
మహిళల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలి
హన్మకొండ చౌరస్తా: మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూలే–అంబేడ్కర్ యాదిలో–మహిళల హక్కుల పరరిరక్షణ యాత్ర గురువారం హనుమకొండకు చేరుకుంది. ఈబస్సు యాత్రకు ఐద్వా జిల్లా కమిటీ, వివిద ప్రజా సంఘాల బాధ్యులు వేయిస్తంభాల గుడి వద్ద బోనాలు, డప్పుచప్పుళ్లు, బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారు. వేయి స్తంభాల గుడి నుంచి హనుమకొండ చౌరస్తా మీదుగా సాగిన ప్రదర్శనలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించినప్పటికీ సీ్త్ర, పురుషుల మధ్య అసమానత్వం కొనసాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్ఫూర్తితో సీ్త్రల హక్కుల కోసం పోరాటాలు సాగిస్తామన్నారు. ‘ఐద్వా’ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆశాలత, రత్నమాల, సాయిలీల, రామతార, శ్వేత, రాధికారాణి, అనిత, రాధ, పుష్ప, సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, ఉప్పలయ్య, చక్రపాణి, రజిత, గిరిజన సంఘం నాయకులు వీరన్న, మత్స్యకార్మిక సంఘం నాయకులు వెంకట్, కేవీపీఎస్ బాధ్యులు సాంబయ్య, సంపత్, డీవైఎఫ్‌ఐ బాధ్యులు కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి