
వాన ‘గండం’
గురువారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం
సాక్షి, మహబూబాబాద్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు అమ్మితే మోసపోతారని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా సకాలంలో ధాన్యం కొనేందుకు నానా కొర్రీలు పెడుతున్నారని రైతులు చెబుతున్నారు. ఉదయం అంతా నిప్పులు కురిసేలా ఎండ.. తీరా సాయంత్రం కాగానే ఆకాశం మేఘావృతం కావడం, ఉరుములు, మెరుపులు, జల్లులు, గాలిదుమారం రావడంతో కల్లాల్లో ధాన్యం పోసుకున్న రైతులు భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు.
కేంద్రాల్లో నిండిన ధాన్యం
గిట్టుబాటు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇస్తుండడంతో రైతులు ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. యాసంగిలో 23,633 ఎకరాల దొడ్డురకం వరి, 1,12,603 ఎకరాల్లో సన్న రకాలు మొత్తం 1,36,236 ఎకరాల్లో వరి సాగుచేశారు. కాగా 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని లెక్కించారు. ఇందులో 84,577 మెట్రిక్ టన్నులు రైతులు, కూలీల అవసరాలకోసం వినియోగించవచ్చు. అదే విధంగా మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మకాలు చేస్తారు. ఇవి పోగా మిగిలిన 1.79లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయనున్నారు. అయితే సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరతోపాటు, బోనస్ కూడా ఇవ్వడంతో గతం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ఐకేపీ 61 సెంటర్లు, పీఏసీఎస్ 162, ఇతర సెంటర్లు 16 మొత్తం 239 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పుటి వరకు 170 సెంటర్లు ప్రారంభించారు. దీంతో రైతులు పంట పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నారు. ఇప్పటి వరకు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినట్టు అంచనా. మరో వారం రోజుల్లో వరి కోతలు పూర్తయి మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానుందని రైతులు చెబుతున్నారు.
కొనుగోలులో కొర్రీలు
ఒకవైపు ఎప్పుడు అకాల వర్షం కురుస్తుందో అని భయ పడుతున్నామని, మరోవైపు నిర్వాహకులు కొనుగోళ్లలో కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి 170 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా ఇప్పటి వరకు 63 కేంద్రాల్లోనే కొనుగోళ్లు చేస్తున్నారు. మిగిలిన చోట్ల తేమ శాతం 17కు లోపు ఉన్నా, జల్లెడ పట్టి మట్టి, చెత్త లేకుండా ధాన్యం శుభ్రం చేసినా.. కావాలనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. కొన్ని చోట్ల హమాలీల కొరత, మరికొన్ని చోట్ల లారీలు రావడం లేదని చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కొనే కేంద్రాల్లో కూడా నాయకులో, అధికారులో చెప్పిన ధాన్యం మాత్రమే కొంటున్నారని, సామాన్య రైతులను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే విధంగా 40.700 తూకం వేయాల్సిన బస్తాను 41.300 తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటి అంటే లారీలు వచ్చేవరకు మరింత బరువు తగ్గుతాయి, అలా అయితే ఇక్కడ అమ్మండి లేకపోతే తీసుకెళ్లండి అని బెదిరిస్తున్నారు. ఇలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 15రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు 4,454 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు.
నెత్తురోడిన రహదారులు..
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు.
– 10లోu
న్యూస్‌రీల్
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు వివరాలు
కొర్రీలతో కొనుగోళ్లలో
జాప్యం చేస్తున్న నిర్వాహకులు
ఎప్పుడు వర్షం వస్తుందోనని
రైతుల ఆందోళన
వారాల తరబడి
కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షణ

వాన ‘గండం’

వాన ‘గండం’