
గంజాయి ముఠా అరెస్ట్
● రూ.3.5 లక్షల విలువైన
ఎండు గంజాయి స్వాధీనం
పరకాల: సిగరెట్లలో గంజాయి పెట్టి విక్రయించాలనే ఆలోచనతో ఒడిశా నుంచి సరుకు దిగుమతి చేసి పరకాలలో విక్రయించేందుకు సిద్ధమైన ముఠాను పరకాల పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ క్రాంతికుమార్ కథనం ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా పశువుల సంతలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతోపాటు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు అనుమానితుల వద్ద ఉన్న బ్యాగులను తనిఖీ చేయగా రూ.3లక్షల 5వేల విలువైన 6.11 కిలోల ఎండుగంజాయి లభ్యమైంది. దీంతో ఒడిశాకు చెందిన శంకుభర సగారియా(మేసీ్త్ర), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దరగోపాల్ యాదవ్(మేసీ్త్ర), పరకాలలోని మల్లారెడ్డిపల్లెకు చెందిన ఓంటేరు రాజ్‌కుమార్(ల్యాబ్‌టెక్నీషియన్)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై శివక్రిష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు టి.సర్వర్, ఎస్.నరసింగం, డి.నాగరాజు, ఎస్.నాగరాజు, ఎ.శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.