
ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ వర్తింపజేయాలి
మహబూబాబాద్ రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులు (ఫీల్డ్ అసిస్టెంట్లు)గా పనిచేస్తున్న తమకు పే స్కేల్ వర్తింపజేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దల ఉప్పలయ్య (గాంధీ) కోరారు. తమ సమస్యలు పరిష్కరించాలని మహబూబాబాద్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి రఘుపతిరెడ్డికి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4,779 సర్క్యులర్‌ను రద్దు చేసి, లిస్ట్ మూడు కింద ఉద్యోగాలు కోల్పోయిన వారిని మళ్లీ ఉద్యోగాలకు తీసుకోవాలన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు రూ.35 వేలు ఇవ్వాలని, ఫీల్డ్ అసిస్టెంట్లకు హెల్త్ కార్డులు, జీవిత బీమా కల్పించాలని కోరారు. ఉద్యోగ సమయంలో మరణించిన వారికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నరసయ్య, శ్వేత, సుజాత, ఉమారాణి, స్వాతి, విమల, ఉపేందర్, సుధాకర్, శ్రీలత, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
50 ఆకుల కట్ట రూ.3.30
● తునికాకు ధరల నిర్ణయం
కొత్తగూడ: తునికాకు సేకరణ ధరలను ప్రజా సంఘాలు, కాంట్రాక్టర్లు మండల కేంద్రంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో బుధవారం చర్చించి ధరలు నిర్ణయించారు. 50 ఆకుల కట్టకు రూ.3.30 నిర్ణయించారు. గతంలో రూ.3 ఉండగా అదనంగా 30 పైసలు పెంచుతూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ ధరలకు కాంట్రాక్టర్లు సమ్మతించారు. ఈ సమావేశంలో తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్క యాదగిరి, సందీప్, సారయ్య, న్యూడెమోక్రసీ నాయకులు పుల్లన్న, శ్రీశైలం, మంగన్న, బూర్క బుచ్చిరాములు, యాదగిరి, యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.
పూడికతీత పనులు చేపడతాం
● మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్
డోర్నకల్: సిగ్నల్‌తండాలోని తాగునీటి బావిలో యుద్ధప్రాతిపదికన పూడికతీత పనులు చేపడతామని మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలోని సిగ్నల్‌తండాలో తాగునీటి ఇబ్బందులపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన కమిషనర్ హెల్త్ అసిస్టెంట్ అహ్మద్‌తో కలిసి బుధవారం సిగ్నల్‌తండా బావిని పరిశీలించారు. ఈ సందనకభంగా కమిషనర్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్‌ప్లాన్ నిధులతో బావిలో పూడికతీత పనులు చేపట్టి తండాకు తాగునీటి సరఫరా చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
పెండింగ్ సమస్యల
పరిష్కారానికి కృషి
కేయూ క్యాంపస్: గత వీసీ హయాంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రాబోయే నూతనకమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేద్దామని కేయూ ఎన్‌జీఓ అధ్యక్షుడు ఎల్.యాదగిరి, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి అన్నారు. బుధవారం యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించిన ఆ సంఘం సంఘం సర్వసభ్యసమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్లలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేసిన వాటిని వివరించారు. కొత్త కమిటీని ఎన్నుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 21 తరువాత ఎన్నికలు జరపాలని ప్రస్తుత కమిటీ కోరనున్నది. ఆ తరువాత ఎన్నికై న నూతనకమిటీ ఇకనుంచి మూడేళ్లపాటు కొనసాగబోతుంది. సమావేశంలో ఉపాధ్యక్షుడు యూనస్, జా యింట్ సెక్రటరీలు తోట ప్రభాకర్, ఎ.సతీష్ బాబు, అరుణకుమారి, కోశాధికారి జి.నిరంజన్ బోధనేతర ఉద్యోగులు పాల్గొన్నారు.
జెన్‌పాక్ట్ నియామకాల్లో
‘పింగిళి’ విద్యార్థినుల సత్తా
హన్మకొండ అర్బన్: ప్రముఖ కార్పొరేట్ సంస్థ జెన్‌పాక్ట్‌లో వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మ హిళా కళాశాల విద్యార్థినులు17 మంది ఉద్యోగాలు సాధించి సత్తా చాటినట్లు కళాశాల ప్రిన్సి పాల్ చంద్రమౌళి తెలిపారు. ఉద్యోగాలు సా ధించిన విద్యార్థులకు బుధవారం కళాశాల ఆ వరణలో నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కా ర్పొరేట్ కళాశాలలకు తీసిపోకుండా ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు.

ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ వర్తింపజేయాలి