
అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి
నెహ్రూసెంటర్: మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పని చేసే ప్రదేశాల్లో వేధింపులకు గురైతే వెంటనే షీటీంకు తెలపాలని షీటీం ఎస్సై సునంద అన్నారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళల భద్రత, రక్షణ, హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్ధాలపై సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈవ్‌టీజీంగ్, పని ప్రదేశాల్లో వేదింపులకు గురైతే వెంటనే షీటీంకు లేదా 100 డయల్ చేయవచ్చని, షీటీం నంబర్ 87126 56935 ఫోన్ చేసి చెప్పాలన్నారు. టీసేఫ్ యాప్ ట్రావెలర్ యాప్ అని ట్రావెలింగ్ చేసే ప్రతీ ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో జీజీహెచ్ ఆర్‌ఎంఓ డాక్టర్ జగదీశ్వర్, ఏఓ గఫర్, షీ టీం ఉమెన్ పీఎస్ ఎస్సై ఆనందం, షీటీం సిబ్బంది అరుణ, పార్వతి, రమేశ్, ఏహెచ్‌టీ సిబ్బంది సుప్రజ, భరోసా సిబ్బంది బేబీ, తదితరులు పాల్గొన్నారు.