
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
నర్సంపేట రూరల్: నర్సంపేటలోని మల్లంపలి రోడ్డులో శుక్రవారం ఉరేసుకుని వివాహిత ఆత్మహ త్య చేసుకుంది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన హర్షియాబేగం (28) భర్త అబ్దుల్ గణితో కలిసి న ర్సంపేటలోని మల్లంపల్లి రోడ్డులో జీవనం సాగి స్తోంది. వీరి ఒక పాప. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైంది. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హర్షియా బేగంను పోస్టుమార్టానికి తరలించారు. మృతురాలి మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
రైలు కింద పడి ఒకరు..
ఖిలా వరంగల్/కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం కోమటిపల్లి తండాకు చెందిన బా నోతు రమేశ్ (36) కుటుంబకలహాలతో గురువారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా డు. తాళ్ల పూసలపల్లి కేసముద్రం రైల్వేస్టేషన్ల మధ్య బడి తండా సమీపాన ఈ ఘటన జరిగింది. రమేశ్ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. జీవితంపై విరక్తి చెందిన గురువారం రాత్రి కేసముద్రం తాళ్లపూసలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య బడి తండా సమీపాన ఆఫ్‌లైన్‌పై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ కిందపడి బానోతు రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి బానోతు బీమా ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ తెలిపారు.
వృద్ధురాలు..
గుర్తు తెలియని వృద్ధురాలు రైలు కింద పడి ఆత్మహ త్య చేసుకుంది. రైల్వే జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సు దర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 65 నుంచి 70 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వృద్ధురాలు వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో 377/41 మైలు రాయి వద్ద గుర్తు రైలు కింద పడి ఆత్మహత్య కు పాల్పడింది. ఈఘటనలో ఆమె తలకు శరీర భా గాలకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. వృద్ధురాలు ఆకుపచ్చ రంగు, డిజైన్ గల చీర, ప సుపు రంగు జాకెట్ ధరించి ఉందని, ఆమె 5.2 ఎ త్తు ఉందని, గుండ్రని ముఖం ఉన్నట్లు తెలపిరాఉ. కాగా మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వరంగల్ రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీ ఎం మార్చురీలో భద్రపరిచినట్లు హెడ్‌కానిస్టేబుల్ సుదర్శన్ తెలిపారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు వరంగల్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేష న్, లేదా 97017 47014 ,87126 58585 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.