సివిల్స్‌లో భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గుగులోత్ జితేందర్ నాయక్ మెరిశారు. ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో ఎలాంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే చదువుకుంటూ యూపీఎస్సీ ఫలితాల్లో 855 ర్యాంకు సాధించారు. జితేందర్ తండ్రి హేమానాయక్ భూపాలపల్లి ఏరియా సింగరేణి వర్క్‌షాపులో ఉద్యోగం చేస్తున్నారు. జితేందర్ 2021లో బీటెక్ పూర్తి చేసి 2022లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. అనంతరం 2023 నుంచి ఇంట్లోనే ఉండి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదువుకున్నట్లు తెలిపారు. చిన్నప్పటి నుంచి సివిల్ సాధించాలనే లక్ష్యంతో చదువుకున్నట్లు జితేందర్ పేర్కొన్నారు. -
జూనియర్ ఇంటర్లో ‘ఇన్స్పైర్’కు ప్రథమ ర్యాంకు
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలి తాల్లో ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఇన్స్పైర్ అకాడమీ విద్యాసంస్థకు చెందిన తీగల సాయి శ్రే ష్టత జూనియర్ ఇంటర్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సా ధించినట్లు డైరెక్టర్ భరత్‌కుమార్ తెలిపారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 468 మార్కులు సాధించిన రాష్ట్రంలో ప్రథమ స్థా నంలో నిలిచిందన్నారు. అలాగే, ఎంపీసీ విభాగంలో మేర్గు అజయ్ 464, వంశీ 464, శ్రీ చరణ్ 463, సాయిప్రియ 462, సిరి చందన 460, సాయి ప్రియ 462, బైపీసీ విభాగంలో మధుప్రియ 432 మార్కులు, కీర్తిరోషి 431, సీఈసీ విభాగంలో నూతన శ్రీ 459మార్కులు, కిరణ్మయి 455 మార్కులు సాఽధించినట్లు చెప్పారు.ఈ సందర్భంగా సాయి శ్రేష్టతను అభినందించారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సభ్యులు రాజ్‌కుమార్,మమత, సుంకరి శ్రీరాంరెడ్డి, హరీశ్‌గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..
● ఒకరి దుర్మరణం ● ఉప్పల్‌లో ఘటనకమలాపూర్: రాంగ్ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ ద్విచక్రవాహనదారుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కమలాపూర్ మండలం రాములపల్లి (కన్నూరు)కు చెందిన వంటకాల రాంరెడ్డి (52) ద్విచక్రవాహనంపై ఉప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి వస్తున్నాడు. బస్టాండ్ వద్ద యూటర్న్ తీసుకుని వెళ్తున్న క్రమంలో ఉప్పల్‌కు రాంగ్ రూట్లో వస్తున్న ఆర్టీసీ బస్సు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంతో సహా రాంరెడ్డి బస్సు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతుడి కుమారుడు ప్రణయ్ ఫిర్యాదు మేరకు రేగొండ మండలానికి చెందిన బస్సు డ్రైవర్ మంతెన శ్రీకాంత్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ హరికృష్ణ తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. -
మిర్చి ధర తగ్గించారంటూ రైతుల ఆందోళన
● కేసముద్రం మార్కెట్లో ఘటన కేసముద్రం: కొందరు వ్యాపారులు కుమ్మకై ్క మిర్చి ధరను అమాంతం తగ్గించి, తమను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహించిన సంఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో జరిగింది. మార్కెట్‌కు మంగళవారం సుమారు 700 మిర్చి బస్తాలు అమ్మకానికి వచ్చాయి. ఈ మేరకు వ్యాపారులు టెండర్లు వేయగా, పలువురు రైతులు తీసుకువచ్చిన మిర్చికి క్వింటాకు రూ.6 వేల వరకే ధర పడింది. దీంతో రైతులంతా ఆగ్రహానికి లోనై నిన్నటి వరకు మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.12వేల వరకు ఉండగా, ఇప్పుడు సగానికి సగం ధరను ఎలా తగ్గిస్తారంటూ ఆందోళనకు దిగారు. ధరతోపాటు, తూకంలో మోసం చేస్తున్నారని, క్యాష్ కటింగ్ పేరుతో తమను దోచుకుంటున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి తమ మిర్చికి టెండర్లు వేయాలంటూ వారు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న సెకండ్ ఎస్సై కరుణాకర్ పోలీస్‌సిబ్బందితో మార్కెట్ యార్డుకు చేరుకుని, రైతులతో మాట్లాడారు. ధర పడని బస్తాలకు తిరిగి బుధవారం టెండర్లు వేయిస్తామని రైతులను శాంతింపజేశారు. -
ఇంటర్లో ‘శివాని’ విజయదుందుభి
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో భీమారంలోని శివాని కళాశాల విజయదుందుభి మోగించింది. జూనియర్ ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన నేరేళ్ల రిషిత 468 మార్కులు, నాగుల నవదీప్ 468 మార్కులు, చక్రిక 468, ఎన్.జశ్వంత్ 467, వరుణ్ తేజా 467, శివకుమార్ 467, తేజాశ్రీ 467, పూజిత 467, సంధ్యా 467 మార్కులు సాధించినట్లు శివాని విద్యాసంస్థల కరస్పాండెంట్ స్వామి తెలిపారు. బీపీసీ విభాగంలో బానోత్ స్వాతి 435 మార్కులు, ఇంద్రజా 434 మార్కులు సాధించారు. సీఈసీ విభాగంలో మేకల కార్తీక్ 484 మార్కులు సాధించాడు. సీనియర్ ఎంపీసీ విభాగంలో చీరాల శైజా 995 మార్కులు, కె. మాధవి 995, బి. మనీషా 993, నక్షత్ర 993, దివ్యశ్రీ 992, రోజా 992, పోరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి 991, జెమిని 990 మార్కులు సాఽధించినట్లు కరస్పాండెంట్ తెలిపారు. బీపీసీ విభాగంలో హర్షిణి 993 మార్కులు, హన్సిక 992, సుష్మిత 992 మార్కులు సాధించారని కరస్పాండెంట్ స్వామి చెప్పారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ స్వామి, ప్రిన్సిపాళ్లు చంద్రమోహన్, సురేందర్‌రెడ్డి, డైరెక్టర్లు రాజు, రమేశ్, మురళీధర్, సురేశ్, సంతోశ్‌రెడ్డి అభినందించారు. -
వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు: వడదెబ్బపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ రవి రాథోడ్ సూచించారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనారోగ్యం బారిన పడితే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వైద్యాధికారులు, సిబ్బంది సైతం అప్రమత్తంగా ఉంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్స్ జ్వలిత, మీరాజ్, ప్రియాంక, నందన, సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం ఆరబోస్తూ రైతు మృతినెల్లికుదురు: ధాన్యం ఆరబోస్తూ ఓ రైతు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని మధనతుర్తి గ్రామంలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బిర్రు వెంకన్న (52) తనకున్న వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోత కోశాడు. పొలం వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టాడు. కాగా, ధాన్యాన్ని నేర్పుతున్న క్రమంలో కుప్పకూలిపోయి మృతి చెందాడు. ఎండ తీవ్రతతో వడదెబ్బ తగిలి మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. -
వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని దోచుకున్నారు..
మహబూబాబాద్ అర్బన్: దేశంలో వక్ఫ్ బోర్డును అడ్డుపెట్టుకొని కొంత మంది నాయకులు దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ చైర్మన్ మార్తినేని ధర్మారావు అన్నారు. జిల్లా కేంద్రంలోనీ బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు సరవణ చట్టం ప్రయోజనాల గురించి వివరించడానికి బీజేపీ దేశావ్యాప్తంగా వక్ఫ్ సుధార్ జనజాగరన్ అభ్యాస్ ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. మే 5వరకు ప్రచారం కొనసాగుతుందన్నారు. వక్ఫ్ సవరణ చట్టంతో ప్రతి పేద ముస్లింకు న్యాయం జరుగుతుందన్నారు. ముస్లింల ఇంటింటికీ వెళ్లి చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలకు ముస్లిం ఓట్లు మాత్రమే అవసరమా.. మిగిలిన వారి ఓట్లు అవసరం లేదా అని ప్రశ్నించారు. కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్‌బోర్డు ఆదాయం ఎక్కడికి పోతుందనే విషయాన్ని అసదుద్దీన్, అక్బరుద్దీన్, కాంగ్రెస్ పాలకులు చెప్పాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శ్యామ్‌సుందర్ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రరావు, జిల్లా నాయకలు రాంబాబు, వెంకన్న, ఇందుభారతి, సందీప్, సత్యనారాయణ, ముస్తఫా, వక్ఫ్ సంస్కరణల కోకన్వీరన్ తుంపిళ్ల శ్రీనివాస్, మురళి పాల్గొన్నారు. -
ఇంటర్మీడియట్లో ‘రెజోనెన్స్’ సత్తా
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో వరంగల్, హ నుమకొండలోని రెజోనెన్స్ జూనియర్ కళాశాలలు 90 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బీపీసీలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంకుతోపాటు మొత్తం 80 రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు వివరించారు. నలుగురు విద్యార్థులు 470 మార్కులగాను 468 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకుసాధించారని, 22 మంది విద్యార్థులు 470 మార్కులకు 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు సాధించారన్నారు. 21 మంది తృతీయ ర్యాంకు, 25 మంది రాష్ట్ర స్థాయి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. ద్వితీయ సంవత్సరంలోనూ విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో జయకేతనం ఎగుర వేశారన్నారు. 21 మంది విద్యార్థులు రాష్ట్ర టాప్ మార్కులు, 995, 994, 993, 992, 991, 990తో పాటు మరిన్ని ఉత్తమ ర్యాంకులు సాధించారని వివరించారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో భూక్యా మనోజ్ కుమార్ 468, వేముల అనిక్షిత 468, గందె వర్ష 468, మంతిని సహస్ర 468 మార్కులు, ద్వితీయ సంవత్సరంలో నీలం నిక్షిత 995, బుర్ర అక్షిత 994, బీపీసీ మొదటి సంవత్సరంలో గండ్ర శ్రీజ 438, దావర్తి శ్రీనిధి 436, దర్ముల శ్రీతిక 436, ద్వితీయ సంవత్సరంలో ఎం.పూజశ్రీ 992, ఆర్.ఇక్షావర్ 992, డి.త్రిలోచన్ 992, ఎం.అస్మిత 992 మార్కులు సా ధించారని వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థా యి ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్, డైరెక్టర్లు, అధ్యాపకులు అభినందించారు. డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీఏఓ లెక్కల రమ్య, అకడమిక్ డీన్ గోపాలరావు, డీన్ కె.సాంబశివుడు పాల్గొన్నారు. -
‘సువిద్య’ విద్యార్థుల విజయకేతనం
హన్మకొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో హనుమకొండ నక్కలగుట్టలోని సువిద్య జానియర్ కాలేజీ ఫ ర్ గర్ల్స్ విజయకేతనం ఎగురవేసింది. మంగళవారం వె లువడిన ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణులయ్యారని కళాశాల కరస్పాండెంట్ కె.శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు ఎ.జితేందర్ రెడ్డి, ఎన్.వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ మొద టి సంవత్సరంలో ఎన్.ధృతి రెడ్డి 467 మార్కులు, ఎస్.జీవిక 463, పి.శ్రీజ 459, బీపీసీ మొదటి సంవత్సరంలో పి.షణ్ముక ప్రియ 424, ద్వితీయ సంవత్సరంలో ఎం.సిరిచందన 986, బి.దేవిశ్రీ 985, డి.ప్రీతిక 985 మార్కులు సాధించారన్నారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ అభినందించారు. -
కాళోజీ కళాశాల ప్రభంజనం
హసన్‌పర్తి: ఇంటర్మీడియట్ ఫలితాల్లో చింతగట్టులోని కాళోజీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్ బీపీసీ విభాగంలో సురేశ్ 993 మార్కులు, ఎస్. వైష్ణవి 991 మార్కులు, ఎంపీసీ విభాగంలో సీహెచ్. శ్రీకృతి 991 మార్కులు, జి. తేజస్వీని 991, హాసిని 989, స్ఫూర్తి 985,అనురాఘవగౌడ్ 985 మార్కులు, సాధించినట్లు చెప్పారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఎస్. వంశీ 463 మార్కులు, సింధు 461, కె. అక్షిత 460 , శ్రీనిధి 460 మార్కులు, బీపీసీ విభాగంలో ఆశ్రయ 428 మార్కులు, ఆర్.మానస 421, హారిక 421మార్కులు సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ వై.కె.ఎస్. డైరెక్టర్లు తిరుపతిరెడ్డి, అనిల్‌రెడ్డి, మధుకర్‌రెడ్డి,ఎం.సతీశ్‌కుమార్ అభినందించారు. -
మహబూబాబాద్
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025సివిల్స్‌లో మెరిశారు..9● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక ● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే ● సాయి శివానికి 11వ, జయసింహారెడ్డికి 46వ ర్యాంకు ● నీరుకుళ్ల యువకుడు హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు ● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు.. ● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు అభ్యర్థులు అత్యుత్తమ ప్రతి భ కనబర్చారు. తెలుగు రాష్ట్రాల మొదటిర్యాంకర్ వరంగల్ నగరవాసే. వరంగల్ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజ్ కుమార్, రజిత దంపతుల కుమార్తె సాయి శివాని ఆలిండియా స్థాయిలో 11వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకులు సాధించి జిల్లా పేరుప్రతిష్టలను దేశస్థాయిలో నిలిపారు. – సాక్షి నెట్వర్క్ – వివరాలు 10లోu -
ధరణి పోర్టల్ సీతానగరం రైతులకు శాపం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సీతానగరంతో పాటు సమీప గ్రామాల రైతులకు శాపంగా మారింది. ఇప్పటి మా సాగు భూములను 1954–1970 మధ్యలో మా తాత, ముత్తాతలు ఇక్కడి ఒక ముస్లిం వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు. తెలంగాణ రాక ముందు వరకు మా భూములు రెవెన్యూలో మా పేర్లపై ఉన్నాయి. తెలంగాణ వచ్చాక ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మా పేర్లు మాయమయ్యాయి. ఈ సమస్యపై ఎన్నో ఏళ్లుగా ఐటీడీఏ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు విన్నవించుకున్నాం. మా పేర్లపై ఉన్న కాగితాలు ఉన్నాయి. మా సమస్యకు వెంటనే పరిష్కార మార్గం చూపాలి. – ఆకుల రమేశ్, రైతు, సీతానగరం -
ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మహబూబాబాద్: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్‌ను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని రాష్ట్ర రెవె న్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్, హౌసింగ్‌శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌతమ్‌లతో కలిసి ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి చట్టంపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శంకగా జరగాలన్నారు. అధికారులు భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్‌వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో విప్లవాత్మక మార్పులు
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ గూడూరు: భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్, ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మండలంలోని భూపతిపేట రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గతంలో ఉన్న ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి అధికారాలు ఇవ్వలేదని, దీంతో సమస్యలు ఉత్పన్నమైనట్లు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతు ఆధార్ లింకు ద్వారా భూధార్ నంబర్ కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా సీతానగరం గ్రామంలో నెలకొన్న రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇవ్వగా, అవసరమైతే తాను సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మంచారి, ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రావు, డీఏఓ విజయనిర్మల, నెక్కొండ ఏఎంసీ వైస్ చైర్మన్ నరేష్‌రెడ్డి, ఏడీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
నెహ్రూసెంటర్: మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైతే వెంటనే షీటీంకు తెలపాలని షీటీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్ధాలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈవ్‌టీజీంగ్, పని ప్రదేశాల్లో వేదింపులకు గురైతే వెంటనే షీటీంకు లేదా 100 డయల్ చేయవచ్చని, షీటీం నంబర్ 87126 56935 ఫోన్ చేసి చెప్పాలన్నారు. టీసేఫ్ యాప్ ట్రావెలర్ యాప్ అని ట్రావెలింగ్ చేసే ప్రతీ ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ఏఓ గఫర్, షీ టీం ఉమెన్ పీఎస్ ఎస్సై ఆనందం, షీటీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేశ్, ఏహెచ్‌టీ సిబ్బంది సుప్రజ, భరోసా సిబ్బంది బేబీ, తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలో సౌకర్యాలు కల్పించాలి
నెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని సామాజికవేత్త డాక్టర్ వివేక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీఎంసీని సోమవారం ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో భవనాలు, హాస్టల్ భవనాలు, ఆసుపత్రికి సంబంధించిన పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భవనాలను పూర్తి చేసి విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ బీమానాయక్, విష్ణు, శాంతికుమార్, సాయికుమార్, సూర్యప్రకాశ్, శివవర్మ పాల్గొన్నారు. -
అమెరికాతో ఒప్పందాలు విరమించుకోవాలి
తొర్రూరు: అమెరికాతో భారత్ ఒప్పందాలు విరమించుకోవాలని వామపక్ష సంఘాల నాయకులు పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ రాకను నిరసిస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో సోమవారం డివిజన్ కేంద్రంలోని గాంధీ సెంటర్లో నిరసన తెలిపారు. అమెరికాకు లాభం చేకూర్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నాడన్నారు. కార్యక్రమంలో నాయకులు ముంజంపల్లి వీరన్న, ఎండీ యాకూబ్, ఆలకుంట్ల సాయిలు, ఊడుగుల లింగన్న, జమ్ముల శ్రీను, యాకాంతం, వల్లపు సాయిలు పాల్గొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడి పర్యటనను నిరసిస్తూ ఆందోళన బయ్యారం: అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ భారత పర్యటనను నిరసిస్తూ సోమవారం మండలకేంద్రంలో వామపక్ష ప్రజా, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలో వ్యవసాయరంగంను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే అమెరికా ఉపప్రధాని పర్యటనను భారతదేశంలో నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు నందగిరి వెంకటేశ్వర్లు, మండ రాజన్న, బిల్లకంటి సూర్యం, భిక్షం, పాల్గొన్నారు. -
తక్షణమే సస్పెండ్ చేయాలి
గంగారం: మహబూబాబాద్ జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా విధులు నిర్వహిస్తున్న గుగులోత్ దేశిరామ్ను సస్పెండ్ చేయాలని తుడుం దెబ్బ కార్యనిర్వాహక అధ్యక్షుడు పులసం మునేష్ కోరారు. గంగారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలోఆయన మాట్లాడుతూ.. సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలలో పనిచేస్తున్న ఆదివాసీ, గిరిజన ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులపై ప్రైవేట్ వ్యక్తులతో, ఆయా పాఠశాలలు, ఆశ్రమ వసతి గృహాలలో సమస్యలు లేకపోయిన ఉన్నట్లుగా పేపర్ స్టేట్మెంట్స్ ఇప్పిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. తక్షణమే డీడీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. -
తాగునీరు రావడం లేదని రాస్తారోకో
నెల్లికుదురు: వారం రోజుల నుంచి తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులతో మొరపెట్టుకున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయడం లేదని సీపీఎం మండల కార్యదర్శి ఇస్సంపల్లి సైదులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లాని పాపారావు, బీఆర్ఎస్ నాయకుడు బైస రమేశ్ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని మునిగలవీడు గ్రామంలో 10రోజుల నుంచి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తు సోమవారం రాస్తారోకో చేపట్టారు. గ్రామంలో మంచినీటి కొరత లేదని ఎంపీఓ పద్మ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
ప్రాజెక్ట్ ద్వారా సాగునీరు అందించాలి
గార్ల: సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీటిని ఇల్లెందు నియోజకవర్గంలోని ఐదు మండలాలకు అందించాలని కోరుతూ సోమవారం న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈధర్నాను ఉద్దేశించి న్యూడెమోక్రసీ పార్టీ మండల కార్యదర్శి జి.సక్రు మాట్లాడారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాజెక్ట్ ద్వారా సాగు, తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ శ్రీరామ్‌కు అందజేశారు. కార్యక్రమంలో మాన్యా, సీహెచ్ గణేశ్, రైతులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మరిపెడ రూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురి వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బొలగాని సతీష్ సోమవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మరిపెడ మండలంలో అకేరు, పాలేరు వాగుల నుంచి ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసేందుకు రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, మండలంలోని బీచ్‌రాజ్‌పల్లి గ్రామానికి చెందిన చిదుముల విజయ్, బాల్నిధర్మారానికి చెందిన గుడిమల్ల ఉపేందర్, చిన్నగూడూరు మండలం విస్సంపల్లికి చెందిన బొమ్మ రవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవాలి మరిపెడ/నర్సింహులపేట: పిల్లలు, మహిళలకు పోషకాహారాన్ని అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి గుగులోతు రవి అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మరిపెడలో పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాజ్యలక్ష్మీ, సీడీపీఓ ఎల్లమ్మ , అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశలు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
తొర్రూరు: క్రీడలతో ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కలుగుతుందని తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి అన్నారు. అనుమాండ్ల మాధవరెడ్డి స్మారకార్థం వాలీబాల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జట్లు పాల్గొనగా రఘునాథపల్లి జట్టు ప్రథమ స్థానంలో, మేడారం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గొడిశాల నగేష్, ఎంఈఓ బుచ్చయ్య, ప్రతినిధులు వాసిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, సూరం ఉపేందర్‌రెడ్డి, కొండం జనార్ధన్, హెచ్ఎం లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. -
మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మల్లేశంగౌడ్
తొర్రూరు రూరల్: గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ జిల్లా కార్యదర్శిగా మండలంలోని గుర్తూరు గ్రామానికి చెందిన మేరుగు మల్లేశంగౌడ్ను నియమిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ అనంతుల రమేశ్‌గౌడ్ నియామక పత్రాన్ని సోమవారం అందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి గూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని జిల్లా నాయకుడు పొదిళ్ల నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2029ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందన్న నమ్మకాన్ని ఇప్పటి నుంచే కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాసమల్ల వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ నాయిని ధర్మారెడ్డి, ఎంపీపీ చెల్పూరు వెంకన్న, గిరిజన మోర్చా రాష్ట్ర కార్యదర్శి గుగులోతు రాంబాబు, శ్రీశైలం, విజయశ్రీ, నాగేశ్వర్రావు, పడాల నాగరాజు పాల్గొన్నారు. ఆర్థికసాయం మహబూబాబాద్: మానుకోట మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ పాఠశాలలో 1988–89 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన అక్బర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తోటి మిత్రులు సోమవారం రూ.37,500 ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో మిత్రులు నూకల సుధీర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, భీముడు వెంకటప్పయ్య, జయపాల్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ ఆస్తుల ఆక్రమణకు కేంద్రం కుట్ర మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ ఆస్తులు అక్రమణకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని జేఏసీ ఉద్యమ నేత చైర్మన్ డాక్టర్ డోలి సత్యనారాయణ అన్నారు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీల ధరించి ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఉద్యమ, వామపక్ష, కుల, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ జాయిట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ఇక్బాల్ సాహెబ్, ఫజల్, ఇబ్రహిం, రహీం, జాకీర్, నజీర్, జావీద్, నయీమ్, షకిల్, సత్తార్, యూసఫ్ పాల్గొన్నారు. పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పెద్దవంగర: పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు జాగ్రత్తలు వహించాలని మండల పశువైద్యాధికారి రాజశేఖర్ అన్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని బొమ్మకల్లు గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసారు. కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కేతిరెడ్డి సోమనర్సింహరెడ్డి, సిబ్బంది సంధ్య, అనిల్, హసన్, ఉప్పలయ్య పాల్గొన్నారు. పూర్వ విద్యార్థి విరాళం మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్ధి శేరి వీరయ్య పాఠశాల అభివృద్ధి కోసం రూ.20వేలు సోమవారం విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం గుగులోత్ లక్ష్మి, ఉపాధ్యాయులు రవి, రాధిక, సువర్ణ, కవిత, శ్రీజ పాల్గొన్నారు. ఫ్రీజర్ బాక్స్ అందజేత దంతాలపల్లి: మండల కేంద్రానికి చెందిన సేను రాజేష్ తన భార్య మహేశ్వరి జ్ఞాపకార్థం, నెల్లూరి యాకయ్య తన తండ్రి నారాయణ జ్ఞాపకార్థం చెరో రూ.36వేల చొప్పున రూ.73వేల విలువ చేసే ఫ్రీజర్‌ను గ్రామ పంచాయతీ కార్యలయంలో సోమవారం అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకన్న, ఎస్సై పిల్లల రాజు, నాయిని శ్రీనివాస్ రెడ్డి, సంపెట సురేష్, యాకయ్య పాల్గొన్నారు. నార్మల్ డెలివరీతో ఆరోగ్యం గార్ల: నార్మల్ డెలివరీలతోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని గార్ల సీహెచ్‌సీ డాక్టర్ హనుమంతరావు అన్నారు. సోమవారం స్థానిక సీహెచ్‌సీ ఆసుపత్రిలో ఎస్.స్వప్నకు నార్మల్ డెలివరీ చేయగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కార్యక్రమంలో హెడ్ స్టాఫ్‌నర్సు స్వాతి, స్టాఫ్‌నర్సులు రమాదేవి, నాగమణి, పుష్పలత, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కురవి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. కురవి, సీరోలు మండలాల్లోని కందికొండ, చింతపల్లి గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మహబూబాబాద్ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, రెండు మండలాల పార్టీ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, అంబటి వీరభద్రంగౌడ్, బండి శ్రీనివాస్, జెరిపోతుల మహేష్‌గౌడ్, దువ్వ సైదులు, చందూలాల్, సతీష్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి మరిపెడ రూరల్: మండలంలోని తానంచర్ల శివారు పాలేరు వాగు ఒడ్డును స్వయంభూగా వెలసిన గంగాభవాని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. జాతరకు ఎమ్మెల్యే హాజరై ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సమాచార హక్కు మాజీ కమిషనర్ గుగులోతు శంకర్‌నాయక్, నాయకులు యుగేందర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, తాజుద్దీన్, ఐలమల్లు, కోట వెంకట్‌రెడ్డి, గుగులోతు రవి, పాశం నరేష్‌రెడ్డి, మచ్చ వెంకటనర్సు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ రాంచంద్రునాయక్ -
రైతు సేవకే పునరంకితం కావాలి
మరిపెడ రూరల్: ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) కమిటీదేనని, ఆత్మ కమిటీ రైతు సేవకే పునరంకితం కావాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మండలంల గిరిపురం గ్రామ రైతు వేదికలో మరిపెడ డివిజన్ వ్యవసాయ అధికారి విజయ్ చందర్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా ఎన్నికై న మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్‌రెడ్డితో పాటు 23 మంది కమిటీ డైరెక్టర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, నూకల అభినవ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరరెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, కాలం రవీందర్‌రెడ్డి, కాలం శ్రీనివాస్‌రెడ్డి, అఫ్జల్, ఉపేందర్ పాల్గొన్నారు. -
పోస్టుమార్టం గది ప్రారంభమెప్పుడో?
గార్ల: గార్ల కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ (సీహెచ్‌సీ)లో నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం పూర్తయి 8నెలలు గడుస్తున్నా, నేటికీ ప్రారంభించక పోవడంతో మృతదేహాలకు వైద్యులు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. సీహెచ్‌సీ వైద్యులు మాత్రం సరిపడా సిబ్బంది ఉన్నా ప్రమాదవశాత్తు చనిపోయిన, పురుగుమందు తాగి మృతిచెందిన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం లేదు. దీంతో మృతదేహాల పోస్ట్‌మార్టం కోసం నిరుపేదలు రూ.10,000 ఖర్చు పెట్టుకొని వాహనం మాట్లాడుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. గార్లలో 6ఏళ్ల క్రితం సకల సౌకర్యాలతో నాటి ప్రభుత్వం రూ.5కోట్లు వెచ్చించి 30పడకల ఆస్పత్రిని నిర్మించింది. కాని ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం భవనంను విస్మరించింది. దీంతో మండలంలోని వామపక్ష పార్టీల నాయకులు సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం భవనం నిర్మించాలని పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా ఎట్టకేలకు ఆస్పత్రి వెనుకభాగంలో ప్రభుత్వం 8నెలల క్రితం నూతన పోస్టుమార్టం భవనం నిర్మాణం చేపట్టింది. కాని ఈ పోస్ట్‌మార్టం భవనంలో రైలు, రోడ్డు ప్రమాదాలు, పురుగుమందు తాగి ఆత్మహత్యలు చేసుకున్న మృతదేహాలకు సీహెచ్‌సీ వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఆసక్తి కనబర్చడం లేదు. మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తే సాక్ష్యం కోసం మాటిమాటికి వైద్యులు కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని, మనకెందుకు రిస్క్ అని వైద్యులు తప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటికై నా కలెక్టర్, జిల్లా డీసీహెచ్ఎస్ స్పందించి సకల సౌకర్యాలు ఉన్న స్థానిక సీహెచ్‌సీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీల నాయకులు, మండల ప్రజలు డిమాండ్ చేశారు.ఆర్థికంగా నష్టపోతున్నారు.. గార్ల సీహెచ్‌సీలో వైద్యులు, వైద్యసిబ్బంది ఉన్నా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేయడం లేదు. వైద్యులు, వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వలన, పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను రూ.10వేలు ఖర్చు పెట్టి వ్యాన్ తీసుకొని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి వెళ్తూ నిరుపేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. కలెక్టర్ స్పందించి సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. – ఇమ్మడి గోవింద్, గోపాలపురం నిర్మాణం పూర్తయి 8నెలలు.. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తూ ఆర్థికంగా నష్టపోతున్న పేదలు ప్రారంభించాలని కోరుతున్న ప్రజలు -
అఽధిక ధరలను నియంత్రించాలి
మహబూబాబాద్: అధిక ధరలను వెంటనే నియంత్రించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విజయసారథి మాట్లాడుతూ.. ధరలు పెరగడంతో పేదలపై తీవ్రభారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం మోదీ కేవలం కార్పొరేట్లకే ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్ సారథిరెడ్డి, శ్రీనివాస్, ఇక్బాల్, ఫరీద్ రియాజ్, చాంద్, పెరుగు కుమార్, నవీన్ పాల్గొన్నారు. -
రజతోత్సవ సభతో బీఆర్ఎస్కు పూర్వ వైభవం
● మాజీ మంత్రి సత్యవతి రాఽథోడ్ మహబూబాబాద్: బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, ఆ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో సోమవారం గూడూరు మండలం దామరవంచ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తి గా విఫలమైందన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రజతో త్సవ సభలో మాజీ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడుతారని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు యాళ్ల మురళీధర్‌రెడ్డి, లూనావత్ అశోక్, నవీన్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. నర్సింగ్ కళాశాల తనిఖీనెహ్రూసెంటర్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సోమవారం తనిఖీ చేశారు. నర్సింగ్ విద్యార్థులకు అందుతున్న క్లినికల్ ట్రైనింగ్, తరగతులు, ల్యాబ్‌లు, మ్యూజియం, పరీక్షలు, మౌలిక వసతులు, బిల్డింగ్ తదితర అంశాలను పరిశీలించారు. కళాశాలతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సింగ్ విద్యార్థుల క్లినికల్ ట్రైనింగ్, వార్డులను పరిశీలించారు. అర్బన్ హెల్త్ సెంటర్‌కు వెళ్లి నర్సింగ్ విద్యార్థుల ట్రైనింగ్ గురించి తెలుసుకున్నారు. అనంతరం నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కేటాయించిన బిల్డింగ్, నర్సింగ్ కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లీలా తదితరులు ఉన్నారు. అలాగే మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఫౌంటేన్ కాదు.. భగీరథ పైపులైన్ లీకేజీకురవి: ఇది ఫౌంటేన్ అనుకుంటే పొరపాటే.. మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీ. మండల కేంద్రం శివారు పెద్ద చెరువు సమీపంలో 365 జాతీయ రహదారి పక్కన భగీరథ పైపులైన్ లీకేజీతో నీళ్లు ఫౌంటేన్‌లా విరజిమ్ముతూ సోమవారం వృథాగాపోయాయి. దీంతో ఆ రహదారి వెంట వెళ్లే వాహనదారులు వృఽథాగా పోతున్న నీటిని చూసి అధికారుల నిర్లక్ష్యాన్ని విమర్శించారు. తాగునీటిని వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై భగీరథ సూపర్వైజర్ను వివరణ కోరగా వేరే చోట పైపు పగిలిపోవడంతో ఎయిర్‌వాల్వ్‌ను విప్పి నీటిని బయటకు పంపించి పగిలిన పైపు మరమ్మతులు చేసినట్లు సూపర్వైజర్ వెంకటరెడ్డి తెలిపారు. గణితంతోనే అన్ని విభాగాల్లో పరిశోధనలు ● నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఉమామహేశ్ కాజీపేట అర్బన్: గణితశాస్త్రం అన్ని విభాగాలతో ముడిపడి ఉంటుందని, వివిధ విభాగాల్లో నూతన పరిశోధనలు, ఆవిష్కరణలు గణితంతోనే సాధ్యమని నిట్ ఇన్చార్జ్ డైరెక్టర్ ఎన్వీ.ఉమామహేశ్ తెలిపారు. నిట్ వరంగల్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లోని హామిబాబా హాల్లో సోమవారం మ్యాథమెటికల్ డిపార్ట్మెంట్, ఐఐటీ బాంబే నేషనల్ సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ముంబై సౌజన్యంతో వారం రోజుల టీచర్స్ ఎన్రీచ్మెంట్ వర్క్‌షాప్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మా ట్లాడారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ–2020కి అనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. వారం రోజుల వర్క్‌షాప్ వేదికగా నిలవాలన్నారు. నిట్ మ్యా థమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ సెల్వరాజ్, ప్రొఫెసర్లు రాజశేఖర్, శ్రీనివాసరావు ఉన్నారు. -
అర్హుల నిరీక్షణ!
మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025‘ఈ ఫొటోలోని మానసిక దివ్యాంగుడు మహబూబాబాద్ మండలం అమనగల్ గ్రామానికి చెందిన గంట శ్రీనివాస్–మౌనిక దంపతుల కుమారుడు రాజేందర్. పుట్టిననాటి నుంచి 15ఏళ్లుగా మానసిక స్థితి బాగాలేక లక్షల రూపాయలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. అయినప్పటికీ ఆయనలో మార్పులేకపోవడంతో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఏప్రిల్ 19న వందశాతం అంగవైకల్యం ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ ఇచ్చారు. ఇటీవల తల్లి మౌనిక మరణించడంతో తండ్రి కూలీ పనిచేస్తేనే కుటుంబం గడుస్తోంది. ఈ పరిస్థితిలో పింఛన్ వస్తే ఆసరాగా ఉంటుందని ఎదురు చూస్తున్నారు.’సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం అర్హులకు ఆత్మీయ భరోసా పింఛన్లు అందించి ఆసరాగా నిలుస్తోంది. అయితే 2022 ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. దీంతో జిల్లాలో మూడేళ్లుగా సుమారు 20వేల మందికి పైగా కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈమేరకు పింఛన్ మంజూరు చేయాలని సదరం సర్టిఫికెట్ పట్టుకొని కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తుల వెల్లువ.. రాష్ట్ర వ్యాప్తంగా 2024 జనవరిలో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా 17,111 మంది పింఛన్ మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా మూడు సంవత్సరాలుగా ప్రమాదాలు, వ్యాధులతో పాటు ఇతర కారణాలతో అంగవైకల్యం పొందిన వారు సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంగవైకల్యం ఉందని డాక్టర్లు నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేసిన వారు మరో 1700మంది వరకు ఉంటారని, 1800 మేరకు ఇటీవల అర్హత పొందిన వృద్ధులు, వితంతులు ఉంటారని అంచనా. ప్రస్తుతం 1.09లక్షల పింఛన్లు.. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 1,09,240 మందికి ప్రతీ నెల రూ. 27.86కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తుంది. వృద్ధులు, వితంతులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ. 2,016 చొప్పున పింఛన్ అందిస్తున్నారు. అలాగే దివ్యాంగులకు నెలకు రూ. 3016 చొప్పున అందజేస్తున్నారు. న్యూస్రీల్మూడేళ్లుగా మంజూరు కాని కొత్త పింఛన్లు సదరం సర్టిఫికెట్ పట్టుకొని కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ అందని వైనం వృద్ధులు, వితంతులు, నేత, గీత కార్మికుల ఎదురుచూపు మంజూరు చేయాలని వేడుకోలు జిల్లాలో ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల వివరాలు పింఛన్ రకం సంఖ్య వృద్ధాప్యం 45,707 వితంతు 41,500 చేనేత కార్మికులు 380 గీత కార్మికులు 2,938 బోదకాలు బాధితులు 375 బీడీ కార్మికులు 14 ఒంటరి మహిళ 3014 డయాలసిస్ పేషెంట్లు 74దివ్యాంగ 15,238 మొత్తం 1,09,240 -
ఏడేళ్ల తర్వాత తెరుచుకున్న బడి
● ఉపాధ్యాయుల ప్రయత్నంతో ప్రాథమిక పాఠశాల రీఓపెన్ బయ్యారం: బడీడు పిల్లల నమోదు లేక ఏడు సంవత్సరాలు మూత పడిన ప్రభు త్వ పాఠశాల ఎంఈఓ, ఉపాధ్యాయుల చొరవతో తిరిగి తెరుచుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్త ఇర్సులా పురం ప్రాథమిక పాఠశాలను విద్యార్థుల నమోదు లేకపోవడంతో ఏడేళ్లక్రితం మూసివేశారు. దీంతో ఆ గ్రామ విద్యార్థులు మండలం కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఎంఈఓ దేవేంద్రాచారి సూచనతో ఉపాధ్యాయులు బానోత్ రాజు, బేబి గ్రామంలోని ఇంటింటికీ తిరిగి పిల్లలను బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. వారి ప్రయత్నంతో 23 మంది విద్యార్థులను తల్లిదండ్రులు వచ్చే విద్యాసంవత్సరం(2025–26) పాఠశాలలో చదివించేందుకు అంగీకరించి అడ్మిషన్ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాలను ఎంఈఓ దేవేంద్రాచారి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భద్రునాయక్, శోభన్, రామకృష్ణ, రాజు, బేబి, గోవర్ధన్, వెంకటేశ్వర్లు, గ్రామస్తులు ఐలయ్య, వీరన్న, కృష్ణ, నరేశ్, లింగన్న, లివిన్, విజయ, అరుణ, మైబూబి తదితరులు పాల్గొన్నారు. -
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణిలో ఇచ్చిన వినతుల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్ వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నా రు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలన్నారు. ఆ వినతుల గడువులోపే పరిష్కరించి ప్రజలకు నమ్మకం కల్పించాలన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నారని, వెంటనే విచారణ చేయాలని మానుకోట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మట్టూరి నాగేశ్వర్రావు వినతి పత్రం అందజేశారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీని రద్దు చేసి గీత కార్మికులను సాంఘిక బహిష్కరణ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజావాణిలో 63 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, తొర్రూరు ఆర్డీఓ గణేశ్, సీపీఓ సుబ్బారావు, డీపీఓ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో ప్రజావాణిలో 63 వినతులు -
వచ్చే నెలలో టీచర్లకు ట్రైనింగ్
కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు ప్రతీ జిల్లాలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాక ఏ జిల్లాకు ఆ జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. డెమో ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన జాబితాలను ఆయా జిల్లాల డీఈఓలు ఈనెల 28వ తేదీ వరకు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలికి, ఎస్ఈఆర్టీ అధికారులకు పంపనున్నారు. ఇదిలా ఉండగా హనుమకొండ జిల్లాలో ఆసక్తిగల తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూమీడియం ఉపాధ్యాయులు నిర్దేశించిన దరఖాస్తుల ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ డి.వాసంతి సోమవారం కోరారు. ఇతర సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యారణ్యపురి: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవిలో శిక్షణలు ఇవ్వనున్నారు. తొలుత ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులను మండల, జిల్లాస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా నియమించనున్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు ప్రకారం ఉమ్మడి జిల్లా పరిధి హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాలల నుంచి ఆసక్తి కలిగిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు, గెజిటెడ్ హెడ్మాస్టర్లను రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం ఆయా జిల్లాల డీఈఓలు.. సదరు ఉపాధ్యాయులనుంచి ఈనెల 22నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతీ జిల్లాలో ప్రాథమిక పాఠశాలలనుంచి మండలస్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా తెలుగు, ఇంగ్లిష్, మ్యాఽథ్స్, ఈవీఎస్ సబ్జెక్టులనుంచి ఇద్దరు చొప్పున ఎంఆర్పీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాస్థాయికి డీఆర్పీలుగా కూడా ఆయా సబ్జెక్టులకు ఒక్కో సబ్జెక్టుకు ఇద్దరు చొప్పున ఎంపిక చేసేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. ఉర్దూ మీడియం, స్పెషల్ ఎడ్యుకేషన్నుంచి కూడా రిసోర్స్ పర్సన్లను నియమిస్తారు. జిల్లాస్థాయిలో హైస్కూళ్లనుంచి.. ప్రతీ జిల్లానుంచి హైస్కూల్‌స్థాయిలో విద్యాబోధన చేస్తున్న టీచర్లు ప్రతీ సబ్జెక్టునుంచి నలుగురి చొప్పున 9 సబ్జెక్టులకు 36మందిని జిల్లాస్థాయి రిసోర్స్పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ఉర్దూ మీడియంలో ఐదు సబ్జెక్టులకు ఇద్దరు చొప్పున పది మందిని నియమిస్తారు. దరఖాస్తులు తీసుకున్నాక అందులో నుంచి అవసరం మేరకు సంబంధిత అధికారులు ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఎంపికై న మండల, జిల్లాస్థాయి రిసోర్స్ పర్సన్లకు ఆయా సబ్జెక్టుల వారీగా కూడా రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణామండలి అధికారులు త్వరలోనే సబ్జెక్టు ఎక్స్‌ఫర్ట్స్‌తో శిక్షణ ఇవ్వనున్నారు. వీరి ద్వారా జిల్లాస్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణలు ఉంటాయని సమాచారం. గుణాత్మక విద్యను అమలుచేసేందుకు ఉపాధ్యాయులకు అందించే శిక్షణలకు ఈ రిసోర్స్పర్సన్లను వినియోగిస్తారు. రిసోర్స్ పర్సన్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం డీఈఓ కార్యాలయాల్లో స్వీకరణ నేటినుంచి ఈనెల 24వరకు గడువు ఇంటర్వ్యూ, డెమో ద్వారా ఎంపికలు -
వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు పోరాడుదాం
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ సవరణ చట్టం రద్దుకు ముస్లింలందరూ ఐక్యంగా పోరాడాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని ముస్లిం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, మాజీ మంత్రి సత్యవతి, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, వామపక్షాల నాయకుల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్ర పోరాటంలో హిందూ ముస్లిం భాయి భాయి అని గాంధీ శాంతియుత ర్యాలీ చేసి భిన్నత్వంలో ఏకత్వమని నిరుపించారన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేవరకు మనమందరం కలిసి పోరాడాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ను బొందపెట్టాలన్నారు. రైతులు, క్రిస్టియన్లు, ముస్లిం వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ రాజ్యాంగంపై దాడులు చేస్తూ.. మానవ హక్కులను కూడా కాలరాస్తోందని మండిపడ్డారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టం రద్దుకోసం పార్లమెంట్లో గళం విప్పుతామన్నారు. శుక్రవారం 2 గంటల పాటు ముస్లింలు నిరసన పోరాటం చేయాలని, చట్టం రద్దు అయ్యేవరకు కలిసికట్టుగా పోరా డుదామని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే భూక్య మురళీ నాయక్ మాట్లాడుతూ.. బీజేపీ మతతత్వ పార్టీ అని పేద, మధ్య, బడుగు బలహీన వర్గాల ప్రజల మధ్య చిచ్చుపెడుతుందని, వక్ఫ్ సవరణ చట్టాన్ని తుంగలో తొక్కాలన్నారు. ముస్లిం మత పెద్ద మహ్మద్ ఇక్బాల్, జిల్లా కన్వీనర్ ఎండీ. ఫరీద్, ఖలీల్, అలంగీర్, హఫీజ్ అబ్దుల్, అహ్మద్, రిజవి, షేక్ అక్రమ్ ఖలీద్, అక్బర్, వాహెద్, షేక్ చాంద్, అసద్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
వడదెబ్బపై అవగాహన కల్పించాలి
మహబూబాబాద్ రూరల్: వైద్యాఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది వేసవికాలం దృష్ట్యా ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. వేసవికాలం దృష్ట్యా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఏర్పాటు చేయాలని, వడదెబ్బకు గురికాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా సకాలంలో గర్భిణుల వివరాలను నమోదు చేయాలని, వ్యాధి నిరోధక టీకాలను వందశాతం పూర్తి చేయించాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సాగర్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, ఆరోగ్య విద్యా బోధకులు రాజు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మేరీ, ఎంపీహెచ్ఈఓ నరేశ్, సూపర్వైజర్లు చక్రి, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ భూక్య రవిరాథోడ్ -
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
కొత్తగూడ/గంగారం: ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయి న భూ సమస్యలకు భూ భారతి చట్టంతో పరిష్కా రం లభిస్తుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అ న్నారు. సోమవారం కొత్తగూడ, గంగారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలో ధరణి వల్ల భూరికార్డులు లేకుండా పోయాయని అన్నారు. మళ్లీ ప్రతీ భూమికి భూ భారతి ద్వారా రికార్డులు వస్తాయని అన్నారు. ప్రతీ గ్రామంలో గ్రామ సభ నిర్వహించి భూమిపై ఎవరు సాగులో ఉన్నారు, ఎన్ని ఏళ్లుగా ఉన్నారు, హద్దులు, ఏమైనా సివిల్ తగాదాలు ఉన్నాయా లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులు తయారు చేస్తారని చెప్పారు. రికార్డులు లేకుండా పోయిన పట్టా భూములకు పరిష్కారంతో పాటు మోఖా మీద ఎవరు ఉన్నారని తేలిపోతుందన్నారు. దీంతో రైతులకు సకాలంలో న్యాయం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దార్లు రమాదేవి, సత్యనారాయణ, ఎంపీడీఓ రవీంద్రప్రసాద్, అప్పరావు పాల్గొన్నారు. పహాణీల ద్వారా పంట రుణాలు ఇవ్వాలి: చల్ల నారాయణరెడ్డి, రైతు షెడ్యూల్డ్ ప్రాంతంలో గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమికి పహాణీలు జారీ చేసి పంట రుణాలు ఇవ్వాలని రైతు చల్ల నారాయణరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో కొత్తగూడ మండలంలోని పలు గ్రామాల్లో 1/70కి లోబడి ఉన్న భూములకు పహాణీల ద్వారా రుణాలు వచ్చాయని చెప్పాడు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి సమాధానం ఇస్తూ పట్టాలతో సంబంధం లేకుండా పహాణీల ఆధారంగా పంట రుణాలు ఇవ్వాలని భూ భారతిలో ప్రత్యేక నిబంధన ఉన్నట్లు తెలిపారు. ధరణిలో రద్దయిన పట్టాలను పునరుద్ధరించాలి: బిట్ల శ్రీనివాస్, రైతు ధరణి చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో కొత్తగూడ మండలం గుండంపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో రద్దయిన పట్టాలను పునరుద్ధరించాలని రైతు బిట్ల శ్రీనివాస్ కలెక్టర్‌ను కోరాడు. ఈవిషయమై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సైతం మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశాడు. కలెక్టర్ సమాధానం ఇస్తూ ఫారెస్ట్ శాఖను అనుసంధానం చేసుకుని సమస్య పరిష్కరించే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ -
ఆకట్టుకున్న రైతు దామోదర్‌రెడ్డి స్టాల్●
● నిజామాబాద్ రైతు మహోత్సవంలో ఏర్పాటు ● 17 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మూడురోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. వివిధ జిల్లాలకు చెందిన పలపలు పంటలు పండించే రైతులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సుభాష్ పాలేకర్ విధానంలో పూర్తిగా ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తున్న మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన రైతు గంట దామోదర్‌రెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. గంట దామోదర్‌రెడ్డి 1974లో బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేశారు. 1978 నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అయితే గత 17 ఏళ్లుగా సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 11 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొదట 4 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టగా మొదట్లో అంతగా దిగుబడులు రాలేదు. తరువాత 3వ సంవత్సరం నుంచి దిగుబడులు వచ్చాయి. ప్రస్తుతం దామోదర్‌రెడ్డి 22 రకాల పసుపు పంట పండిస్తున్నారు. అదేవిధంగా వేరుశనగ, పప్పుదినుసులు, గోధుమ, జొన్న పండిస్తున్నారు. పసుపు, కంది, వేరుశనగ సాగులో సుభాష్ పాలేకర్ విధానంలో మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇక అతికష్టం మీద మెట్ట వరిలో సైతం మల్చింగ్ షేడ్ వేస్తున్నారు. ఇందుకు గాను జాతీయ అవార్డు సాధించారు. దామోదర్‌రెడ్డి ఉత్పత్తులకు వ్యవసాయ శాఖ ధ్రువీకరణ పత్రం ఇచ్చింది. దీంతో మార్కెటింగ్‌కు ఢోకా లేకుండా పోయింది. పసుపుతో క్యాన్సర్‌కు ఔషధం ఇస్తున్నట్లు దామోదర్‌రెడ్డి తెలిపారు. -
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
వేలేరు: ఆయిల్ పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందొచ్చని సీనియర్ శాస్త్రవేత్త రాజశేఖర్ రెడ్డి,కేఎన్ బయోసైన్స్ ఎండీ సుధారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గుండ్లసాగర్లో కేఎన్ బ యో సైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ తో టలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా వారు రైతులకు పలు సూచనలు చేశారు. వేసవిలో సరిపడ నీరు లేకపోతే మొక్కల్లో వచ్చే లోపాలు, వాటి యాజమాన్య పద్ధతులను వివరించారు. ఆయిల్‌పామ్ సాగులో సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలని సూచించారు. ప్రభుత్వం ఆయి ల్ పామ్ రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాకాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ డైరక్టర్ కుషాల్ రెడ్డి, జిల్లా మేనేజర్ రంజిత్, ఫీల్డ్ ఆఫీసర్లు విక్రమ్, మహిపాల్ పాల్గొన్నారు. -
అంపైర్స్ ‘వర్క్‌షాప్’నకు ఆహ్వానం
వరంగల్ స్పోర్ట్స్: బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ అంపైర్స్ వర్క్‌షాప్, ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కె. శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కొటాక్ గోపిచంద్ అకాడమీలో నిర్వహించే వర్క్‌షాప్, ఎగ్జామ్ అనంతరం సర్టిఫికేషన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్న వర్క్‌షాప్‌లో పాల్గొనే వారు ఏదైనా డిగ్రీ చదవి, తెలంగాణ వారై ఉండి, 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌లో పాల్గొనే అభ్యర్థులు తప్పనిసరిగా యూనిఫాం కలిగి ఉండాలని, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ మాత్రమే అందజేయనున్నట్లు, వసతి, ఇతర అలవెన్సులు కల్పించబడవని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శుల లెటర్‌హెడ్ పై దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం దామెర: అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండ గ్రామశివారులో చోటుచేసుకుంది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, సీఐ శ్రీధర్, దామెర ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. పసరగొండ గ్రామ శివారులోని శ్రీ సాయి ఇన్ఫ్రా క్రషర్లో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న మంద నాగరాజు గ్రామం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా పేలుడు పదార్థాలు దాచి ఉంచాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి 400 జిలెటిన్ స్టిక్స్, 150 డిటోనేటర్లు, డిటోనేటర్ ఫ్యూజు వైర్లు, 45 కిలోలు అమోనియా నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మంద నాగరాజుపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు వారు పేర్కొన్నారు. సజ్జ కూలి మేసీ్త్ర మృతి ● నాగిరెడ్డిపల్లిలో ఘటన బచ్చన్నపేట : నూతన ఇంటి సజ్జ కూలి మీదపడడంతో ఓ మేసీ్త్ర మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని నాగిరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా బల్లెకురువ మండలం పాలెం గ్రామానికి చెందిన అచ్చి వెంకటేశ్వర్లు (61) సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో నివాసముంటున్నాడు. చుట్టు పక్కల గ్రామాల్లో నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్నాడు. ఇందులో భాగంగా ఆదివారం మండలంలోని నాగిరెడ్డిపల్లిలో కూడా నూతన ఇంటి నిర్మాణ పనులకు వెళ్లాడు. తొమ్మిది రోజుల క్రితం పోసిన సజ్జల సెంట్రింగ్ బాక్స్‌లను తొలగిస్తుండగా సజ్జ కూలి మీదపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కే. హామీద్ తెలిపారు. కాగా, మృతుడికి కూతురు ఉంది. రాంకీ విల్లాలో చోరీ ● రూ.12 లక్షల మేర బంగారం, నగదు అపహరణ వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని రాంకీలోని 52 నంబర్ విల్లాలో చోరీ జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.12 లక్షల వరకు అపహరణకు గురయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్ కథనం ప్రకారం.. ఈ విల్లాలో అద్దెకుంటున్న వారు ఆదివారం మధ్యాహ్నం నగరంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయి. దీంతో లోపలికివెళ్లి పరిశీలించగా బీరువాలో భద్రపరిచిన 10తులాల బంగారంతో పాటు సుమారు రూ.లక్షన్నర నగదు, రిజిస్ట్రేషన్ పేపర్లు కనిపించలేదు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన క్లూస్‌టీంతో ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ షుకూరు తెలిపారు. పిడుగుపాటుకు కూలిన పౌల్ట్రీ ఫామ్ బచ్చన్నపేట : పిడుగుపాటుకు పౌల్ట్రీ ఫామ్ కూలి కోళ్లు మృత్యువాత పడిన ఘటన మండలంలోని నక్కవానిగూడెంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. శనివారం రాత్రి గాలిదుమారంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగు పడి పౌల్ట్రీ ఫామ్ కూలింది. దీంతో 500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనలో రూ. 5 లక్షల నష్టం వాటిళ్లిందని బాధితుడు లబోదిబోమన్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు. -
అండర్–7 చెస్ విజేత దేవాన్ష్‌రెడ్డి
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–7 చదరంగ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఉమ్మడి జిల్లా నుంచి 14 మంది బాలబాలికలు పాల్గొన్న ఈ పోటీల్లో బైరి దేవాన్ష్‌రెడ్డి విజేతగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి. కన్నా తెలిపారు. ద్వితీయ స్థానంలో అక్షాంత్ చౌహాన్, తృతీయ స్థానంలో వింజమూరి వీయాన్స్, వేనం హితాన్స్, బాలికల విభాగంలో మనీషాగాయత్రి, రన్వికతేజ, ఎం. నిత్య, చైత్రపూర్ణిమ వరుస నాలుగు స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. విజేతలు మే 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటా రని తెలిపారు. ఈ ముగింపు వేడుకలకు ఎస్ఎంఆ ర్ స్కూల్ కరస్పాండెంట్ వెలగందుల విముక్తీశ్వర్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్బిటర్లు ప్రేమ్‌సాగర్, బైరి రఘువీరారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘పట్టు’.. రాయితీ కొట్టు..
డోర్నకల్ : రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం మల్బరీ సాగు, పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ‘సిల్క్ సమగ్ర పథకం’ ద్వారా అన్నదాతలకు మేలు చేకూర్చడానికి రాయితీలు కల్పిస్తోంది. ప్రతీ సంవత్సరం పట్టు గూళ్ల ధర పెరుగుతుండడంతోపాటు జనగామ, హైదరాబాద్ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో రైతులకు ఉద్యాన పట్టుపరిశ్రమ శాఖ రాయితీలు అందించి ప్రోత్సహిస్తోంది. ఇతర వాణిజ్య పంటల కన్నా మల్బరీ, పట్టుపరిశ్రమతో అధిక లాభాలు వస్తుండడంతో రైతులకు అవగాహన కల్పించి సాగును పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిల్క్ సమగ్ర పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, జనరల్ రైతులకు వేర్వేరు రాయితీలు ప్రకటించింది. మల్బరీ సాగుకు అనుకూలాంశాలు.. మల్బరీ సాగుకు నీటి అవసరం తక్కువ ఉంటుంది. ఈ మొక్కలు ఒకసారి నాటితే 10 నుంచి 15 ఏళ్ల వరకు దిగుబడినిస్తాయి. నల్ల రేగడి, చౌడు భూములు మినహా మిగతా భూములన్నీ సాగుకు అనుకూలంగా ఉంటాయి. రెండెకరాల్లో మల్బరీ సాగు చేస్తే మొదటి ఏడాది రెండు నుంచి మూడు పంటలు తీసుకుని రూ.2 లక్షల ఆదాయం పొందొచ్చు. రెండో సంవత్సరం నుంచి 6 నుండి 7 పంటలు తీసుకుని రూ.4 లక్షల ఆదాయం పొందొచ్చు. క్రిమి సంహారక మందుల వినియోగం అవసరం ఉండదు. దరఖాస్తులకు ఆహ్వానం.. మల్బరీ సాగు, పట్టుపరిశ్రమ ఏర్పాటుకు ఆసక్తి కలిగిన రైతులు ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన రైతులు బి.వెంకన్న(పట్టుపరిశ్రమ అధికారి, 8977714628), కె.సురేశ్(సహాయ పట్టుపరిశ్రమ అధికారి, 8977714605), డి.రాజయ్య(సహాయ పట్టుపరిశ్రమ అధికారి 897771468) సంప్రదించాలి.రైతులకు రాయితీలు(రూపాయల్లో)..వివరాలు జనరల్ ఎస్సీ/ఎస్టీ రెండెకరాల మల్బరీ సాగుకు 60,000 78,000 నీటి సదుపాయానికి 55,000 65,000 పట్టుపురుగుల రేలింగ్ షెడ్ నిర్మాణం 2,25,000 2,92,500 పరికరాలకు 37,500 48,750 రోగనిరోధక మందులకు 2,500 3250 కిసాన్ నర్సరీ ద్వారా మొక్కల పెంపకం కోసం 75,000 97,500 మొత్తం 4,50,000 5,85,000‘మల్బరీ’కి ప్రోత్సాహం పంట సాగుకు ‘సిల్క్ సమగ్ర పథకం’ రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం రాయితీలతో ప్రోత్సహిస్తున్నాంమల్బరీ సాగు, పట్టుపరిశ్రమ పెంపు కోసం రాయితీలతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. పత్తి, మిరప, వరి పంటలకు ప్రత్యామ్నాయ పంటగా మల్బరీ సాగు లాభదాయకంగా ఉంటుంది. సాగు కోసం రైతులు పట్టుపరిశ్రమ శాఖ అధికారులను సంప్రదించాలి. –ఏ. ముత్యాలు, పట్టుపరిశ్రమశాఖ ఉపసంచాలకుడు, మహబూబాబాద్ -
తాన్యశ్రీకి గిన్నిస్ బుక్‌లో చోటు
పాలకుర్తి : మండలంలోని ఎల్ల రాయని తొర్రూరుకు చెందిన చిన్నారి తాన్యశ్రీ కూచిపూడి నాట్యంలో అద్భుత ప్రతిభ కనబర్చి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకుంది. ఈ మేరకు ఆదివారం నిర్మల్ పట్టణ కేంద్రంలో స్వరూపిణీ నిత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో 2025 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సక్సెట్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 18 నెలల క్రితం కూచిపూడి నాట్యంలో ప్రతిభకనబర్చిన తాన్యశ్రీకి సర్టిఫికెట్లు, మోడల్స్ పంపిణీ చేశారు. దీంతో మాజీ ఎంపీటీసీ మడిపల్లి కౌసల్య, సోమయ్య, మాజీ సర్పంచ్ నాయిని మల్లారెడ్డి, మడిపల్లి దామోదర్, గ్రామస్తులు అభినందించారు. -
తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ద్రోహం
ఎల్కతుర్తి: ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అమలు చేయకుండా తెలంగాణ ప్రజానీకానికి కాంగ్రెస్ ప్ర భుత్వం ద్రోహం చేసిందని శాసనమండలి ప్రతి పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతం సదానందంతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ 14 ఏళ్ల ఉద్య మం తర్వాత పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అద్భుత పాలన అందించారన్నారు. దేశంలోనే తె లంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్‌గా నిలబెట్టారని వివరించారు. గడిచిన 16 మాసాల కాలం నుంచి కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. తె లంగాణ ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం కాంగ్రెస్ నైజమని దుయ్యబట్టారు. హు స్నాబాద్ నుంచి వస్తుంటే చెరువులన్నీ ఎండిపోయి ఉన్నాయని, సంవత్సరంన్నర క్రితం జలాశయాలన్నీ నీటితో కళకళలాడేవని గుర్తు చేశారు. ప్రపంచం మెచ్చుకునే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తాగు, సాగునీరు కష్టాలు లేకుండా చేసిన నేత కేసీఆర్ అని కొనియాడారు. ఇప్పుడు కాళేశ్వరం నీటిని వాడుకునే చిత్తశుద్ధి కాంగ్రెస్‌కు లేదన్నారు. ఇదిలా కొనసాగితే తెలంగాణలో కరువు, కాటకాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం కలుగుతుంటే ప్రజల తరఫున గొంతు విప్పడానికే కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారని చెప్పారు. అందుకే రాష్ట్రంలోని ప్రతీ ఇంటి నుంచి తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరా రు. అంతకు ముందు మునుగోడు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సభాస్థలిని పరిశీలించారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
విద్య మాఫియాను అడ్డుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: కార్పొరేట్ విద్య మాఫియాను అడ్డుకుని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయుల గొంతుకై నిలబడి వారి సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి కృషి చేస్తానన్నారు. పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి ప్రభుత్వానికి పలు సూచనలు చేసి విద్యా వ్యవస్థ పటిష్టానికి సహకరిస్తామన్నారు. ఏపార్టీకి అనుబంధంగా ఉండకుండా ఉపాధ్యాయ సంక్షేమమే ఎజెండాగా, ధ్యేయంగా పనిచేస్తానన్నారు. సీపీఎస్ రద్దు కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతానని, కాంట్రిబ్యూషన్తో నూతన హెల్త్‌కార్డులు, ప్రతీ సంవత్సరం మేలో బదిలీలు. పదోన్నతులు నిర్వహిస్తామన్నారు. కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాల, మోడల్ స్కూళ్లలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు టైంస్కేల్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశాల, ఉపాధ్యాయుల, ప్రభుత్వ అధ్యాపకులకు హెల్త్ కార్డులు అందిస్తామని, వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్, ఖమ్మం, హనుమకొండ, మానుకోట జిల్లా అధ్యక్షులు సంకా బద్రీనారాయణ, మిర్యాల సతీశ్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వైవీరావు, వివిధ సంఘాల అధ్యక్షులు వడ్డెబోయిన శ్రీనివాస్, శ్రీధర్‌రావు, యాకయ్య, రఫీ, నాగిరెడ్డి, ఏఐఎఫ్టీఓ ఉపాధ్యక్షులు గీత, పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు హల్యానాయక్, రాంజీనాయక్, చిట్టిబాబు, సుజాత, నాగరాజు, కనకయ్య, వెంకన్న, పూర్ణచందర్, సునీత, సంగీత, మమత, సుశీల తదితరులు పాల్గొన్నారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి -
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ ఆపాలి
● హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నెహ్రూసెంటర్ : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీ, గిరిజనులపై కొనసాగిస్తున్న దా డులు, హత్యాకాండను వెంటనే నిలిపివేయాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఏఐకేఎంఎస్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు రిటై ర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు టాన్యా మాట్లాడుతూ.. అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మధ్య భారతంలో మారణహోమం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అటవీప్రాంతంలోని ఆది వాసీలపై జరుగుతున్న దాడులు, హత్యలపై సు ప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించిన వారిని నిర్బంధిస్తూ, నక్సలైట్లుగా ముద్రవేసి ఆదివాసీ జాతి హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్య క్తం చేశారు. పరిశ్రమలు, పర్యాటక ప్రాంతాల పేరుతో అడవులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని వివరించారు. పీసాచట్టం–2006 అమలు చే యాలని, ఆదివాసీల జీవించే హక్కు, భూమి హ క్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకుడు ప్రసాద్, మదార్, సాయిలు, కొటమ్మ, వెంకటేశ్వర్లు, పొమ్మన్న, ఆనంద్, కె.భాస్కర్‌రెడ్డి, జీవన్, రాంచందర్, ఉపేందర్, రాంసింగ్, సురేందర్, ఉమ, అశోక్, ఐలయ్య, కృష్ణ, గౌడయ్య, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీలపై పెరిగిన దాడులు
హన్మకొండ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీలపై దాడులు, లైంగికదాడులు పెరిగాయని ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాళ్ అన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘బునియాదీ కార్యకర్త సమ్మేళన్’ రెండో రోజు శిక్షణ ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వనాథన్ పెరుమాళ్ మాట్లాడుతూ ఆదివాసులను వనవాసులుగా మార్చి తరతరాలుగా భూమి మీద ఉన్న హక్కులను తొలగించాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివాసీ సంస్కృతిని కలుషితం చేయడం కోసం మనువాద సంస్కృతిని రుద్దుతున్నారని ఆరోపించారు. ఆదివాసీల్లో నాయకత్వాన్ని పెంపొందించడానికి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ట్రైనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసులు ఆత్మగౌరవంతో బతుకడానికి కారణం కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగమేనన్నారు. ఈ రాజ్యాంగం లేకుండా చేసే కుట్రలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయన్నారు. ‘తెలంగాణలో ఆదివాసీ ఉద్యమాలు– ప్రత్యేక రాష్ట్రంలో ఆదివాసుల పాత్ర’ అనే అంశంపై తెలంగాణ ఉద్య మ నాయకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ‘భారత రాజ్యాంగం –ఆదివాసీ సంస్కృతి’ అనే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ రవి, ‘భారత రాజ్యాంగం, సామాజిక న్యాయం, ఆదివాసుల పాత్ర’ అనే అంశంపై కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ వెంకటనారాయణ, ‘భారత రాజ్యాంగం – ఆదివాసీ ఉద్యమాలు’ అనే అంశంపై తెలంగాణ ఉద్యమకారుడు ఇన్నయ్య, ‘భారత రాజ్యాంగం – కాంగ్రెస్ పార్టీ – ఆదివాసీల నాయకత్వం’ అనే అంశంపై ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ‘ఆదివాసీలు– కాంగ్రెస్ విధానాలు’ అనే అంశంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ‘ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ– కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు’ అనే అంశంపై డాక్టర్ రియాజ్ ప్రసంగించారు. కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, నాయకులు రాహుల్ బాల్, ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు, నాయకులు గుగులోత్ రవీందర్ నాయక్, రవళి, వినోద్ లోక్ నాయక్, తిరుపతి నాయక్, చంద్రకళ, తదితరులు పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరుమాళ్ -
సంగెంలో ఆదిమానవుల సమాధులు
సంగెం: వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి రెవెన్యూ శివారు బాలునాయక్‌తండాలో(బోడ బోల్లు) బోడగుట్టలపై పెద్ద రాతి యుగపు ఆదిమానవుల సమాధులను డిస్కవరీ బృందం సభ్యులు కూన ప్రతాప్, గుండా ఓంకార్ గుర్తించారు. ఈ మేరకు వారు ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సమాధులు క్రీ.పూ. 3500 నుంచి 1000 సంవత్సరాల నాటివని, ఈ రెండు గుట్టల మీద సుమారు 15 డోల్మన్ సమాధులు ఉన్నట్లు పేర్కొన్నారు. పాత మధ్యరాతి యుగాల్లో పెద్ద బండలను కదిలించలేని ఆదిమానవులు.. పెద్ద రాతి యుగానికి వచ్చే సరికి తెలివి , నైపుణ్యం మెరుగు పరుచుకుని పెద్ద రాళ్లను సైతం కదిలించి ఇలా సమాధులు సుస్థిరంగా ఉండేలా నిర్మించుకున్నారని తెలిపారు. నేటి ఆధునిక మానవులకు నాటి సమాధుల గురించి తెలియక గుట్టలతో పాటు సమాధులను సైతం ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. పాత రాతి యుగం, మధ్యరాతి యుగాల్లో ఆదిమానవులు కొండ గుహల్లో జీవించేవారని, కాల క్రమంలో కొండల నుంచి కిందకు దిగి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వివరించారు. ఈ బోడ గుట్ట కింద ఉన్న పాటిగడ్డ మీద నాటి పెద్ద రాతి యుగపు ఆదిమానవులు ఉపయోగించిన మృణ్మయ పత్రాలు, రాతి పనిముట్లు ఇప్పటికీ ఉన్నాయన్నారు. కాగా, కొన్ని సమాధులు ధ్వంసమై ఉన్నాయని, చరిత్ర కలిగిన సమాధులు, గుట్టలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వారు సూచించారు. డిస్కవరీ బృందం సభ్యులు కూన ప్రతాప్, గుండా ఓంకార్ -
పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ
మరిపెడ: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి భూక్య రవిరాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఫార్మసీస్టోర్, వ్యాక్సినేషన్ రూమ్, అటెండెన్స్ రిజిస్టర్, అవుట్ షేషెంట్, ఇన్ పేషెంట్ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ఎవరైనా వడదెబ్బ తగిలి ఆస్పత్రికి వస్తే వెంటనే ప్రథమ చికిత్స చేసి జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేయాలని సూచించారు. వడదెబ్బపై ప్రతీ గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. మందుల కొరత లేకుండా చూడాలని అన్నారు. ‘ఓపెన్’ పరీక్షలు ప్రారంభం మహబూబాబాద్ అర్బన్: ఓపెన్ ఇంటర్, పదో తరగతి పరీక్షలు ఆదివారం ప్రారంభమైనట్లు డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపా రు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్లో 422 మందికి 372 మంది విద్యార్థులు హాజరయ్యారని, పదిలో 558 మందికి 493 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారాన్నారు. ఎక్కడ ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ల బదిలీ కురవి/గార్ల/దంతాలపల్లి: జిల్లాలోని పలు మండలాల తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. సీరోలు తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఆర్.శారద గార్లకు బదిలీ అయ్యారు. సీరోలుకు తహసీల్దార్ ఎస్వీ నారాయణమూర్తి రానున్నారు. అలాగే కురవి తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న యు.సునీల్‌కుమార్‌ను దంతాలపల్లికి బదిలీ చేశారు. కురవికి గూడూరు తహసీల్దార్ ఎస్.శ్వేత బదిలీపై రానున్నారు. దంతాలపల్లి తహసీల్దార్ రాజేశ్వర్‌ను గూడూరుకు బదిలీ చేశారు. నేటి నుంచి రిఫ్రెషర్ కోర్సు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలనాశాస్త్రం, మానవ వనరుల నిర్వహణ శాస్త్ర విభాగంలోని పరిశోధకులకు రీసెర్చ్ మెథడాలజీపై ఈనెల 21 నుంచి రిఫ్రెషర్ కోర్సు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వారం రోజులపాటు చేపట్టే ఈ తరగతుల్లో విశేష పరిశోధన అనుభవం కలిగిన సీనియర్ ప్రొఫెసర్లతో బోధన ఉంటుందని, రీసెర్చ్ స్కాలర్స్ సద్వినియోగం చేసుకోవాలని ఆ విభాగం అధిపతి ఆచార్య పెదమళ్ల శ్రీనివాస్‌రావు ఒక ప్రకటనలో కోరారు. హేమాచలక్షేత్రంలో భక్తుల సందడి మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలో సహజసిద్ధంగా వెలిసిన పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు శేఖర్శర్మ, పవన్‌కుమార్, ఈశ్వర్‌చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. ఈ పూజలో పాల్గొన్న భక్తులు స్వామి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తుల పేరిట గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి దీవించారు. చట్టాల అమలులో నిర్లక్ష్యం వెంకటాపురం(కె): ఆదివాసీ చట్టాలను అమలు చేయటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి ఆరోపించారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఏజెన్సీ చట్టాలను గౌరవిస్తూ ఆదివాసీల ఆభివృద్ధికి పాటు పడాలన్నారు. ప్రభుత్వాలు మారిన పాలకులు మారిన ఆదివాసీల బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. -
సన్న బియ్యం.. జైకొట్టి
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం సరఫరా చేస్తోంది. గతంలో దొడ్డు బియ్యం పంపిణీ చేయడంతో అన్నం ముద్దగా ఉందని, తింటే అరగడం లేదని ఇబ్బంది పడిన పేదలు ఇప్పుడు సన్న బియ్యం అనగానే పోటీపడి మరీ తీసుకెళ్తున్నారు. దీంతో గత నెలతో పోలిస్తే ఈ నెల కోటా అధికంగా బియ్యం పంపిణీ చేసినట్లు అధి కారులు చెబుతున్నారు. అయితే గతంలో బియ్యం తీసుకెళ్లిన వారిలో ఎక్కువ మంది తినేవారు కాదు. ఇప్పుడు మాత్రం తినేందుకే తీసుకెళ్తున్నామని లబ్ధిదారులు చెప్పడం గమనార్హం. పోటాపోటీగా.. ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేయడంతో రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇలా జిల్లాలోని 556 రేషన్ షాపుల ద్వారా ఆహార భద్రతాకార్డులు, అంత్యోదయ, అన్నపూర్ణ మొత్తం 2,41,012 కార్డుల్లోని 7,03,550 మందికి నెలకు 4,511 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. మార్చి నెలలో 1,65,107 రేషన్ కార్డులపై 3,254 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేశారు. అంటే గత నెల 68.51శాతం లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకెళ్లారు. అదే ఏప్రిల్ నెలలో 4,602 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం రేషన్ షాపులకు సరఫరా చేయగా.. తెల్లరేషన్ కార్డులు ఉన్న 1,84,089 కుటుంబాలు 3,691మెట్రిక్ టన్నుల బియ్యం తీసుకెళ్లారు. అంటే ఈనెల 80.21శాతం బియ్యం పంపిణీ చేశారు. గత నెల కంటే ఈనెల 11.7శాతం అధికం సరఫరా చేశారు. బియ్యం వ్యాపారుల ఢీలా.. ప్రతీ నెల దొడ్డుబియ్యం రావడంతో పేదల వద్ద నుంచి కిలో రూ.7నుంచి రూ.10 వరకు కొనుగోలు చేసి రూ.14 రూపాయలకు పైగా కిలో చొప్పున పెద్ద వ్యాపారికి, రైస్ మిల్లుల యజమానులకు విక్రయించేవారు. వారు దొంగచాటున బస్తాలు మార్చి బీరు షాపులు, కోళ్ల పరిశ్రమ, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడం, కొందరు మిల్లర్లు ఈ బియ్యాన్నే సీఎంఆర్‌గా పెట్టి పట్టుబడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ నెల సన్నబియ్యం ఇవ్వడంతో బయట మార్కెట్లో కిలో రూ.50కి పైగా పలుకగా.. వీటిని అమ్ముకునేందుకు లబ్ధిదారులు ఎవరూ ముందుకు రావడంలేదు. నూకను వేరు చేసి వండుకోవడం, కొద్దిరోజులు మాగపెట్టి వండుకునేందుకు నిల్వ చేసుకుంటున్నారు. దీంతో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారులకు బియ్యం దొరకడం లేదు. అలాగే సాధారణ బియ్యం వ్యాపారుల సేల్స్ కూడా భారీగా తగ్గాయి. రేషన్ బియ్యం పంపిణీ ఇలా.. (మెట్రిక్ టన్నులు) నెల మొత్తం కార్డులు తీసుకున్న కార్డులు సరఫరా పంపిణీ శాతం మార్చి 2,41,012 1,65,107 4,511.62 3,254.64 68.51 ఏప్రిల్ 2,41,012 2,20,543 4,602.16 3,691.71 80.21అదనంగా 50 క్వింటాళ్లు పంపిణీ చేశా ప్రతీ నెల నాకోటా కింద 86 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తా. కొన్ని సార్లు బియ్యం తీసుకునేందుకు ఎక్కువ మంది రాకపోవడంతో 50 క్వింటాళ్లు కూడా పంపిణీ కాని సందర్భాలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలో నాకోటా పోగా అదనంగా 50 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేశా. సన్నబియ్యం కావడంతో పేదలు సంబురంగా తీసుకెళ్తున్నారు. –రామచందర్‌రావు, డీలర్, వెంకటేశ్వర బజార్, మహబూబాబాద్ మంచి స్పందన వచ్చింది ఏప్రిల్ నెలలో అన్ని రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేశాం. సన్న బియ్యం తీసుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా షాపుల వద్దకు వచ్చారు. జిల్లాలోని కార్డుదారులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ బియ్యం తీసుకున్నారు. పేదలు తినేందుకు అనువుగా బియ్యం ఉండడంతో అమ్ముకునేందుకు కూడా ముందుకు రారు. –ప్రేమ్ కుమార్, డీఎస్ఓ, మహబూబాబాద్తినేందుకే తీసుకెళ్లాం.. పోయిన నెల దొడ్డు బియ్యం ఇస్తే అవి వండాలంటే ఇబ్బంది పడేవాళ్లం. ముద్ద అన్నం, ఏ కూర వేసుకొని తిన్నా రుచీ పచీ ఉండేది కాదు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు. కారం ఏసుకొని తిన్నా రుచిగానే ఉంటుంది. అందుకోసమే సన్నబియ్యం ఇస్తున్నారు అని తెలియగానే తీసుకెళ్లాను. –కొమ్ము ఉప్పలమ్మ, చిన్నగూడూరు మరింత నాణ్యమైనవి సరఫరా చేయాలి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తే మంచిదే. కానీ ప్రస్తుతం ఇస్తున్న సన్న బియ్యంలో నూక ఎక్కువగా ఉంది. అన్నం వండితే ముద్ద అవుతుంది. మరింత నాణ్యమైన సన్నబియ్యం సరఫరా చేస్తే పేదలకు ఉపయోగ పడుతుంది. పాలిష్ ఎక్కువ పెట్టిన బియ్యం సరఫరా చేయడంతో అన్నం పగులుతుంది. వచ్చే నెల నుంచి మంచి బియ్యం ఇవ్వాలి. –తీగల రాజు, గుర్తూరు పోటీపడి తీసుకెళ్లిన లబ్ధిదారులు గత నెల కన్నా అధికంగా పంపిణీ హర్షం వ్యక్తం చేస్తున్న పేదలు -
సేవాలాల్ మార్గం అనుసరణీయం
మరిపెడ: సంత్ సేవాలాల్ మహరాజ్ సమాజానికి చేసిన సేవలు మరిచిపోలేనివని, ఆయన మార్గం అనుసరణీయమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ అన్నారు. ఆదివారం మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో డోర్నకల్ నియోజకవర్గస్థాయి సంత్ సేవాలాల్ భోగ్ భండారో కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మానుకోట, ఖమ్మం ఎంపీలు పోరిక బలరాంనాయక్, రామసహాయం రఘురాంరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. సాధు పూజారులు ముందుగా బెల్లం, బియ్యం, పప్పు, నెయ్యిని ఉపయోగించి తయారు చేసిన పదార్థాలను సంత్ సేవాలాల్‌కు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. బంజారా జాతిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప విప్లవ చైతన్యమూర్తి సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొనియాడారు. దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్తల్లో ఒకరని పేర్కొన్నారు. ముఖ్యంగా భోగ్ భండారో చేయడంలో గొప్ప శాసీ్త్రయత దాగి ఉందన్నారు. ఎంపీ బలరాంనాయక్ మాట్లాడుతూ.. బంజారాల జీవనం ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు, భాషను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. బంజారాలకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి బంజారులు కృషి చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ దేశిరాంనాయక్, జిల్లా నాయకులు వంటికొమ్ము యుగేందర్‌రెడ్డి, నూలక అభివన్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు రఘువీరరెడ్డి, అంబటి వీరభద్రం, భట్టునాయక్, మారబోయిన వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు తాజుద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవినాయక్, మానుకోట మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్‌నాయక్, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ ఘనంగా సంత్ సేవాలాల్ మహరాజ్ భోగ్ భండారో హాజరైన ఎంపీలు బలరాంనాయక్, రఘురాంరెడ్డి -
నగదు బదిలీ చేస్తేనే మేలు..
ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి బదులుగా సొసైటీలకు నగదు బదిలీ చేస్తే నాణ్యతతో కూడిన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. ప్రభుత్వం అందించే చేప పిల్లలు చిన్న సైజులో, కొంత నాసిరకంగా ఉండటంతో బరువు పెరగక పోవడంతో దిగుబడి తగ్గుతున్నది. చిన్న పిల్లలను పెద్ద చేపలు తినడంతో మరింత నష్టం తప్పడం లేదు. నగదు బదిలీతో చేపల పంపిణీ కార్యక్రమం నడిపిస్తే.. నాణ్యమైన, కాస్త పెద్ద సైజు పిల్లలను కొనుగోలు చేసుకుంటాం. – నీల సోమన్న, మత్స్యసొసైటీ చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్ -
వేసవి శిక్షణ శిబిరాలేవి?
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా క్రీడలకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడి నుంచి వందలాది మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఈక్రమంలో అనేక మంది క్రీడాకారులు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న జిల్లాలో ఇప్పటి వరకు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణపై ఎలాంటి కదలిక లేదు. మరో రెండు రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. దీంతో చిన్నారులు సొంత ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్తున్నారు.. మరికొందరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికై నా శిబిరాలు ఏర్పాటు చేస్తే పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని క్రీడాభిమానులు కోరుతున్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఎదుగుదల.. క్రీడలు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతాయి. క్రీడలతో ఎముకలు, కండరాల పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, వయసుకు తగ్గ పెరుగుదల ఉంటుంది. అలాగే మెదడు, గుండె చక్కగా పని చేస్తాయి. కాగా ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పిల్లలు పాఠశాలలు ఉన్నప్పుడు తరగతి గదులకే పరిమితమవుతున్నారు. చాలా తక్కువ మంది క్రీడలు ఆడుతున్నారు. ఇలాంటి వారికి సమ్మర్ శిక్షణ శిబిరాలు ఉపయుక్తంగా మారుతాయి. సమ్మర్ క్యాంప్‌లో క్రీడలు.. మున్సిపల్ పరిధిలోని సమ్మర్ క్యాంప్‌లో బాస్కె ట్‌బాల్, తైక్వాండో, క్రికెట్, అథ్లెటిక్స్, హాకీ, స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ తదితర క్రీడలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, సాఫ్ట్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ క్రీడలు నిర్వహిస్తారు. పిల్లలకు మెరుగైన శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మానుకోట పేరును నిలబెట్టే అవకాశం ఉంది. క్రీడా శిబిరాల ఏర్పాటులో నిర్లక్ష్యం సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్తున్న చిన్నారులు జిల్లాలో సమ్మర్ క్యాంపులపై నోరుమెదపని అధికారులు -
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
● ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత పెరిగిందని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లా ఇన్చార్జ్, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అందరిని సమన్వయం చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, అధిష్టానం ఆదేశాలు పాటించడం లేదన్నారు. నాయకులు, కార్యకర్తలతో సమన్వయంతో ఉంటేనే స్థానిక ఎన్నికల్లో గెలుస్తామన్నారు. వరంగల్‌లో నిర్వహించే రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ నుంచి రెండు లక్షలకు తగ్గకుండా సభకు హాజరవుతున్నారన్నారు. ఇప్పటికై నా మాజీ మంత్రి అందరూ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులను కలుపుకుని రజతోత్సవ సభ విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోనే అన్ని సమావేశాలు నిర్వహించాలని కోరారు. ము న్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, మాజీ కౌన్సిలర్ ఎడ్ల వేణు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి ఉన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
వెంకటాపురం(కె) : మండల పరిధిలోని దానవాయిపేట గ్రామానికి చెందిన దంపతులు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. గ్రామస్తుల కథనం ప్రకారం దానవాయిపేటకు చెందిన భార్యభర్తలు ఇందు, రవి ఐదు రోజులుగా గొడవ పడుతున్నారు. కాగా శనివారం ఉదయం ఇద్దరు గొడవకు దిగడంతో భర్త రవి బయటకు వెళ్లిపోయాడు. భర్త బయటికి వెళ్లిన క్రమంలో భార్య ఇందు ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి అత్మహత్యా యత్నానికి పాల్పడింది. బయటికి వెళ్లిన భర్త రవి ఇంటికి రాగానే భార్య ఇందు పురుగుల మందు తాగిందనే విషయం తెలుసుకొని అతను కూడా పురుగుల మందు తాగి అత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంకటాపురం వైద్యశాలకు తరలించి చిక్సిత అందజేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్యభర్తలు ఆత్మహత్య చేసుకోవడానికి గల పూర్తి కారణాలు తెలియదు. టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం ● ధ్వంసమైన టోల్ క్యాబిన్.. సిబ్బందికి గాయాలు ● పోలీసుల అదుపులో లారీ డ్రైవర్రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాతీయ రహదారిపై కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద శనివారం లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ సరాసరి టోల్‌ప్లాజా క్యాబిన్లో దూసుకెళ్లాడు. దీంతో క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు అందులో ఉన్న సిబ్బంది ఒకరు గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌కు చెందిన లారీ డ్రైవర్ మక్కల శంకర్ హైదరాబాద్ నుంచి లారీతో హనుమకొండకు వెళ్తున్నాడు. మద్యం మత్తులో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ కోమళ్ల టోల్‌ప్లాజా వద్ద రెండో నంబర్ క్యాబిన్లోకి లారీతో దూసుకెళ్లగా, క్యాబిన్ ధ్వంసమైంది. విధులు నిర్వహిస్తున్న టోల్ సిబ్బంది బండి శ్రీనాథ్‌గౌడ్ గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న మరో కారును ఢీకొట్టగా దెబ్బతింది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ శంకర్‌కు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్ష చేయగా మద్యం తాగినట్లు తేలిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి. నరేష్ తెలిపారు. -
రెజోనెన్స్ విజయకేతనం
హన్మకొండ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో వరంగల్‌లోని రెజోనెన్స్ కళాశాల విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. అద్భుత ఫలితాలతో నంబర్–1 కోచింగ్ తమ కళాశాల నిలిచిందని వరంగల్ రెజోనెన్స్ కళాశాలల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి తెలిపారు. కళాశాలలకు చెందిన 11 మంది విద్యార్థులు 99పైగా పర్సంటైల్ సాధించగా, 64 మంది 95 పైగా, 161 మంది 90కి పైగా పర్సంటైల్ సాధించి అత్యున్నత ఫలితాలు సాధించారని వివరించారు. జాతీయ స్థాయిలో 13, 236, 306, 949, 988 ర్యాంకులు కై వసం చేసుకున్నారని తెలిపారు. ఎ.నంది 100 పర్సంటైల్, ఎం.చరణ్ తేజ 99.89, సీహెచ్. సాయిదత్తు 99.77, బి.శ్రీహర్ష 99.69, బి.వెంకట్ జశ్వంత్ 99.66, జి.అనిరుద్ 99.64, ఎండీ రహమాన్ 99.58, కే.శిత్తిజ్ 99.56, వి.సాయి కౌశిక్ 99.48, వి.వి.ఫణి హర్షిత్ 99,26, వి.రాజశేఖర్ 99.25 పర్సంటైల్ సాధించారని వివరించారు. హనుమకొండలోని రెజోనెన్స్ కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులను అభినందించారు. చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అలుపెరగని కృషి, తల్లిదండ్రుల సహకారం, అత్యుత్తమ బోధనతో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సీ.ఏ.ఓ లెక్కల రమ్య రెడ్డి, అకడమిక్ డీన్ బీ.ఎస్.గోపాలరావు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
‘జేఈఈ మెయిన్స్’ ఆణిముత్యాలు
జేఈఈలో ఇరువురికి ర్యాంకులు భూపాలపల్లి అర్బన్ : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. పట్టణానికి చెందిన తాళ్ల నిహారిక ఆల్ ఇండియా 15,625 ర్యాంక్, (93 పర్సంటైల్) సాధించగా, గుగులోత్ జ్ఞానేశ్వర్ 72వేల ర్యాంకు, (95 పర్సంటైల్) సాధించారు.దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. మే లో జరిగే అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత పొందారు. ఈ క్రమంలో జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాలను శుక్రవారం రాత్రి పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అర్హత పొందిన విద్యార్థుల వివరాలు..మాణిక్యాలు.. మానుకోట విద్యార్థులుమహబూబాబాద్ అర్బన్ : జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో మానుకోటకు చెందిన ఉమ్మగాని మధు–కృష్ణవేణి కుమారుడు విశిస్ట్ గౌడ్ ఆల్ ఇండియా 7, 300 ర్యాంక్ సాధించాడు. జేఈఈలో విశిస్ట్ మంచి ర్యాంక్ రావడంతో మార్గదర్శి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమ్మగాని అరుణ్‌కుమార్, బంధుమిత్రులు హార్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ప్రభుత్వ చీఫ్ ఇంజనీయర్గా ఉద్యోగ సాధిస్తానని విశిస్ట్ వివరించాడు. మానుకోటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బ్రాహ్మణపల్లి శ్రీనివాస్–సువర్ణ దంపతుల కుమారుడు హనీష్ జేఈఈ ఫలితాల్లో ఆల్ ఇండియా 3,553 ర్యాంక్ సాధించాడు. భవిష్యత్‌లో ఐఐటీ కంప్యూటర్ సైన్స్‌లో సీటు సాధించి, సాఫ్ట్వేర్ ఇంజనీయర్ కావాలని, విదేశాలలో ఉద్యోగం చేయాలని హనీష్ తెలిపాడు.సత్తా చాటిన సాగర్రఘునాథపల్లి : మండలంలోని వెల్ది మోడల్ స్కూల్/కళాశాల విద్యార్థి మనుపాటి సాగర్ జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ సాధించాడు. మండల కేంద్రానికి చెందిన మనుపాటి ఎల్లయ్య–శారద కుమారుడు సాగర్ జాతీయస్థాయిలో 7,626 ర్యాంకు సాధించి, జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించాడు. శనివారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పి.శ్రీధర్‌తో పాటు తల్లిదండ్రులు సాగర్‌ను అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్, మల్లం శ్రీధర్, రాజు, మోహన్‌రావు, శ్రీను, రవి, సౌజన్య, ప్రియ, రుద్రమదేవి, విజయ, శశికుమారి తదితరులు పాల్గొన్నారు.మెరిసిన ‘ఏకలవ్యులు’.. కురవి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రిన్సిపాల్ లాలు శనివారం తెలిపారు. కళాశాలకు చెందిన బి.వినీత (85.65), బి.దీపిక (59.46), జి.సోనియా (57.84), బి.సింధు (54.93), కె.ప్రియదర్శిని(52.37) పర్సంటైల్‌తో జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అర్హత సాధించారు.అర్జున్ అత్యుత్తమ ప్రతిభ దేవరుప్పుల : జేఈఈ మెయిన్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన బిట్ల అర్జున్ 16,816 ర్యాంకు (97.07 పర్సంటైల్) సాధించాడు. మండల కేంద్రంలోని బాలయేసు ఇంగ్లిషు మీడియం హైస్కూల్లో తొమ్మిది వరకు, ఆపై హైదరాబాద్‌లో చదివాడు. నిట్‌లో అనుకున్న సీటు లభిస్తుందని అర్జున్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
పేలుడు పదార్థాల స్వాధీనం
స్టేషన్‌ఘన్‌పూర్ : మండలంలోని నమిలిగొండ గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన కథనం ప్రకారం.. నమిలిగొండకు చెందిన బోసు బుచ్చమ్మ ఇంట్లో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి దాడి చేశారు. అదే సమయంలోనే అక్కడికి అనుమానాస్పదంగా వచ్చిన ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలకు చెందిన ఓర్సు రమేశ్ ఆటోలో తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆటోతో పాటు బుచ్చమ్మ ఇంట్లో ఉన్న పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్స్, 55 కిలోల అమ్మోనియం నైట్రేట్ (పేలుడు పదార్థం), పేలుడుకు ఉపయోగించే ఫ్యూజులు, బత్తుల బెండలు 2, ఆటో, స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన బోసు బుచ్చమ్మ, ఓర్సు రమేశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్, ఘన్పూర్ ఎస్సై వినయ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ‘భూభారతి’తో రైతు సమస్యలు దూరం హన్మకొండ : భూ భారతి చట్టంతో రైతుల సమస్యలు దూరమవుతాయని, ఇక నుంచి రైతులు తమ భూ సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండమల్లి రవి పేర్కొన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి 10,954 మంది గ్రామ పాలన అధికారులను తీసుకుంటున్న క్రమంలో ముందుగా జీఓ 129కి సవరణ చేసి పూర్వ గ్రామ రెవెన్యూ అధికారులను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలిపారు. వారి పూర్వ సర్వీసును పరిగణనలోకి తీసుకొని వారికి పదోన్నతి కల్పించాలని కోరారు. అర్హులైన వారిని గ్రామ రెవెన్యూ సహాయకులను నియమించి వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. -
జేఈఈలో మెరిసిన ఎస్ఆర్ విద్యార్థులు
విద్యారణ్యపురి : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. జాతీయ స్థాయిలో వి.నాగసిద్ధార్ధ 5వ ర్యాంకు, పాటిల్సాక్షి 48వ ర్యాంకు, ఎం.అరుణ్ 60వ ర్యాంకు, ఎం.రవిచంద్రారెడ్డి 65వ ర్యాంకు సాధంచినట్లు ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్‌రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. వై.భరణి శంకర్ 88వ ర్యాంకు, బాదావత్ సురేష్ 98, దాసరి ఫణీంద్ర 116, మోదెల్లా వెంకట కౌసిక్ 141, ఈర్ల బిందుశ్రీ 142, గుట్ట దిలీప్‌రెడ్డి 190, భూక్య వినోద్ 246, సీహెచ్ షణ్ముఖ సాయి 274, బి.ధనషన్ముఖ శ్రీ 410, కాగితపు దీపక్ 491, పుత్తూరు ఉజ్వల్ 509వ ర్యాంకు సాధించారని వారు వివరించారు. మే 18న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ కు ఇప్పటివరకు 3,556 మందికి పైగా విద్యార్థులు ప్రవేశానికి అర్హత సాధించారని రాష్ట్రంలో ఎస్ఆర్ విజయపథాన్ని ఎగురవేశారని వారు తెలిపారు. ఓపెన్, అన్ని కేటగిరీలు కలిపి జాతీయస్థాయిలో 528, 567, 584, 647, 687, 707, 726, 740, 777, 826, 844, 969 ర్యాంకులను విద్యార్థులు సొంతం చేసుకున్నట్లు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరింత అత్యుత్తమైన మార్కులు సాధించేలా తీర్చిదిద్దుతామని వారు ఆశాభావాన్ని వ్యక్తపర్చారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికి స్ఫూర్తిదాయకం కావాలని వారు ఆకాంక్షించారు. -
మతతత్వ పార్టీని అడ్డుకునేది కాంగ్రెస్సే
దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హన్మకొండ : మతతత్వ పార్టీ ఆగడాలను అడ్డుకునే శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హరిత కాకతీయ హోటల్లోమూడ్రోజుల పాటు జరిగే బునియాదీ కార్యకర్త సమ్మేళన్ శిక్షణ కార్యక్రమాన్ని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, విప్ రాంచందర్ నాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, మురళీ నాయక్ జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కొండా సురేఖ పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల గణన చేసి దేశానికి మార్గదర్శిగా నిలిచిందన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ శిక్షణ తరగతులు మూడు దశల్లో జరుగుతున్నాయన్నారు. ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలు ఏకమైతేనే బీజేపీని తరిమికొట్టగలుగుతామన్నారు. మూడ్రోజుల పాటు జరిగే ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ..మణిపూర్ మారణహోమంపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదప లేదని విమర్శించారు. ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి, ఏఐసీసీ శిక్షణ తరగతుల కన్వీనర్ రాహుల్ బాలే, శిక్షణ తరగతుల ఇన్‌చార్జ్‌లు చంద్రకళ, గుగులోత్ రవీందర్‌నాయక్, నాయకులు రవళి, అనిల్, రాజేష్ నాయక్ పాల్గొన్నారు. -
రజతోత్సవ సభనుంచే కాంగ్రెస్ పతనం
ఎల్కతుర్తి : రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీ పతనం రజతోత్సవ సభ నుంచే ప్రారంభం కాబోతుందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీష్‌కుమార్, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న తదితరులతో కలిసి సభా స్థలిని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. ఏడాదిన్నర కాలంలోనే దుర్మార్గంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదని ఆయన విమర్శించారు. ఏడాదిన్నర తిరగక ముందే కాంగ్రెస్‌కు ప్రజలే తద్దినం పెట్టే రోజులు దగ్గర పడ్డాయని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. రజతోత్సవ సభ ప్రభుత్వ వ్యతిరేక సభగా మారనుందని తెలిపారు. గతంలో వరంగల్‌లో నిర్వహించిన సభలు రికార్డులు సృష్టించిన చరిత్ర కేసీఆర్‌కే దక్కిందని, అదే తరహాలో ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ రికార్డు సృష్టించబోతుందన్నారు. కేసీఆర్ మాటలు వినాలే..కేసీఆర్‌ను చూడాలని ప్రజలు కుతూహలంతో ఎదురుచూస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఈ సభద్వారా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అంతకు ముందు మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి -
పుష్కరాలకు జాయ్‌రైడ్స్
కాళేశ్వరం : జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీవరకు జరిగే సరస్వతి నది పుష్కరాలను హెలికాప్టర్ల ద్వారా భక్తులు వీక్షించేందుకు టిక్కెట్ తీసుకొని ఏవియేషన్ శాఖ ప్రభుత్వం జాయ్‌రైడ్స్ ఏర్పాటు చేసింది. కానీ పుష్కరాలకు రోజులు దగ్గర పడుతుండడంతో జాయ్రైడ్స్పై సందిగ్ధత ఏర్పడినట్లు తెలిసింది. పుష్కరాలకు ప్రభుత్వం రూ.25కోట్ల నిధులు మంజూరు చేసి అభివృద్ధి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. అధికారులు కూడా హెలికాప్టర్లు తిరగడంపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. కాగా, కాళేశ్వరం నుంచి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లి గ్రామ శివారు వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీపంపుహౌజ్కు సంబంధించిన మూడు హెలిపాడ్లు శాశ్వతంగా నిర్మాణం చేసి ఉన్నాయి. భక్తులు 12 రోజుల పాటు ఈ మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి హెలికాప్టర్ సేవలు వినియోగించుకుంటారా! లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం సమీపంలోనే హెలిపాడ్లు సిద్ధం చేస్తే జాయ్‌రైడ్స్‌కు భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. గోదావరి పొడవునా.. ఈ జాయ్‌రైడ్స్‌తో హెలికాప్టర్‌తో 10–15 నిమిషాలతో అన్నారం బరాజ్ టు మేడిగడ్డ బరాజ్ వరకు గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నది పొడవునా విహాంగ వీక్షణం చేయడానికి వీలు కల్పిస్తారు. ఇదే విషయంపై కాళేశ్వరం దేవస్థానం ఈఓ శనిగెల మహేష్‌ను సంప్రదించగా.. మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో ఏవియేషన్ శాఖ ద్వారా జాయ్‌రైడ్స్ కోసం ఏర్పాట్లు జరుగుతుందని, మూడు హెలిపాడ్లు కన్నెపల్లి వద్ద సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సిద్ధంగా మూడు హెలిపాడ్లు అన్నారం టు మేడిగడ్డకు విహాంగ వీక్షణం -
రైతులకు సహకరించాలి
మహబూబాబాద్ రూరల్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి అన్నారు. మహబూ బాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రా మంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించి, మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని, టార్పాలిన్లు, గన్ని సంచులు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటనే పడే విధంగా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీఎస్ఓ ప్రేమ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి ణి కృష్ణవేణి, తదితరులు ఉన్నారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీకోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీ ఒకేషనల్, బీసీఏ తదితర కోర్సుల 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్షలు (బ్యాక్లాగ్) ఈనెల 21నుంచి జరగాల్సిండగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శనివారం తెలిపారు. ఎక్కువశాతం ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల పరీక్షల ఫీజులు యూనివర్సిటీకి చెల్లించలేదు. అదేవిధంగా నామినల్ రోల్స్‌ను కూడా పంపలేదు. దీంతో ఆయా పరీక్షలను వాయిదా వేశామని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ తెలిపారు. ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని, నిర్వహణ రీషెడ్యూ ల్ కూడా విడుదల చేస్తామని వెల్లడించారు. దరఖాస్తుల ఆహ్వానంమహబూబాబాద్ అర్బన్: 2025–26 విద్యా సంవత్సరానికి ఉత్తమ కళాశాలలను ఎంపిక చేసేందుకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యుల్ట్ కులాల అభివృద్ధి అధికారి నర్సింహరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న కళాశాలల ఫీజు, బుక్స్, హాస్టల్ వసతి, భోజనం, ఇతర అవసరాలకు ప్రతి విద్యార్థికి రూ.35 వేల చొప్పున చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. పాకెట్ మనీకి ప్రతి విద్యార్థికి రూ.3,000 చొప్పున అందిస్తారని తెలిపారు. దీంతోపాటు ఎంసెట్ కోచింగ్ ఫ్రీగా ఉంటుందని తెలిపారు. దరఖాస్తులను epass.telangana.gov.in వెబ్సైట్ లో ఈ నెల 30 వరకు సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని జిల్లా ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కేసముద్రానికి ఫైర్‌స్టేషన్ మంజూరుకేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రానికి ఫైర్‌స్టేషన్ మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫైర్ స్టేషన్లో పనిచేసేందుకు 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు జీఓలో పేర్కొన్నారు. పారిశ్రామిక కేంద్రంగా ఉన్న కేసముద్రంలో ఫైర్స్టేషన్ను ఏర్పాటు చేయాలని అనేక పర్యాయాలు ఇక్కడి వ్యాపారులు, ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫైర్స్టేషన్ను మంజూరు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేట పరికరాల స్వాధీనం ఏటూరునాగారం: మండలంలోని రాయబంధం, ఐలాపురం, మల్యాల, కొమురంభీం నగర్, రేగులగూడెం 1, 2, మల్యాల, షాపెల్లి, చింతలపాడు గొత్తికోయగూడాల్లో అటవీశాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురి వద్ద నుంచి పెద్దఎత్తున ఇనుప తీగలు, ఉచ్చులు, బాణాలు, విల్లంబులు, వేటకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్ఆర్ఓ అబ్దుల్ రెహమాన్ విలేకర్లతో మాట్లాడారు. అడవుల్లో కొంతమంది వేటగాళ్లు అటవీ జంతువులను కృరంగా వేటాడడం మానుకొని అటవీశాఖ కల్పించే ఉపాధిని పొందాలన్నారు. అటవీ జంతువులను వేటాడితే అన్ని రకాల ప్ర భుత్వ ధృవీకరణ పత్రాలు, ఆధారాలను రద్దు చేయిస్తామన్నారు. ఇప్పటికై నా వన్యప్రాణుల వేటను మానుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ ప్రహ్లాద్, నారాయణ, దయానంద్, రాజేష్, జ్యోతి, భూష, సుమలత, అశ్విని, బేస్‌క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబాబాద్ అర్బన్/డోర్నకల్: ఇచ్చిన హామీ లను నెరవేర్చలేని అసమర్థత సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 15నెలలు గడుస్తున్నా పాలనపై పట్టు రావడం లేదన్నారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో జరి గే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, మహిళలు, యువకులు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, నాయకులు గద్దె రవి, అశోక్, రాజు, రంజిత్, కిషన్, వెంకన్న, ఎలేందర్, దాము, మహబూబ్ పాషా పాల్గొన్నారు. విజయవంతం చేయండి కొత్తగూడ: బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ములుగు మాజీ జెడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బడే నాగజ్యోతి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం బహిరంగ సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాయకులు కొమ్మనబోయిన వేణు, బానోతు నెహ్రూ, దేశిడి శ్రీనివాస్ రెడ్డి, భూపతి తిరుపతి, మోకాళ్ల సంతోషరాణి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీ.ఎస్. చౌహాన్‌తో కలిసి శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు, సన్న బియ్యం పంపిణీ, తాగునీటి సరఫరా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మే మొదటి వారం నుంచి వరికోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా అర్హతగల ప్రతి లబ్ధిదారుడికి బియ్యం సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నల్లా కనెక్షన్ లేనిప్రాంతాలకు వాటర్ ట్యాంకులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.వీరభ్రహ్మచారి, డీఆర్డీఓ మధుసూదనరాజు, జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, విజయ నిర్మల, కృష్ణారెడ్డి, హరిప్రసాద్, సురేష్, మరియన్న, ప్రేమ్‌కుమార్, పాల్గొన్నారు. ఆకాంక్ష బ్లాకుల అభివృద్ధికి సహకరించాలి దేశంలోని ఆకాంక్ష ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకింగ్‌లో జిల్లాలోని గంగారం మండలం దేశంలో మొదటిస్థానం సాధించిందని, అందుకు కృషి చేసిన అధికారులను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అభినందించారు. ఈమేరకు కలెక్టర్‌లో శనివారం జిల్లా అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పథకం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అభివృద్ధి భాగస్వాములతో ప్రారంభించబడిందన్నారు. వెనుకబడిన బ్లాకులలో జీవన ప్రమాణాలు మెరుగుపరచడం లక్ష్యంగా ఆకాంక్ష బ్లాకుల కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ సామాన్యులకు అందుబాటులో ‘భూ భారతి’ చిన్నగూడూరు: సామాన్యులకు అందుబాటులో సేవలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. శనివారం మండలంలోని ఉగ్గంపల్లి రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. భూ భారతి పోర్టల్ ద్వారా క్షేత్రస్థాయిలో భూ సమస్యలను పరిష్కరింవచ్చన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి మాట్లాడుతూ.. నూతన చట్టం ద్వారా సమస్య సులభంగా పరిష్కారమవుతుందన్నారు. రైతులు కృష్ణారెడ్డి, వెంకన్న సందే హాలకు కలెక్టర్, అదనపు కలెక్టర్ సమాధానాలు, పరిష్కార మార్గాలు వివరించారు. సదస్సులో భా గంగా రెవెన్యూ డివిజినల్ అధికారి గణేష్ భూ భారతి కొత్త ఆర్వోఆర్ చట్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో రైతులకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. డీఎస్ఓ ప్రేమ్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారిని కృష్ణవేణి, తహసీల్దార్ మహబూబ్ అలీ పాల్గొన్నారు. -
సోమేశ్వరాలయంలో హైకోర్టు జడ్జి పూజలు
పాలకుర్తి టౌన్: సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూలకంటి అనిల్‌కుమార్ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చరిత్రను అడిగి తెలుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తికి అర్చకులు స్వామి వారి శేషవస్తాలతో సన్మానించి, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. బసవ పురాణం గ్రంథకర్త పాల్కురికి సోమనాథుడు జన్మించిన ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ రవీంద్రశర్మ, అడిషన్ జడ్జి సందీప, ఆర్డీఓ డీఎస్ వెంకన్న, ఏసీపీ అంబటి నర్సయ్య, తహసీల్దార్ నాగేశ్వరచారి, ఆలయ ఈఓ సల్వాది మోహన్‌బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్ శర్మ, అనిల్‌కుమర్, నాగరాజు, సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్సై పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆర్మీలో చేరాలనుంది..
కబడ్డీ రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచా. హనుమకొండ జేఎన్ఎస్లో పలుమార్లు శిక్షణ తీసుకున్నా. ఈశిక్షణతో కబడ్డీలో విజేతగా నిలిచా. నాకు ఆర్మీలో ఉద్యోగం పొందాలని ఉంది. సమయాన్ని వృథా చేయకుండా సెలవుల్లో పుస్తకపఠనం చేస్తా. – ఇట్టబోయిన గణేశ్, విద్యార్థి, వేలేరు పలు రంగాల్లో అవగాహన కల్పించాలి.. పిల్లలకు చదువుతోపాటు పలు రంగాల్లో ఆసక్తి కలిగేలా అవగాహన కలిగించి ప్రోత్సహించాలి. నాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. వారిని రామకృష్ణ మఠంలో బాలసంస్కార్ క్లాస్‌కు పంపిస్తాను. విలువిద్య, స్విమ్మింగ్ నేర్పిస్తున్నా. – చింత శ్యాంసుందర్, హనుమకొండ కంప్యూటర్ క్లాస్‌లకు పంపిస్తా.. నాకు ఒక కుమారుడు అజయ్, కుమార్తె నిక్షిత ఉన్నారు. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. కూతురు ఆరవ తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవుల్లో కూతురును కంప్యూటర్ క్లాస్‌కు పంపించాలనుకుంటున్నాం. ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి ఫీజులు మాట్లాడి వచ్చాం. సెలవుల్లో ఏదో ఒకటి నేర్పించాలని ఇలా చేస్తున్నాం. – మేకల సంధ్య, రమేష్ దంపతులు అవనగల్, మహబూబాబాద్ -
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– IIలోuపుస్తకాలతో కుస్తీ పడిన చిన్నారులకు రిలీఫ్ దొరికినట్లయ్యింది. ఇన్నాళ్లు బండెడు బుక్స్‌ను మోసిన ఆ చిన్ని భుజాలకు కాస్తంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే పలు ప్రైవేట్ స్కూళ్లు వేసవి సెలవులు ఇచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లు మాత్రం ఈ నెల 24 నుంచి సెలవులు ప్రకటించాయి. స్పెషల్ క్లాసులు, ట్యూషన్లు, హోంవర్క్‌లు, బైహాట్లు ఇప్పుడివేమీ లేవు. అలాగని ఈ సెలవుల్లో వాళ్లేం ఖాళీగా ఉండరు. ఫోన్ చూడడమో, లేక టీవీకి అతుక్కుపోవడమో చేస్తుంటారు. ఈ సెలవుల్ని వినియోగించుకుంటే భవితకు పునాది వేసుకోవచ్చు. వారికి ఇష్టమైన క్రీడలు, నాట్యం, ఆత్మరక్షణ విద్య, స్విమ్మింగ్, ఇతర రంగాలను తెలుసుకుని ప్రోత్సహించాలి. పిల్లల్ని ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. అప్పుడే వారిలో మానసికోల్లాసంతోపాటు శారీరక దృఢత్వం అలవడుతుంది. సెలవుల్ని ఎలా వినియోగించుకోవాలనేదే ఈ వారం ‘సాక్షి’ ప్రత్యేకం. – హన్మకొండ కల్చరల్పర్యాటక ప్రాంతాల సందర్శన ఓరుగల్లు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం. వేసవిలో ఆహ్లాదం, ఆనందం కోసం తల్లిదండ్రులు పిల్ల లను ఉమ్మడి జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని జూపార్కు, సైన్స్‌సెంటర్, వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, రామప్ప, లక్నవరం, పాకాల సరస్సు ఖిలా వరంగల్కోట తదితర ప్రదేశాలను సందర్శించవచ్చు. సజీవంగా నిలిచిపోయే కళ చిత్రలేఖనం. ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆర్టిస్టులు ఉచితంగా చిత్రలేఖనాన్ని నేర్పిస్తున్నారు. కొంత మంది నిర్ణీత రుసుముతో బొమ్మలు గీయడం నేర్పిస్తున్నారు. మరికొంత మంది ఆన్లైన్ క్లాసుల ద్వారా విద్యార్థులను బొమ్మలు గీయడంలో నేర్పరులుగా మారుస్తున్నారు. కాగా.. వరంగల్ కాపువాడకు చెందిన చిత్రకళలో డాక్టరేట్ సాధించిన యాకయ్య విద్యార్థులకు చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని లైబ్రరీలు విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. శాస్త్ర, సాంకేతిక, కథలు, కవితలు, అన్నిరకాల పోటీ పరీక్షల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా మేధను పెంచుకునేందుకు ఇవి చక్కటి సోపానాలు. ఉన్నత స్థానంలో ఉన్న వారంతా పుస్తకాల పురుగులే. నగరవాసులు అయితే వరంగల్, హనుమకొండలోని సెంట్రల్ లైబ్రరీలకు పిల్లలను ఎంచక్కా పంపొచ్చు. నృత్య, సంగీత శిక్షణతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వరంగల్‌కు చెందిన నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ గురువు రంజిత్ ఆధ్వర్యంలో ఈనెల 24వ తేదీ నుంచి పేరిణి నాట్య కళాపరిచయం పేరిట 45 రోజులు నిర్వహించే శిక్షణ శిబిరాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ప్రాయోగిక, ప్రాథమిక స్థాయి శిక్షణతో పాటు ప్రశంస పత్రం అందజేస్తారు. అంతేకాకుండా హనుమకొండకు చెందిన శ్రీశివానంద నృత్యమాల నాట్యాచార్యులు బొంపల్లి సుధీర్‌రావు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నాట్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి.న్యూస్రీల్క్రీడల్లో శిక్షణ..పిల్లలు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలిసజీవ కళ చిత్రలేఖనం.. వారికి ఇష్టమైన కళలు, ఆటల్లో శిక్షణ ఇప్పించాలి.. సెల్‌ఫోన్‌ను దూరం పెట్టాలి.. పుస్తకాల్ని చేరువ చేయాలి ఆ బాధ్యత తల్లిదండ్రులదే.. పుస్తక పఠనం..భగవద్గీత శ్లోక శిక్షణ.. సామాజిక సేవ -
ఉపాధ్యాయుల కృషితోనే పాఠశాలలకు గుర్తింపు
డోర్నకల్: ఉపాధ్యాయుల కృషితోనే పాఠశాలలకు గుర్తింపు వస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. సీరోలు మండలం మన్నెగూడెం జెడ్పీహెచ్ఎస్లో శనివారం ‘ది లిటరరీ లాంథర్ ఇన్ ది వండర్ లాండ్’ పేరుతో ముద్రించిన సావనీర్‌ను డీఈఓ ఆవిష్కరించారు. మన్నెగూడెం పాఠశాలలో సంవత్సరంపాటు నిర్వహించిన కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల రచనలు, సాధించిన విజయాలు, ఛాయాచిత్రాలతో ముద్రించిన సావనీర్‌ను పరిశీలించిన డీఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమష్టి కృషితో రూపొందించిన సావనీర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా మన్నెగూడెం పాఠశాలలో వసతులు, విద్యాబోధన ఉందన్నారు. హెచ్ఎం సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మానాయక్, కాంప్లెక్స్ హెచ్ఎం రుక్మాంగధరరావు, ఎస్ఎంసీ చైర్మన్ అరుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి మహబూబాబాద్ అర్బన్: నేటి నుంచి ప్రారంభం కానున్న ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. శనివారం తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌రెడ్డి మాట్లాడారు. ఇంటర్మీడియట్‌కు 708 మంది, టెన్త్ 485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు రెండు షిఫ్ట్‌ల్లో పరీక్షల జరుగుతాయన్నారు. సమావేశంలో ఏసీజీఈ శ్రీరాములు, ఏడీ రాజేశ్వర్‌రావు, సైన్స్ అధికారి అప్పారావు. ఏఎంఓ చంద్రశేఖర్ఆజాద్, సంతోష్, పూర్ణచందర్, సతీష్ పాల్గొన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి -
కులపెద్దలే పరిష్కరించాలి
కుటుంబ సమస్యలు వరంగల్ లీగల్ : కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలని, సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించి, శాంతియుత సమాజాన్ని స్థాపించడానికి కమ్యూనిటీ పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఆయా జిల్లాల న్యా య సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా తా త్కాలిక చీఫ్ జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ ఏ వివాదమైనా ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాల మధ్యే ఏర్పడుతుందని, అయితే ఆ వ్యక్తి గాని సమూహం గాని ఏదో ఒక కమ్యూనిటీకి చెందిన వారై ఉంటారన్నారు. అలాంటి పరిస్థితిల్లో అదే కమ్యూనిటీకి చెందిన పెద్దవారు వారికి నచ్చచెబుతే వివాదాలు సద్భావ వాతావరణంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఈ బృహత్తర ఆలోచన నుంచి ఉద్భవించినదే కమ్యూనిటీ మీడియేషన్ విధానమన్నారు. దేశంలో మొదటిసారి కేరళలో ఈ విధానం విజయవంతమైందని, సమాజంలోని కమ్యూనిటీ పెద్దలు కోర్టుల దాకా రాకుండా వేల సంఖ్యలో వివాదాలను పరిష్కరించారన్నారు. కాగా, 2023లో వచ్చిన మీడియేషన్ చట్టం ఈ విధానానికి చట్టబద్ధత కల్పించిందన్నారు. ముఖ్యంగా సమాజంలో కొన్నేళ్లుగా భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లల మధ్య తగాదాలు పెరిగిపోతున్నాయని, వీటికి చక్కటి పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ అని తెలిపారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం, ఇంటిలో సర్ది చెప్పే పెద్దలు లేకపోవడం దంపతుల మధ్య మనస్పర్థలు ఎక్కువ అవ్వడానికి కారణమవుతున్నాయని, వీటిని సమాజ కమ్యూనిటీ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్. పంచాక్షరి మాట్లాడుతూ నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ కమ్యూనిటీ మీడియేషన్ వలంటీర్లు విజయవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. గత ఏప్రిల్ 7న కామారెడ్డిలో ఒకేసారి 12 కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి నిర్మలా గీతాంబ, సి.హెచ్ రమేశ్ బాబు, ఇతర జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయి కుమార్, క్షమాదేశ్ పాండే, కమ్యూనిటీ మీడియేటర్లు, తదితరులు పాల్గొన్నారు.హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వరంగల్, హనుమకొండ కలెక్టర్లు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభంకమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి జిల్లాకు వచ్చిన రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్‌ను ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందించి స్వాగతం పలికారు. -
వీడిన మల్లక్క హత్య కేసు మిస్టరీ..
కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారంపేటలో ఈ నెల 13న జరిగిన వృద్ధురాలి హత్య కేసు మిస్టరీ వీడింది. ఈమేరకు కాటారం పీఎస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు.. నిందితుడి అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ఆదివారంపేటకు చెందిన ఒడేటి మల్లక్క(67) భర్త రామయ్య, కుమారుడు రమేశ్ కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. గ్రామంలో కిరాణం నడుపుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. మల్లక్క కుమారుడు చనిపోగా కోడలు శ్రీలతకు నిందితుడు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బారెగూడకు చెందిన మోరలే శివ అలియాస్ శివాజీతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మూడేళ్ల పాటు కాగజ్‌నగర్‌లో సహజీవనం చేశారు. శివ వేధింపులు తట్టుకోలేక శ్రీలత అతడిని వదిలిపెట్టి ఆదివారంపేటకు వచ్చి ఉంటోంది. నిందితుడు శివ పలుమార్లు శ్రీలత వద్దకు వచ్చి కలుద్దామని అడగగా ఆమె నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న శివ ఆమె అత్తను అంతమొందిస్తే ఆస్తి కోసం శ్రీలత హత్య చేసిందని కేసు ఆమె పైకి వెళ్తుందని ప్రణాళిక రచించాడు. పథకం ప్రకారం ఈ నెల 12న అర్ధరాత్రి మల్లక్క ఇంటికి వెళ్లిన శివ.. నిద్రిస్తున్న మల్లక్క తలపై గొడ్డలితో బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మల్లక్క మంచంలోనే మృతి చెందగా నిందితుడు గొడ్డలి అక్కడే పడేసి పరారయ్యాడు. మరుసటి రోజు డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి, మహదేవపూర్ సీఐ రాంచంద్రరావు, ఎస్సై–2 శ్రీనివాస్ ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మృతురాలి కూతురు శ్రీదేవి ఫిర్యాదు మేరకు పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలు ఆధారాల సాయంతో శివను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు మ్యాక అభినవ్, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడి అరెస్ట్, రిమాండ్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
మళ్లొస్తానని వెళ్లి.. మృత్యుఒడికి..
పొలం వద్ద విద్యుదాఘాతం.. దడువాయి మృతిజనగామ : పొలం వద్దకు వెళ్తున్నా.. మళ్లొస్తా అంటూ బయలుదేరిన కొద్ది సేపటికే ఓ దడువాయి మృత్యుఒడికి చేరాడు. విద్యుత్ రూపంలో మృత్యువు కబలించింది. విగతజీవిగా పడి ఉన్న అన్న కొడుకును చూసిన బాబాయి.. అతడిని పట్టుకునే ప్రయత్నంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. పట్టణంలోని జ్యోతినగర్ కాలనీకి చెందిన జూకంటి మనీశ్(28) వ్యవసాయ మార్కెట్లో దడువాయిగా పని చేస్తున్నాడు. తన సొంత భూమిలో డెయిరీ ఫామ్ నిర్వహించడంతోపాటు (పాల వ్యాపారం) వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో పొలం వద్ద పనులతోపాటు పశువుల వ్యర్థాలను తొలగించేందుకు ఇంట్లో చెప్పి తెల్లవారుజామున బయలు దేరాడు. పొలం పనులు చేసిన తర్వాత పశువుల పాకలో వ్యర్థాలను తొలగించే క్రమంలో కరెంట్ తీగ చేతికి తగలంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో బాబాయి జూకంటి శ్రీశైలం పక్కనే ఉన్న తన పొలంలో పని ముగించుకుని ఇంటికి బయలు దేరేందుకు సిద్ధమయ్యాడు. అన్న కుమారుడు మనీశ్ ద్విచక్రవాహనం చూసి ఇంకా ఇంటికి వెళ్లలేదని అతడిని పిలుస్తూ ముందుకు వెళ్లాడు. ఎంతకూ పలకకపోవడంతో దగ్గరకు వెళ్లే సరికి విగతజీవిగా పడి కనిపించాడు. తట్టి లేపే ప్రయత్నంలో కరెంట్ తీగలు గమనించి వెనక్కి తగ్గడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయగా వారు ఘటనాస్థలికి చేరకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. బిడ్డా మళ్లొస్తానంటూ వెళ్లి.. కానరానిలో కాలకు వెళ్లిపోయావా అంటూ గుండలవిసేలా రోదించారు. ఎస్సై రాజేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తల్లిదండ్రులు యాదగిరి, ఉపేంద్ర తీర్థయాత్రలకు వెళ్లగా, కొడుకు చనిపోయిన వార్త తెలుసుకుని ఆయోధ్య నుంచి జనగామకు బయలు దేరారు. మరొకరికి తప్పిన ప్రమాదం జనగామలో ఘటన -
కాళేశ్వరం ట్రస్టు బోర్డు ఏర్పాటయ్యేనా?
ఆశావహుల ఎదురుచూపులుకాళేశ్వరం: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కాళేశ్వరం ఒకటి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆలయానికి ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులతోపాటు ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ట్రస్టు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే కోడ్ అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచాయి. కానీ మార్చి 3వ తేదీతో కోడ్ ముగిసింది. నెల రోజులకు పైగా గడిచిన ట్రస్టు బోర్డు ఏర్పాటు ఆలస్యం అవుతుండడంతో చైర్మన్, డైరెక్టర్ పదవులను ఆశిస్తున్న వారిలో ఆందోళన మొదలైంది. సరస్వతీ నది పుష్కరాలు మే 15 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించి రూ.25కోట్లు మంజూరు చేసింది. అభివృద్ధి పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. కాగా, పుష్కరాలకు 27 రోజుల సమయం కూడా లేదు. అయినా ఇంతవరకు ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంపై మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర నాయకులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండోసారి నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది ఆగస్టులో ట్రస్టుబోర్డు ఏర్పాటుకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పుడు 20 రోజుల నిర్ణీత గడువులోగా వివిధ పదవులకు 37 వరకు దరఖాస్తులు వచ్చాయి. అంతలోనే మూడు నెలల గడువు ముగియడంతో అనివార్య కారణాలతో ఆ ఉత్తర్వులు రద్దు చేశారు. తర్వాత ఈ ఏడాది జనవరి 5న ట్రస్టుబోర్డు ఏర్పాటుకు మళ్లీ రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆశావహులు 88మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. సంవత్సరం కాలపరిమితితో 14 మంది డైరెక్టర్లు, ఎక్స్అఫీషియో మెంబర్‌కు ధరఖాస్తులు చేసుకున్నారు. ముమ్మర ప్రయత్నాలు! ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆశావహులకు సంఽబంధించి పోలీసు, ఎస్బీ ఎంకై ్వరీలు పూర్తయ్యాయి. నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. మంత్రి శ్రీధర్‌బాబు సూచించిన వారికి డైరెక్టర్, చైర్మన్ పదవులు రానుండడంతో ఆయన వద్దకు నేతలు క్యూ కడుతున్నారు. కాళేశ్వరం, మహదేవపూర్, మంథని, ముత్తారం, హనుమకొండ, భూపాలపల్లి నుంచి చైర్మన్ పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. గతంలో చైర్మన్ చేసిన ఒకరికి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. సరస్వతీ పుష్కరాలకు ముందు ఏర్పాటు చేస్తే బాగుటుందని భక్తుల అభిప్రాయంపుష్కరాల లోపు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు.. కాళేశ్వరం దేవస్థానంలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో మహాకుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముందుగానే ట్రస్టుబోర్డు నియామకం జరుగుతుందని ఆశావహులు ఆశించి నిరాశ పడ్డారు. ఈక్రమంలో సరస్వతీ పుష్కరాలు వచ్చే నెల 15 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. ఈలోపు ట్రస్టుబోర్డును ఏర్పాటు చేసేలా నేతలు మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర అధికారపార్టీ నాయకులను కలుస్తున్నట్లు తెలిసింది. కాగా, పుష్కరాల లోపు ట్రస్టుబోర్డు నియామకం జరిగితే అభివృద్ధి పనులపై అజమాయిషీ ఉంటుందని, పుష్కరాల్లో ఏర్పాట్లపై మరింతగా దృష్టిసారిస్తారని భక్తులు పేర్కొంటున్నారు. -
డిగ్రీ పరీక్షల వాయిదా తప్పదా?
పరీక్ష ఫీజుచెల్లించిన కళాశాలలు 156 మాత్రమేకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బి ఓకేషనల్, బీసీఏ, తదితర కోర్సుల 2,4,,6 సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 21 నుంచి నిర్వహించాలని, వీటి తర్వాత వెంటనే 1,3,5 సెమిస్టర్ల పరీక్షలు కూడా నిర్వహించాలని అధికారులు టైంటేబుల్ విడుదల చేసి పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారు. అయితే ఆయా పరీక్షల నిర్వహణకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ప్రభుత్వం మూడేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడం లేదని, దీంతో తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అందుకే పరీక్షలు నిర్వహించబోమని ఆయా యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు ఇప్పటికే యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం వరకు కూడా యూనివర్సిటీ పరిధిలో ఎక్కువ శాతం ప్రైవేట్ కళాశాలలు పరీక్ష ఫీజులు యూనివర్సిటీ పరీక్షల విభాగానికి చెల్లించలేదు. అయితే ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు నిర్వహిస్తామని యూనివర్సిటీ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. పరీక్షలు సమీపిస్తున్నా హాల్‌టికెట్లు జారీచేయకపోవడంతో విద్యార్థులు అయోమయం చెందుతున్నారు. అన్ని సెమిస్టర్లు కలిపి సుమారు 2లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సింటుంది విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులు నేటికీ వర్సిటీకి చెల్లించని వైనం కేయూ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, గురుకులాలు, పలు అటానమస్ కాలేజీలు కలిపి సుమారు 292 డిగ్రీ కళాశాలలున్నాయి. అందులో శుక్రవారం వరకు అన్ని యాజమాన్యాలు కలిపి 156 కళాశాలలు మాత్రమే ఫీజులు పరీక్షల విభాగానికి చెల్లించాయి. ఇటీవల యూనివర్సిటీ అధికారులు ఫీజులు చెల్లించిన విద్యార్థులకే పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించినా ఆయా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు మాత్రం బేఖాతర్ చేస్తున్నాయి. పరీక్షలను ఫీజురీయింబర్స్‌మెంట్‌కు ముడిపెట్టి విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను పరీక్షల విభాగానికి చెల్లించకపోవడంతో పరీక్షల నిర్వహణపై యూనివర్సిటీ అధికారులు మల్లగుల్లాలుపడుతున్నారు. ఎందుకంటే ఈనెల 21నుంచే పరీక్షలు నిర్వహించాల్సింటుంది. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచాల్సింటుంది. ఈ ప్రక్రియను చేపట్టే పరిస్థితులు కనపడడం లేదు. అందుకే వాయిదా వైపు మొగ్గుచూపేందుకే అవకాశాలున్నాయి.. ఓయూలో కొనసాగుతున్న పరీక్షలు.. ఎంజీయూలో వాయిదా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే డిగ్రీ 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు కొనసాగుతున్నాయి. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో కూడా ప్రైవేట్ యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సిద్ధంగా లేకపోవడంతో 2,4,6 సెమిస్టర్ల పరీక్షలు మాత్రం వాయిదావేశారని సమాచారం. దీంతో కాకతీయ యూనివర్సిటీ కూడా పరీక్షలను వాయిదా వేయక తప్పదని తెలుస్తోంది. విద్యార్థుల నుంచి వసూలు చేసినా వర్సిటీకి చెల్లించని ఎక్కువ శాతం ప్రైవేట్ కళాశాలలు ఫీజురీయింబర్స్‌మెంట్‌కు, పరీక్షలకు ముడి పరీక్షలకు 2లక్షల మందికి పైగా విద్యార్థుల నిరీక్షణ నేడు వాయిదా నిర్ణయం వెల్లడించే అవకాశం ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సిద్ధంగా లేకపోవడం.. పరీక్షల ఫీజులు చెల్లించకపోవడంతో టైంటేబుల్ ప్రకారం పరీక్షలు ఈనెల 21నుంచి నిర్వహించడం సాధ్యం కాదు. ఈనెల 19న వీసీ కె. ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో చర్చించి వాయిదా వేసే అవకాశాలున్నాయి. -
స్టెరాయిడ్ విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్ అరెస్ట్
రామన్నపేట : బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొందాలనే యువత కోరికను ఆసరా చేసుకుని వారికి అత్యంత ప్రమాదకర స్టెరాయిడ్ విక్రయిస్తున్న జిమ్ ట్రైనర్‌ను అరెస్ట్ చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్ తెలిపారు. ఈ మేరకు శుకవ్రారం రాత్రి మట్టెవాడ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోని డాక్టర్స్ కాలనీకి చెందిన కందకట్ల శ్రవణ్‌కుమార్ అలియాస్ కిరణ్ సుబేదారిలోని జేడీ జిమ్‌లో బాడీ బిల్డింగ్ శిక్షణ పొందుతున్నాడు. ఈ శిక్షణలో ప్రశాంత్ అనే వ్యక్తి పరిచయమై శరీర ఆకృతి త్వరగా రావాలంటే స్టెరాయిడ్ తీసుకోవాలని చెప్పి కొన్ని స్టెరాయిడ్ ఇంజక్షన్లు, టాబ్లెట్ల్ విక్రయించాడు. అప్పటి నుంచి శ్రవణ్ స్టెరాయిడ్ తీసుకుంటూ జిమ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఐదు సంవత్సరాలుగా శ్రవణ్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఎలాంటి లైసెన్స్ లేకుండా వైజాగ్‌కు చెందిన మణికంఠ, ఆనంద్ వద్ద ఆన్లైన్ ద్వారా స్టెరాయిడ్ కొనుగోలు చేస్తూ యువతకు సైతం విక్రయిస్తున్నాడు. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు శ్రవణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా యువతకు స్టెరాయిడ్ విక్రయిస్తూ అధిక మొత్తంలో డబ్బు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. దీంతో శ్రవణ్‌ను అరెస్ట్ చేసిన అతడి వద్ద నుంచి సుమారు రూ.20 వేల విలువైన స్టెరాయిడ్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. శ్రవణ్‌కు స్టెరాయిడ్ విక్రయించిన మణికంఠ, ఆనంద్, ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ వివరించారు. కాగా, స్టెరాయిడ్‌తో బీపీ పెరిగి హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని, వీటి వినియోగంతో కాలక్రమేణ మానసిక సమస్యలు ఇబ్బందులు ఎదురవుతాయని ఏసీపీ పేర్కొన్నారు. మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి, ఎస్సై విఠల్, తదితరులు పాల్గొన్నారు. పరారీలో ముగ్గురు వివరాలు వెల్లడించిన ఏసీపీ -
ప్రపంచ వారసత్వ సంపదను కాపాడుకోవాలి
వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ పాండురంగారావు పిలుపునిచ్చారు. వరల్డ్ హెరిటేజ్ డేను పురస్కరించుకుని శుక్రవారం రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ సంపద ప్రాముఖ్యతను తెలియజేస్తూ పర్యాటకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడారు. ప్రపంచ పటంలో రామప్పను తీసుకెళ్లేందుకు అహర్నిషలు కృషి చేశామన్నారు. వెంకటాపురం మండల కేంద్రం శివారులో సింగరేణి చేపట్టే ఓపెన్‌కాస్ట్ గనితో రామప్ప ఆలయానికి, సరస్సుకు ముప్పు ఉందన్నారు. ఓపెన్‌కాస్ట్ గనితో భూమిలోని పొరల కదలికల వల్ల ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అందుకే ఓపెన్‌కాస్ట్ గని అనుమతులను రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వీరమల్ల ప్రకాశ్‌రావు, ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్ఆర్సీ రెడ్డి, ప్రొఫెసర్లు దేవప్రతాప్, సాంబయ్య, గణపతి, సేవా టూరిజం కల్చరల్ సొసైటీ ఫౌండర్ కుసుమ సూర్యకిరణ్, రామప్ప పరిరక్షణ సమితి కన్వీనర్ ఆకిరెడ్డి రామ్మోహన్రావు, గైడ్ వెంకటేశ్ పాల్గొన్నారు. డీజిల్ దొంగల అరెస్ట్పరకాల: కొంతకాలంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లలో అర్ధరాత్రి వేళల్లో డీజిల్ కొట్టించుకుని డబ్బులివ్వకుండా పారిపోతున్న ముఠాను పరకాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీఐ క్రాంతికుమార్ వివరాలు వెల్లడించారు. ముగ్గురు యువకులు ఉమ్మడి జిల్లాలోని రాయపర్తి, జఫర్గడ్ పెట్రోలు బంక్‌లతోపాటు పరకాల పట్టణంలోని హుజూరాబాద్ రోడ్డులో గల హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు కియా సైరీస్ కారులో గత నెల 25వ తేదీన వేర్వేరు సమయాల్లో వచ్చారు. రెండు క్యాన్లలో డీజిల్ పోయించుకొని ఫోన్ పే చేస్తామంటూ డబ్బులు ఇవ్వకుండానే పారిపోయారు. బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పరకాల పోలీసులు కేసు నమోదు చేశారు. గాలింపు చేపట్టగా దోపిడీ కోసం వినియోగించిన కారుతోపాటు ముగ్గురు యువకులు పట్టుపడ్డారు. పట్టుబడిన నిందితుల్లో వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన ఏనుగుల రంజిత్, హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన రేవూరి నవీన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలానికి చెందిన కోడిరెక్క భరత్ చంద్ర ఉన్నట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. నిందితులనుంచి కారుతోపాటు 4 సెల్ఫోన్లు, రూ.12,500 నగదు స్వాదీనం చేసుకున్నట్లు చెప్పారు. సమావేశంలో పరకాల ఎస్ఐ శివకృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు సభ్యుడు ప్రొఫెసర్ పాండురంగారావు -
ప్రభుత్వానిది అవగాహనారాహిత్యం
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహన రాహిత్యంతో రాష్ట్రంలో వ్యవసాయం కుంటుపడేలా చేస్తోందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి సమీపంలో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో అద్భుత సభలు నిర్వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జన మొదలు.. నేటి రజతోత్సవ సభ వరకు ప్రజల్లో స్ఫూర్తి నింపుతున్న నేత కేసీఆర్ అన్నారు. ఎల్కతుర్తిలో నిర్వహించబోయే సభ దేశ చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం చెందిందన్నారు. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దితే అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లో తెలంగాణను అధోగతిపాలు చేస్తోందని విమర్శించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో భూములు కొల్లగొట్టే ప్లాన్ చేశారని, ధరణి పేరు మార్చి భూ భారతి అంటూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ మారపెల్లి సుధీర్‌కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతం సదానందం, ఇన్‌చార్జ్‌లు భరత్‌కుమార్‌రెడ్డి, నాగుర్ల వెంకన్న, నాయకులు ఎల్తూరి స్వామి, వేముల శ్రీనివాస్, సమ్మయ్య, జడ్సన్ చిట్టిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి -
ఇసుక పంచాయితీ..!
శనివారం శ్రీ 19 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025– IIలోuసాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణా అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులకు ఇబ్బ ందికరంగా మారింది. ఇసుక రవాణా అడ్డుకోవడం, పరిరక్షణ ఎవరి పరిధిలోకి వస్తుందనేది తేలడం లేదు. రెండు నెలలు కట్టుదిట్టం చేసిన అధికారులు ఒక్కసారిగా చేతులెత్తేశారు. దీంతో విచ్చలవిడిగా ఇసుక తరలింపుపై గ్రామాల్లోని రాజకీయ పార్టీల మధ్య మొదలైన చిచ్చు.. ప్రభుత్వ విప్ వరకు వెళ్లింది. దీనిపై ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, దానిపై జిల్లా తహసీల్దార్ల సంఘం, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఖండించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కట్టడి చేసేది ఎవరు.. జిల్లా వ్యాప్తంగా నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు మండలాల పరిధిలో ఉన్న ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల్లోని ఇసుకపై ఎవరికి అజమాయిషీ ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు. వాగుల వెంబడి టెంట్లు వేసుకొని పహారా కాసిన పోలీస్ శాఖ చేతులెత్తేసింది. దీంతో అడ్డూ అదుపు లేకుండా వాగుల్లోంచి వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతుంది. అయినా పోలీసు, మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు పట్టించుకోవడం లేదు. అయితే సాండ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాలోని వాగుల్లో ఇసుక ఉన్నది వాస్తవమే.. కానీ, రీచ్‌లు చేసి విక్రయాలు జరిపే స్థాయి కాదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎవరూ పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతుంది. ప్రయత్నం విఫలం గతంలో ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసిన శశాంక ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం, ఇసుక ద్వారా గ్రామ పంచాయతీలకు ఆదాయం వచ్చే మార్గాలు అన్వేషించారు. ఇందుకోసం ఎక్కడెక్కడ ఇసుక ఉంది. ఎంత మోతాదుల్లో ఉంది. ఎంత ఆదాయం వస్తుంది. ఎలా విక్రయించాలనే విషయంపై అధికారులతో చర్చించారు. ఏమైందో ఏమో.. ఒక్కసారిగా తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇందుకు రాజకీయ నాయకుల ఒత్తిడే కారణమని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. చిచ్చు రేపుతున్న ఇసుక దందా ఇసుక దందా ఇప్పుడు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల్లో గొడవలకు దారితీస్తుంది. గతంలో ఇసుక లభ్యమయ్యే ప్రాంతాల్లో అప్పటి నాయకుల అనుచరులే ఇసుక రవాణా చేసేవారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ప్రభుత్వంలోని కొందరు నాయకులు తమ అనుచరులకు ఇసుక అనుమతులు ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. దీనికితోడు స్థానికులు తమ అవసరాలకు లేకుండా ఇసు క తవ్వకాలు చేస్తుంటే ఎవరూ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన విప్ రాంచంద్రు నాయక్ చిన్నగూడూరు సభలో తహసీల్దార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ మనోభా వాలు దెబ్బతిన్నాయని రెవెన్యూ, తహసీల్దార్ల సంఘం నాయకులు ఖండించారు. దీనిపై విప్‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘నా అవసరం కోసం కాదు.. ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటానని ఎన్నికల సమయంలో మాట ఇచ్చాను. అది నిలబెట్టుకోవా ల్సిన అవసరం ఉంది. అధికారులు సహకరించాలి. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనుమతులు ఇవ్వాలని చెప్పాను. ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించలేదు’ అని చెప్పారు.మాట్లాడుతున్న వద్దిరాజు రవిచంద్ర న్యూస్‌రీల్ నిల్వలు ఉన్నా.. రీచ్‌ల ఏర్పాటుకు లేని అవకాశం స్థానిక అవసరాలకు గ్రీన్ సిగ్నల్ అనుమతులపై చర్చ ఇసుక రవాణాపై గ్రామాల్లో రాజకీయ గొడవలు‘ఇంతకన్న పెద్దమాట ఏం చెప్పాలి. ఆర్అండ్బీ గెస్ట్ హౌజ్‌లో ఎస్పీని, తహసీల్దార్లను కూర్చొబెట్టి చెప్పాను. మీకు నాకు గెట్టు పంచాయితీ ఉందా.. ప్రజలకు అందకుండా రూ.6 వేలు, రూ.8 వేలకు ట్రాక్టర్ ఇసుక అమ్ముతున్నారు.. గతంలో మాదిరిగా టోకెన్ ఇస్తే ఇలా ఉండదు.. ఈడియట్ మాటలు మాట్లాడకుండా.. కలెక్టర్ వద్ద కూర్చొని మా ఎమ్మెల్యే చెప్పిండని ఆర్డర్ తెచ్చుకోండి.. నేను కేబినెట్ ర్యాంకులో ఉండి చెబుతున్నా పట్టించుకోవడం లేదు.. ఇది సరికాదు.. మేం మా పని చేసుడే సరిపోతుందని చెబితే ఎలా.. ఇక్కడ ఇసుక అయిపోతే ట్రాక్టర్ గోదావరి ఇసుక రూ.10 వేలకు తెచ్చుకోవాలి.’అని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్రాంచంద్రునాయక్ చిన్నగూడూరు తహసీల్ధార్ మహబూబ్ అలీతో అన్నమాటలు..‘చిన్నగూడూరు తహసీల్దార్‌పై డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇసుక తవ్వకాలకోసం అనుమతి ఇవ్వాలంటే జీఓ నంబర్ 03, 15 ప్రకారం సాండ్ కమిటీ నివేదిక ఉండాలి. అంతే కానీ తహసీల్దార్లకు ఇసుక తవ్వకాలకు అనుమతి ఇచ్చే అధికారం లేదు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడంలో అన్ని శాఖల సమష్టి కృషి అవసరం. ప్రస్తుత పరిస్థితిలో క్షేత్రస్థాయి సిబ్బంది లేక ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి పథకాల అమలుకే సమయం సరిపోకపోయినా కష్టపడి లక్ష్యాలను చేరుకుంటున్నాం. ఈ పరిస్థితిలో సభా ముఖంగా రెవెన్యూ ఉద్యోగులపై ప్రభుత్వ విప్ అనుచితవ్యాఖ్యలు చేయడంతో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది సరికాదు. విప్ ఇటువంటి సంఘటనలు మరోసారి పునరా వృతం కాకుండా చూసుకోవాలి.’ –జిల్లా రెవెన్యూ, తహసీల్దార్ల సంఘం -
సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో కొనుగోలు కేంద్రాల్లో చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, ముడుపుగల్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం ప్రారంభించి, మాట్లాడారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నిబంధనల మేరకు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, లారీలలో మిల్లులకు తరలించిన ధాన్యాన్ని దిగుమతి చేసే దగ్గర జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కేవలం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే సన్నధాన్యానికి బోనస్ లభిస్తుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టకంటి రామిరెడ్డి, ఏఓ తిరుపతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం తిలక్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, సీసీలు ధనుంజయ, సుమలత, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ -
మూగజీవాల మృత్యువాత
మహబూబాబాద్ రూరల్ : విద్యుదాఘాతంతో మూడు జీవాలు మృత్యువాతపడిన ఘటన మహబూబాబాద్ పురపాలక సంఘం మండల పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని దామ్యతండా గ్రామపంచాయతీకి చెందిన బానోత్ శ్యామ్ తన ఆవును ఉదయం మేత కోసం విడిచిపెట్టాడు. బానోత్ లింగ్య బావి సమీపంలోని స్తంభానికి ఉన్న విద్యుత్ వైరు తెగివుండడంతో ఆవుకు ఆ వైరు తగిలి కరెంటు షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. దీంతో బాధిత రైతుకు రూ.70 వేలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అనంతారం గ్రామ శివారు కంది పప్పు మిల్లు పక్కన విద్యుత్ విద్యుత్ వైర్లు తెగిఉండి అటువైపుగా మేతకు వెళ్ళిన రెండు పాడిగేదెలు విద్యుదాఘాతానికి గురై మృత్యువాతపడ్డాయి. మహబూబాబాద్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన గుగులోతు నరేందర్ తన పాడిగేదెలను మేతకోసమని అనంతారం గ్రామం పరిధిలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో అనంతారం గ్రామ శివారు కంది పప్పు మిల్లు ప్రాంతానికి రెండు పాడిగేదెలు వెళ్లగా కిందపడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి అక్కడిక్కడే మృతిచెందాయి. దీంతో బాధిత రైతుకు రూ.2.50 లక్షలు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు. వేర్వేరు చోట్ల విద్యుదాఘాతంతో మూడు మృతి -
కుటుంబ సమస్యలు కులపెద్దలే పరిష్కరించాలి
● హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆయా జిల్లాల న్యాయ సేవ సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్ల మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం హనుమకొండలోని డీసీసీ బ్యాంక్ ఆడిటోరియంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ మాట్లాడుతూ కుటుంబ సమస్యలను కులపెద్దలే పరిష్కరించాలన్నారు. – వరంగల్ లీగల్– వివరాలు IIలోu -
బంక్‌లో ఎలక్ట్రిక్ వస్తువులు నిల్వ చేయొద్దు
జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనాథ్ మహబూబాబాద్: పెట్రోల్ బంక్‌లలో ఎలక్ట్రిక్ వస్తువులు, కాలే గుణం ఉన్న ఎటువంటి వస్తువులు నిల్వఉంచొద్దని జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనాథ్ అన్నారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు పెట్రోల్ బంక్‌లలో అగ్ని ప్రమాద నివారణ చర్యలపై సిబ్బంది మాక్ డ్రిల్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలను ప్రజలు తిలకించాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, రవీందర్, గోపి, విశ్వనాథ్, రాజు, వెంకన్న, రమేష్, షఫీ, జీవన్ తదితరులు పాల్గొన్నారు. అదృశ్యమైన బాలుడి అప్పగింత గూడూరు: జనవరి నెలలో ఆశ్రమ పాఠశాలకు వచ్చి అదృశ్యమైన బాలుడు ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఉన్నాడన్న విషయం తెల్సుకున్న ఎస్సై గిరిధర్‌రెడ్డి, అక్కడికి వెళ్లి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన సంఘటన శుక్రవారం జరిగింది. ఎస్సై బి. గిరిధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం కోమటిపల్లికి చెందిన ఇస్లావత్ నర్సింహా కొడుకు చరణ్, గూడూరు మండలంలోని సీతానగరం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. జనవరిలో సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన చరణ్, సెలవులు ముగిశాక.. జనవరి 23న పాఠశాలకు వచ్చి కనిపించకుండా పోయాడు. విషయం ఆలస్యంగా తెల్సుకున్న బాలుడి తండ్రి ఇస్లావత్ నర్సింహా పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్సై మూడు నెలలుగా ఆరా తీసాడు. ఇటీవల ఏపీలోని రాజమహేంద్రవరంలో కూలీ పనులు చేస్తున్నాడని తెల్సుకున్నాడు. చాకచక్యంగా సిబ్బందితో కల్సి వెల్లిన ఎస్సై బాలుడిని గుర్తించి తీసుకొచ్చినట్లు తెలిపారు. తాళంవేసిన ఇంట్లో చోరీ నెల్లికుదురు: తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన ఘటన ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బీరవెల్లి ఉపేంద్ర హైదరాబాద్‌లో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి ఈ నెల 11న వెళ్లింది. అప్పటి నుంచి గ్రామానికి చెందిన ముంజపల్లి యాకాలు, పూలమ్మ దంపతులు ఉపేంద్ర ఇంటి పనులు చేస్తున్నారు. శుక్రవారం ఇంట్లో పనులు చేయడానికి వచ్చిన వారికి ఇంటి తాళం పగులగొట్టి కన్పించడంతో ఉపేంద్ర సమీప బంధువు( కొడుకు వరుస) అయిన గ్రామానికి చెందిన బీరవెల్లి మధుసూదన్‌రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి అందులో ఉన్న చంద్రహారం, చెవి కమ్మలు, రూ.10వేల నగదు, కలర్ టీవీ అపహరణకు గురైనట్లు గుర్తించి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భద్రకాళి సన్నిధిలో ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రటరీ హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శుక్రవారం ఐటీడీఏ ప్రిన్సిపల్ సెక్రెటరీ బానోత్ శరత్‌నాయక్ కుటుంబసమేతంగా సందర్శించారు. వారిని ఆలయ అధికారులు స్వాగతించారు. ముందుగా వారు ఆదిశంకరులను, వల్లభగణపతిని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆనంతరం శరత్‌నా యక్ దంపతులకు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. -
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’ ● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ● భూ భారతి పైలట్ మండలం వెంకటాపురం (ఎం)లో రెవెన్యూ సదస్సు ● హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులువెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. రైతుల వద్దకే వెళ్లి అధికారులు భూ సమస్యలు పరిష్కరిస్తారన్నారు. రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ : మంత్రి కొండా సురేఖ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు. భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం: మంత్రి ధనసరి సీతక్క తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్‌రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఈకార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, కలెక్టర్ దివాకర టీఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మించి కడతేర్చారు..
నల్లబెల్లి: ఇంటి అవసరాల కోసం అప్పు ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని అప్పు తీసుకున్న వ్యక్తి భా ర్యను శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విష యం తెలిసిన భర్త పరువు పోయిందని భావించి భార్యను నిలదీశాడు. దీంతో తాము కలిసి ఉండాని నిర్ణయించుకుని లొంగదీసుకున్న వ్యక్తిని పథకం ప్రకారం భార్యాభర్తలు హత్యచేశారు. నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బుధవారం నర్సంపేటలోని దుగ్గొండి సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ సా యిరమణ.. ఎస్సై గోవర్ధన్‌తో కలిసి హత్య వివరా లు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ జంపయ్య 23 గుంటల వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడు. ఇంటి ని ర్మాణ పనులు చేపట్టారు. ఈక్రమంలో బానోత్ కొమ్మాలు(40) మధ్యవర్తిగా ఉండి రెండుసార్లు రూ.1.50 లక్షలు జంపయ్యకు అప్పుగా ఇప్పించా డు. ఇది ఆసరా చేసుకుని జంపయ్య భార్య విజ యను కొమ్మాలు శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జంపయ్య పెద్ద మనుషులను ఆశ్రయించగా కొమ్మాలుకు రూ.70 వేలు జరి మానా విధించారు. ఈ క్రమంలో కొమ్మాలు వ్యవహరశైలితో తన పరువు పోయిందని భావించిన జంపయ్య.. కొమ్మాలును చంపాలని అనుకున్నాడు. కా గా, జంపయ్య తన భర్య విజయతో గొడవపడ్డాడు. కొమ్మాలును అయినా, నిన్ను అయినా చంపుతానని చెప్పాడు. దీంతో భయపడిన విజయ మనం కలిసే ఉందామని భర్తకు తెలిపింది. అనంతరం కొమ్మాలును హత్య చేయాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా కొమ్మాలు ఫోన్ చేసిన ప్రతీసారి అతడితో మాట్లాడడానికి వెళ్లమని జంపయ్య తన భార్య విజయకు చెప్పాడు. దీంతో విజయ పూర్తిగా కొమ్మాలును నమ్మించింది. ఈ క్రమలో పథకం ప్రకారం ఈ నెల 12న విజయ.. కొమ్మాలుకు ఫోన్ చేసి మాట్లాడాలి మొక్కజొన్న చేనువద్దకు రావాలని కోరింది. అనంతరం దంపతులు పథకం ప్రకారం కత్తులు తీసుకుని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. జంపయ్య ఎవరికీ కనిపించకుండా మొక్కజొన్న చేనులో కొంతదూరంగా ఉన్నాడు. ఈ విషయం గమనించకుండా కొమ్మాలు మొక్కజొన్న చేనువద్దకు చేరుకున్నాడు. ఇదే అదునుగా భావించి జంపయ్య వెనుకవైపు నుంచి కొ మ్మాలును కత్తితో పలుమార్లు పొడిచాడు. అనంతరం దంపతులిద్దరు పరారయ్యారు. ఈ క్రమంలో రుద్రగూడెంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. కాగా, హత్య కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన ఎస్సై గోవర్ధన్, సిబ్బందిని సీఐ అభినందించారు. పథకం ప్రకారం ఫోన్ చేసి రప్పించి హతమార్చారు కొమ్మాలు హత్య కేసులో దంపతుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన పోలీసులు -
వడదెబ్బతో కూలీ మృతి
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 1వ వార్డుకు చెందిన వ్యవసాయ కూలీ పలిశెట్టి వెంకటేశ్వర్లు(62) వడదెబ్బతో మృతి చెందినట్లు అతడి భార్య రమణ తెలిపారు. వెంకటేశ్వర్లు రోజూ సమీపంలోని పంట పొలాలు, మిర్చి కల్లాల వద్దకు పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం కూడా వెళ్లాడు. రాత్రి వాంతులు, విరోచనాలు జరిగి ఇంటి వద్దే మృతి చెందినట్లు ఆమె తెలిపారు. 19 నుంచి బునియాడీ కార్యకర్తల సమ్మేళనం హన్మకొండ: హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జరిగే బునియాడీ కార్యకర్తల సమ్మేళనం విజయవంతం చేయాలని ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రవీందర్ నాయక్ పిలుపునిచ్చారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ డెలిగేట్లు పాల్గొంటారని వివరించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతీ మండలం నుంచి ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సమ్మేళనంలో పాల్గొనాలని కోరారు. యువకుడిపై పోక్సో కేసు నమోదువరంగల్: మూడేళ్ల చిన్నారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎంఎ.షుకూర్ తెలిపారు. బుధవారం రాత్రి గిర్మాజీపేటలో కిరాయికి ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన మూడేళ్ల చిన్నారి తన నానమ్మ వద్ద అన్నం తిని ఇంటి ఆవరణలో అన్నయ్యతో ఆడుకుంటోంది. వీరు ఉంటున్న ఇంట్లోనే పైఅంతస్తులో కిరాయికి ఉంటూ పెయింటింగ్ వర్క్ చేసే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన లల్లు రంజాన్.. ఇద్దరు పిల్లలను బయటకు తీసుకెళ్లి బిస్కెట్లు కొనిచ్చాడు. ఇంటికి తీసుకొచ్చి బాలికలను పైఅంతస్తులోని తన గదికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలిక తన నానమ్మతో చెప్పగా కుటుంబ సభ్యులు రంజాన్‌ను నిలదీయగా పరారయ్యాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు రంజాన్‌పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ షుకూర్ తెలిపారు. -
గంజాయి ముఠా అరెస్ట్
● రూ.3.5 లక్షల విలువైన ఎండు గంజాయి స్వాధీనం పరకాల: సిగరెట్లలో గంజాయి పెట్టి విక్రయించాలనే ఆలోచనతో ఒడిశా నుంచి సరుకు దిగుమతి చేసి పరకాలలో విక్రయించేందుకు సిద్ధమైన ముఠాను పరకాల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ క్రాంతికుమార్ కథనం ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పశువుల సంతలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతోపాటు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమానితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా రూ.3లక్షల 5వేల విలువైన 6.11 కిలోల ఎండుగంజాయి లభ్యమైంది. దీంతో ఒడిశాకు చెందిన శంకుభర సగారియా(మేసీ్త్ర), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దరగోపాల్ యాదవ్(మేసీ్త్ర), పరకాలలోని మల్లారెడ్డిపల్లెకు చెందిన ఓంటేరు రాజ్‌కుమార్(ల్యాబ్‌టెక్నీషియన్)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శివక్రిష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు టి.సర్వర్, ఎస్.నరసింగం, డి.నాగరాజు, ఎస్.నాగరాజు, ఎ.శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు. -
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
నర్సంపేట రూరల్ : వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేసి ఇద్దరు మహిళలను కాపాడినట్లు వరంగల్ టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ కథనం ప్రకారం.. నర్సంపేటలోని మాధన్నపేట రోడ్డులో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు వరంగల్ టాస్క్‌ఫోర్స్, నర్సంపేట పోలీసుల ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఇందులో ముగ్గురు విటులు నర్సంపేటకు చెందిన కేసనపల్లి విక్రమ్, బానోజీపేటకు చెందిన కొయ్యల రమేశ్, కొయ్యల నితిన్, గృహ నిర్వాహకురాలు మాధన్నపేట రోడ్డులోని సీపీఐ కాలనీ చెందిన కన్నెరపు ఉమ పట్టుబడ్డారు. దీంతో వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 సెల్ఫోన్లు, రూ. 2,750 న గదు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ సీఐ శ్రీధర్, నర్సంపేట ఎస్సై అరుణ్, హెడ్‌కానిస్టేబుల్ రాజేశ్వరి, కానిస్టే బుళ్లు కృష్ణ, రాజు, నరేశ్, గణేశ్ పాల్గొన్నారు. నిర్వాహకురాలు, ముగ్గురు విటుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన టాస్క్‌ఫోర్స్ ఏసీపీ -
బాలుడి వైద్య పరీక్షల నివేదిక ఆధారంగా చర్యలు
మహబూబాబాద్: బాలుడి కాలుపై వాత పెట్టిన విషయంలో వైద్య పరీక్షలు నిర్వహించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీడీపీఓ శిరీష పేర్కొన్నారు. జిల్లా కేంద్రం సిగ్నల్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయా భద్రమ్మ కత్తిని స్టౌవ్‌పై వేడి చేసి మనుదీప్(ఐదేళ్లు) అనే బాలుడి కాలుపై వాత పెట్టిన ఘటపై ఈనెల 16న కేంద్రం ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై సీడీపీ శిరీష, సూపర్ వైజర్ కవిత విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సీడీపీఓ శిరీష మాట్లాడుతూ గత శనివారం బాలుడి నానమ్మ ఫోన్ చేసి గత గురువారం ఆయా భద్రమ్మ కత్తితో తన మనుమడి కాలుపై వాత పెట్టిందని ఫోన్లో తెలిపారన్నారు. వెంటనే ఆ కేంద్రం సందర్శించి ఘటన వివరాలు తెలుసుకోవాలని సూపర్ వైజర్ కవితను ఆదేశించామన్నారు. అయితే అంగన్వాడీ టీచర్ సరిత ఈనెల 14,15న సెలవులో ఉండడంతో విచారణ పూర్తి కాలేదన్నారు. దీంతో ఈనెల 16న, 17న విచారణ చేశామన్నారు. ఆ బాలుడిని వైద్యపరీక్షల కోసం జిల్లా ప్రధాన వైద్యశాలకు పంపామన్నారు. దీనిపై త్వరలో రిపోర్ట్ ఇస్తామని చెప్పారన్నారు. వైద్యులు రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో వాత అని తేలితే చర్యలు తప్పవన్నారు. సీడీపీఓ శిరీష -
రజతోత్సవ సభకు చకచకా ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, వరంగల్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాతికేళ్ల పండుగ వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అవతరించి 25 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఈ రజతోత్సవ వేడుకలను నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపం చింతలపల్లి శివారులో ఈ నెల 27న భారీ సభ నిర్వహిస్తోంది. పది లక్షల మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి ‘పబ్లిక్ మీటింగ్’ నిర్వహించడానికి మార్చి 28న కాజీపేట ఏసీపీకి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అనుమతులు ఇవ్వడంలో జాప్యం జరగడంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పోలీసుల అనుమతి కూడా లభించింది. పాతికేళ్ల పండుగ వేడుకల నిర్వహణకు ఇంకా పది రోజులే ఉండటంతో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం జరుగుతోంది, పనులు ఎంతవరకు.. ఆరా తీస్తున్న అధినేత కేసీఆర్.. రజతోత్సవ వేడుకల సభ ఏర్పాట్లపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజూ ఆరా తీస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. సభావేదిక ఏర్పాట్ల కోసం మొదట మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించగా.. ప్రస్తుతం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, ఉమ్మడి జిల్లా నేతలు పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం ఓ సారి, సాయంత్రానికోసారి సభావేదిక ఏర్పాట్లపై కేసీఆర్ ఆరా తీస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. ఎల్కతుర్తి, గోపాల్పూర్, బావుపేట, ఎల్లాపూర్, కొత్తపల్లి శివార్లలో వాహనాల పార్కింగ్ కోసం స్థలాల చదును పూర్తయ్యింది. సుమారు 50 వేల వాహనాల వరకు వస్తాయని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. ఆ మేరకు ఇంకా పార్కింగ్ స్థలాలను పెంచుతున్నారు. ఇదిలా ఉండగా జనసమీకరణకు ఇదివరకే ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను నియమించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఓ వైపు సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నే.. మరోవైపు జన సమీకరణ కోసం నియోజకవర్గాల వారీగా ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసేందుకు ‘ప్రచార రథం’లు కూడా రోడ్డెక్కాయి. కాగా, సభకు మరో పది రోజులే గడువు ఉండటంతో రెండు రోజుల్లో కీలక కమిటీలు వేయడంతోపాటు శనివారం ఉమ్మడి వరంగల్ నాయకులతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం. సమావేశ స్థలం కంటే పార్కింగ్‌కే అధికం..ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పాతికేళ్ల పండుగ వేడుకల కోసం ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్ శివార్లలో 1,159 ఎకరాల భూసేకరణ చేశారు. ఇందుకోసం రైతులు స్వచ్ఛందంగా అనుమతి పత్రాలు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పోలీసులకు అనుమతి కోసం చేసిన వినతిపత్రంలో సమావేశానికి 159 ఎకరాలు, పార్కింగ్ కోసం 1000 ఎకరాలు సేకరించినట్లు స్పష్టం చేశారు. వరంగల్ – కరీంనగర్, సిద్దిపేట – వరంగల్, యాదాద్రి భువనగిరి – ఆరెపల్లి (భూపాలపట్నం)... మూడు జాతీయ రహదారులకు కేంద్రంగా ఉన్న ఎల్కతుర్తి, దాని పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న చింతలపల్లి శివారులో సభావేదిక, సమావేశానికి హాజరయ్యే ప్రజల కోసం కుర్చీలు, షామీయానాలను వేసేందుకు భూమి చదును పనులు పూర్తి దశకు చేరుకుంటున్నాయి. లక్షల్లో జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున నిఘా కోసం తగినన్ని సీసీ కెమెరాలు, పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా మ్యాపింగ్ చేస్తున్నారు. ఎల్కతుర్తిలో భారీ సభ కోసం మొత్తం 1,159 ఎకరాలు పార్కింగ్ స్థలాలు, సభావేదిక మైదానాల చదును పాతికేళ్ల వేడుకల సభకు మరో పది రోజులే... రోడ్డెక్కిన ప్రచార రథాలు ఆవిర్భావ సభ సక్సెస్‌కు నేడో, రేపో కీలక కమిటీలు ఏర్పాట్లపై రోజు రెండుసార్లు అధినేత కేసీఆర్ ఆరా ఉమ్మడి వరంగల్ నేతలతో రేపు కేసీఆర్ భేటీ...? -
మహిళల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి
హన్మకొండ చౌరస్తా: మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూలే–అంబేడ్కర్ యాదిలో–మహిళల హక్కుల పరరిరక్షణ యాత్ర గురువారం హనుమకొండకు చేరుకుంది. ఈబస్సు యాత్రకు ఐద్వా జిల్లా కమిటీ, వివిద ప్రజా సంఘాల బాధ్యులు వేయిస్తంభాల గుడి వద్ద బోనాలు, డప్పుచప్పుళ్లు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. వేయి స్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా సాగిన ప్రదర్శనలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ సీ్త్ర, పురుషుల మధ్య అసమానత్వం కొనసాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీ్త్రల హక్కుల కోసం పోరాటాలు సాగిస్తామన్నారు. ‘ఐద్వా’ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశాలత, రత్నమాల, సాయిలీల, రామతార, శ్వేత, రాధికారాణి, అనిత, రాధ, పుష్ప, సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఉప్పలయ్య, చక్రపాణి, రజిత, గిరిజన సంఘం నాయకులు వీరన్న, మత్స్యకార్మిక సంఘం నాయకులు వెంకట్, కేవీపీఎస్ బాధ్యులు సాంబయ్య, సంపత్, డీవైఎఫ్ఐ బాధ్యులు కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి -
ఎల్సీ యాప్‌తో ప్రమాదాల నివారణ
హన్మకొండ: ప్రమాదాల నివారణ, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఎల్సీ యాప్‌ను రూపొంచిందని కంపెనీ వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతం రెడ్డి అన్నారు. గురువారం వరంగల్ ఆజంజాహి మిల్ సబ్ స్టేషన్లో ఎల్సీ యాప్‌ను ప్రారంభించి అమలు చేశారు. విద్యుత్ సంబంధ మరమ్మతులు చేస్తున్న క్రమంలో లైన్ క్లియర్ తీసుకుంటామని, ఒక్కోసారి సమాచార లోపంతో ప్రమాదాలు జరిగేవన్నారు. వీటిని అరికట్టేందుకు ఎల్సీ యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ యాప్ ద్వారా ఎల్సీ తీసుకోవాలంటే సంపూర్ణ సమాచారం పొందుపరుచాల్సి ఉంటుందన్నారు. ఈ సమాచారాన్ని పరిశీలించి ఎల్సీ తీసుకుని పనులు చేపట్టడం ద్వారా ప్రమాదాల నివారించొచ్చన్నారు. ఇప్పటి నుంచి వరంగల్ టౌన్ డివిజన్లో ఎల్సీ యాప్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి యాప్ ద్వారానే ఎల్సీ తీసుకోవాలని అధికారులు, ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో డీఈలు ఎ.ఆనందం, ఎస్.మల్లికార్జున్, ఏడీ బి.కిశోర్, ఏఈ సి.హెచ్.సాయి కృష్ణ, సబ్ ఇంజనీర్లు సురేశ్, విజయ్, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఎన్పీడీసీఎల్ వరంగల్ ఎస్ఈ కె.గౌతం రెడ్డి -
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20నుంచి 26వతేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ డి వాసంతి, ఉమ్మడి వరంగల్జిల్లా కోఆర్డినేటర్ ఎ. సదానందం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.అయితే పరకాలలోని జిల్లా పరిషత్ (బాలుర) హైస్కూల్ పరీక్ష కేంద్రానికి అనుబంధంగా ఆ పరీక్ష కేంద్రానికి దగ్గరలోనే ఎస్ఆర్ స్కూల్లో కూడా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరకాల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో హాల్‌టికెట్ నంబర్ 2412130037 నుంచి 2412130187 వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సింటుందని తెలిపారు. పరకాలలోని ఎస్ఆర్ స్కూల్ పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్ నంబర్ 2412130188 నుంచి 2412130380వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఆయా విద్యార్థులు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారించుకోవాలని వారు సూచించారు. 20న అండర్–7 జిల్లా స్థాయి చెస్ పోటీలు వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–07 చదరంగ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హ నుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూ ల్లో ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు జనవరి01, 2018, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను మే నెలలో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పో టీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 90595 22986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. మిర్చి కొనుగోళ్ల వివరాలు సేకరణ వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు చేసిన కమీషన్ వ్యాపారుల వివరాలను జీఎస్టీ అధికారులు సేకరిస్తున్నారు. గురువారం జీఎస్టీ అధికారులు శ్రీధర్, గోపి మార్కెట్ కార్యాలయానికి వచ్చి కార్యదర్శి జి.రెడ్డితో భేటీ అయ్యారు. మార్కెట్ ఫీజులు చెల్లించిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకపోవడం, ఏమేరకు సరుకులు ఖరీదు చేశారన్న వివరాలు తెలియకపోవడంతో అధికారులు కార్యాలయానికి వచ్చినట్లు తెలిసింది. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన సరుకులకు ఒక శాతం మార్కెట్ ఫీజులు చెల్లించారు. ఈ ప్రకారం వ్యాపారులు తాము విక్రయించిన సరుకులకు 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందిన వెంటనే సదరు వ్యాపారులకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలిసింది. అటవీ జంతువును వేటాడిన వ్యక్తి అరెస్ట్బయ్యారం: ఉచ్చులు పెట్టి అటవీ జంతువును వేటాడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు బయ్యారం డీఆర్వో ఉమారాణి గురువారం తెలిపారు. మండలంలోని గౌరారం బీట్ పరిధిలో బాలాజీపేటకు చెందిన చక్కల క్రిష్ణ బుధవారం సమీప అటవీ ప్రాంతంలో కొండగొర్రెను వేటాడారన్నారు. దీంతో అరెస్ట్ చేసి మహబూబాబాద్ కోర్టులో హాజరుపర్చామన్నారు. బీట్ ఆఫీసర్ రాంబాబు తదితరులు ఉన్నారు. -
నిరంతరం కష్టపడితేనే విజయం
కేయూ క్యాంపస్ : నిరంతరం కష్టపడితేనే విజయం వరిస్తుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్ రెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో గురువారం యూనివర్సిటీ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ అధ్యక్షతన నిర్వహించిన యూనివర్సిటీ కాలేజీ వార్షిక స్పోర్ట్స్ అండ్ కల్చరల్ డేలో వీసీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కష్టించే తత్త్వం, పట్టుదల, అకడమిక్‌పై పట్టు, పెద్ద లక్ష్యం, జీవన నైపుణ్యాలు విజయమార్గాన్ని సుగమం చేస్తాయన్నారు. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విద్యార్థి దశలో అవసరమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ సినీ గేయ రచయత, గాయకుడు మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ విద్యార్థులతోనే సమాజ మార్పు సాధ్యమన్నారు. రైతులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల కృతజ్ఞతభావం ఉండాలన్నారు. మరో గౌరవ అతిథి, ఇండియన్ కబడ్డీ టీం పూర్వపు హెడ్ కోచ్ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదువుకు టాలెంట్‌కు సంబంధం లేదు అన్నారు. చదువుతోపాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి. సురేశ్ లాల్, ఎన్. సుదర్శన్, బి. రమ, బి. సుకుమారి, ఎం.నవీన్, చిర్రరాజు, కె. అనితారెడ్డి, పుల్లూరి సుధాకర్, కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, క్యాంపస్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ మమత వందన సమర్పణ గావించారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి -
దక్కన్ క్వీన్ అందాలు జిగేల్..
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ ఎదుట రైల్వే చరిత్ర తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మొద టి తరం రైల్వే స్టీమ్ లోకోమోటివ్ను (కాజీపేట జంక్షన్ ఎదుట ఏర్పాటు చేసినప్పుడు లోకోకు చేసిన నామకరణం హెరిటేజ్ దక్కన్ క్వీన్) రైల్వే అధికారులు గురువారం సుందరీకరించారు. శు క్రవారం ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా డీజిల్లోకోషెడ్ సీనియర్ డీఎంఈ ఎన్. వి.వెంకటకుమార్, డీఎంఈ అనికేత్ కాడే పర్యవేక్షణలో 15 మంది రైల్వే సిబ్బంది పెయింటింగ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి స్టీమ్ లోకోను సుందరంగా అలంకరించినట్లు ఏఆర్టీ ఎస్ ఎస్ ఈ పి.చంద్రశేఖర్ తెలిపారు. స్క్రీన్ ఏర్పాటు చేసి ప్రొజెక్టర్ ద్వారా భారతీయ రైల్వే చరిత్ర, స్టీమ్లోకోమోటివ్ విశేషాలను ప్రదర్శించగా ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. కాగా, విద్యుత్ కాంతుల మధ్య దక్కన్ క్వీన్ జిగేల్ మంటోంది. దీంతో ప్రయాణికులు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. దక్కన్క్వీన్ కొత్త అందాలతో కాజీపేట జంక్షన్ శోభాయమానంగా మారింది. వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ముస్తాబు పెయింటింగ్, లైటింగ్స్‌తో కలర్పుల్గా స్టీమ్లోకో.. ప్రొజెక్టర్ ద్వారా రైల్వే చరిత్ర ప్రదర్శన -
డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి
బయ్యారం: రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమలశాఖ అధికారి జినుగు మరియన్న సూచించారు. మండలంలోని బయ్యారం, బాలాజీపేట, ఇర్సులాపురం గ్రామాల పరిధిలో సాగు చేసిన ఆయిల్‌పామ్, మామిడి, కూరగాయల పంటలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. రైతులు కూరగాయలు, పూలసాగు చేయడం ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మూడు సంవత్సరాలలోపు ఉన్న ఆయిల్‌పామ్ మొక్కలోని పూగుత్తులను నెలకు ఒకసారి, అబ్లేషన్ సాధనంతో రెండుసార్లు తొలగించాలన్నారు. మామిడి, జామ, నిమ్మ, సపోటా, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో మొక్కలకు మల్చింగ్, బిందు సేద్యం ద్వారా నీరు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ మానిటరింగ్ అధికారి కరుణాకర్, ఆయిల్‌ఫెడ్ ఫీల్డ్ అధికారులు చంద్రప్రకాశ్, శ్రీకాంత్, రైతులు అప్పారెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లోu‘ఈ ఫొటోలో బస్సు ఎక్కుతున్న ప్రయాణికులది గూడూరు మండలం భూపతిపేట గ్రామం. అటు మహబూబాబాద్, ఇటు వరంగల్, నర్సంపేట, గూడూ రు వెళ్లే ప్రయాణికులు రోడ్డు పక్కన ఉన్న చెట్ల నీడలో ఉండి బస్సు రాగానే ఎక్కుతున్నారు. ఎక్కువ మంది ఉంటే చెట్టు నీడ సరిపోక.. ఎండలో రోడ్డుపై నిలబడి బస్సు ఎక్కాల్సి వస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.’ ‘ఈ ఫొటోలు కనిపిస్తున్నది కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని జ్యోతిరావుపూలే సెంటర్. ఈ ప్రాంతానికి ఆర్టీసీ బస్టాండ్ కిలోమీటరు దూరంలో ఉంది. వరంగల్ వెళ్లే ప్రయాణికులు ఈ సెంటర్లో బస్సు ఎక్కుతారు. అయితే ఈ సెంటర్లో ప్రయాణికుల కోసం కనీసం బస్‌షెల్టర్ లేదు. ఎండలో కూర్చుంటేనే బస్సు ఎక్కడం.. బస్టాండ్ ఉన్నప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు లేవు.’ సాక్షి, మహబూబాబాద్: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆస్టీసీ బస్షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డుపైనే నిల్చొని గంటల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి గజగజ వణుకుతూ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడంతో సమీపంలోని చెట్లు, దుకాణాలే ప్రయాణికులకు బస్షెల్టర్లుగా మారుతున్నాయి. ఈమేరకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని ప్రధాన సెంటర్ల వద్ద బస్షెల్ట ర్లు లేక ప్రయాణికులు పడుతున్న అవస్థలపై ‘సాక్షి గ్రౌండ్ రిపోర్ట్.’ జిల్లా కేంద్రంలో.. మానుకోట పట్టణంలో ఆర్టీసీ బస్షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సు కోసం ఎండలోనే నిల్చొని వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రం నుంచి తొర్రూరు, నర్సంపేట, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, ఇతర ప్రాంతాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాగా జిల్లా కేంద్రంలోని మదర్‌థెరిస్సా సెంటర్, కురవిగేట్, తొర్రూరు బస్టాండ్ సెంటర్, మూడుకొట్ల సెంటర్ల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ఎండలోనే ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. తొర్రూరు బస్టాండ్ సెంటర్లో చిన్నపాటి బస్షెల ్టర్ ఏర్పాటు చేసినప్పటికీ అది సరిపోక ప్రయాణికులు చెట్లకింద, షాపుల వద్ద ఉంటూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరికి పట్టని షెల్టర్లు.. బస్టాండ్, బస్ షెల్టర్ల గురించి ఆలోచించి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలి. అయితే కొన్ని సంవత్సరాలుగా ఇది జరగడం లేదు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద మున్సిపల్‌శాఖ బస్ షెల్టర్లు నిర్మించాలి. అదే విధంగా గ్రామాలు, మండలాల్లో గ్రామ పంచాయతీ అధ్వర్యంలో, జాతీయ రహదారి వెంట హైవే అథారిటీ వారు నిర్మించాలి. కానీ బస్టాండ్ తప్ప.. జిల్లాలో ఎక్కడ కూడా ప్రయాణికులకోసం షెల్టర్లు నిర్మించడం లేదు. మహబూబాబాద్ ఆర్టీసీ డిపో నుంచి 65 బస్సులు, 30 రూట్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ప్రతీరోజు సుమారు 34 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. న్యూస్‌రీల్ -
‘భూ భారతి’ రైతులకు వరం
కురవి: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం రైతులకు వరంలాంటిదని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్ వీరబహ్మచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వం, పాలకులు రైతుల నుంచి ఎలాంటి సూచనలు తీసుకోకుండా ధరణి పోర్టల్‌ను ప్రారంభించి అన్యాయం చేసిందన్నారు. భూమిపై ఎవరికి ఎలాంటి హక్కులున్నాయో తెలిపే రికార్డు ఈ భూ భారతి చట్టం అన్నారు. ఇందులో ఆరు మాడ్యూల్స్ ఉన్నాయన్నారు. భూ హక్కుల రికార్డులను రూపొందించి. హక్కుల రికార్డుల్లో తప్పులను సరిచేయడం, వివాదాస్పద భూముల రిజిష్ట్రేషన్, మ్యుటేషన్‌కు అవకాశం, భూముల సర్వే చేసి మ్యాప్‌ను రైతు చేతికి అందించడం, వారసత్వంగా వచ్చిన భూములరిజిస్ట్రేషన్ విషయంలో అప్పిళ్లకు అవకాశం ఉంటుదన్నారు. ఇతర మార్గాల ద్వారా వచ్చిన భూమికి మ్యుటేషన్ లేదా సివిల్ రెవెన్యూ కోర్టు, లోక్ అదాలత్ అవార్డు, వివిధ మార్గాల ద్వారా పొందిన భూమికి హక్కులు సంభవిస్తే రికార్డులను సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకం అందిస్తామన్నారు. అప్పిల్ వ్యవస్థ ఏర్పాటు కూడా ఇందులో ఉంటుందన్నారు. తహసీల్దార్లపై ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారికి అసైన్డ్ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కృష్ణవేణి, తహసీల్దాఽర్ సునీల్‌రెడ్డి, డీటీ గణేశ్, ఆర్ఐ నెల్లూరి రవికుమార్, చైర్మన్లు ఇస్లావత్ సుధాకర్, గార్లపాటి వెంకటరెడ్డి, కొర్ను రవీందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రంగౌడ్, నాయకులు పాల్గొన్నారు. ఇసుక రవాణాకు టోకెన్లు ఇవ్వండిచిన్నగూడూరు: మండలంలోని విస్సంపల్లి గ్రామంలో గురువారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ప్రసంగించారు. అనంతరం డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం ఆకేరు వాగు నుంచి ఇసుక రవాణాకు తహసీల్దార్ పర్మిషన్ ఇవ్వడం లేదంటూ స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే తహసీల్దార్‌ను మందలించారు. ‘నంబర్ ప్లేట్, అనుమతులు లేని ఇసుక ట్రాక్టర్లను పట్టుకోండి. ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లేకపోతే ప్రజలకు ఏం పరిపాలన అందిస్తరు. రిటైర్మెంట్లో సస్పెండ్ అయితే ఎలా ఉంటదో మీకు తెలుసు, శనివారం లోపు టోకెన్లు జారీ చేయాలి లేదా మొదట సస్పెండ్ అయ్యేది మీరే’ అని తహసీల్దార్‌ను ఎమ్మెల్యే హెచ్చరించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ -
బాధ్యతాయుతంగా పనిచేయాలి
మహబూబాబాద్ రూరల్: పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని, క్రికెట్ బెట్టింగ్‌లపై నిఘాపెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆదేశించారు. జిల్లా పోలీస్ అధికారులతో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం లేనప్పటికీ, సరఫరా, వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాకు సరఫరా అయ్యే అవకాశం ఉందని, ప్రత్యేక నిఘా పెట్టి రవాణా జరగకుండా పూర్తిస్థాయిలో నియంత్రించాలన్నారు. అందుకు సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాల ని సూచించారు. ప్రత్యేక టాస్క్ఫోర్సులను ఏర్పాటుచేసి తనిఖీలు చేయాలని, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఫిర్యాదులపై చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ప్రతీ గ్రామం, మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఏర్పాటు చేసిన చోట పనిచేయని వాటిని పునరుద్ధరించడం లేదా కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకా లు అందించారు. డీఎస్పీలు తిరుపతిరావు, డీఎస్పీ కృష్ణకిశోర్, డీసీఆర్బీ డీఎస్పీ మోహన్, సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ -
గంటల తరబడి ఎండలోనే..
ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు ఎండలోనే గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. సరైన నీడ కూడా లేదు. ప్రయాణికులు కూర్చునేందుకు షెడ్లు ఏర్పాటు చేయాలి. ప్రయాణికులకు కనీస సౌకర్యాలను కల్పించాలి. తొర్రూరు బస్టాండ్ సెంటర్లో ఉన్న షెడ్లో కొంత మంది ప్రయాణికులు కూర్చుకునేందుకే వీలుంది. – శోభ, రాజులకొత్తపల్లి తాగేందుకు మంచినీరు కూడా లేదు ఊరెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌కు రాగా ఎండల తీవ్రత వల్ల బాగా దాహం అవుతుంది. బస్సు ఎక్కేందుకు వచ్చిన వారికి కనీసం తాగేందుకు మంచినీరు కూడా ఏర్పాటు చేయలేదు. బస్సులు కూడా తొందరగా రావడం లేదు. గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. మంచినీటితో పాటు కూసునేందుకు నీడ ఏర్పాటు చేశారు. – సూరయ్య, తాళ్లపూసపల్లి షెడ్డు ఏర్పాటు చేయాలి జిల్లా కేంద్రంలోని కురవిగేట్ వద్ద ప్రయాణికుల కోసం ఒక షెడ్డు ఉండేది. దానిని కూడా ఇక్కడ నుంచి తీసేశారు. బస్సు కోసం ఎండలోనే ఉండాల్సి వస్తుంది. కురవి, డోర్నకల్, ఖమ్మం ప్రాంతాలకు ఇక్కడ నుంచే ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు వెళ్తారు. కురవిగేట్ వద్ద ప్రయాణికుల కోసం షెడ్డును ఏర్పాటు చేయాలి. అలాగే తాగునీటి సదుపాయం కల్పించాలి. – రమేశ్, సాలార్‌తండా బస్ షెల్టర్ లేక ఇబ్బందులు భూపతిపేట బస్టాండ్ వద్ద బస్ షెల్టర్ లేకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్ల వద్ద నిలబడి బస్సు రాగానే పరుగెత్తి ఎక్కాల్సి వస్తుంది. నర్సంపేట కళాశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు పెద్ద వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఉన్న బస్ షెల్టర్ రోడ్డు వెడల్పులో కనిపించకుండా పోయింది. బస్ షెల్టర్ నిర్మించాల్సిన అవసరం ఉంది. – ఆకుల రమేశ్, సీతానగరం, గూడూరు మండలం● -
సంక్షేమ హాస్టళ్లకు తాళాలు!
మహబూబాబాద్ అర్బన్: విద్యాసంవత్సరం ముగియకముందే సంక్షేమ హాస్టళ్లకు నిర్వాహకులు తాళాలు వేశారు. ప్రస్తుతం 5నుంచి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. కాగా విద్యార్థులు తోటి స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉండి గురువారం చివరి పరీక్ష సాంఘికశాస్త్రం రాసి మధ్యాహ్నం తమ ఇళ్లకు వెళ్లారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ఎస్సీ– ఈ, ఎస్సీ–సీ హాస్టళ్లు, ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులోని బాలికల హాస్టల్, కేసముద్రం ఎస్సీ బాలుర హాస్టళ్లకు తాళాలు వేయడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సెలవులు ప్రకటించకుండానే వార్డెన్లు, వర్కర్లు ఇంటిబాట పట్టారని, వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈవిషయంపై ఎస్సీ షెడ్యూల్డ్ కులాల అధికారి ఎం. నర్సింహస్వామిని వివరణ కోరగా.. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఈ నెల 23నుంచి విద్యార్థులకు సెలవులు ఉన్నాయని, హాస్టళ్లకు తాళాలు వేస్తే, ఆ వార్డెన్లపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవి సెలవులు ప్రకటించక ముందే మూత నిర్వహణలో వార్డెన్ల ఇష్టారాజ్యం -
ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి
తొర్రూరు రూరల్: ప్రభుత్వ బడుల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అ న్నారు. బుధవారం మండలంలోని చెర్లపాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝూన్సీరెడ్డి, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ఫౌండేషన్ ప్రతినిధులు బాకి శ్రీనివాస్, నాగరాజు, నాగిరెడ్డి, యాకుబ్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, బీరెల్లి లావణ్య, రామచంద్రు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
గురువారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోuజిల్లాలో అంగన్వాడీల వివరాలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నవి : 713పక్కా భవనాలు, రెంటెండ్ భవనాల్లో కొనసాగుతున్నవి : 724 మొత్తం : 1,437అంగన్వాడీల్లో ఆంగ్ల విద్య● ప్రీ ప్రైమరీ బోధనకు సిద్ధం ● ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని కేంద్రాలపై దృష్టి ● విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం ● అంగన్వాడీ టీచర్‌తో పాటు మరొకరిని నియమించే అవకాశం సాక్షి, మహబూబాబాద్: పుట్టిన బిడ్డ నుంచి చదువులు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే మొత్తం బాధ్యత తీసుకొని మంచి బోధన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో అటు పౌష్టికాహారం, ఇటు ఉత్తమ బోధనకు పునాది వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు. జూన్ నుంచి విద్యాబోధన.. అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఒకేసారి మార్చడం ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనతో ముందుగా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించారు. జిల్లాలో డోర్నకల్, గూడూరు, మరిపెడ, మహబూబాబాద్, తొర్రూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,437 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 724 కేంద్రాలు పక్కా భవనాలు, రెంటెండ్ భవనాల్లో ఉండగా.. మిగిలిన 713 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో ముందుగా 30 కేంద్రాలను ఎంపిక చేసి వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా నుంచి ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించే అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ టీచర్ల విద్యార్హతలు మొదలైన వివరాలను రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నారు. కిడ్స్ స్కూల్స్ తరహాలో.. ప్రభుత్వ నిబంధనల మేరకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ఉంది. అయితే ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. కానీ ఆ తర్వాత పిల్ల లను ప్రభుత్వ పాఠశాలలో ఉంచడం లేదు. ఇందుకోసం పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలసిన కిడ్స్, వండర్ వర్డ్స్, కిండర్ గార్డెన్, మాంటీసోరీ, బచ్పన్ మొదలైన పేర్లతో లక్షల రూపాయల ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. అక్కడ ఆంగ్ల మాధ్యమం బోధన చేయడంతో పేదలు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఆయా స్కూల్స్‌కు పంపుతున్నారు. అదే ఒరవడిలో చదవడం, ప్రైవేట్ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు. అదే అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు ఆటలు, పాటలు, అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, పిల్ల లను ప్రాథమిక పాఠశాలల్లో చేరేందుకు అర్హులను చేయడం అంటే.. అక్షరాలు, అంకెలు, రైమ్స్ వంటి నేర్పించడం, నర్సరీ, యూకేజీ, ఎల్కేజీలు అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. న్యూస్రీల్ఉద్యోగుల్లో ఆందోళన అంగన్వాడీ కేంద్రాలను ప్రీప్రైమరీ పాఠశాలలుగా మార్చే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో అంగన్వాడీ టీచర్లల్లో ఆందోళన మొదలైంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో డైట్, బీఈడీ వంటి అర్హతలు ఉన్న వారిని వలంటీర్లుగా నియమిస్తారని ప్రకటనలు వస్తున్నాయి. అయితే సెంటర్‌కు మరొక టీచర్ వస్తే తమ ప్రాభల్యం తగ్గుతుందని కొందరు దశలవారీగా అంగన్వాడీ కేంద్రాలు ఎత్తి వేస్తారని మరికొందరు చెప్పడంతో అంగన్వాడీ టీచర్లలో భయం పట్టుకుంది. దీనిపై ఇప్పటికే అంగన్వాడీ ఉద్యోగుల అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఉన్నతాధికారులకు వినతి పత్రం కూడా అందచేశారు. -
యోగా కౌన్సెలర్ల నియామకానికి ఇంటర్వ్యూలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్యాకేంద్రంలో డిప్లొమా ఇన్ యోగా కోర్సు బోధనకు బుధవారం కౌన్సెలర్ల నియామకానికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. దూర విద్యాకేంద్రం డైరెక్టర్ బి.సురేష్‌లాల్, విద్యావిభాగం డీన్ ఎన్.రాంనాఽథ్కిషన్, బీఓఎస్, వరంగల్ నిట్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు. 9మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరితో ఈ రెండు బ్యాచ్‌లకు యోగా థియరీ ,ప్రాక్టికల్స్ క్లాస్‌లు నిర్వహించాలని యోచిస్తునట్లు డైరెక్టర్ సురేష్‌లాల్ తెలిపారు. -
సెలవులు ఇవ్వకముందే ఇంటిబాట
మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవులు ఇవ్వకముం దే కొంతమంది హాస్టల్ వార్డెన్లు విద్యార్థులను ఇంటికి పంపుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ప్ర భుత్వ, ప్రైవేట్ పాఠశాల, గిరిజన ఆశ్రమ పాఠశా ల, వివిధ గురుకుల పాఠశాలలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ నెల 9 నుంచి 17వ తే దీ వరకు వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. ఈ క్ర మంలో వార్షిక పరీక్షలు ముగిశాయని గిరిజన ఆ శ్రమ పాఠశాల హాస్టల్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు పరీక్షలు ముసిగిన తర్వాత ఈ నెల 23వ తేదీ వరకు విద్యార్థుల త ల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రొగ్రెస్ కా ర్డులు అందజేసి పంపించాలి. కానీ ముత్యాలమ్మగూడెం, మానుకోట జిల్లా కేంద్రంలోని ఆర్డీ కార్యాలయం ఎదురుగా ఉన్న గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల హాస్టల్స్ ప్రభుత్వ నింబంధనలు పాటించకుండా వార్డెన్లు విద్యార్థులను సెలవులు వచ్చాయని ఇంటికి వెళ్లిపోవాలని సెలవు పత్రాలు రా యించుకుని పంపిస్తున్నారు. కొంత మంది వార్డెన్లు విద్యార్థుల బారం మోయలేమని, గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, వార్డెన్లు మీ పిల్లలను ఇంటికి తీసుకెళ్లాలని ఫోన్లు చేస్తున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పటికై న హాస్టల్స్ వార్డెన్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిబంధనలను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనిపై గిరిజన శాఖ అధికారిని వివరణ కోరగా విద్యార్థులు ఇంటికి వెళ్లడానికి అనుమ తి లేదని, ప్రభుత్వం సెలవులు మంజూరు చేసినప్పుడే తల్లిదండ్రులతో ఇంటికి పంపాలన్నారు. లే దంటే వార్డెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లు -
నెల రోజుల్లో ‘కిటెక్స్’ ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లోని కేరళ కేంద్రంగా ఉన్న ‘కిటెక్స్’ కంపెనీని నెల రోజుల్లో ప్రారంభిస్తామని మేనేజర్ మనోజ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ సత్యశారద, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కంపెనీ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మేనేజర్ మనోజ్.. కలెక్టర్, ఎమ్మెల్యేకు కంపెనీలో తయారు చేసే గార్మెంట్లు, ఉద్యోగావకాశాల గురించి వివరించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోందని, వచ్చే నెలలో ప్రధాని మోదీతో కంపెనీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, కంపెనీలో ఇప్పటికే పలు కేటగిరీలకు చెందిన ఉద్యోగుల భర్తీ ప్రత్యక్షంగా, ఆన్లైన్లో కొనసాగుతోంది. కంపెనీ ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి రోజూ నిరుద్యోగులు కంపెనీ వద్దకు దరఖాస్తులతో క్యూ కడుతున్నారు. టీజీ ఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి, గీసుకొండ తహసీల్దార్ ఎండి. రియాజుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. 20న హజ్ యాత్రికులకు శిక్షణ న్యూశాయంపేట : పవిత్ర మక్కాలోని హజ్ యాత్రకు వెళ్లే ఉమ్మడి వరంగల్ జిల్లా యాత్రికులకు ఈనెల 20 ఆదివారం ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వరంగల్ జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్మోహియోద్దీన్ ఘాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరంగల్ ఎల్బీ నగర్‌లోని ఏ1 ఫంక్షన్హాల్లో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యాత్రికులకు ప్రొజెక్టర్ ద్వారా సవివరంగా యాత్ర ఎలా చేయాలనే విషయాలపై శిక్షణ అందిస్తారన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ ఖుష్రూపాషా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాత్రీకులు సకాలంలో హాజరుకావాలని ఆయన కోరారు. ● కంపెనీ మేనేజర్ మనోజ్ ● పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యేకు వివరించిన మేనేజర్ -
రక్త పరీక్షల ఫలితాలు త్వరగా అందించాలి
నెహ్రూసెంటర్: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన రక్త నమూనాలను త్వరగా పరీక్షించి ఫలితాలను వెంటనే పంపించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో టీహబ్, పాలియేటివ్ కేర్, టీబీ ప్రోగ్రాం, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్స్, ఎయిడ్స్ కార్యక్రమాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులను పరీక్షించి రక్త నమూనాలను సేకరించి ఆన్లైన్లో వివరాలను నమోదు చేయాలన్నారు. క్షయ వ్యాధికి సంబంధించిన సిబి నాట్ టెస్టులు, ట్రూ నాట్ టెస్టులు జరుగుతున్నాయని దీనిపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ నాగేశ్వర్రావు, విజయ్‌కుమార్, శ్రవణ్‌కుమార్, జ్యోతిరెడ్డి, మేనేజర్ అనురాధ, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ వైద్యసేవలే లక్ష్యం గూడూరు: గ్రామీణ ప్రాంతాల్లో ఉత్తమ వైద్య సేవలే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవిరాథోడ్ అన్నారు. మండలంలోని అయోధ్యపురం పీహెచ్‌సీతో పాటు భూపతిపేట వ్యాక్సినేషన్ సెంటర్లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిపోర్టులు పరిశీలించి, అన్ని జాతీయ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యమున, హెచ్ఈఓ లోక్యానాయక్, గణేష్, సర్ధార్బాబు, విశాల, స్రవంతి, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ రవిరాథోడ్ -
విద్యుత్ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి హన్మకొండ : ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో 16 సర్కిళ్ల పరిధిలో ప్రతీ అధికారి, ఉద్యోగి అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. బుధవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ ఈదురుగాలులకు చెట్లు విరిగి లైన్లు తెగిపడి ట్రిప్పింగ్స్, బ్రేక్ డౌన్స్ జరిగిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎప్పటికప్పడు తమ సర్కిల్ పరిధిలోని సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌కు చేరవేయాలని, అక్కడి నుంచి కార్పొరేట్ ఆఫీస్‌కు సమాచారం అందించాలన్నారు. కావాల్సిన మెటీరియల్ అందుబాటలో ఉంచామని, ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. ఎక్కువ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, జగిత్యాల, పెద్దపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ఈదురుగాలులు, భారీ వర్షాలు పడుతాయని, ఎస్ఈలు ఎప్పటికప్పుడు విద్యుత్ సరఫరా మానిటర్ చేస్తూ, మెన్, మెటీరియల్‌తో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్ టి.మధుసూదన్, సీఈలు రాజుచౌహాన్, అశోక్, 16 సర్కిళ్ల ఎస్ఈలు పాల్గొన్నారు. -
ఒక్కడే..18 బైక్‌లు చోరీ
హసన్‌పర్తి: ఒకే యువకుడు వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన 18 బైక్‌లు చోరీ చేశాడు. వాహనాల తనిఖీల్లో తప్పించుకునే క్రమంలో పోలీసులను చూసి పారిపోతుండగా అదుపులోకి తీసుకుని తీసుకుని విచారించగా ఈ విషయం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ తిరుమల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫతేపూర్‌కు చెందిన గుగులోత్ చందూలాల్ కొంతకాలంగా 56వ డివిజన్ గోపాలపురంలో ఉంటున్నాడు. తన స్నేహితుడి ఐడీతో జొమాటో, స్విగ్గి, ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్నాడు.అయితే ఆ ఆదాయం సరిపడక పోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనకు వచ్చి రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను మాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా హనుమకొండ పీఎస్ పరిధిలో ఏడు, హసన్‌పర్తి పీఎస్ పరిధిలో మూడు, కేయూసీ పీఎస్ పరిధిలో ఒకటి, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పరిధిలో నాలుగు, భువనగిరిలో రెండు, హైదరాబాద్‌లో ఒకటిచొప్పున ఎత్తుకెళ్లాడు. ఇంటిలోనే చోరీ వాహనాలు.. హసన్‌పర్తి మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసిన చందూలాల్ తప్పించుకునే క్రమంలో పట్టుకుని విచారించారు. చోరీ వాహనాలను ఫతేపూర్‌లోని తన ఇంటిలోనే భద్రపరిచినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో అతడి ఇంటికెళ్లి 18 బైక్‌లు స్వాధీనం చేసుకున్న ట్లు ఏసీపీ తిరుమల్ చెప్పారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా, ఏసీపీ తిరుమల్, పోలీస్ ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, సిబ్బందిని వరంగల్ పో లీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అభినందించారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యం.. నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ -
విద్యార్థుల నమోదు శాతం పెరగాలి
● గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్ మహబూబాబాద్ రూరల్: నూతన విద్యా సంవత్సరంలో గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచే విధంగా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు కృషి చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశీరాంనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ సాధారణ సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ దేశీరాంనాయక్ మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరంలో విద్యా వ్యవస్థ పనితీరు, వసతి గృహాల విధివిధానాల కార్యాచరణపై పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి విషయంలో ప్రత్యేక చొరవ చూపి నూతన విధివిధానాలకు అనుగుణంగా పనితీరును మెరుగు పరచుకోవాలని సూచించారు. వేసవి సెలవుల్లో పాఠశాలలన్నింటికి రంగులు, మరమ్మతులు పూర్తి చేసి ఆకర్షణీయంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
టెంట్‌సిటీ నిర్మాణాలు త్వరగా చేపట్టాలి
కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 15 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న సరస్వతీనది పుష్కరాల్లో టూరిజంశాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన టెంట్‌సిటీ పనులు యుద్ధప్రాతిపాదికన చేట్టాలని మంత్రి శ్రీధర్‌బాబు.. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మను ఆదేశించినట్లు తెలిసింది. బుధవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో జరిగిన సరస్వతీ పుష్కరాల యాప్, వెబ్‌పోర్టల్ ప్రారంభ సమీక్షలో కలెక్టర్‌తో మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి) ఘాట్ వద్ద తాత్కాలిక టెంట్‌సిటీ నిర్మాణాలకు రూ.83లక్షలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు. మేఘా, సింగరేణి, ఎన్టీపీసీల్లో ఏదో ఒక్క సంస్థకు అప్పగించి పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు సమాచారం. టెంట్‌సిటీ కోసం ఇప్పటికే కాళేశ్వరంలో దేవస్థానానికి సంబంధించిన గుడిమాన్యం భూమిలో ఆరు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. రైతులకు కూడా పంటనష్టం అందజేశారు. కానీ నిర్మాణాలు మొదలు కాకపోవడంతో మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రెండు రోజుల్లో షార్ట్టెండర్స్ పిలిచి పనులు చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆలయ వర్గాల సమాచారం. వీఐపీ ఘాట్ వద్ద విగ్రహాల తొలగింపు కాళేశ్వరంలోని వీఐపీ(సరస్వతి)ఘాట్ వద్ద పుష్కఘాట్ విస్తరణలో భాగంగా వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టు కింద భక్తులు ఏర్పాటు చేసిన పలు దేవతా విగ్రహాలకు బుధవారం ఉద్వాసన పూజ చేసి తొలగించారు. కాగా, ఇటీవల కలెక్టర్ రాహుల్‌శర్మ సరస్వతీనది పుష్కరాల అభివృద్ధి పనులు పరిశీలించిన సమయంలో ఘాట్‌పై ఉన్న వేప, జమ్మి చెట్లు కలిసి ఉన్న చెట్టును తొలగించొద్దని, దేవతా విగ్రహాలను తొలగించి ప్రత్యేకంగా మళ్లీ ఓ చోట ఏర్పాటు చేయాలని అఽధికారులకు ఆదేశించారు. దీంతో తొలగింపు పనులు చేపట్టారు. కలెక్టర్‌కు మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశం -
అసత్య ప్రచారాలు మానుకోవాలి
మహబూబాబాద్ అర్బన్: వక్ఫ్ బిల్లు రద్దుపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం రచించిన ప్రకారం అన్ని వర్గాల ప్రజలకు సమాన స్వేచ్ఛ హక్కులు కల్పించారని, మైనార్టీలకు కూడా బీజేపీ ప్రభుత్వం అన్ని సమాన హక్కులు కల్పిస్తుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం 106 సార్లు సవరణ జరిగిందని, 1954, 1955, 2013లో వక్ఫ్ బోర్డు బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వామే సవరించిందని గుర్తు చేశారు. ప్రతి పేద ముస్లిం, మైనార్టీ ప్రజలకు న్యాయం జరగడానికే ప్రధాన మంత్రి వక్ఫ్ బోర్డు బిల్లు సవరించడం జరిగిందని, నేడు ఈ సవరణ బిల్లు సుప్రీంకోర్టులో ఉందని, దీనిపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నాయకులకు సరికాదన్నారు. బీజేపీ ఎప్పుడు ముస్లింకు వ్యతిరేకంగా కాదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి మొసంగి మురళీ, చీకటి మహేష్‌గౌడ్, శ్యాంసుందర్‌శర్మ, నాయకులు గడ్డం అశోక్, తుంపిళ్ళ శ్రీనివాస్, దార ఇందుభారతి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ -
వేసవిలో డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలి
హన్మకొండ: వేసవి కాలంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవర్లు విధులు నిర్వర్తించాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను అన్నారు. బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని ఆర్టీసీ హనుమకొండ డిపోలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లకు వాటర్ క్యాన్లు, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ డ్రైవర్లు ఎండతోపాటు ఇంజన్ వేడి తట్టుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఇలాంటి తరుణంలో తగినంత తాగు నీరు తీసుకోవాలన్నారు. అదే విధంగా ఎండ నుంచి ఉపశమనానికి రుమాలు చుట్టుకోవాలన్నారు. డ్యూటీలో అస్వస్థతకు గురవుతున్నట్లు కనిపించినా, డీ హైడ్రేషన్‌కు గరైనా వెంటనే ఓఆర్ఎస్ తీసుకోవాలన్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడగాలులు, ఎండ వేడి నుంచి కొంతైనా ఉపశమనం పొందొచ్చన్నారు. ఈ క్రమంలోనే హనుమకొండ డిపోలోని ప్రతీ డ్రైవర్‌కు జ్యూట్ బ్యాగుతో కూడిన 5 లీటర్ల వాటర్ క్యాన్, రుమాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించినట్లు వివరించారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హనుమకొండ డిపో మేనేజర్ బి.ధరమ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్లు కేశరాజు భానుకిరణ్, మహేశ్, హనుమకొండ డిపో ట్రాఫిక్ సూపర్వైజర్ నజియాసుల్తానా, మెకానిక్ సూపర్వైజర్ వి.చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను -
కాళేశ్వరం ఆర్చి నిర్మాణ పనులు ప్రారంభం
2018లో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొలగింపుకాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో కాళేశ్వరం దేవస్థానానికి సంబంధించిన ఆర్చి నిర్మాణ పనులు ఎన్‌హెచ్ 353(సీ)ప్రధాన రహదారి పైన బుధవారం ప్రారంభమయ్యాయి. 2018లో కాళేశ్వరం ప్రాజెక్టునిర్మాణ సమయంలో భారీ యంత్రాలు, పరికరాలు, మోటార్లు ఆర్చి కింద నుంచి వెళ్లేందుకు వీలుగా లేకపోవడంతో మేఘా ఇన్ ఫ్రా సంస్థ కూల్చివేసింది. నిర్మాణానికి నష్టపరిహారంగా రూ.25లక్షలు దేవస్థానానికి సదరు సంస్థ చెల్లించింది. అప్పటి నుంచి ఆర్చి నిర్మాణాలపై దేవాదాయశాఖ దృష్టిసారించలేదు. ఈక్రమంలో మే 15వ తేదీ నుంచి 26 వరకు జరిగే సరస్వతీనది పుష్కరాల సందర్భంగా ఆర్చి పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ఆదేశించడంతో ఈఓ మహేష్ పనులు ప్రారంభించారు. పిల్లర్లకోసం జేసీబీతో తవ్వకాల చేపట్టారు. కాగా, రూ. 32 లక్షల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. -
హాల్‌మార్క్ సర్టిఫికెట్తో పసిడి నాణ్యత..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ హాల్‌మార్క్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశ పెట్టింది. తయారైన ఆభరణం చిన్నదైనా,పెద్దదైనా హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తో పాటు ఆ వస్తువు సర్టిఫై చేసిన హాల్‌మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ యూనిక్ ఐడీ నంబర్ విధిగా ఉండాలి. ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ఇవేవి చేయకపోగా అన్ని ఆభరణాలు 91.6 అని విక్రయిస్తున్నారు. దీనికి రశీదులు ఇవ్వకుండా.. ఇచ్చినా అందులో వివరాలు తెలుపడం లేదు. దీనిపై వినియోగదారులు చైతన్యవంతులై నిలదీయాలి. -
బాలుడి కాలుపై వాత పెట్టిన ఆయా
మహబూబాబాద్: ఓ అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న ఆయా స్టౌవ్‌పై కత్తిని వేడి చేసి బాలుడి కాలుపై వాత పెట్టింది. ఈ ఘటన మహబూ బాబాద్ జిల్లాకేంద్రంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సిగ్నల్ కాలనీకి చెందిన పావని, వంశీ దంపతుల కుమారుడు మనుదీప్ (5 ఏళ్లు)ను స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. నాలుగు రోజుల క్రితం కేంద్రంలో పనిచేస్తున్న ఆయా భద్రమ్మ.. సదరు విద్యార్థి మనుదీప్ కుడి మోకాలు కింద భాగంలో వాత పెట్టింది. కూ రగాయలు కోసే కత్తిని స్టౌవ్‌పై వేడి చేసి వాతపె ట్టడంతో పెద్ద గాయం కావడంతోపాటు జ్వరం వచ్చిందని తల్లి తెలిపింది. దీంతో బుధవారం అంగన్వాడీ కేంద్రం ఎదుట బాలుడి తల్లిదండ్రులతోపాటు బంధువులు ఆందోళన చేశారు. అంగన్వాడీ టీచర్ సరితతోపాటు ఆయా భద్రమ్మతో వాగ్వాదానికి దిగారు. టీచర్ సరిత, ఆయా భద్రమ్మను వివరణ కోరగా వాత పెట్టలేదని, వారి వ్యక్తిగత గొడవల మూలంగానే ఆందోళన చేశారని తెలిపారు. -
మోసగించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య
ఎల్కతుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 1,200 ఎకరాల్లో ఈనెల 27న నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్స సభ ఏర్పాట్లను ఆమె మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నరేందర్, నాయకులు నాగుర్ల వెంకన్న, భరత్‌కుమార్, రాకేశ్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చితకిలపడిపోయిందన్నారు. నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సదానంద, పార్టీ మండల అధ్యక్షులు మహేందర్, మండల సురేందర్, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, తంగెడ మహేందర్, గోల్లె మహేందర్, మాజీ సర్పంచ్‌లు కుర్ర సాంబమూర్తి, దుగ్యాని సమ్మయ్య, జూపాక జడ్సన్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ -
ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ వర్తింపజేయాలి
మహబూబాబాద్ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు)గా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య (గాంధీ) కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని మహబూబాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘుపతిరెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,779 సర్క్యులర్‌ను రద్దు చేసి, లిస్ట్ మూడు కింద ఉద్యోగాలు కోల్పోయిన వారిని మళ్లీ ఉద్యోగాలకు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.35 వేలు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు, జీవిత బీమా కల్పించాలని కోరారు. ఉద్యోగ సమయంలో మరణించిన వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, శ్వేత, సుజాత, ఉమారాణి, స్వాతి, విమల, ఉపేందర్, సుధాకర్, శ్రీలత, శంకర్ తదితరులు పాల్గొన్నారు. 50 ఆకుల కట్ట రూ.3.30● తునికాకు ధరల నిర్ణయం కొత్తగూడ: తునికాకు సేకరణ ధరలను ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు మండల కేంద్రంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో బుధవారం చర్చించి ధరలు నిర్ణయించారు. 50 ఆకుల కట్టకు రూ.3.30 నిర్ణయించారు. గతంలో రూ.3 ఉండగా అదనంగా 30 పైసలు పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ ధరలకు కాంట్రాక్టర్లు సమ్మతించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి, సందీప్, సారయ్య, న్యూడెమోక్రసీ నాయకులు పుల్లన్న, శ్రీశైలం, మంగన్న, బూర్క బుచ్చిరాములు, యాదగిరి, యుగేందర్, తదితరులు పాల్గొన్నారు. పూడికతీత పనులు చేపడతాం ● మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ డోర్నకల్: సిగ్నల్తండాలోని తాగునీటి బావిలో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపడతామని మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్తండాలో తాగునీటి ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కమిషనర్ హెల్త్ అసిస్టెంట్ అహ్మద్‌తో కలిసి బుధవారం సిగ్నల్‌తండా బావిని పరిశీలించారు. ఈ సందనకభంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్‌ప్లాన్ నిధులతో బావిలో పూడికతీత పనులు చేపట్టి తండాకు తాగునీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి కేయూ క్యాంపస్: గత వీసీ హయాంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రాబోయే నూతనకమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దామని కేయూ ఎన్జీఓ అధ్యక్షుడు ఎల్.యాదగిరి, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని సెనేట్హాల్లో నిర్వహించిన ఆ సంఘం సంఘం సర్వసభ్యసమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసిన వాటిని వివరించారు. కొత్త కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 21 తరువాత ఎన్నికలు జరపాలని ప్రస్తుత కమిటీ కోరనున్నది. ఆ తరువాత ఎన్నికై న నూతనకమిటీ ఇకనుంచి మూడేళ్లపాటు కొనసాగబోతుంది. సమావేశంలో ఉపాధ్యక్షుడు యూనస్, జా యింట్ సెక్రటరీలు తోట ప్రభాకర్, ఎ.సతీష్ బాబు, అరుణకుమారి, కోశాధికారి జి.నిరంజన్ బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు. జెన్పాక్ట్ నియామకాల్లో ‘పింగిళి’ విద్యార్థినుల సత్తా హన్మకొండ అర్బన్: ప్రముఖ కార్పొరేట్ సంస్థ జెన్పాక్ట్లో వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మ హిళా కళాశాల విద్యార్థినులు17 మంది ఉద్యోగాలు సాధించి సత్తా చాటినట్లు కళాశాల ప్రిన్సి పాల్ చంద్రమౌళి తెలిపారు. ఉద్యోగాలు సా ధించిన విద్యార్థులకు బుధవారం కళాశాల ఆ వరణలో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కా ర్పొరేట్ కళాశాలలకు తీసిపోకుండా ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. -
రూ. 5.60 లక్షల విలువైన ఎండు గంజాయి పట్టివేత
● ముగ్గురి అరెస్ట్, రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ సంపత్‌రావు భూపాలపల్లి అర్బన్: గణపురం మండలం రవినగర్ సమీపంలో రూ. 5.60లక్షల విలువైన 11 కేజీల ఎండు గంజాయి పట్టుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్ల డించారు. భూపాలపల్లి మండలం గుర్రంపేటకు చెందిన ఆరెల్లి అఖిల్, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఆముదాల కార్తీక్, హనుమకొండ జిల్లా నడికూడ మండలం వరికోల్‌కు చెందిన ముస్కే రోహిత్ స్నేహితులు. తాము సంపాదించే డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో కొద్ది రోజులుగా ఒడిశాలోని కొండప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి భూపాలపల్లి, గణపురం మండలాల పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న రవినగర్ సమీపంలో గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు అశోక్ తన సిబ్బందితో కలిసి మంగలోనికుంట మత్తడి వద్ద మాటు వేయగా ముగ్గురు వ్యక్తులు సంచులు పట్టుకుని అనుమానాస్పందగా కనిపించారు. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించడంతో సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ సంపత్‌రావు తెలిపారు. కాగా, గంజాయిని పట్టుకోవడంలో ఉత్తమ విధులు నిర్వర్తించిన చిట్యాల సీఐ మల్లేశ్, సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై అశోక్, సీసీఎస్ ఎస్సై భాస్కర్‌రావు, సిబ్బందిని అభినందించారు. వడదెబ్బతో మహిళ మృతి నర్సంపేట రూరల్ : వడదెబ్బతో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘ టన నర్సంపేట మండలంలోని రాజుపేట శివారు గార్లగడ్డతండా లో చోటు చేసుకుంది. కుటుంబీకుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఫాల్తియా వసంత (35) మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి పజ్జజొన్న చేనులో పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చింది. అదేరోజు రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందింది. మృతురాలికి భర్త భద్రు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రైలునుంచి జారి పడి యువకుడి మృతి ఖిలా వరంగల్ : వరంగల్ రైల్వేగేట్ వద్ద ఓ యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు. వరంగల్ శివనగర్‌లోని ఏసీరెడ్డి నగర్‌కు చెందిన పెరుమాండ్ల అనిల్ (29) మంగళవారం రామగుండంలో కూలి పనికి వెళ్లి తిరిగి రైలులో సాయంత్రం ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రైలు వరంగల్ రైల్వే గేట్ సమీపాన చేరుకోగానే అనిల్ అందులోనుంచి జారిపడగా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆటోలో ఎంజీఎం తరలించగా.. వై ద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవా రం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు శవపంచనామ నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
కాటాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య
ఎస్ఎస్ తాడ్వాయి: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని కాటాపూర్‌లోని బెస్త గుంపులో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ రెడ్డి కథనం ప్రకారం.. కాటాపూర్ బెస్త గుంపునకు చెందిన కంపెల్లి దేవేందర్ ((40)) నాలుగు సంవత్సరాల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎలక్ట్రీషియన్‌గా పని చేసుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నెల 15న కాటాపూర్ వచ్చాడు. అదే రోజున గ్రామంలో సర్కస్ నిర్వహిస్తుండగా చూడడానికి వెళ్లి తిరిగి రాత్రి ఇంటికొచ్చాడు. సుమారు 10 గంటల ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి కన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దేవేందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై పేర్కొన్నారు. కాగా, తన కుమారుడి ఆత్మహత్యకు రామెల్ల ప్రశాంత్, నర్సయ్య కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కన్నమ్మ కోరింది. కక్కిరాలపల్లిలో మరో వ్యక్తి.. ఐనవోలు: ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన మండలంలోని కక్కిరాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై పస్తం శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కత్తెరశాల చందర్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య శ్వేతతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీనిపై మనస్తాపానికి గురైన చందర్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, చందర్‌కు మొదట మమతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు రాజేశ్, రోహిత్ జన్మించారు. చందర్‌తో మొదటి భార్య, కుమారులు వేరుగా ఉండడంతో సుమారు 10 సంవత్సరాల క్రితమే శ్వేతను రెండో వివాహం చేసుకున్నాడు. చందర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై తెలిపారు. -
హాల్‌మార్క్ సర్టిఫికెట్తో కొనుగోలు చేయాలి
బంగారు ఆభరణాల కొనుగోలులో వినియోగదారులు జాగ్రత్తలు పాటించాలి. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు వ్యాపారులకు వరంగా, వినియోగదారులకు భారంగా మారాయి. రెడీమేడ్ బంగారం, వెండి ఆభరణాల్లో 60 నుంచి 70శాతం నష్టాన్ని కలిగిస్తాయి. నాణ్యతాప్రమాణాల గుర్తింపు కోసం హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తో కూడిన వస్తువునే కొనుగోలు చేయాలి. వస్తువు నాణ్యత లేనిపక్షంలో బీఐఎస్‌కు ఆన్లైన్లో లేదా వినియోగదారుల సంఘాల ప్రతినిధికి ఫిర్యాదు చేయాలి –మొగిలిచెర్ల సుదర్శన్, రాష్ట్ర అధ్యక్షుడు, సీసీఐ -
తెలుసుకోండి..!
కొనేముందు ఖిలా వరంగల్: బంగారం ఆభరణాలంటే ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా మహిళలు మక్కువ చూపుతారు. హుందాకు చిహ్నంగా భావిస్తారు. అందుకే పెళ్లిళ్లు, శుభకార్యాలయాల్లో బంగార ఆభరణాలదే అగ్రస్థానం. ధర ఎంత పెరిగినా.. పసిడిని కొనుగోలు చేయడం మానరు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం సంప్రదాయ అవసరాలు తీర్చడమే కాకుండా పెట్టుబడులకు కూడా ఉపయోగపడుతోంది. అందుకే చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా బంగారం విక్రయాలు పెరుగుతున్నాయి. అదే స్థాయిలో షాపులు కూడా పెరుగుతున్నాయి. భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, ఏటూరునాగరం, నర్సంపేట, పరకాల, తొర్రూరు, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యల్లో బంగారు ఆభరణాల షాపులు ఉన్నాయి. కొనుగోలు సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు బంగారం, దాని నాణ్యతను సులువుగా గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. వరంగల్ ట్రైసిటీలో చిన్న, పెద్ద కలిపి సుమారు 150పైగా దుకాణాలు ఉన్నాయి. అనధికారికంగా మరికొన్ని వెలుస్తున్నాయి. ప్ర స్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.95 వేలకుపైగా చేరింది. ఈ క్రమంలో కొనుగోలు సమయంలో వినియోగదారులు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంగారంలోనే రంగులు బంగారు ఆభరణం తయారీలో నికిల్, మాంగనీస్ లేదా పల్లాడియం వంటి లోహాలు కలుపుతారు. అప్పుడు అది బంగారం వర్ణంలోనే కొంచెం తెల్లని ఛాయలో ఉంటుంది. రాగి ఎక్కువ కలిపితే ఎరుపు, గులాబీ ఛాయలో కనిపిస్తుంది. రోజ్‌గోల్డ్ అయితే అందులో 25 శాతం రాగి కలిపినట్లు అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఆ బంగారంతో 18 క్యారెట్లు మాత్రమే ఉంటుంది. వెండి, మాంగనీస్, రాగిని ఉపయోగిస్తే బూడిద రంగు ఛాయలో ఉంటుంది. కేవలం వెండిని మాత్రమే కలిపితే గ్రీనిస్ షేడ్‌లో కనిపిస్తుంది. స్వచ్ఛత గుర్తింపు ఇలా.. ఆభరణం అంచులు రంగు పోయి బంగారపు వర్ణం కాకుండా ఇతర వర్ణం కనిపిస్తుంటే అది కచ్చితంగా పూత పోసిన ఆభరణమని గ్రహించాలి. నోటి పళ్ల మధ్య పెట్టి బలంతో ఆభరణాన్ని నొక్కి చూడండి. స్వచ్ఛ బంగారమా.. పూత పోసిందా అని తెలుసుకోవచ్చు. పంటి గాట్లను గమనించి బంగారం నాణ్యతను సులభంగా తెలుసుకోవచ్చు. బంగారంలో ఇనుము కలిసి ఉంటే ఆయస్కాంతంతో గుర్తించొచ్చు. షైనింగ్ లేని సిరామిక్ ప్లేట్ మీద బంగారు ఆభరణాన్ని రుద్దితే నల్లని చారలు పడితే ఆది స్వచ్ఛమైనది కాదు. బంగారు గీతలు పడితే స్వచ్ఛమైనది అని అర్థం. ఆభరణం కొనుగోలుకు ముందే షాపు వద్ద నైట్రిక్ యాసిడ్‌తో టెస్ట్ చేయమని కోరవచ్చు. ఆభరణంపై చుక్క నైట్రిక్ యాసిడ్ వేసిన వెంటనే రసాయనిక చర్య ప్రారంభమై ఆకుపచ్చ రంగులో కనిపిస్తే బేస్ మెటల్ లేదా బంగారు పూత వేసిందిగా గ్రహించాలి. బంగారం వర్ణంలోనే రియాక్షన్ కనిపిస్తే బంగారం పూత వేసి ఇత్తడిగా గమనించాలి. పాల రంగులో కనిపిస్తే వెండి ఆభరణంగా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దానిని స్వచ్ఛమైన ఆభరణంగా గుర్తించాలి. కేడీఎం అంటే.. జ్యూవెల్లరీ దుకాణంలో బంగారం కొనే సమయంలో ఆ ఆభరణం కేడీఎం అని షాపు యజమానులు చెబుతారు. అసలు కేడీఎం అంటే బంగారు ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్డరింగ్ చేస్తారు. ఇవి 91.6 స్వచ్ఛతతో ఉంటాయి. ఇవి గమనించాలి.. 24 క్యారెట్ల బంగారంలో 99.9, 22 క్యారెట్ బంగారంలో 91.6 శాతం స్వచ్ఛత ఉంటుంది. స్వచ్ఛ బంగారం మొత్తగా ఉంటుంది. బంగారంలో కలిపిన ఇతర లోహాల శాతాన్ని బట్టి ఆభరణాల రంగు, గట్టిదనం, మన్నిక ఆధారపడి ఉంటాయి. నాణ్యత తెలిపే కొలమానం వేయించుకుని రశీదులు తీసుకోవాలి. భవిష్యత్‌లో తేడా వస్తే కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. పసిడి నాణ్యతను గుర్తించండిలా.. హాల్‌మార్క్‌తోనే మోసాలకు చెక్ యూనిక్ ఐడీ నంబర్‌ను బట్టి స్వచ్ఛత నాణ్యత శాతం సర్టిఫికెట్‌తోనే అసలు గుర్తింపు క్యారెట్ల బట్టి స్వచ్ఛత.. 24 క్యారెట్ల: 99.9 శాతం స్వచ్ఛత ఇది. బిస్కెట్ రూపంలో ఉంటుంది. 22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. 18 క్యారెట్ల: 75 శాతం బంగారం, మిగతా 25శాతం ఇతర లోహాలు 14 క్యారెట్లు: 58.5 శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహలు 12 క్యారెట్లు: 50శాతం మాత్రమే బంగారం, మిగతా 50శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది. 10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది. 24 క్యారెట్లు అంటే.. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది. ఆభరణాలు గట్టిగా , మన్నికగా ఉండేందుకు గాను స్వచ్ఛమైన బంగారానికి రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలు కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బంగారం స్వచ్ఛత 22.18.14 క్యారెట్లుగా నిర్ధారిస్తారు. -
అకాల వర్షం..తీరని నష్టం
సాక్షి నెట్వర్క్: అకాల వర్షం అన్నదాతలను ఆగమాగం చేసింది. జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న, వరి, మామిడిపంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. అకస్మాత్తుగా వచ్చిన గాలిదుమారం, ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ధాన్యంపై కప్పిన టార్పాలిన్లు ఎగిరిపోయాయి. వర్షపు నీరు రాశుల్లోకి చేరి ధాన్యం తడిసి రైతులు మనోవేదనకు గురవుతున్నారు. అలాగే బయ్యారం, దంతాలపల్లి, నర్సింహులపేట, తదితర మండలాల్లో మోస్తారు వర్షం కురిసింది. పలు చోట్ల ఇంటిపై కప్పులు లేచిపడ్డాయి. ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఆదుకోవాలని రైతులు కోరారు. ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.. : ఉద్యానవన శాఖ అధికారి శాంతిప్రయదర్శిని దంతాలపల్లి: అకాల వర్షాలతో దెబ్బతిన్న మామిడి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టం తీవ్రతను ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శాంతిప్రయదర్శిని అన్నారు. బుధవారం మండలంలోని రేపోపి, వేములపల్లి, రామానుజపురం, పెద్ద ముప్పారం, రామవరం గ్రామాల్లో పర్యటించి మామిడితోటలను పరిశీలించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ పూర్తిస్థాయిలో పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి దీక్షిత్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం నేలరాలిన మామిడికాయలు కేసముద్రం మార్కెట్లో తడిసిన ధాన్యం ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు– మరిన్ని ఫొటోలు 9లోu -
నీతి ఆయోగ్‌లో గంగారం బ్లాక్‌కు మొదటి ర్యాంక్
గంగారం: దేశంలో ఆకాంక్షిత (ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం) మండలాల డెల్టా ర్యాంకింగ్స్‌లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం అగ్రస్థానం, ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం రెండో స్థానంలో నిలిచిందని ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం అధికారి శ్రీనాథ్ హాల్కే వెల్లడించారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సూచన మేరకు అన్నిశాఖల సమన్వయంతో కేత్రస్థాయిలో ఐదు థీమ్‌లు, 40 సూచికల ద్వారా లోపాలను గుర్తించి మెరుగుపరచడం వల్లే విజయం సాధ్యమైందన్నారు. హెల్త్ అండ్ న్యూట్రిషీయన్, విద్య, సామాజికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, వ్యవసాయ, వ్యవసాయేతర రంగాల్లో అభివృద్ధి సాధించడంతో గంగారం మండలం నీతి ఆయోగ్‌లో మొదటి ర్యాంకు సాధించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి సీతక్క అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ్ ప్రకటించిన డిసెంబర్ మూడో త్రైమాసిక ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) డెల్టా ర్యాంకింగ్స్‌లో రాష్ట్రంలోనే గంగారం బ్లాక్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన బ్లాక్‌లలో పాలనను మెరుగుపర్చడం, జీవన నాణ్యతా ప్రమాణాలను పెంచడం లక్ష్యమన్నారు. బ్లాక్‌ల పనితీరు, సూచికల పురోగతిపై ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల సంబంధిత అధికారులు మరింత ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసి అభివృద్ధికి బాటలు వేయాలని సీతక్క కోరారు. -
బాలుడిని ఢీకొన్న లారీ..
● అక్కడికక్కడే చిన్నారి దుర్మరణం ● పుల్లయ్యబోడుతండా వద్ద ఘటన నర్సంపేట: రోడ్డు పక్కన నిలబడిన ఓ బాలుడిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడుతండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్య వెంకన్న, జ్యోతి దంపతుల కుమారుడు అనిల్(9) అ యోధ్యపురం ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు. వెంకన్న, జ్యోతి దంపతుల ఇల్లు తండా ప్రధాన రహదారి పక్కన ఉంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు మండలం అయోధ్యపురం క్రషర్ మిల్లు నుంచి ఓ లారీ నెక్కొండ వైపునకు వెళ్తోంది. పుల్లయ్యబోడుతండా సమీపంలో కి రాగానే రోడ్డు పక్కన నిలబడిన అనిల్‌ను ఢీకొంది. దీంతో బాలుడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీనిని గమనించిన తండావాసులు లారీని ఆపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం 108లో నర్సంపేటకు తరలించారు. అప్పటి దాకా కళ్ల ముందే కదలాడిన కొడుకు విగతజీవిగా పడి ఉండడంతో ఆ చిన్నారి మృతదేహంపై పడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బిడ్డా లే.. బిడ్డా లే.. అంటూ విలపించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై బాలుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు. అదుపు తప్పి చెట్టును ఢీకొన్న కారు.. ● యువకుడి మృతి ● తిర్లాపురంలో ఘటన గార్ల: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి గార్ల మండలం తిర్లాపురం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తిర్లాపురం గ్రామానికి చెందిన ఒంటెపాక శివకుమార్(23) తన స్నేహితులు నరేశ్, ప్రకాశ్‌తో కలిసి కారులో గార్ల నుంచి తిర్లాపురం వెళ్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ ప్రకాశ్ కారును అతివేగంగా నడుపుతూ డబ్బాలమోరీ వద్ద రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్నాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న శివకుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హుటాహుటిన మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతిచెందాడు. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, ఒక్కగానొక్క కొడుకు కారు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సావిత్రి.. కుమారుడి మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్‌పాషా తెలిపారు. వడదెబ్బతో మహిళా కూలీ మృతి గార్ల: వడదెబ్బతో ఓ మహిళా కూలీ మృతి చెందింది. ఈఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జీవంజిపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాదంపూడి సుశీల(57) గార్ల జీపీ గండితండా గ్రామ సమీపంలో మిరపతోటలో కాయలు ఏరేందుకు వెళ్లింది. ఈక్రమంలో నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. సహ కూలీలు వచ్చి సీపీఆర్ చేసినా అప్పటికే మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త 15 ఏళ్ల క్రితం చనిపోగా రోజూ కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. మృతురాలి ఒక కూతురు సంతానం. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. వేలుబెల్లిలో వృద్ధురాలు.. కొత్తగూడ: వడదెబ్బతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని వేలుబెల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. రెండు రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం, వడగాలులు వీస్తుండడంతో గ్రామానికి చెందిన బాసాని మల్లమ్మ(75) మంగళవారం వడదెబ్బకు గురై కుప్పకూలింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి కుమారుడు కట్టయ్య ఉన్నాడు. గుండెపోటుతో భక్తుడు మృతి ● కాళేశ్వరాలయ ఆవరణలో ఘటన ● కాసేపు ఆలయం మూసివేత ● సంప్రోక్షణ తర్వాత యథావిధిగా పూజలు కాళేశ్వరం: జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థాన ఆవరణలో ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా ఎలిగేడుకు చెందిన రాంపల్లి కనుకయ్య(72) కుటుంబ సభ్యులతో కలసి కాళేశ్వరం వచ్చాడు. కుమారుడు కాలసర్ఫనివారణ పూజలు చేసుకుంటుండగా..మృతుడు ఆలయ ఆవరణలోని ఓ హోటల్ వద్ద కూర్చోని మాట్లాడుతుండగానే ఛాతీలో నొప్పితో కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలోనే మృతి చెందాడు. కాసేపు ఆలయం మూసివేత.. కనుకయ్య ఆలయ ఆవరణలో మృతి చెందిన విషయం దేవస్థాన అధికారులకు తెలియడంతో ఆలయాన్ని ఉదయం 8.10 గంటల నుంచి సుమారు గంటన్నరపాటు మూసివేశారు. ఆ తర్వాత సంప్రొక్షణ జరిపి యథావిధిగా పూజలు పునఃప్రారంభించారు. దీంతో భక్తులు పూజల్లో పాల్గొన్నారు.శివకుమార్ (ఫైల్)సుశీల(ఫైల్) -
స్టీమ్ టు వందేభారత్..
172 వసంతాల భారతీయ రైల్వే సుదీర్ఘ ప్రయాణంలో కాజీపేట జంక్షన్ ప్రస్థానం ● ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే వారోత్సవాలు ● ప్రతిభ కనబరిచిన వారికి ఏటా అవార్డులు ● కాజీపేట జంక్షన్ నుంచి పలువురు ఎంపికకాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేట రైల్వే డీజిల్లోకోషెడ్ను ఏప్రిల్ 21, 1973లో ప్రారంభించారు. నాటి నుంచి డీజిల్‌షెడ్ దినదినాభివృద్ధి సాధించి భారతీయ రైల్వేలో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం షెడ్లో 240 ట్రాక్షన్, డీజిల్లోకోల నిర్వహణతో 715 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ షెడ్ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర దేశాల రైల్వేకు డీజిల్‌షెడ్ కార్మికులు వెళ్తుంటారు. డీజిల్‌షెడ్ ఉత్తమ నిర్వహణ షెడ్‌గా రైల్వే జీఎం, రైల్వే బోర్డు, ఇతర రైల్వే అవార్డులను సొంతం చేసుకుంది. కాజీపేట రూరల్ : భారతీయ రైల్వేకు నేటి(బుధవారం)తో 172 వసంతాలు పూర్తయ్యాయి. దేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీన ముంబాయి–థానే మధ్య 34 కి.మీతో నడిపించారు. భారతీయ రైల్వే ప్రస్థానం మొదటి స్టీమ్ లోకోమోటివ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం డిజీల్లోకోమోటివ్, హాల్కోలోకోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్, వందేభారత్ రైళ్లతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం.. కాజీపేట మీదుగా నిజాం స్టేట్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అధికారులు సరుకు రవాణా కోసం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వరకు సింగిల్‌లైన్ నిర్మించారు. 1904లో కాజీపేట రైల్వే స్టేషన్‌ను చిన్న షెడ్డుతో ప్రారంభించారు. తర్వాత కాజీపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. 1917లో కాజీపేటలో రైల్వే స్టీమ్లోకోషెడ్ను ఏర్పాటు చేశారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగంతో 1991లో స్టీమ్లోకోషెడ్ మూతబడింది. 1923లో కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారింది. 1917లో విజయవాడ–బల్హార్షా మధ్య కాజీపేట మీదుగా డబుల్‌లైన్ ఏర్పాటైంది. కాజీపేట–బల్హార్షా మధ్య మూడో రైల్వే లైన్ కూడా పూర్తి కావొస్తుంది. కాజీపేట కేంద్రంగా 1992లో ఎలక్ట్రిక్లైన్ నిర్మాణం జరిగింది. 1970 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేతో సంయుక్తంగా ఆర్టీసీ కండక్టర్ల నియామకం చేపట్టింది. అప్పట్లో వీరి కోసం కాజీపేట జంక్షన్లో క్వార్టర్స్‌ను కూడా నిర్మించారు. కాజీపేట నుంచి రోజూ 170 రైళ్లు రాకపోకలు, 15 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ.సుమారు 12 లక్షల ఆదాయం వస్తోంది. కాజీపేట కేంద్రంగా సుమారు 5 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కాజీపేట యంత్రాంగం బల్హార్షా మాణిక్ ఘర్, విజయవాడ వద్ద కొండపల్లి, కరీంనగర్ రూట్లో జగిత్యాల, సికింద్రాబాద్ రూట్లో భువనగిరి వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీం రీ–డెవలప్మెంట్ వర్క్స్‌తో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా అత్యాధునీకరిస్తున్నారు. కొన్ని నెలల్లో కాజీపేట కేంద్రంగా నిర్మిస్తున్న రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్షెడ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం.. కాజీపేటలో 2004లో రైల్వే ఎలక్ట్రిక్లోకోషెడ్ నిర్మాణం జరిగింది. మొదట ఈ షెడ్ 100 లోకోమోటివ్ల నిర్వహణ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 205 లోకోల నిర్వహణతో సుమారు 420 మంది రైల్వే సిబ్బందితో షెడ్ నిర్వహణ జరుగుతోంది. దినదినాభివృద్ధి చెంది ఈ షెడ్ దక్షిణ మధ్య రైల్వేలో ప్రత్యేక గుర్తింపు సాధించి ఎన్నో రైల్వే అవార్డులు కై వసం చేసుకుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టాలపైకి రైళ్లు.. సాంకేతిక విప్లవం దినదినాభివృద్ధి చెంది స్టీమ్లోకోమోటివ్ నుంచి డీజిల్లోకోమోటివ్, డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్డ్లోకోమోటివ్), తర్వాత ఎలక్ట్రిక్లోమోటివ్, ఎలక్ట్రిక్లోకోమోటివ్లో అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్‌లు వచ్చాయి. తర్వాత వందేభారత్ రైలు 130 కేఎంపీహెచ్ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు పెడుతోంది. రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్, సూపర్ఫ్టాస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. 1853, ఏప్రిల్ 16న మొదటి రైలు ప్రారంభమైనప్పటి నుంచి ఏటా రైల్వే వీక్ అవార్డుల వారోత్సవాల పేరిట విధుల్లో ప్రతిభ కనబరిచిన రైల్వే అధికారులు, కార్మికులకు అవార్డులు, నగదు పురస్కార్, ప్రశంస పత్రాలు ప్రదానం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. కాజీపేట జంక్షన్ నుంచి కూడా ఈ ఏడాది పలువురు రైల్వే అవార్డులకు ఎంపికై నట్లు అఽధికారులు తెలిపారు. -
‘మత్తు’ తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
వరంగల్ క్రైం : గంజాయి, హశీష్ ఆయిల్ తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 10 కిలోల గంజాయి, సుమారు రూ.25 లక్షల విలువైన 2 కిలోల హశీష్ ఆయిల్, మూడు సెల్ఫోన్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డీసీపీ కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన సుధాకర్, కోటగిరి సాయివినయ్ అలియాస్ వినయ్ 2023లో తన స్నేహితుడు వరుణ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి వెళ్లి గంజాయి తీసుకొస్తుండగా డొంకరాయి పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక్కడ (జైలు) ములుగుకు చెందిన లావుడ్యా రవీందర్‌కు తాను గంజాయి అమ్ముకుంటానని చెప్పాడని పేర్కొంటూ ఇటీవల సుధాకర్‌పై దాడిచేయగా సాయి వినయ్‌పై హనుమకొండ పీఎస్‌లో కేసు నమోదైంది. అనంతరం సాయి వినయ్‌ను ఖమ్మం సెంట్రల్ జైలుకు తరలించగా అక్కడ హరి, కబీర్ సింగ్ ఇద్దరు పరిచయమై సాయి వినయ్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. మూడు వారాల క్రితం హరి.. సాయివినయ్కి ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని చెప్పాడు. దీనిని సిగరెట్లకు పూసి తాగితే కిక్కు వస్తుందని, ఇది కిలో రూ. 12.50 లక్షల వరకు ఉంటుందని చెప్పి తన అన్న రామ్మూర్తి ద్వారా ఆ ఆయిల్‌ను వరంగల్ రైల్వే స్టేషన్లో అందజేయగా సాయివినయ్ ఇంట్లో దాచాడు. పది రోజుల క్రితం ములుగు జిల్లా జగ్గన్నపేట అన్నంపల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్ లావుడ్యా రవీందర్, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన గుగులోత్ హరిసింగ్.. 12 కిలోల ఎండు గంజాయి తీసుకుని సాయి వినయ్‌కు ఇవ్వగా దానిని కూడా తన ఇంట్లో దాచాడు. అనంతరం సాయి వినయ్.. రవీందర్‌కు ఫోన్ చేసి తన దగ్గర హశీష్ ఆయిల్ ఉందని తెలుపగా రవీందర్, హరిసింగ్ మంగళవారం ఆటోలో సాయివినయ్ ఇంటికి వచ్చారు. అనంతరం ఇద్దరు ఆటోలో, ఒకరు బైక్‌పై వెళ్తుండగా రెడ్డికాలనీ ప్రాంతంలో పోలీసులకు అనుమానం వచ్చింది. తనిఖీ చేయగా గంజాయి, హశీష్ ఆయిల్ లభించడంతో ముగ్గురిని అరెస్ట్ రిమాండ్‌కు తరలించామని, మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు డీసీపీ షేక్ సలీమా తెలిపారు. 10 కిలోల గంజాయి, 2 కిలోల హశీష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్ సలీమా -
ఆర్చరీలో ఉచిత శిక్షణ ఇస్తాం
మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఆర్చరీలో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఆర్చరీ జాతీయ కమిటీ సభ్యుడు పుట్ట శంకరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు క్రీడాకారులతో కలిసి ఆర్చరీ శిక్షణకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్చరీ క్రీడ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించి శిక్షణ ఇస్తామని, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు ఉచిత శిక్షణకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, బాస్కెట్‌బాల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, పలువురు క్రీడాకారులు పుట్ట శంకరయ్యను సన్మానించారు. తెలంగాణ అకాడమిక్ డీఎస్పీ సాదుల సారంగపాణి, వంగ వెంకటరమణ, శ్రీరంగం మురళీకృష్ణ, వాసుదేవ్, సంజీవరావు, సుధాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు. ఆర్చరీ జాతీయ కమిటీ సభ్యుడు పుట్ట శంకరయ్య -
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు
కాళేశ్వరం: హత్యకేసులో నిందితుడికి భూపాలపల్లి జడ్జి నారాయణబాబు రూ.10వేల జరిమానా, జీవితౖఖైదు విధిస్తూ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్సై పవన్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానాగారం గ్రామానికి చెందిన సంగిశెట్టి కిశోర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బ్రహ్మణపల్లి ఇసుక క్వారీలో సూపర్ వైజర్‌గా పని చేస్తూ ఉండేవాడు. 2018లో కిశోర్ స్నేహితుడు, ఇసుక క్వారీ ఇన్చార్జ్గా పనిచేసే ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరానికి చెందిన చోడవరపు నర్సింహామూర్తి మహదేవపూర్ మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన యువతి గోగుల లలితను ప్రేమ వివాహం చేసుకోవడానికి విజయనగరం తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఆ యువతి తమ్ముడు గోగుల విజయ్ 2018 ఆగస్టు 26న నర్సింహామూర్తికి సహకరించాడనే కోపంతో కిశోర్‌ను గొడ్డలిలో నరికి చంపాడు. ఈ విషయమై మృతుడి తండ్రి సంగిశెట్టి దుర్గారావు మరుసటి రోజు 27న మహదేవపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్సై డి. విజయ్‌కుమార్ కేసు నమోదు చేయగా అప్పటి మహదేవపూర్ సీఐ రంజిత్ కుమార్ నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత సీఐగా వచ్చిన అంబటి నర్సయ్య నిందితుడిపై చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎదులాపురం శ్రీనివాస్ వాదనలు వినిపించారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి జీవిత ఖైదు, రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్సై వివరించారు. తీర్పు వెలువరించిన జడ్జి నారాయణబాబు -
మూడు మిల్లులకే అర్హత
సాక్షి, మహబూబాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం సేకరణకు ప్రభుత్వం కొనుగో లు కేంద్రాలను ప్రారంభించింది. పలుచోట్ల కొనుగోళ్లు మొదలయ్యాయి. అయితే ధాన్యం ఎగుమతి చేసేందుకు సివిల్ సప్లయీస్ జిల్లా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో మూడు మిల్లులకు మాత్రమే దిగుమతి అనుమతులు వచ్చాయి. మెజారిటీ మిల్లులు అర్హత పొందకపోవడంతో ధాన్యాన్ని ఎటు పంపాలని అధికారులు సతమతమవుతున్నారు. మూడు మిల్లులకే.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని ముందుగా జిల్లాలోని మిల్లులకు ఎగుమతి చేస్తారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు మూడు మిల్లులు మాత్రమే యాసంగి ధాన్యం దిగుమతి చేసుకునేందుకు అర్హత పొందాయి. గత అనుభవాల దృష్ట్యా ధాన్యం దిగుమతి కోసం వానాకాలం నుంచి ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. జిల్లాలో మొత్తం 66 రైస్ మిల్లులు ఉండగా గతంలో తీసుకున్న ధాన్యానికి సీఎంఆర్ పెట్టలేదని కొన్ని మిల్లులపై కేసులు కూడా పెట్టారు. మిగిలిన మిల్లుల్లో ప్రభుత్వం నిర్దేశించిన 10శాతం డిపాజిట్ కట్టేందుకు వెనకడుగు వేశారు. మొత్తంగా గత వానాకా లం 16మిల్లుల యజమానులు డిపాజిట్ చెల్లించారు. అలాగే 23మిల్లులు షూరిటీలు ఇచ్చాయి. ఈ మిల్లులన్నీ కలిపి 1.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి చేసుకున్నాయి. ఇందుకు గాను 87,887 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ పెట్టాలి. ఇప్పటి వరకు 52,155 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ పెట్టగా.. మరో 35,734 మెట్రిక్ టన్నుల బియ్యం సీఎంఆర్ పెట్టాల్సి ఉంది. ఈ మేరకు సకాలంలో సీఎంఆర్ పెట్టి, డిపాజిట్ చెల్లించిన మూడు మిల్లులు మాత్రమే యాసంగి ధాన్యం తీసుకునేందుకు అర్హత సాధించాయి. అకాల వర్షాలతో భయం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెస్తే సకాలంలో కొనడం, కాంటాలు పెట్టడం, లారీలకు ఎత్తేవరకు రైతు భయపడుతూనే ఉంటాడు. ఎప్పుడు వర్షం వస్తుందో.. గాలిదుమారంతో ఏం జరుగుతుందోన ని ఉత్కంఠగా ఉంటారు. కాగా కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేసి, మిల్లులకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ జిల్లాలో మూడు మిల్లులకే దిగుమతి అనుమతి రాగా మిగిలిన ధాన్యం ఎటు పంపించాలనేది చర్చగా మారింది. ఇందుకోసం సీఎంఆర్ త్వరగా పెట్టాలని, డిపాజిట్ చెల్లిస్తే ధాన్యం పంపిస్తామని మిల్లర్లతో సివిల్ సప్లయీస్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే అధికారుల మాట విని సీఎంఆర్ పెట్టేందుకు కొందరు సిద్ధమవుతుంటే.. మరికొందరు మాత్రం డిపాజిట్ చెల్లించడం, లేదా బ్యాంకు గ్యారంటీలు ఇచ్చి ధాన్యం తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అలాగే యాసంగి ధాన్యం నూక ఎక్కువ వస్తుందని కొందరు, సన్నబియ్యం సీఎంఆర్ పెట్టడం ఇబ్బందిగా ఉంటుందని మరికొందరు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. సమస్య రాకుండా చూస్తాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిల్లుల సామర్థ్యం మేరకు దిగుమతి చేసుకునే ధాన్యం విలువలో 10శాతం డిపాజిట్ చేసిన వారికి ధాన్యం తీసుకునే అవకాశం ఇస్తాం. వానా కాలం డిపాజిట్ చేసిన వారు త్వరగా సీఎంఆర్ పూర్తి చేసి కొత్త ధాన్యం తీసుకునే అర్హత పొందాలి. ఇప్పటి వరకు మూడు మిల్లులు ఈ అర్హత పొందాయి. 15 మిల్లులు అర్హత పొందుతాయని భావిస్తున్నాం. మిల్లర్లు ముందుకు రాకపోతే ఇతర జిల్లాలకు పంపిస్తాం. ఎగుమతి ఇబ్బందులు లేకుండా చూస్తాం. – ప్రేమ్ కుమార్, డీఎస్ఓయాసంగి ధాన్యం ఎగుమతిపై అధికారుల తర్జనభర్జన డిపాజిట్ చెల్లించేందుకు మిల్లర్లు వెనుకంజ వానాకాలం సీఎంఆర్ ఆలస్యమే ప్రధాన కారణం త్వరగా సీఎంఆర్ పెడితేనే ధాన్యం మిల్లులకు తరలించే అవకాశంకొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో 61సెంటర్లు, పీఏసీఎస్ 162, ఇతర సెంటర్లు 16 మొత్తం 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో ఇప్పటి వరకు 174 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 200 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. -
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
మహబూబాబాద్: జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎలాంటి ఆటంకం కలుగకుండా చూడాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో రాజీవ్ యువ వికాసం పథకం, తాగునీటి సమస్య, పలు పథకాలపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నారు. లక్ష్యం మేరకు లబ్ధిదారులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా రుణ సదుపా యం కల్పించాలన్నారు. అర్హులకు రుణాలు మంజూరు చేయాలన్నారు. యువత ఆర్థికాభివృద్ధి చెందడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నా రు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలన్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్ ప్రకారం అధికారులు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీహెచ్సీలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర అన్నిరకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి,జెడ్పీ సీఈఓ పురుషోత్తం, డీపీఓ హరి ప్రసాద్, డీసీఓ వెంకటేశ్వర్లు, సీపీఓ సుబ్బారావు, డీసీఎస్ఓ ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సహకరించాలి కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ -
మోసం చేయడంలో రేవంత్‌రెడ్డిది మొదటిస్థానం
తొర్రూరు రూరల్: ప్రజలను మోసం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి మొదటి స్థానంలో నిలుస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని శ్రీనివాస గా ర్డెన్లో బీఆర్ఎస్ పట్టణ, మండల పార్టీ ఆధ్వర్య ంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత హామీలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించిందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపైన ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే కేసీఆర్ నా యకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి వంద సీట్లు రావడం ఖాయమన్నారు. ప్రభుత్వంపైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసే సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని, దమ్ముంటే ఎన్నికలను నిర్వహించాలని సవాల్ విసిరారు. ఈనెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగకు పార్టీ కార్యకర్తలు, అన్నివర్గాల ప్రజలు అధిక సంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. కార్య క్రమంలో బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి అంజయ్య, మాజీ జెడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు గాంధీనాయక్, నలమాస ప్రమోద్, కుర్ర శ్రీనివాస్‌గౌడ్, అనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, శామకూరి ఐలయ్య, ఎస్కే అంకూస్, ఎన్నమనేని శ్రీనివాస్‌రావు, కర్నె నాగరాజు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
అన్నివర్గాల ప్రజలకు హక్కుల కల్పన
మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ, సమాన హక్కులు కల్పించారని జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి అన్నారు. జిల్లా కేంద్రంలోని పత్తిపాక గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో మంగళవారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. మంచి అలవాట్లను అలవర్చుకొని, క్రమశిక్షణతో ప్రతీరోజు పుస్తక పఠనంపై దృష్టిసారించాలన్నారు. అంబేడ్కర్‌ను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులను మెనూ అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సి ల్ దాసరి నాగేశ్వర్రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వల్లపు యాదగిరి, కానిస్టేబుల్ సంపత్‌రెడ్డి, పాఠశాల హెచ్ఎం వీరులాల్ ఉన్నారు. జూనియర్ సివిల్ జడ్జి తిరుపతి -
విధుల్లో నిర్లక్ష్యం చేయొద్దు
● డీఈఓ రవీందర్‌రెడ్డి తొర్రూరు రూరల్: విధుల్లో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చేయవద్దని డీఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని నాంచారిమడూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను డీఈఓ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఏ–2 పరీక్ష జవా బు పత్రాల మూల్యాంకనం వెంటనే పూర్తి చేసి, మార్కులను ఆన్లైన్లో నమోదు చేయాలని, ఏమైనా ఇబ్బందులు తలెత్తితే మండలస్థాయి అధికారులను సంప్రదించి పరిష్కరించుకో వాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, హెచ్ఎం రాజేందర్, ఉపాధ్యాయులు సునీత, సంపత్‌రావు, సీఆర్పీలు వీణ, రమేశ్ పాల్గొన్నారు. పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలి● డీఎంహెచ్ఓ రవిరాథోడ్ నెహ్రూసెంటర్: జిల్లాలోని ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. ఆర్బీఎస్కే కార్యక్రమాలపై మంగళవారం వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. డైక్ సెంటర్లో ఫిజియోథెరఫి, మానసిక సమస్యలు ఉన్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వ డం జరుగుతుందన్నారు. డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేన్షన్స్ సెంటర్ నుంచి సమస్య ఉన్నవారిని ప్ర భుత్వ ఆస్పత్రికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్బీఎస్కే కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్, డీపీఎం నీలోహన, డీడీఎం సౌమిత్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, హెచ్ఈ కేవీ రాజు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆర్బీఎస్కే వాహనాలను తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన ఉండాలిమహబూబాబాద్: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనాఽథ్ అన్నారు. అగ్ని మాపకశాఖ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు సెంటర్లలో విన్యాసాలను ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వారోత్సవాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవాలన్నారు. ఈనె ల 14నుంచి 21వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో సిబ్బంది కృష్ణ, రవీందర్, షపీ, గోపి, వెంకన్న, పూర్ణచందర్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ చైర్మన్‌గా శ్రీనివాస్మహబూబాబాద్: జిల్లా కేంద్రంలోని టీఎన్జీ ఓ ఎస్ భవనంలో మంగళవారం తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్క ర్స్, పెన్షనర్స్ సంఘాల సమావేశంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జేఏసీ జిల్లా చైర్మన్‌గా వడ్డెబోయిన శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా మహమ్మద్ రఫీ, అడిషనల్ జనరల్ సెక్రటరీగా సంకా బద్రినారాయణ, కోచైర్మన్లుగా మురళీకృష్ణ, రమేశ్, భగవాన్‌రెడ్డి, సుధాకరచారి, యాకూబ్, భాస్కర్, భిక్షం, మైస నాగయ్యను ఎన్నుకున్నారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీలుగా రోహిత్, ప్రసాద్, రవి, వైస్ చైర్మన్‌గా రమేశ్, సెక్రటరీలుగా లక్ష్మికాంత్, ఎ.శ్రీనివాస్, పబ్లిసిటీ సెక్రటరీగా వి.శ్రీనివాస్‌ను ఎన్నుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈసందర్భంగా వడ్డెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో మల్లారెడ్డి, యాకూబ్, శ్రీశైలం, దేవేందర్‌రాజు, భద్రు పాల్గొన్నారు. -
భాషాపండితులకు సన్మానం
విద్యారణ్యపురి: రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ఉద్యోగ విరమణ పొందబోతున్న పలువురు భాషాపండితులను టెన్త్ స్పాట్లో సన్మానించారు. మూల్యాంకనం చేపడుతున్న ఫాతిమా హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో డీఈఓ వాసంతి మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనంలో భాగస్వాములైన భాషాపండితుల సేవలను కొనియాడారు. రాష్ట్రీయ భాషా పండిత్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ భాషా పండితులు అప్‌గ్రేడ్ కోసం కృషి చేయగా పదోన్నతులు లభించాయని గుర్తుచేశారు. ఆ పరిషత్ బాధ్యులు అంకేశ్వరపు కుమారస్వామి, బి. వెంకన్న, అల్లం నర్సయ్య, సదానందం, భిక్షపతి, లక్ష్మీనారాయణ, తిరుపతయ్య, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాలి
మహబూబాబాద్ రూరల్: పోలీసు అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించి ప్రజల్లో పోలీ సు వ్యవస్థపై విశ్వాసం పెంపొందించాల్సిన అవసరం ఉందని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం సరికాదని, ప్రతీ కేసు విచారణలో చార్జిషీట్‌ను నిర్దేశిత కాలవ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాలని ఆదేశించారు. అలాగే కోర్టు విచారణకు సంబంధించి సాక్షుల హాజరును నిర్ధారించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయాన్ని మెరుగుపర్చుకొని కేసుల పరిష్కార వేగాన్ని పెంచాలన్నారు. అనుమానితులను న్యాయస్థానాలకు తరలించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి భద్రతాలోపాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టు డ్యూటీలలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష