
ఆర్చరీలో ఉచిత శిక్షణ ఇస్తాం
మహబూబాబాద్ అర్బన్: వేసవి సెలవుల్లో విద్యార్థులకు ఆర్చరీలో నెలరోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తామని ఆర్చరీ జాతీయ కమిటీ సభ్యుడు పుట్ట శంకరయ్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలువురు క్రీడాకారులతో కలిసి ఆర్చరీ శిక్షణకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్చరీ క్రీడ పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించి శిక్షణ ఇస్తామని, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దుతామన్నారు. విద్యార్థులు ఉచిత శిక్షణకు హాజరయ్యేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం మా అసోసియేషన్ అధ్యక్షుడు బొడ్డుపల్లి ఉపేంద్రం, బాస్కెట్‌బాల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి ప్రతాప్ రెడ్డి, పలువురు క్రీడాకారులు పుట్ట శంకరయ్యను సన్మానించారు. తెలంగాణ అకాడమిక్ డీఎస్పీ సాదుల సారంగపాణి, వంగ వెంకటరమణ, శ్రీరంగం మురళీకృష్ణ, వాసుదేవ్, సంజీవరావు, సుధాకర్, రఘు తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీ జాతీయ కమిటీ సభ్యుడు
పుట్ట శంకరయ్య