
వేసవి శిక్షణ శిబిరాలేవి?
మహబూబాబాద్ అర్బన్: మానుకోట జిల్లా క్రీడలకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడి నుంచి వందలాది మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు. ఈక్రమంలో అనేక మంది క్రీడాకారులు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న జిల్లాలో ఇప్పటి వరకు వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణపై ఎలాంటి కదలిక లేదు. మరో రెండు రోజుల్లో పిల్లలకు వేసవి సెలవులు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే పలు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించాయి. దీంతో చిన్నారులు సొంత ఊళ్లకు, విహారయాత్రలకు వెళ్తున్నారు.. మరికొందరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఇప్పటికై నా శిబిరాలు ఏర్పాటు చేస్తే పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని క్రీడాభిమానులు కోరుతున్నారు.
క్రీడలతో మానసిక, శారీరక ఎదుగుదల..
క్రీడలు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతాయి. క్రీడలతో ఎముకలు, కండరాల పెరుగుదల, మంచి రక్త ప్రసరణ, వయసుకు తగ్గ పెరుగుదల ఉంటుంది. అలాగే మెదడు, గుండె చక్కగా పని చేస్తాయి. కాగా ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో పిల్లలు పాఠశాలలు ఉన్నప్పుడు తరగతి గదులకే పరిమితమవుతున్నారు. చాలా తక్కువ మంది క్రీడలు ఆడుతున్నారు. ఇలాంటి వారికి సమ్మర్ శిక్షణ శిబిరాలు ఉపయుక్తంగా మారుతాయి.
సమ్మర్ క్యాంప్‌లో క్రీడలు..
మున్సిపల్ పరిధిలోని సమ్మర్ క్యాంప్‌లో బాస్కె ట్‌బాల్, తైక్వాండో, క్రికెట్, అథ్లెటిక్స్, హాకీ, స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ తదితర క్రీడలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, సాఫ్ట్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ క్రీడలు నిర్వహిస్తారు. పిల్లలకు మెరుగైన శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మానుకోట పేరును నిలబెట్టే అవకాశం ఉంది.
క్రీడా శిబిరాల ఏర్పాటులో నిర్లక్ష్యం
సెలవుల నిమిత్తం ఊర్లకు వెళ్తున్న
చిన్నారులు
జిల్లాలో సమ్మర్ క్యాంపులపై
నోరుమెదపని అధికారులు